సాక్షి, న్యూఢిల్లీ: భారత సీనియర్ పేస్ బౌలర్ అశీష్ నెహ్రా కెరీర్‌ను లేటుగా ముగించిన లెటేస్ట్‌గా ముగించాడు. న్యూజిలాండ్‌తో సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చివరి మ్యాచ్ ఆడిన నెహ్రా తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసిన నెహ్రా కేవలం 29 పరుగులే ఇచ్చాడు. అయితే భారత ఫీల్డర్ల తప్పిదం వల్ల నెహ్రాకు చివరి మ్యాచ్‌లో వికెట్ దక్కలేదు.
మున్రో ఇచ్చిన సునాయసమైన క్యాచ్‌ను పాండ్యా విడిచిపెట్టడంతో నెహ్రాకు వికెట్ దక్కే అవకాశం చేజారింది. విలియమ్సన్ ఇచ్చిన మరో కష్టమైన క్యాచ్‌ను కూడా కోహ్లి జార విడిచాడు. అయితే వికెట్ పడకున్నా తన మైమరిపించే మార్క్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు ఈ 38 ఏళ్ల క్రికెటర్. చహల్ వేసిన ఓ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్ బ్యాక్ సైడ్‌కు ఆడగా.. లెగ్‌సైడ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నెహ్రా బంతిని తన లెగ్ టెక్నిక్‌తో అందుకున్నాడు.
దీంతో కెప్టెన్ కోహ్లి వావ్ నెహ్రాజీ అంటూ నవ్వుతూ.. చప్పట్లు కొట్టగా.. బౌలర్ చహల్ చేతులు పైకెత్తి సలాం..జీ అన్నట్లు చప్పట్లు కొట్టాడు. అయితే ఈ వీడియోను బీసీసీఐ ‘మన నెహ్రాజీ ఫూట్ టెక్నిక్ ఎలా ఉంది’ అనే క్యాఫ్షన్‌తో ట్వీట్ చేసింది. ఈ వీడియోకు భారత అభిమానులు ముగ్ధులయ్యారు. నెహ్రాజీ.. యూ ఆర్ గ్రేట్‌జీ అంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.
How's that for footy skills from our very own Nehraji? What do you make of that @YUVSTRONG12 ;) #INDvNZ pic.twitter.com/YaTeJk5d0t
— BCCI (@BCCI) November 1, 2017
Comments
Please login to add a commentAdd a comment