న్యూఢిల్లీ:న్యూజిలాండ్ తో రెండో టీ 20లో నెమ్మదైన ఆట తీరుతో విమర్శల పాలైన ఎంఎస్ ధోనికి మాజీ భారత ఆటగాడు ఆశిష్ నెహ్రా అండగా నిలిచాడు. ధోని తాజా ఫామ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సరికాదన్నాడు. తన మునపటి ఫామ్ ను ధోని త్వరలోనే అందుకుంటాడని ఇటీవల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న నెహ్రా వ్యాఖ్యానించాడు. '2020 వరల్డ్ టీ 20 వరకూ ధోని జట్టులో కొనసాగుతాడనేది నా నమ్మకం. ఏదొక మ్యాచ్ లో అతను ఆడనంత మాత్రనా విమర్శలు చేయడం సరికాదు. ఇంకా రెండు-మూడేళ్లు ఆడే సత్తా ధోనిలో ఉంది. ధోనిపై విమర్శలు కట్టిపెట్టి అతని ఆటను ఆడనివ్వండి. భారత క్రికెట్ జట్టులో అత్యంత నిజాయితీ గల క్రికెటర్లలో ధోని ఒకడు. అతను తప్పకుండా గాడిలో పడతాడు.
వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ కాదు.. వచ్చే వరల్డ్ టీ 20 వరకూ ధోనిని జట్టులో చూస్తానని నమ్మకం ఉంది. ఒక ఫాస్ట్ బౌలర్ గా నేను 39 ఏళ్ల వయసు వరకూ క్రికెట్ ఆడినప్పుడు.. బ్యాట్స్ మన్ గా ధోని ఫిట్ నెస్ బట్టి చూస్తే ఇంకా మూడేళ్ల పాటు ఆడతాడు. టీమిండియా కెప్టెన్సీ పదవిని ధోని సరైన సమయంలోనే కోహ్లికి అప్పజెప్పాడు. మరి అటువంటప్పుడు అతను ఎప్పుడు క్రికెట్ నుంచి తప్పుకోవాలో తెలీదా. ధోనిపై విమర్శలు చేయడం ఆపితే అతను సహజసిద్ధమైన ఆటతో సత్తాచాటతాడు' అని నెహ్రా బదులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment