ముంబై : టీమిండియా హార్డ్ హిట్టర్, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ప్రపంచకప్‌లో ఆడించాల్సిందేనని దిగ్గజ క్రికెట్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సూచించిన విషయం తెలిసిందే. అయితే వార్న్ సలహా మంచిదేనని, ఈ దిశగా టీమిండియా ఆలోచించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. రిషభ్ పంత్ ఓపెనర్‌గా ఆడించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదని, అతను చెలరేగితో మిడిలార్డర్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఓ జాతీయ ఛానెల్‌కు తెలిపాడు. ‘పంత్ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్. ఎడమ-కుడి బ్యాట్స్‌మెన్ కాంబినేషన్‌ను ఎదుర్కొవడం బౌలర్లకు కష్టమైన పని. ఇలానే రోహిత్-ధావన్ కాంబినేషన్ విజయవంతమైంది. గతంలో సచిన్-గంగూలీ, సెహ్వాగ్-గంగూలీలు జోడిలు కూడా ఓపెనర్లుగా రాణించాయి. పంత్ కూడా ఓపెనర్‌గా రాణిస్తాడు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.
గావస్కరే కాదు మరో భారత మాజీ క్రికెటర్ ఆశిశ్ నెహ్రా సైతం పంత్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘బ్యాటింగ్‌లో కుడి–ఎడమ కాంబినేషన్ ముఖ్యం. టీమిండియాలో చూస్తే ధావన్ తప్ప ఏడో స్థానం వరకు ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ లేరు. పంత్ మ్యాచ్ విన్నర్. రోహిత్‌శర్మలా అలవోకగా సిక్స్‌లు బాదుతాడు. బ్యాకప్ ఓపెనర్‌గానూ పనికొస్తాడు. 1 నుంచి 7వ స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. కోహ్లి... అతడిని ఏవిధంగానైనా ఉపయోగించుకోవచ్చు.’ అని పేర్కొన్నాడు.
ఇక షేన్ వార్న్ ధోని కోసం పంత్‌ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని, వికెట్‌కీపర్‌గా కాకుండా బ్యాట్స్‌మన్‌గా పరిగణించి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లోనే పంత్‌ను ఓపెనర్‌గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధావన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టు గెలుపు కోసం కొన్ని త్యాగాలు చేయలన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment