
ముంబయి: సొంత మైదానం న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లాలో జరిగే తొలి ట్వంటీ20 తనకు ఆఖరి మ్యాచ్ అని టీమిండియా క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పష్టం చేసినా.. ఆ మ్యాచ్‌లో అతడికి చోటుంటుందో లేదో చెప్పలేనని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. న్యూజిలాండ్‌తో ట్వంటీ20 సిరీస్‌కు ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలక్టర్ల బృందం 16 మంది ఆటగాళ్లను సోమవారం ఎంపిక చేసింది.
ఆటగాళ్ల ఎంపిక అనంతరం ఎమ్మెస్కే జాతీయ మీడియాతో మాడ్లాడుతూ.. రిటైర్మెంట్ పై సీనియర్ పేసర్ నెహ్రా నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే. సరైన సమయంలో నెహ్రా తగిన నిర్ణయం తీసుకున్నాడు. యువతరం కోసం సీనియర్లు సొంతంగా ఓ అభిప్రాయానికి వస్తే మంచిది. అయితే న్యూఢిల్లీలో న్యూజిలాండ్, భారత్ తలపడే తొలి టీ20కి తుదిజట్టులో నెహ్రా ఆడతాడా లేదా అన్నది చెప్పలేం.
తుది జట్టులో నెహ్రాకి ఛాన్స్ దక్కుతుంతా లేదా అన్నది కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల చేతుల్లో ఉంటుంది. నెహ్రా, టీమ్ మేనేజ్‌మెంట్‌తో ఇదివరకే చర్చించాం. న్యూజిలాండ్ సిరీసే అతడికి ఆఖరి సిరీస్ అవుతుంది. కివీస్‌తో సిరీస్‌కు ఓ లెఫ్టార్మ్ పేసర్ అవసరమని భావిస్తున్నాం. కానీ గత సిరీస్‌లలో ఆడి రాణించిన బౌలర్లకే చోటు దక్కవచ్చునంటూ' అభిప్రాయపడ్డారు.
న్యూజిలాండ్‌తో టీ 20 సిరీస్ కు భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, అశిష్ నెహ్రా, సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment