MSK Prasad
-
మరో సిరాజ్ కోసం.. పాతబస్తీలో ఎమ్మెస్కే వేట (ఫోటోలు)
-
‘మరో సిరాజ్’ వేటలో...
సాక్షి, హైదరాబాద్: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పలు చిరస్మరణీయ విజయాల్లో భాగంగా ఉన్న అతను టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. ఎంతో మంది యువ ఆటగాళ్లతో పోలిస్తే అతని ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. పేదరిక నేపథ్యం, ఆటోడ్రైవర్‌గా పని చేసే తండ్రి, కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే స్థితి నుంచి అతను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగాడు.ఒకదశలో షూస్ కూడా కొనుక్కోలేకపోయిన అతను డబ్బుల కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత కేవలం తన కఠోర శ్రమ, పట్టుదలతో పైకి ఎదిగాడు. ఇప్పుడు అలాంటి సిరాజ్‌లను వెతికి సానబెట్టేందుకు భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా నగరంలోని పాతబస్తీలో ఉన్న పేద పేస్ బౌలర్ల కోసం ఒక ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ పేరుతో ఈ కార్యక్రమం ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎంఎస్కేఎస్ఐసీఏ) ఆధ్వర్యంలో జరిగింది. దీనికి స్వయంగా సిరాజ్ హాజరై తన అనుభవాలను పంచుకున్నాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్న అతను... ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప బౌలర్లుగా ఎదగాలని ఆకాంక్షించాడు. అత్తాపూర్‌లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఇలాంటి ప్రయత్నాలు క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకోవాలనుకునే యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతాయని, ప్రతిభ గలవారిని తీర్చిదిద్దుతున్న ఎమ్మెస్కే ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తన బాల్య స్నేహితుడు మునీర్ అహ్మద్, కోచ్ రహ్మతుల్లా బేగ్ గౌరవార్ధమే ప్రత్యేకంగా పాతబస్తీ క్రికెటర్ల కోసం ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ కార్యక్రమాన్ని లాభాపేక్ష లేకుండా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎమ్మెస్కే చెప్పారు. సుమారు 400 మంది యువ పేస్ బౌలర్లు ఈ ట్రయల్స్‌కు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాజీ క్రికెటర్లు షహాబుద్దీన్, ఫసీర్ రహమాన్, సత్యప్రసాద్, మనోజ్‌సాయి, ప్రకాశ్‌బాబు, అమానుల్లా ఖాన్‌లతో పాటు టీఎన్జీఏ ప్రధాన కార్యదర్శి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమైన రోహిత్.. ఆ తర్వాత తను ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ తీవ్ర నిరాశపరిచాడు. ఇప్పుడు మెల్బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ విమర్శలు గుప్పించారు. కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ శర్మ విఫలమయ్యాడని ఎమ్ఎస్కే మండిపడ్డారు.టెస్టుల్లో రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్, కెప్టెన్సీ రెండింటిలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. బీజీటీకి ముందు న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమి చవిచూసింది. ఇది నిజంగా భారత్ క్రికెట్‌కు అవమానకరం. స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవ్వడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.ఈ సిరీస్‌లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ అటూ జట్టును నడిపించడంలోనూ , ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ వచ్చాడు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరం కావడంతో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను బుమ్రా తీసుకున్నాడు.తొలి టెస్టులో జట్టును బుమ్రా అద్బుతంగా నడిపించాడు. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన రోహిత్ బుమ్రా తిరిగి జట్టును పగ్గాలను అందుకున్నాడు. రోహిత్ వరుస వైఫల్యాలతోనే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాడు. తన పేలవ ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీలోనూ ప్రోయాక్టివ్(చురగ్గా)గా ఉండడం లేదు. మెల్బోర్న్ టెస్టులో రోహిత్ కెప్టెన్సీ లోపం స్పష్టంగా కన్పించింది.సామ్ కాంటాస్ ఫాస్ట్ బౌలర్లను అద్బుతంగా ఆడుతున్నప్పటికి మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో వరుసగా 11 ఓవర్లు బౌలింగ్ చేయించాడు. ఆ సమయంలో స్పిన్నర్న తీసుకు వచ్చివుంటే ఆరంభంలోనే అతడి వికెట్ దక్కేది. రోహిత్ వ్యూహత్మకంగా వ్యవహరించడం లేదు. అతడు కెప్టెన్సీతో పాటు ఫామ్ లేమితో సతమతవుతున్నాడని" ఎమ్ఎస్కే ప్రసాద్ పేర్కొన్నారు. -
లక్నో జట్టు ‘గేమ్ ఛేంజర్’ అతడే: ఎమ్ఎస్కే ప్రసాద్
జహీర్ ఖాన్ రాకతో లక్నో సూపర్ జెయింట్స్ రాత మారబోతుందని ఆ జట్టు టాలెంట్ సెర్చ్ డైరెక్టర్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ అన్నాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న జహీర్ మార్గదర్శనంలో లక్నో అద్భుత విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.లక్నో మెంటార్‌గా జహీర్ నియామకంకాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్‌గా భారత మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. జహీర్ ఈ జట్టుతో చేరుతున్నట్లుగా గత కొంత కాలంగా వార్తలు వినిపించగా... టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా బుధవారం అధికారికంగా ప్రకటించారు. మెంటార్‌గా ప్రధాన జట్టుకే పరిమితం కాకుండా ప్రతిభాన్వేషణ, కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దే అదనపు బాధ్యతలను కూడా జహీర్‌కు లక్నో యాజమాన్యం అప్పగించింది.క్యాష్ రిచ్ లీగ్‌లోకి 2022లో లీగ్‌లోకి ప్రవేశించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు రెండేళ్లు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత మెంటార్ బాధ్యతల నుంచి గంభీర్ తప్పుకోగా.. 2024 సీజన్లో లక్నో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ క్రమంలో గంభీర్ స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేసింది యాజమాన్యం.అత్యుత్తమ బౌలర్ రాక మాకు శుభ పరిణామంఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘లక్నో జట్టుకు ఇదొక శుభవార్త. జహీర్ ఖాన్ వంటి మేటి క్రికెటర్ మెంటార్‌గా రావడం మంచి పరిణామం. జహీర్ నెమ్మదస్తుడు. కూల్‌గానే తనకు కావాల్సిన ఫలితాలను రాబట్టుకోగల సమర్థత ఉన్నవాడు. ఆట పట్ల అతడికి విశేష జ్ఞానం ఉంది. ఐపీఎల్లో జహీర్ కెరీర్ ఇలాటీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణించిన ఘనత అతడి సొంతం. ఐపీఎల్‌లోనూ తనకు గొప్ప అనుభవం ఉంది. లక్నో జట్టుకు అతడు గేమ్ ఛేంజర్ కాబోతున్నాడు’’ అని స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా భారత అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న జహీర్ 2017 వరకు ఐపీఎల్ ఆడాడు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ జట్ల తరఫున మొత్తం 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టిన అతను ఆ తర్వాత కూడా ఐపీఎల్‌తో కొనసాగాడు. 2018–2022 మధ్య ఐదేళ్ల పాటు జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ టీమ్‌కు డైరెక్టర్, ఆ తర్వాత హెడ్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్-2025లో లక్నో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.చదవండి: ఒక్కడి కోసం అంత ఖర్చు పెడతారా? లక్నో జట్టు ఓనర్ -
హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
టీమిండియా భవిష్య కెప్టెన్ గురించి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు సారథిగా పగ్గాలు చేపట్టగల అర్హత అతడికే ఉందంటూ ఓ ముంబైకర్ పేరు చెప్పాడు.కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. హిట్‌మ్యాన్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఏక కాలంలో నంబన్ వన్‌గా నిలిచిన టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.ఫైనల్ వరకూ వచ్చినా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అదే విధంగా.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లోనూ విజయ లాంఛనం పూర్తి చేయలేక.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఆఖరి మెట్టుపై టైటిల్‌ను చేజార్చుకుంది.ఇక ఇప్పుడు మరో మెగా టోర్నీకి టీమిండియా సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఇందులో మిడిలార్డర్ బ్యాటర్, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా మాత్రం అయ్యర్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేకేఆర్ ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు. ‘‘హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.. శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దబడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమపద్ధతిలో సారథిగా ఎదిగేందుకు బాటలు వేసుకున్నాడు.గత రెండేళ్లలో అతడి గణాంకాలు అద్బుతం. ఇక ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాకు తెలిసి ఇండియా- ఏ ఆడిన 10 సిరీస్‌లలో ఎనిమిది గెలిచింది. అందులో ఎక్కువసార్లు భారత జట్టును ముందుకు నడిపింది శ్రేయస్ అయ్యరే!టీమిండియా తదుపరి కెప్టెన్‌గా అతడు తయారుచేయబడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత సారథిగా రిషభ్ పంత్‌తో శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నాడు. పంత్ కంటే ముందే..నిజానికి పంత్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పవచ్చు’’ అని రెవ్‌స్ట్పోర్ట్స్‌తో ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. అయితే, ఇదంతా గతం. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంతో ఇప్పుడు జట్టులో స్థానం గురించి పోటీ పడాల్సిన పరిస్థితి.చదవండి: ‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’ -
'అతడు బ్యాటర్లను భయపెడుతున్నాడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు'
లక్నో సూపర్ జెయింట్స్ యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఆరు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మయాంక్.. దురదృష్టవశాత్తు ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు. భుజం నొప్పి కారణంగా కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసి యాదవ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కానిట్లు తెలుస్తోంది. అతడు రాబోయే మ్యాచ్‌ల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో తన సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన మయాంక్‌పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. ఈ జాబితాలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చేరాడు. మయాంక్‌కు అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని ఎంఎస్కే అభిప్రాయపడ్డాడు. "మయాంక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెడుతున్నాడు. అతడి బౌలింగ్ స్పీడ్‌కు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఆడేందుకు ఇబ్బంది పడతున్నాడు. అతడు భవిష్యత్తులో భారత జట్టుకు ముఖ చిత్రంగా మారుతాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇప్పుడు సెలక్టర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు బంతిని షేర్ చేసుకునే మూడో పేసర్ కోసం వెతుకుతున్నారు. కాబట్టి షమీ స్ధానాన్ని వరల్డ్‌కప్ జట్టులో మయాంక్‌తో భర్తీ చేయాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ యాదవ్‌లో ఉన్నాయి. అతడు ప్రస్తుతం ఆడుతున్నది వేరే ఫార్మాట్ అయితే నేను కాస్త ఆలోచించి నా నిర్ణయాన్ని వెల్లడించేవాడిని. కానీ ఐపీఎల్ అనే అనేది ఒక మెగా వేదిక. ఇక్కడ ప్రదర్శన చేయడం అంత సులభం కాదు. ప్రతి గేమ్‌లో ఒత్తిడి ఉంటుంది. కానీ మయాంక్ మాత్రం ఒత్తడిని తట్టుకుని మరి నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడికి వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తున్నాని" ప్రసాద్ రేవ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాహుల్‌కు మొదటి అవకాశం
న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో భారత వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందని మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. ఇషాన్ కిషన్కంటే మిడిలార్డర్లో రాహుల్ ఎంతో విలువైన ఆటగాడని ఆయన అన్నారు. తన ప్రదర్శనతో దీనిని అతను రుజువు చేసుకున్నాడని, మరో చర్చకు ఆస్కారం లేద ని ప్రసాద్ చెప్పారు. రాహుల్‌కు గాయం కావడం లేదా సుదీర్ఘ టోర్నీ కాబట్టి కొన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా విశ్రాంతినివ్వాల్సి వస్తేనే ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎమ్మెస్కే వివరించారు. -
IPL 2024: ఎంఎస్కే ప్రసాద్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌లో కీలక పదవి
భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలకపదవి కట్టబెట్టింది. 2024 ఐపీఎల్ సీజన్‌కు గానూ కీలకమైన స్ట్రాటెజిక్ కన్సల్టెంట్‌గా (వ్యూహాత్మక సలహాదారు) నియమించింది. గడిచిన నెలలో తమ ప్రధాన కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్‌ను తప్పించి, అతని స్థానంలో ఆసీస్ మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్‌ను నియమించిన ఎల్ఎస్జీ.. తాజాగా మరో కీలక మార్పు చేసి వార్తల్లో నిలిచింది. ఎంఎస్కే ప్రసాద్‌ను తమ వ్యూహాత్మక సలహాదారుగా నియమించినట్లు ఎల్ఎస్జీ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్ 17) అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా, క్రికట్ ఆపరేషన్స్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ప్రసాద్ సేవలు తమ ఫ్రాంచైజీకి చాలా ఉపయోగపడతాయని ఎల్ఎస్జీ తమ స్టేట్మెంట్లో పేర్కొంది. కాగా, 1999, 2000 సంవత్సరాల్లో భారత్ తరఫున 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్రసాద్.. 2016 నుంచి 2020 వరకు భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా పలు ఫ్రాంచైజీలు తమ ప్రధాన కోచ్‌లను మార్చేశాయి. ఈ మార్పులకు కూడా ఎల్‌ఎస్‌జీనే శ్రీకారం చుట్టింది. తొలుత ఈ జట్టు ఆండీ ఫ్లవర్ స్థానంలో లాంగర్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించుకోగా, ఆతర్వాత అదే ఫ్లవర్‌కు ఆర్సీబీ తమ ప్రధాన కోచ్‌గా అపాయింట్ చేసుకుంది. కొద్ది రోజుల ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తమ ప్రధాన కోచ్ పదవి నుంచి బ్రియాన్ లారాకు ఉద్వాసన పలికి, అతని స్థానంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీని హెడ్‌గా కోచ్‌గా నియమించుకుంది. -
శ్రేయస్ అయ్యర్ దూరం.. తిలక్ వర్మకు అవకాశం.. అలా అయితే..!
Tilak Varma to do well in ODIs: టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ ప్రశంసలు కురిపించాడు. ఈ హైదరాబాదీ స్టార్.. లిస్ట్- ఏ క్రికెట్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయని.. అతడిని వన్డేల్లో ఆడిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. కాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన నంబూరి తిలక్ వర్మను ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంతో దశ తిరిగింది. అరంగేట్రంలోనే అదుర్స్ ముంబై తరఫున గత రెండు సీజన్లలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఈ లెఫ్టాండర్‌ను తొలిసారి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. వారి నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి 139 పరుగులు సాధించాడు. అరంగేట్రంలో 39 రన్స్ చేసిన అతడు.. రెండో మ్యాచ్‌లోనే అర్ధ శతకం బాదాడు. అయ్యర్ దూరమైతే ఇక మంగళవారం ముగిసిన మూడో టీ20లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్కే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రానిపక్షంలో తిలక్ వర్మకు మిడిలార్డర్లో అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. గణాంకాలు అద్భుతం ‘‘హైదరాబాద్‌కు జట్టు తరఫున లిస్ట్-ఏ క్రికెట్లో తిలక్ వర్మ 25 మ్యాచ్‌లు ఆడి సగటున 55 పరుగులు స్కోర్ చేశాడు. మొత్తంగా ఐదు సెంచరీలు, 5 అర్ధ శతకాలు సాధించాడు. అంటే.. ఆడిన మొత్తం సందర్భాల్లో కనీసం 50 శాతమైనా తన ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలను, సెంచరీలుగా మారుస్తున్నాడు. అతడి స్ట్రైక్‌రేటు కూడా 100కు పైగానే ఉంది. ఒకవేళ శ్రేయస్ కోలుకోకపోతే.. వర్మను జట్టులోకి తీసుకోవడం బాగానే ఉంటుంది. ఒకవేళ అలా జరుగకపోయినా.. భవిష్యత్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో తిలక్ రెగ్యులర్ ప్లేయర్ అవుతాడని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్లకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు మాజీ చీఫ్ సెలక్టర్ తిలక్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాగా లిస్ట్-ఏ క్రికెట్లో తిలక్ ఇప్పటి వరకు సగటు 56.18తో 1236 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్ సిక్సర్! అత్యంత ఖరీదు.. ధర తెలిస్తే షాక్! -
రహానే వైస్ కెప్టెన్ అయినపుడు మరి కోహ్లి ఎందుకు..?: మాజీ చీఫ్ సెలక్టర్
Team India Test Captain: ‘‘ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. సెలక్టర్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం కదా! నిజానికి డబ్ల్యూటీసీ తాజా సైకిల్ ఆరంభం కానున్న నేపథ్యంలో సెలక్టర్లు ప్రతి విషయంలో పూర్తి స్పష్టతతో ఉండాలి. అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా పునరాగమనం చేసినపుడు మరి విరాట్ కోహ్లి ఎందుకు తిరిగి కెప్టెన్ కాకూడదు? మరోసారి కెప్టెన్సీ చేపట్టే విషయంలో కోహ్లి ఆలోచనా ధోరణి ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరన్న అంశంపై సెలక్టర్లు చర్చిస్తూ ఉంటే కచ్చితంగా విరాట్ రూపంలో వాళ్ల ముందు గొప్ప ఆప్షన్ ఉంది’’ అని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ అన్నాడు. టెస్టు సారథిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లిని తిరిగి కెప్టెన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ తర్వాత రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు విజయాలు అందించిన 36 ఏళ్ల రోహిత్.. ఐసీసీ ఈవెంట్లలో విఫలం కావడం, వయసు పైబడటం కూడా అతడిని సారథిగా తొలగించాలనే డిమాండ్లకు కారణం. ఈ నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరన్న అంశంపై చర్చ నడుస్తున్న తరుణంలో ఎమ్ఎస్కే ప్రసాద్ ఖేల్ నౌతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి తిరిగి టెస్టు పగ్గాలు చేపడితే బాగుంటుందన్న ప్రసాద్.. కోహ్లి ఈ విషయం పట్ల సుముఖంగా లేకుంటే శుబ్‌మన్ గిల్ కూడా మంచి ఆప్షన్ అని పేర్కొన్నాడు. అయితే, ఈ యువ బ్యాటర్‌పై ఇప్పుడే భారం మోపడం సరికాదని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2023లో అదరగొట్టిన రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023తో టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. కీలక మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ వెటరన్ బ్యాటర్.. వెస్టిండీస్‌తో టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్ మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే Ind Vs WI: ద్రవిడ్ సెంచరీ.. కోహ్లి 19 పరుగులు! విరాట్ ట్వీట్ వైరల్ -
#MSKPrasad: 'క్రికెట్ కు సంబంధించి దేశానికి ఏపీ రోల్ మోడల్'
టీమిండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఒక చానెల్‌కు ఇంటర్య్వూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ''క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని సగర్వంగా చెప్పగలను. క్రికెట్లో కేఎస్ భరత్ లాంటి యంగ్ క్రికెటర్ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. అదే విధంగా ఇతర క్రీడలో సాత్విక్ సాయిరాజ్, కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులు బ్యాడ్మింటన్‌లో.. టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశానికి వివిధ కేటగిరీల్లో పతకాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిస్తున్నారు. ఇక క్రీడల్లో మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా ఉంది. ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. '' అంటూ చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడా మౌలిక సదుపాయాలు ఇంటర్నేషనల్ స్టేడియంలు 2 క్రికెట్ అకాడమీలు 4 ఫస్ట్ క్లాస్ క్రికెట్ గ్రౌండ్ లు 18 ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు? ఇక ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. ''దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే), కర్నాటకకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్లున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్కటే ఉంది. ఐపీఎల్ జట్టు అనేది ఫ్రాంచైజీ నుంచి కానీ, ప్రాంతం తరపున కాదు. ఆ మధ్య రెండు కొత్త జట్లను ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్‌చంద్రా రెడ్డి కూడా 3,500 కోట్లకు బిడ్ వేశారు. కానీ, ఎక్కువ కోట్ చేసిన వేరేవాళ్లకు ఆ జట్లు వెళ్లాయి. ఒకదశలో వైజాగ్, అమరావతి అన్న పేరుతో ఫ్రాంచైజీ వస్తుందన్న టాక్ నడిచింది. ఐపీఎల్ కమర్షియల్ టోర్నమెంట్.ఇలాగే ఉంటే కొన్నిరోజులకు బీసీసీఐకి కూడా నష్టం జరుగుతోంది. ఒక రకంగా ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ లేకపోవడమే మంచిది. ఫుట్‌బాల్‌లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌నే తీసుకుంటే ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడడం కంటే కూడా ఆ లీగ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే ఒక్క రూపాయి వస్తే, ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటే వంద రూపాయలు ఇస్తారు. '' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు. ఇక వికెట్ కీపర్ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ టీమిండియా తరపున ఆరు టెస్టుల్లో 106 పరుగులు, 17 వన్డేల్లో 131 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థశతకం ఉంది. ఇక 2016 నుంచి 2020 వరకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. చదవండి: #ViratKohli: పుష్కర కాలం పూర్తి.. లెక్కలేనన్ని ఘనతలు సొంతం -
ఇంపాక్ట్ ప్లేయర్స్ దునేస్తున్నారు...
-
IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జరిగిందిదే! అందుకే ఇలా!
IPL 2023- Impact Player- ముంబై: గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్–2023 మరింత ఆసక్తికరంగా సాగుతోందని భారత మాజీ క్రికెటర్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా లీగ్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఎమ్మెస్కే ఈ ఐపీఎల్ సీజన్లో స్టార్ స్పోర్ట్స్–తెలుగు చానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘స్టార్’ కార్యక్రమంలో ఆయన తాజా సీజన్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘సగం టోర్నమెంట్ ముగిసేసరికే ఈ ఐపీఎల్ గత సీజన్ల రికార్డులను అధిగమించింది. 200కు పైగా స్కోర్లు పెద్ద సంఖ్యలో నమోదు కాగా, సిక్సర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇది లీగ్ ఎంతగా విజయవంతం అయిందో చూపిస్తోంది’ అని ప్రసాద్ అన్నారు. సానుకూలమే.. అందుకే ఇలా కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అంశం మంచి ప్రభావం చూపిస్తోందని ప్రసామద్ చెప్పారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఈ సీజన్లో ఐపీఎల్ టీమ్ హోమ్ అడ్వాంటేజ్ పోయింది. ప్రత్యర్థి జట్టు వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కలుగుతోంది. అందుకే చాలా మ్యాచ్‌లలో సొంత మైదానాల్లో జట్లు ఓడిపోతున్నాయి’ అని ఎమ్మెస్కే విశ్లేషించారు. యువ ఆటగాళ్లు అదుర్స్ ప్రధానంగా భారత యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనలు ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశమని ఈ భారత మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత క్రికెట్‌కు మేలు చేసే అంశం. తిలక్‌వర్మ, సాయిసుదర్శన్, రింకూ సింగ్, యశస్వి, ధ్రువ్ జురేల్ తమ ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం సానుకూలాంశం.’ అని ప్రసాద్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సద్వినియోగం చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఆయుష్ బదోనిని, బెంగళూరు హర్షల్ పటేల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా దింపాయి. చదవండి: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్ -
IPL 2023: క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించనున్న బాలయ్య
Nandamuri Balakrishna: నటసింహం బాలయ్య మరో కొత్త అవతారమెత్తనున్నాడు. సినిమాలు, రాజకీయాలు, ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో బిజీగా ఉండే బాలకృష్ణ.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2023 సీజన్‌తో వ్యాఖ్యాతగా మారనున్నాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఐపీఎల్ 16వ ఎడిషన్ కోసం బాలయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కామెంట్రీ బాక్స్‌లో బాలయ్య.. వేణుగోపాల్ రావు, ఎంఎస్కే ప్రసాద్, ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, టి సుమన్‌లతో కలిసి వ్యాఖ్యానించనున్నాడు. బాలయ్య తనదైన శైలిలో సినిమాకు, క్రికెట్‌ను అనుసంధానించి ఎలా వ్యాఖ్యానిస్తాడోనని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నతనం నుంచి క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే బాలయ్య, కాలేజీ రోజుల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి క్రికెట్ ఆడేవారట. గతంలో బాలయ్య సినీ తారలు ఆడే సెలబ్రిటీ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు సారధ్యం వహించాడు. బాలయ్య సమయం దొరికినప్పుడల్లా సెట్స్‌లో కూడా క్రికెట్ ఆడేవారని జనాలు చెబుతుంటారు. ఇలా బాలయ్య ప్రతి దశలోనూ క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించాడు. క్రికెట్‌పై ఉన్న అమితాసక్తితోనే బాలయ్య స్టార్ స్పోర్ట్స్ తెలుగు వారి ఆఫర్‌ను కాదనలేకపోయారని తెలుస్తోంది. కాగా, మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్- ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
'అతడు అద్భుతమైన ఆటగాడు.. తిరిగి జట్టులోకి వస్తాడని ఎవరు ఊహించి ఉండరు'
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాకి తిరిగి జట్టులో చోటు దక్కింది. కాగా పుజారా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో ఆడుతున్న పుజారా 8 ఇన్నింగ్స్‌లలో 720 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అద్భుతమైన పునరాగమనం చేసిన పుజారాపై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంస్కే ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుజారా నిబద్ధత, అంకితభావం కలిగిన ఆటగాడని అతడు కొనియాడాడు. "పుజారా భారత జట్టులోకి అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఇది అతడికి ఆట పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. అతడు మళ్లీ భారత జట్టులోకి వస్తారని ఎవరూ ఊహించి ఉండరు. టెస్ట్ క్రికెట్లో తన ఫామ్‌ను తిరిగి పొందడానికి అతడు కౌంటీల్లో ఆడాడు. అక్కడ అత్యుత్తమ ప్రదర్శనలు చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు. కాబట్టి క్రెడిట్ మొత్తం అతడికే దక్కాలి. అతడు దాదాపు తన కెరీర్లో టెస్ట్ క్రికెటర్‌గానే ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆటగాడు జట్టులో లేకపోతే.. అద్భుతమైన టెస్ట్ క్రికెటర్‌ను కోల్పోతాం. అతడు ఇంగ్లండ్ సిరీస్‌లో బాగా రాణించి భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తే.. పుజారా ఖచ్చితంగా మరో రెండేళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను కలిగి ఉంటాడని నేను భావిస్తున్నాను" అని ఎంస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. చదవండి: Daniel Vettori: ఆస్ట్రేలియా కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్.. -
తను బాగా ఆడితే నా కన్న కొడుకే ఆడినంతగా సంబర పడతా: ఎమ్ఎస్కే ప్రసాద్
MSK Prasad Comments: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత జట్టు మాజీ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2022లో కొత్త జట్టు గుజరాత్ కెప్టెన్‌గా అదరగొడుతున్నాడని, ఆ అనుభవం హార్దిక్ కెరీర్‌కు ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. మైదానంలో అతడు వ్యవహరిస్తున్న తీరు ముచ్చటగొలుపుతోందన్నాడు. భావోద్వేగాలకు అతీతంగా హుందాగా ప్రవర్తిస్తూ మానసికంగా పరిణతి చెందుతున్నాడని కొనియాడాడు. కాగా హార్దిక్ పాండ్యా 2016లో భారత జట్టుకు ఎంపిక కావడంలో ఎమ్ఎస్కే ప్రసాద్ పాత్ర మరువలేనిది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న హార్దిక్ స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అయితే, గతేడాది నుంచి ఫామ్‌లేమితో సతమతమవడం, బౌలింగ్ చేయలేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో జాతీయ క్రికెట్ అకాడమీలో హార్దిక్ శిక్షణ పొందాడు. బీసీసీఐ నుంచి పిలుపు రాకపోవడం సహా ఐపీఎల్లో తనను ప్రోత్సహించిన ముంబై ఇండియన్స్ కూడా రిటైన్ చేసుకోకపోవడంతో హార్దిక్ కెరీర్ మసకబారుతోందంటూ కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ అతడిని కొనుగోలు చేసి తమ జట్టు సారథిగా నియమించింది. ఇక సారథిగా హార్దిక్‌కు ఇదే తొలి అనుభవం. అయినప్పటికీ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో తనదైన ముద్ర వేసి హార్దిక్ జట్టుకు వరుస విజయాలు అందించాడు. లక్నో, ఢిల్లీ జట్లపై గెలుపుతో సారథిగా శుభారంభం అందుకున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో 31 పరుగులు, లక్నోపై 33 పరుగులు సాధించి బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో బొరియా మజుందార్ యూట్యూబ్ చానెల్లో ఎమ్ఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ హార్దిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తను బాగా ఆడితే... నాకు అది గర్వకారణం. నా కన్న కొడుకుదే ఆ విజయం అన్నంతగా సంబరపడతా. దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ వారసత్వాన్ని కొనసాగించగల ఆల్‌రౌండ్ ప్రతిభను వెలికితీయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఈ యంగ్స్టర్లో నేను ఆ లక్షణాలు చూశాను. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అతడు స్ట్రాంగ్. ఇప్పుడు తను వ్యక్తిగతంగా, ఆటగాడిగా మరింత పరిణతి చెందాడు. తనకు పెళ్లైంది. జీవితంలో సెటిలయ్యాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయ్యాడు. ఈ అనుభవం తనను మరో స్థాయికి తీసుకువెళ్తుంది. భారత జట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఫీల్డ్‌లో హార్దిక్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ముచ్చటేస్తోంది’’ అని హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఏప్రిల్ 8న పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఇక గుజరాత్ టైటాన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో భావోద్వేగానికి గురైన హార్దిక్.. జట్టును అత్యున్నత శిఖరాలకు చేరుస్తానంటూ అభిమానులకు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: కోహ్లి రనౌట్.. చహల్ భార్య ధనశ్రీ సెలబ్రేషన్స్.. మరీ ఇంత సంతోషమా? వైరల్ ❤️ Goosebumps on our debut day, courtesy captain @hardikpandya7 ▶️ pic.twitter.com/2qdwn5FKrc — Gujarat Titans (@gujarat_titans) March 28, 2022 -
"అందుకే దక్షిణాఫ్రికా టూర్‌కు రహానేను ఎంపిక చేశారు"
Ajinkya Rahane: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ టెస్ట్ జట్టును బీసీసీఐ బుధవారం( డిసెంబర్ 8) ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని అజింక్య రహానే పై వేటు తప్పదని అంతా భావించనప్పటికీ.. అనుహ్యంగా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే రహానెను వైస్ కెప్టెన్ భాధ్యతల నుంచి తప్పించి రోహిత్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో సెలక్టర్లు రహానెను ఎందుకు ఎంపిక చేశారో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్‌స్కే ప్రసాద్ తెలిపాడు. విదేశీ పిచ్‌ల్లో రహానెకు వున్న రికార్డుల వల్ల అతడివైపు సెలక్టర్లు మొగ్గు చూపారని ఎమ్‌స్కే ప్రసాద్ చెప్పాడు. "జట్టు ఎప్పుడూ జూనియర్లు, సీనియర్లు కలయిక తో సమతూకంగా ఉండాలి. రహానే విషయానికి వస్తే..2013లో టెస్ట్ క్రికెట్లో అద్బుతంగా రాణించాడు. సాధరణంగా రహానే విదేశాల్లో బాగా రాణిస్తాడు. కానీ స్వదేశంలో అతడికి పెద్దగా రికార్డులు లేవు. గత కొద్దికాలంగా అతడు పెద్దగా ఫామ్‌లో లేడు. ఈ క్రమంలో సెలెక్టర్లకు అతడిని ఎంపిక చేసే ముందు కాస్త అయోమయంకు గురై ఉంటారు. అయితే విదేశాల్లో అతడికి ఉన్న ట్రాక్ రికార్డును చూసి సెలెక్టర్లు ఎంపిక చేసుండవచ్చు" అని ఎమ్‌స్కే ప్రసాద్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా విదేశాల్లో రహానే 40 సగటుతో 3000పైగా పరుగులు సాధించాడు. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: IND-A Vs SA-A: భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ డ్రా.. -
Ravi Shastri: అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ..
Ravi Shastri: Had No Say Dropping Ambati Rayudu In 2019 World Cup Squad: రవిశాస్త్రి... 2017లో టీమిండియా హెడ్ కోచ్‌గా పగ్గాలు చేపట్టాడు. ఆయన హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించింది. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో 43 టెస్టులు ఆడిన భారత జట్టు 25 గెలవగా.. ఐదింటిని డ్రా చేసుకుంది. ఇక 76 వన్డేల్లో సాధించిన విజయాలు 51. పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే... అరవై ఐదింట.. 43 విజయాలు. మొత్తంగా 184 మ్యాచ్‌లలో 119 గెలుపొందింది. విజయాల శాతమే ఎక్కువగా ఉన్నా... ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా 2019లో వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి టీమిండియా కనీసం ఫైనల్‌కు కూడా చేరకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. అంతేగాక జట్టు సెలక్షన్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును కాదని.. విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకొన్న రవిశాస్త్రి తాజాగా ఈ విషయాల గురించి మాట్లాడారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో సంభాషించిన ఆయన... ‘‘2019 వరల్డ్‌కప్... జట్టు ఎంపిక విషయం గురించి నాకు పెద్దగా ఫిర్యాదులు లేవు. అయితే, ప్రపంచకప్ కోసం ముగ్గురు వికెట్ కీపర్లను సెలక్ట్ చేయడం సరికాదనిపించింది. నిజానికి అంబటి(అంబటి రాయుడు) లేదంటే శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావాల్సింది. ఎంఎస్ ధోని, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్.. వికెట్ కీపర్ బ్యాటర్లు ఇంతమంది ఎందుకు అనిపించింది. కానీ సెలక్టర్ల నిర్ణయంలో నేను ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. సాధారణ చర్చల్లో భాగంగా... ఫీడ్బాక్ అడిగినపుడు మాత్రమే కొన్ని విషయాలు చెప్పేవాడిని’’ అని పేర్కొన్నాడు. కాగా 2019లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ సమయంలో... అద్భుత ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడి కాదని, విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో విమర్శలు రాగా.... విజయ్ త్రీ డైమన్షనల్ ఆటగాడని అందుకే అతన్ని సెలెక్ట్ చేసినట్లు(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. ఆనక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. చదవండి: IPL 2022 Auction- Avishka Fernando: 23 బంతుల్లో 53 పరుగులు.. సిక్సర్ల కింగ్.. ఐపీఎల్ వేలంలోకి వచ్చాడంటే! -
వాళ్లిద్దరూ కోచ్, మెంటార్లుగా ఉంటే.. టీమిండియాకు వరం: ఎమ్మెస్కే ప్రసాద్
MSK Prasad Comments On Rahul Dravid And Dhoni: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడన్న వార్తల నేపథ్యంలో... కొత్త కోచ్ ఎవరన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. కుంబ్లే పేరును బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రతిపాదించినప్పటికీ.. తనకు ఈ పదవిపై ఆసక్తి లేదని కుంబ్లే చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. బీసీసీఐ విదేశీ కోచ్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ అయితే బాగుంటుందని పేర్కొన్నాడు. స్పోర్ట్స్‌తక్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ద్రవిడ్ కోచ్‌గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రవి భాయ్ యుగం ముగిసిన తర్వాత.. ఎంఎస్ ధోని మెంటార్‌గా, ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని నా సహచర కామెంటేటర్లతో ఛాలెంజ్ చేశా. ఐపీఎల్ కామెంట్రీ చేస్తున్న సమయంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయి. కోచ్‌గా ద్రవిడ్, మెంటార్‌గా ధోని ఉంటే భారత క్రికెట్‌కు అదొక వరంలా మారుతుంది. ఇద్దరూ కూల్‌గా ఉంటారు. అందులో ఒకరు(ద్రవిడ్) మరీ హార్డ్ వర్కర్. ఇండియా ఏ జట్టులో చాలా మంది ఇప్పటికే ఆయన శిక్షణలో రాటుదేలుతున్నారు. నేను అనుకున్నట్లుగా ధోని మెంటార్, ద్రవిడ్ కోచ్ కాకపోతే నేను నిరాశచెందుతాను’’ అని చెప్పుకొచ్చాడు. 2017లో భారత జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడైన రవిశాస్త్రి హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలవలేదు. చదవండి: Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా... -
T20 World Cup: ఆ ఇద్దరిని సెలక్ట్ చేయాల్సింది: ఎమ్మెస్కే ప్రసాద్
MSK Prasad On T20 World Cup Squad Selection: వచ్చే నెలలో మరో మెగా క్రికెట్ ఈవెంట్‌కు తెరలేవనుంది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ మేజర్ టోర్నీ కోసం ఇప్పటికే ప్రధాన దేశాలన్నీ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, ఈ ఎంపికపై ఇప్పటికీ కొంతమంది మాజీ సెలక్టర్లు పెదవి విరుస్తున్నారు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ సెలక్టర్ సబా కరీం అభ్యంతరం వ్యక్తం చేయగా.. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు చోటు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్‌తక్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నమెంట్లలో శిఖర్ ధావన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అతడి సేవలు జట్టుకు అవసరం. అలాగే కృనాల్ పాండ్యా కూడా.. గత రెండు, మూడేళ్లుగా టీ20 ఫార్మాట్లో రాణిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. టీ20 జట్టును ఎంపిక చేసే సమయంలో సెలక్టర్లు ఈ విషయాలు ఆలోచించాల్సి ఉండాల్సింది. వీళ్లిద్దరినీ ఎంపిక చేయాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ధవన్ ప్రస్తుత సీజన్ అత్యధిక పరుగుల జాబితాలో 422 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాహుల్ చహర్ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెస్కే మాట్లాడుతూ.. ‘‘టీమిండియా టీ20 బౌలర్లలో యజువేంద్ర చహల్ అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా వరుస మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో రాహుల్ చహర్ సైతం ఐపీఎల్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్నపుడు తాజా పర్ఫామెన్స్‌ను బట్టి సెలక్టర్లు చహర్ వైపు మొగ్గు చూపారు. ఈ ఎంపిక సైతం చర్చనీయాంశమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దుబాయ్‌లో అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌తో టీమిండియా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: IPL 2021: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఇంటి దారి పట్టిన స్టార్ ఆల్‌రౌండర్ -
టీమిండియాలో అతని ఎంపికే ఓ వివాదం..
హైదరాబాద్: టీమిండియా డాషింగ్ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపిక అప్పట్లో ఓ పెద్ద వివాదానికి దారి తీసిందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. 2014లో మాజీ కెప్టెన్ ధోనీ టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా ఎదిగాడని, అతను భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్న తరుణంలో సడన్‌గా రిషబ్ పంత్‌ని తమ బృందం తెరపైకి తెచ్చిందని, దీంతో ఆ సమయంలో తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో పంత్ టెస్టులకు పనికిరాడని, అతని దూకుడు టెస్ట్ ఫార్మాట్‌కు సరిపోదని, కీపింగ్ విషయంలో ఫిట్నెస్ విషయంలో అలక్ష్యంగా ఉంటాడని అతనిపై అనేక రకాల విమర్శలు వచ్చాయని, అయినా పంత్ వాటన్నింటిని అధిగమించి రాటుదేలాడని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పంత్ ఘోరంగా విఫలమయ్యాడని, అయితే గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో తిరుగులేని ప్రదర్శన కనబర్చాడని, ఆ తర్వాత ఇంగ్లండ్‌పైనా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పంత్.. భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లపై సైతం చక్కగా కీపింగ్ చేస్తున్నాడని, ఛాలెంజింగ్ కండీషన్లలో కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సెలెక్టర్‌గా ప్రతిభని గుర్తించడం తన బాధ్యతని, అందులో భాగంగానే పంత్ ఎంపిక జరిగిందని, తన నమ్మకాన్ని పంత్ వమ్ము చేయలేదని తెలిపాడు. రెండేళ్ల కిందట చాలా మంది పంత్ ఈ స్థాయిలో రాణిస్తాడని ఊహించలేదని, అతన్ని విమర్శించిన వారే నేడు అతన్ని అందలం ఎక్కిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ గడ్డపై ఈ నెల 3న అడుగుపెట్టిన భారత జట్టు.. జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా జరిగే డబ్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ టూర్‌కి రిషబ్ పంత్ టీమిండియా ఫస్ట్ ఛాయిస్ కీపర్‌గా ఎంపికయ్యాడు. చదవండి: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్.. కారణం తెలిస్తే షాక్ -
పంత్‌తో ఇషాన్ పోటీ రసవత్తరంగా ఉంటుంది!
న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్‌పై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటు ఓపెనర్‌గా.. అటు నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాడిగా మెరుగ్గా రాణించాడని, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం అతడి ప్రతిభకు నిదర్శనమన్నాడు. త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్‌లీగ్‌లో ఐదోసారి టైటిల్‌ను సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగా, ఛేజింగ్‌కు దిగిన రోహిత్ సేన అలవోకగా విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో నంబర్ 4 ఆటగాడిగా మైదానంలో దిగిన 22 ఏళ్ల ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 33(నాటౌట్) పరుగులు చేశాడు , ఇందులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అంతేగాకుండా టోర్నీ మొత్తంలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ ఇషాన్ గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. డైనమైట్లా దూసుకువచ్చిన అతడిని చూస్తే ముచ్చటేసింది. ఓపెనింగ్ ఇన్నింగ్స్‌తో పాటు నంబర్ 4 ప్లేస్‌లోనూ బ్యాట్స్‌మెన్‌గానూ ఆకట్టుకున్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం చూస్తుంటే త్వరలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.(చదవండి: పంత్ ఎన్నటికీ ధోని కాలేడు: గంభీర్ ) టీ20, వన్డేల్లో వికెట్‌కీపర్- బ్యాట్స్‌మెన్ స్థానానికి అతడో గట్టి పోటీదారు అవుతాడు. ఐపీఎల్ మాదిరి ప్రదర్శన కొనసాగిస్తే నేషనల్ స్వ్యాడ్లోకి అతడికి స్వాగతం లభిస్తుంది’’అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఇషాన్ కిషన్‌పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తన కెప్టెన్సీలో అండర్ 19 మ్యాచ్‌లు ఆడిన రిషభ్ పంత్‌తో ఇషాన్ కిషన్‌కు పోటీ ఆసక్తికరంగా ఉంటుందని, కొన్నాళ్ల క్రితం ‘స్టార్’గా వెలుగొందిన పంత్‌ను రీప్లేస్ చేసే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా మాజీ సారథి, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ ధోని వారసుడిగా నీరాజనాలు అందుకున్న పంత్, గత కొంతకాలంగా మెరుగ్గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్ కీపర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేయడంతో అతడికి అవకాశాలు సన్నగిల్లాయి. అదే విధంగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్లో మెరుగ్గా రాణించి తమను తాము నిరూపించుకున్న నేపథ్యంలో 23 ఏళ్ల పంత్‌కు వారిద్దరి వల్ల గట్టిపోటీ ఎదురుకాబోతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: ‘సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’) -
తెవాటియా.. ఐయామ్ వెరీ సారీ: మాజీ చీఫ్ సెలక్టర్
షార్జా: ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్-రాజస్తాన రాయల్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల మోత మోగింది. తొలుత కింగ్స్ పంజాబ్ 223 పరుగులు చేస్తే, తాము ఏమీ తక్కువ తినలేదని జవాబిస్తూ రాజస్తాన్ రాయల్స్ దాన్ని ఇంకా మూడు బంతులు ఉండగానే ఛేదించి భళా అనిపించింది. ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ తెవాటియానే. తొలుత స్మిత్, సంజూ శాంసన్‌లు ధాటిగా ఆడినా తెవాటియా ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్. భారీ లక్ష్య ఛేదనలో సెకండ్ డౌన్లో వచ్చాడు. అయితే పెద్దగా అంచనాలు లేని తెవాటియాను ఆ స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్న వచ్చింది. దానికి తగ్గట్టుగానే తెవాటియా తొలుత తడబడ్డాడు. తెవాటియా ఎదుర్కొన తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేసి ఇదేమి బ్యాటింగ్ అనిపించాడు. కానీ శాంసన్ ఔటైన తర్వాత మొత్తం గేమ్ స్వరూపాన్ని మార్చేశాడు తెవాటియా. కాట్రెల్ వేసిన 18 ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి గేమ్‌ను చేంజ్ చేసేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆడిన ఇన్నింగ్స్ కింగ్స్ పంజాబ్‌కు పరాజయాన్ని మిగిల్చింది. తెవాటియా మొత్తంగా 31 బంతుల్లో 7 సిక్స్‌లతో 53 పరుగులు చేసి మొత్తం గేమ్ స్వరూపాన్ని మార్చేసి తిట్టిన నోళ్లనే పొగిడేలా చేసుకున్నాడు. ఇలా తెవాటియా విమర్శించిన వారిలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా ఉన్నారు. (చదవండి: కోహ్లిని ఊరిస్తున్న రికార్డు) తెవాటియాను దింపి తప్పు చేశారు.. స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్లో కామెంట్రీ చెబుతున్న సమయంలో తెవాటియా బ్యాటింగ్ చూసి ఎంఎస్కే అసహనం వ్యక్తం చేశారు. తెవాటియాకు బ్యాటింగ్ రికార్డులు ఉండటం తాను ఎక్కడ చూడలేదని, మరి రాజస్తాన్ రాయల్స్ అతన్ని సెకెండ్ డౌన్లో దింపి తప్పు చేసిందన్నాడు. దీనివల్ల అవతలి ఎండ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఎంఎస్కే అన్నారు. ఆపై కాసేపటికి షమీ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో సంజూ శాంసన్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో కింగ్స్ పంజాబ్ విజయం ఖాయమని ఆ ఫ్రాంచైజీ సంబరాలు చేసుకుంది. కానీ ఆ తర్వాతే కథ మొదలైంది. తెవాటియా తన బ్యాట్‌కు పని చెప్పి సిక్సర్లతో హోరెత్తించాడు. టీ20లో అసలైన మజాను అందించాడు. వరుస సిక్సర్లతో కాట్రెల్‌పై విరుచుకుపడ్డాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టడంతో ఒక్కసారి మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఐయామ్ వెరీ సారీ.. మ్యాచ్ అనంతరం బైజూస్ క్రికెట్ లైవ్‌లో హోస్ట్ నందుతో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. తన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. ‘తెవాటియా గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లున్నాను. తెవాటియా ఒక అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్స్‌లతో విరుచుకుపడి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. తాను ముందుగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా. అతనిలో సామర్థ్యాన్ని గుర్తించే టీమ్ మేనేజ్మెంట్ ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు’ అని అన్నారు. -
‘అందుకే అంబటి రాయుడ్ని తీసుకోలేదు’
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అంబటి రాయుడు భారత క్రికెట్ జట్టులో చోటు కోసం చివరి వరకూ ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని అప్పటి సెలక్షన్ కమిటీ రాయుడ్ని పరిగణలోకి తీసుకోలేకపోవడంతో అది అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. వరల్డ్‌కప్‌కు రాయుడ్ని పక్కకు పెట్టిన సెలక్టర్లు.. విజయ్ శంకర్‌కు అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలోనే విజయ్ శంకర్ ‘3డీ(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ప్లేయర్ అంటూ ఎంఎస్కే కామెంట్ చేయడంతో రాయుడిలో మరింత అసంతృప్తిని రేకెత్తించింది. (‘న్యూజిలాండ్‌ను సాకుగా చూపడం లేదు’) భారత జట్టు 3డీ ఆటను చూడటానికి 3డీ గ్లాసెస్ కోసం ఆర్డర్ చేశానంటూ సెటైరిక్‌గా రాయుడు స్పందించడం మరింత వివాదంగా మారింది. కాగా, విజయ్ శంకర్ గాయంతో తిరిగి వచ్చిన క్రమంలో కూడా రాయుడికి అవకాశం ఇవ్వకుండా, రిషభ్ పంత్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించారు. దాంతో రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రాయుడు.. హైదరాబాద్ రంజీ జట్టుకు సైతం కెప్టెన్‌గా చేశాడు. కాగా, హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేసిన రాయుడు గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కాగా, అప్పుడు రాయుడ్ని వరల్డ్‌కప్‌లోకి ఎందుకు తీసుకోలేదనే దానిపై మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే మరొకసారి స్పందించాడు. స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి ఉద్వాసన గురించి అడగ్గా అందుకు ప్రసాద్ బదులిచ్చాడు. ‘ అంబటి రాయుడు కచ్చితంగా అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మేము వరల్డ్‌కప్ దృష్టిలో పెట్టుకుని అనుభవానికే పెద్ద పీట వేశాం. ఆ క్రమంలోనే అంబటి రాయుడు ఏడాది పాటు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే వరల్డ్‌కప్‌కు తీసుకునే నమ్మకాన్ని అతను మాకు కల్పించలేకపోయాడు. దాంతో రాయుడ్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఇక యువ క్రికెటర్లవైపు చూడటం కూడా మంచిది కాదనుకున్నాం. ఆ టోర్నమెంట్ ఇంగ్లండ్‌లో జరుగుతుండటంతో అన్ని రకాలుగా పకడ్బందీగా వెళ్లాలనుకున్నాం. 2016లో జింబాబ్వే పర్యటన తర్వాత రాయుడు టెస్టు సెలక్షన్‌పై ఫోకస్ చేసి ఉండాల్సింది. ఆ విషయాన్ని రాయుడికి చాలాసార్లు చెప్పాను కూడా. టెస్టు క్రికెట్‌పై ఎందుకు ఫోకస్ చేయడం లేదని చాలాసార్లు ఆడిగా’ అని ఎంఎస్కే చెప్పుకొచ్చాడు. (‘బుమ్రా యాక్షన్‌తో అతనికే చేటు’) -
నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్
న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు సెలక్షన్ సమయంలో రాద్దాంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ ఆటగాడు అంబటి రాయుడ్ని కాదని విజయ్ శంకర్‌కు చోటు కల్పించడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ కోటాలో శంకర్‌కు చోటు కల్పించిన బీసీసీఐ సెలక్షన్ పెద్దలు.. దాన్ని అప్పట్లో సమర్ధించుకున్నారు కూడా. అప్పుడు బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్.. విజయ్ శంకర్‌ను 3డీ ప్లేయర్‌గా అభివర్ణించడం అగ్గిరాజేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను 3డీతో పోల్చాడు ఎంఎస్కే. దాంతో చిర్రెత్తుకొచ్చిన అంబటి రాయుడు.. భారత క్రికెట్ జట్టు ఆటను చూడటానికి 3డి కళ్లద్దాలకు ఆర్డర్ ఇచ్చానంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఇదే అంశంపై ఇప్పుడు మరోసారి ఎంఎస్కే నిర్ణయాన్ని తప్పుపట్టాడు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్. ఒక చీఫ్ సెలక్టర్(సెలక్షన్ చైర్మన్) హోదాలో ఆ మాట అనడం సరైనది కాదని గంభీర్ పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘క్రికెట్ కనెక్టెడ్’ షోలో గౌతం గంభీర్, కృష్ణమాచారి శ్రీకాంత్‌లతో పాటు ఎంఎస్కే ప్రసాద్ కూడా పాల్గొన్నాడు. ఈ షోలో ఎంఎస్కే ప్రశ్నించాడు గంభీర్.(ధోనిని ఏనాడు అడగలేదు: రైనా) ‘అంబటి రాయుడు విషయంలో ఏమి జరిగిందో చూశాం. ముఖ్యంగా వరల్డ్‌కప్‌కు ముందు రెండేళ్ల పాటు అతనికి జట్టులో చోటు కల్పిస్తూ వచ్చారు. ఆ రెండేళ్లు నాలుగో స్థానంలో రాయుడు బ్యాటింగ్ చేశాడు. మరి వరల్డ్‌కప్‌కు ముందు 3డీ అవసరమైందా.. ఒక చైర్మన్ హోదాలో మీరు ఆ మాట మాట్లాడటం భావ్యమా’ అని నిలదీశాడు. దీనికి ఎంఎస్కే బదులిస్తూ. ‘ఇంగ్లిష్ వాతావరణంలో ఆల్‌రౌండర్ ఉండాలనే ఉద్దేశంతోనే శంకర్‌ను ఎంపిక చేశాం. మనకు సీమ్ బౌలింగ్ పరంగా ఇబ్బంది ఉందనే శంకర్‌ను చివరి నిమిషంలో తీసుకొచ్చాం. శంకర్ దేశవాళీ రికార్డులను పరిశీలించిన పిదప అతనికి అవకాశం ఇచ్చాం’ అని తెలిపాడు. కాగా, ఎంఎస్కే నిర్ణయాన్ని షోలో ఉన్న శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఇక్కడ గంభీర్‌ను వెనకేసుకొచ్చి మిమ్మల్ని కించపరచడం లేదంటూనే అంతర్జాతీయ క్రికెట్‌కు దేశవాళీ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుందన్నాడు. బౌలింగ్ పరంగా శంకర్ ఓకే కావొచ్చు...కానీ బ్యాటింగ్‌లో టాపార్డర్‌లోనే దిగాలి కదా.. ఆ విషయాన్ని పట్టించుకోలేదా’ అని శ్రీకాంత్ ప్రశ్నించాడు. (మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి) -
'అందుకే రైనాను పక్కన పెట్టాం'
న్యూఢిల్లీ : భారత పరిమిత ఓవర్ల క్రికెట్లో దశాబ్దానికి పైగా తనదైన ముద్ర వేసిన సురేశ్ రైనా 2018 జూలైæ తర్వాత జట్టులోకి ఎంపిక కాలేదు. తనను తొలగించడానికి సెలక్టర్లు ఎలాంటి కారణం చూపించలేదని, ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకొని పునరాగమనం చేసే వాడినని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైనా వ్యాఖ్యానించాడు. దీనిపై నాటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. రైనా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.('టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తా') ‘వేటు గురించి నేను స్వయంగా రైనాకు చెప్పాను. తిరిగి రావాలంటే ఏం చేయాలో కూడా వివరించాను. ఇప్పుడు అతను అలా ఎందుకు అంటున్నాడో నాకు తెలీదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్ ప్లేయర్ ఎవరైనా దేశవాళీలో అద్భుతంగా ఆడి తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో రైనా వెనుకబడ్డాడు. ఇతర యువ ఆటగాళ్లు, ‘ఎ’ జట్టు సభ్యుల ఆటతో పోలిస్తే రైనా ప్రదర్శన బాగా లేదు. మేం యూపీ రంజీ మ్యాచ్‌లు చూడలేదనే విమర్శలు కూడా అబద్ధం. నేను స్వయంగా రెండు మ్యాచ్‌లు చూశాను. రైనా ఆట సంతృప్తికరంగా లేదు’ అని ప్రసాద్ స్పష్టం చేశారు. 2018–19 రంజీ సీజన్లో యూపీ తరఫున 5 మ్యాచ్‌లే ఆడిన రైనా 2 అర్ధసెంచరీలతో 243 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ 17 మ్యాచ్‌లలో కేవలం 383 పరుగులు చేశాడు. (అప్పటి నుంచి శిఖర్ అనే పిచ్చి పట్టింది నాకు..) -
ఎమ్మెస్కే వారసుడిగా సునీల్ జోషి
ముంబై: ఓ తెలుగు జట్టు మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్ పదవీకాలం ముగియగా... ఇప్పుడు అతని స్థానంలో మరో తెలుగు జట్టుతో అనుబంధం ఉన్న ఆటగాడు సునీల్ జోషి సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్‌గా వచ్చాడు. 49 ఏళ్ల సునీల్ జోషి గతంలో హైదరాబాద్ రంజీ జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి (సౌత్‌జోన్)ని ఎంపిక చేయగా... ఈ ఎంపికకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదముద్ర వేసింది. సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జోషి సిఫారసును బోర్డు ధ్రువీకరించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. సెంట్రల్ జోన్ నుంచి ఖాళీ అయిన స్థానంలో మాజీ భారత పేస్ బౌలర్, 42 ఏళ్ల హర్వీందర్ సింగ్‌కు అవకాశమిచ్చారు. ఎమ్మెస్కేతో పాటు గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) పదవీ కాలం కూడా ముగిసింది. ఐదుగురు సభ్యుల కమిటీలో ఇప్పటికే జతిన్ పరంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)లు ఉండగా... కొత్తవారు త్వరలోనే బాధ్యతలు చేపడతారు. భారత మాజీ క్రికెటర్లు నయన్ మోంగియా, అజిత్ అగార్కర్ సహా మొత్తం 40 మంది సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోగా... ఇందులో నుంచి సునీల్ జోషి, హర్వీందర్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, శివరామకృష్ణన్‌లను తుది జాబితాకు ఎంపిక చేశారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించాక చైర్మన్, సెలక్టర్‌ను ఖరారు చేశారు. ‘సెలక్షన్ కమిటీ కోసం అత్యుత్తమ వ్యక్తుల్నే ఎంపిక చేశాం. జోషి, హర్వీందర్‌లు సరైన దృక్పథంతో ఉన్నారు. ఇంటర్వ్యూలో వాళ్లిద్దరు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా సూటిగా స్పష్టంగా ఉన్నాయి’ అని సీఏసీ చైర్మన్ మదన్ లాల్ తెలిపారు. సీఏసీకి చాలా దరఖాస్తులే వచ్చాయని, అందరి పేర్లను పరిశీలించాకే తుది జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పారు. చైర్మన్ సునీల్ జోషి, సెలక్టర్ హర్వీందర్‌లు నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. జోషి తెలుసుగా... సునీల్ జోషి అంటే గొప్పగా గుర్తొచ్చే ప్రదర్శన సఫారీపైనే! నైరోబీలో 1999లో జరిగిన వన్డే టోర్నీలో జోషి 10–6–6–5 బౌలింగ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్లతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 1996 నుంచి 2001 వరకు సాగిన స్వల్ప కెరీర్లో జోషి 15 టెస్టులాడి 41 వికెట్లు, 69 వన్డేలు ఆడి 69 వికెట్లను పడగొట్టాడు. హైదరాబాద్ రంజీ కోచ్‌గా వ్యవహరించిన జోషికి బంగ్లాదేశ్ జాతీయ జట్టు సహాయ సిబ్బందిలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. మాజీ పేసర్ హర్వీందర్ది కూడా స్వల్ప కాలిక కెరీరే! 1998 నుంచి 2001 వరకు కేవలం నాలుగేళ్లే టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈ మాజీ సీమర్ మూడే టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 4, వన్డేల్లో 24 వికెట్లు తీశాడు. -
మార్చి తొలి వారంలో బీసీసీఐ సెలక్టర్ల ఎంపిక
న్యూఢిల్లీ: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు ఖాళీలను ప్రస్తుతం జరుగుతోన్న భారత్–న్యూజిలాండ్ సిరీస్ ముగిసేలోపు భర్తీ చేస్తామని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ తెలిపారు. సెలక్టర్ల పదవి కోసం మొత్తం 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, ప్యానెల్ సభ్యుడు గగన్ ఖోడాల పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సీఏసీకి అప్పగించారు. -
కనీసం 7 టెస్టులు ఆడి ఉండాలి
ముంబై: ప్రస్తుత భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య ఆరు! సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనుభవం విషయంలో ప్రసాద్ ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్త సెలక్టర్ ఎంపికకు అర్హత విషయంలో బీసీసీఐ భారీ మార్పులేమీ చేయలేదు. కెరీర్లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వారు సీనియర్ జట్టు సెలక్టర్ పదవికి అర్హులని ప్రకటించింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఏర్పడబోయే రెండు ఖాళీల కోసం బోర్డు దరఖాస్తులు కోరుతోంది. పదవీకాలం ముగిసిపోవడంతో ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు గగన్ ఖోడా తప్పుకోనున్నారు. వీరి స్థానాల్లో కొత్త సెలక్టర్లు వస్తారు. మిగిలిన ముగ్గురు సెలక్టర్లు శరణ్‌దీప్ సింగ్, దేవాంగ్ గాందీ, జతిన్ పరాంజపేలు మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. బోర్డు పేర్కొన్న అర్హతలను బట్టి చూస్తే... సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేవారు కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలతో పాటు 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండటంతో పాటు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 24ను చివరి తేదీగా నిర్ణయించగా... సెలక్టర్లను ఎవరు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారనే విషయంలో మాత్రం బోర్డు స్పష్టతనివ్వలేదు. సీనియర్ పురుషుల జట్టుతో పాటు జూనియర్ పురుషుల జట్టు, సీనియర్ మహిళల జట్ల సెలక్టర్ల కోసం కూడా బీసీసీఐ దరఖాస్తులు కోరింది. టెస్టు జట్టులోకి రాహుల్? ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆఖరిసారిగా నేడు భారత సీనియర్ జట్టు ఎంపిక జరగనుంది. న్యూజిలాండ్‌లో జరిగే టెస్టు, వన్డే సిరీస్ కోసం టీమ్‌లను కమిటీ ఆదివారం ఎంపిక చేస్తుంది. వన్డే, టి20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్‌ను టెస్టు టీమ్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ తన ఆఖరి టెస్టును వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో గత ఆగస్టులో ఆడాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో అతని పేరును పరిశీలించకుండా సెలక్టర్లు శుబ్‌మన్ గిల్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఉంచారు. అయితే తాజా ప్రదర్శనతో రాహుల్ అవకాశాలు మెరుగయ్యాయి. అశ్విన్, జడేజా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు అందుబాటులో ఉండటంతో కుల్దీప్ను కాకుండా ఐదో పేసర్‌గా నవదీప్ సైనీ వైపే మొగ్గు కనిపిస్తోంది. చివరి నిమిషంలో ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన టి20లకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫిట్‌గా మారితే వన్డేల్లోకి ఎంపిక చేయడం దాదాపుగా ఖాయం. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతనికంటే మెరుగైన టెక్నిక్ కలిగిన రహానే కివీస్ గడ్డపై రాణించవచ్చనేది అంచనా. అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని భావిస్తే ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేరు అందరికంటే ముందుగా పరిశీలనలో ఉంది. ఈ టూర్లో భారత్ 5 టి20ల తర్వాత 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. -
ఎంఎస్‌కేకు గుడ్ బై.. కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరు?
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌ను మార్చాలనే వాదన వినిపిస్తోంది. ఒక చీఫ్ సెలక్టర్‌గా ఎంఎస్కే సక్సెస్ అయినప్పటికీ ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసే క్రమంలో అతనికి నిబద్ధత లోపించిందనే విమర్శలు వచ్చాయి. అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానుల కూడా ఎంఎస్కే సెలక్షన్‌పై అసంతృప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా క్రికెట్ ఆడిన అనుభవం లేని ఎంఎస్కేను ఎంతకాలం చీఫ్ సెలక్టర్‌గా కొనసాగిస్తారని వెటరన్ క్రికెటర్ల కూడా ప్రశ్నించారు. ఇక చీఫ్ సెలక్టర్‌గా ఎంఎస్కే గుడ్ బై చెప్పి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇటీవల హర్భజన్ కూడా విన్నవించాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడని భజ్జీ ధీమా కూడా వ్యక్తం చేశాడు. అయితే అందుకు ముందుడగు పడినట్టే కనబడుతోంది. తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. సెలక్షన్ కమిటీలో మార్పులు తప్పవనే సంకేతాలిచ్చాడు. కాకపోతే ప్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీని మొత్తం ఒకేసారి మార్చాల్సిన అవసరం లేదన్నాడు. ప్రధానంగా ఇద్దరి సభ్యుల్ని మార్చితే సరిపోతుందన్నాడు. ఈ నియామకాన్ని కొత్త ఏర్పాటు చేయబోయే క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) చూసుకుంటుందన్నాడు. సీఏసీ ఏర్పాటు చేయడానికి మరో రెండు-మూడు రోజుల సమయం పడుతుందన్నాడు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీలో మార్పులు ఉంటాయని స్పష్టం చేశాడు. దాంతో సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్‌కు ఉద్వాసన తప్పక పోవచ్చు. ఎంఎస్కే పదవీ కాలం వరల్డ్‌కప్‌తోనే ముగిసినప్పటికీ మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం ఆ సమయం దాటి పోవడంతో చీఫ్ సెలక్టర్‌నే తొలుత మార్చే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా ఎంఎస్‌కేకు అవకాశం ఇవ్వడం కూడా అతని మార్పు అనివార్యం కాక తప్పదు. భారత క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా మూడేళ్లు పని చేయడం అంటే అది చాలా ఎక్కువ. అదే సమయంలో లోధా నిబంధనల ప్రకారం తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లే అయ్యింది. దాంతో ఎంఎస్కే మార్పు అనివార్యం. ఇప్పుడు తదుపరి చీఫ్ సెలక్టర్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.మరొకవైపు సెలక్టర్‌గా పని చేసి పదవీ విరమణ చేసిన గగన్ ఖోడా స్థానంలో కూడా మరొక సెలక్టర్ రానున్నాడు. ప్రస్తుత సెలక్షన్ కమిటీలో దేవాంగ్ గాంధీ, జతిన్ పరాన్‌జపి, శరణ్‌దీప్ సింగ్‌లు ఉన్నారు. వీరు పదవీ కాలం మరో ఏడాది ఉంది. దాంతో వీరిని సెలక్షన్ కమిటీలో కొనసాగించి ఒక చీఫ్ సెలక్టర్‌ను, మరొక సెలక్టర్‌ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ఉంది. -
పంత్‌పై ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: వరుస వైఫల్యాలతో సతమవుతున్న టీమిండియా యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో కాస్త ఉపశమనం లభించింది. చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో రెచ్చి పోయిన పంత్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. విశాఖ వన్డేలో ధాటిగా టీమిండియాకు మంచి స్కోర్ అందించాడు. అయితే చివరి వన్డేలో మాత్రం ఘోరంగా నిరుత్సాహపరిచాడు. అయితే ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో పర్వాలేదనిపించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో కేవలం పంత్ బ్యాటింగ్ లోపాలపై మాట్లాడే ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా అతడి కీపింగ్‌పై కూడా పెదవివిరిచాడు. కీపింగ్‌లో పంత్ మరింత మెరుగుపడాలని సూచించాడు. ఈ క్రమంలో స్పెషలిస్టు వికెట్ కీపింగ్ కోచ్ పర్యవేక్షణలో పంత్‌కు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తాజాగా ముగిసిన బంగ్లాదేశ్, వెస్టిండీస్ పర్యటనలలో పంత్ కీపింగ్‌లో అంతగా ఆకట్టుకోలదని పేర్కొన్నాడు. అయితే అంతగా ఆందోళనచెందాల్సిన అవసరం లేదన్నాడు. పంత్ కీపింగ్ నుంచి తాము హై లెవల్ స్టాండర్డ్స్ ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇందుకోసమే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్‌లో పంత్ కాస్త మెరుగుపడినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా తొలి వన్డేలో కష్టకాలంలో ఉన్న టీమిండియాను శ్రేయస్ అయ్యర్‌తో కలిసి పంత్ ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశాడు. ఇక శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌ల కోసం టీమిండియాను ప్రకటించిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ మీడియా సమావేశంలో పై విధంగా మాట్లాడాడు. అంతేకాకుండా దీపక్ చాహర్ గాయంపై కూడా చీఫ్ సెలక్టర్ స్పందించాడు. చాహర్ గాయం తీవ్రత దృష్ట్యా వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని పేర్కొన్నాడు. చాహర్‌కు సుదీర్ఘ విశ్రాంతి అవసరమని తెలిపాడు. దీంతో చాహర్‌ను ఐపీఎల్ తర్వాతనే సెలక్షణ్ కోసం పరిగణలోకి తీసుకుంటామన్నాడు. అయితే బౌలర్ల గాయాలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నాడు. యువ బౌలర్లతో రిజర్వ్‌బెంచ్ బలంగా ఉందన్నాడు. చదవండి: పంత్‌కు పూనకం వచ్చింది.. అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం! -
ఐపీఎల్ వరకూ కష్టమే..!
న్యూఢిల్లీ: ఇటీవల వెస్టిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో వెన్నుగాయంతో సతమతమైన టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఆ తర్వాత మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే ఆ గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు వెన్నుగాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీపక్ చాహర్‌కు కూడా అదే గాయం బారిన పడగా కొన్ని నెలల పాటు విశ్రాంతి తప్పకపోవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) రాబోవు సీజన్ ఆరంభం నాటి వరకూ చాహర్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనబడుటం లేదు. శ్రీలంక, ఆసీస్ జట్లతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత జట్టును ఎంపిక చేసిన క్రమంలో సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. దీపక్ చాహర్ ఏప్రిల్ వరకూ అందుబాటులోకి రావడం కష్టమనే అనుమానం వ్యక్తం చేశాడు. ‘ ఏప్రిల్ వరకూ దీపక్ చాహర్ జట్టుకు అందుబాటులోకి రాకపోవచ్చు. అతను వెన్నుగాయంతో సతమతమవుతున్నాడు. నాకు తెలిసినంత వరకూ చాహర్‌కు సుదీర్ఘ విశ్రాంతి అవసరం కావొచ్చు.’ అని అన్నాడు. కాగా, జట్టుకు కొంతమంది దూరమైనప్పటికీ తమకు అన్ని ఫార్మాట్లకు తగినంత బ్యాకప్స్ ఉన్నాయన్నాడు. గత ఆరేడేళ్ల కాలం నుంచి చూస్తే భారత్ జట్టుకు అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉందన్నాడు. దాంతో మ్యాచ్‌లకు సిద్ధమయ్యే క్రమంలో ఫలానా ఆటగాడు లేడని చింతించాల్సిన అవసరం లేదన్నాడు. ‘ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముగ్గురు ఓపెనర్లు కూడా అందుబాటులో ఉంటారు. చాహర్‌కు అనూహ్యంగా వెన్ను నొప్పి వచ్చింది. అయితే మనకు తగినంత సంఖ్యలో రిజర్వ్ పేస్ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను న్యూజి లాండ్లో పర్యటించే భారత ‘ఎ’ జట్టులోకి ఎంపిక చేశాం’ అని ఎంఎస్కే అన్నాడు. -
అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం!
ఎమ్మెస్కే ప్రసాద్ ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎన్ని...? అతని అనుభవం ఎంత? ఏడాది పాటు సెలక్టర్‌గా, ఆ తర్వాత చీఫ్ సెలక్టర్‌గా పని చేసిన మూడేళ్ల కాలంలో అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి లెక్క లేనన్ని సందర్భాల్లో ఈ ప్రశ్న ఎదురవుతూ వచ్చింది. ముఖ్యంగా కీలక, అనూహ్య నిర్ణయాలు తీసుకున్నప్పుడైతే వీరంతా ప్రసాద్‌ను విమర్శించడంలో ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. కానీ సెలక్టర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించడం తప్ప విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెస్కే వ్యాఖ్యానించారు. ముంబై: భారత జట్టు సాధిస్తున్న విజయాలే తమ సెలక్షన్ కమిటీ పనితీరుకు సూచిక అని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘మేం ఎన్ని మ్యాచ్‌లు ఆడామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా, ఎంత అంకితభావంతో పని చేశామన్నదే ముఖ్యం. మాకంటే ఎక్కువ క్రికెట్ ఆడినవాళ్లు కూడా సెలక్టర్లుగా విఫలమయ్యేవారేమో. ఏదేమైనా విజయాలే మన గురించి చెబుతాయి. ప్రస్తుతం భారత జట్టు అన్ని ఫార్మాట్లలో ఎలా ఆడుతుందో చూస్తే చాలు. గతంలో ఏ సెలక్షన్ కమిటీకి కూడా మా అంత మెరుగైన రికార్డు లేదు. అనుభవం లేనివాళ్లమే అయినా విజయవంతమైన జట్లను ఎంపిక చేశాం. సీనియర్ టీమ్ ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా ‘ఎ’ జట్లయితే విశేషంగా రాణించాయి. 13 సిరీస్‌లు ఆడితే అన్నీ గెలిచాయి. సీనియర్ టీమ్‌లో ఇప్పుడు మ్యాచ్ ఫలితాలను శాసించగల ఎనిమిది మంది ఫాస్ట్ బౌలర్లు, ప్రధాన స్పిన్నర్లతో పాటు మరో ఆరుగురు స్పిన్నర్లు, ఆరుగురు సమర్థులైన ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఇంకా మా నుంచి ఏం ఆశిస్తున్నారు’ అని ఎమ్మెస్కే వివరించారు. ప్రపంచకప్ సెమీస్‌లో పరాజయానికి ‘నాలుగో స్థానం’ కారణం కాదని, సెమీఫైనల్ మ్యాచ్ వరకు కూడా నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడటం జరగనే లేదని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు మినహా తాము అవకాశం ఇచ్చిన కొత్త ఆటగాళ్లంతా సత్తా చాటారన్న మాజీ వికెట్ కీపర్... బుమ్రాను టెస్టుల్లోకి ఎంపిక చేయడం తమ అత్యుత్తమ నిర్ణయమన్నారు. సెలక్టర్‌గా పని చేసేటప్పుడు విమర్శలు రావడం సహజమేనన్న ఎమ్మెస్కే... ధోని, కోహ్లిలతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ‘మేనేజ్మెంట్ విద్యార్థినైన నేను ఆంధ్ర క్రికెట్ డైరెక్టర్‌గా ఇంతకంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సెలక్టర్‌గా ఉన్న సమయంలో నేను దిగ్గజ క్రికెటర్ల సలహాలు తీసుకుంటూ వచ్చాను. ధోని, కోహ్లిలతో నా సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినలేదు. జనం ఏమైనా అనుకోవచ్చు గానీ వారిద్దరు నన్ను ఎంతగా గౌర విస్తారో నాకు తెలుసు’ అని ప్రసాద్ అన్నారు. -
‘దాదా..ఇక సెలక్షన్ ప్యానల్‌ను మార్చండి’
న్యూఢిల్లీ: ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని ప్రస్తుత భారత క్రికెట్ జట్టు సెలక్షన్ ప్యానల్‌ను మార్చేయాలని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ డిమాండ్ చేశాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కల్పించుకోవాలన్నాడు. భారత క్రికెట్ జట్టుకు ఇక బలమైన సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే సమయం ఆసన్నమైందన్నాడు. ఈ విషయంలో గంగూలీ చొరవ తీసుకుంటాడని ఆశిస్తున్నట్లు భజ్జీ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో త్వరలో ఆరంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా భారత యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని లోక్‌సభ ఎంపీ శశి థరూర్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ‘ ఎంతో కాలంగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌కు ఎంపిక చేయకపోవడం నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కనీసం చాన్స్ కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఎంపిక చేసినా తుది జట్టులో శాంసన్ ఉండటం లేదు. మూడు టీ20లకు డ్రింక్స్ ఇవ్వడం వరకే పరిమితం చేశారు కానీ జట్టులో అవకాశం ఇవ్వకుండా విస్మరించారు. అతన్ని బ్యాటింగ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా.. లేక అతని హృదయాన్ని టెస్టు చేయాలనుకుంటున్నారా’ అని శశి థరూర్ మండిపడ్డారు. దీనికి బదులు ఇచ్చిన భజ్జీ.. భారత సెలక్షన్ కమిటీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నాడు. ‘ నేను అనుకోవడం శాంసన్ హృదయాన్ని టెస్టు చేయాలనే అనుకుంటున్నారు. సెలక్షన్ ప్యానల్‌ను మార్చాలి. పటిష్టమైన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలి. దాదా.. అందుకు చర్యలు తీసుకుంటాడనే ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్‌కు భజ్జీ రిప్లై ఇచ్చాడు. -
రోహిత్‌కు విశ్రాంతి!
కోల్‌కతా: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. కోహ్లి లేని సందర్భంలో నాయకత్వ బాధ్యతల్ని మోసిన ఈ ‘హిట్‌మ్యాన్’పై విపరీతమైన పని ఒత్తిడిని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ గమనిస్తోంది. అదే విధంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న శిఖర్ ధావన్‌కు ఉద్వాసన ఇచ్చినా ఆశ్చర్యం లేదు. గురువారం ముంబైలో సమావేశమయ్యే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ విండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు టీమిండియాను ఎంపిక చేయనుంది. ప్రధానంగా రోహిత్‌కు విశ్రాంతినిచ్చి ధావన్‌ను తప్పించే అంశాల్నే కమిటీ పరిశీలించనుంది. బహుశా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ఎంపిక చేసే ఆఖరి జట్టు ఇదే అవుతుందేమో. ఆయన నాలుగేళ్ల పదవీ కాలం ముగియనుంది. విండీస్‌తో సొంతగడ్డపై భారత్ ముందుగా మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. కెపె్టన్ కోహ్లి కంటే ఈ ఏడాది రోహిత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌తో కలుపుకొని 60 మ్యాచ్‌లు ఆడి ఉండటంతో రెస్ట్ ఇచ్చి న్యూజిలాండ్ పర్యటనకు అతన్ని తాజాగా సిద్ధం చేయాలని ఎమ్మెస్కే కమిటీ భావిస్తోంది. ప్రపంచకప్ గాయం తర్వాత జట్టులోకి వచి్చన ధావన్ పెద్దగా రాణించలేదు. దేశవాళీ క్రికెట్లోనూ అతని ప్రదర్శన పేలవంగా ఉంది. మరోవైపు మయాంక్ అగర్వాల్ టెస్టుల్లో తనకు అందివచి్చన అవకాశాల్ని సది్వనియోగం చేసుకున్నాడు. దీంతో లోకేశ్ రాహుల్‌కు జతగా మయాంక్‌కు అవకాశం ఇవ్వొచ్చు. అలాగే నిలకడగా రాణిస్తున్న సంజూ సామ్సన్‌కు వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో చోటు దక్కవచ్చు. కొత్త పేస్ ఎక్స్‌ప్రెస్ దీపక్ చాహర్ స్థానానికి ఏ ఢోకా ఉండదు. పైగా వివిధ రకాల గాయాలతో హార్దిక్ పాండ్యా, బుమ్రా, నవ్‌దీప్ సైనీ, భువనేశ్వర్‌లు ప్రస్తుతం కోలుకుంటుండటంతో శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్లను కొనసాగించే అవకాశముంది. అలాగే వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యాల ఎంపికను సెలక్టర్లు పరిశీలించే అవకాశముంది. -
అనుష్కకు టీ కప్‌లు ఇవ్వడానికి వెళ్లారా?
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీపై మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మనకున్న క్రికెట్ సెలక్షన్ కమిటీ మికీ మౌస్ సెలక్షన్ కమిటీ అంటూ మండిపడ్డాడు. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో పనిచేస్తున్న సెలక్షన్ కమిటీని ఏ అంశాల ఆధారంగా ఎంపిక చేశారంటూ విమర్శలు గుప్పించాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మకు టీ కప్‌లు అందివ్వాలంటే ఈ తరహా సెలక్షన్ కమిటీనే సరైనదేమోనంటూ ఎద్దేవా చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అనుష్క శర్మకు సెలక్టర్లు టీ కప్‌లు ఇచ్చిన విషయాన్ని అందరితో పాటు తాను చూశానంటూ ఫరూక్ విమర్శించాడు. ‘మన సెలక్షన్ కమిటీ ఎంపికకు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. వారు ఆడింది 10 నుంచి 12 టెస్టులు మాత్రమే. అసలు వరల్డ్‌కప్‌కు వెళ్లిన సెలక్టర్లు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ వారు భారత జెర్సీలు ధరించడంతో సెలక్టర్లలో ఒకరిగా అనుకున్నా(ఎంఎస్కే ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ). ఈ సెలక్టర్లు కోహ్లి భార్య అనుష్కకు టీ కప్‌లు అందివ్వడం నేను చూశా. నాతో పాటు అంతా చూసి ఉండవచ్చు. అనుష్క శర్మకు టీ కప్‌లు ఇవ్వడం కోసం వారు పని చేశారు’ అని పుణెలోని వెంగసర్కార్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వెళ్లిన ఫరూక్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించారు. మన సెలక్షన్ కమిటీలో వెంగసర్కార్ వంటి ఒక ప్రముఖ వ్యక్తి ఉండాల్సిందని పేర్కొన్నాడు. అదే సమయంలో క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ)ను కూడా ఫరూక్ వదిలి పెట్టలేదు. అది ఉపయోగం లేని పరిపాలక కమిటీ అంటూ విమర్శించాడు. అందులోని సభ్యులకు రూ. 3 కోట్లకుపైగా కేటాయించడం ఇంకా పనికి మాలిన చర్యగా ఫరూక్ అభివర్ణించాడు. -
ధోని ఆట ముగిసినట్లేనా!
ముంబై: వరల్డ్ కప్ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో స్పష్టతనివ్వడంలో సెలక్టర్లు ఇప్పటి వరకు తడబడుతూ వచ్చారు. విశ్రాంతి అడిగాడని ఒక సారి, అతను కోరుకుంటే ఆడగలడని, ధోనిలాంటి గొప్ప క్రికెటర్‌ను ఏ జట్టయినా కోరుకుంటుందని... ఇలా ప్రతీ సారి ఏదో కప్పదాటు సమాధానాలే వారినుంచి వచ్చాయి. గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా మారిన మహత్యమో లేక నిజంగా ధోనినే తన గురించి చెప్పుకున్నాడో కానీ గురువారం అతని కెరీర్ గురించి మొదటి సారి సెలక్షన్ కమిటీ చెప్పుకోదగ్గ వివరణఇచ్చింది. మాజీ కెప్టెన్ ఇక ఆటకు గుడ్‌బై చెప్పినట్లేనని ఈ మాటల సారాంశంగా కనిపిస్తోంది. ధోనిని దాటి తాము ఆలోచిస్తున్నామని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేం ఇక భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామని స్పష్టంగా చెబుతున్నా. రిషభ్ పంత్‌పై ప్రస్తుతం మేం ఎక్కువ దృష్టి పెట్టాం. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడంలో భాగంగానే పంత్‌తో పాటు ఇప్పుడు శామ్సన్ను కూడా ఎంపిక చేశాం. మా ప్రక్రియ మీకు అర్థమవుతోందని భావిస్తున్నా’ అని ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తమ ఆలోచనలకు ధోని కూడా మద్దతిచ్చాడన్న చీఫ్ సెలక్టర్... రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయమని చెప్పడం విశేషం.‘కుర్రాళ్లను ప్రోత్సహించాలనే మా ఆలోచనను ధోని కూడా సమర్దించాడు.అతని భవిష్యత్తు గురించి కూడా మేం మాట్లాడాం. మహి మళ్లీ జట్టులోకి రావాలంటే అతనిష్టం. దేశవాళీ క్రికెట్ ఆడి టచ్‌లోకి వస్తాడా, రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడా అనేది పూర్తిగా వ్యక్తిగతం. అయితే మేం జట్టు భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక రూపొందించాం. దాని ప్రకారమే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాం’ అని ఎమ్మెస్కే వివరించారు. మరో వైపు ధోని జార్ఖండ్ అండర్–23 టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ చేయనున్నట్లు సమాచారం. -
శివమ్,శామ్సన్‌లకు అవకాశం
ముంబై: కోహ్లి మరోసారి పొట్టి ఫార్మాట్‌నుంచి విశ్రాంతి కోరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అతను దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరిస్తాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో గురువారం సమావేశమైన కమిటీ టి20, టెస్టు జట్లను ప్రకటించింది. టి20 జట్టులో ఇద్దరికి కొత్తగా అవకాశం దక్కింది. ముంబై ఆల్‌రౌండర్ శివమ్ దూబే తొలి సారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శామ్సన్ను కూడా మళ్లీ టీమ్‌లోకి ఎంపిక చేశారు. రిషభ్ పంత్ కూడా జట్టులో ఉన్నా... శామ్సన్ను రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా టీమ్‌లోకి తీసుకోవడం విశేషం. చహల్ కూడా కొంత విరామం తర్వాత పునరాగమనం చేశాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ ఇంకా గాయాలనుంచి కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీలించలేదు. ఇటీవలి కాలంలో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తూ వచి్చన రవీంద్ర జడేజాకు కూడా టీమ్‌లో చోటు దక్కలేదు. అతని లాంటి శైలి ఆటగాడే అయిన కృనాల్ పాండ్యా ఇప్పటికే జట్టులో ఉండటం ఇందుకు కారణం. నవదీప్ సైనీ ఫిట్నెస్ సమస్యల కారణంగా శార్దుల్‌ను ఎంపిక చేశారు. షాబాజ్ నదీమ్ అవుట్! సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన షాబాజ్ నదీమ్‌కు అంతలోనే నిరాశ ఎదురైంది. రాంచీ టెస్టులో నాలుగు వికెట్లతో రాణించి అందరినీ ఆకట్టుకున్నా...బంగ్లాతో సిరీస్‌కు స్థానం లభించలేదు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడిన జట్టులో ఉన్న కుల్దీప్ యాదవ్ కోలుకోవడంతో బోర్డు విధానం ప్రకారం మళ్లీ అతడినే ఎంపిక చేసింది. టి20 జట్టు: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, మనీశ్ పాండే, సంజు శామ్సన్, రిషభ్ పంత్, దూబే, కృనాల్, వాషింగ్టన్ సుందర్, చహల్, దీపక్ చహర్, రాహుల్ చహర్, ఖలీల్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్. టెస్టు జట్టు: కోహ్లి (కెపె్టన్), మయాంక్, రోహిత్, పుజారా, రహానే, విహారి, సాహా, పంత్, జడేజా, అశి్వన్, షమీ, ఇషాంత్, ఉమేశ్, కుల్దీప్, శుబ్‌మన్ గిల్. -
‘పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నాం’
హైదరాబాద్: టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్‌పై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస వైఫల్యాలతో తీవ్రంగా నిరాశపరుస్తున్న పంత్‌పై అన్ని వైపులా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్‌ను పక్కకు పెట్టి మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే వాదన రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ తరుణంలో పంత్ వైఫల్యాలపై ప్రసాద్ స్పందించాడు. పంత్ ప్రతిభను పరిగణలోకి తీసుకుని అతడిపై ఓపిగ్గా వ్యవహరిస్తున్నామని తెలిపాడు. పంత్‌లో అపార ప్రతిభ దాగుందని.. కానీ అతడి పేలవ, నిర్లక్ష్య షాట్ల ఎంపికపైనే తాము ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నాడు. అయితే టీమిండియా వికెట్ కీపర్‌గా తమ తొలి ఛాయిస్ పంతేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా మూడు ఫార్మట్లలో కీపర్‌గా వ్యవహరిస్తున్న పంత్‌పై వర్క్‌లోడ్ తగ్గించే అంశం కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో యువ వికెట్ కీపర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషాన్‌ల దృష్టి సారించామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ముఖ్యంగా లాంగ్ ఫార్మట్ క్రికెట్లో పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నామని ప్రసాద్ తెలిపాడు. రంజీల్లో విశేషంగా రాణిస్తున్న యువ వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. దక్షిణాఫ్రికా-ఏ జరిగిన టెస్టు మ్యాచ్‌లో కేఎస్ భరత్ ఆకట్టుకున్నాడని.. వన్డే సిరీస్‌లో శాంసన్ రాణించాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం వీరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పకనే చెప్పాడు. ఇక వెస్టిండీస్ టూర్లో అంతగా ఆకట్టుకోని పంత్.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లోనూ పేలవ షాట్‌తో అవుటై అందరినీ నిరుత్సాహానికి గురిచేసిన విషయం తెలిసిందే. -
‘రోహిత్‌ను అందుకే ఎంపిక చేశాం’
ముంబై : పరిమిత ఓవర్ల క్రికెట్లో విశేషంగా రాణిస్తున్నప్పటికీ టెస్టుల్లో సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సువర్ణావకాశం లభించింది. వన్డే, టీ20ల్లో ప్రపంచ శ్రేణి ఓపెనర్‌గా గుర్తింపు పొందిన రోహిత్.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా సరైన గుర్తింపు సాధించలేకపోయాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్ కోసం రోహిత్‌ను ఓపెనింగ్ కోసం సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌తో రోహిత్ టెస్టు సత్తా ఏంటో తెలుస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్‌ను ఎంపిక చేయడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ‘లాంగ్ ఫార్మట్ క్రికెట్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా అంతగా రాణించని రోహిత్.. ఓపెనర్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకుంటాడని భావిస్తున్నాం. వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు.. ఇప్పటివరకు టెస్టుల్లో రోహిత్‌కు ఓపెనింగ్ అవకాశం దక్కలేదు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని ఓపెనర్‌గా ఎంపిక చేశాం. విజయవంతమవుతాడని ఆశిస్తున్నాం. ఇక కేఎల్ రాహుల్ దారులు మూసుకపోలేదు. అతడు అద్భుత ప్రతిభగల ఆటగాడు. అయితే ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. త్వరలోనే తిరిగి జట్టులోకి చేరతాడనే నమ్మకం ఉంది’అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. ఇక రోహిత్‌కు టెస్టుల్లో ఓపెనింగ్ అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించిన విషయం తెలిసిందే. సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్ వంటి దిగ్గజాలు కూడా టెస్టుల్లో రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దింపాలని, అది టీమిండియాకు ఎంతో లాభిస్తుందని సూచించారు. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమవ్వడంతో సెలక్టర్లు ఇదే అవకాశంగా రోహిత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. ఇక టెస్టుల్లో ఈ హిట్ మ్యాన్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. -
రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ‘సాక్షి’
హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడానికి గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో చాలాకాలం తర్వాత మరోసారి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీసీసీఐతో చర్చించాడని గురువారం ప్రెస్ మీట్లో రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించనున్నాడని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ధోని సతీమణి సాక్షి ధోని స్పందించారు. ధోని రిటైర్మెంట్పై వస్తున్న వార్తలు అసత్యమని కొట్టిపారేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇక చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ధోని రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేశాడు. తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ధోని ఈ విషయంపై బీసీసీఐతో గాని నాతో గాని చర్చించలేదని స్పష్టం చేశాడు. ఇక ధోని రిటైర్మెంట్, ప్రెస్ మీట్‌పై తమకు అధికారిక సమాచారం లేదని బీసీసీఐ పేర్కొంది. ప్రపంచకప్ అనంతరం ధోని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారత్ ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక తాజాగా ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. విశ్రాంతి నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ధోని అందుబాటులో ఉండటం లేదు. అయితే ధోనిని విశ్రాంతి పేరుతో కావాలనే పక్కకు పెడుతున్నారని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. -
ధోని ప్రెస్ మీట్.. ఏం చెప్పనున్నాడు?
న్యూఢిల్లీ : ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. గురువారం సాయంత్రం ధోని మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం. దీంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించేందుకే ప్రెస్ మీట్ పెడుతున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ధోనిని కీర్తిస్తూ కోహ్లి ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ధోని రిటైర్మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపాడని, దీనిలో భాగంగానే కోహ్లి ట్వీట్ చేశాడని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తలను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టి పారేశాడు. రిటైర్మెంట్ గురించి ధోని తమతో చర్చించలేదని పేర్కొన్నాడు. కాగా, ధోని ప్రెస్ మీట్‌పై తమకు ఎలాంటి సమాచారం అందలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ధోని ప్రెస్ మీట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ అభిమానులపై ధోని రిటైర్మెంట్ బాంబ్ పేల్చనున్నాడని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఎలాంటి సంచలన నిర్ణయం ప్రకటించకూడదని ధోని అభిమానులు కోరుకుంటున్నారు. ధోని మరికొంత కాలం క్రికెట్ ఆడాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో బ్యాటింగ్‌లో విఫలమవుతున్న ధోనిపై విమర్షల వర్షం కురుస్తోంది. (చదవండి: ‘ధోనితో కలిసి ‘పరుగు’ను మర్చిపోలేను’) ప్రపంచకప్ అనంతరం భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ధోని తెలిపాడు. ఆర్మీ శిక్షణ పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. అయితే తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేసిన టీ20 జట్టులో ధోనికి అవకాశం కల్పించలేదు. ధోనికి మరికొంత కాలం విశ్రాంతినిస్తున్నట్లు సెలక్టర్లు పేర్కొన్నారు. అయితే విశ్రాంతి పేరుతో కావాలనే పక్కకు పెడుతున్నారని సీనియర్ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఒక వేళ ధోనిని తప్పించాలనుకుంటే గౌరవంగా అతడికి వీడ్కోలు మ్యాచ్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. A game I can never forget. Special night. This man, made me run like in a fitness test 😄 @msdhoni 🇮🇳 pic.twitter.com/pzkr5zn4pG — Virat Kohli (@imVkohli) September 12, 2019 Ok , I am prepared. I won't cry. I promise. Tears rolling down already. 😭#Dhoni — Neel Patel (@NeelPatel189) September 12, 2019 -
‘అందుకే కుల్దీప్, చహల్‌లను తీసుకోలేదు’
ముంబై: వరల్డ్‌టీ20కి ఏడాది మాత్రమే సమయం ఉన్నందున టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రాబోవు సిరీస్‌ల్లో యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో కీలక ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్‌లకు కూడా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇప్పటికే ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చామో స్పష్టం చేసిన చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్.. తాజాగా కుల్దీప్, చహల్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. ‘స్పిన్ బౌలింగ్ విభాగంలో కాస్త వైవిధ్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం. ఆస్ట్రేలియాలో జరుగున్న టీ20 వరల్డ్‌కప్ నాటికి యువ క్రికెటర్లను పూర్తి స్థాయిలో పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్, చహల్‌లు పొట్టి ఫార్మాట్లో అసాధారణమైన బౌలర్లు. అందులో ఎటువంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా జట్టులో వారి ముద్ర కనబడుతోంది. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారు ముందు వరుసలో ఉంటారు. కాకపోతే మాకున్న మిగతా బౌలింగ్ ఆప్షన్స్‌కు పరీక్షించాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఫాస్ట్ బౌలర్ నవదీప్ షైనీతో పాటు బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్లు వారి సత్తాను నిరూపించుకున్నారు. ఇక కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లు కూడా పొట్టి ఫార్మాట్లో వారి ప్రతిభను చాటుకున్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కుల్దీప్, చహల్‌లను పక్కకు పెట్టాం’ అని ఎంఎస్కే పేర్కొన్నాడు. ఆదివారం నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. -
త్రీడీ ట్వీట్‌పై స్పందించిన రాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో చోటు దక్కపోవడంతో చేసిన వివాదాస్పద 3డీ ట్వీట్‌పై క్రికెటర్ అంబటి రాయుడు తొలిసారి స్పందించాడు. ఈ ట్వీట్ చేసినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని ప్రకటించాడు. ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టలేదని స్పష్టం చేశాడు. తనకు ఆటే ముఖ్యమని, మిగతా వాటి గురించి పట్టించుకోనని అన్నాడు. ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని వెల్లడించాడు. ప్రపంచకప్ కోసం చాలా శ్రమించానని, సెలక్టర్లు వేరే రకంగా ఆలోచించారని చెప్పుకొచ్చాడు. ఫామ్‌లో ఉన్నప్పటికీ తనను జట్టులోకి తీసుకోకపోవడం దురదృష్టంగా రాయుడు వర్ణించాడు. గత ప్రపంచకప్ సెలక్షన్స్‌లో భాగంగా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే మాట్లాడుతూ రాయుడు మెరుగైన ఆటగాడని, అయితే విజయ్ శంకర్‌ను మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాయుడు వ్యంగ్యంగా స్పందిస్తూ మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్) అన్నందుకు ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని రాయుడు ట్వీట్ చేసి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో చోటు దక్కలేదన్న మనస్తాపంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. (చదవండి: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న రాయుడు) -
ఈ విజయం ఎంతో ప్రత్యేకం
న్యూఢిల్లీ: పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలవడంతో అందరికంటే అమితానందం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్. తన శిష్యురాలి తాజా ప్రదర్శన గోపీచంద్‌ను గర్వపడేలా చేసింది. స్వర్ణం సాధించడంతో ఒక పనైపోయిందని ఆయన అన్నారు. ‘నాకు సంబంధించి ఇది చాలా పెద్ద విజయం. వరల్డ్ చాంపియన్ అనిపించుకోవడం నిజంగా చాలా గొప్ప ఘనత. దీనిని ఆమె సాధించిన తీరు ఇంకా అపూర్వం. రెట్టింపు గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మన దేశం నుంచి ఇప్పటికే కాంస్యం, రజతం చూశాం. ఇప్పుడు స్వర్ణం కూడా దక్కింది’ అని గోపీచంద్ భావోద్వేగంతో చెప్పారు. ఒకుహారాతో జరిగిన మ్యాచ్‌పై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరం లేకపోయిందని, ఒక్కసారి మ్యాచ్‌లో పట్టు చిక్కితే ఆమె దూసుకుపోతుందనే విషయం తనకు తెలుసని కోచ్ వ్యాఖ్యానించారు. ‘ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... ఇలా అన్ని చోట్లా సింధు రాణించింది. బయటి వారి సంగతి ఎలా ఉన్నా ఆమె ఆటపై నాకు మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినా నేను బాధపడకపోయేవాడిని. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం’ అని మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్కే అభినందన... సింధు విజయంపై భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో గోపీచంద్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు ‘సింధు కఠోర శ్రమ, అంకితభావం, నైపుణ్యానికి దక్కిన ఫలితమిది. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. భారత బ్యాడ్మింటన్‌కు వెన్నెముకలా నిలిచి శ్రమించిన గోపీచంద్‌కు కూడా నా అభినందనలు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఇంతటి అంకితభావం ఉన్న కోచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ప్రసాద్ అన్నారు. చాముండేశ్వరీనాథ్ కారు కానుక... వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు అత్యాధునిక హై ఎండ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేసే అవకాశం ఉంది. -
‘అందుకే రోడ్స్‌ను ఫైనల్ లిస్ట్‌లో చేర్చలేదు’
ముంబై: టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్‌నే తిరిగి ఎంపిక చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి పోటీ పడినప్పటికీ శ్రీధర్‌వైపు సెలక్షన్ కమిటీ మొగ్గుచూపింది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి అండదండలతోనే శ్రీధర్‌ను మళ్లీ నియమించారనేది కాదనలేని వాస్తవం. అయితే రోడ్స్‌ను కనీసం ఫైనలిస్టులో చేర్చకపోవడమే చర్చనీయాంశంగా మారింది. దీనిపై చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ‘ఫీల్డింగ్ కోచ్ ఫైనలిస్టులో శ్రీధర్‌తో పాటు, అభయ్ శర్మ, టి దిలీప్‌లతోనే సరిపెట్టాం. వీరిద్దరికీ భారత్-ఏ జట్టుతో పని చేసిన అనుభవంతో పాటు ఎన్సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ)లో కూడా సేవలందించారు. దాంతో రోడ్స్‌ను తుది జాబితాలో ఎంపిక చేయలేదు’ అని ఎంఎస్కే తెలిపాడు. అయితే శ్రీధర్‌నే తిరిగి నియమించడాన్ని ఎంఎస్కే సమర్ధించుకున్నాడు.‘ ఆర్ శ్రీధర్ ఒక అత్యుత్తమ ఫీల్డింగ్ కోచ్. అందులో సందేహం లేదు. టీమిండియా ఫీల్డింగ్ మెరుగు పడటంలో శ్రీధర్ పాత్ర చాలానే ఉంది. దాంతో మాకు వేరే ఆలోచన లేకుండా శ్రీధర్‌నే ఎంపిక చేశాం’ అని చెప్పుకొచ్చాడు. (ఇక్కడ చదవండి: సంజయ్ బంగర్‌పై వేటు) -
సంజయ్ బంగర్‌పై వేటు
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన సహాయక సిబ్బందిలో ఇద్దరు కొనసాగనుండగా... మరొకరిపై వేటు పడింది. తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడని స్వయంగా విరాట్ కోహ్లి పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించినా సరే... బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు మాత్రం పొడిగింపు లభించలేదు. మెరుగైన రికార్డే ఉన్నా, వరల్డ్ కప్ సెమీస్‌లో ధోనిని ఏడో స్థానంలో పంపడానికి కారణమయ్యాడంటూ విమర్శలపాలు కావడమే బంగర్ తన పదవిని కోల్పోయేలా చేసినట్లు సమాచారం. బంగర్ స్థానంలో మరో మాజీ ఆటగాడు విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. రాథోడ్ భారత్ తరఫున 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. మూడేళ్ల క్రితం వరకు భారత సెలక్టర్‌గా కూడా పని చేసిన అతనికి పంజాబ్ రంజీ టీమ్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్లకు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. బ్యాటింగ్ శిక్షణలో కొత్తదనం తీసుకురావడం కోసమే ఈ మార్పు చేసినట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. రోడ్స్‌కు దక్కని అవకాశం... : కోచ్ రవిశాస్త్రి అండదండలతో పాటు కొన్నేళ్లుగా భారత పేస్ బౌలింగ్ పదునెక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన భరత్ అరుణ్‌నే బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనున్నారు. మరో వైపు జాంటీ రోడ్స్ స్థాయి వ్యక్తి పోటీపడినా... హైదరాబాదీ ఆర్.శ్రీధర్‌నే ఫీల్డింగ్ కోచ్‌గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టీమ్ అడ్మినిస్ట్రే్టటివ్ మేనేజర్‌గా కూడా హైదరాబాద్‌కే చెందిన గిరీశ్ డోంగ్రే ఎంపికయ్యారు. ఒక్కో పదవికి ప్రాధాన్యతా క్రమంలో మూడు పేర్లను కమిటీ ప్రతిపాదించింది. దీనిపై బీసీసీఐ అధికారిక ముద్ర వేస్తుంది. -
బ్యాటింగ్ కోచ్ ఎవరో?
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పేరు ఖరారైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఇతర సహాయక సిబ్బందిపై పడింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బృం దం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, గురువారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం ఎంపికైనవారి జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎంపిక విషయంలో రవిశాస్త్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారా లేక ఎంపిక కమిటీ తమదైన శైలిలో తగిన వ్యక్తులను ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరం. ముందంజలో విక్రమ్ రాథోడ్ ... 2014 నుంచి భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ పనితీరు నిజానికి బాగుంది. చాలా మంది బ్యాట్స్‌మెన్ అతని హయాంలో తమ ఆటతీరు మెరుగైందని, సాంకేతిక విషయాల్లో కూడా లోపాలు తీర్చిదిద్దారని బహిరంగంగానే చెప్పారు. అయినా సరే బంగర్ పదవి భద్రంగా లేదు. అనేక మంది దీని కోసం పోటీ పడుతున్నారు. కారణాలేమైనా రవిశాస్త్రి కూడా భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్ల గురించి మాట్లాడినంత సానుకూలంగా బంగర్ గురించి చెప్పలేదు. దాంతో కొత్త వ్యక్తికి అవకాశం దక్కవచ్చని వినిపిస్తోంది. హెడ్ కోచ్ పదవికి ప్రయత్నించి విఫలమైన లాల్‌చంద్ రాజ్‌పుత్ ఈసారి బ్యాటింగ్ కోచ్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. వీరిద్దరితో పాటు ప్రవీణ్ ఆమ్రే, అమోల్ మజుందార్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. సౌరాష్ట్ర కోచ్ సితాన్షు కొటక్, హృషికేశ్ కనిత్కర్, మిథున్ మన్హాస్ కూడా ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు. రోడ్స్‌కు కష్టమే! బౌలింగ్ కోచ్ పదవి కోసం ప్రస్తుత కోచ్ భరత్ అరుణ్‌తో పాటు వెంకటేశ్ ప్రసాద్, పారస్ మాంబ్రే, అమిత్ భండారి బరిలో ఉన్నారు. వీరంతా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మరోవైపు జాంటీ రోడ్స్‌లాంటి దిగ్గజం పోటీలో నిలిచినా ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. ఇన్నేళ్లుగా భారత్ ఫీల్డింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీధర్‌కు రవిశాస్త్రి అండదండలు ఉండటమే దీనికి కారణం. టీమిండియా ప్రస్తుత ప్రమాణాలు శ్రీధర్ ఘనతే కాబట్టి రోడ్స్ స్థాయి వ్యక్తి అయినా సరే అనవసరమనే భావన కనిపిస్తోంది. -
ఇప్పటికీ అతనే బెస్ట్: ఎంఎస్కే
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ కెరీర్ ఇంకా ఎంత కాలం కొనసాగుతుందనే ప్రశ్నలు ఒకవైపు వస్తుంటే, మరొకవైపు చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాత్రం ఇప్పటికీ ధోనినే బెస్ట్ అంటున్నాడు. భారత్ క్రికెట్లో ఎంఎస్ ధోనినే అత్యుత్తమ కీపర్, బెస్ట్ ఫినిషర్ అంటూ కొనియాడాడు. భారత క్రికెట్లో మిగతా వారికి వికెట్ కీపర్లగా పరీక్షిస్తున్నా ధోని జట్టులో ఉంటే ఆ బలమే వేరన్నాడు. దాంతోనే వరల్డ్‌కప్‌లో ధోనికి చోటు దక్కిందన్నాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా ధోనిలో సత్తా ఇంకా తగ్గలేదని పేర్కొన్నాడు. ‘ ధోని విషయంలో నాకు ఒక స్పష్టత ఉంది. అతనొక అత్యుత్తమ కీపరే కాదు.. బెస్ట్ ఫినిషర్ కూడా. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని ఇప్పటికే ఉత్తమమే. మరొకవైపు కెప్టెన్ నిర్ణయాలు తీసుకునే క్రమంలో ధోని అనుభవం వెలకట్టలేనిది. వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని-జడేజాల ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం. టాపార్డర్ కుప్పకూలిన సమయంలో వారిద్దరూ ఆకట్టుకున్నారు. జడేజాకు దిశా నిర్దేశం చేస్తూ ధోని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కాకపోతే దురదృష్టం కొద్ది పోరాడి ఓడిపోయాం’ అని ఎంఎస్కే చెప్పుకొచ్చాడు. -
మా సమర్థతకు అనేక ఉదాహరణలు
న్యూఢిల్లీ: తన ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ సమర్థతపై వస్తున్న విమర్శలకు భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గట్టిగా బదులిచ్చారు. తమ బృందానికే గనుక దూరదృష్టి లేకుంటే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ రెండో భాగంలో ఆయన... ఒక సెలక్షన్ కమిటీకి ఉండాల్సిన అర్హతలేంటో వివరించారు. ఇంకా ఏం చెప్పారంటే... పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా భావించిన బుమ్రా ఇప్పుడు ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్. టి20లకే పనికొస్తాడని అనుకున్న హార్దిక్ నేడు అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న ఆల్‌రౌండర్. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అశ్విన్, జడేజా వంటి పేరున్న స్పిన్నర్ల స్థానంలో చహల్, కుల్దీప్లను ప్రత్యామ్నాయంగా తెచ్చాం. దూకుడైన రిషభ్ పంత్‌ను ఎవరూ ఊహించని విధంగా తక్కువ వ్యవధిలోనే తీర్చిదిద్ది టెస్టుల్లో ప్రవేశపెట్టాం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో అతడెలా రాణించాడో అందరం చూశాం. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి పురోగతి, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ వంటి వారితో పేస్ బౌలింగ్ బలం ఎలా పెరిగిందో చూస్తున్నాం. మా దూరదృష్టికి ఇవన్నీ ఉదాహరణలే. సీనియర్ జట్టు వెన్నంటే ‘ఎ’ జట్టు విదేశీ పర్యటనలు సాగేలా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించాం. మాకే గనుక బ్లూ ప్రింట్ లేకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? సెలక్టర్ కనీస సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి ఉండాలన్నది ఒక అంశమే. దాంతోపాటు నిజాయతీ, నిబద్ధత, గోప్యత, సమగ్రత... ఈ నాలుగు అంశాలు ఒక మంచి సెలక్షన్ కమిటీకి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు. మా కమిటీకి ఇవన్నీ ఉన్నాయని నేను 100 శాతం కచ్చితంగా చెప్పగలను. ధోని ఇప్పటికీ భారత్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉత్తమ ఫినిషర్, కీపర్ (ప్రపంచ కప్‌లో ధోని కోసం మిడిలార్డర్ కూర్పుపై రాజీపడ్డారా? అన్న ప్రశ్నకు). మిగతావారు క్రమంగా మెరుగవుతున్నారు. జట్టు, కెప్టెన్ మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో తన విశేష అనుభవాన్ని పంచుకుంటూ కీపర్, బ్యాట్స్‌మన్‌గా ధోని ప్రపంచ కప్‌లో జట్టుకు కొండంత అండగా ఉన్నా డు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి ఉంటే ధోని–జడేజా భాగస్వామ్యం మరుపురానిదిగా మిగిలిపోయేది. అవకాశం దొరికితే సొంతగడ్డపై జరిగే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు ధోనిని ఎంపిక చేస్తారా అంటే... గతంలో చెప్పినట్లే మాకు ప్రపంచ కప్ తర్వాత వేరే ప్రణాళికలున్నాయి. చాలినన్ని అవకాశాలతో పంత్‌లో ఆత్మవిశ్వాసం కల్పించి జట్టు అవసరాలకు తగ్గట్లు అతడు రాణించాలన్నది మా ఆలోచన. జట్టు పునర్నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచాం. భవిష్యత్‌పై ఆశావహంగా, టెస్టు చాంపియన్‌షిప్‌పై ఉత్సుకతతో ఉన్నాం. ‘ఎ’ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శన చేస్తున్న కొందరు కుర్రాళ్లకు పరిమిత ఓవర్ల ఆటలో చోటు కల్పించాం. వారు దానిని నిలబెట్టుకుంటే మరిన్నిఅవకాశాలుంటాయి. -
అదంతా ఒట్టి భ్రమే!
భారత క్రికెట్ జట్టు ఎంపిక, నాయకత్వ మార్పు గురించి ఎప్పుడు చర్చ జరిగినా సెలక్షన్ కమిటీ సభ్యుల కెరీర్‌పైనే అన్ని వైపుల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఆరు టెస్టులే ఆడిన ఎమ్మెస్కే ప్రసాద్ ధోని కెరీర్‌ను శాసించడం ఏమిటంటూ సెలక్టర్ల సామర్థ్యంపైనే అందరూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే దీనిపై ఎమ్మెస్కే ఘాటుగా స్పందించారు. తమ కెరీర్ గణాంకాలకు సంబంధించి వస్తున్న విమర్శలపై స్పష్టంగా సమాధానమిస్తూ ఆయన ఎదురు దాడి చేశారు. తమ ఆటకు, జట్టు ఎంపికకు సంబంధం ఏమిటంటూ సూటిగా ప్రశ్నించారు. న్యూఢిల్లీ : అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ క్రికెట్ ఆడిన వారికే సెలక్టర్లుగా బాగా పని చేసే సామర్థ్యం ఉంటుందనే ప్రచారంలో వాస్తవం లేదని భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అదంతా ఒట్టి భమ్ర మాత్రమేనని ఆయన విశ్లేషించారు. టీమిండియా ఇటీవలి ప్రదర్శన, తమ బృందంపై వచ్చిన విమర్శలు తదితర అంశాలపై ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఎమ్మెస్కే మాటల్లోనే... సెలక్షన్ కమిటీ స్థాయి, సామర్థ్యం గురించి వచ్చిన విమర్శలపై... ఏదో ఒక ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఉండాలనేది మమ్మల్ని సెలక్టర్లుగా నియమించే సమయంలో పెట్టిన కనీస అర్హత. మా సభ్యులలో అందరికీ ఆ అర్హత ఉంది. దీంతో పాటు మేమందరం కలిసి 477 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాం. మా పదవీకాలంలో 200కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూశాం. ఆటగాళ్లుగానే కాకుండా సెలక్టర్లుగా ఇన్ని మ్యాచ్‌లు చూసిన అనుభవం సరైన ప్రతిభను గుర్తించేందుకు సరిపోదా! ఐదుగురు కలిసి ఆడిన టెస్టుల సంఖ్య 13 మాత్రమే కావడంపై... నిజంగా అంతర్జాతీయ అనుభవం గురించే చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇంగ్లండ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎడ్ స్మిత్ ఒకే ఒక టెస్టు ఆడాడు. సుదీర్ఘ కాలం ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్‌గా పని చేసిన ట్రెవర్ హాన్స్ 7 టెస్టులు మాత్రమే ఆడాడు. 128 టెస్టులు, 244 వన్డేలు ఆడిన మార్క్‌వా, 87 టెస్టులు ఆడిన మరో దిగ్గజం గ్రెగ్ చాపెల్ కూడా ట్రెవర్ నేతృత్వంలో పని చేశారు. ఆయా దేశాల్లో ఎవరూ పట్టించుకోని అనుభవం, స్థాయి మన వద్దకు వచ్చేసరికి ఎందుకు అవసరమవుతుంది? నా ఉద్దేశం ప్రకారం ప్రతీ పదవికి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అపార అంతర్జాతీయ అనుభవమే కొలమానమైతే ఒక్క టెస్టు కూడా ఆడని రాజ్‌సింగ్ దుంగార్పూర్‌లాంటి మహానుభావుడు చీఫ్ సెలక్టర్ అయ్యేవాడా? 16 ఏళ్ల వయసున్న సచిన్ టెండూల్కర్‌లాంటి ఒక వజ్రాన్ని ఆయన వెలికి తీసేవాడా? ప్రతిభను గుర్తించాల్సిన సెలక్టర్‌కు స్థాయి, అంతర్జాతీయ అనుభవంతో పనేంటి. సెలక్టర్లకు చేవ లేదంటూ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలపై... ఇది చాలా దురదృష్టకరం. దిగ్గజ క్రికెటర్లంటే మాకు ఎంతో గౌరవం ఉంది. వారు వెలిబుచ్చే ప్రతీ అభిప్రాయాన్ని తగిన విధంగా పరిగణలోకి తీసుకుంటాం కూడా. వారి ఆలోచనలు వారికి ఉండవచ్చు. అయితే ఇలాంటి మాటల వల్ల బాధ పడటంకంటే సెలక్షన్ కమిటీ మరింత బలంగా, అంకితభావంతో, కలిసికట్టుగా పని చేయడం ముఖ్యం. ఎంపిక విషయంలో కోహ్లి, శాస్త్రిలతో వచ్చే విభేదాలపై... ఎక్కువ క్రికెట్ ఆడిన వారికి ఎక్కువ పరిజ్ఞానం ఉంటుందని, అదే కారణంతో వారు సెలక్టర్లకు ఇబ్బంది పెడతారని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. అలా అయితే కోచ్‌ల నుంచి ఇతర సహాయక సిబ్బంది వరకు అంతా అనుభవం ఉన్న క్రికెటర్లతోనే నిండిపోయేది. ఎంపిక సమయంలో కోహ్లి, శాస్త్రి, ‘ఎ’ జట్టు కోచ్ ద్రవిడ్‌లతో చర్చించడం సహజం. సెలక్టర్లకు కూడా తమ పాత్ర ఏమిటో బాగా తెలుసు. అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి కానీ బయటకు చెప్పం. నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో అక్కడే ఉండిపోతుంది. చివరకు భారత జట్టు ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యం. గత మూడేళ్లలో సెలక్షన్ కమిటీ పనితీరుపై... మా సెలక్షన్ కమిటీ దేశంలోని మూలమూలకూ వెళ్లి ప్రతిభాన్వేషణ సాగించింది. ఒక పద్ధతిలో సరైన వారిని గుర్తించి భారత ‘ఎ’ జట్టులోకి, సీనియర్ జట్టులోకి తీసుకొచ్చింది. భారత జట్టు 13 టెస్టు సిరీస్‌లలో 11 గెలిచి గత మూడేళ్లుగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో విజయశాతం 80–85 మధ్యలో ఉండగా, ఇటీవలి ప్రపంచకప్ సెమీస్ పరాజయం వరకు నంబర్‌వన్‌గా నిలిచాం. చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరడంతో పాటు రెండు సార్లు ఆసియా కప్ సాధించాం. ‘ఎ’ జట్టు 11 వన్డే సిరీస్‌లలో 11 కూడా గెలిస్తే, 9 టెస్టు సిరీస్‌లలో 8 నెగ్గింది. దాదాపు 35 మంది ఆటగాళ్లను గుర్తించి మూడు ఫార్మాట్లలో కూడా ఎంపిక చేశాం. ఇదంతా మా కమిటీ ఘనతగా చెప్పగలను. -
నేను సెలక్ట్ అవుతాననే అనుకున్నా: శుబ్‌మన్
న్యూఢిల్లీ: వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డాడు. విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కుతుందని ఆశించానని, అయితే అది జరగకపోవడంతో నిరాశకు గురైనట్లు పేర్కొన్నాడు. ‘ భారత జట్టులో పునరాగమనం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశా. నేను సెలక్ట్ అవుతాననే అనుకున్నా. కనీసం భారత సెలక్టర్లు ప్రకటించిన ఏదొక జట్టులో చోటు దక్కుతుందనే భావించా. కానీ నేను ఎంపిక కాలేదు. ఇది నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేసింది. కాకపోతే దాని కోసం ఆలోచిస్తూ కూర్చోను. నా ముందన్న లక్ష్యం సెలక్టర్లను ఆకర్షించడమే. అలా చేయాలంటే బ్యాట్‌తో ఆకట్టుకోవాలి. మళ్లీ జాతీయ జట్టులో ఎంపిక కావడానికి నా శాయ శక్తులా కృషి చేస్తా’ అని గిల్ పేర్కొన్నాడు. విండీస్ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో గిల్‌ను ఎంపిక చేయలేదు. వరల్డ్‌కప్‌లో నిరాశపరిచిన కేదార్ జాదవ్‌ను ఎంపిక చేసేందుకే మొగ్గుచూపిన ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. గిల్‌ను పక్కకు పెట్టేసింది. కాగా, గిల్ ఎంపిక చేయకపోవడంపై విమర్శలు రావడంతో ఎంఎస్ఏ ప్రసాద్ స్పందించాడు. ఇంకా గిల్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడంటూ సమర్ధించుకునే యత్నం చేశాడు. -
‘రిటైర్ అవ్వను.. అందుబాటులో ఉండను’
న్యూఢిల్లీ : ఓవైపు రిటైర్మెంట్పై ఎడతెగని చర్చ నడుస్తుండగా... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ప్రస్తుతానికి ఆ ఆలోచనే లేదని భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో తాను భాగం కానని, మేనేజ్మెంట్ వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవచ్చని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రపంచకప్ ఓటమి అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జోరందుకుంది. కానీ ధోని మాత్రం రాబోయే రెండు నెలలు ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో పని చేయాలని భావించి, విండీస్ పర్యటనకు దూరంగా ఉంటానని చెప్పాడని ఆదివారం వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్ల ప్రకటన సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ధోని కోరిక మేరకే విండీస్ పర్యటన నుంచి తప్పించి యువ ఆటగాడు రిషభ్ పంత్‌కు అవకాశం ఇచ్చినట్లు స్పష్టం చేశాడు. అయితే ఈ సందర్భంగా ధోని తన రిటైర్మెంట్పై కూడా క్లారిటీనిచ్చినట్లు తెలుస్తోంది. ‘ ప్రస్తుతానికి రిటైర్మెంట్పై ఎలాంటి ఆలోచనలేదని ధోని ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలిపాడు. అంతే కాకుండా భారత్ భవిష్యత్తు ప్రణాళికల్లో ఉండనని చెప్పాడు. యువ ఆటగాళ్లను సిద్దం చేసుకోమని, జట్టు ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగాలని కూడా స్పష్టం చేశాడు. అందుకే ఎమ్మెస్కే.. రిటైర్మెంట్ ధోని వ్యక్తిగతం, మేము మాత్రం మా ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగుతాం’ అని మీడియాకు తెలిపాడని ఓ జాతీయ చానెల్ పేర్కొంది. -
రాయుడిపై వివక్ష లేదు
ముంబై: విండీస్ టూర్‌కు జట్ల ప్రకటన సందర్భంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వద్ద... తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడి గురించి మీడియా ప్రస్తావించింది. దీనిపై ఎమ్మెస్కే వ్యంగ్యంగా స్పందించాడు. విజయ్ శంకర్‌ను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకుంటూ అతడిని త్రీ డైమెన్షనల్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆటగాడిగా ప్రసాద్ పేర్కొన్నాడు. దీనిపై అప్పట్లో రాయుడు... ‘ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే ‘3డి’ కళ్లజోడుకు ఆర్డరిచ్చా’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్ స్పందిస్తూ ‘ఆ ట్వీట్ చాలా బాగుంది. సమయోచితం, అద్భుతం కూడా. నేను బాగా ఎంజాయ్ చేశా. ఆ ఆలోచన తనకు ఎలా వచ్చిందో?’ అని అన్నాడు. కూర్పు వైవిధ్యం కారణంగానే రాయుడిని ఎంపిక చేయలేదని; అంతేకాని అతనిపై ఎలాంటి వివక్ష చూపలేదని ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో అతడు ఎంత ఉద్వేగానికి గురయ్యాడో సెలక్షన్ కమిటీ కూడా అంతే ఉద్వేగానికి లోనైందని అన్నాడు. ఇదే రాయుడు గతేడాది ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికై, యో యో పరీక్ష విఫలమైనప్పుడు విమర్శలు రాగా తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించాడు. ప్రపంచ కప్‌లో ధావన్ గాయపడ్డాక జట్టు మేనేజ్మెంట్ ఎడంచేతి ఆటగాడు కావాలని కోరిందని, అందుకే పంత్‌ను పంపామని, ఇక ఓపెనర్ రాహుల్‌కు బ్యాకప్‌గా మయాంక్‌ను తీసుకున్నామని ఎమ్మెస్కే వివరించాడు. ఇందులో పూర్తి స్పష్టతతో వ్యవహరించామని తెలిపాడు. కోన భరత్‌కు తప్పని నిరీక్షణ సెలక్టర్లు టెస్టులకు పంత్, సాహాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్‌కు నిరీక్షణ తప్పలేదు. ఇటీవల అద్భుత ఫామ్ రీత్యా భరత్ ఎంపికపై వార్తలు వచ్చాయి. ‘ఎ’ జట్టు తరఫున ప్రదర్శనలనూ లెక్కలోకి తీసుకున్నామని చెప్పిన ఎమ్మెస్కే... టెస్టు జట్టులోకి ఎంపికకు భరత్ చాలా చాలా దగ్గరగా ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే, గాయంతో దూరమైన జట్టులోని ఒక రెగ్యులర్ ఆటగాడు ఫిట్నెస్ సాధిస్తే ఎంపికలో అతడికే ప్రాధాన్యం ఇవ్వాలన్న అప్రకటిత నియమంతో సాహాకు చాన్స్ దక్కింది. -
విండీస్ సిరీస్‌కు సై
ముంబై: ప్రపంచ కప్ సాధించలేకపోయిన బాధను అధిగమిస్తూ వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం. విడివిడిగా కాకుండా మూడేసి టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒకేసారి జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. వీరిలో పేసర్ నవదీప్ సైనీ (ఢిల్లీ), స్పిన్నర్ రాహుల్ చహర్ (రాజస్తాన్) పూర్తిగా కొత్త ముఖాలు. విశ్రాంతి ఊహాగానాలను తోసిరాజంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం పర్యటనలో పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌పై వేటు పడింది. పనిభారం రీత్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయగా, ఫిట్నెస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే కరీబియన్ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. హార్దిక్‌ది గాయయా? విశ్రాంతా? మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మొత్తం విండీస్ టూర్‌కే ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్‌లో బాగానే రాణించిన హార్దిక్... సెమీస్‌కు వచ్చేసరికి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కొంతకాలంగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తిరగబెట్టకుండా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పృథ్వీ షా మళ్లీ మిస్... అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం పృ థ్వీ షాను ఆ తర్వాత దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. పట్టిం చుకోనవసరం లేని ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్లిష్టమైన క్యాచ్ అందుకోబోయి పాదం గాయానికి గురై, కెరీర్‌కు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పృథ్వీ... ఇప్పుడు మరో గాయంతో వెస్టిండీస్ సిరీస్‌నూ చేజార్చుకున్నాడు. రెండు నెలల క్రితం ముంబై టి20 లీగ్‌లో ఆడుతూ గాయం బారినపడ్డ అతడు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఆడుతున్న భారత ‘ఎ’ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. విండీస్‌తో టెస్టులకు కొంత సమయం ఉన్నా సెలక్టర్లు పృథ్వీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విదేశాల్లో సత్తా చాటేందుకు అతడు ఇంకొంత కాలం ఆగక తప్పలేదు. టెస్టు జట్టు: సభ్యులు 16 ఎంపిక తీరు: మయాంక్ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్. ఎంపిక తీరు: స్పెషలిస్ట్ మూడో ఓపెనర్‌గా ఎవరినీ తీసుకోలేదు. మయాంక్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అవసరమైతే తెలుగు ఆటగాడు విహారిని ఓపెనింగ్‌కు పరిశీలించే వీలుంది. ఈ కారణంగానే దేశవాళీ, ‘ఎ’ జట్ల తరఫున సెంచరీలతో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచాల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్)లకు పిలుపు అందలేదు. ప్రపంచ కప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మళ్లీ అవకాశం దక్కింది. రోహిత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. ఏడాదిగా గాయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్‌గా తీసుకున్నారు. ఆసీస్ టూర్లో జట్టులో ఉన్న మిగతా నలుగురు పేసర్లకూ స్థానం కల్పించిన సెలెక్టర్లు పేసర్ భువనేశ్వర్‌ను పక్కన పెట్టారు. స్పిన్ బాధ్యతలను అశ్విన్–జడేజా–కుల్దీప్ త్రయం మోయనుంది. వన్డే జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, పంత్, జడేజా, కుల్దీప్, చహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: వేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఫిట్నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిఖార్సైన బ్యాట్స్‌మెన్ అయ్యర్, పాండేలకు అవకాశం దక్కింది. సీనియర్ దినేశ్ కార్తీక్‌పై వేటుతో రిషభ్ పంత్ ఏకైక కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను తప్పిస్తారని ఊహించినా అతడిపై భరోసా ఉంచారు. ఎడంచేతి వాటం పేసర్ ఖలీల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పేరు ప్రస్తావనకు రాలేదు. టి20 జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కృనాల్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్, భువనేశ్వర్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: జాతీయ జట్టు సభ్యులుగా సోదర ద్వయం రాహుల్ చహర్ (స్పిన్), దీపక్ చహర్ (పేసర్) తొలిసారి మైదానంలో దిగే వీలుంది. దీపక్ గతంలో ఒక వన్డే, ఒక టి20 ఆడాడు. ఐపీఎల్, ‘ఎ’ జట్టు తరఫున అదరగొట్టిన 19 ఏళ్ల రాహుల్ చహర్ తన ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా గడప తొక్కాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు పట్టించుకోని వాషింగ్టన్ సుందర్‌కు తిరిగి పిలుపొచ్చింది. మణికట్టు ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో షమీని పొట్టి ఫార్మాట్‌కు పరిగణించలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడిపై మరింత భారం మోపకుండా ఖలీల్, దీపక్, సైనీ వంటి యువ పేసర్లను పరీక్షించనున్నారు. భువీ ప్రధాన పేసర్‌గా వ్యవహరిస్తాడు. -
రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే
న్యూఢిల్లీ : ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న అసహనంతో అంబటి రాయుడు చేసిన త్రీడీ ట్వీట్‌ను ఆస్వాదించానని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ప్రపంచకప్ జట్టుకు విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై రాయుడు స్పందిస్తూ త్రీడీ కళ్లజోడు కొనుక్కుని వరల్డ్ కప్ చూస్తానంటూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాయుడు ఏకంగా క్రికెట్‌కే గుడ్ బై చెప్పాడు. రాయుడి రిటైర్మెంట్కు త్రీడీ ట్వీట్ కూడా ఓ కారణమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, తాజాగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ట్వీట్‌పై స్పందించాడు. ‘అంబటి రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించాను. వ్యంగ్యంతో కూడిన ఆ ట్వీట్ చాలా బాగుంది. రాయుడి భావోద్వేగాలను అర్థం చేసుకున్నాం. జట్టు ఎంపికలో మాకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఎవరి విషయంలోనూ తమకు ద్వేషం, పక్షపాతం లేదు. రాయుడు టీ20 ప్రదర్శన ఆధారంగా వన్డేలకు ఎంపిక చేయాలనుకున్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా మేం అతని అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేశాం. అతను ఫిట్నెస్ టెస్ట్ ఫెయిలైనప్పుడు కూడా ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అండగా నిలిచాం. కొన్ని కాంబినేషన్స్ నేపథ్యంలో అతన్ని ప్రపంచకప్ తుది జట్టులోకి తీసుకోలేకపోయాం. అంత మాత్రానా సెలక్షన్ కమిటీ పక్షపాతంగా వ్యవహరించదనడం తగదు.’ అని పేర్కొన్నారు. ప్రపంచకప్ తుది జట్టులో చోటు ఖాయమని భావించిన రాయుడికి ఆఖరి నిమిషంలో విజయ్‌శంకర్ రూపంలో నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ త్రీ డైమన్షన్స్ నేపథ్యంలో ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే ప్రసాద్ అప్పట్టో వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు 3డీ గ్లాస్‌ను ఆర్డర్ చేశానని కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. ధావన్, విజయ్ శంకర్ గాయపడి స్వదేశం చేరుకున్నా.. స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న రాయుడిని కాదని సెలక్టర్లు మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇచ్చారు. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే -
అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్
న్యూఢిల్లీ : టీమిండియా లెజండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో తెలుసని భారత ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అది ధోని వ్యక్తిగత నిర్ణయమని అతని రిటైర్మెంట్పై వస్తున్న ఉహాగానాల నేపథ్యంలో పేర్కొన్నారు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ ఎంఎస్ ధోని విండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. అతని గైర్హాజరీ విషయాన్ని ముందే తెలియజేశాడు. ప్రపంచకప్ నుంచే మా దగ్గర ప్రణాళికలున్నాయి. కానీ ప్రపంచకప్‌లో కొన్ని వ్యూహాలు ఫలించలేదు. రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేం భావిస్తున్నాం. ప్రస్తుతం మా ప్రణాళిక కూడా అదే. ధోని భవిష్యత్తు గురించి కూడా అతనితో చర్చించాం. రిటైర్మెంట్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. దిగ్గజ క్రికెటర్ ధోనికి ఎప్పుడు రిటైర్ అవ్వాలనే విషయం తెలుసు. కానీ మేం మా భవిష్యత్తు ప్రణాళికలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం.’ అని ఎమ్మెస్కే స్పష్టం చేశాడు. ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోని స్ట్రైక్‌రేట్, స్లోబ్యాటింగ్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెస్కే మాత్రం స్ట్రైక్‌రేట్ గురించి తాము ఆలోచించడం లేదని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నామన్నారు. రిషభ్ పంత్ మూడు ఫార్మాట్లు ఆడుతాడని, అతనిపై పనిభారం పడకుండా చూసుకుంటామని, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్‌లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తామన్నారు. రాబోయే రెండు నెలలు ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో పని చేయాలని భావించిన ధోని.. విండీస్ పర్యటన నుంచి స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే. -
రాయుడు పేరును పరిశీలించండి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి రాయుడు ఉద్వేగంలో తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జట్టు ఎంపికలో అతని పేరును పరిశీలించాలని పేర్కొంటూ మాజీ ఎంపీ, భారత క్రికెట్ సమాఖ్య చైర్మన్ వి. హనుమంతరావు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు లేఖ రాశారు. ప్రతిభావంతుడైన రాయుడులో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. నం. 4లో బ్యాటింగ్‌తో పాటు అవసరమైన సమయాల్లో వికెట్ కీపింగ్ కూడా చేయగల సామర్థ్యం రాయుడుకు ఉందన్నారు. ప్రపంచకప్ ఎంపికలో తనపై చూపించిన నిర్లక్ష్యం కారణంగా నొచ్చుకున్న రాయుడు భావోద్వేగంలో రిటైర్మెంట్ను ప్రకటించాడని, బీసీసీఐ చొరవ తీసుకొని రాయుడుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. -
రాయని డైరీ.. ఎం.ఎస్.కె. ప్రసాద్ (సెలక్టర్)
లండన్ నుంచి ఇండియా బయల్దేరాం. ఫ్లయిట్ ఎక్కేముందు ఇండియా నుంచి వినోద్ రాయ్ ఫోన్ చేశారు. వెంటనే లిఫ్ట్ చేసి, ‘‘గుడ్ మాణింగ్ సర్’’ అన్నాను. రాయ్ పెద్దగా నవ్వారు. ‘‘క్యాచ్ పట్టినట్టుగా పట్టావ్ కదయ్యా’’ అన్నారు. ‘‘ఏంట్సార్ పట్టేది!! అన్నాను. ‘‘అదేనయ్యా.. దినేష్ కార్తీక్ కొట్టిన బంతిని నీషమ్ అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు కదా. అలా నువ్వు నా కాల్ని పట్టేశావు. నేను కదా ముందుగా నీకు గుడ్ మాణింగ్ చెప్పాల్సింది. నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు నాకు ఫోన్ చెయ్యలేదు.. హాహాహా..’’ అన్నారు! ముందు పంపాల్సిన ప్లేయర్‌ని ముందు పంపి, వెనుక పంపాల్సిన ప్లేయర్‌ని వెనుక పంపి వుంటే ఇప్పుడు మేమంతా ఇండియా ఫ్లయిట్ ఎక్కేందుకు ముందూవెనుకా ఆలోచించే పని ఉండేది కాదని రాయ్ నాకు చెప్పదలచుకున్నారని అర్థమైంది. ఆయన నాకు చెప్పదలచుకున్నారని నేను అర్థం చేసుకున్న ఇంకో విషయం.. సెమీస్‌లో మ్యాచ్ పోయాక ఈ రెండు మూడు రోజుల్లో ఒక్కసారి కూడా నేను ఆయనకు ఫోన్ చెయ్యలేదని నాకు గుర్తు చేయడం. ‘‘సారీ సర్. చెయ్యాల్సింది’’ అన్నాను. ‘‘చెయ్యలేకపోయావ్ సరే, ‘చెయ్యలేకపోయాను’ అనైనా చెయ్యాల్సింది’’ అన్నారు! ఆయన ఇగో బాగా హర్ట్ అయినట్లుంది. ఇండియా హర్ట్ అయినా పర్వాలేదు. ఇగోలు హర్ట్ కాకూడదు. వినోద్ రాయ్ ఇగోను అసలే హర్ట్ కానీయకూడదు. క్రికెట్ బాగోగుల కమిటీ చైర్మన్ ఆయన. ‘‘చేద్దామనుకున్నాను సర్. ఓడిపోయాక చేసి చెప్పేది, చెప్పి చేసేదీ ఏముంటుందని చెయ్యలేదు’’ అన్నాను. ‘‘గెలిస్తే ‘కంగ్రాట్స్’ అని నేనే ముందుగా ఫోన్ చెయ్యడం కామన్. ఓడిపోతే ‘సారీ’ అని నీకై నువ్వే ముందుగా ఫోన్ చెయ్యకపోవడం అన్‌కామన్. పిటీ ఏంటంటే.. ఓడిపోయినా నేనే నీకు ఫోన్ చేసి నీ చేత సారీ చెప్పించుకోవడం’’ అని మళ్లీ ‘ హాహాహా..’ అన్నారు. ఇండియా న్యూజిలాండ్‌పై ఓడిపోడానికి కారణం నేనేనని ఆయన అనుకుంటున్నట్లు న్నారు! అలాగైతే ఇండియా దక్షిణాఫ్రికా మీద, ఆస్ట్రేలియా మీద, పాకిస్తాన్ మీద, ఆప్గానిస్తాన్ మీద, వెస్టిండీస్ మీద, బంగ్లాదేశ్ మీద గెలవడానికి కూడా నేనే కారణం అని ఆయన అనుకోవాలి. కెప్టెన్ ఉండగా, కోచ్ ఉండగా, మ్యాచ్ మట్టిపాలవడానికి కారణం సెలక్టర్స్ కమిటీ ఛైర్మన్ మాత్రమే అయితే.. అంతమందీ ఉండగా గెలిచిన మ్యాచ్లన్నిటిలోనూ గెలుపుకు సెలక్టర్స్ కమిటీ ఛైర్మనే కారణం అవ్వాలి కదా! ‘‘గెలుపు ఓటములకు కారణం నేనేనని మీరు అనుకుంటున్నట్లయితే కనుక నేను నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను సర్’’ అన్నాను. ‘‘ఓటమికి మాత్రమే కారణాలు ఉంటాయి మిస్టర్ ఎమెస్కే. గెలుపుకు కారణమేంటని ఎవరూ చూడరు. తప్పుల్ని దిద్దుకుంటానని అంటున్నావ్. దిద్దుకోలేని తప్పేదైనా చేసి ఉంటే మాత్రం నిన్ను ఇంకొకరు దిద్దవలసి వస్తుంది. నిన్ను నువ్వు దిద్దుకోడానికి ఉండదు’’ అన్నారు! అంబటి రాయుడిని టీమ్‌లోకి తీసుకోనందుకు ఈయన ఇలా అనడం లేదు కదా అని ఒక్కక్షణం అనిపించింది. ‘‘మీరంతా ఇండియా రాగానే చిన్న మీటింగ్ ఉంటుంది ఎమెస్కే. కెప్టెన్ కోహ్లీకి, కోచ్ రవిశాస్త్రికి కలిపి ఒక మీటింగ్. నీకొక్కడికే సపరేట్గా ఒక మీటింగ్. ఆ సంగతి చెప్పడానికే ఫోన్ చేశాను’’ అన్నారు వినోద్ రాయ్! నాకొక్కడికే సపరేట్గా ఒక మీటింగా! నాకేదో అర్థమవుతోంది. ‘‘సర్.. మా నేటివ్ ప్లేస్ గుంటూరుకు వెళ్లి కొన్ని యుగాలు అవుతోంది. ముంబైలో ఫ్లయిట్ దిగ్గానే ఒకసారి గుంటూరు వెళ్లొస్తాను సర్’’ అన్నాను. ‘‘గుంటూరా! అంబటి రాయుడిది కూడా గుంటూరే కదా’’ అన్నారు సడన్‌గా ఆయన. -
‘4’లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే ఓడాం
ముంబై: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ సమావేశమవుతుంది. మెగా టోర్నీ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇంగ్లండ్ నుంచి కోహ్లి, శాస్త్రి తిరిగి రాగానే సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గే వారితో చర్చిస్తారు. దీంతో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. ముఖ్యంగా అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్ ముందు జరిగిన ఆఖరి సిరీస్ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అదే విధంగా దినేశ్ కార్తీక్ వైఫల్యం, సెమీస్‌లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలు కూడా భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 2020 టి20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్ధం చేసే విషయంలో సెలక్షన్ కమిటీ సూచనలను సీఓఏ కోరనుంది. రేపు భారత జట్టు రాక... ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించిన భారత క్రికెట్ జట్టు ఆదివారం స్వదేశం చేరుకోనుంది. విడిగా కాకుండా జట్టు ఆటగాళ్లందరూ కలిసి ఒకేసారి ముంబైకి ప్రయాణిస్తారు. ‘టోర్నీ ముగిశాక కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్‌లోనే ఉండి విరామం కోరుకుంటారని వినిపించింది. అయితే అది వాస్తవం కాదు. జట్టు సభ్యులంతా ఆదివారం లండన్‌లో ఒక్కచోటికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ముంబై విమానమెక్కుతారు. సెమీస్ ఓటమి తర్వాత క్రికెటర్లంతా చాలా బాధలో ఉన్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ధోని రిటైర్మెంట్పైనే ఉంది. దీనిపై అతను మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ముంబై నుంచి స్వస్థలం రాంచీ చేరుకున్న తర్వాతే ధోని ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. ‘4’లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే ఓడాం హెడ్ కోచ్ రవిశాస్త్రి విశ్లేషణ ఎప్పటి నుంచో వెంటాడిన ‘నాలుగో’ సమస్యను సమస్యగానే ఉంచడం వల్ల ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు అంగీకరించారు. మిడిలార్డర్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే సెమీఫైనల్లో కంగుతిన్నామని రవిశాస్త్రి అన్నారు. టీమిండియా పరాజయాన్ని విశ్లేషించిన ఆయన ఈ లోటుపై తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని సూచించారు. ‘మిడిలార్డర్‌కు కీలకమైన నాలుగో స్థానాన్ని మొదట్లో రాహుల్‌తో లాగించాం. టోర్నీ మధ్యలో ఓపెనర్ ధావన్ గాయంతో నిష్క్రమించడంతో అతన్ని ఓపెనర్‌గా దింపాల్సి వచ్చింది. విజయ్ శంకర్‌ను ఆ నాలుగో స్థానంలో ఆడించినా... అతనూ గాయపడటంతో ఇక చేయాల్సిందేమీ లేకపోయింది’ అని రవిశాస్త్రి వివరించారు. మయాంక్ అగర్వాల్‌ను పిలిపించినా అప్పటికే సమయం మించిపోయిందన్నారు. ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపలేదన్న గావస్కర్ విమర్శలపై మాట్లాడుతూ ఎంతో అనుభవజ్ఞుడు, గొప్ప ఫినిషర్ అయిన ధోనిని ముందే పంపితే... అతను ఔటయితే ఇక గెలిచే పరిస్థితే ఉండదన్న విశ్లేషణతోనే మాజీ కెప్టెన్‌ను ఏడోస్థానంలో దింపామని... ఇది పూర్తిగా జట్టు నిర్ణయమని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. ‘ఆఖరిదాకా వికెట్ కాపాడుకున్న ధోని కూడా గెలిపించగలననే ధీమాతోనే ఉన్నాడు. అతను రనౌట్ కానంత వరకు అతని కళ్లలో ఈ ఆత్మవిశ్వాసమే కనబడింది. దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో ఓటమి తప్పలేదు’ అని కోచ్ తెలిపారు. -
ఎమ్మెస్కే ప్రసాద్ పేరు చెప్పి మోసం
-
కటకటాల పాలైన క్రికెటర్
గుణదల (విజయవాడ తూర్పు): అతను ఉన్నత విద్యావంతుడు. దానికితోడు మంచి క్రికెటర్. పేద కుటుంబం నుంచి వచ్చి ప్రతిభ చూపి రంజీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే స్థాయికి ఎదిగాడు. 82 గంటలపాటు క్రికెట్ ఆడటం ద్వారా గిన్నిస్ బుక్‌లో కూడా స్థానం సంపాదించాడు. అయితే, బుద్ధి వక్రించడంతో కటకటాల పాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ ఏసీపీ వైబీసీసీఏ ప్రసాద్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరి నాగరాజు (24) పేద కుటుంబానికి చెందిన యువకుడు. ప్రస్తుతం విశాఖపట్నం మధురవాడ గాయత్రీనగర్‌లో ఉంటున్న నాగరాజు ఎంబీఏ వరకు చదువుకున్నాడు. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని గేమ్‌లో చక్కని ప్రతిభ కనబరిచేవాడు. 2006లో విశాఖ అండర్–14 కు ఎంపికయ్యాడు. ఆపై వరుసగా 7 సంవత్సరాలపాటు వివిధ జోన్ల తరఫున ఆడుతూ చక్కని ప్రతిభ కనబరిచాడు. 2014 లో ఆంధ్రా తరఫున రంజిలో కూడా ఆడాడు. 2016లో 82 గంటల పాటు క్రికెట్ ఆడి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. నాగరాజు ఆటను చూసి అతనిని ప్రోత్సహించే దిశగా అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వచ్చిన సంపాదనతో జల్సాలకు అలవాటు పడ్డాడు. మరింత డబ్బు సంపాదించి విలాసవంతంగా గడపాలనే దురుద్దేశంతో ధోని క్రికెట్ అకాడమీ పేరుతో ఓ సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. ఈ క్రమంలో గత యేడాది నందం వేణుగోపాల్ అనే వ్యక్తిని మోసం చేసి రూ.22,300 నగదు తీసుకున్నాడు. ఈ ఘటనపై సదరు వేణుగోపాల్.. నాగరాజుపై విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే అలవాటుగా మారిన నాగరాజు ఈ యేడాది ఫిబ్రవరిలో టి–20 టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి మనోజ్ అనే వ్యక్తిని మోసం చేసి అతని వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేశాడు. ఇటీవల తాను ఎమ్మెస్కే ప్రసాద్‌నని నమ్మబలికి హైదరాబాద్‌కు చెందిన మురళీ అనే వ్యక్తి నుంచి రూ.2,88,000 వసూలు చేసి మోసం చేశాడు. ఇదే పంథాలో విజయవాడకు చెందిన రామకృష్ణ హౌసింగ్ సొసైటీ నిర్వాహకులకు ఫోన్ చేసి రూ.3,88,000 నగదు వసూలు చేశాడు. ఈ విధంగా ఎమ్మెస్కే ప్రసాద్ పేరును వాడుకుని డబ్బు వసూలు చేస్తూ జల్సాలకు అలవడిన నాగరాజుపై మాచవరం పోలీస్ స్టేషన్లో గత నెల 22వ తేదీన కేసు నమోదు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో నిందితుడు ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు నాగరాజును గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1,80,500 నగదు, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో మాచవరం సీఐ జి శ్రీనివాస్, ఎస్ఐ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ క్రికెటర్ల పరిస్థితే ఇంత : ఓజా
హైదరాబాద్ : ప్రపంచకప్ జట్టులో హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంపై కొనసాగుతున్న వివాదానికి మరో హైదరాబాద్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా మరింత అగ్గిని రాజేశాడు. ఇప్పటికే తెలుగు క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిమానులు మండిపడుతుండగా.. ఓజా చేసిన ట్వీట్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాయుడు కంటే విజయ్ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణకు వ్యంగ్యంగా.. మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్) ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని రాయుడు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌పై బీసీసీఐ కూడా స్పందిస్తూ.. రాయుడి బాధను అర్థం చేసుకోగలమని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్ఞాన్ ఓజా కూడా ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘హైదరాబాద్ క్రికెటర్లలో కొందరి పరిస్థితి ఇంతే. ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కున్నా. నీ బాధను అర్థం చేసుకోగలను’ అని రాయుడికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఓజా టెస్ట్ కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా.. కారణం లేకుండా జాతీయ జట్టు నుంచి తొలగించారు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఓజా సెలక్షన్ ప్యానెల్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఫేర్వేల్ టెస్ట్‌లో ఓజా 10 వికెట్లు పడగొట్టి మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అదుకున్నాడు. 24 అంతర్జాతీయ టెస్టుల్లో 113 వికెట్లు పడగొట్టాడు. 18 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 6 టీ20లు కూడా ఆడాడు. Curious case of some Hyderabadi cricketers... been in a similar situation... understand the wink✌🏼 https://t.co/zLtAQIMvYn — Pragyan Prayas Ojha (@pragyanojha) 16 April 2019 -
‘త్రీడి కళ్లద్దాలు’ ఆర్డర్ ఇచ్చా: రాయుడు
రాయుడు కంటే విజయ్ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణపై అంబటి రాయుడు వ్యంగ్యంగా స్పందించాడు. మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్) అన్నందుకు ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని రాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 55 వన్డేలాడిన హైదరాబాదీ బ్యాట్స్‌మన్ రాయుడు 47.05 సగటు నమోదు చేశాడు. ఆసీస్, కివీస్ పర్యటనల్లో 82.25 స్ట్రయిక్‌రేట్‌తో అదరగొట్టాడు. -
విజయ్ శంకరానందం
ముంబై: సీనియర్ ఆటగాళ్లు అంబటి రాయుడు, అజింక్యా రహానేలను కాదని ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాకు యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో విజయ్ శంకర్‌తో పాటు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ‘ప్రపంచకప్‌లో పాల్గొనబోయే టీమిండియాకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తొలి మెగా టోర్నీ. ప్రపంచకప్‌లో ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు. నేను కూడా దేశం తరుపున ఆడాలని కలలు కనేవాడిని. అది ఇంత త్వరగా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే పర్యటనగా మిగిలిపోతుంది’ అంటూ విజయ్ శంకర్ పేర్కొన్నాడు. ఇక విజయ్ శంకర్ త్రీ డైమెన్షన్ ప్లేయర్ అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ కొనియాడిన విషయం తెలిసిందే. అంబటి రాయుడు, విజయ్ శంకర్లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్ వైపే మొగ్గు చూపామని ఎమ్మెస్కే వివరించాడు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చేదు జ్ఞాపకాలను తుడిచివేసుకొని.. మరింత రాటుదేలిన శంకర్ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు తొమ్మిది వన్డేలు ఆడిన విజయ్ శంకర్ 33 సగటుతో 165 పరుగులు సాధించాడు. స్లో మీడియం పేసర్ అయిన శంకర్.. చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం, మెరుపు ఫీల్డింగ్ అతడికి అదనపు బలం. -
అందుకే అంబటిని పక్కకుపెట్టాం: ఎమ్మెస్కే
ముంబై : ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన టీమిండియా పూర్తి సమతూకంగా ఉందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. రెండేళ్ల క్రితం జరిగిన చాంపియన్ ట్రోఫీ అనంతరమే ప్రపంచకప్ వేట ప్రారంభించామని తెలిపాడు. సోమవారం ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకంటించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రెండేళ్ల కాలంలో మిడిలార్డర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని అందుకే యువ ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు కల్పించామన్నాడు. జట్టును ఎంపిక చేసేటప్పుడు అంబటి రాయుడు, విజయ్ శంకర్లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్ వైపే మొగ్గు చూపామని ఎమ్మెస్కే వివరించాడు. మోస్ట్ బ్యాలెన్స్డ్ టీమ్.. ‘భారత జట్టు ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాం. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు, ఆటగాళ్ల బలాబలాలు, ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేశాం. ప్రస్తుతం జట్టులో ఏడుగురు బౌలర్లు ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎక్కువమంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. అందుకే ప్రస్తుత టీమిండియా మోస్ట్ బ్యాలెన్డ్స్డ్గా ఉంది. సెలక్షన్లో ఐపీఎల్ ప్రదర్శణను పరిగణలోకి తీసుకోలేదు. రిజర్వ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశాం. గత కొద్ది కాలంగా మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరికి తోడు అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా కూడా ఉంటే మంచిదని భావించాం. సైనీ, ఖలీల్‌లకు అవకాశం రావచ్చు.. నాలుగో స్థానం కోసం రాయుడు, శంకర్లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్ బ్యాటింగ్, బౌలింగే కాదు మంచి ఫీల్డర్ కూడా. దీంతో శంకర్ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీల గురించి కూడా చర్చించాం. జట్టుకు మరో పేసర్ అవసరమనుకుంటే వీరిద్దరిలో ఒకరు ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం ఉంది. బ్యాకప్ కీపర్‌గా అనభవం దృష్ట్యా దినేశ్ కార్తీక్ వైపే మొగ్గు చూపాం’అని ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు వివరించాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తొలి పోరులో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తరువాతి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. -
ప్రపంచ కప్ సన్నాహాలకు ఐపీఎల్ తోడ్పడుతుంది
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ముంగిట ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటం మన క్రికెటర్లకు మేలు చేస్తుందని భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రతిష్ఠాత్మక టోర్నీకి ముందు లీగ్ ఆడటం ఓ రకంగా మంచి సన్నాహకమేనని ఆయన అన్నారు. శుక్రవారం ఇక్కడ ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎమ్మెస్కే ఈ వ్యాఖ్యలు చేశారు. భిన్నమైన ఒత్తిడిలో ఆటగాళ్లు రాటుదేలేలా చేసే ఐపీఎల్‌ను ‘భారత అంతర్జాతీయ టోర్నీ’గా ఆయన అభివర్ణించారు. ‘లీగ్‌పై నా దృష్టి కోణం భిన్నమైనది. ప్రత్యేక శిక్షణ ద్వారానో, నెట్స్‌లో ప్రాక్టీస్ సెషన్ల ద్వారానో కంటే, పోటీ వాతావరణాన్ని కల్పించే ఐపీఎల్ ఆడటం ఎక్కువ ప్రయోజనకరం. ఉదాహరణకు ఇంగ్లండ్‌లోనే జరిగిన 2013, 2017 చాంపియన్స్ ట్రోఫీలనే తీసుకోండి. ఆ సంవత్సరాల్లో భారత క్రికెటర్లు ఐపీఎల్ ఆడి చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. ఈ రెండుసార్లూ మనం ఫైనల్ చేరాం’ అని ఎమ్మెస్కే వివరించారు. నాలుగు ఓవర్ల కోటానే ఉంటుంది కాబట్టి ఐపీఎల్ కారణంగా భారత బౌలర్లపై భారం పడదన్నారు. చక్కటి పోటీ వాతావరణంలో జరిగే లీగ్‌లో ఆడిన అనుభూతి... సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటే రాదని, కాకపోతే వారు ఫిట్నెస్ను ఎలా కాపాడుకుంటారనేదే కీలకమని ఎమ్మెస్కే అన్నారు. -
కార్తీక్ ఓకే.. పంత్ కూడా పోటీలోనే ఉన్నాడు
న్యూఢిల్లీ: వచ్చే వరల్డ్‌కప్‌కు తాము ఎంపిక చేసే భారత జట్టులో దినేశ్ కార్తీక్‌కు దారులు మూసుకుపోలేదని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మరోమారు స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కార్తీక్‌కు చోటివ్వకపోవడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. దినేశ్‌ను వరల్డ్‌కప్ నుంచి తప్పించే క్రమంలోనే అతనికి ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు నుంచి ఉద్వాసన పలికారనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపై హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంఎస్‌కు ప్రసాద్ మరోసారి క్లారిటి ఇచ్చాడు. ‘దినేశ్ కార్తీక్ వరల్డ్‌కప్ చాన్స్ లేదనే విషయాన్ని మేము చెప్పలేదు కదా. ప్రస్తుత భారత జట్టులో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. గత కొంతకాలంగా దినేశ్ కార్తీక్ మ్యాచ్ ఫినిషింగ్ పాత్ర పోషిస్తున్నాడు. అతనికి ఇచ్చినా అవకాశాల్ని కార్తీక్ సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. అయితే వికెట్ కీపర్ బ్యాకప్ స్లాట్ కూడా ముఖ్యమే. దాంతోనే రిషభ్‌కు అవకాశాలు కల్పిస్తున్నాం. దినేశ్ కార్తీక్ ప్రదర్శనపై మాకు ఎటువంటి అనుమానం లేదు. కానీ రిషభ్ పంత్ కూడా అంతే వేగంగా దూసుకొచ్చాడు. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పరిణితి సాధించిన క్రికెటర్ రిషభ్. ఇద్దరూ సమానంగానే వారి వారి అవకాశాల్ని ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే సరైన సమయంలో జట్టు అవసరాన్ని బట్టి వారికి అవకాశాలు ఇస్తున్నాం’ అని ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. -
‘ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎలా స్పందిస్తాయో’
ముంబై: వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత క్రికెటర్లకు ఐపీఎల్ నుంచి విశ్రాంతి ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాకాలం కిందటే తెరపైకి వచ్చింది. దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ అంశంపై బోర్డు పెదవి విప్పింది. మార్చి 23న మొదలయ్యే ఐపీఎల్ మే 12న ముగియనుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే మే30వ తేదీన ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో ప్రపంచక్‌పలో ఆడే క్రికెటర్లపై ఐపీఎల్లో భారం పడకుండా చూడాలని ఫ్రాంచైజీలను కోరనున్నట్టు బోర్డు వెల్లడించింది. ‘ఆ ఆటగాళ్లను ఎన్ని మ్యాచ్‌లు ఆడించాలి. ఎన్నింటికి విశ్రాంతి ఇవ్వాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ విషయాలను వెల్లడిస్తాం’ అని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ప్రధానంగా వరల్డ్‌కప్‌కు వెళ్లే 18 మంది భారత ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేశామని, వీరిని సాధ్యమైనన్ని తక్కువగా ఐపీఎల్ ఆడించాలన్నదే తమ ప్రతిపాదనగా చెప్పాడు. అయితే స్టార్ క్రికెటర్లను ఐపీఎల్ ప్రాంచైజీలు దూరంగా పెట్టడం అనుకున్నంత తేలిక కాదని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌధురి అభిప్రాయపడ్డాడు. దీనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎలా స్పందిస్తాయో చూడాలన్నాడు. కానీ క్రికెట్ అభివృద్ధి, దేశ ప్రయోజనాల రీత్యా ఫ్రాంచైజీలు సానుకూలంగా స్పందించగలవన్న ఆశాభావం ప్రకటించాడు. -
ఒకటే స్థానం ఖాళీ!
వన్డే వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటిగా భారత జట్టు బరిలోకి దిగబోతోంది. బలమైన బ్యాటింగ్ లైనప్, ఇంగ్లండ్ పిచ్‌లకు సరిపోయే పదునైన బౌలింగ్‌తో పాటు ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వన్డేల్లో టీమిండియా ఇటీవలి ప్రదర్శన చూస్తే సాధారణ క్రికెట్ అభిమానికి కూడా వరల్డ్ కప్ జట్టులో ఎవరెవరు ఉంటారో ఒక అంచనా వచ్చేసి ఉంటుంది. ఆసియా కప్ టైటిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సిరీస్ విజయాల తర్వాత టీమ్ కూర్పుపై సెలక్షన్ కమిటీకి కూడా మరింత స్పష్టత లభించింది. ఇదే అంశంపై సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తన అభిప్రాయం వెల్లడించారు. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోబోమని... టీమ్ ఎంపికపై ఎలాంటి సందేహాలు లేకుండా మరింత స్పష్టతనిచ్చారు. ముంబై: వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక దాదాపుగా పూర్తయిందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. 15 మంది సభ్యుల జట్టులో 14 మంది విషయంలో తాము దాదాపు నిర్ణయానికి వచ్చేశామని, మిగిలిన ఒకే ఒక స్థానం కోసం గట్టి పోటీ ఉందని ఆయన చెప్పారు. నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు జట్టు ఎంపిక సాఫీగానే అనిపించిందని, అయితే ఇటీవల అవకాశం ఇచ్చిన కుర్రాళ్లంతా సత్తా చాటడంతో తమకు ‘ఆరోగ్యకరమైన తలనొప్పి’ మొదలైందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. జట్టులో ధోని పాత్ర ఎంత కీలకమో కూడా ఆయన స్పష్టతనిచ్చారు. వరల్డ్ కప్‌కు సంబంధించి ప్రసాద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... టీమ్ ఎంపికపై... వన్డేల్లో మన టీమ్ అద్భుత ప్రదర్శన తర్వాత వరల్డ్ కప్ టీమ్ ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే. ఆఖరి క్షణంలో ఒక మార్పు మినహా మిగతా ఆటగాళ్ల గురించి ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఒకటే స్థానం ఖాళీగా ఉంది. అది కూడా ఇటీవల కొత్త ఆటగాళ్ల చక్కటి ప్రదర్శన తర్వాత మా తుది ఎంపికపై పునరాలోచించుకోవాల్సి వచ్చింది. బహుశా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత ఆ స్థానం ఖాయం అవుతుంది. 2011 వరల్డ్ కప్ తరహాలో సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉంటుంది. అప్పుడు సచిన్, సెహ్వాగ్‌లే కాకుండా కోహ్లి, శ్రీశాంత్‌లాంటి కుర్రాళ్లూ ఉన్నారు. మిగిలిన స్థానానికి ఉన్న పోటీపై... చాలా మంది బరిలో ఉన్నారని మాత్రం చెప్పగలను. రిషభ్ పంత్, విజయ్ శంకర్, రహానేలతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఇంకా రేసులోనే నిలిచారు. గత ఏడాది కాలంగా పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనే విజయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శన జట్టు కూర్పు గురించి మరో కోణంలో ఆలోచించేలా చేసింది. దేశవాళీ క్రికెట్లో రహానే పరుగుల వరద పారించాడు కాబట్టి అతడిని ఇంకా పూర్తిగా పక్కన పెట్టలేదు. వీరందరినీ దాటాలంటే రాహుల్ మిగిలిన కొద్ది సమయంలో మాత్రం భారీగా పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటికే నలుగురు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్ ఉన్నారు. వీరందరినీ తెలుసుకోలేం. వరల్డ్ కప్ కోసం కొన్ని లెక్కలను చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 20 మందితో జాబితా మా ముందుంది. కాబట్టి వచ్చే ఐపీఎల్లో ప్రదర్శన ఎలా ఉన్నా దానిని మాత్రం ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించాం. మిడిలార్డర్ సమస్యలపై... ఇంగ్లండ్ గడ్డపై 1–2తో వన్డే సిరీస్ ఓడిపోయిన సమయంలో మా మిడిలార్డర్ సమస్యగా కనిపించింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌ల తర్వాత దానికి పరిష్కారం లభించినట్లే. మిడిలార్డర్ బాధ్యతల గురించి స్పష్టంగా వివరించి అవకాశాలు ఇచ్చిన వారందరూ తమ పాత్రకు న్యాయం చేయడం సంతోషకరం. ఇంకా చిన్న చిన్న లోపాలేమైనా ఉంటే ఆటగాళ్లే చూసుకుంటారు. నేను ఏ ఒక్కరి పేరు చెప్పను గానీ మిడిలార్డర్ సమస్య తీరినట్లుగానే భావిస్తున్నాం. రాయుడుపై విశ్వాసం ఉంచడంపై... మన మిడిలార్డర్ పటిష్టంగా ఉండాలి. నాలుగో స్థానంలో కోసం మేం ప్రయత్నించినవారి ఆట మాకు సంతృప్తి కలిగించలేదు. ఆ స్థానంలో అనుభవంతో పాటు పరిణతి అవసరం. టి20 ఫార్మాటే అయినా ఐపీఎల్ ప్రదర్శనతోనే రాయుడును వన్డేలకు ఎంపిక చేశాం. తనకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకున్న అతను, ఆ స్థానానికి సరైనవాడినేనని నిరూపించుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లపైనే నమ్మకం... వాస్తవానికి 2017 చాంపియన్స్ ట్రోఫీ తర్వాతి నుంచి మేం వరల్డ్ కప్ జట్టు నిర్మాణం గురించి ఆలోచించాం. ఆ టోర్నీలో భారత్ బాగానే ఆడి ఫైనల్ చేరింది. కానీ స్పిన్‌లో మరింత వైవిధ్యం ఉంటే బాగుంటుందని భావించాం. అందుకే చహల్, కుల్దీప్లకు అవకాశాలిచ్చాం. ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే చూశారుగా. వీరిద్దరు కలిసి ఆడిన మ్యాచ్‌లలో భారత్ 70 శాతం (27 మ్యాచ్‌లలో 19 గెలిచి, 7 ఓడింది) విజయాలు సాధించింది. వారి వల్ల బౌలింగ్ బలం పెరిగింది. వరల్డ్ కప్ జరిగే సమయంలో ఇంగ్లండ్‌లో పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. అలాంటప్పుడు ఆఫ్ స్పిన్నర్లకంటే లెగ్ స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపుతారు కూడా. ధోని పాత్ర, అతని ప్రాధాన్యతపై... ధోని ఇప్పటికీ మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ కప్‌లో కూడా అందరికంటే అతనే కీలకం కానున్నాడు. విరాట్ కోహ్లికి సలహాలివ్వడంలో గానీ వికెట్ కీపర్‌గా గానీ మైదానంలో కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయడంలో గానీ అతడిని మించినవారు లేరు. ఇటీవల సిరీస్‌ల తర్వాత తన సహజశైలిలో దూకుడుగా ఆడతానని ధోని సందేశం ఇచ్చేశాడు. మనందరికీ తెలిసిన పాత తరహా ధోనిలా భారీ షాట్లతో చెలరేగితే మాకందరికీ ఆనందం. మధ్యలో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అతనిలో కొంత జోరు తగ్గి ఉండవచ్చు కానీ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. వరల్డ్ కప్‌కు ముందు ఐపీఎల్ సైతం ఆడతాడు కాబట్టి సమస్య లేదు. బ్యాటింగ్ ఫామ్ మాత్రం కొంత తగ్గినా... అతని కీపింగ్‌పై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. విరాట్ చెప్పినట్లు ధోనిపై విపరీతమైన అంచనాలు ఉండటమే సమస్య. మనకెప్పుడూ ధోని తొలి రోజులు గుర్తుకొచ్చి అలాగే ఆడాలని కోరుకుంటాం. ఇప్పుడు విఫలమవుతున్నాడని విమర్శిస్తాం. కానీ అతని స్థాయి ఆటగాళ్లకు తమనుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాము విఫలమైతే వారు కూడా సహజంగానే బాధపడతారు! 2016 సెప్టెంబర్‌లో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ బాధ్యతలు తీసుకున్న నాటినుంచి భారత్ 131 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే 89 గెలిచి, 33 ఓడింది. ఈ సమయంలో భారత్ గెలుపోటముల నిష్పత్తి (2.696) అన్ని జట్లకంటే చాలా ఎక్కువగా ఉంది. -
మా వరల్డ్‌కప్ ప్రణాళికల్లో ఆ ముగ్గురు..: ఎంఎస్కే
ముంబై: మరో మూడు నెలల్లో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారత క్రికెట్ జట్టు తమ కసరత్తులు ముమ్మరం చేసింది. ఒకవైపు యువ ఆటగాళ్లను పరీక్షిస్తూనే వారి బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా ఒక కన్నేసి ఉంచింది. దీనిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఈ సిరీస్‌లో విజయ్ శంకర్ బ్యాటింగ్‌లో భారీ షాట్లు ఆడి తాను కూడా వరల్డ్‌కప్ రేసులో ఉన్నాననే సంకేతాలు పంపాడు. తాజాగా విజయ్ శంకర్ స్థానంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సూత్రప్రాయంగా స్పష్టత ఇచ్చాడు. ఆ మెగా టోర్నీలో భాగంగా విజయ్ శంకర్ కూడా తన ప్రణాళికల్లో ఉన్నాడంటూ పేర్కొన్నాడు. విజయ్‌తో పాటు రిషభ్ పంత్, అజింక్యా రహానేలు కూడా వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టు ప్రాబబుల్స్ కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలిపాడు. ఏప్రిల్ 23వ తేదీ జట్లు ఎంపికకు చివరి తేదీ కాగా, ఈలోపు పూర్తిస్థాయి జాబితాను సిద్ధం చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ తర్జన భర్జన పడుతోంది. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎంఎస్కే ప్రసాద్.. విజయ్ శంకర్, రిషభ్ పంత్, అజింక్యా రహానేలు వరల్డ్‌కప్ రేసులో ఉన్నట్లు తెలిపాడు. ఇప్పటికే రిషభ్ పంత్ తానేంటో నిరూపించుకోగా, తాజాగా విజయ్ శంకర్‌పై మేనేజ్మెంట్ ఒక స్పష్టతకు వచ్చినట్లు పేర్కొన్నాడు. గత రెండేళ్ల నుంచి భారత్-ఎ తరఫున విజయ్ శంకర్ నిలకడగా ఆడుతున్న విషయాన్ని కూడా ఎంఎస్కే ఈ సందర్భంగా తెలిపాడు. ఇక దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న రహానే వరల్డ్‌కప్ ఎంపిక రేసులో ముందువరుసలో ఉన్నాడన్నాడు. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌లో మూడో ఓపెనర్‌గా రహానేను పరిశీలించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవల లిస్ట్-ఎ క్రికెట్లో రహానే తన మార్కు ఆట తీరును చూపించాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 74.62 సగటుతో 597 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
ఆ బెంగ మాకు లేదు: ఎంఎస్కే ప్రసాద్
న్యూఢిల్లీ: నాణ్యమైన క్రికెటర్ల కోసం బెంగపడాల్సిన అవసరం భారత క్రికెట్ జట్టుకు లేదని సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు నైపుణ్యమున్న క్రికెటర్లతో కళకళలాడుతోందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా టీమిండియాలోకి వచ్చే యువ క్రికెటర్ల సంఖ్య పెరిగిందన్న ఎంఎస్కే.. ఈ సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్ అత్యుత్తమంగా ఉండటమేనని వెల్లడించాడు. ‘దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు చూడటమంటే నాకు చాలా ఇష్టం. సాధ్యమైనంత వరకూ ఎక్కువ దేశవాళీ మ్యాచ్‌లు చూడటానికి ప్రాధాన్యతనిస్తా. భారత్ క్రికెట్ భవిష్యత్ అంతా అక్కడే ఉంది. ప్రతి ఏడాది దేశవాళీ క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వస్తున్నారు. అందుకే దేశవాళీ మ్యాచ్‌లకు అధిక ప్రాముఖ్యతనిస్తాను’ అని ఎంఎస్కే పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం పోటీ పెరగడం చాలా ఆనందంగా ఉందని, రిజర్వ్ బెంచ్ బలం చూస్తుంటే, మరో దశాబ్దం పాటు భారత జట్టుకి ఆటగాళ్ల విషయంలో ఎటువంటి బెంగ ఉండదన్నాడు. నాణ్యమైన ఆటగాళ్లను ఎదిగి పట్టుకోవడంలో భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందన్నాడు. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన పలువురు యువ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రాటుదేలిన వారేనని తెలిపాడు. -
సమిష్టి కృషితో టీమిండియా విజయాలు
సాక్షి, చేబ్రోలు (పొన్నూరు): సమిష్టి కృషితో భారత క్రికెట్ జట్టు 70 ఏళ్ల తర్వాత విదేశాల్లో మంచి విజయాలు సాధించిందని భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. సోమరావం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులోని సెయింట్ మేరీస్ కళాశాలలో జాతీయస్థాయి సెయింట్ మేరీస్ క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెస్కే ప్రసాద్ హాజరై ప్రసగించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ పర్యటనకు ముందు జరిగిన పలు అంశాలను ఆయన ఈ సమావేశంలో వెల్లడించారు. క్రికెట్ జట్టు ఎంపిక సమయంలో బోర్డు సభ్యుల మధ్య సామరస్యమైన వాదనలు జరిగాయన్నారు. ఒకటి రెండు ఎంపికల సమయంలో యువకులకు అవకాశం ఇవ్వాలని తాను ప్రయత్నించగా, మిగిలిన బోర్డు సభ్యులు, కెప్టెన్ కోహ్లి అనుభవం ఉన్న వారి కోసం పట్టుబట్టారన్నారు. అయితే సిరీస్ గెలిచిన తరువాత ఆ ఇద్దరు పనికిరాకుండా పోయారన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మిగిలిన సభ్యులు కూడా తరువాత జరిగిన పొరపాటును అంగీకరించటం వారి గొప్పదనమన్నారు. హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ తదితరులు ఆస్ట్రేలియా సిరీస్‌లో తమ ప్రతిభను చూపారన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషితో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను తీర్చిదిద్దటం కోసం ప్రతి ఏటా రూ.4 కోట్ల ఖర్చుతో నాలుగు చోట్ల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. -
సెలెక్టర్లకు బీసీసీఐ రూ.20 లక్షల నజరానా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు సిరీస్ విజయంతో జాతీయ జట్టు సెలెక్టర్లకు బీసీసీఐ రూ. 20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సహా కమిటీలోని సెలెక్టర్లు దేవాంగ్ గాంధీ, జతిన్ పరంజపే, గగన్ ఖోడా, శరణ్‌దీప్ సింగ్‌లకు ఈ మొత్తం దక్కనుంది. ఆసీస్ పర్యటనకు పటిష్టమైన జట్టును ఎంపిక చేశారని ఈ సందర్భంగా వారిని క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ ప్రశంసించారు. -
ద్రవిడ్‌తో చర్చించిన తర్వాతే..
న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునే అన్ని అర్హతలు యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌కు ఉన్నాయని సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. అతనిలో విశేషమైన టాలెంట్ దాగి ఉన్నందువల్లే జాతీయ జట్టులో తొందరగా స్థానాన్ని సాధించాడన్నాడు. ప్రధానంగా జట్టు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేసే సత్తా శుబ్మాన్ సొంతమన్నాడు. అటు ఓపెనర్‌గా,ఇటు మిడిల్ ఆర్డర్లో కూడా శుబ్‌మన్ విశేషంగా రాణించగలడన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మల స్థానంలో శుబ్‌మన్‌ను పరీక్షిస్తామన్నాడు. అయితే శుబ్‌మాన్‌కు వరల్డ్‌కప్‌లో చోటు దక్కుతుందా? లేదా ? అనే విషయంపై ఇప్పుడేమీ మాట్లాడుదలుచుకోలేదన్నాడు. భారత్ జట్టులో శుబ్‌మన్‌కు అవకాశం కల్పించే సందర్భంలో భారత యువ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చర్చించామన్నాడు. ద్రవిడ్‌తో శుబ్మాన్ అంతర్జాతీయ అరంగేట్రంపై చర్చించిన పిదప అతనికి చోటు కల్పించే విషయంలో ఒక స్సష్టతకు వచ్చామన్నాడు. దేశవాళ్లీ మ్యాచ్‌ల్లో యువ క్రికెటర్ల ఆట ఎలా ఉందనే విషయంపై ద్రవిడ్‌తో చర్చిస్తుంటామన్నాడు. అలాగే సీనియర్ క్రికెటర్ల ఆట తీరుపై కోచ్ రవిశాస్త్రిని అడిగి తెలుసుకుంటామన్నాడు. ఇది రెగ్యులర్ జరిగే ప్రక్రియ అని ఎంఎస్కే అన్నాడు. అలా వచ్చిన అవకాశాల్ని పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలు సద్వినియోగం చేసుకోవడం కచ్చితంగా భారత జట్టుకు శుభపరిణామని సెలక్షన్ కమిటీ చీఫ్ అన్నాడు. శుబ్‌వార్త... -
‘మా వరల్డ్‌కప్ ప్రణాళికల్లో రిషభ్ ఉన్నాడు’
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి యువ క్రికెటర్ రిషభ్ పంత్‌ను తప్పించడంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. కేవలం రిషభ్‌కు విశ్రాంతి మాత్రమే ఇచ్చామని, జట్టు నుంచి ఉద్వాసన పలకలేదన్నాడు. అతనొక ఎదుగుతున్న క్రికెట్ విజేత అంటూ ప్రశంసలు కురిపించిన ఎంఎస్కే ప్రసాద్.. తమ వరల్డ్‌కప్ ప్రణాళికల్లో రిషభ్ కూడా ఉన్నాడని స్సష్టం చేశాడు. ‘ఆస్ట్రేలియాలో రిషభ్ పంత్ నాలుగు టెస్టులు, మూడు టీ20లు ఆడాడు. ఎడతెరపి లేని ఆట అతడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపింది. అతడికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరం. ఆ తర్వాత ఇంగ్లాండ్ లయన్స్‌పై ఎన్ని మ్యాచ్‌లు ఆడగలడో చూస్తాం. పంత్ మా ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నాడు. అతడో విజేతగా రూపొందుతున్నాడు. అతడి శక్తియుక్తులేంటో అతడికింకా పూర్తిగా తెలియదు. అవసరానికి తగినట్టు ఆడగలనని నిరూపించాడు. టెస్టులకు ఎంపిక చేసినప్పుడు అతడి కీపింగ్ ప్రతిభ గురించి అందరూ పెదవి విరిచారు. ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 11 క్యాచ్ అందుకున్నప్పుడు, ఆస్ట్రేలియాలో రికార్డులు బద్దలు చేసినప్పుడు మా అంచనా నిజమైంది’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు. జనవరి 23వ తేదీ నుంచి భారత్-ఎ-ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య అనధికారిక ఐదు వన్డేల సిరీస్‌తో పాటు రెండు టెస్టుల సిరీస్ జరుగనుంది. భారత్-ఎ తరఫున వన్డే సిరీస్‌లో రిషభ్ ఆడనున్నాడు. -
విహారి ఓపెనర్‌గా విఫలమైనా...
మెల్బోర్న్: ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారి ఓపెనర్‌గా విఫలమైతే మిడిలార్డర్లో మరిన్ని అవకాశాలిస్తామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లకు తగినన్ని టి20 అవకాశాలు ఇచ్చేందుకే ధోనికి విశ్రాంతి కల్పించామని ఆయన వివరించారు. దీంతో కుర్రాళ్లను పరిశీలిస్తున్నామని చెప్పకనే చెప్పిన ఈ చీఫ్ సెలక్టర్ ఆసీస్‌లో 2020లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ధోని ఆడడనే సంకేతాలిచ్చాడు. రవీంద్ర జడేజాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేసే సమయంలో అతను ఫిట్నెస్తోనే ఉన్నట్లు చెప్పాడు. రెగ్యులర్ ఓపెనర్లు రాహుల్, విజయ్ పదేపదే నిరాశపర్చడంతో టీమ్ మెనేజ్మెంట్ విహారి, మయాంక్ అగర్వాల్‌లతో ‘బాక్సింగ్ డే’ టెస్టును ఓపెన్ చేయించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండే టెస్టులాడిన విహారి విఫలమైతే పరిస్థితి ఏంటని ప్రశ్నకు సమాధానమిస్తూ ‘విఫలమైనా అవకాశాలు సజీవంగా ఉంటాయి. దేశవాళీ క్రికెట్లో అతని ఆటను ప్రత్యక్షంగా గమనించా. కూకాబురా బంతుల్ని ఎదుర్కొనే సత్తా అతనిలో ఉంది’ అని అన్నాడు. 1999 పర్యటనలో మెల్బోర్న్లో ఎమ్మెస్కే కూడా ఓపెనర్‌గా దిగినా... స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ ధాటికి నిలువలేకపోయాడు. దీనిపై అతను మాట్లాడుతూ అవకాశాల్ని అంచనాల్ని తాను అందుకోలేకపోయానని కానీ ఈ యువ ద్వయం (విహారి, మయాంక్) రాణిస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. -
రవిశాస్త్రి వ్యాఖ్యలకు ఎంఎస్కే ఘాటు రిప్లై!
మెల్బోర్న్: ఆసీస్ పర్యటనలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్ జట్టు కూర్పుపై మీడియా ప్రతినిధులతో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకోలేకపోవడంపై రవిశాస్త్రి ఇచ్చిన వివరణపై చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అసహనం వ్యక్తం చేశాడు. ‘భారత్ జట్టు ఎంపిక ముందు రోజు సాయంత్రం కచ్చితంగా ఆటగాళ్ల ఫిట్నెస్ రిపోర్టులని కమిటీ తెప్పించుకుంటుంది. అలానే ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే ముందు కూడా రిపోర్టుల్ని పరిశీలించాం. అందులో రవీంద్ర జడేజా పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నట్లుగా తెలిసింది. అందుకే.. అతడ్ని జట్టులోకి ఎంపిక చేశాం. ఈ ఎంపిక తర్వాత.. జడేజా.. రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. అక్కడ దాదాపు 60 ఓవర్లకిపైగా బౌలింగ్ కూడా చేశాడు. ఒకవేళ అతను ఫిట్‌గా లేకపోతే.. ఎలా బౌలింగ్ చేస్తాడు..? కాబట్టి.. జడేజా ఫిట్‌గా లేడనే మాటల్లో నిజం లేదు' అని రవిశాస్త్రి వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు ఎమ్మెస్కే. ఆసీస్‌తో రెండో టెస్టు అనంతరం కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ.. జడేజాను ఎంపిక చేయకపోవడం తాము చేసిన తప్పిదంగా పేర్కొన్నాడు. ఆసీస్ స్పిన్నర్ లయన్ చెలరేగిన చోట నలుగురు పేసర్లతో చేసిన ప్రయోగం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదన్నాడు. కాగా, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి రవీంద్ర జడేజా గాయంతోనే ఆసీస్ పర్యటనకు వచ్చాడని రవిశాస్త్రి పేర్కొనడం ఇప్పుడు టీమిండియా క్రికెట్లో పెద్ద దుమారం రేపింది. రవిశాస్త్రి వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు ఖండించగా, ఆ వ్యాఖ్యలతో చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే సైతం విభేదించడం హాట్‌టాపిక్ అయ్యింది. ఇక్కడ చదవండి: జడేజా పూర్తి ఫిట్‌గా లేడు బాక్సింగ్‌డే టెస్ట్ భారత జట్టు ఇదే! -
రోహిత్‌పై అప్పుడెందుకు వేటేశారు: సెహ్వాగ్
న్యూఢిల్లీ : గత టెస్ట్ సిరీస్‌ల్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై ఎందుకు వేటేశారో సమాధానం చెప్పాలని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెలక్టర్లను ప్రశ్నించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘ భారత గడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రోహిత్ ఒక శతకం, హాఫ్ సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమయ్యాడు. అంత మాత్రానా రోహిత్‌ను టెస్ట్‌లకు దూరం పెడ్తారా? కనీసం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు కూడా ఎంపికచేయలేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఎంత మంది బ్యాట్స్‌మెన్ రాణించారు? ఒక్క రోహిత్‌నే ఎందుకు టెస్టుల నుంచి దూరం పెట్టారు. సెలక్టర్లు సమాధానం చెప్పాలి. అతను వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేశాడన్న విషయం మర్చిపోవద్దు. టెస్టు జట్టులో తన స్థానం ఎంటో తెలుసుకోకపోవడం అతని కర్మా? వన్డేల్లో అద్భుతంగా రాణించి, టెస్ట్‌ల్లో చోటు దక్కని బ్యాట్స్‌మెన్ ప్రపంచంలోనే ఎవరూ లేరు.’ అని సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమవడంతో రోహిత్‌ను అఫ్గాన్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్టు, ఇంగ్లండ్‌తో 5 టెస్టులకు దూరం పెట్టారు. దీంతో రోహిత్ టెస్ట్ కెరీర్ ముగిసిందని అందరు భావించారు. కానీ ఆసియా కప్, వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించడంతో ఆస్ట్రేలియా పర్యటనలో 4 టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. -
ఆ స్థాయి ఆల్ రౌండర్ కనిపించలేదు: చీఫ్ సెలక్టర్
ముంబై: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు, వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టీ20, టెస్టు సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఇక్కడ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తప్పించారు సెలక్టర్లు. ఇదిలా ఉండగా ఈ మూడు సిరీస్‌లకు సంబంధించిన జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు కూడా ఎక్కడా చోటు కల్పించలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో హార్దిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ కారణం చేతనే హార్దిక్‌ను తప్పించారనే వాదన వినిపించింది. కాగా, గత నెలలో ఆసియాకప్‌లో భాగంగా లీగ్ మ్యాచ్‌లో హార్దిక్ గాయపడ్డాడు. దాని నుంచి హార్దిక్ ఇంకా కోలుకోలేకపోవడంతోనే విశ్రాంతి అనివార్యమైందనేది ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యాల ద్వారా తెలుస్తోంది. ‘హార్దిక్ పాండ్య స్థాయిలో సామర్థ్యం గల ఓ పూర్తిస్థాయి ఆల్‌రౌండర్ మాకు కనిపించలేదు. పాండ్య బౌలింగ్‌తో పాటు, బ్యాట్‌తోనూ సత్తా చాటగలడు. కానీ ఈ సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో అతని స్థాయిలో ప్రదర్శన చేసే ఆల్‌రౌండర్ భారత జట్టులో ఏ ఆటగాడిలోనూ కనిపించలేదు. అతని సామర్థ్యాలకు సమానంగా ఉన్న ఆటగాడు దొరకడం కూడా ప్రస్తుతం కష్టమే. ఆ కారణం చేతనే జట్టులో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయలేకపోయాం. అయితే బంతితో రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్ టెస్టు సిరీస్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటగలడని ఆశిస్తున్నాం. భువీ ఆల్‌రౌండర్ ప్రదర్శన పట్ల మాకు విశ్వాసం ఉంది’ అని తెలిపాడు.