శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెస్కే ప్రసాద్
Published Thu, Sep 14 2017 2:22 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం బీసీసీఐ సెలక‌్షన్ కమిటీ చైర్మన్ ఎం.ఎస్.కే ప్రసాద్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నఆయన ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపం వద్ద ఆలయ అర్చకులు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు అధ్బుత ప్రదర్శన చేస్తోందని రాబోయే ఆస్ర్టేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Advertisement
Advertisement