ఆస్ట్రేలియా సీరిస్‌ గెలుస్తాం.. | Cricket selection committee chairman MSK Prasad visit the tirumala | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా సీరిస్‌ గెలుస్తాం..

Published Thu, Sep 14 2017 8:12 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

ఆస్ట్రేలియా సీరిస్‌ గెలుస్తాం..

ఆస్ట్రేలియా సీరిస్‌ గెలుస్తాం..

సాక్షి, తిరుమల: భారత క్రికెట్‌ జట్టు క్రీడాస్ఫూర్తితో రాణిస్తోందని క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. ప్రస్తుతం జరగనున్న ఆస్ట్రేలియా సీరిస్‌ను గెలుస్తామని అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే విరాట్‌ కొహ్లీ సేన విజయాల బాటలో నడుస్తోందని కొనియాడారు.

అదే స్ఫూర్తితోనే టీం ఇండియా అన్ని పోటీల్లోనూ విజయాలు సాధిస్తుందనే ఆశాభావాన్ని ఎమ్మెస్కే వ్యక్తం చేశారు. శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.  ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. టీం ఇండియా వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది. ఆస్ట్రేలియాతో కోహ్లీ సేన ఐదు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 17వ తేదీన తొలి వన్డే  మ్యాచ్‌ చెన్నైలోని  చిదంబరం స్టేడియంలో జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement