తిరుమలలో పలువురు ప్రముఖులు | msk prasad visits tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పలువురు ప్రముఖులు

Published Sun, Sep 25 2016 9:19 AM | Last Updated on Sat, Aug 18 2018 6:24 PM

msk prasad visits tirumala

తిరుమల: తిరుమలలో శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్, ఏపీ డీజీపీ ఎన్ సాంబశివరావు ఆదివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శనంలో సమయంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మాడవీధుల్లో భద్రతను సాంబశివరావు పరిశీలించారు. ఉన్నతాధికారులకు సాంబశివరావు పలు సూచనలు చేశారు.

ఇదిలా ఉంటే...  తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామి వారిని 84,787 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement