n sambasiva rao
-
'రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పీఎస్‌లు'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ ఎన్ సాంబశివరావు వెల్లడించారు. అలాగే మోడల్ స్టేషన్లను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలోని నగరంపాలెం, పాత గుంటూరు మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
తిరుమలలో పలువురు ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్, ఏపీ డీజీపీ ఎన్ సాంబశివరావు ఆదివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శనంలో సమయంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మాడవీధుల్లో భద్రతను సాంబశివరావు పరిశీలించారు. ఉన్నతాధికారులకు సాంబశివరావు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే... తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామి వారిని 84,787 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్
విజయవాడ : సంక్రాంతి పండగ సెలవులు పూర్తి కావడంతో గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు వెల్లడించారు. అందుకోసం విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 500 సాధారణ బస్సులు... అలాగే 250 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరో 300 సర్వీసులు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. విజయవాడ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ప్రత్యేక సర్వీసులను ఎండీ సాంబశివరావు పర్యవేక్షించారు. అయితే ఆదివారం సాయంత్రం విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.