ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్ | Passengers heavy rush in vijayawada bus stand | Sakshi
Sakshi News home page

ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్

Published Sun, Jan 17 2016 6:47 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Passengers heavy rush in vijayawada bus stand

విజయవాడ : సంక్రాంతి పండగ సెలవులు పూర్తి కావడంతో గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు వెల్లడించారు. అందుకోసం విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 500 సాధారణ బస్సులు... అలాగే 250 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అలాగే ప్రయాణికుల డిమాండ్ను బట్టి మరో 300 సర్వీసులు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. విజయవాడ బస్టాండ్లో నిలిపి ఉంచిన ప్రత్యేక సర్వీసులను ఎండీ సాంబశివరావు పర్యవేక్షించారు. అయితే ఆదివారం సాయంత్రం విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement