సర్ ఛార్జీలపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం | andhra pradesh government back step on sur charges in apsrtc | Sakshi
Sakshi News home page

సర్ ఛార్జీలపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం

Published Mon, Jul 13 2015 10:53 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

andhra pradesh government back step on sur charges in apsrtc

హైదరాబాద్ : గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాలకు వెళ్లే బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని నారాయణ అన్నారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సర్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement