sur charges
-
కొంచెం ఇష్టం..కొంచెం కష్టం,యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ షాక్!
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు భారీ షాకివ్వనుంది. ప్రస్తుతం మూడు దేశాల్లో మాత్రమే పాస్వర్డ్ షేరింగ్‌పై నెట్ ఫ్లిక్స్ అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అన్నీ దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్‌పై డబ్బులు వసూలు చేయాలని భావిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..చీలీ, కోస్టరికా,పెరులో నెట్‌ఫ్లిక్స్ వినియోగించే యూజర్లు వారి అకౌంట్ క్రెడియన్షియల్స్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలంటే.. అందుకు అదనంగా 2.99డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సర్ ఛార్జీలను మిగిలిన దేశాల్లో సైతం వసూలు చేయనుంది. ఈ ఏడాది విడుదలైన మొదటి త్రైమాసికంలో(జనవరి,ఫిబ్రవరి, మార్చి) 200,000 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రానున్న నెలల్లో మరో 2మిలియన్ల మంది సబ్స్క్రిప్షన్లను కోల్పోవచ్చని అంచనా వేసింది. కాబట్టే మార్కెట్ విలువ నుండి సుమారు $55 బిలియన్ల ఆదాయం తగ్గిపోయింది. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం గతనెల క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో వాటాదారులకు రాసిన లేఖలో సుమారు 100 మిలియన్ల మంది యూజర్లు పాస్‌వర్డ్‌ను షేరింగ్ చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అందుకే సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్‌పై సర్ ఛార్జీలను వసూలు చేయనుంది.అదే జరిగితే సబ్స్క్రిప్షన్ సంఖ్య తగ్గిపోతుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి విరుగుడుగా సబ్స్క్రిప్షన్ ఛార్జీలు తగ్గించి..ఈ ఏడాది (2022) చివరి నాటికి పాస్వర్డ్ షేర్‌పై సర్ చార్జీలను విధించాలని చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే సబ్‌స్క్రిప్షన్‌ను కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు షేర్ చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 ఆ కక్కుర్తితో వందల కోట్ల హాంఫట్,నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులారా బుద్ధొచ్చింది! -
మొబైల్ ఫోన్ సర్వీసులు మరింత ప్రియం
న్యూఢిల్లీ: దేశంలో నానాటికి దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతానంటూ మాటలను వల్లెవేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్నుల మీద పన్నులు విధిస్తూ ఈ ఏడాదిని పన్నుల సీజన్‌గా మార్చి వేశారు. ఇప్పటికే ఈ ఏడాది వివిధ రకాల సెస్‌లు, సర్‌చార్జీల పేరిట వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ప్రజలపై భారం విధిస్తూ వచ్చిన ఆర్థిక మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం ఆ కార్యక్రమం పేరిట 0.5 శాతం సెస్ విధించారు. ముందస్తు ప్రజాభిప్రాయం లేకుండానే ప్రజలపై మరో వెయ్యి కోట్ల రూపాయల భారం మోపారు. వాస్తవానికి స్వచ్ఛభారత్ కోసం రెండు శాతం సెస్ విధించాలనుకున్నారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతో చివరి నిమిషంలో ప్రతిపాదిత సెస్‌లో ఒకటిన్నర శాతం తగ్గించారు. అంటే సమీప భవిష్యత్‌లో అదను చూసుకొని ఆ మిగతా సెస్ శాతం భారాన్ని ప్రజలపైవేసే అవకాశం ఉంది. స్వచ్ఛభారత్ సెస్ వల్ల టెలిఫోన్ నుంచి రైలు ప్రయాణం వరకు, ఉప్పు నుంచి పప్పు వరకు, మంచినీళ్ల నుంచి మద్యం వరకు, రెస్టారెంట్లలో టిఫిన్ నుంచి భోజనం వరకు భారం కానున్నాయి. టెలిఫోన్ సర్వీసులపై ఇప్పటికే 14 శాతం సర్వీసు టాక్స్‌ను వసూలు చేస్తుండగా దానికి 0.5 శాతం ఈ కొత్త సెస్ యాడ్ అయింది. అంటే...ప్రతి వెయ్యి రూపాయల టెలిఫోన్ బిల్లుపై ఇప్పుడు ఐదు రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్ టాక్స్ వర్తించే అన్ని సేవలపై స్వచ్ఛ భారత్ సెస్‌ను వసూలు చేస్తారు. ప్రతి వంద రూపాయలకు 50 రూపాయల చొప్పున సెస్ పడుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఏసీ సౌకర్యంగల మెస్‌లు సరఫరా చేసే ఆహార పదార్థాలు, లిక్కర్, బ్రేవరీస్‌ల నుంచి పంపిణీ జరిగే మద్యంపై ఈ సెస్ విధిస్తారు. ఖరీదైన భవనాలకు, వివిధ పనుల కాంట్రాక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. విమానయాన ట్రావెల్ ఏజెంట్లు, లాటరీ ఏజెంట్లు, లాటరీ డిస్ట్రిబ్యూటర్లు, జీవిత భీమా సంస్థలు అందించే సర్వీసులకు కూడా ఈ సెస్ వర్తిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మార్పిడిలో కూడా సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగంపై కూడా ఆర్థిక భారం పడుతుంది. నవంబర్ 15వ తేదీకి ముందే ఇన్వాయిస్లు రూపొందించి సరకు సరఫరాకాని వారికి నవంబర్ 29 వరకు సెస్ మినహాయింపును ఇచ్చారు. ఆ తర్వాత సర్వీసు టాక్స్ పరిధిలోకి వచ్చే అన్ని లావాదేవీలపై సెస్ విధిస్తారు. 2006 నాటి సర్వీస్ టాక్స్ నిబంధనల ప్రకారమే సర్వీసు విలువను లెక్కేసే సెస్‌ను అంచనా వేస్తారు. ఈ సెస్ కింద వసూలయ్యే మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తారు. -
సర్ ఛార్జీలపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్ : గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాలకు వెళ్లే బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని నారాయణ అన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సర్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.