ప్రయాణికులకు రూ.5లక్షల బీమా సౌకర్యం
Published Wed, May 17 2017 11:16 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
కర్నూలు (రాజ్‌విహార్): బస్సు ప్రయాణికులకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజరు వెంకటేశ్వర రావు బుధవారం ప్రకటలో తెలిపారు. బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు మరిణించినా లేదా శాశ్విత అంగవైకల్యం ఏర్పడినా ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రమాణికులను ఆకర్షించి వారి ఆదరణ పొందేందుకు యాజమాన్యం ఈ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. దీంతోపాటు పల్లె ప్రయాణికుల సౌకర్యార్థం లింక్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టామని, దీంతో గ్రామీణ, మండల ప్రాంతాల నుంచి తిరుపతి, హైదరాబాదు తదితర నిర్ణీత దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఒకేసారి టికెట్ పొందవచ్చునన్నారు. దీంతో చార్జీ తగ్గడంతోపాటు చిల్లర సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సదుపాయాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Advertisement