బస్‌పాస్‌లు విద్యార్థులకు అందజేస్తున్న ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్సారీ
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు) : ఏడాది పొడవునా బస్‌పాస్‌ల కోసం విద్యార్థులు నిరీక్షించాల్సిన పనిలేకుండా ఆర్టీసీ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎ.అన్సారీ సోమవారం ఎంవీపీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రస్తుతం విద్యార్థులు నెలవారి బస్‌పాస్ పొందుతున్నారని, దీనివల్ల వారికి సమయం వృ థా అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏడాది మొ త్తం ఒకేపాస్ ఉండేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
ఈ విధానం ద్వారా ప్రతి విద్యార్థి ఏడాదిలో ఒక్కసారి బస్ పాస్ తీసుకుంటే సరిపోతుందన్నారు. దీంతోపాటు బస్ పాస్‌ల మంజూరులో ఇక నుంచి ఇంటర్‌నెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ముందుగా విద్యార్థులు వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకొని అనంతరం దగ్గరలోని ఆర్టీసీ కేంద్రంలో పాస్‌లు పొందవచ్చన్నారు. ఎంవీపీ, ద్వారకా నగర్, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక, కూర్మనపాలెం, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, మధురవాడ కేంద్రాల్లో బస్ పాస్‌లు పొందవచ్చన్నారు.
గతంలో జారీ చేసే 3 నెలల పాస్‌లో యథాతదంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు 10 నెలలకు రూ.1300, ఇంటర్, పాలిటెక్నికల్ విద్యార్థులకు 11 నెలలకు రూ.1430, డిగ్రీ, పలు వృత్తి విద్యా కోర్సుల వారికి 12 నెలలకు రూ.1560 చొప్పున చెల్లించి బస్ పాస్‌లు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుదేష్‌కుమార్, సుధా బిందు వెంకటరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment