
విశాఖ: నగరంలోని ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
దీనికి సంబంధించి ఆమె వెంట ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయ్యిందని, అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఆమె మెడకు ఉరితాడు బిగించి వాష్ రూమ్ లో పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఆమె కూడా ఉన్న డా క్టర్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.