bus pass
-
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్ పాస్‌లో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ను సంస్థ తెచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ‘జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్‌లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్‌ను హైదరాబాద్, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. ఈ బస్ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్‌కు అతిభారీ వర్ష సూచన! -
మంచిర్యాల జిల్లాలో విద్యార్థులకు ఉచిత పాస్‌ల పంపిణీకి ఆర్టీసీ ఏర్పాట్లు
మంచిర్యాలఅర్బన్: ఈనెల 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. దూరప్రాంతాల నుంచి కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. పాస్‌లు పొందితే బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు నిత్యం వచ్చివెళ్లేందుకు బస్‌పాస్‌లు అవసరంతో ఉచిత రాయితీ పాస్‌లు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లుచేసింది. ఉచిత పాసులు ఇలా.. గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పల్లె వెలుగు బస్సుల్లో 12 ఏళ్ల లోపు(బాలురు) విద్యార్థులంతా 20 కి.మీ దూరం వరకు పాఠశాలకు వెళ్లిరావడానికి రోజు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకునే బాలికల కోసం ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఆర్టీసీ పాస్‌కోసం ఇంట్లో నుంచి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పైసా ఖర్చులేకుండా వెబ్సైట్లో అడిగిన వివరాలు పొందుపర్చి ఫొటో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. www.online.tsrtcpass. in వెబ్సైట్లో రిజిష్టర్ అయితే నమోదు సంఖ్య వస్తుంది. దాన్ని పాస్ కౌంటర్లోని సిబ్బందికి తెలియజేస్తే బస్‌పాస్ పొందవచ్చు. తప్పనిసరిగా ఆయా విద్యాసంస్థలు అంగీకరిస్తేనే పాస్ జారీ అవుతుంది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ.50 చెల్లిస్తే బస్‌పాస్ అందిస్తారు. 35 కి.మీ లోపు రాయితీ పాసులు మంత్లీ స్టూడెంట్ బస్‌పాస్ రాయితీ కూడిన విద్యార్థులు చార్జీలు కేటాయించారు. ప్రైవేట్ పాఠశాలల్లోని 12 ఏళ్లు పైబడిన బాలురతోపాటు కళాశాలల విద్యార్థులు ఆర్టీసీ రాయితీ పాస్‌లు పొందవచ్చు. 35 కి.మీ మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉన్నా బస్‌పాస్‌లకు కి.మీ చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. గుర్తింపుకార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 12 ఏళ్లలోపు బాలురు ఉచిత బస్‌పాస్ ధర రూ.30, 18 ఏళ్లలోపు బాలికలకు ధర రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులకు ప్రయోజనం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం. అంతకుమించి ప్రయాణ సౌకర్యం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీ పేరిట డీడీలు చెల్లించాలి. విద్యార్థులకు బస్‌పాసులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం బస్‌స్టేషన్‌లో బస్‌పాసు కౌంటర్ ఏర్పాటు చేశాం. వివరాలకు 9985445438లో సంప్రదించవచ్చు. – రవీంద్రనాథ్, ఆర్టీసీ డీఎం, మంచిర్యాల ఎంతో ప్రయోజనం.. తమ విద్యార్థులకు బస్‌పాసులు మంజూరు చేయాలంటే ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీ పేరిట డీడీలు రూపంలో నగదు చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ప్రత్యేకంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ కేటాయిస్తుంది. తమ పాఠశాలల్లోని 12 ఏళ్లలోపు బాలురు, పదోతరగతి వరకు బాలికలు ఉచిత పాసులు పొందాలన్నా ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీకి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ఆర్టీసీ ఆదిలాబాద్ పేరిట డీడీలను తీసి సమీపంలోని డిపోల్లో అందజేయాల్సి ఉంటుంది. 200 మంది లోపు విద్యార్థులున్నా పాత, కొత్త ప్రైవేట్ పాఠశాలలు రూ.700, 500లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు రూ.1000, 500 మంది పైన విద్యార్థులున్నా పాఠశాలలు ఆడ్మిస్టేటివ్ చార్జీలు (రెన్యూవల్) రూ.1500, ఆడ్మిస్టేటివ్ చార్జీలు (ఫ్రెష్) కింద రూ.2వేలు చెల్లించాలి. డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు రూ.6వేలు (కొత్తవి), రెన్యూవల్ కోసం రూ.5వేలు చెల్లించాలి. జూనియర్, డిప్లొమా, ఒకేషనల్ యాజమాన్యాలు ఆడ్మిస్టేటివ్ చార్జీలు కింద రూ.5వేలు, రెన్యూవల్ కోసం రూ.4 వేలు చెల్లించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలు డీడీలు చెల్లించాలి విద్యార్థులకు ఉచిత పాస్‌లే కాకుండా రూట్‌పాస్ లు కూడా జారీ చేస్తారు. బస్‌పాసులు పొందడానికి విద్యాసంస్థలు ఆడ్మినిస్ట్రేటివ్ రుసుము చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు దీని నుంచి మినహాయింపు ఉండగా ప్రైవేట్ సంస్థలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యాసంస్థను బట్టి వార్షిక రుసుము నిర్దేశించారు. రుసుము చెల్లించి అనుమతి పొందిన వారికే ఆర్టీసీ ఆన్లైన్లో చోటు లభిస్తోంది. దీని ఆధారంగా విద్యార్థులకు రాయితీ బస్‌పాస్‌ల జారీ కొనసాగనుంది. 3 నెలలు, 6 నెలలు ఇలా కాలపరిమితి కూడిన బస్‌పాస్‌లు కిలోమీటర్ బట్టి రాయితీతో పొందవచ్చు. -
పిల్లల చదువులకు పాసులభారం.. ఐదు కిలో మీటర్లకు రూ.35 వడ్డన
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీలో బస్‌పాస్‌ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యాసంస్థలు ప్రారంభమై పక్షం రోజులు కావడంతో ఆ సంస్థ అధికారులు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం పెరిగిన చార్జీలతోనే విద్యార్థులకు కూడా రాయితీ బస్ పాస్‌లను జారీ చేయనున్నట్లు ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. దీంతో గత ఏడాదితో పొలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులపై అదనంగా భారం పడుతోంది. ఐదు కిలో మీటర్ల ప్రయాణిస్తే పెరిగిన చార్జీల కారణంగా భారం రూ.35 పడుతుండగా ఆపై కిలో మీటర్లు ప్రయాణించే విద్యార్థులకు అదనంగా చెల్లించాల్సిందేనని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు బస్‌పాస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పాఠశాల, కళాశాల యాజమాన్యానికి ఇచ్చిన లాగెన్‌లోకి వెళ్తుంది. ఆ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను ధ్రువీకరించి తిరిగి ఆర్టీసీ అధికారులకు పంపిస్తే ఆయా బస్టాండ్‌లోని కేంద్రాల్లో బస్‌పాస్‌లను పొందవచ్చని పేర్కొంటున్నారు. చదవండి👉🏻ఖైరతాబాద్ భారీ గణనాథుని రూపం ఆవిష్కరణ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు లేవు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అభ్యసించే విద్యార్థులకు ఈ సదుపాయం వర్తించదని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. బస్‌పాస్ పొందాలనుకునే విద్యార్థులు తొలుత అకౌంట్ ఆఫీసర్, టీఎస్ఆర్టీసీ నల్లగొండ పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. యాజమాన్యం ఆ డీడీని తీసుకువచ్చి సంబంధిత బస్టాండ్ బస్సుపాస్ కౌంటర్లలో నమోదు చేయించాలి. అనంతరం ఇనిస్టిట్యూట్ వివరాలు బస్సుపాస్ కౌంటర్లలో పొందుపరుస్తారు. వెంటనే నమోదు చేసిన మొబైల్‌కు యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. 15ఏళ్ల లోపు బాలికలు, 12ఏళ్ల లోపు బాలురకు ఉచితంగా.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా, బాలికలను విద్యలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్టీసీ 15ఏళ్లలోపు బాలికలు, 12ఏళ్లలోపు బాలురకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తోంది. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ చార్జీలపై ఆర్టీసీ రాయితీని అందిస్తోంది. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. చదవండి👉🏻ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు బస్‌పాస్ పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాం. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వారికి కేటాయించిన విధంగా ప్రెష్, రెన్యువల్ ఆడ్మినిస్ట్రేషన్ చార్జీలను తక్షణమే చెల్లించాలి. – బొల్లెద్దు పాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, మిర్యాలగూడ -
స్టూడెంట్స్పై ఆర్టీసీ దెబ్బ.. భారీగా పెరిగిన బస్ పాస్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: ‘ఉరుము ఉరిమి మంగళం మీడ పడ్డట్టు’ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో విద్యార్థి లోకంపై అశనిపాతమే అయింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్ చార్జీలను పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకొనేందుకే ఈ భారాన్ని మోపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం పట్ల విద్యార్ధి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త చార్జీల ప్రకారమే.. సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు,రూట్ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు. చదవండి: ఉప్పల్ కష్టాల్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం ప్రస్తుతం వివిధ రకాల విద్యార్థుల పాస్‌లపై ఆర్టీసీకి ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా చార్జీల పెంపుతో మరో రూ.15 కోట్లకుపైగా అదనంగా లభించనుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులపై రూ.180 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థుల నుంచి ఆర్టీసీ బస్‌పాస్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరించి 15 నుంచి జారీ చేయనుంది. కొత్త చార్జీల ప్రకారమే ఈ పాస్‌లను అందజేయనున్నారు. ఆందోళన ఉద్ధృతం చేస్తాం: ఇప్పటికే కోవిడ్ కారణంగా చదువులకు దూరమైన విద్యార్థులపై బస్‌పాస్ చార్జీల భారం మోపడం దారుణం. నిరుపేద పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది, బస్‌పాస్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతం చేస్తాం. – రాథోడ్ సంతోష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోయలేని భారం బస్‌పాస్ చార్జీలు ఒక్కసారిగా ఇలా పెంచడం అన్యాయం. సిటీబస్సులపై ఆధారపడి కాలేజీకి వెళ్లే నాలాంటి వారికిది ఎంతో భారం. పెంచిన బస్‌పాస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – వంశీ, ఇంటర్ విద్యార్ధి రూట్ పాస్‌లు కిలోమీటర్లు ప్రస్తుతం పెంచిన చార్జీ (రూ.లలో) 4 165 450 8 200 600 12 245 900 18 280 1150 22 330 1350 -
బస్‌పాస్ ఛార్జీలు భారీగా పెంచిన ఆర్టీసీ
-
‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల బస్‌పాస్ చార్జీలను ఆర్టీసీ పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. జనరల్ బస్ టికెట్ (జీబీటీ) పాసులు భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ పాస్ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్ పాస్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెరిగింది. ఎన్జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి.. ఆర్డినరీ పాస్ చార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్–ఆర్టీసీ కోంబో టికెట్ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది. ఇటీవలే సేఫ్టీ సెస్ పేరుతో టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్ చేయటంతో గరిష్టంగా టికెట్ ధర రూ.5 మేర పెరిగింది. గతం లో రౌండాఫ్ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజాగా బస్‌పాస్ చార్జీలను సవరించింది. అసలైన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం సీఎం వద్ద పెండింగులో ఉంది. ఆయన అనుమతిస్తే అవి కూడా పెరగనున్నాయి. -
టీఎస్ఆర్టీసీ దోపిడీ.. రెండు రకాలుగా విద్యార్థులను ముంచుతోంది
సాక్షి,హన్మకొండ: బస్‌పాస్‌ల జారీలో టీఎస్ ఆర్టీసీ దోపిడీకి పాల్పడుతోంది. రెండు రకాలుగా విద్యార్థులను ముంచుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని, సుఖవంతమైన, సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్పుకుంటున్న ఆర్టీసీ.. ప్రయాణికులకు సేవల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు వినవస్తున్నాయి. ప్రయాణికులకు ఆర్టీసీని మరింత చేరువ చేసేల ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో అనేక ట్వీట్లు చేస్తున్నారు. మరో వైపు కనిపించకుండా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నెలవారీగా జారీ చేసే పాస్‌లలో తమకు అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు మొత్తుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించకుండా అనారోగ్యంతో కానీ, మరే ఇతర కారణాలతో ఆలస్యంగా విద్యార్థి పాస్ తీసుకుంటే ఆలస్యం అయినందుకు అపరాధ రుసుం వసూలు చేయడంతో పాటు రోజులు తగ్గిస్తున్నారని విద్యార్థులు మొత్తుకుంటున్నారు. ఆలస్యం అయినందుకు రూ.10 వసూలు చేయడంతో పాటు రోజులు తగ్గిస్తున్నారని తెలిపారు. రెడ్డికాలనీకి చెందిన సాయి జాహ్నవి యాదవనగర్ నుంచి కేయూసీ క్రాస్ రోడ్డు వరకు విద్యార్థి పాస్‌ను ఈ నెల 21న (మంగళవారం) పాస్ రెన్యువల్ చేయించుకుంది. రూ.70 చార్జీతో పాటు రూ.10 లేట్ ఫీ, రూ.20 సర్వీస్ చార్జీ తీసుకుని జనవరి 16వ తేదీ వరకు మాత్రమే బస్‌పాస్ జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఈ నెల 21న పాస్ తీసుకుంటే వచ్చే నెల 20వ తేదీ గడువుతో పాస్ జారీ చేయాలి. అయితే 4 రోజులు తగ్గించి జారీ చేశారు. ఆలస్యపు రుసుంతో పాటు నెల రోజులకు డబ్బులు తీసుకుని 24 రోజులకు మాత్రమే పాస్ ఎలా జారీ చేస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని కోరుతున్నారు. చదవండి: గుట్కాలు కొన్న విషయం ప్రిన్సిపాల్‌కి తెలియడంతో.. ఏం జరుగుతుందోనని భయపడి.. -
TSRTC: జర్నలిస్టులకు సజ్జనార్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పరిగెత్తించేందుకు కృషిచేస్తూనే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతేగాక ట్విట్టర్లోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్రయాణికులు, నెటిజన్ల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తూ.. పరిష్కార మార్గాలను చూపుతున్నారు. చదవండి: నూతన వధూవరులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సర్ప్రైజ్.. ఈ క్రమంలో తాజాగా జర్నలిస్టులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త అందించారు. జర్నలిస్ట్ బస్ పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు తెలంగాణ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే తమకు లభించాల్సిన తగ్గింపు (కన్సెషన్) పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో గుడ్‌న్యూస్ ఫర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ సూచనలు చేసిన ఇద్దరు నెటిజన్లకు ఆయన కృతజ్జతలు తెలియజేశారు. కాగా సజ్జనార్ నిర్ణయంపై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సజ్జనార్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేశారు. చదవండి: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్ Good NEWS for our NEWS friends! Now, #journalists with valid bus pass from #TSRTC can avail of concession online also while booking tickets through our #TSRTC website. Thank You @iAbhinayD & @NVNAGARJUNA for your suggestion Patronage #TSRTC & #IchooseTSRTC #fridaymorning@V6News pic.twitter.com/7FEyzzBN99 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 12, 2021 అయితే మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ కార్డుతో ఆర్టీసీ నుంచి బస్ పాస్ తీసుకుంటారు. ఈ పాస్ ఉన్నవారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే కన్సెషన్ పొందుతుంటారు. ఇప్పటి వరకు నేరుగా బస్ కండక్టర్ నుంచి మాత్రమే రాయితీ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఆన్లైన్లో ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే మాత్రం ఈ మినహాయింపులు వర్తించేవి కావు. ఈ క్రమంలో తాజాగా టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు జర్నలిస్టులు తమ కన్సెషన్ పొందవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో వెల్లడించారు. -
హైదరాబాద్‌లో బస్‌పాస్‌కు రూ.1200.. ఇలా చేస్తే బెటరేమో!
సాక్షి, హైదరాబాద్: సిటీబస్సుల్లో రూట్‌పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం పదోతరగతి వరకు చదివే విద్యార్థులకే పరిమితమైన రూట్‌పాస్‌లను అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులకు, సాధారణ ప్రయాణికులకు కూడా విస్తరించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. కోరుకున్న దూరానికే పాస్‌లు ఇవ్వడం వల్ల ప్రయాణికులకు డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు ప్రతి నెలా రూ.1200 పైన చెల్లించి సాధారణ బస్‌పాస్‌లు తీసుకోవలసి వస్తోంది. వీటిపై సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా ప్రయాణం చేయవచ్చు. చదవండి: TSRTC: దసరా పండగకు ప్రయాణికులకు తీపికబురు.. కానీ ఉద్యోగులు, విద్యార్థులు చాలా వరకు ఇంటి నుంచి కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే ప్రయాణం చేస్తారు. దీంతో సాధారణ పాస్‌లపైన తాము ప్రయాణం చేయని దూరానికి కూడా అదనంగా డబ్బు చెల్లించవలసి వస్తోంది. దీంతో బస్‌పాస్‌ల అవసరం ఉన్నప్పటికీ డిమాండ్ కనిపించడం లేదు. గ్రేటర్లో లక్షలాది మంది చిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసేవారు ఉన్నారు. అలాగే నగర శివార్లలోని కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. కానీ బస్‌పాస్ వినియోగదారుల సంఖ్య మాత్రం 5 లక్షలకు పైగా ఉంది. సాధారణ పాస్‌లతో పాటు ప్రయాణికులు కోరుకున్న రూట్ వరకు పాస్ ఇవ్వడం వల్ల ఈ వినియోగదారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: TSRTC: ఉద్యోగులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఉభయ తారకంగా... ముషీరాబాద్‌కు చెందిన సురేష్ ప్రతి రోజు కోఠి వరకు సిటీ బస్సులో ప్రయాణం చేస్తాడు. అందుకోసం అతడు ప్రతి నెలా రూ.1150 వరకు వెచ్చించి సాధారణ మెట్రో బస్‌పాస్ (జీబీటీ) తీసుకోవలసి వస్తుంది. కానీ అదే మార్గంలో అతనికి రూట్‌పాస్ తీసుకొనే సదుపాయం ఉంటే కేవలం రూ.800 లోపే లభిస్తుంది. ప్రతి నెలా రూ.350 వరకు ఆదా అవుతుంది. ఈ తరహా రూట్‌పాస్‌లను ఆర్టీసీ అందజేస్తే ఉద్యోగులు, విద్యార్థులతో పాటు నిర్ణీత స్థలాలకు రాకపోకలు సాగించే చిరువ్యాపారులకు కూడా ప్రయోజనంగా ఉంటుంది. ఎక్కువ మంది పాస్‌లు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి ముందస్తుగానే ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్జీవో పాస్‌లు ఉన్నాయ. అలాగే విద్యార్థులకు జీబీటీలతో పాటు పరిమిత సంఖ్యలో రూట్‌పాస్‌లు, గ్రేటర్ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లు, కాలేజీలు పని చేస్తున్నాయి. దసరా తరువాత మరిన్ని విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశం ఉంది. దీంతో రూట్‌పాస్‌లను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. చదవండి: ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు -
నగరవాసులకు అందుబాటులోకి మొబైల్ బస్ పాస్ కౌంటర్లు
-
బస్‌పాస్ ‘కల్లాస్’.. పడిపోయిన ఆర్టీసీ ఆదాయం
సాక్షి, హైదరాబాద్: జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా సరే బస్‌పాస్ ఉంటే చాలు సిటీ అంతా చుట్టేసి రావచ్చు. సగటు ప్రయాణికుడికి అదొక ధీమా. నెలంతా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా వెళ్లొచ్చు. విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు ఒకప్పుడు బస్‌పాస్‌ల కోసం కౌంటర్ల వద్ద గంటలతరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. మరోవైపు ఆర్టీసీకి సైతం బస్‌పాస్‌లపైనే ఎక్కువ ఆదాయం లభించేది. కానీ కోవిడ్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో పాస్‌ల వినియోగం గణనీయంగా తగ్గింది. ఆర్టీసీ ఆదాయం కూడా దారుణంగా పడిపోయింది. గతంలో రోజుకు రూ.65 లక్షలకు పైగా ఆదాయం లభిస్తే ఇప్పుడు రూ.15 లక్షలు కూడా లభించడం లేదు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అంటే మూడు నెలలు మినహా ఈ మొత్తం కోవిడ్ కాలంలో ఒక్క బస్‌పాస్‌లపైన సుమారు రూ.195 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ‘జూలై నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. సాధారణ ప్రయాణికులు,ఎన్జీవోలు బస్‌పాస్‌లను కొనుగోలు చేస్తున్నారు. కానీ మూడో దశ వస్తే మాత్రం మరిన్ని నష్టాలు తప్పకపోవచ్చు’ అని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. బస్సెక్కని స్టూడెంట్.. సాధారణంగా ఉదయం, సాయంత్రం సిటీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. ప్రత్యేకించి నగర శివార్లలోని విద్యాసంస్థలకు వేలాది మంది విద్యార్ధులు రాకపోకలు సాగించేవారు. విద్యార్ధుల కోసమే గ్రేటర్ ఆర్టీసీ ప్రతి రోజు 2500 పైగా ప్రత్యేక ట్రిప్పులు నడిపేది. ఇప్పుడు ఈ విద్యార్ధలంతా ఆన్లైన్ చదువులకు పరిమితమయ్యారు. సుమారు 1000కి పైగా విద్యాసంస్థలు ఆర్టీసీ గుర్తింపును పునరుద్ధరించుకోకపోవడం గమనార్హం. అలాగే ఆరీ్టసీకి ఉన్న అతిపెద్ద ‘ప్యాసింజర్ బ్యాంక్’పరిశ్రమల్లో పని చేసే కారి్మకులు, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే చిరుద్యోగులు. కరోనా కారణంగా చాలామంది సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్టీసీ బస్సులను పెద్దగా వినయోగించడం లేదు. ఎన్జీఓ బస్‌పాస్‌లకు ఇప్పుడిపుడే తిరిగి డిమాండ్ కనిపిస్తోంది. 25 శాతానికి పడిపోయిన పాస్‌లు... కోవిడ్ కారణంగా సుమారు 5 లక్షలకు పైగా విద్యార్థుల బస్‌పాస్‌లు, మరో 3 లక్షల సాధారణ బస్‌పాస్‌లు నిలిచిపోయాయి. గత సంవత్సరం లాక్డౌన్ సడలింపుల అనంతరం సిటీ బస్సుల సేవలను పునరుద్ధరించినప్పటికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రోజుకు కేవలం రూ.లక్ష మాత్రమే ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. బస్‌పాస్‌ల ఆదాయం యథావిధిగా సుమారు రూ.60 లక్షలకు చేరుకుంది. మరోసారి మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడడంతో మార్చి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 25 శాతానికి సాధారణ బస్‌పాస్‌ల వినియోగం పరిమితమైంది. అంటే రోజుకు రూ.15లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మాత్రమే లభిస్తుంది. విద్యార్థులు వినియోగించే అన్ని రకాల పాస్‌ల వినియోగం గణనీయంగా తగ్గింది. ఇదీ లెక్క ► మొత్తం బస్‌పాస్‌లు : 10 లక్షలు ► స్టూడెంట్ పాస్‌లు : 6 లక్షలు ► సాధారణ బస్‌పాస్‌లు : 3.5 లక్షలు ► ఎన్జీవోపాస్లు : 20 ,000 ► జర్నలిస్టు పాస్‌లు : 10,000 ► దివ్యాంగుల పాస్‌లు : 20,000 ► జీబీటీ : రూ.950 ఆర్డినరీ, ► మెట్రో పాస్ : రూ.1070 ► స్టూడెంట్ పాస్ :రూ.165 ► ఎన్జీవో పాస్ : రూ.360 -
ఉద్యోగులకు కంబైన్డ్ పాస్ బస్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైలుతో ప్రయాణాల కోసం కంబైన్డ్ పాస్‌లను ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేయాలి. ఆర్డినరీ బస్సు చార్జీలో 2/3 వంతుకు మించకుండా వీటి ద్వారా జరిపే ప్రయాణాల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలి. మిగిలిన వ్యయాన్ని ఉద్యోగులు భరించాలి’అని చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసు చేసింది. ఇటు ఉద్యోగుల ట్రావెలింగ్ అలవెన్సులు (టీఏ) పెంపు విషయంలో ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసింది. మైలేజీ అలవెన్స్ పెంచాలి.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో సొంత వాహనాలు వినియోగించే వారికి అందించే మైలేజీ అలవెన్సులను పెంచాలని పెట్రోల్‌తో నడిచే కార్లకు కిలోమీటర్‌కు రూ.13 నుంచి రూ.16కు, డీజిల్‌తో నడిచే వాటికి రూ.9 నుంచి రూ.14కు, ద్విచక్ర వాహనాలకు రూ.5 నుంచి రూ.6కు అలవెన్సు పెంచాలని కోరింది. కొత్తగా సవరించి ప్రతిపాదిస్తున్న వేతనాల్లో రూ.54,220–1,33,630 వేతనం అందుకునే అధికారులు సొంత కారు, సవరించిన వేతనం రూ.36,750–1,06,990, ఆపై అందుకునే అధికారులు సొంత ద్విచక్రవాహనం ద్వారా ప్రయాణించడానికి ఈ అలవెన్సులను మంజూరు చేయాలని సూచించింది. ఇతర సిఫారసులు.. గ్రేడ్–1, 2 ఉద్యోగులు ఆర్టీసీ/ప్రైవేటు ఏసీ బస్సుల ద్వారా ప్రయాణించడానికి అనుమ తించాలి. గ్రేడ్–3 ఉద్యోగులు నాన్ ఏసీ బస్సుల చార్జీలు చెల్లించాలి. రూ.42,300–1,15,270 వేతనం అందు కుంటున్న ఉద్యోగులకు ఫస్ట్ క్లాస్‌లోని ఏసీ, చైర్ కార్/ఏసీ, 3 టైర్/ఏసీ, 2 టైర్‌తో పాటు సెకండ్ క్లాస్ రైల్వే ప్రయాణాలకు అనుమతించాలి. రూ.38,890–1,12,510 వేతనం ఉన్న ఉద్యోగులకు సెకండ్ క్లాస్ రైల్వే ప్రయాణాలకు అనుమతించాలి. వేతన సవరణ తర్వాత నెలకు రూ.96,890–1,58,380 వేతనం ఉన్న ఉద్యోగులకు అధికార పర్యటనల కోసం విమాన ప్రయాణ సదుపాయాన్ని కల్పిం చాలి. డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులకు సైతం విమాన ప్రయాణ సదుపాయం కల్పించాలి. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 15 శాతాన్ని ప్రత్యేక అలవెన్సుగా చెల్లించాలి. ప్రజారవాణా/ప్రైవేటు రవాణా సదుపాయం లేని జిల్లా కేంద్రం నుంచి 8 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో పర్యటిం చడానికి అందించే మైలేజీ అలవెన్సులను పెంచాలని సిఫారసు చేసింది. గ్రేడ్–1 ఉద్యోగులకు కి.మీ.కు రూ.7 నుంచి రూ.9, గ్రేడ్–2 ఉద్యోగులకు రూ.6 నుంచి రూ.7.50, గ్రేడ్–3 ఉద్యోగులకు రూ.5 నుంచి రూ.6.5కు పెంచాలి. గ్రేడ్–1 ఉద్యోగులకు రాష్ట్రం లోపల ప్రయా ణాలకు రూ.600, వెలుపల ప్రయాణాలకు రూ.800, గ్రేడ్–2 ఉద్యోగులకు రాష్ట్రం లోపల ప్రయాణాలకు రూ.400, వెలుపల ప్రయాణాలకు రూ.600, గ్రేడ్–3 ఉద్యోగు లకు రాష్ట్రం లోపల ప్రయాణాలకు రూ.300, బయట ప్రయాణాలకు రూ.400 వరకు దినసరి భత్యాలను పెంచాలి. కోర్టు మాస్టర్లకు ఇలా.. కోర్టు మాస్టర్లు, హైకోర్టు జడ్జీల వ్యక్తిగత కార్యదర్శుల కన్వెయన్స్ అలవెన్సును నెలకు రూ.5 వేల వరకు పెంచాలి. మండలం లోపల చేసే ప్రయాణాల కోసం ట్రావెలింగ్ అలవెన్సులను నెలకు రూ. 1,200 నుంచి రూ.1,500కు పెంచాలి. రెవె న్యూ డివిజ¯Œ లోపల జరిపే ప్రయాణాలకు నెలకు రూ.1,500 నుంచి రూ.2 వేలకు పెంచాలి. -
ఏపీ: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తీపి కబురు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయబోతోంది. ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపో/యూనిట్లకు సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని గత కొద్ది కాలంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు) ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్‌పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాస్‌లు చెల్లుబాటవుతాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. (చదవండి: రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..) -
సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుక్రవారం శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. కోవిడ్ లాక్డౌన్లో తీసుకున్న బస్ పాస్‌లో(ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్పోర్ట్ పుష్పక్ ఎసీ బస్) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీఎస్ఆర్టీసీ కల్పించనుంది. దీంతో వినియోగదారులు అప్పటి బస్ పాస్‌ను కౌంటర్లో తిరిగి ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది. కొత్త పాస్‌లో కోల్పోయిన రోజులను కలిపి పాసులు జారీ చేయనుంది. ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవచ్చు. చదవండి: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త -
ఆర్టీసీకి రూ.500 కోట్లే..!
సాక్షి, హైదరాబాద్: తాజా బడ్జెట్లో ఆర్టీసీకి తీవ్ర నిరాశే ఎదురైంది. వేతనాలు చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడుతున్న సంస్థకు.. బడ్జెట్లో ఊరట లభించలేదు. బస్ పాస్ రాయితీలు భరించినందుకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు చేసే మొత్తానికి సంబంధించి రూ.680 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరగా రూ.500 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇక బ్యాంకు రుణాలను చెల్లించేందుకు రూ.200 కోట్లు కావాలని కోరగా రూ.50 కోట్లు మాత్రమే ప్రకటించింది. కొత్త బస్సుల కొనుగోలుకు రూ.150 కోట్లు కోరగా, ప్రభుత్వం ఆ పద్దు జోలికే వెళ్లలేదు. పొరుగు రాష్ట్రం ఏపీ అక్కడి ఆర్టీసీకి రూ.1,572 కోట్ల ఆర్థిక సాయాన్ని బడ్జెట్ లో ప్రకటిస్తే ఇక్కడ రూ.550 కోట్లే ప్రతిపాదించటం సరికాదని ఎన్ఎంయూ నేత నాగేశ్వర్రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటికి కేటాయింపుల్లేవ్.. - మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు ఈసారి ప్రభుత్వం మొండిచేయి చూపింది. గత బడ్జెట్లో రూ.460 కోట్లు ప్రకటించి చివరకు రూ.378 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్లో ఆ పద్దు జాడే లేదు. - గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో రూ.80 కోట్లు ప్రతిపాదించి, రూ.66 కోట్లకు సవరించారు. - జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ.500 కోట్లుగా చూపారు. చివరకు దాన్ని రూ.411 కోట్లకు సవరించారు. తెలంగాణ కళాభారతి లాంటి ప్రతిపాదనలను కూడా పక్కనపెట్టేసింది. - పర్యాటక శాఖ, హెరిటేజ్ తెలంగాణకు జీతాల కోసం తప్ప అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదు. -
బస్‌పాస్‌ల పేరిట దోపిడీ
తాండూరు : పెద్దేముల్ మండలానికి చెందిన భవాని తాండూరులో 8వ తరగతి చదువుతోంది. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం బస్‌పాస్‌ను ఉచితంగా అందించింది. బస్‌పాస్ తీసుకునేందుకు బస్‌స్టేషన్‌లో ఉన్న కౌంటర్ వద్దకు వెళితే రూ.60 చెల్లించాలని డిమాండ్ చేశారు. చేసేది లేక ఆ విద్యార్థి ఆరోజు పాస్ తీసుకోకుండానే గ్రామానికి వెళ్లిపోయింది. మరుసటి రోజు రూ.60 చెల్లించి బస్ పాస్ పొందింది. బస్‌పాస్‌ల పేరిట ఆర్టీసీ ఉద్యోగులు దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా బస్‌పాస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. జూన్‌లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రావాణాశాఖ అధికారులు గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు అందించేందుకు నియమించింది. ఇదే అదునుగా భావించిన సదరు అధికారులు విద్యార్థుల నుంచి పాస్ ఫీజు రూ.30లకు బదులుగా, నిబంధనలకు విరుద్ధంగా రూ.60 వసూలు చేస్తూ అధిక డబ్బు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న జిల్లాలలోనే ఇలా అక్రమ వసూళ్లకు ఆర్టీసీ ఉద్యోగులు పాల్పడడం గమనార్హం. వికారాబాద్ జిల్లాలో మొత్తం తాం డూరు, పరిగి, వికారాబాద్ పట్టణాల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆర్టీసీ డిపోల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా బస్‌పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, అమలుచేస్తోంది. విద్యార్థులు బస్‌పాస్‌ల విషయంలోఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో రెండు మూడేళ్లుగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి ఆర్టీసీ ఉద్యోగులు బస్ పాస్లనుపంపిణీ చేస్తారు. గతేడాది జిల్లాలోని 18 మండలాల విద్యార్థులకు మూడు ఆర్టీసీ డిపోల నుంచి33వేల మంది విద్యార్థులకు ఉచిత బస్ పాస్లనుఅందించారు. అయితే బస్ పాస్‌లను జారీ చేసేందుకు ఆన్లైన్ ఫీజు పేరిట గతేడాది రూ.30లుతీసుకుంటే ఈ ఏడాధి అనందనంగామరోరూ.30 వసూలు చేసినట్లుతెలిపారు. నిబంధనలకు విరుద్దంగా వసూళ్లు జిల్లాలోని 18 మండలాల్లో ప్రతిఏటా దాదాపు 33 వేల మందికి బస్ పాస్‌లు జారీ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు తాండూరు పరిగి వికారాబాద్ ఆర్టీసీ డిపోల పరిధిలో బస్ పాస్‌లను జారీ చేసేందుకు వికారాబాద్ డిపో పరిధిలో 9 మంది, పరిగిలో 9మంది, తాండూరులో 7 గురు ఆర్టీసీ ఉద్యోగులను నియమించారు. పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులుప్రతి రోజు ఒక్కొ మండలానికి వెళ్లి బస్‌పాస్‌ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జూన్ నెలలో మొత్తం 18 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లను అందించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ నిభందనల ప్రకారం విద్యార్థుల నుంచిరూ.30 తీసుకోకుండా రూ.60 వసూలుచేస్తున్నారని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మంత్రి ఇలాఖాలోనే దోపిడీ ఆర్టీసీ బాస్‌గా వ్యవహరిస్తున్న తాండూరుఎమ్మెల్యే, రాష్ట్ర రావాణాశాఖ మంత్రిపట్నం మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాఖాలోనే ఆర్టీసీ అధికారులు దోపిడికి తెరలేపారు. జిల్లాలోనే అధికంగా తాండూరు ఆర్టీసీ డిపోలో విద్యార్థుల నుంచి అధికంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 18వేల మంది విద్యార్థులకు బస్ పాస్‌లను అందించి దాదాపు రూ.5లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికంగా డబ్బులు వసూలు చేయొద్దు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత బస్ పాస్‌లలో ఆర్టీసీ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడం సరికాదని. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొఓక్కారని ఆరోపించారు. ఉప్పల రాజేశ్, ఏబీవీపీ తాండూరు ఇంచార్జ్ ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేస్తాం.. ఆర్టీసీ డిపోల పరిధిలో గ్రామాలలోని విద్యార్థులకు ఉచిత బస్పాస్లలో ఆర్టీసీ ఉద్యోగులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫీర్యాదు చేస్తా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. తాండూరు ఆర్టీసీ డిపోలో జరిగిన సంఘటన తమ దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి డబ్బులను వసూలు చేసిన విషయమై విచారణ చేస్తాము. భవానీప్రసాద్, డివిజనల్ మెనేజర్,ఆర్టీసీ డిపో -
ఏడాదంతా ఒక్కటే బస్ పాస్
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు) : ఏడాది పొడవునా బస్‌పాస్‌ల కోసం విద్యార్థులు నిరీక్షించాల్సిన పనిలేకుండా ఆర్టీసీ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎ.అన్సారీ సోమవారం ఎంవీపీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రస్తుతం విద్యార్థులు నెలవారి బస్‌పాస్ పొందుతున్నారని, దీనివల్ల వారికి సమయం వృ థా అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏడాది మొ త్తం ఒకేపాస్ ఉండేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ విధానం ద్వారా ప్రతి విద్యార్థి ఏడాదిలో ఒక్కసారి బస్ పాస్ తీసుకుంటే సరిపోతుందన్నారు. దీంతోపాటు బస్ పాస్‌ల మంజూరులో ఇక నుంచి ఇంటర్నెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ముందుగా విద్యార్థులు వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకొని అనంతరం దగ్గరలోని ఆర్టీసీ కేంద్రంలో పాస్‌లు పొందవచ్చన్నారు. ఎంవీపీ, ద్వారకా నగర్, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక, కూర్మనపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, మధురవాడ కేంద్రాల్లో బస్ పాస్‌లు పొందవచ్చన్నారు. గతంలో జారీ చేసే 3 నెలల పాస్‌లో యథాతదంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు 10 నెలలకు రూ.1300, ఇంటర్, పాలిటెక్నికల్ విద్యార్థులకు 11 నెలలకు రూ.1430, డిగ్రీ, పలు వృత్తి విద్యా కోర్సుల వారికి 12 నెలలకు రూ.1560 చొప్పున చెల్లించి బస్ పాస్‌లు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుదేష్కుమార్, సుధా బిందు వెంకటరావు పాల్గొన్నారు. -
ఇకపై జర్నలిస్టులకు ఆన్లైన్లో బస్‌పాస్‌లు
సాక్షి, హైదరాబాద్ : అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు టీఎస్ఆర్టీసీ బస్‌పాస్‌ల కోసం ఇకనుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమలులోకి రానుందని టీఎస్ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు పేర్కొన్నారు. బస్‌పాస్‌ల కోసం జర్నలిస్టులు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్ఎం కార్యాలయాలకు వెళ్లకుండా సమీపంలోని బస్‌పాస్ కౌంటర్ నుంచి పొందేలా వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. ప్రస్తుతం జర్నలిస్టుల బస్‌పాస్‌ల గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ఆర్టీసీ అమలు చేయనుంది. ఆన్లైన్లో బస్‌పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు ఫోన్లో టీఎస్ఆర్టీసీ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత జర్నలిస్టులు తమ సమీపంలోని బస్‌పాస్ కౌంటర్‌కు వెళ్లి మెసేజ్‌ను చూపిస్తే అక్కడ బస్‌పాస్ జారీ చేస్తారని టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. -
కనికరం లేని కండక్టర్
తిరువొత్తియూరు: ఉచిత బస్‌పాస్ చెల్లదని కంటి చూపు లేని విద్యార్థిని మార్గమధ్యలో బస్సు నుంచి కిందకు దింపేశాడు ఓ కండక్టర్. కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన మాయవేల్ (20) కంటిచూపు లేని విద్యార్థి. ఇతను విల్లుపురం లా కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్‌పాస్‌తో కళాశాలకు బస్సు తో వెళ్లి వస్తుంటాడు. మంగళవారం బన్రూటి నుంచి విల్లుపురానికి రావడానికి ప్రభుత్వ బస్సు ఎక్కాడు. బస్సు కదలిన కొద్ది సమయానికి కండక్టర్ మాయవేల్ను టికెట్ తీసుకోమని కోరాడు. అతను ఉచిత బస్సు పాస్‌ను కండక్టర్ చేతికి ఇచ్చాడు. అది చూసిన కండక్టర్ అది చెల్లదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెందిన కండక్టర్ మాయవేల్ను మార్గమధ్యలో బస్సు నుంచి కిందకు దింపేశాడు. దీనిపై ఫిర్యాదు ఇవ్వడానికి మాయవేల్ విల్లుపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ కలెక్టర్‌ను కలవడానికి వీలుకాకపోవడంతో విల్లుపురం బస్‌డిపో జనరల్ మేనేజర్ వద్ద కండక్టర్‌పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు దీనిపై విచారణ చేస్తామని అతనికి హామీ ఇచ్చారు. -
రూ.వెయ్యి ఆదాయమా.. నో బస్ పాస్
- సిబ్బంది తల్లిదండ్రుల పాస్‌పై ఆర్టీసీ వింత నిబంధన - ఇరవై ఏళ్ల నాటి నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చిన యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల క్రితం తీసు కున్న ఓ నిర్ణయాన్ని ఆర్టీసీ ఇప్పుడు అమల్లోకి తెచ్చింది. సిబ్బంది తల్లిదండ్రులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు జారీ చేసే పాస్ వసతిని తొలగించింది. నెలకు రూ.1000, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉండే తల్లిదండ్రులకు ఇక నుంచి ఈ పాస్ వర్తించదని పేర్కొంటూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఏడాదికి మూడు పర్యాయాలు సిబ్బందికి ఆర్టీసీ పాసులు జారీ చేస్తుంది. ఇందులో ఒక పాసుకు నెల రోజుల గడువు, మిగతా వాటికి రెండు నెలలు చొప్పున గడువు ఉంటుంది. ఒక ప్రాంతానికి వెళ్లి వస్తే ఒక పాస్ గడువు తీరుతుంది. ఇలా మూడు ఉచిత పర్యటనలకు ఇవి వెసులుబాటు కల్పిస్తాయి. 1996 నాటి నిర్ణయం.. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా 1996లో సిబ్బంది తల్లిదండ్రులు పాస్‌లపై నియంత్రణ విధించాలని ఆర్టీసీ నిర్ణయిం చింది. నెలకు రూ.వెయ్యి, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉండే తల్లిదండ్రులకు ఇది వర్తించదని ఆర్టీసీ బోర్డులో తీర్మానించింది. అయితే అది అమల్లోకి రాలేదు. తర్వాత దాన్ని అందరూ మరిచిపోయారు. రాయితీ లపై తాజాగా సమీక్షించిన యాజమాన్యం, 1996లో తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అప్పుడు ఆదాయ పరిమితి రూ.వెయ్యి ఉండగా, దాన్ని యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.వెయ్యి కంటే తక్కువ ఆదాయం ఎవరికి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. పేరుకే ఆదాయ పరిమితి షరతు విధించారని, అంత తక్కువ ఆదాయం ఎవరికీ ఉండదు కాబట్టి బస్ పాస్ వసతి సిబ్బంది తల్లిదండ్రులంతా కోల్పోవాల్సిం దేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సిబ్బంది తల్లిదండ్రుల నెల ఆదాయం రూ.వెయ్యికి తక్కువగా ఉన్నప్పటికీ, వారిని పోషించే కుమారులుంటే ఈ వసతి వర్తించదని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. ఆర్టీసీ నిర్ణయం సరికాదు..: ఎన్ఎంయూ ఆర్టీసీ సిబ్బంది తల్లిదండ్రులకు ఇచ్చే బస్సు పాస్ వసతిని రద్దు చేయాలని నిర్ణయించటం సరికాదని ఆర్టీసీ ఎన్ఎంయూ పేర్కొంది. రూ.వెయ్యి కంటే వేతనం తక్కువ ఉండే అవకాశమే లేనందున అందరు కార్మికుల తల్లిదండ్రులు ఈ వెసులుబాటును కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని సంఘం నేతలు నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, నరేందర్, మౌలానా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
దివ్యాంగులకు ఆర్టీసీ బస్‌పాస్‌లు
ఒంగోలు : దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రాయితీపై బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తోంది. వివిధ రకాల వైకల్యాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు 50 శాతం రాయితీతో బస్‌పాస్‌లు అందిస్తోంది. ప్రత్యేక మేళాలు... దివ్యాంగుల కోసం ప్రస్తుతం ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటరులో బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే త్వరలోనే అన్నిప్రాంతాల్లో ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేయనున్నట్లు ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. బస్ పాస్ పొందేందుకు ఇవీ అర్హతలు... ఎముకలు సంబంధిత వైకల్యం 40 శాతం, పోలియో, పెరాలసిస్‌కు సంబంధించి 40 శాతం, మూగ, చెవుడు, అంధత్వం 100 శాతం, బుద్దిమాంధ్యం 50 శాతం కలిగిన వారికి ఈ రాయితీ బస్ పాస్ అందిస్తున్నారు. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ రాయితీ ద్వారా దివ్యాంగులు ప్రయాణించవచ్చు. ఇంటర్‌స్టేట్ బస్సులు, అల్ట్రా డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులకు ఈ సౌకర్యం వర్తించదు. అంధత్వం ఉన్నవారికి, మరో సహాయకునికి కూడా 50 శాతం రాయితీ కల్పిస్తారు. దరఖాస్తు ఇలా... ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే దివ్యాంగులు తమ అంగవైకల్యం ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్‌కార్డు జెరాక్స్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను ఆర్టీసీ ఆన్లైన్ కౌంటర్లో లేదా ఆర్టీసీ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. లేదా ప్రత్యేక మేళాలు నిర్వహించే సమయంలో ఆర్టీసీ అధికారులకు వీటిని సమర్పించడం ద్వారా పొందవచ్చు. ఆర్టీసీ బస్సు టికెట్ల రద్దుకు నిబంధనలు... ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ముందుగా తాము బుక్ చేసుకున్న టికెట్లను రద్దుచేసుకునేందుకు కొన్ని పరిమితులు విధించారు. నిర్ణీత సమయాల ప్రకారం బుక్‌చేసుకున్న టికెట్లలో కొంతమొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తం ఇస్తారు. వాటికి సంబంధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి... = బస్సు బయలుదేరడానికి 48 గంటల కంటే ముందుగా రద్దుచేసుకుంటే రిజర్వేషన్ చార్జీ మినహా మిగిలిన మొత్తం చెల్లిస్తారు = 24 గంటల నుంచి 48 గంటల మధ్య సమయంలో రద్దుచేసుకుంటే 10 శాతం వాస్తవ ఫేర్‌తో పాటు రిజర్వేషన్ చార్జీని మినహాయిస్తారు. = 2 గంటల నుంచి 24 గంటల మధ్యలో రద్దుచేసుకుంటే 25 శాతం వాస్తవ ఫేర్తోపాటు రిజర్వేషన్ చార్జీని మినహాయిస్తారు = 1 గంట నుంచి 2 గంటల మధ్యలో అయితే 50 శాతం వాస్తవ ఫేర్‌ను, రిజర్వేషన్ చార్జీని మినహాయిస్తారు = 1 గంటలోపు అయితే ఎటువంటి మొత్తం వాపసు ఇవ్వబడదు. -
దివ్యాంగులకు ప్రయోజనకరం
పుట్టపర్తి టౌన్ : దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రాయితీ బస్సుపాసు సౌకర్యం కల్పిస్తోంది. వివిధ రకాల వైకల్యాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు 50 శాతం రాయితీలో బస్సు పాసు సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ పుట్టపర్తి డిపో మేనేజర్ రమణయ్య గురువారం వివరించారు. ప్రత్యేకంగా దివ్యాంగ మేళాలను ఏర్పాటు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పాస్‌లు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎములకల సంబంధిత వైకల్యం 40 శాతం, పోలియో, ఫెరాలసిస్కు సంబంధించి 40 శాతం, మూగ, చెవుడు, అంధత్వం 100 శాతం, బుద్ధి మ్యాంద్యం 50 శాతం కలిగిన వారికి ఆర్టీసీ 50 శాతం రాయితీతో బస్సు పాసులను అందజేస్తోంది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ రాయితీ ద్వారా దివ్యాంగులు ప్రయాణించవచ్చు. ఇంటర్ స్టేట్ బస్సులు, ఆల్ట్రా లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకు మాత్రం ఈ సౌకర్యం వర్తించదు. అంధత్వం ఉన్న వారికి, మరో సహాయకునికి కూడా 50 శాతం రాయితీని కల్పిస్తారు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే వారు తమ అంగవైకల్యం ధ్రువీకరణ పత్రంతోపాటు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను ఆర్టీసీ అధికారులకు అందజేసి రాయితీ బస్సు పాసులు పొందవచ్చు. గతంలో డిపోల్లో మాత్రమే ఈ బస్సుపాసు కేంద్రాలను నిర్వహించిన సంస్థ, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రస్తుతం బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రాయితీ బస్సు పాస్‌లను అందజేస్తోంది. దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీ దివ్యాంగులకు 50 శాతం రాయితీతో బస్సు పాసు సౌకర్యం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి దివ్యాంగుడు సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే ప్రత్యేక దివ్యాంగ మేళా ఏర్పాటు చేసి అర్హులందరికీ బస్సుపాసులు మంజూరు చేస్తాం. విద్యావంతులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తమ పరిసరాల్లోని దివ్యాంగులకు ఈ పథకంపై అవగాహన పెంపొందించాలి. – రమణయ్య, ఆర్టీసీ డీఎం, పుట్టపర్తి -
నెలవారీ బస్సు పాస్‌ల ధరల పెంపు..
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలవారీ బస్సు పాస్‌ల ధరలు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన బస్సు పాస్‌ల వివరాలు... ఆర్డినరీ - రూ.700నుంచి రూ. 770 మెట్రో ఎక్స్ ప్రెస్ - రూ. 800 నుంచి రూ.880 మెట్రో డీలక్స్ - రూ.900 నుంచి రూ.990 ఎన్జీవోలకు.. ఆర్డినరీ బస్సు పాస్ - రూ.235 నుంచి రూ.260 మెట్రో ఎక్స్ ప్రెస్- రూ.335 నుంచి రూ.370 మెట్రో డీలక్స్ - రూ.435 నుంచి రూ.480 ఆర్టీసీ, ఎంఎంటీఎస్ కాంబినేషన్ బస్సు పాస్ - రూ.800 నుంచి రూ.880 హైదరాబాద్‌లో ఒకరోజుకు జారీ చేసే టికెట్ ధర -రూ.70 నుంచి రూ.80 కి పెరిగాయి. -
విద్యార్థులకు బస్సుపాస్‌లు కావాలంటే...
కడప అర్బన్ : విద్యా సంవత్సరం ఈనెల 13 నుంచి ప్రారంభమైంది. ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత, రాయితీ బస్సు పాస్‌ల జారీ ఇప్పటికే ప్రారంభమైంది. గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాల విద్యార్థులందరూ బస్సుపాస్ పొందేందుకు అర్హులు. * 12 సంవత్సరాల వయసు వరకు పాఠశాల విద్యార్థులు, 10 వతరగతి వరకు బాలికలు (వయసు 18 సంవత్సరాల వరకు) ఉచిత బస్సు పాస్‌లు పొందేందుకు అర్హులు. * ఉచిత బస్సుపాస్‌లు 20 కిలోమీటర్ల వరకు, రాయితీ బస్సు పాస్‌లు 35 కిలో మీటర్ల వరకు ఇవ్వబడును. * బస్సు పాస్ దరఖాస్తును డబ్య్లుడబ్య్లుడబ్య్లు.ఏపీఎస్ఆర్టీసీ.జీఓవి.ఇన్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చును. * ఆర్టీసీ డిపోలు ఉన్న పట్టణాలలోనేగాక కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, వేంపల్లి, వీరపునాయునిపల్లె, పోరుమామిళ్ల, గాలివీడు, కోడూరు మరియు విద్యార్థులు అధికంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడి పాఠశాల, కళాశాలల యాజమాన్యం వారు ఆర్టీసీ కౌంటర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్, ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పిస్తే ప్రతినెలా ఒక నిర్ణీత తేదీన అక్కడే బస్‌పాస్ మంజూరు చేస్తారు. ఆన్లైన్లో బస్‌పాస్ నమోదు విధానం : * విద్యార్థులు బస్సుపాస్ ఆన్లైన్లో తీసుకోవడానికి ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఏపీఎస్ఆర్టీసీపీఏఎస్ఎస్.ఐఎన్’ వెబ్సైట్లోకి వెళ్లాలి. * వెబ్సైట్ తెరుచుకోవడానికి పదవ తరగతి పైబడిన విద్యార్థులకు, పదవ తరగతి కింది స్థాయి వారికి వేర్వేరు ఐచ్చికాలు ఉంటాయి. విద్యార్థి చదువుతున్న తరగతిని బట్టి వాటిపై క్లిక్ చేయాలి. * గత ఏడాది పాస్ తీసుకున్న వారు అప్పటి గుర్తింపు నెంబరును నమోదు చేస్తే దరఖాస్తు చేయడం త్వరగా సులభంగా పూర్తవుతుంది. లేదంటే కొత్త రిజిస్ట్రేషన్‌ను ఎంచుకుని దానిలో వివరాలు ఎంపిక చేయాలి. * విద్యార్థి పూర్తి వివరాలు నమోదు చేసిన వెంటనే దానిపై దరఖాస్తు వస్తుంది. ఆ దరఖాస్తులో పేరు, చిరునామా, పాఠశాల, కళాశాల వివరాలు, ఆధార్‌కార్డు సంఖ్య తదితర వివరాలను నమోదు చేయాలి. తర్వాత వారి ఫొటోను అప్లోడ్ చేయాలి. ఆపై రూ ట్ వివరాలు కూడా నమోదు చేయాలి. పూర్తి వివరాలు పొందుపరిచిన దరఖాస్తును సబ్మిట్ చేసి దాని ప్రింట్‌ను తీసుకోవాలి. * ఆ ప్రింట్‌ను సంబంధిత కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయుని సంతకంతో ధృవీకరించాలి. ధృవీకరణ పూర్తయిన తర్వాత దగ్గరిలోని బస్‌పాస్ కౌంటర్లో నిర్ణీత రుసుము చెల్లించి బస్‌పాస్ తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఆర్ఎం గోపీనాథరెడ్డి వివరించారు. -
స్టూడెంట్ బస్ పాస్ జారీకి విస్తృత ఏర్పాట్లు
♦ ఈనెల 10 నుంచి 19 కేంద్రాల ద్వారా పంపిణీ ♦ రద్దీ నియంత్రణకు ఆన్లైన్ సేవలు ♦ సెలవులు, ఆదివారాల్లో కూడా పాస్‌లు ♦ ఆర్టీసీ గ్రేటర్ ఈడీ పురుషోత్తం వెల్లడి సాక్షి,సిటీబ్యూరో: స్కూళ్లు, కళాశాలలు తిరిగి తెరుచుకోనున్న దృష్ట్యా విద్యార్ధుల బస్‌పాస్‌ల జారీకీ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.నగరంలోని 19 ప్రధాన బస్‌పాస్ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉచిత బస్‌పాస్‌లు, రూట్ పాస్‌లు అందజేస్తారు. మరో 53 ఆన్లైన్ కేంద్రాల ద్వారా బస్‌పాస్‌ల రెన్యూవల్స్‌తో పాటు, వివిధ రకాల పాస్‌లను అందజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 13 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 10వ తేదీ నుంచే బస్‌పాస్‌లను అందజేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ పురుషోత్తమ్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బస్‌పాస్ కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఈ ఏడాది మొట్టమొదటి సారి లక్షా 50 వేల స్టూడెంట్ జనరల్ టిక్కెట్లకు (జీబీటీ) కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరిస్తారు. జీబీటీ పాస్‌లు కావాలనుకొనే విద్యార్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారం లోపు వారికి బస్‌పాస్‌లను అందజేస్తారు. కొరియర్ లేదా పోస్టల్ సర్వీస్ ద్వారా జీబీటీలను పంపిణీ చేయాలని భావించినప్పటికీ చార్జీల భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి విద్యార్థులకు బస్‌పాస్ కేంద్రాల ద్వారా నేరుగా అందజేయాలని నిర్ణయించినట్లు ఈడీ చెప్పారు. 50 వేలకు పైగా ఉన్న ఉచిత పాస్‌లు, మరో 1.5 లక్షల రూట్ పాస్‌లు, ఇతర పాస్‌లను ఈ ఏడాది నేరుగానే అందజేస్తారు. ప్రస్తుతం 50 శాతం పాస్‌లకు మాత్రమే ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టాం. దశలవారీగా మొత్తం పాస్‌లను ఆన్లైన్ పరిధిలోకి తెస్తాం.’’ అని ఈడీ పేర్కొన్నారు. 19 కేంద్రాల్లో పాస్‌లు... ♦రెతిఫైల్, ఓల్డ్ సీబీఎస్, సనత్‌నగర్, మెహదీపట్నం, చార్మినార్, ఆఫ్జల్‌గంజ్, ఉప్పల్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, దిల్సుఖ్నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చెల్, కాచిగూడ, కూకట్పల్లి బస్‌స్టేషన్, షాపూర్‌నగర్, బీహెచ్ఈఎల్ కీర్తిమహల్, వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ, హయత్‌నగర్, శంషాబాద్, మిధానీ కేంద్రాల్లో ఉచిత, రూట్ పాస్‌లను అందజేస్తారు. ♦ ఈ పాస్‌ల కోసం విద్యార్ధులు ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు, ఐడీ, బోనఫైడ్, ఫీజు రశీదు, ఎస్సెస్సీ మెమో,తదితర ధృవపత్రాల జిరాక్స్ ప్రతులను జతపరిచి అందజేయాలి. దరఖాస్తు చేసుకున్న వారం లోపు బస్‌పాస్‌లు ఇస్తారు. ♦ స్టూడెంట్ జనరల్ , గ్రేటర్, ఎక్స్‌క్లూజివ్, స్పెషల్ బస్‌పాస్‌లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫొటో మాత్రం అప్లోడ్ చేస్తే చాలు.మిగతా డాక్యుమెంట్స్ పాస్ తీసుకొనే సమయంలో అధికారులకు అందజేయవచ్చు.ఆన్లైన్ దరఖాస్తులు www.tsrtcpass.in (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ఆర్టీసీ డాట్ ఇన్) వెబ్సైట్లో పొందవచ్చు. సెలవు రోజుల్లో కూడా... ♦ సాధారణ రోజుల్లో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్‌పాస్‌లను అందజేస్తారు. విద్యార్ధుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పాస్‌లు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ♦ ఉచిత పాస్‌ల కోసం విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవ సరం లేకుండా ఈ సారి ఆర్టీసీ డిపోమేనేజర్లు తమ పరిధిలోని స్కూళ్లకు వెళ్లి ఉచిత పాస్‌ల దరఖాస్తులను స్వీకరించే విధంగా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం పిల్లల తల్లిదండ్రులు బస్‌పాస్ కేంద్రాలకు వెళ్లి పాస్‌లు తీసుకోవచ్చు. ♦ విద్యార్ధుల బస్‌పాస్‌లకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు,సలహాల కోసం నేరుగా ఫోన్ చేయవచ్చు. 8008204216 నెంబర్‌కు సంప్రదించవచ్చు. ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు atmbuspass@gmail.ఛిౌఝ కు మెయిల్స్ చేయవచ్చు.