సిటీ బస్సు ప్రయాణికులకు ‌గుడ్‌ న్యూస్‌ | Good News For HYD RTC Passengers | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

Published Fri, Oct 30 2020 6:09 PM | Last Updated on Fri, Oct 30 2020 8:00 PM

Good News For HYD RTC Passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుక్రవారం శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. కోవిడ్ లాక్‌డౌన్‌లో తీసుకున్న బస్ పాస్‌లో(ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఎయిర్‌పోర్ట్‌ పుష్పక్‌ ఎసీ బస్‌) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్‌ జోన్‌ టీఎస్‌ఆర్టీసీ కల్పించనుంది. దీంతో వినియోగదారులు అప్పటి బస్‌ పాస్‌ను కౌంటర్‌లో తిరిగి ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది. కొత్త పాస్‌లో కోల్పోయిన రోజులను కలిపి పాసులు జారీ చేయనుంది. ఈ సదుపాయాన్ని నవంబర్‌ 30 వరకు వినియోగించుకోవచ్చు. చదవండి: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement