Bus passengers
-
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
-
ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి..
సాక్షి, హైదరాబాద్: అతను ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడిన అతడికి వైద్యం చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టాడు.. రాత్రి వేళల్లో ల్యాప్‌టాప్‌తో బస్సుల్లో ప్రయాణించే వారినే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని పనామా క్రాస్‌రోడ్‌లో ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని ఎల్బీనగర్ సీసీఎస్ ఏసీపీ క్రైమ్ ఆర్.శేఖర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 16 ల్యాప్‌టాప్‌లు, 5 సెల్ఫోన్లు, 2 పవర్ బ్యాంక్, ఒక వాచ్ స్వాధీనం చేసుకున్నారు. ► భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన గుడికాడి నవీన్ కుమార్(41) ఖమ్మం జిల్లా పాల్వంచలోని లక్ష్మిదేవునిపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్‌గా స్థిరపడ్డాడు. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఇతను డబ్బు కోసం చోరీలు చేస్తుంటాడు. రాత్రి సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటాడు. ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో బస్‌లలో ప్రయాణించడాన్ని గమనిస్తుంటాడు. వారితో పాటు తోటి ప్రయాణికుడిగా బస్ ఎక్కుతాడు. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలకు బస్ చేరుకుంటుందనగా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను లాక్కొని రన్నింగ్ బస్ నుంచి సెకనులో దిగేసి పారిపోతాడు. లేదంటే దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లోని బ్యాచ్లర్స్ రూమ్స్‌లలోకి చొరబడి ల్యాప్‌టాప్స్‌ను దొంగిలిస్తుంటాడు. ► చోరీలో భాగంగా గత నెల 8వ తేదీన ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి నర్సరావుపేట నుంచి నిజాంపేట వెళ్లేందుకు హైదరాబాద్ బస్ ఎక్కారు. వాళ్లు పనిచేసే కంపెనీ ఇచ్చిన హెచ్‌పీ, డెల్ ల్యాప్‌టాప్‌లను తీసుకొని బస్‌లో కూర్చున్నారు. వాళ్ల మొబైల్ ఫోన్లను కూడా అదే బ్యాగ్‌లో పెట్టేసి పడుకున్నారు. ఇది గమనించిన నిందితుడు నవీన్ కుమార్ అదే బస్‌లో ఎక్కాడు. రిజర్వేషన్ చేసుకుంటే వివరాలు తెలిసిపోతాయని.. టికెట్‌కు సరిపోయే డబ్బులు చెల్లించి వారి పక్కనే కూర్చున్నాడు. బస్ ఆటోనగర్‌కు సమీపిస్తున్న సమయంలో నిందితుడు ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో దిగి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసుకునేసరికి ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు కనిపించకపోయేసరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► గతంలో నవీన్ కుమార్ మీద వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్‌పేట, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో 5 కేసులు నమోదయ్యాయి. చదవండి: అటవీ ప్రాంతంలో పేకాట.. -
అతడే ఒక సైన్యంలా..!
భువనేశ్వర్: ఓ జవాన్ తెగువ.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి ప్రాణాలను కాపాడగలిగింది. ఒడిశాలోని కియోంజర్ 2వ ప్రత్యేక భద్రతా దళానికి చెందిన జవాన్ హిమాంశు శేఖర పాత్రో కటక్ నుంచి భువనేశ్వర్‌కి బస్సులో ఆదివారం ఉదయం బయలుదేరాడు. డెంకనాల్ జిల్లా సమీపంలోకి రాగానే కొంతమంది దుండగులు బస్సుని ఆపారు. డ్రైవర్ తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. ప్రయాణికులు భయపడుతుండగా బస్సులో ఉన్న జవాన్ సాహసించి ఒక్కసారిగా దుండగుల వైపు దూకాడు. వారి చేతిలోని తుపాకీని స్వాధీనం చేసుకుని వారికే గురిపెట్టాడు. దీంతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకులు ఎవరు, ఎందుకు దాడి చేశారనే దానిపై విచారిస్తున్నట్లు డెంకనాల్ జిల్లా ఇన్చార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ జగ్మోహన్ మీనా తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చదవండి: (ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు) ఘటనాస్థలంలో నిలిచిపోయిన బస్సు జవాన్‌కు డీజీపీ సత్కారం.. దుండగుల బారి నుంచి ప్రయాణికులను కాపాడిన జవాన్ పాత్రోని ఒడిశా డీజీపీ అభయ్ విందుకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జవాన్‌కు డీజీపీ ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. హిమాంశు చాలా ధైర్యవంతుడని, సాదాసీదా వ్యక్తిత్వంతో విధి నిర్వహణలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని డీజీపీ ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో స్పందించి, బస్సు ప్రయాణికుల ప్రాణాలను రక్షించడంలో జవాన్ అంకితభావం స్ఫూర్తిదాయకమని డీజీపీ అన్నారు. దుండగుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ -
సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుక్రవారం శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. కోవిడ్ లాక్డౌన్లో తీసుకున్న బస్ పాస్‌లో(ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్పోర్ట్ పుష్పక్ ఎసీ బస్) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీఎస్ఆర్టీసీ కల్పించనుంది. దీంతో వినియోగదారులు అప్పటి బస్ పాస్‌ను కౌంటర్లో తిరిగి ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది. కొత్త పాస్‌లో కోల్పోయిన రోజులను కలిపి పాసులు జారీ చేయనుంది. ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవచ్చు. చదవండి: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త -
బాబోయ్ బస్సు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో దసరా సెలవుల రద్దీ కొనసాగుతోంది. ప్లాట్ఫారం మీదకి వచ్చిన ప్రతీ బస్సు క్షణాల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. పండుగ రద్దీ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ‘దసరా స్పెషల్’పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి 4,480 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు నడుస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 21 వరకు ఈ సర్వీసులు తిరుగుతాయి. ప్రతీ బస్ టికెట్‌పై ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. కార్యాలయాలు, కళాశాలలు, ఇతర కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించిన దరిమిలా.. ఈ రద్దీ ఆదివారం నుంచి మరింత పెరిగింది. బస్సు దొరికితే చాలు, కనీసం నిలబడి అయినా సరే వెళదామనుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. కానరాని సదుపాయాలు.. రద్దీ నేపథ్యంలో ఎంజీబీఎస్, ఉప్పల్, కాచిగూడ, జేబీఎస్‌ల నుంచి ఆర్టీసీ దసరా స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులు ఉన్నాయి. వీటిలో చాలా బస్సుల్లో సరైన సదుపాయాల్లేవు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కిటికీలు సరిగ్గా లేక రాత్రిపూట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీలు లేక ఖాళీ అరలు దర్శనమిస్తున్నాయి. అయినా టికెట్ ధరలో ఎలాంటి మార్పులు ఉండకపోవడం గమనార్హం. ఇక రాజధాని, గరుడ బస్సుల్లో దుప్పట్లు, వాటర్ బాటిళ్లు అందజేయాలి. కానీ కొన్ని బస్సుల్లో వాటిని ఇవ్వడం లేదని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే బుకింగ్ ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపుల్లో ప్రతి టికెట్‌పై అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అయినా, వీరికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పలుచోట్ల డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. సమస్య పరిష్కారమైంది: మునిశేఖర్ సీటీవో, టీఎస్ఆర్టీసీ కరీంనగర్, వరంగల్‌తోపాటు కొన్ని జిల్లాలకు వెళ్లే బస్సుల్లో దుప్పట్లు, వాటర్ బాటిళ్లు అందించడం లేదన్న ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం వాస్తవమే. వీటిని సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో జరిగిన జాప్యమే దీనికి కారణం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ప్రయాణికులు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నా.. ఆ బస్సులన్నీ తిరిగి వచ్చేటప్పడు ఖాళీగానే వస్తున్నాయి. అందుకే తాము ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాం. -
తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
అర్థరాత్రి రోడ్డుపై పడిగాపులు
- చెడిపోయిన ఎస్ఎల్ ట్రావెల్స్ - ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు గుత్తి: ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించి ప్రయాణం సాగిస్తున్న వారి కష్టాలు చెప్పనలవి కాని విధంగా మారుతున్నాయి. అకస్మాత్తుగా బస్సు రిపేరుకు వస్తే.. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో చెడిపోయింది. అయితే ట్రావెల్స్ యాజమాన్యం బస్సును రిపేర్ చేయించడం గానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గానీ చేయలేదు. దీంతో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు రోడ్డుపై అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం స్పందించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపక పోవడంతో వారంత గత అర్థరాత్రి నుంచి రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకులు రహదారిపై ఆందోళనకు దిగారు. -
ఆగిన కేశినేని బస్సు : ప్రయాణికులు ఇక్కట్లు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సులో శనివారం అర్థరాత్రి సాంకేతికలోపం ఏర్పడింది. దాంతో బీదర్ సమీపంలో బసవ కల్యాణం వద్ద బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. దాంతో అర్థరాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం నివారించేందుకు చర్యలు తీసుకోవడం కానీ... ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేయడం కానీ ట్రావెల్స్ యాజమాన్యం చేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసిన సదరు ట్రావెల్స్ ... తమను నడి రోడ్డుపై నిలిపి చోద్యం చూస్తుందని ప్రయాణికులు కేశినేనిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. -
లారీ - బస్సు ఢీ: ఆరుగురికి గాయాలు
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం నుంచి హిందూపురం వెళ్తున్న బస్సు ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 6 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు హిందుపురం డిపోకు చెందినది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బస్సు - లారీ ఢీ: 12 మందికి గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా విడపనకల్ సమీపంలోని రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు - ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఉరవకొండ నుంచి హోస్పేట్ వైపు వెళ్తున్న బస్సు ... ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని తప్పించే క్రమంలో లారీని ఢీ కొట్టిందని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏమున్నది గర్వకారణం..
సాక్షి, కడప : జిల్లాలోని కొన్ని బస్టాండ్లలో బస్సు ఎక్కాలంటే అదిరిపోవాల్సిందే. కడప పాత బస్టాండులాంటి ప్రాంతాల్లో ప్రొద్దుటూరు, కమలాపురం వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేచోట చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే. దుర్వాసనతో అదిరిపోవాల్సిందే! బస్టాండు ప్రాంగణంలో చెత్తతోపాటు ఆరుబయటే మల, మూత్ర విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. అనేక చోట్ల తాగునీటి సౌకర్యం లేదు. మూత్ర శాలలు అంతంత మాత్రమే. ప్రయాణికులకు బస్టాండుచుట్టుపక్కల ఉన్న పరిసరాలే మరుగుదొడ్లుగా, మూత్రశాలలుగా మారుతున్నాయి. ఆర్టీసీ అధికారులు బస్టాండుల నిర్వహణను గాలికొదిలేశారు.బస్టాండ్లలో తాగునీటి సౌకర్యం కల్పించామని చెబుతున్నప్పటికీ ట్యాంకులు శుభ్రపర్చక పోవడంతోపాటు నీరు బాగా లేకపోవడంతో ఆ నీటిని ప్రయాణికులు ఎవరూ తాగడం లేదు. కడప పాత బస్టాండు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తతోపాటు ప్రాంగణంలోనే మూత్ర, మల విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. బుగ్గవంక సమీపంలో పాతబస్టాండ్ ఉండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. బస్టాండులో ప్రయాణికులు నిలువలేని పరిస్థితి నెలకొంది. ప్రొద్దుటూరులో 30 ఏళ్ల నాటి భవనం పెచ్చులూడి అధ్వానంగా కనిపిస్తోంది. పురుషుల మరుగుదొడ్లు ఏడాదిగా పనిచేయడం లేదు. తాగునీటి కొళాయి వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. చెత్త, పందుల సంచారంతో పరిసరాలన్నీ దుర్వాసనతో అధ్వానంగా ఉన్నాయి. అధికారులు డిపోలోకి ప్రతిరోజు వెళుతూ వస్తున్నప్పటికీ ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు కొత్త బస్టాండులో తాగడానికి నీరు, కూర్చోవడానికి సీట్లు లేవు. ప్రయాణికులకు సమాచారం అందించేవారు కూడా లేరు. మరుగుదొడ్ల పరిస్థితి అంతంత మాత్రమే. ముద్దనూరు, మైలవరంలో లక్షలాదిరూపాయలు వెచ్చించి బస్టాండు నిర్మాణాలు చేపట్టినప్పటికీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. రాయచోటి బస్టాండులో మరుగుదొడ్ల కొరత ఉంది. ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సి వస్తోంది. ప్రయాణికులు కూర్చోనేందుకు కనీసం స్థలం కూడా సరిగా లేదు. మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేకోడూరులో బస్టాండు సౌకర్యం లేదు. 1993లో నిర్మించినప్పటికీ ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. హైవే రోడ్డే ప్రయాణికులకు దిక్కయింది. మహిళలు బస్సు ఎక్కాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే! బద్వేలులో ఎటు చూసినా మూత్ర విసర్జన, చెత్తాచెదారం, పందుల సంచారంతో బస్టాండు పరిసరాలలో దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. తాగేందుకు నీటి సౌకర్యం లేదు. రాజంపేటలో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. బస్టాండు ఆరంభంలోనే చెత్త దర్శనమిస్తుంటుంది. పాత బస్టాండులో నిలబడేందుకు కూడా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పులివెందులలో ప్రయాణికుల సౌకర్యార్థం మినరల్ ప్లాంట్ ఉన్నప్పటికీ అది పనిచేయకపోవడంతో కుళాయి నీళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. పందుల సంచారంతోపాటు పరిసరాల్లోని చెత్తతో ఇబ్బందులు తప్పడం లేదు. మైదుకూరులో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. పరిసరాల్లో ప్రవహిస్తున్న మురుగునీరు, చెత్తతో బస్టాండు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కమలాపురంలోబస్టాండు ఉన్నప్పటికీ బస్సులు వెళ్లే పరిస్థితి లేదు. బస్టాండు శిథిలావస్థకు చేరింది. మెయిన్‌రోడ్డులోనే నిలబడి తోసుకుంటూ బస్సు ఎక్కాల్సిందే! -
నిబంధనలకు పాతర !
పట్టుబడ్డ ప్రైవేటు బస్సుల్లో సగం వోల్వోలే పాలెం ఘటన తర్వాతా బస్సుల్లో బాణసంచా తరలింపు అదనపు ఆదాయం కోసం లారీల తరహాలో సరుకు రవాణా అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న దిమ్మతిరిగే వాస్తవాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రహదారులపై పరుగులుపెడుతున్న వోల్వో బస్సుల సంఖ్య 650. పాలెం దుర్ఘటన తర్వాత రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో ఇప్పటి వరకు జప్తు చేసిన వోల్వో బస్సుల సంఖ్య 320. రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఏ స్థాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో ఈ సంఖ్యే స్పష్టం చేస్తోంది. 45 నిండుప్రాణాలను బలి తీసుకున్న పాలెం దుర్ఘటన తర్వాత కూడా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల్లో మార్పు రాలేదనటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. పాలెం దుర్ఘటన జరిగిన మూడు రోజులకే... రెండు బస్సులు లగేజీ బాక్సులో బాణసంచాను తరలిస్తూ పట్టుబడ్డాయి. రవాణా శాఖ అధికారులవి తాటాకు చప్పుళ్లే అని బలంగా విశ్వసించే ట్రావెల్స్ యజమానులు యథాప్రకారం నిబంధనలు కాలరాస్తూ బస్సులను నడుపుతున్నారు. వోల్వో ఎగ్జాస్ట్ సిస్టమ్‌కు చేరువగా ఉండే లగేజీ బాక్సులో నిప్పు పుట్టించే వస్తువులు ఉంచకూడదు. కానీ కాసుల కోసం పెద్ద సంఖ్యలో వస్తువులను తరలించే అలవాటున్న బస్సు నిర్వాహకులు బాణసంచాను కూడా తరలించేందుకు సిద్ధపడ్డారు. అధికారుల తనిఖీలో ఈ విషయం వెలుగు చూడటంతో.. ఆ రెండు బస్సులను జప్తు చేయటమే కాక.. యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంతకాలం కళ్లుమూసుకున్న రవాణా శాఖ అధికారులు, పాలెం దుర్ఘటన తర్వాత ఏ ఒక్క బస్సునూ వదలకుండా తనిఖీలు చేస్తూ నిబంధనలను విస్మరిస్తున్న వాటిని అక్కడికక్కడే జప్తు చేస్తున్నారు. ఇదే పని ఇప్పటికే చేసి ఉంటే నిబంధనలు అపహాస్యం అయిఉండేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ తనిఖీలైనా ఎంతకాలం కొనసాగుతాయన్నదే అసలు ప్రశ్న. గతఏడాది జూన్‌లో శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాదానికి గురై 32 మంది చనిపోయినప్పుడు ఇలాగే తనిఖీలు చేసి.. 500 బస్సుల వరకు సీజ్ చేసిన అధికారులు ఆ తర్వాత చూసీచూడనట్టు వ్యవహరిం చారు. ఇప్పుడు కూడా ఈ హడావుడి మధ్యలో నిలిచిపోయే అవకాశం లేకపోలేదు. ఉల్లంఘనలెన్నో: ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలుగా ఉండే అత్యవసర ద్వారం వద్ద కొంతమేర ఖాళీ వదలాలి. ఆ స్థలంలో అదనపు సీట్లను బిగించిన వ్యవహారాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. బస్సుల్లో అదనపు ప్రయాణికులు కూర్చోవటానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పాలెం ఘటనలో ఈ అదనపు సీట్ల వల్లే ప్రాణనష్టం పెరిగింది. కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి పొంది స్టేజి క్యారియర్‌గా నడుపుతున్న బస్సులపైనా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం కర్ణాటకలో ప్రమాదానికి గురైన బస్సు ఇలాంటి నిబంధన ను అతిక్రమించిందే. మన రాష్ట్రంలోనూ మూడొంతుల బస్సులు ఇలాగే అనుమతి లేకుండా నడుస్తున్నాయి. దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లుండాలి. ఆరు గంటల డ్రైవింగ్ తర్వాత డ్రైవర్ మారాలి. కానీ 90% బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా లగేజీ బాక్సులో సరుకులు బట్వాడా చేస్తున్నారు. ప్రయాణికుల తాలూకు వస్తువులు ఉంచాల్సిన చోట లారీల తరహాలో సరుకు రవాణా చేస్తూ ట్రావె ల్స్ నిర్వాహకులు అదనపు ఆదాయం పొందుతున్నారు. బస్సులో ప్రయాణికుల వివరాలతో జాబితా ఉండాలి. కానీ మూడొంతుల బస్సుల్లో అది ఉండటం లేదు. ఉన్నా అందులోని వివరాలకు.. ప్రయాణిస్తున్న వారి వివరాలకు పొంతన ఉండటం లేదు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు కొందరు మృతుల వివరాలు దొరక్కపోవటానికి ఇదే కారణం. వోల్వోను వదిలించుకుందాం! చారణా కోడికి బారాణా మసాలా అనే హైదరాబాదీ సామెత రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నడుపుతున్న వోల్వో బస్సులకు అతికినట్టు సరిపోతుంది. వీటి ఖరీదు దాదాపు రూ. కోటి. పైగా చిన్న చిన్న మరమ్మతులకు కూడా లక్షల్లో చమురు వదులుతోంది. పైగా వీటితో ఆదాయం మాట అటుంచి నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. తెల్ల ఏనుగులుగా మారిన బస్సులను వదిలించుకోవాలని ఏపీటీడీసీ నిర్ణయించిందని సమాచారం. ఇకపై విదేశీ తయారీ వాహనాలను కొనుగోలు చేయబోదంటున్నారు. 2002- 2005 మధ్య కొన్న ఒక్కోటీ దాదాపు రూ.60 లక్షల చొప్పున కొన్న 11 వోల్వో బస్సులను తుక్కు కింద సంస్థ అమ్మకానికి పెట్టింది! కానీ వాటిని కొనేందుకు ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. ఇవి పోను ఏపీటీడీసీ నడిపే 106 బస్సు సర్వీసుల్లో మరో 20 వోల్వోలు, 8 మెర్సిడస్ బెంజ్ వాహనాలున్నాయి. వోల్వో బస్సు ఖరీదు ప్రస్తుతం రూ.85 లక్షల నుంచి రూ. 1.08 కోట్లుంది. అదే దేశీయ తయారీ హైటెక్ ఏసీ బస్సు రూ.35 లక్షలుంది. అంటే ఒక్క వోల్వోకు వెచ్చించే మొత్తంతో మూడు హైటెక్ ఏసీ బస్సులను సమకూర్చుకోవచ్చు.