ఒంగోలు సబర్బన్: గోదావరి పుష్కరాల తరువాత జర్నలిస్టుల బస్‌పాస్‌ల వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కరాలు పూర్తి కాగానే యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలను తీవ్రంగా ఖండించాలని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ ప్రభుత్వానికి సూచించారు. యూనియన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ శ్రీకాంత్, జేసీ హరిజవహర్‌లాల్, ఐజేయూ నాయకుడు కె.శ్రీనివాసరెడ్డి, ప్రెస్‌కౌన్సిల్ సభ్యుడు అమర్‌నాథ్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వి.సుబ్బారావు, నాయకులు అంబటి ఆంజనేయులు, నరేంద్రరెడ్డి, నల్లి ధర్మారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురళి, సురేష్, ప్రజానాట్యమండలి నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాల తరువాత జర్నలిస్టులకు బస్‌పాస్‌లు
Published Mon, Jul 13 2015 8:54 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement