కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు | Devulapalli Amar Comments On Journalist Who Died Due To Corona | Sakshi
Sakshi News home page

కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు

Published Fri, Aug 13 2021 4:20 PM | Last Updated on Sat, Aug 14 2021 1:09 PM

Devulapalli Amar Comments On Journalist Who Died Due To Corona - Sakshi

సాక్షి, అమరావతి: కరోనాతో చనిపోయిన జర్న లిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు చాలా మంది కరోనాతో చనిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశ వైరస్‌ విజృంభణలో ఎక్కువమంది జర్న లిస్టులు మృతిచెందారని తెలిపారు. వీరి కుటుం బాలకు శాశ్వత మేలు కల్పించడానికి ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే ఈ సాయం ఆ కుటుంబాలకు పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వలేదని భావించి శాశ్వత మేలు చేయాలని ఆలోచిస్తోందని చెప్పారు.

జర్నలిస్టుల పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలినుంచి సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు సంతకం చేసిన కొద్ది ఫైళ్లలో జర్నలిస్టుల హెల్త్‌స్కీమ్‌ ఫైలు ఒకటని గుర్తుచేశారు. ఐజేయూ అధ్యక్షుడు ఇటీవల మాట్లాడుతూ ఏపీలో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని, దీనిపై ప్రశ్నించాలంటూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించడం సమంజ సం కాదన్నారు. ఈ నెల 17న ఏపీయూడబ్ల్యూజే ఆ విర్భావ దినోత్సవాన్ని సా వధాన దినోత్సవంగా జరు పుకోవడానికి పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు.

యాజమాన్యాలను ఎందుకు ప్రశ్నించరు?
రూ.కోట్లు ఆర్జిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనాలివ్వని యాజమాన్యాల ను యూనియన్‌ నాయకులు ఎందుకు ప్రశ్నించరని అమర్‌ దుయ్యబట్టారు. ఏపీడబ్ల్యూ జర్నలిస్టుల సంక్షేమానికి అనేక రాయితీలు ఇస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం యూనియన్‌ నాయకులకు తగదన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టులపై దాడులు జరిగాయో ఆధారాలతో ని రూపించాలని డిమాండ్‌ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం జర్నలిస్టులను అన్ని విధా లుగా ఆదుకుందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానీని కలిసి జర్నలిస్టు యూనియన్‌ నాయకులు కృతజ్ఞత లు తెలిపారని, ప్రస్తుతం వారే ప్రభుత్వంపై బురద జల్లే చర్యలకు దిగుతుండటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

ఇళ్ల స్థలాల కేటాయింపు పరిశీలనలో ఉంది
రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అక్రిడిటేషన్‌ మంజూరు చేస్తుందని చెప్పారు. అక్రిడిటేషన్‌లు ఇవ్వడంలో ఆలస్యమైందని విమర్శించే వారు దాని వెనుక వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అక్రిడిటేషన్‌ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కృషి చేస్తున్నారని తెలిపారు. చిన్న పత్రికలకు జీఎస్టీ మినహాయింపు, అక్రిడిటేషన్‌ కమిటీల్లో యూనియన్‌లకు ప్రాతినిథ్యం అంశాలు సమాచారశాఖ దృష్టిలో ఉన్నాయన్నారు. వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.

సగర్వదినంగా జరుపుకోవాలి: యూనియన్ల నేతలు
రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో తెలియజేస్తూ ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెన్ను శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల యూనియన్‌ నాయకులు శుక్రవారం ఓ ప్రకట నలో తెలిపారు. ఈ 17న ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని జర్నలిస్టులు సావధాన దినంగా కాకుండా సగర్వ దినంగా జరుపుకోవా లని పిలుపునిచ్చారు.  కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు కలి గించేదిశగా ప్రభుత్వం ఆలోచించడం హర్షణీయ మని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతమైన ఆలోచన విధానంతో ఉన్నారని, జర్నలిస్టులకు త్వరలోనే తీపి కబురు అందిస్తామని అమర్‌ హామీ ఇచ్చారని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement