
సాక్షి, హైదరాబాద్ : అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌ల కోసం ఇకనుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమలులోకి రానుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు పేర్కొన్నారు. బస్‌పాస్‌ల కోసం జర్నలిస్టులు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్‌ఎం కార్యాలయాలకు వెళ్లకుండా సమీపంలోని బస్‌పాస్ కౌంటర్ నుంచి పొందేలా వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. ప్రస్తుతం జర్నలిస్టుల బస్‌పాస్‌ల గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ఆర్టీసీ అమలు చేయనుంది.
ఆన్‌లైన్‌లో బస్‌పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు ఫోన్‌లో టీఎస్‌ఆర్టీసీ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత జర్నలిస్టులు తమ సమీపంలోని బస్‌పాస్ కౌంటర్‌కు వెళ్లి మెసేజ్‌ను చూపిస్తే అక్కడ బస్‌పాస్ జారీ చేస్తారని టీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment