ఏపీ: ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి తీపి కబురు | Free Travel Facility For APSRTC Outsourcing Staff | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి తీపి కబురు

Published Thu, Dec 17 2020 7:25 PM | Last Updated on Thu, Dec 17 2020 9:46 PM

Free Travel Facility For APSRTC Outsourcing Staff - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయబోతోంది. ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపో/యూనిట్లకు సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం కల్పించాలని గత కొద్ది కాలంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు)

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్‌పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్‌ పాస్‌లు చెల్లుబాటవుతాయి. ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. (చదవండి: రేపు అర్ధరాత్రి వరకు వెబ్‌ఆప్షన్లకు గడువు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement