![APSRTC 2400 special buses for Sankranti: Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/28/APSRTC-EXPRESS-BUS-3.jpg.webp?itok=l0SjcwAB)
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రెగ్యులర్‌గా నడిచే సర్విసులతో పాటు 2,400 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు డిఫ్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.విజయలక్ష్మి తెలిపారు. ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడుపుతారు. ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి లేదా అ«దీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు, బస్సుల రద్దీ దృష్ట్యా.. జనవరి 10వ తేదీ నుంచి 12 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక బస్సులను గౌలిగూడ సీబీఎస్ నుంచి నడుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment