special buses
-
సంక్రాంతికి 7,200 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా 7,200 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వాటిలో సంక్రాంతి పండుగకు ముందు ఈ నెల 8 నుంచి 13 వరకు 3,900 బస్సు సర్వీసులు, పండుగ తర్వాత ఈ నెల 16 నుంచి 20 వరకు 3,300 బస్సు సర్వీసులను నడపనుంది. రోజువారి తిరిగే బస్సు సర్వీసులకు అదనంగా ఈ సంక్రాంతి స్పెషల్ బస్సులను నడుపుతారు. పండుగకు ముందు 3,900 ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అత్యధికంగా 2,153 సర్వీసులు హైదరాబాద్ నుంచే నడుస్తాయి. బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42, విజయవాడ నుంచి 300, విశాఖ నుంచి 250, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 50, ఇతర ముఖ్య ప్రాంతాల నుంచి 500 బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసినట్టుగానే సాధారణ చార్జీలతోనే ఈ స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒకేసారి రానూపోనూ టికెట్ కొనుగోలు చేసినవారికి 10 శాతం రాయితీ ప్రకటించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 149, 0866–2570005 కాల్ సెంటర్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. – సాక్షి, అమరావతి -
సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ 2,400 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రెగ్యులర్‌గా నడిచే సర్విసులతో పాటు 2,400 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు డిఫ్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.విజయలక్ష్మి తెలిపారు. ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడుపుతారు. ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి లేదా అ«దీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు, బస్సుల రద్దీ దృష్ట్యా.. జనవరి 10వ తేదీ నుంచి 12 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక బస్సులను గౌలిగూడ సీబీఎస్ నుంచి నడుపుతారు. -
దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు..
-
19 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: గురుపౌర్ణమి సందర్భంగా భక్తు లు అరుణాచలంలో గిరిప్రదక్షిణకు ఆసక్తి చూపుతారు. గత కొన్నేళ్లుగా అక్కడికి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో ఈసారి స్పెషల్ బస్సులు పెంచాలని సంస్థ నిర్ణయించింది.ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర పట్టణాల నుంచి వీటిని నడపనుంది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా, 19 నుంచి 22 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది. అరుణాచలంతోపాటు కాణిపాకం, శ్రీపురం కూడా దర్శించుకునేలా ఈ ప్యాకేజీని ఏర్పాటు చేసింది. -
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్‌లో కమిన్స్ బృందం తప్పక గెలవాలి.అయితే, వర్షం రూపంలో సన్‌రైజర్స్- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్లో సన్‌రైజర్స్ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఆ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్, జూబ్లీ బస్‌స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.మెట్రోలో సైతంఅలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐThe Risers are back to Hyderabad 🧡💪 pic.twitter.com/uecAotesSz— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2024 -
మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగనుంది. ఇక, ఈసారి మేడారం జాతర కోసం భక్తులు ఇప్పటి నుంచే పోటెత్తుతున్నారు. దీంతో, టీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదే సమయంలో మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, తాజాగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ..‘మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నాం. ఇక, మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించాం. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉ. 6.00, 6.30 గంటలకు జేబీఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. పెద్దలకు రూ. 750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.00, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇందులో రానుపోను టిక్కెట్ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లు. సూపర్‌లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులను కూడా నడుపుతారు. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. సూపర్ లగ్జరీలో టిక్కెట్ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు. -
సంక్రాంతికి తెలంగాణ నుంచి అదనంగా వెయ్యి ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి ఉన్న పరిమితులను ఏపీఎస్ఆర్టీసీ సమర్థంగా అందిపుచ్చుకోవడమే అందుకు తాజా నిదర్శనం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అదనంగా వెయ్యి సంక్రాంతి స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాస్తవానికి ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ కింద 6,725 బస్సులను నడపాలని నిర్ణయింది. అందులో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ముందు 1,600 బస్ సర్విసులు, సంక్రాంతి తరువాత 1,500 బస్ సర్విసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. ఏటా సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడిపేది. కానీ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో అంచనాలకు మించి మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్విసులు నడపలేమని తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసింది. ఈ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ సద్వినియోగం చేసుకుంది. పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేందుకు అదనంగా వెయ్యి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నాలకు అదనపు వెయ్యి బస్సు సర్విసులు నడుపుతారు. బెంగళూరు, చెన్నైల నుంచి కూడా మన రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వీటితోపాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపురం, తిరుపతిలకు అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మెరుగైనసేవలు అందించేందుకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు చెప్పారు. -
AP: సంక్రాంతి కానుక.. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే..
అదనపు చార్జీల భారం లేకుండా సాధారణ చార్జీలతోనే సంక్రాంతి పండుగ ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి 18 వరకు మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాది సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిల్లో రిజర్వేషన్ల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. – సాక్షి, అమరావతి ప్రత్యేక బస్సుల వివరాలు.. ► ఈ నెల 6 నుంచి 14 వరకు 3,570 సర్వీసులు నిర్వహిస్తారు. తిరుగు ప్రయాణం నిమిత్తం ఈనెల 16 నుంచి 18 వరకు 3,225 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేస్తున్నారు. ► సంక్రాంతికి ముందుగా నిర్వహించే ప్రత్యేక సర్వీసుల విషయానికొస్తే.. హైదరాబాద్ నుంచి 1,600, బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40 సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటుచేశారు. ► అలాగే, రాష్ట్రంలో విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 790 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. ► సంక్రాంతి తరువాత ఈ నెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్ నుంచి 1,500, బెంగళూరు నుంచి 495, చెన్నై నుంచి 85 సర్వీసులను రాష్ట్రంలోని ప్రాంతాలకు ఏర్పాటుచేశారు. ► విజయవాడ నుంచి 200, విశాఖపట్నం నుంచి 395, రాజమహేంద్రవరం నుంచి 50, తిరుపతి నుంచి 50, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 700 సర్వీసులు నిర్వహిస్తారు. ► చార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కానుక ఇదీ.. నిజానికి.. సంక్రాంతి, దసరా పండుగల ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అధిక చార్జీలు వసూలు చేయడం రాష్ట్రంలో దశాబ్దాలపాటు అమలవుతూ వచ్చింది. ఒకటిన్నర రెట్లు చార్జీలు అంటే సాధారణ చార్జీలపై 50శాతం అధికంగా చార్జీలు వసూలు చేసేవారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సాధారణ చార్జీల కంటే రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేసేవి. ఫలితంగా ప్రయాణికులు భారీ ఆర్థిక భారాన్ని వహించాల్సి వచ్చేది. ఈ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. సాధారణ చార్జీలతోనే పండుగ ప్రత్యేక సర్వీసులను కూడా నిర్వహించాలని నిర్ణయించింది. 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020, జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి 2021 నుంచి పండుగ ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నిర్వహిస్తోంది. వరసగా నాలుగో ఏడాదీ ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నిర్వహించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లలో 10శాతం రాయితీ.. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఆర్టీసీ కల్పించింది. ఒకేసారి రానూపోనూ రిజర్వేషన్ చేసుకుంటే 10శాతం రాయితీ ఇస్తోంది. దీంతో సాధారణ చార్జీల కంటే తక్కువతోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసేందుకు సూపర్వైజర్లను నియమించింది. బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటలు సేవలు అందించే సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. కాల్ సెంటర్ నంబర్లు 149, 0866–2570005. సద్వినియోగం చేసుకోండి ప్రయాణికులపై భారం పడకూడదనే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది నిర్ణయించింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లూచేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ -
సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు అదనంగా 4,484 బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇది గతేడాది సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల సంఖ్య కంటే దాదాపు 200 అదనం. కానీ, తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,500 ప్రత్యేక బస్సులు అవసరమని గుర్తించినప్పటికీ, కేవలం 600 సర్వీసులను మాత్రమే తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండటంతో బస్సులో విపరీతమైన రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఉన్న బస్సులు సరిపోవటం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు అందే అవకాశం లేకపోవటంతో పండగ ప్రత్యేక బస్సుల్లో సింహభాగం తెలంగాణ ప్రాంతంలోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీకి నడిపేందుకు చాలినన్ని బస్సులు లేకపోవటంతో, డిమాండులో సగానికంటే తక్కువ బస్సులతోనే సరిపుచ్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. 626 సర్విసులకు రిజర్వేషన్ సౌకర్యం ఇప్పుడు నడిపే 4,484 ప్రత్యేక బస్సుల్లో 626 సర్విసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈనెల ఏడో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి నేపథ్యంలో, సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో కూడా రద్దీ విపరీతంగా ఉండనున్నందున.. ఎక్కువ ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు పల్లెవెలుగు బస్సులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రత్యేక బస్సుల నిర్వహణ, ‘మహాలక్ష్మి’రద్దీని తట్టుకునే చర్యలపై చర్చించారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్ ప్రాంతాలలో ప్రత్యేక బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నందున ఆయా ప్రాంతాలకు సిటీ బస్సులను కూడా అదనంగా తిప్పాలని నిర్ణయించారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా జమయ్యే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో నీడ కోసం షామియానాలు, మంచినీటి వసతి, కుర్చిలను సిద్ధం చేయాలని, ప్రయాణికుల సందేహాలను తీర్చే వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రద్దీ ప్రాంతంలో ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఎలాంటి చార్జీ ఉండదని, సాధారణ టికెట్ చార్జీలే వర్తిస్తాయని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 1,450 సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ సర్విసులకు అదనంగా 1,450 బస్సులు తిప్పుతున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 10 నుంచి 13 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇవి తిరుగుతాయని పేర్కొన్నారు. వీటిల్లోనూ సాధారణ చార్జీలే వసూలు చేస్తారని, ఎలాంటి అదనపు చార్జీలుండవని తెలిపారు. రద్దీ నేపథ్యంలో 11వ తేదీ నుంచి 13 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు , మాచర్ల వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌కు బదులు, దాని ఎదురుగా ఉన్న ఓల్డ్ సీబీఎస్ (గౌలిగూడ బస్టాండు)లో ఆగుతాయని వెల్లడించారు. -
సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది. జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నారు. సంక్రాంతికి 6795 స్పెషల్ బస్సులు నడపనుంది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది. ఆర్టీసీ వెబ్సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు. రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
దసరా పండుగ స్పెషల్.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెయ్యి ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు రోజువారీగా తిరుగుతున్న 355 బస్సులకు ఇవి అదనంగా తిరుగుతాయి. ఈనెల 18 నుంచి 23 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. గతంలో పండుగ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేసే పద్ధతి ఉండేది. కానీ, ఈసారి ఎలాంటి ప్రత్యేక చార్జీలు లేకుండా సాధారణ టికెట్ ధరలే వసూలు చేయాలని నిర్ణయించారు. దసరా పండుగకు నగరం నుంచి ఏపీలోని సొంతూళ్లకు ప్రజలు భారీ ఎత్తున వెళ్తారు. ఈపాటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయి, పెద్ద ఎత్తున వెయిటింగ్ జాబి తా కనిపిస్తోంది. ప్రత్యేక రైళ్లు కూడా నిండిపోయాయి. దీంతో చాలామంది బస్సులపైనే ఆ ధారపడతారు. తెలంగాణ నడిపే బస్సులు కూడా చాలక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడపా లని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్, మియాపూర్, ఈసీఐఎల్, ఎంజీబీఎస్ల నుంచి ఇవి బయలుదేరతాయి. ఎంజీబీఎస్ లో రద్దీని నివారించేందుకు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచెర్ల తదితర ప్రాంతాలకు వెళ్లే సాధారణ, ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్ ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ ప్రాంగణం నుంచి నడుపుతారని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
సాధారణ చార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: అదనపు చార్జీల భారం లేకుండా దసరా పండుగ ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ చార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు నడపనుంది. దసరా కోసం ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేకంగా 5,500 బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ఈ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. ► దసరా పండుగకు ముందుగా ఈ నెల 13 నుంచి 22 వరకు 2,700 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. దసరా అనంతరం ఈ నెల 23 నుంచి 26 వరకు 2,800 బస్సు సర్వీసులు నడుపుతారు. ► అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి హైదరాబాద్ నుంచి 2,050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. ► విశాఖపట్నం నుంచి 480, రాజమహేంద్రవరం నుంచి 355, విజయవాడ నుంచి 885, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 1,137 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. ► చార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. ► దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించింది. ► బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాల్ సెంటర్ నంబర్లు 149, 0866–2570005. ► దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. -
TSRTC: రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. రాఖీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ప్రత్యే బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ఈనెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు వెయ్యి బస్సుల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. సజ్జనార్ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌తోపాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని గుర్తు చేశారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో 20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా అలానే పనిచేయాలన్నారు. టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. చదవండి: అమిత్ షా ఖమ్మం పర్యటనలో మార్పులు ‘అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఆ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ముడిపడి ఉన్న ఈ పండుగ నాడు.. మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యూలర్ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత రాఖీ పౌర్ణమి రోజున అక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 87 శాతంగా నమోదైంది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లు 90 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదైంది. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది’ అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు. పండుగ నాడు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్‌లతో పాటు హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు, తదితరులు పాల్గొన్నారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఏపీ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు
-
మహాశివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈనెల 18న 2,427 బస్సులను నడపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు 17వ తేదీ నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలానికి 578 బస్సులు, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, ఆలంపూర్కు 16, రామప్పకు 15, ఉమామహేశ్వరానికి మరో 14 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు ఈ ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. వీటికి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఏపీకి 3,300 ‘సంక్రాంతి’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఏపీవాసుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడపనున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలకు 1,800 బస్సులు నడపాలని నిర్ణయించగా తాజాగా టీఎస్ఆర్టీసీ దాదాపు 1,500 బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. గత రెండేళ్లలో కోవిడ్ తీవ్రత వల్ల సిటీ నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు బస్సులు తగ్గించిన ఇరు ఆర్టీసీలు.. ప్రస్తుతం భారీగా బస్సు సర్వీసులు పెంచాయి. ఈసారి నగరం నుంచి ఏపీకి దాదాపు 15లక్షల మంది వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జనవరి 6 నుంచి 14 వరకు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ (ఓల్డ్ హాంగర్) నుంచి నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కృష్ణకిషోర్ నాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రావైపు వెళ్లే బస్సులను దిల్సుఖ్నగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ నుంచి, కరీంనగర్‌వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి నడిపేందుకు సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రత్యేక చార్జీలు లేకుండానే.. నిజానికి రెండు ఆర్టీసీలు నడిపే ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సరిపోవు. ఎక్కువ మంది రైళ్లలో వెళ్లనుండగా అంతకంటే ఎక్కువ మంది సొంత, ప్రైవేటు వాహనాల్లో వెళ్తుంటారు. కొంతకాలంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులతోపాటు కార్లు, మినీ బస్సుల వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకొనే క్రమంలో ఇరు ఆర్టీసీలు పండుగ స్పెషల్ బస్సుల్లో విధించే 50 శాతం అదనపు చార్జీని రద్దు చేశాయి. తెలంగాణ ఆర్టీసీ ఏపీ, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ సర్వీసులు కాకుండా 4,233 అదనపు బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ నిత్యం హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 352 బస్సులను నడుపుతోంది. పండుగ నేపథ్యంలో ఆ బస్సులకు అదనంగా 1,800 స్పెషల్ బస్సులు తిప్పనున్నట్లు ప్రకటించింది. -
సంక్రాంతికి 6,400 స్పెషల్ బస్సులు.. రిజర్వేషన్‌పై 10శాతం రాయితీ!
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగకు స్వగ్రామం వెళ్లాలని భావిస్తున్నవారికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. సంక్రాంతి రద్దీకి తగ్గట్లుగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సోమవారం ప్రకటించారు. సంక్రాంతి కోసం మొత్తం 6,400 బస్సులు అదనంగా తిప్పనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండగ సందర్భంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు ఎండీ తిరుమలరావు. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుపుతామన్నారు. జనవరి 6 నుంచి 14 వరకు 3,120 బస్సులు, సంక్రాంతి తర్వాత మరో 3,280 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే అదనంగా 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: విజయవాడ: క్రిస్మస్ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్ -
ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశపట్టిన ‘హైదరాబాద్ దర్శిని’ సిటీ టూర్ బస్సుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శని, ఆదివారాల్లో వీటిని నడుపుతారు. 12 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు. - శని, ఆదివారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. - బిర్లామందిర్, చౌమొహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్‌లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తరువాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఛార్జీలు ఇవే.. - మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 . - మెట్రో లగ్జరీ బస్సుల్లో.. పెద్దలకు రూ.450 , పిల్లలకు రూ.340 . -
AP: ఆర్టీసీకి జై కొట్టిన ప్రయాణికులు.. రెగ్యులర్ చార్జీలతోనే రెట్టింపు ఆదాయం
సాక్షి, అమరావతి: దసరా సీజన్లో కూడా రెగ్యులర్ చార్జీలే అమలు చేసిన ఆర్టీసీకి ప్రయాణికులు జై కొట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4,500 సర్వీసుల్లో ఏకంగా 1.84 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. 80 శాతం ఆక్యుపెన్సీ రేటుతో రూ.4.42 కోట్ల ఆదాయం సమకూర్చారు. కొత్త రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే... దశాబ్దకాలంగా ఆర్టీసీ దసరా సీజన్లో అధిక చార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. రెగ్యులర్ టికెట్ల కంటే 50శాతం పెంచడం పరిపాటిగా మారింది. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది దోహద పడుతుందని భావించేవారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగుల జీతాల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో సర్వీసులే తక్కువుగా నడిపారు. తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్లో అధిక చార్జీలు వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 25 నుంచి దసరా వరకు 2,206 ప్రత్యేక సర్వీసులు నడిపింది. రెగ్యులర్ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే ప్రాధాన్యమిచ్చారు. గతేడాది 150 శాతం చార్జీలు వసూలు చేసినా సరే రూ.2.10కోట్ల రాబడే వచ్చింది. ఆర్టీసీపై ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ దసరా సీజన్ ప్రతీకగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో 10వ తేదీ వరకు 2,400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. -
దసరాకు 1,072 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
బస్టాండ్( విజయవాడ పశ్చిమ): దసరా సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఎన్టీఆర్ జిల్లా నుంచి వివిధ దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఏసుదానం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు, విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు 1,072 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, సాధారణ చార్జీలే అమలవుతాయని తెలిపారు. అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో 40 బస్సులను పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి రాయలసీమ ప్రాంతాలైన రాయదుర్గం, కదిరి, అనంతపురం, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, కర్నూలు, నంద్యాల గుంతకల్ ప్రాంతాలకు, విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, భద్రాచలానికి ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్టు తెలిపారు. అలాగే హైదరాబాద్, చెన్త్నె, బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే బస్సులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకూ ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు ఏసుదానం వెల్లడించారు. -
గాయత్రీ దేవిగా 'కనకదుర్గమ్మ' దర్శనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన బుధవారం అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. క్యూలైన్లు సాఫీగా సాగిపోయేలా ఏర్పాట్లు చేయడంతో సామాన్యులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అవుతోంది. కొండపైకి ప్రొటోకాల్, డిజిగ్నేటెడ్ విఐపీల వాహనాలు తప్ప, ఇతరుల వాహనాలు రాకుండా కట్టడి చేశారు. కనులవిందుగా నగరోత్సవం ఆది దంపతుల నగరోత్సవం నయన మనోహరంగా సాగింది. గంగాసమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహా మండపం నుంచి నగరోత్సవం ప్రారంభమైంది. దుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, కారుమూరి దర్శించుకున్నారు. కాగా, దివ్యాంగులకు మోడల్ గెస్ట్‌హౌస్ నుంచి దుర్గగుడికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు బస్సు సౌకర్యం ఉంది. పున్నమి ఘాట్ నుంచి భక్తులను ప్రత్యేక బస్సుల్లో ఓం టర్నింగ్ వరకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వలంటీర్లు వారిని సేకరించుకొని, వీల్చైర్లలో తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారు. నేడు అన్నపూర్ణాదేవిగా.. దసరా మహోత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితిని పురస్కరించుకుని గురువారం కనకదుర్గమ్మను శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నం ప్రసాదించే మాతృమూర్తి. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నాన్ని, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తు ఈశ్వరునికే భిక్షను అందించే అంశం అద్భుతం. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు. ఈ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతామని భక్తుల విశ్వాసం. -
AP: అదనపు చార్జీల్లేకుండానే దసరా స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: ప్రయాణికులపై అదనపు చార్జీల భారం లేకుండానే దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. దశాబ్దకాలం తరువాత ఇలా అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. విజయవాడలోని బస్‌భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4,500 ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాల ముందు ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు 2,100 బస్సులు, దసరా తరువాత అక్టోబరు 5 నుంచి 9 వరకు 2,400 బస్సులు నడుపుతామని తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని 21 నగరాలు, ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. అన్ని సర్వీసుల్లోను యూటీఎస్ విధానాన్ని అమలు చేస్తూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని వివరించారు. అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ విధానంతో అనుసంధానించి కంట్రోల్ రూమ్ నుంచి 24/7 పర్యవేక్షిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు బస్సులను నిరోధించేందుకు పోలీసు, రవాణా శాఖలతో కలసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ–బస్ సర్వీసులు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ ఈ–బస్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 10 ఈ–బస్సులను నడుపుతామన్నారు. అనంతరం దశలవారీగా డిసెంబర్ నాటికి తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 100 ఈ–బస్ సర్వీసులను ప్రవేశపెడతామని చెప్పారు. తిరుమల ఘాట్రోడ్తోపాటు రాష్ట్రంలో దూరప్రాంత సర్వీసుల కోసం కొత్తగా 650 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ఏడాది 1,285 బస్సులను ఫేస్‌లిఫ్ట్ విధానంలో నవీకరించామని ఈ ఏడాది రూ.25 కోట్లతో మరో 1,100 బస్సులను నవీకరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు రెండువేల మందికి సాంకేతికపరమైన అంశాలను పూర్తిచేసి నవంబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీ (కమర్షియల్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దసరాకు 4,485 స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: దసరా ఉత్సవాల్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాల కోసం ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 4,485 దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. నవరాత్రుల సందర్భంగా దసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు 2,100 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. దసరా అనంతరం తిరుగు ప్రయాణం కోసం 2,385 ప్రత్యేక బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా హైదరాబాద్‌కు 2,290 బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. -
యాదాద్రికి స్పెషల్ బస్సులు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలు మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. యాదాద్రికి భక్తుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు, 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వద్దకు బస్సులు నడుస్తాయని, అక్కడి నుంచి మినీ బస్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చని చెప్పారు. అలాగే, జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 ఛార్జ్ ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులు సౌకర్యవంతంగా యాదాద్రి చేరుకోవచ్చని అన్నారు. కాగా, శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనం నిన్న ప్రారంభమైంది. నిన్న ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.8,17,580 ఆదాయం వచ్చింది. -
ముచ్చింతల్: శ్రీరామనగరానికి సిటీ బస్సులు
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలకు శ్రీరామనగరం తరలివెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకొని బస్సులను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు ముచ్చింతల్‌కు రాకపోకలు సాగించేలా ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అన్ని రూట్లలో ఉదయం 6, 7, 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) బస్సుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులను ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేసేందుకు ముచ్చింతల్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ మేరకు ప్రతి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. పోలీసుల ఆధీనంలో ప్రధాన మార్గాలు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్షించారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో సమావేశయ్యారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? విధులు నిర్వహించనున్నారు? తదితర అంశాలపై సమీక్షించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గం సహా బెంగళూరు జాతీయ రహదారి మార్గాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఎక్కడిక్కడ భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. (చదవండి: 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు) -
హైదరాబాద్–ఏపీకి 1,500 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 7 నుంచి 14 వరకు హైదరా బాద్ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లోని వివిధ పట్టణాలకు 1,500 ప్రత్యేక బస్సులు నడపను న్నట్లు సంస్థ హైదరాబాద్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ప్రతిరోజూ 344 రెగ్యులర్ బస్సులను హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్, మియా పూర్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్, జీడిమెట్ల, జేబీఎస్, ఈసీఐఎల్ నుంచి నడుపుతున్న ఆర్టీసీ.. పండుగ స్పెషల్స్‌ను అదనంగా ఏర్పాటు చేసి నట్లు చెప్పారు. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులను ఎంజీబీఎస్ బయటున్న ఓల్డ్ సీబీఎస్ హాంగర్ నుంచి నడపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సులకు కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. -
శబరిమలకి ఆర్టీసీ సర్వీసులు.. ప్రతీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రతీ ఒక్క అవకాశాన్ని గరిష్టంగా వినియోగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే కార్తీక మాసం ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. శబరికి బస్సులు కార్తీక మాసం రావడంతో పల్లె పట్నం తేడా లేకుండా అయ్యప్పమాల ధరించిన వారే కనిపిస్తున్నారు. స్వామి శరణం మాట ప్రతీ చోట ధ్వనిస్తోంది. ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల విరణమ కోసం శబరిమలకి వెళ్తుంటారు. ఇలా వేళ్లే వారు ఇప్పటి వరకు ఎక్కువగా ప్రైవేటు వెహికల్స్‌నే ఆశ్రయిస్తున్నారను. కాగా అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఐదుగురికి ఫ్రీ శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ మేరకు వరంగల్ 1 డిపో తరఫున ట్విట్టర్లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. బుక్ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్, పదేళ్లలోపు ఇద్దరు మునికంట స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అంటోంది. మొత్తంగా మూడు ఫుల్ టిక్కెట్లు, రెండు ఆఫ్ టిక్కెట్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. శబరిమల వెళ్లే భక్తులకు వరంగల్ 1 డిపో నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఇవ్వబడును. వివరాలకు డిపోమేనేజర్ ని సంప్రదించగలరు. #choosetsrtc #shabarimala #rtchirebuses @tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/dQusTBiyde — Depot Manager WL1 (@dmwgl1) November 16, 2021 ఛార్జీలు ఇలా శబరిమలైకి వెళ్లే భక్తులు అయ్యప్ప దర్శనంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ టూర్‌కి అనుగుణంగా ఆర్టీసీ కిలోమీటర్ల వంతున ఛార్జీలు నిర్ణయించింది. వీటితో పాటు ప్రతీ గంటకు రూ.300ల వంతున వెయిటింగ్ ఛార్జీ్ కూడా ఉంటుంది. గంటకు సగటున 30 కిలోమీటర్ల వంతున ప్రయాణ సమయాన్ని లెక్కిస్తున్నారు. ఆర్టీసీ శబరిమలై బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి. - 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు రూ.48.96 - 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు రూ.47.20 - 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు రూ.56.64 - 49 సీట్లు ఉన్న ఆర్టీసీ బస్సులకు కిలోమీటరుకు రూ.52.49 చదవండి:ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రిన్స్ మహేశ్.. అదిరింది సార్! -
పిక్నిక్లకు ఆర్టీసీ స్పెషల్స్
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): కార్తీక మాసం వనవిహారాలకు అనువైన మాసం. అందునా.. పర్యాటకుల స్వర్గధామంగా పేరెన్నిక గన్న విశాఖ. ఈ సదవకాశాన్ని సది్వనియోగం చేసుకునేందుకు ఏపీఎస్‌ఆరీ్టసీ చర్యలు చేపట్టింది. పర్యాటకప్రాంతాలకు వారాంతాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పంచారామాల సందర్శన పవిత్రమైన ఈ మాసంలో శైవక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఒకేరోజు పంచారామాల సందర్శనకు ఏర్పాట్లు చేసింది. సందర్శన ప్రాంతాలు అమరావతిలోని అమరేశ్వరాలయం, భీమవరంలోని సోమేశ్వరుడు, పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వరస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం, సామర్లకోటలోని కుమార రామలింగేశ్వరస్వామి ఆలయం ప్రయాణ తేదీలు ఈ నెల 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు విశా ఖ ద్వారకా బస్‌స్టేషన్ నుంచి బస్సులు బయల్దేరనున్నాయి. బస్‌చార్జీ : సూపర్ లగ్జరీ ప్రయాణ చార్జీ పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,700 అల్ట్రా డీలక్స్ ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.1,900, పిల్లలకు రూ.1,600 వనవిహారాల కోసం.. పిక్నిక్లకు వెళ్లే పర్యాటకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. లంబసింగికి శని, ఆదివారాల్లో తెల్లవారుజామున 3 గంటలకు ద్వారకాబస్‌స్టేషన్ నుంచి బస్సులు బయల్దేరతాయి. సందర్శన ప్రాంతాలు లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మోదమాంబ గుడి, కాఫీ ప్లాంటేషన్ చార్జీలు అల్ట్రా డీలక్స్ ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.500 ఎక్స్‌ప్రెస్ ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.450 అరకు టూర్ శని, ఆదివారాల్లో ఉదయం 6 గంటలకు ద్వారకాబస్‌స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. సందర్శన ప్రాంతాలు డముకు వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్, చాపరాయి, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం చార్జీలు అల్ట్రా డీలక్స్ ప్రయాణ చార్జీ పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.500 ఎక్స్‌ప్రెస్ చార్జీలు పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.450 ధారమట్టం ఈ బస్సులు శని, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు ద్వారకాబస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. దర్శనప్రాంతాలు శివాలయం, ధారమట్టం వాటర్‌ఫాల్స్, అల్లూరి సీతారామరాజు మ్యూజియం, బొజ్జనకొండ(అనకాపల్లి) చార్జీలు : అల్ట్రా డీలక్స్ ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.500 ఎక్స్‌ప్రెస్ చార్జీలు పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400 ఆన్లైన్ రిజర్వేషన్‌కు అవకాశం పర్యాటకులు, భక్తులు www.apsrtconline.in ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 99592 25602, 73829 14183, 99592 21199 నంబర్లలో సంప్రదించవచ్చు. -
రారండోయ్ పంచారామాలు చూద్దాం..
తుని: పవిత్ర కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యమని భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసంలో ఎక్కువ మంది శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఒక కుటుంబం పంచారామాలను దర్శించుకోవడానికి వెళ్లాలంటే ఆర్థికంగా భారం పడుతుంది. ఇది గమనించిన ఆర్టీసీ కార్తికమాసంలో పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి తుని డిపో నుంచి సర్వీసులు తుని ఆర్టీసీ డిపో నుంచి పంచారామాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. తుని నుంచి ఈ నెల 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారం సాయంత్రం బయలుదేరి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట తదితర శైవ క్షేత్రాలకు తీసుకువెళతారు. దర్శనం అనంతరం భక్తులను తుని డిపోకు తీసుకువస్తారు. రిజర్వేషన్ సౌకర్యం తుని ఆర్టీసీ డిపోతో పాటు పాయకరావుపేట, గొల్ల అప్పారావు సెంటర్, అన్నవరం, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో రిజర్వేషన్ టికెట్లు పొందవచ్చు. దీంతో పాటు ఆన్లైన్లో టికెట్లను రిజర్వేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు. బృందాలకు ప్రత్యేకం పంచారామ క్షేత్రాలను దర్శించుకోవడానికి బృందాలుగా వెళ్లే వారికి ఆర్టీసీ వారి స్వగ్రామం నుంచే బస్సు సౌకర్యం కల్పిస్తోంది. బస్సు సీటింగ్ కెఫాసిటీ మేరకు టికెట్లు ఉంటే వారి నివాస గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తారు. నాలుగైదు సీట్లు మిగిలిపోయినా బస్సును అందిస్తామని అధికారులు చెబుతున్నారు. చార్జీలు ఇలా.. పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు బస్సు కేటగిరి ఆధారంగా పెద్దలకు, పిల్లలకు వేర్వేరు టికెట్ ధరలు ఉంటాయి. తుని డిపో నుంచి పల్లెవెలుగు పెద్దలకు రూ.720, పిల్లలకు రూ.570, అల్ట్రా డీలక్స్ పెద్దలకు రూ.1040, పిల్లలకు రూ.810, సూపర్ లగ్జరీ పెద్దలకు రూ.1080, పిల్లలకు రూ.840గా టికెట్ ధర నిర్ణయించారు. ఉద్యోగులు, వ్యాపారులకు.. ఉద్యోగులు, వ్యాపారుల సౌకర్యం కోసం శనివారం బస్సులు బయలు దేరి ఆదివారం సాయంత్రానికి తిరిగి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఈ నెల13, 20, 27 తేదీల్లో వీరికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. భక్తులకు మంచి అవకాశం పవిత్ర కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు కండీషన్లో ఉన్న బస్సులను తుని డిపో నుంచి నడుపుతున్నాం. రెగ్యులర్ భక్తులతో పాటు ఉద్యోగులు, వ్యాపారులకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు బృందంగా వెళ్లే భక్తులను వారి స్వగ్రామం నుంచే పికప్ చేసుకుని తిరిగి ఇంటికి చేర్చుతాం. భక్తులు ఆర్టీసీ సేవలను సద్విని యోగం చేసుకోవాలి. –ఎన్.కిరణ్‌కుమార్, తుని డిపో మేనేజర్ టికెట్ల రిజర్వేషన్, అదనపు వివరాలకు... తుని డిపో మేనేజర్: 99592 25539 అసిస్టెంట్ మేనేజరు: 94928 33885 ఎంక్వయిరీ : 08854–253666 రిజర్వేషన్: 73829 13216, 73829 13218 -
80 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తున్న దసరా ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్బీ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయని, అయితే సాధారణ సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. కేవలం 16 దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50శాతం అదనపు చార్జీ వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు బస్సులను నడుపుతున్నాయని వివరించారు. -
TSRTC: దసరా పండగకు ప్రయాణికులకు తీపికబురు..
హైదరాబాద్: దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక బస్సులకు గానూ..టీఎస్ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. దీని కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులలో టికెట్ ఛార్జీకి అదనంగా 50 శాతం రుసుము వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పండగకు మొత్తం.. 4035 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఎంజీబీఎస్ నుంచి 3,200 బస్సులు, జేబీఎస్ నుంచి 1200 బస్సులు తెలంగాణ, ఏపీకి నడవనున్నాయి. ఇవికాకుండా మరికొన్ని బస్సులు అదనంగా తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు. ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల,నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీంతో పండగకు రూ. 3 నుంచి రూ.4 కోట్ల ఆదాయం చార్జీల రూపంలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ బస్సులు జేబీఎస్ నుంచి బయలుదేరుతుండగా.. వరంగల్, మహబూబాబాద్‌కు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి బయలు దేరనున్నాయి. అదే విధంగా ఖమ్మం, విజయవాడకు వెళ్లే బస్సులు.. ఎల్బీనగర్, హయత్‌నగర్ నుంచి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు వెళ్లే బస్సులు దిల్సుఖ్నగర్ నుంచి బయలుదేరతాయిని అధికారులు తెలిపారు. అదే విధంగా, వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరతాయని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. చదవండి: సరిలేరు మాకెవ్వరూ... అనవసర ఖర్చుల్లో ‘ గ్రేటర్’ -
మహా శివరాత్రికి 3,777 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినానికి ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవక్షేత్రాలకు మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాధారణ చార్జీలనే వసూలు చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు సాధారణ టికెట్ రేట్లనే ఈ పండక్కి వసూలు చేయనున్నారు. మహాశివరాత్రికి రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్పకొండకు 856 బస్సుల్ని, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంలకు 938 బస్సుల్ని నడుపుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సుల్ని నడిపేందుకు ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ఠాకూర్ అన్ని రీజియన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ తప్పని సరి..: ఆర్టీసీ ఎండీ ఠాకూర్ శనివారం కోటప్పకొండలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్క్ లేనిదే బస్సుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని, ప్రతి క్యాంప్‌లో శానిటైజర్ల స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొబైల్ టీంలు ఏర్పాటు చేయాలన్నారు. -
సంక్రాంతికి 4,981 స్పెషల్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 4,981 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ బస్సులను మహాత్మా గాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్, సీబీఎస్, ఉప్పల్, లింగంపల్లి, ఎల్బీనగర్, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల నుంచి నడపనున్నట్లు తెలిపారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుడివాడ, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి, వరంగల్ వైపు వెళ్లే వాటిని ఉప్పల్ నుంచి నడపనున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీ నగర్ నుంచి, కర్నూల్, మహబూబ్‌నగర్ వైపు వెళ్లే బస్సులు గౌలిగూడ సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ వైపు వెళ్లే వాటిని దిల్సుఖ్నగర్ నుంచి నడుపుతారు. ఎంజీబీఎస్‌లోని 35, 36 ప్లాట్‌ఫామ్‌ల నుంచి విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాకపోకలు సాగిస్తాయి. టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. వివరాలకు 9959226245, 9959224910 నంబర్లలో సంప్రదించవచ్చు. -
సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 2021 జనవరి 8వ తేదీ నుంచి 13 వరకూ పొరుగు రాష్ట్రాలు, నగరాల నుంచి రాష్ట్రానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 1251 బస్సులు నడుస్తాయని చెప్పారు. ఇక బెంగళూరు నుంచి 433, చెన్నై నుండి 133 బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి విజయవాడకు 201, విశాఖకు 551 బస్సులు నడపుతారు. అలాగే అంతర్గతంగా వివిధ జిల్లాల మధ్య 1038 ప్రత్యేక బస్సులు తిరుగుతాయి. -
పంచారామాలకు 1,750 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో రాష్ట్రంలో ఐదు పంచారామాలైన పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతికి అన్ని జిల్లాల నుంచి 1,750 బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. భక్తులకు అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కరోజే పంచారామాలు దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దీనికి అనుగుణంగా ఆర్టీసీ రవాణా సదుపాయం కల్పిస్తోంది. మొదటి సోమవారం ఆర్టీసీ తొమ్మిది జిల్లాల నుంచి పంచారామాలకు, నాలుగు జిల్లాల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపింది. మొదటివారం 106 సర్వీసులు ► పంచారామాలకు మొదటివారం తొమ్మిది జిల్లాల నుంచి 106 ప్రత్యేక సర్వీసులు, శ్రీశైలం, కోటప్పకొండకు కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 బస్సులు నడిపారు. ► దూరాన్ని బట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి బస్సులు బయలుదేరి సోమవారం రాత్రికల్లా పంచారామాల్లో దర్శనాలు చేసుకుని తిరుగు పయనమయ్యేందుకు వీలుగా శీఘ్ర దర్శనాలు చేయించనున్నారు. -
సొంతూళ్లకు విద్యార్థులు
అలంపూర్: వలస కార్మికులు, విద్యార్థులు సొంత రాష్ట్రాలు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులు, వలస కార్మికులు అక్కడి అధికారుల అనుమతి పత్రాలతో స్వరాష్ట్రానికి వస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో ఏపీలోని నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న 614 మంది విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి 22 ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర సరిహద్దులోని పుల్లూరు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. వీరిలో జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారున్నారు. ఆర్డీఓ రాములు, సీఐ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో సిబ్బంది విద్యార్థుల వద్ద ఉన్న అనుమతి పత్రాలు పరిశీలించి, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. వైద్యపరీక్షల అనంతరం వారిని 14 రోజుల హోం క్వారంటైన్లో ఉండాలని స్టాంప్ వేసి పం పారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు అధిక సంఖ్య లో వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా అధికారులు సరిహద్దులో చర్యలు తీసుకుంటున్నారు. మొదట్లోనే ప్రయత్నించినా..: వాస్తవానికి తొలి విడత లాక్‌డౌన్‌లోనే.. నంద్యాలలో బ్యాంక్ పోస్టులకు కోచింగ్ కోసం వెళ్లిన విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లడానికి ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు అనుమతించలేదు. -
యూపీ: మరో కీలక నిర్ణయం
లక్నో: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సరిహద్దు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తీసుకెళ్లేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 1,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి శనివారం తెలిపారు. నోయిడా, ఘజియాబాద్, బులంద్‌షహార్, అలీఘర్ తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులకు తాగునీరు, ఆహారం వంటి సదుపాయాలు కల్పించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అర్థరాత్రి జరిపిన సమీక్షలో సీఎం వలస కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించగానే రవాణాశాఖ అధికారులు డ్రైవర్లు, కండక్టర్లతో సంప్రదించినట్లు అధికారి తెలిపారు. దీంతో లక్నోలోని చార్బాగ్ బస్‌స్టేషన్‌కు చేరుకున్న రాష్ట్ర డీజీపీ హితేష్ చంద్ర అవస్థీ, లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ కుమార్ పాండే వలస కార్మికుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ ఈనెల 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యక బస్సులు
-
మేడారం జాతరకు 304 బస్సులు
సాక్షి, ఆదిలాబాద్ : మేడారం సమక్క, సారక్క జాతరకు ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 6 డిపోల నుంచి 304 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం ప్రయాణ ప్రాంగణంలో ఆరు డిపోలకు సంబంధించిన అధికారులతో జాతరకు సంబంధించి బస్సుల కేటాయింపు, తదితరాలపై సమావేశమయ్యారు. గత జాతరకు 68వేల మంది భక్తులు ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నారని, ఈ మేరకు 80 వేల మంది భక్తులను సరిపడా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ డిపో నుంచి 55 కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటిని చెన్నూర్ నుంచి మేడారం వరకు నడపుతామన్నారు. ఆసిఫాబాద్ నుంచి మొత్తం 65 బస్సులు కేటాయించగా.. ఆసిఫాబాద్ నుంచి 10, బెల్లంపల్లి నుంచి 55 బస్సులు నడుపుతామన్నారు. భైంసా డిపో 35 బస్సులను సిర్పూర్ నుంచి, నిర్మల్ డిపో 52 బస్సులను మందమర్రి నుంచి, మంచిర్యాల డిపో నుంచి 97 బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు. ప్రైవేటు వాహనాలు ఆలయం దగ్గరకు చేర్చవని, సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగుతాయని, ఆర్టీసీ బస్సులైతే ఆలయం వరకూ వెళ్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగించుకుని సమ్మక్క, సారలమ్మ కృపకు పాత్రులు కావాలన్నారు. సమావేశంలో డీవీఎం రమేశ్, డీఎం శంకర్రావు, పీవో విలాస్‌రెడ్డి, ఏవో బాలస్వామి, ఏఎం కల్పన, శ్రీకర్, రిజర్వేషన్ ఇన్చార్జి హుస్సేన్, ఆర్ఎం కార్యాలయ ఉద్యోగి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
సొంతూళ్లకు రయ్ రయ్!
సాక్షి, అమరావతి బ్యూరో/కంచికచర్ల/హైదరాబాద్: సంక్రాంతి పండుగకు వారాంతపు సెలవులు కలిసిరావటంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు శనివారం ఏపీలోని తమ సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు.. సొంత వాహనాల్లో బయల్దేరే వారితో జాతీయ రహదారుల్లోనూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. దీంతో వివిధ టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ మేర బారులుతీరుతూ కనిపిస్తున్నాయి. ఇటీవల అమలులోకి తెచ్చిన ఫాస్టాగ్ వ్యవస్థవల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ కొంతవరకు తగ్గినప్పటికీ ఇంకా అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా టోల్‌ప్లాజాల వద్ద పోలీసులను నియమించారు. కొన్నిచోట్ల అదనపు గేట్లను ఏర్పాటుచేశారు. ప్లాజాల నిర్వాహకులు కూడా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. ఆది, సోమవారాల్లో వాహనాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ రెండు వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గత ఏడాదికంటే రెట్టింపు బస్సులను సిద్ధంచేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 700 స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి, భీమవరం, విశాఖపట్నం వైపునకు 500 బస్సులను తిప్పుతున్నారు. ఇక పండుగ తర్వాత 16 నుంచి 21 వరకు తిరుగు ప్రయాణికుల కోసం మరో 800 బస్సులను నడపనున్నారు. బస్సులు లేవని ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించే అవకాశం లేకుండా చూస్తున్నామని కృష్ణా రీజియన్ ఆర్టీసీ ఆర్ఎం నాగేంద్రప్రసాద్ తెలిపారు. తొలిసారిగా ఆర్టీసీ 40 % రాయితీ మునుపెన్నడూ లేనివిధంగా ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికులకు 40శాతం రాయితీ ఇస్తోంది. సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నంత రద్దీ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల్లో ఉండదు. ఇది ఆర్టీసీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇలా వెళ్లే స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులకు సాధారణ చార్జీలో 40 శాతం రాయితీ ఇవ్వాలని సంకల్పించింది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి హైదరాబాద్–విజయవాడ మార్గంలో పండుగ సమయాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. టోల్ నిర్వాహకులు మాత్రం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది. –వంశీ, నెల్లూరు ఇబ్బంది పడ్డాం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నాం. మా వాహనానికి ఫాస్టాగ్ ఉంది. అయినా టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఏమాత్రం ఫాస్ట్‌గా వెళ్లలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. –నర్సింహా, విజయవాడ ఈనెల 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి ప్రతి వాహనానికి జనవరి 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ఉపరితల, రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2019 డిసెంబరు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఆ గడువును డిసెంబరు 15వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం వాహనదారులకు మరోసారి గడువిచ్చారు. 2020 జనవరి 15వ తేదీ నుంచి ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులపై 65 శాతం వాహనదారులు ఫాస్టాగ్ వినియోగిస్తున్నట్లు అంచనా. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫాస్టాగ్‌ల అమ్మకాలు 1.50 లక్షలు దాటాయి. ఈ నెల 14వ తేదీ వరకు హైబ్రీడ్ విధానం అమల్లో ఉంటుంది. జనవరి 15వ తేదీ నుంచి ప్రతి టోల్‌ప్లాజాలో క్యాష్ లైన్ కేవలం ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక రాష్ట్ర రహదారులపైనా అమలు జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనే కాకుండా రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే, రాష్ట్ర రహదారులపై ఇప్పటికీ ఈ విధానం అమలు కావడం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేస్తామని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ టోల్గేట్లలో ఆర్ఎఫ్ఐడీ యంత్రాలు పెట్టేందుకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది. హోటళ్లలోనూ ఫాస్టాగ్‌ల అమ్మకాలు రాష్ట్రంలో 22 బ్యాంకుల ద్వారా 5 లక్షల ఫాస్టాగ్‌లను విక్రయానికి అందుబాటులో ఉంచినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల్లో ఫాస్టాగ్‌ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ చెప్పారు. జనవరి 15వ తేదీ తర్వాత టోల్‌ప్లాజాల్లో క్యాష్‌లైన్ ఒక్కటి మాత్రమే ఉంటుందని, తర్వాత అది కూడా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్‌ప్లాజాల వద్దే కాకుండా జాతీయ రహదారుల వెంట ఉన్న హోటళ్లలోనూ ఫాస్టాగ్‌లు విక్రయించేందుకు ఎన్హెచ్ఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
అవి కళకళ.. ఇవి వెలవెల!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి లాంటి పెద్ద పండుగల సమయంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పుతుంటుంది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ హైదరాబాద్–విజయవాడ మధ్య వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులు తిప్పుతూ ఉంటాయి. చార్జీ కూడా 50 శాతం మేర పెంచటం సహజమే. పండుగకు ముందు హైదరాబాద్ నుంచి విజయవాడవైపు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ బస్సులు కిక్కిరిసిపోతాయి. కానీ ఆ బస్సులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు ప్రయాణికుల్లేక ఖాళీగా వస్తాయి. ఈ విషయంలో ప్రతిసారి డీజిల్ ఖర్చులను ఆర్టీసీ మీదే వేసుకోవాల్సి వస్తోంది. దీనికి విరుగుడుగా ఏపీ అధికారులు ఈసారి కొత్త పంథా అనుసరించారు. హైదరాబాద్‌కు బస్సులు ఖాళీగా కాకుండా, కనీసం డీజిల్ ఖర్చులైనా వచ్చేలా ఆలోచించారు. ఇందుకు సాధారణ టికెట్ ధరను 40 శాతం మేర తగ్గించేశారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు దీనికి ఆకర్షితులై ఆర్టీసీ బస్సెక్కుతారనేది వారి ఆలోచన. అది ఫలిస్తోంది కూడా.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య మెరుగ్గానే ఉంటోంది. ప్రైవేటు బస్సులు, అద్దె కార్లు, జీపులు, వ్యాన్లలో వచ్చేవారు, రైలుకు వెళ్లాలనుకునేవారు ఈ బస్సుల వైపు మళ్లుతున్నారు. పండుగ సమయంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటున్నా.. టికెట్ ధరను తగ్గించటంతో డీజిల్ ఖర్చుకు సరిపడా టికెట్ రెవెన్యూ వస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిస్థితి ఇలా.. అదే టీఆఎస్ఆర్టీసీ మాత్రం విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే చార్జీలను తగ్గించలేదు. దీంతో ఈ బస్సు ఎక్కాల్సిన వారు కూడా ఏపీ బస్సుల వైపు మళ్లడంతో ఇవి ఖాళీగా రావాల్సి వస్తోంది. వీటి ధరను కూడా తగ్గించాలని కొన్ని డిపోల మేనేజర్లు కోరినా.. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఉన్నతాధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ఫలితంగా.. విజయవాడవైపు వెళ్లేటప్పుడు కిక్కిరిసి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులు, తిరుగు ప్రయాణంలో మాత్రం ఖాళీగా వస్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే టీఎస్ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సు విజయవాడ బస్టాండు ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. అందులో హైదరాబాద్‌కు టికెట్ ధర రూ.372గా ఉంది. అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కూడా వచ్చి ఆగింది. అందులో హైదరాబాద్‌కు టికెట్ ధర రూ.223 ఉంది. ఇంకేముంది.. ప్రయాణికులందరూ ఏపీ బస్సు ఎక్కి కూర్చున్నారు. తెలంగాణ బస్సేమో ఖాళీగా బయల్దేరింది. ప్రయాణికులను ఆకర్షిస్తేనే బస్సులకు ఆదరణ ఉంటుంది. లేకుంటే ప్రైవేటు వాహనాల నుంచి పోటీ పడలేక ఆర్టీసీ చతికిల పడాల్సిందే. సంక్రాంతి లాంటి రద్దీ సమయంలో ఈ సూత్రాన్ని మరింత జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీ అధికారులు ఆ సూత్రాన్ని పక్కాగా అనుసరిస్తున్నారు. దీన్ని తెలంగాణ అధికారులు పట్టించుకోలేదు. -
ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన
సాక్షి, అమరావతి : దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ... హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి 110, బెంగుళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 బస్సు సర్వీసులను ఏపీకి నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో ...బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో పండుగలకు స్వస్థలాలకు వెళ్లేవారు...అందుబాటులో ఉన్న బస్సులను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణలో రెండోరోజు మరింత తీవ్రతరం కావడంతో పండుగ పూట ప్రయాణికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో శనివారం ఇమ్లీబన్, దిల్సుఖ్నగర్ బస్టాండ్ల నుంచి ఏపీ బస్సులు సేవలందిసున్నట్లు తెలిపారు. దాదాపు 2 వేల మేర బస్సులు అదనంగా వచ్చాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి కొంత ఊరట లభించింది. మరో ఐదారు రోజుల పాటు ఏపీ బస్సులు తిరగనున్నాయి. -
తిరుగు ప్రయాణం కొండంత భారం
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: సంక్రాంతి కోసం స్వస్థలాలకు వచ్చినవారి తిరుగు ప్రయాణం కొండంత భారం కానుంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్, ఆర్టీసీ పోటాపోటీ పడుతున్నాయి. సాధారణ రోజుల్లో టిక్కెట్ల ధరల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తుండగా.. ఆర్టీసీ కూడా వ్యాపార ధోరణి ప్రదర్శిస్తోంది. రెగ్యులర్ బస్సులతో పాటు మూడు వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రిజర్వేషన్లకు ఫ్లెక్సీ ఫేర్ విధానం(విమాన చార్జీల్లాగా పరిస్థితిని బట్టి రేట్లు అమలు చేయడం) ప్రవేశపెట్టింది. రెగ్యులర్ చార్జీల కంటే 150 శాతం అధికంగా వసూలు చేస్తోంది. సిటీ మెట్రో కూడా ప్రత్యేక బస్సే..! సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని జిల్లాలకు 20 లక్షల మంది వచ్చారని అంచనా. వీరి తిరుగు ప్రయాణం కోసం అన్ని జిల్లాల నుంచి 1,100 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రతిరోజూ హైదరాబాద్‌కు అన్ని జిల్లాల నుంచి 150 వరకు సర్వీసులు నడుపుతున్నారు. వీటితో పాటు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌కు 1,100 బస్సులు తిప్పుతున్నట్లు ప్రకటించారు. ఫ్లెక్సీ ఫేర్ అమలు చేయడం ద్వారా ప్రయాణికులను బాదేస్తున్న ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల పేరిట సిటీల్లో తిరిగే మెట్రో, సాధారణ బస్సుల్ని అందుబాటులో ఉంచింది. దీంతో ప్రయాణికులు గంటలకొద్దీ ఆ సీట్లలో నానా ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్ సమయంలో ఏ బస్సు నడుపుతున్నారో కూడా సమాచారమివ్వకుండా వ్యాపార ధోరణి అవలంభిస్తోందంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు రెగ్యులర్ సర్వీసులు కూడా సరైన సమయంలో తిప్పకుండా ప్రత్యేక బస్సుల్నే ఆర్టీసీ నడపడం గమనార్హం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు 3571 అమరావతి సర్వీస్ మధ్యాహ్నం 1.30కు బయల్దేరాల్సి ఉండగా.. ప్రత్యేక బస్సుకు ప్లాట్‌ఫాం కేటాయించి, ఈ బస్సును గంట పాటు పక్కన పెట్టారు. ఇక సంక్రాంతి హడావుడి ఎక్కువగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలోని 8 డిపోల నుంచి రోజూ 28 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ నేపథ్యంలో మరో 57 ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం వీటిలో చాలా వరకు సీట్లు మిగిలిపోయాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ పేర్కొన్నారు. ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి ప్రధాన నగరాలకు అదనంగా 50 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకం పేరిట సిటీ మెట్రో బస్సులు పెట్టడంపై పలువురు ప్రయాణికులు మండిపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు ఎక్కువ ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో వీటిలోనే వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. మా కష్టాలు పట్టవా? కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో సంక్రాంతి జరుపుకుందామని వస్తే.. ఇలా బాదేస్తున్నారని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి మా కష్టాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి ప్రభుత్వం తగిన చేయూతనిస్తే.. తమకు ఈ బాధలుండేవి కాదన్నాడు. 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయకుండా.. అదనపు బస్సులు మరిన్ని ఏర్పాటు చేస్తే తమకు వెతలుండేవి కాదని మరో ప్రయాణికుడు వాపోయాడు. పోలవరం సందర్శన, సీఎం సభలకైతే ఇష్టారీతిన బస్సులు పెడతారని.. సామాన్యులను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదేశాలిచ్చినా టోల్ ట్యాక్స్ వసూలు.. పండుగ సందర్భంగా 3 రోజుల పాటు వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయబోమని ప్రభుత్వమిచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదు. కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటిలానే టోల్‌ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు మండిపడుతున్నారు. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద ట్యాక్స్ వసూలు చేయడం లేదని.. రాష్ట్రంలో మాత్రం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. కాగా, ఈ విషయంపై ప్లాజా సీవోఎం హరిపాండు రంగస్వామిని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు పాటిస్తున్నామన్నారు. -
మేడారం జాతరకు 4200 బస్సులు
సాక్షి, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహా జాతరకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 50 కేంద్రాల నుంచి 4200 లకు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ సందర్బంగా భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు తెలిపారు. రెండేళ్ల క్రితం జాతర సందర్భంగా ఆర్టీసీ 3700 ప్రత్యేక బస్సులను నడపగా.. సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి జాతరకు అదనంగా మరో 500 బస్సులను నడపునున్నట్టు తెలిపారు. ఈసారి సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, గోదావరి ఖని, పెద్దపల్లి వంటి 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. జాతరకు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని మేడారం స్పెషల్ ఆపరేషన్స్ విధుల్లో నియమించారని ఆయన వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సుల ఏర్పాట్లు చేయడంతో పాటు, మేడారం వద్ద ఆర్టీసీ తాత్కాలిక బస్ టర్మినల్ కూడా ఏర్పాటుచేశామన్నారు. కాగా మేడారంలో ఏర్పాటు చేసిన వసతులను ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. వరంగల్‌లో అధికారులతో ఎండీ సమీక్ష నిర్వహించారు. జాతరలో బస్సుల నిర్వహణ, ప్రయాణికుల కోసం ఏర్పాట్లు, బస్ టర్మినల్, భక్తుల డిమాండ్ మేరకు ఆయా రూట్లలో బస్సుల నిర్వహణపై ఆర్ఎంలు, డిపో మేనేజర్లు, అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. -
ఊరు పిలుస్తోంది
సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విజయవాడలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు బుధవారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్ కిటకిటలాడాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపింది. విజయవాడ: పండిట్ నెహ్రూ బస్టాండ్ బుధవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. నగరంలోని విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునేందుకు తరలివచ్చారు. దీంతో బస్టాండ్ ప్రాంగణం రద్దీగా కనిపించింది. బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు షెడ్యూల్ ప్రకారం కాకుండా అదనపు సర్వీసులు నడిపారు. పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు కడప సెక్టార్ వైపు యాచోటు, అనంతపురం, పులివెందుల, కర్నూలు తదితర ప్రాంతాలకు 85 అదనపు సర్వీసులు, రాజమండ్రి, కాకినాడ, భద్రాచలం తదితర రూట్లలో 50 మెట్రో, సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసులు ప్రత్యేకంగా నడిచాయి. పలు కళాశాలల యాజమాన్యం విద్యార్థుల సౌకర్యార్థం 30 సిటీ సర్వీసులను ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్‌కు 80 ప్రత్యేక బస్సులు నడిపారు. – బస్‌స్టేషన్ (విజయవాడ తూర్పు) -
సంక్రాంతికి ఊరెళుతున్నారా? ఇది చదవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్ : తెలుగువారు ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండుగ దృష్ట్యా అటు రైల్వే, ఇటు ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నాయి. వివిధ ప్రాంతాల మధ్య 84 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించగా, మొత్తం 3,262 స్పెషల్ బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఇక దక్షిణమధ్యరైల్వే ప్రధాన కేంద్రం సికింద్రబాద్ స్టేషన్లో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచారు. ఈ పెంపు తాత్కాలికమేనని, సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరి 11 నుంచి 17 వరకు పెరిగిన ధరలు అమలవుతాయని పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పండుగ సీజన్లలో రైళ్లు ఎక్కేవారికంటే వారికి తోడ్కోలు, వీడ్కోలు కోసం ఫ్లాట్ఫాంపైకి వచ్చేవారితో రద్దీ పెరుగుతుండటంతో దానిని నియంత్రించేందుకే ధరలు పెంచుతుండటం తెలిసిందే. సంక్రాంతి స్పెషల్ రైళ్లు : పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి–విశాఖపట్టణం, కాచిగూడ–విశాఖ, తిరుపతి–కాచిగూడ, హైదరాబాద్–విశాఖ, సికింద్రా బాద్– దర్బం గా, హైదరాబాద్– రెక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు తిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది. కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖ చేరుతుంది. విశాఖ–తిరుపతి(07479) స్పెషల్ ట్రైన్ : ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. హైదరాబాద్–విశాఖ(07148/07147) స్పెషల్ ట్రైన్ : ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది. సికింద్రాబాద్–దర్భంగా(07007/07008) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ –రెక్సాల్ (07005/07006) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది. స్పెషల్ బస్సులు : జనవరి 10 నుంచి 13 వ తేదీ వరకు బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపుచార్జీలు వసూలు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రోజూ నడిచే 3,065 రెగ్యులర్ బస్సులతోపాటు 3,262 ప్రత్యేక బస్సులను సిద్ధంచేశారు. విజయవాడ వైపు 1,094 బస్సులు, కర్నూల్ వైపు 115, నెల్లూరు 143, వరంగల్ 384, కరీంనగర్ 280, ఖమ్మం 430, మహబూబ్ నగర్ 179, ఆదిలాబాద్, నిజామా బాద్ జిల్లా లకు 259, నల్లగొండ 228, మెదక్ 125, బెంగ ళూరు 15, చెన్నై 5, పూణే వైపునకు 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీని నియం త్రించేందుకు ప్రత్యేక బస్సులను నగర శివార్ల నుంచి నడి పేందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, బీహెచ్ ఈఎల్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు. -
ఆర్టీసీకి పండగే!
దసరా ఎఫెక్ట్ 22 నుంచి ప్రత్యేక సర్వీసులు రిజర్వేషన్లు ప్రారంభం టిక్కెట్‌పై 50 శాతం అధిక చార్జీ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆర్టీసీకి పండగొచ్చింది. దసరా సెలవుల ఈనెల 22 నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనుంది. దీనికోసం ఇప్పటి నుంచే రిజర్వేషన్లు ప్రారంభించింది. టికెట్‌పై 50శాతం అధిక చార్జీ వసూలుకు సిద్ధపడింది. ఉమ్మడి రాజధాని నుంచి 60 బస్సులు.. దసరా సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారనే అంచనాతో ఆర్టీసీ అధికారులు 60 బస్సులను సిద్ధం చేశారు. తొలుత ఆ బస్సులను ఇక్కడి నుంచి సర్వీసు చేసుకుంటూ హైదరాబాద్ తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న అక్కడి ప్రయాణికులను ఇక్కడికి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించారు. నిత్యం హైదరాబాద్‌కు జిల్లాలోని ఏలూరు డిపో నుంచి 12, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 4, తాడేపల్లిగూడెం డిపో నుంచి 3, భీమవరం డిపో నుంచి 4, నరసాపురం డిపో నుంచి 5 మొత్తం 28 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పండగ సందర్భాల్లో అవిచాలకపోవడంతో ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. 22 నుంచి ప్రారంభం.. ఈ నెల 21వ తేదీ నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో 22వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ నుంచి 30వ వరకూ ఏలూరు డిపో నుంచి 16, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 13, తాడేపల్లిగూడెం డిపో నుంచి 4, భీమవరం డిపో నుంచి 18, నరసాపురం డిపో నుంచి 9 బస్సులను తిప్పనున్నారు. గత ఏడాది రూ.26.76 లక్షల ఆదాయం.. గత ఏడాది దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేక బస్సులు తిప్పడం వల్ల మొత్తం రూ.26.76 లక్షల ఆదాయం వచ్చింది. దీనిలో హైదరాబాద్ నుంచి జిల్లాకు తిప్పిన సర్వీసుల ద్వారా రూ.10.86 లక్షలు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిప్పిన సర్వీసుల ద్వారా రూ. 15.90 లక్షల ఆదాయం వచ్చింది. ఖాళీగా వెళ్ళడం వల్లే 50 శాతం అధికం.. హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుండి జిల్లా ప్రయాణీకులను ఇక్కడికి తీసుకురావడానికి మన జిల్లా నుంచి ప్రత్యేకంగా బస్సులను పంపుతున్నాం. వెళ్ళే టప్పుడు అవి ఖాళీగా వెళతాయి. అందువల్లనే ఆ నష్టాన్ని కాస్తైనా భర్తీ చేసుకోవడానికి మరో 50 శాతం ప్రయాణికులపై భారం వేయాల్సి వస్తోంది. ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా వారి ప్రయాణానికి సర్వీసులను అందుబాటులో ఉంచుతాం. దీనిని ప్రయాణికులూ అర్థం చేసుకుంటున్నారు. ఇటీవల చాలామంది ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్టీసీకి అనుకున్నంతగా ఆదాయం రావడం లేదు. టేకి వెంకట రామం, ఆర్టీసీ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ -
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. 14 నుంచి ఒకేషనల్, 17 నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ప్రారంభం కానున్న వృత్తివిద్యా కోర్సుల పరీక్షలకు పది సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 162 మంది విద్యార్థులు సంస్కృతం, అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్ పరీక్షలకు హాజరుకానున్నారు. యూనిఫాంలో వస్తే నో ఎంట్రీ: నగరంలోని ట్రాఫిక్‌రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. నిర్థేశిత సమయం 9.35కి నిమిషం ఆలస్యంగా వచ్చిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని హైదారాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ స్పష్టం చేశారు. స్కూల్ యూనిఫాంలో వచ్చే విద్యార్థులను కూడా లోపలికి అనుమతించబోమని తెలిపారు. పరీక్షహాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లు అనుమతించమని తెలిపారు. అత్యవసరమైతే డ్యూటీలో ఉన్న పోలీసుల వద్ద ఉన్న ఫోన్లను వాడుకోవచ్చని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, హాల్‌టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాలు, ఇతర సమస్యలపై 040-65537350 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. వెయ్యి ప్రత్యేక బస్సులు: పదో తరగతి పరీక్షల కోసం ఆయా రూట్లలో 1000 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చూపించి బస్సులను ఎక్కవచ్చని ప్రకటించింది. ఉదయం ఏడు గంటలకే విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు, తిరిగి మధ్యాహ్నం ఇళ్లకు చేరేందుకు కూడా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులపై ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ అనే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం 9959226160/ 9959226154 నంబర్లలో సంప్రదించవచ్చు. ఆటంకం లేకుండా కరెంటు సరఫరా: పరీక్ష సమయంలో అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్తితుల్లోనూ కరెంట్ సరఫరా నిలిపివేయవద్దని ఆయా సర్కిళ్ల ఇంజనీర్లకు డిస్కం ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో రాత్రిపూట విద్యార్థులు చదుకునే అవకాశం ఉండటంతో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. -
తిరుగు ప్రయాణం కోసం 180 బస్సులు
– ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ కర్నూలు(రాజ్‌విహార్): సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణం సందర్భంగా 180 ప్రత్యేక బస్సులు నడిపేందుకు రోడ్డు రవాణ సంస్థ చర్యలు చేపట్టింది. పండుగకు ముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం 270 బస్సులను ఆర్టీసీ నడిపింది. తిరిగి వెళ్లే ప్రజల కోసం స్పెషల్ ఆపరేషన్స్‌కు కసరత్తు చేస్తోంది. ఇందులో ఆదివారం 105 బస్సులు నడపగా ఇందులో హైదరాబాద్‌కు 62, బెంగళూరుకు 32, విజయవాడకు 3, ఒంగోలుకు 1, చెన్నైకి 3, నెల్లూరుకు 1, తిరుపతికి మూడు బస్సులు పంపారు. సోమవారం ఈ రూట్లలో ట్రాఫిక్‌ను బట్టి మరో 75 బస్సులు తిప్పనున్నారు. అయితే మంగళ, బుధవారాల్లో కూడా ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు బస్సులు నడుపుతామని కర్నూలు బస్‌స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరు (ఏటీఎం) ప్రసాద్ తెలిపారు. -
సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సులు
అనంతపురం న్యూసిటీ : సంక్రాంతి పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి అనంతకు వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు అనంతపురం నుంచి ప్రధాన నగరాలకు ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్లు అనంతపురం అర్టీసీ డీఎం బాలచంద్రప్ప శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు తిప్పుతున్నామన్నారు. ముందస్తుగా రిజర్వేషన్ సదుపాయం కల్పించామన్నారు. -
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
వెదురుపాక (రాయవరం) : పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రాజమండ్రి ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. మండలంలోని వెదురుపాక రూట్ పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్తికమాసంలో భక్తుల సౌకర్యార్థః పంచారామ శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలను ఒకే రోజులో సందర్శించే విధంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి శని, ఆదివారం ప్రత్యేక బస్సులు రాత్రి ఏడు గంటలకు రాజమండ్రిలో బయలుదేరతాయన్నారు. టికెట్ రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యం ఉందన్నారు. ఎక్స్‌ప్రెస్, ఆల్ఫాడీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులు నడుపుతున్నామన్నారు. పంచారామాల దర్శనానికి ఎక్స్‌ప్రెస్ బస్సులో పెద్దలకు రూ.630, పిల్లలకు రూ.490, ఆల్ఫాడీలక్స్లో పెద్దలకు రూ.770, పిల్లలకు రూ.600, సూపర్‌లగ్జరీ బస్సులో పెద్దలకు రూ.810, పిల్లలకు రూ.630 టికెట్ ధరగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రామంలోనైనా 45 ప్రయాణికులుంటే అదే గ్రామం నుంచి బస్సు నడుపుతామన్నారు. అలాగే భక్తులు బృందాలుగా వస్తే ఏరోజైనా పంచారామ దర్శనానికి బస్సులు నడపుతామన్నారు. ఈ అవకాశాన్ని అయ్యప్పస్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు 73829 11410 నంబరుకు ఫో¯ŒS చేయాలని ఆయన సూచించారు. -
ఆర్టీసీకి పండొగచ్చింది!
నిజామాబాద్ నాగారం: ఆర్టీసీకి పది రోజుల ముందే పండుగొచ్చింది! విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో గురువారం బస్టాండ్లన్నీ కిటకిటలాడాయి. సొంతూళ్లకు వెళ్లే విద్యార్థులతో బస్సులన్నీ నిండిపోయాయి. వరుసగా బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలు రావడంతో శుక్రవారం నుంచి అక్టోబర్ 12 వరకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులంతా హాస్టళ్లను వీడి సొంతూళ్లకు బయల్దేరారు. గురువారం మధ్యాహ్నం నుంచి బస్సులన్నీ కిటకిటలాడుతూ బయల్దేరాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతో జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ కిక్కిరిసి పోయింది. ప్రత్యేక బస్సులు.. వరుస సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నిజామాబాద్ నుంచి జూబ్లీ వరకు అదనంగా సర్వీసులు నడుపుతున్నారు. గురువారం 29 స్పెషల్ బస్సులు నడిపారు. శుక్రవారం 10, ఆ తర్వాత ఐదు బస్సుల చొప్పున నడపనున్నారు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు స్పెషల్ బస్సులను పెద్ద సంఖ్యలో నడుపుతామని ఆర్ఎం ఖుస్రోషహా ఖాన్ తెలిపారు. -
కృష్ణా పుష్కరాలకు ‘టూరిజం’ ప్రత్యేక బస్సులు
హన్మకొండ : కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సులు నడుపనుందని ఆ సంస్థ జిల్లా మేనేజర్ కత్తి నాథన్ చెప్పారు. మంగళవారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 36 సీట్ల నాన్ ఏసీ హైటెక్ బస్సు ప్రతి రోజు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ ప్రత్యేక బస్సు మహబూబ్‌నగర్ జిల్లా బీచ్పల్లి పుష్కర ఘాట్, ప్రసిద్ధ శక్తి పీఠం జోగులాంబ దేవీ ఆలయాన్ని వెళ్లి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు హన్మకొండకు చేరుతుందన్నారు. ఈ నెల 12 నుంచి 23 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. జిల్లాలోని పర్యాటకులు, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చార్జీలు పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200గా నిర్ణయించామన్నారు. సమావేశంలో హరిత కాకతీయ హోటల్ యూనిట్ మేనేజర్ సురేష్ పాల్గొన్నారు. -
పుష్కరాల కోసం 1150 బస్సులు
పనులను పరిశీలించిన మంత్రి దామరచర్ల : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా పుష్కర పనులను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. పుష్కర పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా 1,150 ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. పుష్కరాల కోసం కొత్తగా 2,500 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
పుష్కర రైళ్లలో ‘ప్రత్యేక’ దోపిడీ
* ప్రత్యేక రైళ్లలో వెళ్లేందుకు ప్రయాణికుల విముఖత * రెగ్యులర్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ‘స్పెషల్’ దోపిడీకి తెరలేపింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరుగనున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ సాధారణ చార్జీలపై అదనపు వసూళ్లకు దిగింది. దీంతో ఈ రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకొనేందుకు ప్రయాణికులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు రెగ్యులర్ రైళ్లకు మాత్రం డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. అదనపు చార్జీల కారణంగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల నిరాదరణకు గురవుతుండగా, రెగ్యులర్ రైళ్లకు మాత్రం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. వీటిలో ఇప్పటివరకు 100 బస్సులు బుక్ అయినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్ఎం గంగాధర్ తెలిపారు. స్పెషల్ రైళ్లు-తత్కాల్ చార్జీలు హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి భక్తులు విజయవాడకు చేరుకొనేవిధంగా, పుష్కరఘాట్లకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లకు రాకపోకలు సాగించే విధంగా సుమారు 220 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అన్ని రైళ్లలోనూ సాధారణ చార్జీల స్థానంలో తత్కాల్ చార్జీలు విధించారు. స్లీపర్ క్లాస్‌పైన సగటున రూ.100 నుంచి రూ.150 వరకు, థర్డ్ ఏసీ బెర్తులపైన రూ.250 నుంచి రూ.350 వరకు, సెకెండ్ ఏసీ పైన రూ.400 నుంచి రూ.500 వరకు అదనపు చార్జీలు విధించారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో, వేసవి సెలవుల్లో ప్రతి సంవత్సరం సాధారణ చార్జీలపైనే ప్రత్యేక రైళ్లు నడుపుతుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారి కృష్ణా పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు దోపిడీకి దిగింది. పుష్కరాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, శ్రీశైలం, బీచుపల్లి, నాగార్జునసాగర్‌లకు 400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఆగస్టు 12 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. -
జిల్లాలో 100 ప్రత్యేక బస్సులు
నగరంలో రూ.10 చార్జీతో సిటీ బస్సులు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవికుమార్ రాజమహేంద్రవరం సిటీ : అంత్య పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు తరలివచ్చే భక్తులకు అవసరమైన బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 100 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇవిగాక విశాఖ నుంచి 100, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మరో 100 బస్సులు తిరగనున్నాయన్నారు. నగరంలో భక్తులు ఘాట్లకు వెళ్ళేందుకు రూ.10 టిక్కెట్ తో 50 సిటీ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం కాంప్లెక్స్ ఆవరణలోని ఖాళీ స్థలంలో వసతి ఏర్పాటు చేశామన్నారు. అంత్యపుష్కరాలు పూర్తయ్యేంత వరకూ బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు 0883–2463400,7382925501,7382925505 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. -
చేపప్రసాదం స్పెషల్ బస్సులు
సాక్షి,సిటీబ్యూరో: చేపప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ,జూబ్లీ బస్స్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే వారు నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకొనేలా ఈ నెల 8,9 తేదీల్లో అదనపు బస్సులను నడపనున్నారు. 8వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 9వ తేదీ చేపప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు 100 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ పురుషోత్తమ్ తెలిపారు. ప్రధాన బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయంతో పాటు, దిల్‌శుఖ్‌నగర్, వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ,మిధానీ ల్యాబ్ క్వార్టర్స్, ఉప్పల్, చార్మినార్,గోల్కొండ,రాంనగర్,రాజేంద్ర నగర్, రీసాలాబజార్,ఈసీఐఎల్,పటాన్చెరు,జీడిమెట్ల,కేపీహెచ్‌బీ,తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ బస్సులకు ‘చేపప్రసాద్ స్పెషల్-నాంపల్లి-ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతారు. సహాయ కేంద్రాలు... కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్,జేబీఎస్‌ల వద్ద ప్రయాణికుల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సూచనలు, సలహాలు అందజేస్తారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులు ఫోన్ ద్వారా కూడా ఆర్టీసీ అధికారుల నుంచి స్పెషల్ బస్సుల సమాచారాన్ని పొందవచ్చు. ప్రయాణికులు సంప్రదించవలసిన ఫోన్‌నెంబర్లు... గాంధీభవన్ 9959226131 గృహకల్ప 9959226131 పబ్లిక్‌గార్డెన్స్ 9959226131 కాచిగూడ రైల్వేస్టేషన్ 9000406069 మహాత్మాగాంధీబస్స్టేషన్ 9959226134 జేబీఎస్ 9959226143 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 9959226147 ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్ 9959226140 శంషాబాద్ ఎయిర్‌పోర్టు 9959226135 సీబీఎస్ 9959226130 -
మేడారం జాతర సమయంలో బస్సులెలా?
♦ ‘స్పెషల్’ రూపంలో 2 వేల బస్సుల మళ్లింపు ♦ హైదరాబాద్ నుంచే వెయ్యి సిటీ బస్సుల తరలింపు ♦ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ♦ విభజనతో ఆంధ్ర నుంచి బస్సులు రాకపోవటమే కారణం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన మేడారం జాతరకు కోట్లలో భక్తులు తరలి వెళ్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్ జిల్లా మేడారానికి భక్తజనం చేరుకుంటుంది. జాతర జరిగే రోజుల్లో ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు. అక్కడి జంపన్నవాగులో నీళ్లు కనిపించకుండా భక్తులు నిండిపోతారు. ఇంత రద్దీ ఉండే సమయంలో వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఇది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. కానీ ఈసారి అదనపు బస్సులు నడపటం ఇబ్బందిగా మారబోతోంది. జాతర మొదలు కాకముందు నుంచే శని, ఆదివారాల్లో లక్షల్లో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ఈనెల 14 నుంచి ఆ సంఖ్య ఎక్కువ కానుంది. ఇక 17, 18 తేదీల్లో అది మరింతగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ దాదాపు రెండు వేల అదనపు బస్సులను మేడారం వైపు నడుపుతోంది. ఒక్క హైదరాబాద్ నుంచే వెయ్యి వరకు సిటీ బస్సులను నడపనున్నట్లు సమాచారం. తొలుత సిటీ బస్సుల్ని వివిధ జిల్లాలకు పంపి.. ఆయా ప్రాంతాల నుంచి మేడారం వరకు నడపనున్నారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తే.. అదనపు బస్సులు నడపాలంటే ఇలాంటి ఇబ్బందులను ఇక ఎదుర్కొనక తప్పదని బదులిస్తున్నారు. ప్రతి జాతర సమయంలో ఆంధ్ర నుంచి బస్సులను తెప్పించి స్పెషల్ సర్వీసులుగా నడిపేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోవటంతో అక్కడి నుంచి ఒక్క బస్సు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వాటిని తెప్పిస్తే ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అది టీఎస్ ఆర్టీసీ ఖజానాకు భారంగా మారుతుంది. దీంతో ఇక్కడి పది జిల్లాల నుంచే కొన్ని కొన్ని చొప్పున బస్సులను మళ్లించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జాతర జరిగే మూడు, నాలుగు రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా బస్సుల కొరత ఏర్పడబోతోంది. -
రాజధాని నుంచి 'మేడారం'కు రోజుకు 50 బస్సులు
హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హైదరాబాద్ నుంచి తరలి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. హైదరాబాద్ నుంచి వెళ్లడంతో పాటు, మేడారం నుంచి తిరిగి వచ్చేందుకు రిటర్న్ జర్నీ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి రోజు 50 బస్సుల చొప్పున నడుపనున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. గురువారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్‌తో కలిసి మేడారం జాతర ప్రత్యేక బస్సుల వివరాలను వెల్లడించారు. ఈ బస్సులకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం ఉంటుంది. ఫిబ్రవరి 17,18,19 తేదీల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ మూడు రోజుల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. అలాగే కొంతమంది ప్రయాణికులు కలిసి పూర్తిగా ఒక బస్సును బుక్ చేసుకుంటే ప్రయాణికులు ఉన్న చోట నుంచే బయలుదేరి వెళ్లవచ్చు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లి, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లు, జగద్గిరిగుట్ట, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి మేడారం స్పెషల్ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను నడుపుతారు. ప్రయాణికులు తమకు నచ్చిన బస్సుల్లో బయలుదేరి వెళ్లవచ్చు. నేరుగా గద్దె వరకు బస్సులు వెళ్తాయని ఈడీ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలపైన యధావిధిగా 50 శాతం అదనంగా తీసుకుంటారు. ఆదివారాల్లో కూడా..... అలాగే, జాతరకు ముందే ప్రయాణికులు మేడారం సమ్మక్క.సారలమ్మలను దర్శించుకొనేందుకు ఆర్టీసీ ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు మేడారం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి మేడారంకు చార్జీల వివరాలు : బస్సు చార్జీలు - పెద్దలకు, పిల్లలకు (రూపాయలలో) ఏసీ : రూ.552, రూ.432 సూపర్ లగ్జరీ : రూ.447, రూ.247 ఎక్స్‌ప్రెస్ : రూ.337, రూ.187 -ప్రయాణికులు అడ్వాన్స్ బుకింగ్ 'www.tsrtconline.in' వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. -నగరంలోని ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. -మేడారం జాతర బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ : 9959226257, 9959224910, 040-27802203, 738201686 నెంబర్లను సంప్రదించవచ్చు. -
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
వరంగల్: వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు 4 వేల ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మేడారం వద్ద 50 ఎకరాలలో బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చెప్పారు. సమ్మక్క-సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో మేడారం భక్తజన సంద్రమైంది. -
విజయవాడ నుంచి 250 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ
విజయవాడ : సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లి.... మళ్లీ గమ్యస్థానాలకు తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం విజయవాడలో ఓ ప్రకటనలో వెల్లడించారు. అందుకోసం విజయవాడ నగరం నుంచి 250 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు. -
అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు: శిద్ధా
హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండగకు రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,600 ప్రత్యేక బస్సు సర్వీసులు కల్పించనున్నట్లు చెప్పారు. ఎవరైనా రవాణా కోసం ప్రయాణికుల నుంచి టిక్కెట్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. -
పొంగల్‌కు ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఈనెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం 12,624 బస్సులను ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు గురువారం ఆమె తెలిపారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై సచివాలయంలో ప్రజలకు పొంగల్ పండుగ సందర్భంగా ఉచిత కానుకలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. పొంగల్ పండుగను తమ స్వస్థలంలో బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని ఆశిస్తారని, ఎంతో వ్యయప్రయాసలకోర్చి దూరప్రాంతాలకు ప్రయాణిస్తారని తెలిపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరడం వల్ల రోజూవారీగా అందుబాటులో ఉండే బస్సులు చాలవని అన్నారు. అందుకే గత నాలుగేళ్లుగా పొంగల్ పండుగకు ప్రత్యేక బస్సులను నడపడం ఆనవాయితీగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులకు ప్రజల నుంచి ఏటా గొప్ప స్పందన వస్తోందని తెలిపారు. ఈ ఉత్సాహంతో కోయంబేడు బస్‌స్టేషన్ నుంచి రాష్ట్రం నలుమూలలకు 12,624 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. ఈనెల 9వ తేదీ నుంచి14వ తేదీ వరకు వెళ్లేందుకు, 15 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు, మహాబలిపురం వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు మరో 200 సిటీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రయివేటు బస్సు యాజమాన్యాలు రద్దీని అడ్డుపెట్టుకుని హెచ్చు చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తే 044-24794709కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె చెప్పారు. పొంగల్ కానుకల పంపిణీ: పొంగల్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ద్వారా కానుకలు పంచే కార్యక్రమాన్ని సీఎం జయలలిత సచివాలయంలో ప్రారంభించారు. కొన్ని కుటుంబాలను తన చాంబర్‌కు పిలిపించుకుని పొంగల్ కానుకల బ్యాగును అందజేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో పంపిణీ ప్రారంభించారు. 1.91 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే పొంగల్ కానుకల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.318 కోట్లు అదనపు భారం పడుతోందని సీఎం తెలిపారు. -
దసరా నేపధ్యంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు
-
దసరాకు ప్రత్యేక బస్సులు
3,855 బస్సులు నడిపేందుకు ప్రత్యేక చర్యలు 200 కిలోమీటర్లు దాటితే 50 శాతం అదనపు చార్జీలు వెల్లడించిన ఆర్టీసీ ఆర్ఎం గంగాధర్ సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ 3,855 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి రోజు నడిచే 3,500 రెగ్యులర్ బస్సులకు ఇవి అదనం. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు తీసుకుంటారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ ఆర్.గంగాధర్ తెలిపారు. బస్సుల సమర్థ నిర్వహణ కోసం మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు, వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రధాన బస్స్టేషన్ల నుంచే కాకుండా అధీకృత టిక్కెట్ బుకింగ్ కేంద్రాల నుంచి కూడా బస్సులు నడుపుతారు. ఈసీఐఎల్, ఏఎస్‌రావునగర్, కేపీహెచ్‌బీ, మియాపూర్, అమీర్‌పేట్, తదితర ప్రాంతాల్లోని అధీకృత టిక్కెట్ బుకింగ్ కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. బస్సుల నిలుపుదలలో మార్పులు.. పండుగ రద్దీ దృష్ట్యా ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు వివిధ రూట్లలో రాకపోకలు సాగించే బస్సుల హాల్టింగ్ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు చేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, పరిగి, వికారాబాద్, తాండూర్ వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ వరకు వస్తాయి. వెన్నెల, గరుడ, గరుడ ప్లస్, కర్ణాటక, మహారాష్ట్ర, విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే రెగ్యులర్ బస్సులు కూడా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు వస్తాయి. విజయవాడ, గుంటూరుకు వెళ్లే స్పెషల్ బస్సులను ఎల్బీనగర్ వరకు నడుపుతారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్, పికెట్ వరకు నడుస్తాయి. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ నుంచి నడుపుతారు. వరంగల్ వైపు వెళ్లే బస్సులు కాచిగూడ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరి ఉప్పల్ క్రాస్‌రోడ్స్ మీదుగా వెళ్తాయి. యాదగిరిగుట్ట బస్సులను ఉప్పల్ నుంచి నడుపుతారు. ప్రతి 15 నిమిషాలకో సిటీ బస్సు.. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక సిటీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఎంజీబీఎస్ నుంచి జూబ్లీ బస్‌స్టేషన్‌కు వెళ్లే సిటీ బస్సులు ప్లాట్‌ఫామ్ 51 నుంచి 55 వరకు ఆగుతాయి. కాచిగూడ, ఉప్పల్ వైపు వెళ్లే బస్సులను ప్లాట్‌ఫామ్ 41-46 మధ్య నిలుపుతారు. ఎల్బీనగర్కు వెళ్లే బస్సులు 15వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతాయి. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు తెలంగాణ ఆర్టీసీ: 040-24614406 (ఎంజీబీఎస్) 040-27802203 (జేబీఎస్) సీనియర్ కస్టమర్ రిలేషన్స్ మేనేజర్: 9959226126 ఏపీఎస్ ఆర్టీసీ: డిప్యూటీ సీటీఎం - 9100948675, 9100948191 -
దసరాకు బస్సులు, చార్జీలు.. అదనం
హైదరాబాద్ : దసరా పండుగకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఈనెల 21వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆర్ఎం గంగాధర్ తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ రూట్లలో 3855 బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు నడిపే అదనపు బస్సుల్లో అదనంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ వైపు వెళ్లే ప్రతి అదనపు బస్సుకు ఎక్స్ట్రా చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బస్సులు యథావిధిగా నడిపేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు. -
నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. శనివారం తెల్లవారుజామున 4గంటలకే వైఎస్సార్ సీపీ జిల్లాలోని పలు డిపోలకు వద్దకు చేరుకొని బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా డిపోల ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
ఆఖరి రోజూ అదే రద్దీ
- బోగీ పట్టాలు తప్పడంతో రైళ్లు ఆలస్యం - కిటకిటలాడిన రైల్వేస్టేషన్ - 100 ప్రత్యేక బస్సుల ఏర్పాటు సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాల ఆఖరిరోజు శనివారం కూడా నగరం నుంచి వేలాది మంది పుష్కర స్నానాలకు వెళ్లారు. అయితే, గత శని, ఆదివారాలతో పోలిస్తే ఆఖరి రోజు పుష్కరాలకు వెళ్లిన వారి సంఖ్య తక్కువగానే ఉందని రైల్వే, ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకే పుష్కరాలు ముగుస్తాయని ప్రకటించడంతో ఉదయం పూటే ఎక్కువ మంది స్నానాలకు తరలివెళ్లారని అధికారులు తెలిపారు. ఆలస్యంగా నడిచిన రైళ్లు చేబ్రోలు- బాదంపూడి మధ్య రాయగడ పాసింజర్‌లోని ఒక బోగీ కొద్దిగా పట్టాలు తప్పింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమై దాన్ని సరిచేయించి పంపారు. ఒకవైపు పుష్కరాల రద్దీ, మరోవైపు బోగీ పట్టాలు తప్పడంతో రాజమండ్రి వైపు నుంచి వచ్చే రైళ్లు రెండు, మూడు గంటలు ఆలస్యంగా వచ్చాయి. శనివారం ఉదయం 8 ప్రత్యేక రైళ్లు యధావిధిగా నడిచాయి. మూడేసి గంటలు ఆలస్యంగా వెళ్లాయి. పుష్కర స్నానానికి వెళ్లేవారు, యాత్రను ముగించి వచ్చేవారితో ఉదయం స్టేషన్ కిటకిటలాడినా.. మధ్యాహ్నం తరువాత కొంత ఖాళీగా కనిపించింది. 100 ప్రత్యేక బస్సులు శుక్రవారం రాత్రి పుష్కరాల కోసం 150 బస్సులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ శనివారం మరో వంద నడిపింది. ఉదయం బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్రైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో కేశినేని భవన్ నుంచి 50 బస్సులు నడిపారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ ‘పుష్కర’ దోపిడీ
హైదరాబాద్: పుష్కర ప్రయాణికులను దోచుకునేందుకు రంగం సిద్ధమైంది. అధికారపార్టీ నేతలకు ప్రైవేటు ట్రావెల్స్‌కు మేలు చేసే రీతిలో ఆర్టీసీ యాజమాన్యం సహకరించింది. పుష్కరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ మొదట ప్రణాళిక రూపొందించుకుంది. ఆ తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గి ఆ నిర్ణయం ఉపసంహరించుకుంది. అయితే పుష్కర ప్రయాణికుల నుంచి 50 శాతం అధిక చార్జీలు వసూలు చేయడంపై మఠాధిపతులు, పీఠాధిపతులు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంవల్లనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటించారు. అలా ఆర్టీసీ అధిక చార్జీలు ఉపసంహరించుకోవడంతోపాటు హైదరాబాద్‌నుంచి సాధ్యమైనన్ని ప్రత్యేక బస్సులు నడపకుండా ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి దారులు తెరిచింది. అయినా... రవాణా శాఖ చోద్యం చూడటం మినహా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. -
పుష్కరాలకు ఆర్టీసీ చార్జీల వాత
కరీంనగర్ : పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇదే అదనుగా ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పుష్కరాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో చార్జీలను పెంచింది. దీంతో పెరిగిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఈ ధర్నా జరిగింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పలువురుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. -
పుష్కర బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్
ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో అదనపు కేంద్రాలు హైదరాబాద్: ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ మరిన్ని విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 450 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా కల్పించింది. హైదరాబాద్ నుంచి భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, బాసర పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లు తీసుకొనేందుకు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ తెలిపారు. -
కూకట్పల్లి నుంచి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
మూసాపేట (హైదరాబాద్) : కూకట్పల్లి ఆర్టీసీ డిపో నుంచి గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వి.మల్లయ్య శనివారం తెలిపారు. ఈనెల 14 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ప్రశాంత్‌నగర్‌లోని బస్ టెర్మినల్ నుంచి ఆదిలాబాద్ జిల్లా బాసరకు, నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు గోదావరి పుష్కరాల ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట, బోరబండ, సనత్‌నగర్, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. బాసర వెళ్లేందుకు పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.130, పోచంపాడు వెళ్లేందుకు పెద్దలకు రూ.265, పిల్లలకు రూ.140ల టిక్కెట్లు ఉంటాయన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 7382818841ను సంప్రదించగలరు. -
ఎంసెట్ కోసం ప్రత్యేక బస్సులు
వరంగల్: తెలంగాణలో గురువారం జరగబోయే ఎంసెట్ పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వరంగల్ జిల్లా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అన్ని మండల కేంద్రాల నుంచి ఎంసెట్ పరీక్షా కేంద్రానికి బస్సులను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. బుధవారం సాయంత్రం నుంచి, గురువారం ఉదయం వరకు ఈ బస్సులు నడుస్తాయని పేర్కొంది. -
రోడ్డెక్కని బస్సులు.. ఆందోళనలో విద్యార్థులు
-
ఎంసెట్ అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- మండల కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు - జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఒంగోలు ఒన్‌టౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వారిని పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. గురువారం రాత్రి జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌తో కలిసి ఆమె ఎంసెట్ ప్రత్యేక ఏర్పాట్ల గురించి విలేకర్లకు వివరించారు. జిల్లాలో ఎంసెట్ పరీక్షకు మొత్తం 11,440 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక బస్సులను అవసరమైన పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేస్తామన్నారు. 12 కేంద్రాల్లో రాత్రి బస ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు గురువారం రాత్రికి ఒంగోలు చేరుకునే వారికి 12 కేంద్రాల్లో బస ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. మొత్తం 1600 మంది బాల, బాలికలకు వేర్వేరుగా ఈ వసతి కల్పించారు. ఈ కేంద్రాలన్నింటికీ లైజన్ ఆఫీసర్లను నియమించారు. పోలీస్ వాహనాలు సిద్ధం ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం పోలీస్ వాహనాల సేవలు కూడా అందిస్తున్నట్లు ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ తెలిపారు. ఒంగోలు నగరంలోని 8 కూడళ్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 8 పోలీస్ హెల్ప్‌లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు అడిషనల్ ఎస్పీకి బాధ్యతలు అప్పగించామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు మాట్లాడుతూ పోలీస్ బందోబస్తుతో గురువారం 50 శాతం ఆర్టీసీ బస్సులను తిప్పినట్లు చెప్పారు. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూం ఒంగోలు టౌన్: ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్‌తో పాటు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. కంట్రోల్ రూమ్ (98482 25915) విద్యార్థులకు ఎలాంటి సహాయం అవసరమైన వెంటనే ఈ కంట్రోల్ రూమ్‌కు సంప్రదించాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా ఒంగోలు రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వేస్టేషన్ వద్ద కొత్తపట్నం డిప్యూటీ తహశీల్దార్ (88866 16035), ఆర్టిసి బస్టాండ్ మద్దిపాడు డిప్యూటీ తహశీల్దార్ (99499 14310) ఇన్చార్జులుగా నియమించామన్నారు. -
ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. గుంటూరు పాటు, శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు విద్యార్థులను ఉచితంగా తరలించేందుకు పలు కళాశాలలు మందుకొచ్చాయి. బస్సులను ఏర్పాటు చేసిన కళాశాలల వివరాలు... గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంసెట్‌కు పరీక్ష రాసేందుకు హాజరుకానున్న మూడు వేల మంది విద్యార్థులను తరలిచేందుకు 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి సుధాకర్ తెలిపారు. ఉచిత రవాణాతో పాటు విద్యార్థులు, వారి వెంట వచ్చే తల్లిదండ్రులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి 4, బీఆర్ స్టేడియం, మణిపురం ఆర్వోబీ, నాజ్ సెంటర్ నుంచి ఒక్కొక్క బస్సు చొప్పున, లక్ష్మీపురం నుంచి మూడు, రాజేంద్ర నగర్ నుంచి ఒకటి, విజయపురి నుంచి, విద్యానగర్ నుంచి రెండు, అమరావతిరోడ్డు నుంచి రెండు, రైల్వే స్టేషన్ నుంచి ఒకటి, బ్రాడీపేట 4/14 నుంచి ఒకటి, ఎస్వీఎన్ కాలనీ నుంచి రెండు, శంకర్‌విలాస్ సెంటర్ నుంచి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన బస్సులు ఉదయం 7.10 గంటలకు బయలు దేరుతాయని తెలిపారు. పెదకాకాని మండలం నంబూరులోని వీవీఐటీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులను తరలించేందుకు అమరావతి, చిలకలూరిపేట, మంగళగిరి, పేరేచర్ల, పొన్నూరు, తెనాలి, విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ఉదయం 7 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. గుంటూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కళాశాల బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని కళ్ళం ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాసేందుకు హాజరుకానున్న విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు కళాశాల డెరైక్టర్ డాక్టర్ ఎం.ఉమా శంకర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ సెంటర్ నుంచి ఉదయం 8 గంటలకు బస్సులు బయలు దేరుతాయని తెలిపారు. కళాశాల క్యాంటీన్లో అల్పాహారం అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థులను శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏసీ కళాశాల మీదుగా అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మశీ కళాశాల వరకూ ఉన్న పరీక్షా కేంద్రాలకు మ్యాగ్నజీల్ కళాశాల బస్సులో ఉచితంగా చేరవేస్తామని మ్యాగ్నజీల్ సీఏ విద్యాసంస్థ చైర్మన్ రేపాల రవికుమార్ తెలిపారు. వివరాలకు 96522 33336 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఎంసెట్‌కు ప్రత్యేక బస్సులు
కర్నూలు(జిల్లా పరిషత్) : ఎంసెట్ విద్యార్థులను వేసవి వడగాడ్పులను మించి ఆర్టీసీ సమ్మె గుబులు పుట్టిస్తోంది. సాధారణ రోజుల్లోనే ఎంసెట్ పరీక్ష రాసేందుకు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం చూశాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించని నేపథ్యంలో ప్రస్తుత ఆర్టీసీ సమ్మె ఆందోళన రేకెత్తిస్తుంది. సమ్మె ఉన్నా ప్రత్యేక బస్సులతో ఎంసెట్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నాటి పరీక్షకు గంట ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకునేందుకు విద్యార్థులు గురువారం నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. కొందరు విద్యార్థులు రాత్రికే కర్నూలు, నంద్యాలలోని బంధువుల ఇళ్లకు, లాడ్జిలకు చేరుకున్నారు. మరికొందరు శుక్రవారం ఉదయమే పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు సమాయత్తమయ్యారు. ప్రధానంగా ఆలూరు, ఆస్పరి, హొళగుంద, కౌతాళం నుంచి కర్నూలుకు, చాగలమర్రి, శ్రీశైలం, ఆత్మకూరు తదితర ప్రాంతాల నుంచి నంద్యాలకు వెళ్లేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో 154 ప్రత్యేక బస్సులు ఎంసెట్ కోసం 154 ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి.వి.రామం తెలిపారు. కర్నూలు, నంద్యాల పరీక్షల కేంద్రాలకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, గూడూరు, డోన్, బేతంచర్ల, ఆత్మకూరు, మహానంది, గడివేముల, బనగానపల్లి, కోవెలకుంట్ల, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు వేశామన్నారు. ఇప్పటికే రెగ్యులర్ సర్వీసుల్లో భాగంగా 312 బస్సులను వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నామన్నారు. ప్రైవేటు కాలేజీల ఆధ్వర్యంలో... ఎంసెట్ పరీక్షలకు నగర శివారులోని పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సౌకర్యాన్ని కల్పించాయి. నగరంలోని ఆయా ప్రధాన కూడళ్ల మీదుగా ఈ బస్సులు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చనున్నాయి. పరీక్ష కేంద్రాలకు జి.పుల్లయ్య కళాశాల బస్సులు నగర శివారులోని జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ బస్సులు పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, వెంకటరమణకాలని, బళ్లారిచౌరస్తా, రాజవిహార్, సి.క్యాంపు నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్తాయన్నారు. పరీక్షల అనంతరం ఆయా పాయింట్ల వద్ద విద్యార్థులను వదిలేలా ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలకు, మెడికల్ విద్యార్థుల కోసం మధ్యాహ్నం 1 గంటకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఏవీఆర్, ఎస్వీఆర్ బస్సులు నగరంలోని ఎంసెట్ పరీక్ష నిర్వహించే కేంద్రాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు నన్నూరులోని ఏవీఆర్, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 8 గంటలకు స్థానిక బళ్లారిచౌరస్తా నుంచి కొత్తబస్టాండ్, శ్రీరామథియేటర్, రాజవిహార్ సెంటర్, కర్నూలు మెడికల్ కాలేజి, కలెక్టరేట్, సి.క్యాంపు మీదుగా ఆయా పరీక్ష కేంద్రాలకు రెండు బస్సులను ఉచితంగా తిప్పుతామన్నారు. బృందావన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో.. నగర శివారులోని బృందావన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని నంద్యా ల చెక్‌పోస్టు, సంతోష్‌నగర్, పాతబస్టాండ్, ప్రకాష్‌నగర్, బస్టాండ్, బళ్లారిచౌరస్తా, మెడికల్ కాలేజి, కృష్ణానగర్ల నుంచి ఉదయం 8.15 గంటలకు బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఒక్క రోజు సమ్మె విరమించండి కర్నూలు(అగ్రికల్చర్): విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఎంసెట్ పరీక్షను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఒక్కరోజు మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్ ఆర్టీసీ యూనియన్ నేతలను కోరారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్‌తో కలిసి కర్నూలు ఆర్టీసీ-2 డిపోలో యూనియన్ల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం కర్నూలు, నంద్యాల్లో జరిగే ఎంసెట్ పరీక్షకు మారుమూల గ్రామాల నుండి సైతం విద్యార్థులు హాజరు కానున్నారని.. ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారన్నారు. విద్యార్థుల జీవితాలను మలుపుతిప్పే పరీక్ష అయినందున సమ్మె నుండి ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలని కోరారు. యూనియన్ నేతలు స్పందిస్తూ ఇది ఒక జిల్లాకు సంబంధించిన ఆందోళన కాదని, మొత్తం రాష్ట్రానికి సంబంధించినదన్నారు. రాష్ట్ర స్థాయిలో చర్చించి తగు నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. -
ఉగాది సందర్భంగా ప్రత్యేక బస్సులు
బెంగళూరు : ఉగాది పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు శుక్రవారం సాయంత్రం ఐదుగంటల నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈమేరకు గురువారం సాయంత్రం మీడియా ప్రకటన వెలువరించింది. ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో పొద్దుటూరు-7, కడప-5, హైదరాబాద్-5, నంద్యాల-5, కర్నూల్-10, విజయవాడ-2,ఒంగోలు-1, నెల్లూరు-4, తిరుపతికి 3 ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక బస్సులు అర్ధరాత్రి 12 గంటల వరకూ ఉండనున్నాయి. మరిన్ని వివరాలకు 9945516544, 9945516545,08022874136 (మెజెస్టిక్)... 9945516543 (శాంతలా బస్ స్టేషన్)లలో సంప్రదించవచ్చు. -
ఉగాదికి 557 ప్రత్యేక బస్సులు
సాక్షి,హైదరాబాద్: ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 557 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వినోద్‌కుమార్ శనివారం తెలిపారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లతో పాటు, వివిధ ప్రాంతాల్లోని పలు ఏటీబీ కేంద్రాల నుంచి 19, 20లలో ఇవి బయలుదేరుతాయి. వివరాలకు 040-24614406, 040-23434268 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. -
శివరాత్రికి స్పెషల్ బస్సులు