దసరా పండుగకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఈనెల 21వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆర్‌ఎం గంగాధర్ తెలిపారు.
హైదరాబాద్ : దసరా పండుగకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఈనెల 21వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆర్‌ఎం గంగాధర్ తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ రూట్లలో 3855 బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు నడిపే అదనపు బస్సుల్లో అదనంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ వైపు వెళ్లే ప్రతి అదనపు బస్సుకు ఎక్స్‌ట్రా చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బస్సులు యథావిధిగా నడిపేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు.