సాక్షి, అమరావతి: అదనపు చార్జీల భారం లేకుండా దసరా పండుగ ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ చార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు నడపనుంది. దసరా కోసం ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేకంగా 5,500 బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ఈ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది.
► దసరా పండుగకు ముందుగా ఈ నెల 13 నుంచి 22 వరకు 2,700 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. దసరా అనంతరం ఈ నెల 23 నుంచి 26 వరకు 2,800 బస్సు సర్వీసులు నడుపుతారు.
► అంతర్‌రాష్ట్ర సర్వీసులకు సంబంధించి హైదరాబాద్ నుంచి 2,050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేశారు.
► విశాఖపట్నం నుంచి 480, రాజమహేంద్రవరం నుంచి 355, విజయవాడ నుంచి 885, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 1,137 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు.
► చార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు.
► దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించింది.
► బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాల్ సెంటర్ నంబర్లు 149, 0866–2570005.
► దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు.
సాధారణ చార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు
Published Thu, Oct 5 2023 2:12 AM | Last Updated on Thu, Oct 5 2023 2:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment