అంత్య పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు తరలివచ్చే భక్తులకు అవసరమైన బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 100 బస్సులు నడపనున్నట్లు తెలిపారు.
-
నగరంలో రూ.10 చార్జీతో సిటీ బస్సులు
-
ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవికుమార్
రాజమహేంద్రవరం సిటీ :
అంత్య పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు తరలివచ్చే భక్తులకు అవసరమైన బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 100 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇవిగాక విశాఖ నుంచి 100, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మరో 100 బస్సులు తిరగనున్నాయన్నారు. నగరంలో భక్తులు ఘాట్‌లకు వెళ్ళేందుకు రూ.10 టిక్కెట్ తో 50 సిటీ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం కాంప్లెక్స్ ఆవరణలోని ఖాళీ స్థలంలో వసతి ఏర్పాటు చేశామన్నారు. అంత్యపుష్కరాలు పూర్తయ్యేంత వరకూ బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు 0883–2463400,7382925501,7382925505 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు.