ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ ....
ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో అదనపు కేంద్రాలు
హైదరాబాద్: ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ మరిన్ని విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 450 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా కల్పించింది. హైదరాబాద్ నుంచి భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, బాసర పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లు తీసుకొనేందుకు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లలో అదనపు కౌంటర్‌లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ తెలిపారు.