హైదరాబాద్: పుష్కర ప్రయాణికులను దోచుకునేందుకు రంగం సిద్ధమైంది. అధికారపార్టీ నేతలకు ప్రైవేటు ట్రావెల్స్‌కు మేలు చేసే రీతిలో ఆర్టీసీ యాజమాన్యం సహకరించింది. పుష్కరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ మొదట ప్రణాళిక రూపొందించుకుంది. ఆ తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గి ఆ నిర్ణయం ఉపసంహరించుకుంది.
అయితే పుష్కర ప్రయాణికుల నుంచి 50 శాతం అధిక చార్జీలు వసూలు చేయడంపై మఠాధిపతులు, పీఠాధిపతులు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంవల్లనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటించారు. అలా ఆర్టీసీ అధిక చార్జీలు ఉపసంహరించుకోవడంతోపాటు హైదరాబాద్‌నుంచి సాధ్యమైనన్ని ప్రత్యేక బస్సులు నడపకుండా ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి దారులు తెరిచింది. అయినా... రవాణా శాఖ చోద్యం చూడటం మినహా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
ప్రైవేట్ ట్రావెల్స్ ‘పుష్కర’ దోపిడీ
Published Tue, Jul 14 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement