private travels
-
లక్షలాది జనం.. రవాణా ఘోరం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేదు. భక్తులు మధ్యతరగతి, సామాన్యప్రజలకు ఏ మాత్రం అందనంతగా విమానచార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి రావాలని కోరుకుంటున్న జనం తోచిన మార్గంలో వెళ్తున్నారు. సామర్థ్యం లేని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాచారం (హైదరాబాద్) నుంచి యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు మినీబస్సులో వెళ్లిన ఏడుగురు భక్తులు తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించిన ఉదంతం ఆందోళన రేపుతోంది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఒకవైపు రహదారులు వందలకొద్దీ కిలోమీటర్లతో కిక్కిరిసిపోతుండగా, మరోవైపు మినీబస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి చిన్న వాహనాల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అరకొర రైళ్లు...: ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కానీ అరకొర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పైగా సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్, గోరఖ్‌పూర్, లక్నో, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో జనవరి నాటికే బుకింగ్ నిలిచిపోయింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు 200 దాటింది. మరిన్ని అదనపు రైళ్లు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సాధారణంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలు, మేడారం వంటి జాతరలకు ఆర్టీసీ వేలకొద్దీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ కుంభమేళాకు లక్షలాది మంది తరలి వెళ్తున్నట్లు తెలిసి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీప్రతిసారీ పండుగ ప్రయాణాన్ని సొమ్ము చేసుకొనే ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ సంస్థలు మహాకుంభమేళా భక్తులను కూడా వదలకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫిట్నెస్ ఉన్నా లేకున్నా పెద్దఎత్తున వాహనాలను నడుపుతున్నాయి. 30 నుంచి 40 మంది ప్రయాణం చేసే ప్రైవేట్ బస్సులతోపాటు, 14 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఇతరత్రా వాహనాలను ఎడాపెడా రోడ్డెక్కిస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వాహనాలు చాలావరకు ఒక డ్రైవర్‌తోనే బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు సుమారు 1,136 కి.మీ. దూరం నిరాటంకంగా వాహనాలను నడపడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. -
ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రవెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గరేణిగుంట మండలం, వెదళ్ళ చెరువు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్నింగ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బస్సులో మంటలను అదుపు చేయించారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను స్థానిక పోలీసులు చొరవ తీసుకొని గమ్యస్థానాలకు పంపారు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
జరుగుమల్లి (సింగరాయకొండ): అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ కిందికి దిగేశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మోజో ట్రావెల్స్ బస్సు(స్లీపర్) 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళుతోంది. బస్సు వెనుక భాగంలో ఉన్న సిగ్నల్ లైట్స్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు, ఏసీ కేబుల్స్ కలిసి ఉండటంతో షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ లక్ష్మణ్.. వెంటనే బస్సును రోడ్డు మార్జిన్లో ఆపివేశాడు. ప్రయాణికులను కిందకు దించి మంటలపై బకెట్‌తో నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేశా డు. అయినప్పటికీ మంటలు తగ్గకపోగా, కాసేపట్లోనే బస్సు మొత్తం వ్యాí³ంచాయి. అప్పటికే ప్రయాణికులంతా కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌తో అక్కడకు చేరుకుని మంటలనార్పారు. అయితే బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికుల లగేజీ మొత్తం కాలిపోయింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కట్టుబట్టలతో మిగిలిన ప్రయాణికులను ఇతర వాహనాల్లో ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సీఐ రంగనాథ్ తెలిపారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
-
కిక్కిరిసిన జర్నీ.. అరకొర రైళ్లే.. ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు
సాక్షి, హైదరాబాద్: నగరం పల్లెబాట పట్టింది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. పండగకు మరో మూడు రోజులే ఉండడడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపించింది. అలాగే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి కూడా ప్రయాణికులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు. ఈ సంవత్సరం ఆర్టీసీ పుణ్యమా అని పండగ ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఆర్టీసీ బస్సుల్ని సాధారణ చార్జీలపైనే ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికుల ఆదరణ పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం యథావిధిగా దారిదోపిడీ కొనసాగుతోంది. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. డిమాండ్ మేరకు రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు అదనంగా ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా వరకు బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తోంది. అరకొర రైళ్లే... ► ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, ఈసారి అదనపు రైళ్లను చాలా వరకు తగ్గించారు. ► కొన్ని ప్రాంతాలకు మాత్రమే సుమారు 20 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. ► దసరా సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ► అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► ‘కనీసం జనరల్ బోగీలను కూడా అదనంగా ఏర్పాటు చేయడం లేదు. ఒక్కో బోగీలో వందలకొద్దీ కిక్కిరిసి ప్రయాణం చేయవలసి వస్తుంది’. అని కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. ► తెలంగాణ ప్రాంతాలకు రైలు సర్వీసుల విస్తరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్తున్న మరో ప్రయాణికుడు శ్రీనివాస్ ఆరోపించారు. దూరప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... ► తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 4400కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ► విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి తదితర నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ► అక్టోబర్ 1 నుంచి రద్దీ మరింత పెరగనున్న దృష్ట్యా రోజుకు 500 నుంచి 1000 వరకు అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి.. సీబీస్: అనంతపూర్, చిత్తూరు, కడప,కర్నూలు,ఒంగోలు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు: వరంగల్, హనుమకొండ, జనగామ, యాదగిరిగుట్ట వైపు దిల్సుఖ్నగర్: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట .. జేబీఎస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లేవి.. ఎల్బీనగర్: వైజాగ్, విజయవాడ, గుంటూరు వైపు .. ఎంజీబీఎస్: మహబూబ్‌నగర్,వికారాబాద్, తాండూరు, భద్రాచలం, తదితర ప్రాంతాలకు.. సాధారణ చార్జీలే.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించరాదని, సాధారణ చార్జీలపైనే ఆర్టీసీ బస్సులు అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ కోరారు. ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లు నమోదు చేసుకోవచ్చునని, నేరుగా ప్రయాణసమయంలోనూ టిక్కెట్లు తీసుకోవచ్చునని తెలిపారు. -
ప్రైవేట్ ట్రావెల్స్.. దసరా దందా..!
దసరా రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి. ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. సాధారణ ధరల కంటే అదనంగా ఒక్కో టికెట్‌పై రూ.400 వరకూ వసూలు చేస్తున్నాయి. దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల ఆదేశాలను సైతం ట్రావెల్స్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా మాటలకే పరిమితమయ్యారు. ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. చీరాల: విజయదశమి పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారికి దోపిడీ తప్పడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ముక్కు పిండి అదనపు చార్జీలు వసూలు చేయడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దసరా సందర్భంగా ఆర్టీసీతో పాటు రైల్వేలో కూడా రద్దీ నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు టికెట్ ధరలు అమాంతం పెంచేశారు. అడిగేవాళ్లు లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 600కుపైగా సర్వీసులు... జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు, అద్దంకి, కనిగిరి ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు నిత్యం 600కుపైగా రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు కూడా నడుపుతున్నాయి. అయితే, ప్రైవేటు ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పండుగ కాస్తా..దండగగా మారిందంటూ నిష్టూరుస్తున్నారు. దసరా ఉత్సవాలు, సెలవులతో పెరిగిన రద్దీ... కరోనా రెండు దశలను విజయవంతంగా ఎదుర్కొని ప్రజాజీవనం మరలా గాడిలో పడుతోంది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు జనం వెళ్లివస్తున్నారు. ఈ సమయంలో వచ్చిన దసరా పండుగకు ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. బుధవారం దుర్గాష్టమి నుంచి కార్యాలయాలకు కూడా సెలవులు కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రయాణమయ్యారు. దీంతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు కాసులు కురిపిస్తోంది. చదవండి: (దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత) రెట్టింపు ధరలతో బెంబేలు... కరోనా ఉధృతి తగ్గిన అనంతరం వచ్చిన పెద్ద పండుగ కావడంతో వృత్తిరీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న వారంతా సొంతూళ్లకు బయలుదేరారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది ఉద్యోగ, వ్యాపారాల రీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులను సాధారాణ చార్జీలతో నడుపుతుండగా, పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు మాత్రం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక చార్జీలతో కొన్ని బస్సులు నడుపుతున్నారు. కానీ, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారు. రోజువారీ సర్వీసుల టికెట్ ధరల కంటే రూ.300 నుంచి రూ.400 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ చార్జీ రూ.440 ఉండగా, ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఏసీ రూ.1,300, నాన్ ఏసీ రూ.890 తీసుకుంటున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు చార్జీ రూ.425 ఉండగా, ప్రైవేటు బస్సు ఏసీ టికెట్ రూ.1,200, నాన్ ఏసీ బస్సు టికెట్‌కు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌కు 20కిపైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. నిబంధనలకు చెల్లుచీటీ... ప్రైవేటు బస్సుల్లో అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ.. పండుగ సీజన్లలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు తాపత్రయపడుతున్నాయి. కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తున్నామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఆ దాఖలాలు కనిపించడం లేదు. పండుగ సంగతి ఏలా ఉన్నా ట్రావెల్స్ బస్సుల టికెట్ ధరలతో ప్రయాణికుల జేబులకు మాత్రం చిల్లు తప్పేలా లేదు. 303 బస్సులను తనిఖీ చేశాం దసరా రద్దీ నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేయకుండా పర్యవేక్షిస్తున్నాం. గడిచిన నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 303 బస్సులను తనిఖీ చేశాం. టికెట్ ధరలు అధికంగా వసూలు చేస్తున్న దాఖలాలు లేవు. కానీ, ఇతర కారణాలతో 33 కేసులు నమోదు చేశాం. ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 91542 94502కు ప్రయాణికులు ఫిర్యాదు చేయాలి. అధిక ధరలు వసూలు చేసినట్లు నిర్ధారణ జరిగితే బస్సులు, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – భువనగిరి శ్రీకృష్ణవేణి, రవాణాశాఖ ఉప కమిషనర్, ఒంగోలు -
కోవిడ్ సెకండ్ వేవ్.. కుదేలవుతున్న క్యాబ్‌లు!
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికి పైగా ప్రజారోగ్యంపై పడగ నీడలా మారిన మహమ్మారి కోవిడ్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. గతేడాది విజృంభించిన వైరస్ బారినుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవస్థలు తిరిగి కుదేలవుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్ రెండో దశ ఉద్ధృతి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా కుదేలైన ప్రజారవాణా వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న తరుణంలో ముంచుకొచ్చిన రెండో దశ మరోసారి పిడుగుపాటుగా మారింది, ప్రత్యేకించి క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, ఆటోలు తదితర వాహనాలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 80 వేలకుపైగా క్యాబ్‌లు ఉబెర్, ఓలా తదితర క్యాబ్దిగ్గజ సంస్థలకు అనుసంధానమై తిరుగుతుండగా, గత నెల రోజులుగా 50 వేలకు పడిపోయినట్లు అంచనా. ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, రాత్రింబవళ్లు పడిగాపులు కాసినా కనీస ఆదాయం లభించకపోవడంతో చాలా మంది డ్రైవర్లు, వాహన యజమానులు క్యాబ్‌లను వదిలేస్తున్నారు. గత 10 రోజులుగా క్యాబ్‌ల వినియోగం గణనీయంగా తగ్గినట్లు తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌కు ముందు వేలాది మందికి ఉపాధినిచ్చిన క్యాబ్‌లు ఇప్పుడు భారంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు తగ్గిన బుకింగ్‌లు.. ►పెళ్లిళ్లు, వేడుకలు, సామూహిక ఉత్సవాలు వంటి వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ట్రావెల్స్ వాహనాల బుకింగ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. 8 సీట్లు, 10 సీట్లతో నడిచే మ్యాక్సీ క్యాబ్‌లు, 14 నుంచి 22 సీట్ల వరకు ఉండే మినీ బస్సులకు డిమాండ్ తగ్గినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ►మే నెల వరకూ పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతో వాహనాలకు డిమాండ్ కనిపించడం లేదు. ముఖ్యంగా పర్యాటక రంగం చాలా వరకు దెబ్బతిన్నది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సందర్శకుల తగ్గిపోయింది. కోవిడ్‌కు ముందు ప్రతిరోజూ సుమారు 50 వేలమందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు నగర సందర్శన కోసం వచ్చేవారు. ఏడాదికిపైగా అంంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుండగా కోవిడ్ రెండో దశ ఉప్పెనలా వచ్చిపడింది. దీంతో బుకింగ్‌లపై ప్రభావం పడినట్లు ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెరుచుకోని ఐటీ రంగం.. ►గతేడాది ఐటీ సంస్థలు లాక్డౌన్ విధించాయి. సాఫ్ట్వేర్ నిపుణులు చాలా వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి, ఐటీ ప్రాంతాలకు రోజుకు 10,వేలకుపైగా క్యాబ్‌లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్యాబ్‌లు చాలా వరకు సాధారణ రాకపోకలపై మాత్రమే ఆధారపడి తిరుగుతున్నాయి. కానీ ప్రస్తుత రెండో దశ దృష్ట్యా అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే నగర వాసులు క్యాబ్‌లు వినియోగిస్తున్నారు. ► ఇదే సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. కోవిడ్ దృష్ట్యా గతేడాది నుంచి ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడ్డారు. గత నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి రెండో వారం వరకు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ కనిపించింది. కానీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. -
ఆర్టీసీకి దారులు మూస్తున్న ప్రైవేట్ రూట్
సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని మరింతగా అగాథంలోకి నెట్టే కొత్త విధానానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. నిబంధనలకు పాతరేసి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను తరలిస్తూ ఆర్టీసీ కొంప ముంచుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఇక దర్జాగా తిరగనున్నాయి. ఇంతకాలం టూరిస్ట్ పర్మిట్లకే పరిమితమవుతూ వచ్చిన బస్సులు ఇక సమూహాలతోపాటు వ్యక్తులుగా కూడా ప్రయాణికులను తరలించొచ్చు. దీంతో ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఏంటీ ఈ మార్పు.. కేంద్ర ప్రభుత్వం గతంలో రోడ్డు రవాణా నిబంధనల్లో చేసిన అతి కీలక సవరణ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. గతంలో టూరిస్టు పర్మిట్లతో కేవలం నిర్ధారిత ప్రాంతం నుంచి గమ్యం వరకు సమూహాలను మాత్రమే తరలించే వెసులుబాటు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు బస్సులకు ఉండేది. ఏయే రాష్ట్రాల మీదుగా ఆ బస్సు తిరిగితే, ఆయా రాష్ట్రాలకు పర్మిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్యాటకాన్ని ప్రోత్సహించే పేరుతో కేంద్రం అఖిల భారత టూరిస్ట్ పర్మిట్ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా కొత్త పర్మిట్ విధానం, ప్రయాణికుల తరలింపులో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో పెళ్లి బృందాలు, యాత్రలు, ఇతర అవసరాలకు సంబంధించి ఒక ప్రాంతం నుంచి గమ్యం వరకు ఒకే బృందంగా ప్రయాణికులను తరలించేవారు. కానీ, ఇప్పుడు ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఎవరికి వారుగా ప్రయాణాలు చేయొచ్చు. అలాంటప్పుడు వారి గమ్యస్థానాలు కూడా వేరుగా ఉంటాయి. అంటే.. స్టేజీ క్యారియర్లుగా అధికారికంగా మారినట్టే. బస్సుకు బోర్డు పెట్టొద్దన్న నిబంధన తప్ప మిగతా అంతా ఆర్టీసీ బస్సు తరహాలోనే మారే అవకాశం కనిపిస్తోంది. పర్మిట్ ఫీజులు ఇలా.. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పర్మిట్ ఫీజులు వసూలు చేసుకునేవి. ఇప్పుడు దేశం మొత్తం ఒకే పర్మిట్ ఫీజు ఉంటుంది. మొత్తం వసూళ్ల నుంచి దామాషా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పంచుతుంది. కొత్త ఫీజులు ఇలా... డ్రైవర్ కాకుండా తొమ్మిది మంది లోపు ప్రయాణికులుండే వాహనాలకు సంబంధించి ఏసీ వాహనాలకు రూ.25 వేలు, నాన్ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, పది అంతకంటే ఎక్కువ–23 కంటే తక్కువ మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉండే వాహనాలలో ఏసీ అయితే రూ.75 వేలు, నాన్ ఏసీ అయితే రూ.50 వేలు, 23 మంది ప్రయాణికులు అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న వాహనాలకు ఏసీ అయితే రూ.3 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.2 లక్షలు వార్షిక పర్మిట్ ఫీజు చెల్లించాలి. ఇది మ్యాక్సీ క్యాబ్, టూరిస్టు బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. సొంత వాహనాలకు ఇది వర్తించదు. పెరగనున్న ప్రైవేటు బస్సులు ప్రస్తుతం రాష్ట్రంలో 4,575 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని టూరిస్టు బస్సులు పోను, మిగతావన్నీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే. ఆర్టీసీ తరహాలో ఇవి టికెట్లు బుక్ చేసి ప్రయాణికులను తరలిస్తున్నాయి. వీటి వల్ల సాలీనా ఆర్టీసీ రూ.3 వేల కోట్ల వరకు నష్టపోతోందన్న అంచనా ఉంది. ప్రైవేట్ బస్సులను నియంత్రించే యంత్రాంగంలోని పలువురు సిబ్బంది నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసి వదిలేస్తున్నారు. ఎప్పుడో ఓసారి దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ, రవాణా శాఖలతో కలిపి ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించి, అప్పటి జేటీసీ వెంకటేశ్వర్లుకు బాధ్యత అప్పగించారు. కానీ, ఆ తర్వాత దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ అధికారి రిటైరయ్యే వరకు ఎలాంటి కార్యాచరణ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తవిధానం వచ్చిన నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దూరప్రాంతాలకు అవి స్టేజీ క్యారియర్లుగా తిరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆర్టీసీకి అశనిపాతమే.. ‘కొత్తగా అమలులోకి వచ్చిన ఈ వెసులుబాటు నిజంగా ఆర్టీసీకి అశనిపాతమే కానుంది. ఊరి పేరుతో బోర్డు లేకుండా ప్రైవేటు బస్సులు స్టేజీ క్యారియర్ల తరహాలోనే తిరుగుతాయి. చర్యలు తీసుకుంటారన్న భయం కూడా ఉండదు. కేంద్రం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించే వెసులుబాటు ఇందులో లేకుండా పోయింది’’ –గాంధీ, రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ -
ప్రయాణికులపై 'ప్రైవేట్' బాదుడు
సాక్షి, అమరావతి: ఎప్పటిలాగే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ పండుగ సీజన్లోనూ దోపిడీకి తెగబడ్డారు. సంక్రాంతికి సొంతూరుకు వెళ్దామనుకునే వారికి రెండ్రోజులుగా చార్జీలు పెంచి చుక్కలు చూపిస్తున్నారు. డిమాండ్ ఉన్న తేదీల్లో అయితే మరీ బాదేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆర్టీసీ టికెట్ ధర రూ.900 ఉంటే, ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం రూ.1,500 వరకు వసూలుచేస్తున్నారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌నుంచి గుంటూరుకు రెగ్యులర్ సర్వీసుల్లో రూ.530 వరకు ఉంది. అదే స్పెషల్ బస్సు అయితే రూ.795 వసూలుచేస్తున్నారు. కానీ, ప్రైవేటు బస్సులో ఏకంగా రూ.1,130–1,200 వరకు తీసుకుంటున్నట్లు ఆన్లైన్లో ఉంచారు. నాన్ ఏసీ ఆర్టీసీ బస్సుల్లో ఇదే మార్గంలో రెగ్యులర్ సర్వీసులకు రూ.418 అయితే, స్పెషల్ బస్సుల్లో రూ.568 వసూలుచేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో నాన్ ఏసీ టికెట్ల ధరలు రూ.850–రూ.950 వరకు ఉన్నాయి. ప్రయాణికుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోం టికెట్ రిజర్వేషన్లు చేసే రెడ్‌బస్, అభీబస్‌ల నిర్వాహకులతో ఇప్పటికే మాట్లాడాం. ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టినా.. అధిక రేట్లకు విక్రయించినా.. ట్రావెల్స్ నిర్వాహకులపైనే కాదు.. బస్ టికెట్ కంపెనీలపై కూడా కేసులు నమోదు చెయ్యొచ్చు. నేటి నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తాం. ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు తమ బస్సుల్లో ‘రవాణా అధికారులు ఎక్కడైనా తనిఖీలు చేస్తారు.. వారికి సహకరించాలి’ అని బోర్డులు పెట్టుకోవాలి. – ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రైవేట్ దోపిడీపై రవాణా శాఖ కన్ను ఇలా ప్రయాణికుల్ని దోచుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్, టికెట్ బుకింగ్ వెబ్సైట్లపై రవాణా అధికారులు దృష్టిసారించారు. మోటారు వెహికల్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. అంతేకాక.. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే భారీ జరిమానాలు విధించనున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ మొదలుకావడంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే ప్రైవేటు బస్సులను తనిఖీలు చేసేందుకు జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినా తీరు మార్చుకోకపోతే వాటిని సీజ్ చేయనున్నారు. అలాంటి ట్రావెల్స్ నిర్వాహకులకు రూ.25 వేల వరకు జరిమానాలు విధించనున్నారు. కేసులు నమోదు చేసిన ట్రావెల్స్ వివరాలను అన్ని చెక్‌పోస్టులకు పంపించాలని కమిషనరేట్ అధికారులు సూచించారు. ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం కేసుల నమోదు విషయంలో మినహాయింపులేదని రవాణా శాఖాధికారులు స్పష్టంచేశారు. మరోవైపు.. టికెట్ల ధరలు తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు గతేడాది హామీ ఇచ్చినప్పటికీ ఈ ఏడాది కూడా అధికంగానే వసూలుచేయడం గమనార్హం. -
రాష్ట్రంలో మరో లక్ష కి.మీ. లక్ష్యం
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్లను రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న అంతర్గత రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే ప్రారంభించారు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో డిమాండ్ ఉన్న కర్ణాటక, తమిళనాడుకు సర్వీసులు పెంచనున్నారు. దీన్లో భాగంగా విజయవాడ–విశాఖపట్టణం మధ్య ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేషన్స్‌పై సర్వే చేసిన అధికారులు ఈ మార్గంలో బస్సులు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. డిమాండ్ ఉన్న తిరుపతికి బస్సులు పెంచడంపై దృష్టి సారించారు. విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం –చెన్నైలకు సర్వీసుల పెంపుపై అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల నుంచి తెలంగాణకు 440 బస్సులు నడిపిన ఏపీఎస్ఆర్టీసీ వీటిని క్రమంగా పెంచనుంది. ఈ నెల రెండు నుంచి తెలంగాణకు ప్రారంభమైన బస్సుల్లో ఆక్యుపెన్సీ 80 శాతం వరకు ఉంది. విజయవాడ–హైదరాబాద్‌కు ఏపీఎస్ఆర్టీసీ 45 సర్వీసులు నడిపితే, టీఎస్ఆర్టీసీ ఈ రూట్లో 39 సర్వీసులు నడిపింది. మొత్తం కర్ణాటక, తెలంగాణ అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఆక్యుపెన్సీ 65 శాతం ఉంది. తమిళనాడుకు త్వరలో సర్వీసులు నడిపేందుకు తమిళనాడు ఆర్టీసీకి సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే చెన్నైకి బస్సులు నడపనున్నారు. విజయవాడ–విశాఖ మధ్య 107 సర్వీసులు ► విజయవాడ–విశాఖ మధ్య ఆర్టీసీ నిత్యం 107 సర్వీసులు నడుపుతోంది. అదే ప్రైవేటు ట్రావెల్స్ వారు 117 సర్వీసులు తిప్పుతున్నారు. ► ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు పగటిపూట సైతం విజయవాడ నుంచి విశాఖకు బస్సులు నడుపుతున్నారు. అయితే కాంట్రాక్టు క్యారేజీలకు అనుమతి తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్నారు. ► నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ను కట్టడిచేయాలని ఆర్టీసీ ఇప్పటికే రవాణాశాఖకు లేఖ రాసింది. ► విజయవాడ–తిరుపతి రూట్లో ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు గతంలో నిర్వహించిన విధంగానే తిరుమల దర్శనసేవలను పునరుద్ధరించనుంది. ► మిగిలిన ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీకే ప్రజాదరణ ఉంది. ఆక్యుపెన్సీ రేషియో కూడా అధికంగా ఉంది. ఆదరణ ఉన్న అన్ని రూట్లు సర్వే చేస్తాం ప్రయాణికుల ఆదరణ ఉన్న అన్ని రూట్లను సర్వే చేస్తాం. డిమాండ్‌ను బట్టి బస్సులు నడిపి ప్రైవేటుకు పోటీగా సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఆర్టీసీలో ప్రమాదరేటు తక్కువ. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. – బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) -
రద్దీనిబట్టి చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ చార్జీలు, రద్దీ లేకుంటే తక్కువ చార్జీలు.. ఇదీ ఫ్లెక్సీ ఫేర్ విధానం. విమాన టికెట్ ధరలు ఇలాగే ఖరారవుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఆర్టీసీలోనూ అమలు చేయనున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యాక అన్ని దూరప్రాంత సర్వీసుల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కొన్ని ఇతర సర్వీసుల్లో కూడా అమలు చేసే అవకాశాన్ని పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బాటలోనే.. కొన్ని ప్రధాన ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని అమలు చేస్తుండటంతో వాటితో ఆర్టీసీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. డిమాండ్ అంతగా లేని సందర్భాల్లో ప్రయాణికులను ఆయా ట్రావెల్స్ తన్నుకుపోతుండటంతో ఆర్టీసీ నష్టపోతోంది. ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ తీవ్రంగా యత్నిస్తోంది. ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని ప్రారంభిస్తే ఆదాయం పెరుగుతుందని అంచనాకొచ్చిన ఆర్టీసీ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకుంది. ఆన్లైన్ బుకింగ్‌తో దీన్ని అనుసంధానించనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు తిరగటం లేదు. ఆయా రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం చేసుకోగానే సర్వీసులు మొదలు కానున్నాయి. ఆ వెంటనే ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తుది అనుమతి పొందాల్సి ఉంది. ప్రజలపై పెద్దగా భారం లేని విధానమే అయినందున దీనికి అనుమతి విషయంలో ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. గంటగంటకూ ధరలు మారే అవకాశం దసరా, సంక్రాంతి, దీపావళి లాంటి ప్రధాన పండుగలతోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రత్యేక సర్వీసులు ప్రారంభించినా సీట్లు లభించనంత రద్దీ ఉంటుంది. ప్రైవేటు ట్రావెల్స్ కూడా వందల సంఖ్యలో తిరిగినా రద్దీ తగ్గదు. అలాంటి సందర్భాల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానంలో టికెట్ ధరలు నిలకడగా ఉండవు. ప్రస్తుతం ఆర్టీసీ ముందుగా నిర్ధారించిన ధరలే స్థిరంగా అమలవుతున్నాయి. స్పెషల్ సర్వీస్ చార్జీగా 50 శాతం అదనంగా ధర పెంచడం తప్ప బేసిక్ టికెట్ ధర స్థిరంగానే ఉంటోంది. కానీ ఫ్లెక్సీ ఫేర్‌లో ప్రతి గంటకూ పరిస్థితిని అంచనా వేసి ధరలను సవరిస్తారు. అలాగే అన్ సీజన్లో, ఖాళీగా ఉండే సమయంలో బేసిక్ ధర కంటే తగ్గిస్తారు. గతంలో బెంగళూరు మార్గంలో నడిచే కొన్ని సర్వీసులకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు బెంగళూరు, షిరిడీ, ముంబై, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి డిమాండ్ ఎక్కువున్న అన్ని దూరప్రాంతాల్లో దాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. తొలుత గరుడ లాంటి ఏసీ సర్వీసులకు దీన్ని ప్రారం భించి ఆ తర్వాత సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ అమలు చేయాలనుకుంటున్నారు. పేదలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ మినహా ఆపై అన్ని కేటగిరీల్లో దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. నిపుణుల సిఫార్సులు ఆర్టీసీ నష్టాలను అధిగమించడంతోపాటు ప్రైవేటు ట్రావెల్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొనేందుకు నిపుణులు గతంలో చేసిన సిఫారసుల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానం కూడా ఉంది. దీన్ని అమలు చేయాలని చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో వెనకడుగు వేశారు. తీవ్ర నష్టాలు, కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులతో ఆర్టీసీ తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పుడు దాన్ని అమలు చేయాలని అధికారులు దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. -
ఖమ్మం జిల్లాలో ట్రావెల్స్ బస్సు బీభత్సం
-
కొలువుకు... రవాణా భారం!
రమేశ్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నెలకు 14 వేల వేతనం. తాను నివసించే చోటు నుంచి ఆఫీసుకు దూరం 35 కిలోమీటర్లు. సాధారణ రోజుల్లో బస్ పాస్ కోసం నెలకు రూ.వెయ్యి ఖర్చు చేసేవాడు. కోవిడ్–19 ప్రభావంతో ప్రస్తుతం సిటీలో ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. దీంతో ప్రైవేటు వాహనాల్లో లేదా సొంత బైక్‌పై కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఎలా వెళ్లినా రోజుకు కనీసం రూ.120 ఖర్చవుతోంది. కార్యాలయానికి వెళ్లాలంటే నెలకు సగటున మూడున్నర వేలు ఖర్చు. ఈ లెక్కన తన వేతనంలో పావువంతు రవాణా చార్జీలకే ఖర్చు చేస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: సగటు ఉద్యోగి సంకటస్థితిలో పడ్డాడు. ‘కార్యాలయానికి ఎలా వెళ్లాలి... తిరిగి వచ్చేదెలా..?’ అనే ప్రశ్నతో ప్రతిరోజూ సతమతమవుతున్నాడు. కోవిడ్–19 కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజారవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే స్థితి లేదు. హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోరైల్, ఎంఎంటీఎస్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రైవేటు వాహనాలు లేదా సొంత వాహనంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. సాధారణ ప్రయాణాల సంగతి అటుంచితే ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఉద్యోగికి ఖర్చు డబుల్ మన హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తు ఉద్యోగులు, కార్మికులు దాదాపు 40 లక్షల మంది ఉంటారు. ఇందులో సంఘటిత రంగంలో పనిచేసే వారితో పాటు అసంఘటిత రంగ కార్మికులు సైతం ఉన్నారు. వీరంతా విధులకు హాజరు కావాలంటే ఎంతో కొంత దూరం ప్రయాణం చేయాల్సిందే. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుపై ఆధారపడేవారు నెలకు సగటున ఒక ఉద్యోగి రూ.800 నుంచి 1,200 వరకు ఖర్చు చేసేవారు. ఈ మొత్తంతో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సిటీ రీజియన్ మొత్తం ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా అదనపు వ్యయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజారవాణా పూర్తిగా స్తంభించడంతో ప్రతి ఉద్యోగి ప్రైవేటు వాహనాలైన ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాల్సి వస్తోంది. లేకుంటే సొంత వాహనాన్ని సర్దుకోవాల్సిందే. సాధారణ రోజుల కంటే ప్రస్తుతం ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రూ.20 తీసుకునే ఆటో డ్రైవర్... ప్రస్తుతం 40 వసూలు చేస్తున్నాడు. సాయంత్రం 6 గంటలు దాటితే రేటు మరింత పెరిగి రూ.50కి చేరుతోంది. హైదరాబాద్‌లో ఆటో కనీస చార్జీ రూ.20గా ఉండడం గమనార్హం. మరోవైపు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఆర్టీసీ బస్సులు కొంత వరకు నడుస్తున్నా... గతంలో మాదిరిగా సమయానుకూలంగా నడవకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ సోకుతుందనే భయంతో కూడా ఇరుకిరుకు ప్రయాణాలకు జనాలు ఆసక్తి చూపడం లేదు. సొంత వాహనంతోనూ కష్టాలే ప్రైవేటు వాహనాలకు బదులు సొంత వాహనాలను వినియోగించే వారికి సైతం ఖర్చు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఖర్చు అమాంతం 20 శాతం పెరిగింది. ఇంధన ఖర్చులే కాకుండా నిర్వహణ వ్యయం సైతం పెరుగుతున్నాయి. నిత్యం ఆఫీసుకు తీసుకురావడంతో ఎక్కువ కిలోమీటర్లను తక్కువ రోజుల్లో తిరగడంతో వాహనాలు సర్వీసింగ్‌కు తొందరగా వస్తున్నాయి. ఈక్రమంలో ఒకే ఆఫీసులో పనిచేసే నలుగురు ఉద్యోగులు కారులో వెళ్లి ఖర్చును షేర్ చేసుకుంటున్నారు. మరికొందరు బైక్ వినియోగించి ఇద్దరు వెళ్లేలా ప్లాన్ చేసుకుని సర్దుకుంటున్నారు. ఈ షేరింగ్ విధానంతో కేవలం ఆఫీస్, ఇళ్లు మాత్రమే వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇతర చోట పనులుంటే మళ్లీ ప్రైవేటు వాహనాల్ని నమ్ముకుని చేతిచమురు వదిలించుకోవాల్సిందే. కొందరు తక్కువ ఖర్చుతో నెట్టుకురావచ్చని భావించి బైక్‌లను వినియోగిస్తున్నా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడంతో వెన్నునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. -
ఆర్టీసీ బస్సులు కళకళ
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ అన్ని వర్గాల్లో ఆనందాన్ని నింపింది. ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యుల మధ్య పండగ జరుపుకున్నవారంతా స్వస్థలాల నుంచి తిరిగి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కాగా, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేడు (శనివారం), రేపు (ఆదివారం) ఆర్టీసీ 2 వేలకు పైగా ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల పాటు ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. మొత్తం పండగ సీజన్లో ఈ నెల 15 నుంచి 19 వరకు 4,200 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీని ప్రకారం పండగ ముందు 2,200 ప్రత్యేక సర్వీసులను నడపడంతో ప్రయాణికులు ఆదరించారు. ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ కట్టడి చేయడంతో ఈ దఫా రాష్ట్ర ప్రజలకు ప్రయాణంలో ఇబ్బందులు తప్పాయి. ఇటు రైల్వే శాఖ నర్సాపూర్, కాకినాడ, విశాఖ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. 40 శాతం రాయితీతో బస్సులు కళకళ.. ఆర్టీసీ పండగ సీజన్లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేస్తుంది. తిరుగు ప్రయాణంలో సరిగా ఆక్యుపెన్సీ ఉండదని, డీజిల్ ఖర్చులకైనా బస్సు నడిపినందుకు రావాలని ఈ విధంగా 50 శాతం చార్జీలు పెంచుతారు. అయితే ఈ దఫా ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేసింది. తిరిగి వచ్చేటప్పుడు ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సులో 40 శాతం రాయితీ ప్రకటించింది. దీంతో ప్రత్యేక బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగి బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ చేస్తే 8309887955కు ఫిర్యాదులు ఈనెల 2వ తేదీ నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ 3,132 కేసులు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 546 బస్సులను సీజ్ చేశారు. తిరుగు ప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రవాణా శాఖ తెలిపింది. -
సిటీ పల్లెటూర్
సాక్షి, హైదరాబాద్: మహానగరం పల్లె బాట పట్టింది. సంక్రాంతి సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్ శుక్రవారం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు రైల్వేతో సహా, ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్లు రంగంలోకి దిగారు. ప్రైవేట్ రైళ్లలో ప్రత్యేక చార్జీలను విధించారు. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు పెంచగా, రాష్ట్రంలోని (200 కి.మీ. లోపు) ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో 10 నుంచి 20 శాతం వరకు చార్జీలను పెంచారు. ఇక ప్రైవేట్ బస్సులు యథావిధిగా దారి దోపిడీ సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలను రెట్టింపు చేశాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 20 లక్షల మందికిపైగా తెలుగు రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. పండుగ రద్దీ విమానాలను సైతం తాకింది. ఆర్టీసీ 50 శాతం అదనం... సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ 3,500 రెగ్యులర్ బస్సులకు తోడు సుమారు 5,500 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి తదితర దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 50 శాతం, తెలంగాణలోని వివిధ జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో 10 నుంచి 20 శాతం అదనపు చార్జీలు విధించారు. ఇప్పటికే అన్ని రెగ్యులర్ బస్సుల్లో సీట్లు రిజర్వ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఇవి నగర శివార్ల నుంచే బయలు దేరేలా కార్యచరణ చేపట్టినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ ఆపరేటర్ల దారి దోపిడీ... నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు రెట్టింపయ్యాయి. ఒక్కో ట్రావెల్స్ సంస్థ ఒక్కో విధంగా చార్జీలు వసూలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి సాధారణ రోజుల్లో రూ.750 వరకు ఉంటే ఇప్పుడు రూ.1,350కి పెంచారు. రాజమండ్రికి సాధారణంగా రూ.900 వరకు ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ట్రావెల్స్ రూ.1,800, మరికొన్ని రూ.2,090 వరకు వసూలు చేస్తున్నాయి. ఫ్లైట్ జర్నీకి సైతం డిమాండ్... పలు రూట్లలో ప్రయాణికుల డిమాండ్ పెరగడంతో విమాన చార్జీలు సైతంపెరిగాయి. ఈ నెల 13న హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు చార్జీ ఉండగా, తిరుపతికి రూ.4,600 వరకు ఉంది. ఇక రాజమండ్రికి రూ.11,339 వరకు చార్జీలున్నాయి. ఏ రోజుకు ఆ రోజు డిమాండ్ మేరకు చార్జీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతిరోజు సుమారు 40 వేల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుండగా, పండుగ రద్దీ దృష్ట్యా ఈ సంఖ్య మరో 5 వేలకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ ప్రజలు భారీగా స్వగ్రామాలకు వేళ్తుండడంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. రైళ్లలో చార్జీలు ‘ప్రత్యేక’ం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో సంక్రాంతి రద్దీ ప్రారంభమైంది. సాధారణ రోజుల్లో రాకపోకలు సాగించే సుమారు 120 రైళ్లతో పాటు సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లను ఏర్పాటు చేశారు. మార్చి వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలోనూ వందల్లో వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలపైన 30 శాతం అదనపు బాదుడుకు తెరలేపారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు థర్డ్ ఏసీ రూ.645. ప్రస్తుతం ఈ ప్రత్యేక చార్జీలు రూ.1,130 వరకు పెరిగాయి. అలాగే విశాఖకు స్లీపర్ రూ.395 ఉండగా ప్రత్యే రైళ్లలో రూ.500కు పెరిగింది. ఇలా అన్ని రూట్లలోనూ స్పెషల్ ట్రైన్స్‌లో చార్జీలు పెంచారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ సంస్థల ఆగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ట్రావెల్స్ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 9542800800 వాట్సాప్ నెంబరును ప్రకటించింది. ఈ నెంబరుకు గత వారం రోజుల వ్యవధిలో 1,702 ఫిర్యాదులు అందాయి. ఇందులో అధిక శాతం ఫిర్యాదులు టిక్కెట్లు రేట్లు పెంచి దోచుకుంటున్నారనే ఉన్నాయి. రవాణా శాఖ దాడులు చేస్తున్నా ప్రైవేటు ట్రావెల్స్ దందా మాత్రం ఆగడం లేదు. ప్రస్తుత సంక్రాంతి సీజన్లో బస్సు చార్జీలను రెండు మూడు రెట్లు పెంచేశాయి. పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటున్నాయి. చార్జీల వివరాలను ఆన్లైన్లో ఉంచి, టిక్కెట్లను విక్రయిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు గత నాలుగు రోజులుగా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 170 బస్సులను సీజ్ చేసి, 80 కేసులు నమోదు చేశారు. చార్జీలు విచ్చలవిడిగా పెంచేసి, ప్రయాణికులను దోచుకుంటున్న ట్రావెల్స్ సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులపై రూ.25 వేల చొప్పున జరిమానా విధించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కేసులు నమోదు చేసిన బస్సుల వివరాలు అన్ని చెక్‌పోస్టులకు పంపించాలని సూచించారు. కేసుల నమోదు విషయంలో ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు పండుగ పండుగ సీజన్లో టిక్కెట్ల ధరలు తగ్గిస్తామని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి తొలుత హామీనిచ్చారు. కానీ, ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. డిమాండ్ ఉన్న తేదీల్లో దోపిడీ మరింత అధికంగా ఉంది. జనవరి 11న ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో(రెగ్యులర్ సర్వీసు) హైదరాబాద్ నుంచి గుంటూరుకు రూ.530 వరకు ధర ఉంది. స్పెషల్ బస్సు అయితే రూ.795 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో రూ.1,130 నుంచి రూ.1,200 వరకు గుంజుతున్నారు. నాన్ ఏసీ ఆర్టీసీ బస్సుల్లో(రెగ్యులర్ సర్వీసు) రూ.383 కాగా, స్పెషల్ బస్సుల్లో రూ.609 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు నాన్ ఏసీ బస్సుల్లో టిక్కెట్ల ధరలు రూ.850 వరకు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు: 750 గత నాలుగు రోజుల్లో సీజ్ చేసిన బస్సులు: 170 నమోదు చేసిన కేసులు: 80 వారం వ్యవధిలో వాట్సాప్ నెంబరుకు అందిన ఫిర్యాదులు: 1,702 తనిఖీలు ఇక మరింత ముమ్మరం ‘‘బస్సు టిక్కెట్ల రిజర్వేషన్లు చేసే రెడ్ బస్, అభీ బస్ వెబ్సైట్ల నిర్వాహకులను పిలిపించి మాట్లాడాం. మోటారు వాహన చట్టం ప్రకారం ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులపైనే కాదు.. ఇలాంటి వెబ్‌సైట్లపైనా కేసులు నమోదు చేయొచ్చు. ఆపరేటర్లు ప్రకటించిన రేట్లనే ఆన్లైన్లో ఉంచి, టిక్కెట్లు విక్రయిస్తున్నామని వెబ్సైట్ల నిర్వాహకులు చెబుతున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే వెబ్సైట్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. ప్రైవేటు బస్సుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తాం’’ – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
పండగకు ప్రయాణమెలా!
వజ్రపుకొత్తూరు: సంక్రాంతి పండగ సమీపిస్తోంది. పల్లెల్లో కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేందుకు... డూడూ బసవన్నల నృత్యాలు.. గంగిరెద్దులోళ్ల సన్నాయి మేళాలు తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రానున్న సంక్రాంతి పండుగ సెలవుల్లో ప్రయాణ పాట్లు తప్పేలా లేవు. నెల రోజుల క్రితమే జనవరి నెలాఖరు వరకు రైల్వే రిజర్వేషన్లు పూర్తి కావడం, రిగ్రిట్‌గా చూపిస్తున్న రైల్వే రిజర్వేషన్‌తో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ అదనపు చార్జీల మోత మోగిస్తుండటంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నాయి. రైల్వే శాఖ ఆదీనంలోని ఐఆర్సీటీసీ రైళ్లలో సైతం ప్రత్యేక బాదుడు ఉండటంతో ప్రయాణికులకు సంక్రాంతి ప్రయాణం భారమైంది. అదనపు బోగీలకు శఠగోపం... సంక్రాంతి పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటి వరకు అదనపు బోగీల ఏర్పాటు యోచన నేటి వరకు చేయలేదు. దీంతో ప్రయాణికులు తమ ఆశలు వదులుకున్నారు. రెండేళ్ల కిందట ప్రత్యేక రైళ్లు నడిపి అదనంగా వసూళ్లు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రయాణికులు గుర్తు చేసకుంటూ... ప్రీమియం రైళ్లలో రోజు రోజుకూ టికెట్ ధరలు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరికదా ఆర్టీసీ బస్సుల్లో వెళ్దామంటే సంబంధిత అధికారులు రిజర్వేషన్ సైట్లను నిలిపివేస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నా అదనపు చార్జీల మోత తప్పడం లేదు. సాధారణ రోజుల్లో రైల్వే చార్జీల కంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువకాగా, పండగ రోజుల్లో డిమాండ్‌ను బట్టీ రెండు నుంచి మూడు రెట్లు వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ మరింద దారుణంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే 30 శాతం వరకు రేట్లను పెంచేసిన యాజమాన్యాలు సంక్రాంతి తర్వాత మరో వారం రోజులపాటు టికెట్ ధరపై రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఏటా ఇదే తరహాలో ప్రయాణికులను ప్రైవేటు, రైల్వే, ఆర్టీసీ యాజమాన్యాలు దోచేస్తున్నాయి. అయితే ఆర్టీసీ ఇటీవల చార్జీలు పెంచినందున అదనపు బాదుడుపై ఎలాంటి నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి సెలవులపై ఇంకా స్పష్టత రాకపోవడంతో రిజర్వేషన్‌పై వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ కావాలన్నా దొరక్కపోవడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా ఆరీ్టసీ, రైల్వే శాఖ అధికారులు దృష్టి సారించి రద్దీ మేరకు ట్రైన్, బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
బస్సులో రచ్చ, టీడీపీ నేతబంధువు వీరంగం
సాక్షి, ముద్దనూరు: టీడీపీ ప్రజాప్రతినిధి బంధువు ఒకరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రచ్చ రచ్చ చేసిన వైనమిది. బస్సెక్కి మెట్లపై నిలబడిన తనను లోపలికి రమ్మని పిలిచినందుకు ఆగ్రహించి.. సిబ్బందితో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక తన బంధువులను రప్పించి బస్సు డ్రైవర్‌ను తమ వాహనంలో బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. తప్పించుకున్న డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. ఎమ్మెల్సీ బీటెక్ రవికి చెందిన సమీప బంధువు చంద్రశేఖరరెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి పులివెందులకొస్తున్న ఓవీఆర్ ట్రావెల్స్ బస్సు ఎక్కి మెట్లపై నిలబడ్డాడు. సడన్ బ్రేక్ వేసినప్పుడు ప్రమాదం జరిగే వీలుందంటూ క్లీనర్ ఆయన్ను లోపలికి రమ్మని పిలిచాడు. దీంతో ఆగ్రహించిన సదరు ఎమ్మెల్సీ బంధువు క్లీనర్‌పై పరుషపదజాలంతో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో తీవ్రంగా భయపడిన క్లీనర్ బస్సు కర్నూలుకు రాగానే దిగి వెళ్లిపోయాడు. ఈలోగా చంద్రశేఖరరెడ్డి సమాచారమివ్వడంతో అతని బంధువులు స్కార్పియో వాహనంలో వచ్చి.. బస్సు ముద్దనూరు సమీపంలోకి రాగానే అడ్డుకున్నారు. స్కార్పియోలో ఉన్న సునీల్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రఫీలతోపాటు చంద్రశేఖరరెడ్డిలు బస్ డ్రైవర్ శ్రీనివాసులును బలవంతంగా దించేసి.. వాహనంలో తమ వెంట తీసుకుపోయారు. వాహనం సింహాద్రిపురం సమీపంలోకి రాగానే శ్రీనివాసులు కేకలేయడంతో అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే డ్రైవర్ ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు చంద్రశేఖరరెడ్డితోపాటు సునీల్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రఫీలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
దసరా ఎఫెక్ట్.. విమానాలకూ పెరుగుతున్న గిరాకీ
సాక్షి, విశాఖపట్నం: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ నగరం పల్లెకు పరుగులెడుతోంది. సంక్రాంతి తర్వాత తెలుగు ప్రజలు అత్యంత ప్రాధాన్యమిచ్చే దసరా పండగ సందర్భంగా సొంతూళ్లలో సరదాగా గడిపేందుకు పయనమవుతున్నారు. విశాఖకు వచ్చే వారి కంటే నగరం నుంచి గ్రామాలకు వెళ్లేవారే అధికంగా ఉండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. నగరానికి ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం వచ్చి నివాసముంటున్నారు. పండగ సెలవులు రావడంతో పిల్లాపాపలతో సొంతూళ్లకు వారంతా పయనమవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నగరం నుంచి బయలుదేరి వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేసినా... దసరా సందర్భంగా రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. దసరా సెలవులకు నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ బస్సులకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గత సంవత్పరంలో ఉన్న పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. విశాఖ రీజియన్ నుంచి రెగ్యులర్‌గా తిరిగే వాటితోపాటు అదనంగా 200కి పైగా బస్సులతో విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమలాపురం, నర్సాపురం, భీమవరం తదితర దూరప్రాంత బస్సులతోపాటు విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్ఛాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటితోపాటు ఇరుగు పొరుగు ప్రాంతాలైన నరసన్నపేట, టెక్కలి, పలాస తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతోంది. ఇదే మాదిరిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. దసరాకు ముందు వారం రోజుల నుంచి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు 20కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఓ వైపు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉండటంతో రైళ్లు, బస్సులు ఖాళీ ఉండటం లేదు. ముఖ్యంగా రైళ్లలోని జనరల్ బోగీల్లో అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి ఉండటంతో జరిమానాలు కట్టి మరీ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణాలు చేస్తున్నారంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్లీపర్ క్లాస్‌లు కూడా కాలు పెట్టలేనంతగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. విమానాలకూ పెరుగుతున్న గిరాకీ మరోవైపు కొంతమంది విమానాల్లో కూడా పయనమవుతున్నారు. ముఖ్యంగా హైదరా బాద్, విజయవాడ నుంచి విశాఖ వచ్చే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. దసరా కావడంతో వివిధ విమాన సర్వీసులు టికెట్ ధరని రెట్టింపు చేసేశాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చేందుకు సాధారణ రోజుల్లో రూ.2,496 వరకూ టికెట్ ధర ఉండగా ప్రస్తుతం రూ. 4,921, 5,885, రూ.6,911 వరకూ ధర చెల్లించాల్సిందే. అదేవిధంగా విజయవాడ నుంచి విశాఖపట్నం విమానంలో రావాలంటే రూ. 3,996 వరకూ చెల్లించాల్సిందే. అయితే బస్సు లకు రూ.3 వేల వరకూ చెల్లించి గంటల తరబడి ప్రయాణం చేసేబదులు మరికొంత డబ్బు చెల్లించి తక్కువ ప్రయాణ సమయంలో ఇళ్లకు చేరుకోవచ్చని చాలా మంది విమానాల్ని ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా పండగ సం దడంతా ప్రయాణాల్లో కనిపిస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండు రెట్లు ప్రైవేట్ బాదుడు ఇదిలా ఉండగా ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి. ఎలాగైనా దసరా పండగను ఊరిలో చేసుకోవాలనే ప్రజ ల తాపత్రాయాన్ని, సెంటిమెంట్‌ను ప్రైవేటు బస్సుల నిర్వాహకులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఆర్టీసీ, రైల్వే చేసిన ఏ ర్పాట్లు డిమాండ్‌కు సరిపడా లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వా రి నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నా రు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు రూ. 700 నుంచి రూ.900 వరకూ ఏసీ సర్వీసులకు టికెట్ వసూలుచేసిన ప్రైవేటుబస్సులు.. దస రా రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖనుంచి హై దరాబాద్‌కు ఏకంగా రూ.1800, రూ. 2,678, రూ.3000వరకూ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడకు రూ.1800, రూ.2,550, రూ.2,670వరకూ ఛార్జీలు బాదుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలుసైతం రెట్టింపు భా రాన్నిమోస్తూ ఉసూరంటూ ఊళ్లకు వెళ్తున్నారు. -
అధిక ధరలకు టికెట్లమ్మితే భారీ జరిమానా
సాక్షి, అమరావతి: దసరా పండగ దృష్ట్యా ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకునే ప్రైవేట్ ట్రావెల్స్‌కు ముకుతాడు వేసేందుకు రవాణా శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రవాణశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ల రేటు పెంచినా.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. పండగ వేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ గతంలోనూ అధికంగా రేట్లు పెంచి ప్రయాణికుల నుంచి భారీగా దండుకున్నాయి. టీఎస్‌ఆరీ్టసీ సమ్మె దృష్ట్యా హైదరాబాద్, తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులను ట్రావెల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పెడతారనే సమాచారంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. టికెట్ల ధర ఎంత వసూలు చేస్తే..అంతకు రశీదులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండగ సీజన్లో పది రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నిరంతర తనిఖీలతో అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలందాయి. ఎక్కడైనా ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ల ధర భారీగా వసూలు, ఒకే పరి్మట్‌తో రెండు వైపులా బస్సుల్ని తిప్పితే.. ఒకసారికి రూ.25 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే మొదటి జరిమానాకు ఐదు రెట్లు అధికంగా జరిమానా విధించేలా ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలందాయి. వాట్సాప్ నంబరుకు ఫిర్యాదులు.. ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలుకు, నిబంధనల ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వాలంటే వాట్సాప్ నంబరు 9542800800కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు. -
కర్నూలులో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
సాక్షి, కర్నూలు : జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగమర్రి మద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది. దాదాపు కోటికి పైగా నష్టం జరిగినట్టుగా సమాచారం. బస్సు వెనుక భాగం నుంచి మంటలు మొదలైనట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
పర్మిట్ రద్దు.. బస్సు సీజ్
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు శుక్రవారం రవాణ శాఖ కార్యాలయంలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ట్రావేల్స్ యజమానులు ఈ ఆదేశాలను బేఖాతరు చేసి ఆలస్యంగా సదస్సుకు హాజరయ్యారు. దాంతో డీటీసీ వచ్చినప్పటికి కూడా ట్రావెల్స్ యజమానులు రాకపోయేసరికి సదస్సు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీరా ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నిబంధనలు తూచా తప్పక పాటించాలన్నారు. బస్సు ప్రారంభానికి ముందే డ్రైవర్‌కి బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేయాలని తెలిపారు. మద్యం సేవించి బస్సు నడిపితే జైలు, జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. స్పీడ్ లాక్‌ను ఎవరైనా ట్యాపర్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తే పర్మిట్ రద్దు చేసి.. బస్సు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సదస్సుకు హాజరుకానీ యాజమాన్యాలకు నోటీసులు పంపిస్తామని తెలిపారు. -
మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం
సాక్షి, గన్నవరం : నిన్న కంచికచర్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పట్టుబడిన ఘటన మరకవ ముందే... ప్రయివేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తప్పతాగి బస్సులు నడుపుతూ ప్రయాణికుల జీవితాలతో ఆటలాడుతున్నారంటూ పోలీసులు తనిఖీలు ముమ్మురం చేసినా డ్రైవర్లకు ఏమాత్రం పట్టడం లేదు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా పొట్టిపాడు టోల్గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వరుణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాగి వాహనం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు నుంచి విశాఖ వెళుతున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్న యాజమన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు బస్సుకి వేరే డ్రైవర్‌ను ఇచ్చి పంపించేశారు. -
వాళ్లు తాగితే.. బస్సులు తూలుతున్నాయ్
సాక్షి, అమరావతి బ్యూరో : ‘ఆ.. అవునండీ.. మధ్యాహ్నం తాగా. అదీ 90 ఎంఎల్.. తప్పేంటి. నేనేమీ నైటు పూట తాగలేదుగా. ఏనాడూ పొరపాటు జరగలేదు. నా ఖర్మ కాలి ఈరోజు దొరికాను. బస్సు యాజమాన్యం నన్నేమీ చెక్ చేయలేదు. ఎవరైనా తాగిన డ్రైవర్లకు బస్సులు ఇచ్చి పంపుతారా? వారి వ్యాపారాన్ని నష్టపరుచుకుంటారా?’ కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు, రవాణా శాఖ అధికారులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాక అధికారుల వద్ద శ్రీ వెంకట పద్మావతి ట్రావెల్స్ డ్రైవర్ చెప్పిన సమాధానం. ప్రయాణికులను ఎంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత గల ఓ డ్రైవర్ తాగి బస్సు నడపటమే కాకుండా.. అధికారుల ఎదుట నిర్లక్ష్యంగా చెప్పిన సమాధానాన్ని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ తీరు ఏమిటో తెలుస్తోంది. జిల్లాలోని కంచికచర్లలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో వివిధ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం తాగి పట్టుబడటం కలవరం కలిగించింది. అవనిగడ్డ నుంచి హైదరాబాద్ బయలుదేరిన శ్రీ వెంకట పద్మావతి ట్రావెల్స్ డ్రైవర్, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌తోపాటు క్లీనర్ కూడా మద్యం మత్తులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో జగ్గయ్యపేట నుంచి కంచికచర్ల వరకు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. రెండు ట్రావెల్ సంస్థల డ్రైవర్లు మద్యం తాగి ఒకేసారి పట్టుబడటంతో పోలీసులతో పాటు ప్రయాణికులు సైతం ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్రావెల్స్ యాజమానులు, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్సులను నడిపే డ్రైవర్ల ఫిట్నెస్పైనా, బస్సులు నడిపే సమయంలో వారెలా ఉంటున్నారనే దానిపైనా కనీస దృష్టి పెట్టడం లేదు. యాజమాన్యానిదే బాధ్యత ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం తాగి బస్సులను నడిపితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తాగి నడుపుతున్న డ్రైవర్లపైనా కఠినంగా వ్యవహరిస్తాం. కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. శుక్రవారం కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు యజమానులు, డ్రైవర్లతో విజయవాడలోని డీటీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నాం. యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం. – మీరా ప్రసాద్, డీటీసీ, కృష్ణాజిల్లా సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు -
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు
-
బస్ టికెట్స్ చాలా కాస్ట్లీ గురూ..
-
ఏపీకి బస్ టికెట్స్ చాలా కాస్ట్లీ గురూ..
సాక్షి, హైదరబాద్: సార్వత్రిక ఎన్నికల దృశ్య సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యా ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు మంగళ, బుధ వారాల్లో ఫుల్ అయిపోయాయి. రైళ్లలో కూడా రద్దీ పెరిగింది. సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులు.. ఎంజీబీఎస్‌లో పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ రెచ్చిపోతున్నారు. టికెట్ల ధరలు మూడింతలు, నాలుగింతలు చేసేశారు. దీంతో ఓటు వేయాలని బయలుదేరిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా విజయవాడ రూట్లో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఛార్జీలు భారీగా పెంచారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా చాలా రూట్లలో నాన్ ఏసీ బస్సులలో సీట్లు నిండిపోయాయి. ఏసీ సర్వీస్‌లో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ టికెటు రెట్లు భారీగా ఉన్నాయి. మరోవైపు విమాన ధరలు కూడా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ సర్వీస్ టికెట్ల రెట్లు గమనించినట్లయితే.. విశాఖ- రూ.3,200 విజయవాడ- రూ. 2,500 కాకినాడ- రూ. 2,000 గుంటూరు- రూ. 2,200 నెల్లూరు- రూ. 3,000 నుంచి 3,500 తిరుపతి- 2,200 కడప- 1,900 -
తిరుగు ప్రయాణం కొండంత భారం
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: సంక్రాంతి కోసం స్వస్థలాలకు వచ్చినవారి తిరుగు ప్రయాణం కొండంత భారం కానుంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్, ఆర్టీసీ పోటాపోటీ పడుతున్నాయి. సాధారణ రోజుల్లో టిక్కెట్ల ధరల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తుండగా.. ఆర్టీసీ కూడా వ్యాపార ధోరణి ప్రదర్శిస్తోంది. రెగ్యులర్ బస్సులతో పాటు మూడు వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రిజర్వేషన్లకు ఫ్లెక్సీ ఫేర్ విధానం(విమాన చార్జీల్లాగా పరిస్థితిని బట్టి రేట్లు అమలు చేయడం) ప్రవేశపెట్టింది. రెగ్యులర్ చార్జీల కంటే 150 శాతం అధికంగా వసూలు చేస్తోంది. సిటీ మెట్రో కూడా ప్రత్యేక బస్సే..! సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని జిల్లాలకు 20 లక్షల మంది వచ్చారని అంచనా. వీరి తిరుగు ప్రయాణం కోసం అన్ని జిల్లాల నుంచి 1,100 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రతిరోజూ హైదరాబాద్‌కు అన్ని జిల్లాల నుంచి 150 వరకు సర్వీసులు నడుపుతున్నారు. వీటితో పాటు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌కు 1,100 బస్సులు తిప్పుతున్నట్లు ప్రకటించారు. ఫ్లెక్సీ ఫేర్ అమలు చేయడం ద్వారా ప్రయాణికులను బాదేస్తున్న ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల పేరిట సిటీల్లో తిరిగే మెట్రో, సాధారణ బస్సుల్ని అందుబాటులో ఉంచింది. దీంతో ప్రయాణికులు గంటలకొద్దీ ఆ సీట్లలో నానా ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్ సమయంలో ఏ బస్సు నడుపుతున్నారో కూడా సమాచారమివ్వకుండా వ్యాపార ధోరణి అవలంభిస్తోందంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు రెగ్యులర్ సర్వీసులు కూడా సరైన సమయంలో తిప్పకుండా ప్రత్యేక బస్సుల్నే ఆర్టీసీ నడపడం గమనార్హం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు 3571 అమరావతి సర్వీస్ మధ్యాహ్నం 1.30కు బయల్దేరాల్సి ఉండగా.. ప్రత్యేక బస్సుకు ప్లాట్‌ఫాం కేటాయించి, ఈ బస్సును గంట పాటు పక్కన పెట్టారు. ఇక సంక్రాంతి హడావుడి ఎక్కువగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలోని 8 డిపోల నుంచి రోజూ 28 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ నేపథ్యంలో మరో 57 ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం వీటిలో చాలా వరకు సీట్లు మిగిలిపోయాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ పేర్కొన్నారు. ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి ప్రధాన నగరాలకు అదనంగా 50 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకం పేరిట సిటీ మెట్రో బస్సులు పెట్టడంపై పలువురు ప్రయాణికులు మండిపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు ఎక్కువ ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో వీటిలోనే వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. మా కష్టాలు పట్టవా? కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో సంక్రాంతి జరుపుకుందామని వస్తే.. ఇలా బాదేస్తున్నారని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి మా కష్టాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి ప్రభుత్వం తగిన చేయూతనిస్తే.. తమకు ఈ బాధలుండేవి కాదన్నాడు. 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయకుండా.. అదనపు బస్సులు మరిన్ని ఏర్పాటు చేస్తే తమకు వెతలుండేవి కాదని మరో ప్రయాణికుడు వాపోయాడు. పోలవరం సందర్శన, సీఎం సభలకైతే ఇష్టారీతిన బస్సులు పెడతారని.. సామాన్యులను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదేశాలిచ్చినా టోల్ ట్యాక్స్ వసూలు.. పండుగ సందర్భంగా 3 రోజుల పాటు వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయబోమని ప్రభుత్వమిచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదు. కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటిలానే టోల్‌ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు మండిపడుతున్నారు. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద ట్యాక్స్ వసూలు చేయడం లేదని.. రాష్ట్రంలో మాత్రం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. కాగా, ఈ విషయంపై ప్లాజా సీవోఎం హరిపాండు రంగస్వామిని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు పాటిస్తున్నామన్నారు. -
అక్రమాల రూటు వదలని ప్రైవేటు ట్రావెల్స్
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల తీరు మారడం లేదు. ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. అడ్డుకోండి.. చూద్దాం అనే రీతిలో ట్రావెల్స్ నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. వారాంతాల్లోనూ, పండుగల సీజన్లలో టిక్కెట్ల ధరలు అమాంతం పెంచేసి ప్రయాణికుల నుంచి భారీగా దోచుకుంటున్నారు. పండుగలప్పుడు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. అదనపు బెర్తులు, సీట్లు ఏర్పాటు చేసి మరీ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఒకే పర్మిట్‌తో రెండు బస్సుల్ని తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొంది స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ఆర్టీసీకి ఏటా రూ.2400 కోట్లు నష్టం చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన రవాణా అధికారులు షరా‘మామూలు’గానే మిన్నకుండిపోతున్నారు. సాక్షి, అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అదనపు సీట్లు/బెర్తుల ఏర్పాటుతో బస్సుల పొడవు పెంచి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మోటారు వాహనాల చట్టంలో రూల్ 351ఎ ప్రకారం.. స్లీపర్ బస్సుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం.. బస్సులో 36 సీట్లు, 32 బెర్తులు ఉండాలి. కానీ అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు నిబంధనలకు విరుద్ధంగా అదనపు సీట్లు, బెర్తులతో తెలుగు రాష్ట్రాల్లో తిరిగాయి. దీంతో ఆ రాష్ట్రాలు 2017 జూన్‌లో రిజిస్ట్రేషన్లు నిలిపివేశాయి. ఆ తర్వాత ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా ఆ బస్సుల్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఏపీలో మళ్లీ బస్సుల్ని రవాణా శాఖ అనుమతించింది. సీట్లు, బెర్తులు తగ్గించి మోటారు వాహనాల చట్టంలో ఏఐఎస్–119 నిబంధనను అనుసరించి తిప్పాలని ట్రావెల్స్ నిర్వాహకులకు అధికారులు సూచించారు. అప్పట్లో అధికారుల ఆదేశాల మేరకు సీట్లు, బెర్తులు తగ్గించిన ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పుడు సంక్రాంతి సీజన్ డిమాండ్ దృష్ట్యా అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన రవాణా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప తర్వాత షరా‘మామూలు’గానే వదిలేస్తున్నారు. అదనపు బెర్తులతో దందా.. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో ఇతర రాష్ట్రాల బస్సులను తిరగనిచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే రవాణా శాఖ ఎన్వోసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) కలిగి ఉండటంతోపాటు ఏఐఎస్ –119 ప్రకారం.. బెర్తుల సంఖ్య తగ్గించాలని స్పష్టం చేసింది. ఆలిండియా పర్మిట్లు పొంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బస్సుల్లో స్లీపర్ బెర్తులు 36 వరకు ఉన్నాయి. ఇలా ఉండటం మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలకు విరుద్ధం. ఈ బస్సులు ఏపీలో తిరగాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్స్ ప్రకారం.. బెర్తులను 30కి తగ్గించి తిప్పాల్సిందే. తనిఖీలకు మంగళం! కేంద్ర మోటారు వాహనాల చట్టం 125 సి (4) ప్రకారం.. ప్రభుత్వ రవాణా సంస్థలు, రాష్ట్ర, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు ట్రావెల్స్ మాత్రమే బెర్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో ఏఐఎస్–119 నిబంధనలున్న బెర్తుల బస్సులు కేవలం రెండు మాత్రమే ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు బెర్తులను 36 నుంచి 30కి తగ్గిస్తేనే వాటి నుంచి త్రైమాసిక పన్ను వసూలు చేయాలి. కానీ రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లతో రవాణా శాఖ తనిఖీలకు మంగళం పాడింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యథేచ్ఛగా ఆన్లైన్లో రిజర్వేషన్లు చేస్తూ ఆక్యుపెన్సీ పెంచుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బెర్తుల బస్సులు రాష్ట్రంలో 655 ఉన్నాయి. రవాణా అధికారులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ బస్సులు నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాయా అనే అంశంలో లేకపోవడం గమనార్హం. హైదరాబాద్ రూటే టార్గెట్ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రధానంగా హైదరాబాద్ రూట్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఈ రూట్లోనే అధికంగా బస్సులు నడిపి.. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొంది.. స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ రోజూ 70 వేల మంది ప్రయాణికుల్ని చేరవేస్తున్నారు. సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఏసీ సర్వీసుకు రూ.550గా ఉన్న టిక్కెట్టు ధరను పండుగలు, రద్దీ సమయాల్లో రూ.990కు పెంచి వసూలు చేస్తున్నారు. స్లీపర్ సర్వీసుల్లో సాధారణ రోజుల్లో రూ.850–రూ.1000గా ఉన్న టిక్కెట్టు ధరను ఈ సీజన్లో రూ.1,200 – రూ.1,850కు పెంచి వసూలు చేయడం గమనార్హం. హైదరాబాద్ – విశాఖపట్నం రూట్లోనూ సాధారణ రోజుల్లో స్లీపర్ సర్వీసుల్లో రూ.1,500– రూ.1,700 ఉండే టిక్కెట్ ధరను పండుగల సీజన్లో ఏకంగా రూ.2,500 – రూ.2,700కు వరకు పెంచి వసూలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో.. ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ల గుర్తింపునకు, వారి సంక్షేమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఖచ్చితంగా చేపట్టాల్సిందేనని హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే డ్రైవర్ల రిజిస్ట్రేషన్ విషయంలో కార్మిక శాఖ, రవాణా శాఖలు తమ బాధ్యత కాదంటే తమది కాదని కొన్నాళ్లపాటు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ విషయం మీద హైకోర్టు సీరియస్‌గా స్పందించడంతో రవాణా శాఖ డ్రైవర్ల సంక్షేమ చట్టం అమలు బాధ్యత తీసుకుంది. సరుకులు తరలించకూడదనే నిబంధన ఉన్నా.. ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల మాటున యథేచ్ఛగా సరుకు తరలిస్తున్నాయి. చెన్నై, బెంగళూరుల నుంచి జోరుగా జీరో వ్యాపారం నిర్వహించేవారికి ఊతమిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులు పొంది స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఆర్టీసీకి ఏటా రూ.2,400 కోట్లు నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఆర్టీసీ ఆక్యుపెన్సీని దెబ్బకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ కార్గో వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రైవేటు బస్సుల్లో వెండి, ఫర్నీచర్ సామగ్రి పెద్ద ఎత్తున మళ్లిపోతోంది. బిల్లులు లేకుండా సామగ్రిని తరలిస్తున్నా రవాణా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ప్రైవేటు బస్సుల్లో బాణాసంచా తరలించడంతో అగ్నిప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో సరుకులు తరలించకూడదనే నిబంధన ఉన్నా.. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా పెడచెవిన పెట్టి ఆయా నగరాల్లో సరుకులను తరలించేందుకు ఏకంగా బుకింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఇష్టారాజ్యంగా టిక్కెట్ ధరలు పెంపు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఇష్టారాజ్యంగా టిక్కెట్ ధరలను పెంచి ప్రయాణికుల అవసరాలను భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సీజన్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీ చేస్తే అంతిమంగా ప్రయాణికులే ఇబ్బందులు పడతారని రవాణా అధికారులు చెబుతున్నారంటే.. వీరి దోపిడీకి ఏ విధంగా సహకరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. టిక్కెట్ల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని రవాణా అధికారులు చేతులెత్తేయడంతో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు తమకు అడ్డే లేదన్న రీతిలో ప్రయాణికుల్ని దోచుకుంటున్నారు. ఏటా ఈ దందా సాగుతూనే ఉందే తప్ప ట్రావెల్స్ కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సాధారణంగా పండుగ సీజన్ల ముందు ఆయా జిల్లాల్లో రవాణా శాఖ అధికారులు ముందుగా ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని వారి వారి ప్రాంతాలకు చేరవేయడంలో సహకరించాలని, టిక్కెట్ల ధరలు పెంచి ప్రయాణికుల్ని దోచుకోవద్దని హెచ్చరికలు చేయాలి. అంతేకాకుండా టిక్కెట్ల ధరల నియంత్రణపై ట్రావెల్స్ నిర్వాహకుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి ఏ జిల్లాలోనూ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులు: 750 వీటిలో 2 ప్లస్ వన్ బెర్తులున్న బస్సులు: 600 రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సుల సంఖ్య: 491 ఈ బస్సుల్లో రోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య: 70 వేలు రాష్ట్ర పరిధిలో స్లీపర్ బస్సుల సంఖ్య: 50 ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల ఆగడాలకు అద్దంపట్టే కొన్ని సంఘటనలు తిరుపతికి చెందిన ఎస్.లక్ష్మీపవన్ సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌లో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. బస్సు టికెట్ బుక్ చేసుకోవడం కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా సెమీ స్లీపర్ ఏసీ బస్సుకు రూ.1900 చెల్లించాలని చెప్పడంతో బిత్తరపోయాడు. అంతకుముందు పలుమార్లు రూ.1000తోనే హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన ఆయనకు ఈసారి ట్రావెల్స్ నిర్వాహకులు రూ.900 ఎక్కువ చెప్పడంతో చేసేదేమీ లేక వారు అడిగినంతా చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి.ప్రమోద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు ఊరికి రావడానికి టికెట్ కోసం ప్రయత్నించగా ఆర్టీసీ, రైల్వే టికెట్లు అప్పటికే అయిపోయాయి. దీంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా వారు సాధారణ సూపర్ లగర్జీ బస్సుకు రూ.1000 ఇమ్మనడంతో కంగుతిన్నాడు. విడిరోజుల్లో హైదరాబాద్ నుంచి తెనాలికి రూ.450 తీసుకునేవారని, ఇప్పుడు రెట్టింపు వసూలు చేస్తున్నారని ప్రమోద్ వాపోతున్నాడు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బి.సురేశ్ హైదరాబాద్‌లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాడు. సంక్రాంతి పండుగకు తన ఊరికి రావడం కోసం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా వారు సాధారణ లగ్జరీ బస్సుకు రూ.1700 చెల్లించాలని చెప్పడంతో విస్తుపోయాడు. హైదరాబాద్ నుంచి అనకాపల్లికి రూ.700 నుంచి రూ.800 మాత్రమే ఛార్జీ అని చెప్పగా ‘ఇష్టముంటే ఎక్కు.. లేదంటే మానుకో’ అని ట్రావెల్స్ నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. -
సిటీకి చక్రాలు కావాలి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలవుతోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు దాదాపుగా 30 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్తారని అంచనా. తెలంగాణ నుంచి సంక్రాంతి, దసరా సమయాల్లో రద్దీ అధి కంగా ఉంటుంది. అందులోనూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలు సంక్రాంతికి తప్పకుండా స్వగ్రామాలకు వెళ్తారు. నగరం విస్తరిస్తోన్న దరిమిలా వీరి సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లడం ఓ ప్రహసనంగా మారింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా సంస్థలే కీలకం. అయితే.. పండుగల సమయంలో ఉండే రద్దీని నియంత్రిం చడం సాధ్యంకాకపోవడంతో.. ఈ వ్యవస్థలు అదనపు చార్జీల రూపంలో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇది సామాన్యుడిని ఆవేదనకు గురిచేస్తోంది. రైలు, బస్సుల టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పండుగపూట సొంతూరికి వెళ్లే భాగ్యం తమకు లేదా? అని వాపోతున్నాడు. ‘పంచాయతీ’ నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఊరికి రావాలంటూ పిలుపులు వస్తున్నందున.. ఈసారి తెలంగాణ పల్లెలకూ ప్రయాణికులు పోటెత్తుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో సహజంగానే రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొన్నటి దసరా సమయంలోనూ తెలంగాణ జిల్లాలకు ప్రజలు పోటెత్తారు. 50% అదనపు చార్జీలు చెల్లించి బస్సుల్లో వేలాడుతూ మరీ వెళ్లారు. ఒక్క నగరం నుంచే దాదాపుగా 10 లక్షల మందికిపైగా తెలంగాణ ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో సంక్రాంతి ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు సంక్రాంతికి తప్పకుండా వెళతారు. ఇలాంటి వెళ్లే వారి సంఖ్య దాదాపు 20 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. దీంతో ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు, రైళ్లపై అపుడే చర్చ మొదలైంది. ముందస్తుగా రైళ్లల్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి అదనపు ఛార్జీలు గండం తప్పినా.. అలాంటివారు చాలా తక్కువ. ఏపీ నుంచి వచ్చి నగరంలో స్ధిరపడిన వారిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి ముందస్తుగా సెలవులు వచ్చే అవకాశం తక్కువ. ఇలాంటి వారంతా జనవరి 7 తర్వాత ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. కాగా ఎప్పటిలాగే.. రైల్వే, ఆర్టీసీలు టికెట్లపై అదనపు ఛార్జీల పేరిట బాదుడుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే అదనపుగా ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.300 ఉండే టికెట్ ఛార్జీని రూ.3000 వరకు పెంచేస్తున్నాయి. వీరి చార్జీల పెంపునకు ఒక విధానమంటూ లేకపోవడంతో ఒకే గమ్యస్థానానికి రకరకాల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో నలుగురు సభ్యులున్న కుటుంబ ప్రయాణమంటే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రజారవాణానే కీలకం జనవరి మొదటివారం నుంచే సంక్రాంతి రద్దీ మొదలవుతుంది. ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ 2వ తేదీన ప్రకటించనుంది. దాదాపు 4,500 బస్సులను తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు నడపొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జనవరి 7 నుంచే రద్దీ ఊపందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ కూడా హైదరాబాద్‌కు 1000 బస్సుల వరకు నడపనుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల ద్వారా దాదాపుగా 20 లక్షలకు పైగా ప్రయాణం చేస్తారని అంచనా. సాధారణంగా తెలంగాణ, ఆంధ్రకు కలిపి రోజుకు 40 రైళ్లలో రాకపోకలు జరుగుతాయి. వీటిలో రోజుకు 56వేల మంది ప్రయాణిస్తారు. పండగ వేళ రోజుకు 3 ప్రత్యేక రైళ్లు తోడవడంతో ఈ సంఖ్య 60 వేలు దాట నుంది. 7వ తేదీ నుంచి 13 వరకు దాదాపు 4.5 లక్షల మంది రైళ్ల ద్వారా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు దందా.. ఇవి కాకుండా తెలంగాణ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో దాదాపు 7,800కు పైగా వివిధ కంపెనీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో ఛార్జీల గురించి తెలుసుకుంటేనే భయమేస్తోంది. సాధారణ రోజుల్లో రూ.300–500 రూపాయలుండే టికెట్‌ను తత్కాల్, ఇతర ఛార్జీల రూపంలో రూ.2,500 నుంచి 3,000 వరకు పెంచేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏకంగా ఒక్కో టికెట్‌కు రూ.4000కుపైగా వసూలు చేస్తున్నాయి. వీటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ట్రావెన్స్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రైవేటు ఆపరేట్ల బస్సుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు సొంతూళ్లకు వెళ్లనున్నారు. ఇక సొంత వాహనాల ద్వారా రెండు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లేవారు 1–2 లక్షల మంది ఉంటారని అంచనా. ఏ మార్గాల ద్వారా ఎంతమంది? రెండు ఆర్టీసీలు: 20 లక్షల మందికిపైగా రైలు మార్గాలు: సుమారు 5 లక్షలు ప్రైవేటు బస్సులు: దాదాపుగా 5లక్షల మంది సొంత, ఇతర వాహనాలు: సుమారుగా 2 లక్షలు మొత్తం : దాదాపు 30–35 లక్షలకుపైగా ప్రయాణం చేయనున్నారు. రైలు ఛార్జీలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు.. రైలు చార్జీల పెంపు వ్యవహారం కేంద్రమంత్రి వరకూ వెళ్లినట్లు సమాచారం. నగరానికి చెందిన జాతీయపార్టీ నేతలు అధిక ఛార్జీలపై పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు దీనిపై మంత్రికి నివేదిక కూడా ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం 9 ప్రత్యేక రైళ్లే వేసామని, పూర్తిస్థాయిలో రైళ్లు వేయలేదని, త్వరలోనే మరిన్ని రైళ్లు వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సంక్రాంతి సీజన్లో ఈ రైళ్లన్ని తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయని అందుకే ఎక్కువ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామని గోయల్‌కు వివరించారు. త్వరలోనే జనసాధారణ్ రైళ్లు సామాన్యుల కోసం త్వరలోనే జనసాధారణ్ పేరుతో రైళ్లను వేయనున్నట్లు తెలిపారు. 14–15 జనరల్ బోగీలతో ఉండే ఈ రైళ్లలో సాధారణ చార్జీలే ఉండనున్నాయని సమాచారం. -
అదుపు తప్పిన బస్సు..!
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా: సామర్లకోట పిఠాపురం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌బస్సు అదుపు తప్పి విద్యుత్ స్థంభాన్ని డీకొట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దీంతో దగ్గర్లోని పంట కాలువలోకి బస్సు దూసుకుపోయింది. శబరిమల నుంచి తిరుగువస్తున్న ఈ బస్సులో దాదాపు 40మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఉన్న అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వారి సొంత గ్రామం ప్రత్తిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
పల్లెకు తరలిన పట్నం!
సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో ఓట్ల పండుగకు పట్నంవాసులు భారీగా తరలివెళ్లారు. నగరం, జిల్లా కేంద్రాలు, ఆయా పట్టణాల నుంచి భారీగా వాహనాలు రోడ్డు మీదకు రావడంతో రద్దీ నెలకొంది. తెలంగాణలోని అన్ని టోల్గేట్ల వద్ద వాహనాలు భారీగా బారులుతీరాయి. వరుస సెలవులు కావడంతో కొందరు ముందే వెళ్లినప్పటికీ, శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున బయల్దేరారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్‌తోపాటు సొంతవాహనాలు కూడా రోడ్డు మీదకు వచ్చాయి. స్పందించిన ఈసీ.. నిజామాబాద్, బెంగళూరు, విజయవాడ, వరంగల్ వెళ్లే జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో మొత్తం 13 టోల్గేట్లు ఉన్నాయి. కరీంనగర్ రాజీవ్ రహదారిపై 3, నార్కట్‌పల్లి– గుంటూరు మధ్యలో మరో 2 టోల్గేట్లు ఉన్నాయి. వరుస సెలవులు రావడంతో నగరం నుంచి జిల్లాలకు వాహనాలు పోటెత్తాయి. ఉదయం 9 నుంచి 11 గంటలకల్లా టోల్గేట్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. విషయం ఎన్నికల సంఘానికి చేరడంతో సీఈవో రజత్‌కుమార్ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. వెంటనే జోషి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన ఎన్హెచ్ఏఐ అధికారులు టోల్గేట్ల వద్ద రద్దీని నియంత్రించారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చేశారు. ఆర్టీసీలో ఎడతెగని రద్దీ.. ప్రజలు ఓట్లేసేందుకు భారీగా సొంతూళ్లకు కదలడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ బస్టాండ్లు కిటకిటలాడాయి. గురువారం అర్ధరాత్రి మొదలైన రద్దీ శుక్రవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగడం గమనార్హం. గురువారంరాత్రి ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వైపు అధికంగా ప్రజలు తరలివెళ్లారు. దీంతో జేబీఎస్ రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజామున బస్సులులేవని కొందరు ఆందోళనకు దిగారు. శుక్రవారం మాత్రం వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండకు అధికంగా ప్రయాణించినట్లు తెలిపారు. వెంటనే అధికారులు బస్సులు వేయడంతో ప్రయాణికులు శాంతించారు. పోలింగ్ సమయాల్లో ఈ స్థాయిలో ప్రజలు ప్రయాణాలు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని అధికారులు వ్యాఖ్యానించారు. గురు, శుక్రవారాల్లో ప్రత్యేకంగా 1,200 బస్సులు నడిపామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘానికి దాదాపు 2,000 బస్సుల వరకు పంపారు. రోజూ బస్సుల్లో 98 లక్షల మంది ప్రయాణం సాగిస్తారు. గురువారం అదనంగా 80,000 మంది ప్రయాణించారని అధికారులు తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం తిరుగు ప్రయాణంలో ఇదే రద్దీ కొనసాగకపోవడం గమనార్హం. ఒకరోజు ఆదాయం రూ.12 కోట్లు కాగా, గురు, శుక్రవారాల్లో దాదాపు రూ.కోటి వరకు అదనంగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంటికి వెళ్లాలన్న నగరవాసుల అవసరాన్ని ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకున్నాయి. కిక్కిరిసిన రైళ్లు! తెలంగాణలో వివిధ జిల్లాలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి ఉదయంపూట బయల్దేరిన రైళ్లు కిటకిటలాడాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక రైళ్లు వేయకపోవడంతో గురువారంరాత్రి, శుక్రవారం ఉదయం రైళ్లు రద్దీగా కిటకిటలాడాయి. చార్జీలు పంచిన నేతలు, ప్రత్యేక వాహనాలు హైదరాబాద్, జిల్లాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వాళ్లందరికీ నేతలు బస్‌చార్జీలు పంచారు. మరికొందరు అల్వాల్, బాలానగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ నుంచి తమ నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చాలా ముందస్తుగా, పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన నేతలు ప్రజలను సొంతూళ్లకు తరలించారు. -
మునగాల వద్ద బస్సు బోల్తా
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని మునగాల వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టి.. రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయినట్టు సమాచారం. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బస్సు పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మూడు ట్రావెల్స్ బస్సులు ఢీ:ఒకరు మృతి
-
ప్రైవేటు ట్రావెల్స్ అగడాలు మళ్లీ మొదటికి!
రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలు మళ్లీ జోరందుకున్నాయి. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొందిస్టేజి క్యారియర్లుగా దూసుకెళ్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా, ఒకే పర్మిట్‌తో మరికొన్ని బస్సుల్ని తిప్పి రహదారి పన్ను ఎగ్గొడుతున్నా.. రవాణా శాఖ చోద్యం చూస్తోందన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. గత ఆర్నెల్ల కాలంలో వీటిపై రవాణా శాఖ ఒక్క కేసూ నమోదు చేయకపోవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ల ఎదుటే టికెట్ కౌంటర్లు, పికప్ పాయింట్లు ఏర్పాటుచేసి మరీ ప్రైవేట్ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. – సాక్షి, అమరావతి 491- రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సుల సంఖ్య 50 - వీటిలో స్లీపర్ బస్సుల సంఖ్య 750 - ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులు 600 - వీటిలో 2 ప్లస్ వన్ బెర్తులున్న బస్సులు 70,000 - ఈ బస్సుల్లో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలతో ఆర్టీసీ ఏటా రూ.2,700 కోట్లు ఆదాయం పోగొట్టుకుంటోందని గతంలో సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రైవేటు ట్రావెల్స్‌ను అడ్డుకోలేమని ఇటీవలే ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చెప్పడాన్ని చూస్తే సర్కారు ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలను ఏ విధంగా కొమ్ము కాస్తోందో అర్ధమవుతోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రైవేటు బస్సులను అడ్డుకునేందుకు, వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు కమిటీలు ఏర్పాటుచేసింది. అంతేకాక, వీటి ఆగడాల నిరోధానికి ప్రత్యేకంగా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లను నియమించినా ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాల్లేవు. నాడు వద్దన్నదే నేడు ముద్దు ఇదిలా ఉంటే.. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించి తమ రాష్ట్రం మీదుగాగానీ.. తమ రాష్ట్రం నుంచి గానీ తిప్పడంలేదని అక్కడ ప్రభుత్వం ఏకంగా ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను గతంలో రద్దుచేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆ బస్సుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి అనుమతించారు. మరోవైపు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్లేందుకు డ్రైవర్లు కొంత మోతాదులో మద్యం సేవించాలని ప్రైవేటు ఆపరేటర్లే ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఇటీవలే ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు పలువురు మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డారు. గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పోలీసుల తనిఖీల్లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవరు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తనిఖీల్లో వెల్లడైంది. అలాగే, జాతీయ రహదారులపై టోల్గేట్లలో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయాలి. ఇందుకు ప్రభుత్వం గతేడాది రూ.10 కోట్లతో వాటిని కొనుగోలు చేసింది. కానీ, అధికారులు తనిఖీలు చేయకుండా ప్రైవేటు బస్సులను వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కార్మిక చట్టాలూ గాలికి.. ఇదిలా ఉంటే.. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు డ్రైవర్ల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయి. డ్రైవర్లకు కనీస సదుపాయాలు కల్పించడంలేదు. ప్రైవేటు ఆపరేటర్లు మోటారు వాహన కార్మికుల చట్టం అమలుచేస్తున్నారా? లేదా? అన్నది కార్మిక శాఖ కనీసం పరిశీలించడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన తర్వాతే రవాణా శాఖ డ్రైవర్ల పనివేళలు, రెండో డ్రైవరు నిబంధనపై మొక్కుబడిగా ఆదేశాలిచ్చిందే తప్ప వాటి అమలును పట్టించుకున్న పాపాన పోలేదు. నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా రవాణా చెక్‌పోస్టుల్లో ప్రతీ వాహనాన్ని ఆ శాఖాధికారులు విధిగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా ప్రయాణీకుల్ని తరలించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఓ కన్నేయాలి. సామర్థ్యానికి మించి వాహనం ఉందో లేదో పరిశీలించాలి. కానీ, అటువంటిదేమీ జరగకపోవడంతో దాదాపు 15 సంస్థలు ప్రయాణీకుల మాటున చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం తదితర నగరాల నుంచి పెద్దఎత్తున అక్రమంగా సరుకు తరలిస్తున్నారు. ఇటీవలే గుంటూరులో ఓ ప్రైవేటు బస్సులో 50 కేజీల వెండి, ఫర్నీచర్ సామాగ్రి రవాణా అధికారులకు దొరకడం ఇందుకు ఉదాహరణ. గతంలోనూ ప్రైవేటు బస్సుల్లో బాణాసంచా తరలించడంతో అగ్ని ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలున్నాయి. అయినా ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తూ జీరో వ్యాపారానికి తోడ్పాటునందిస్తున్నాయి. -
ఒక్క పర్మిట్.. రెండు బస్సులు
సాక్షి, అమరావతి: ఆటోల నుంచి రోడ్ ట్యాక్స్‌ను, ఫిట్నెస్ ఫీజు జాప్యానికి అపరాధ రుసుమును ముక్కు పిండి వసూలు చేసే రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్‌కు మాత్రం మినహాయింపునిస్తోంది. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతూ రోడ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నా చేష్టలుడిగి చూస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల్లో చాలామంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతూ ట్రావెల్స్ నిర్వాహకులు రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాష్ట్రంలో 491 ప్రైవేట్ బస్సులు కాంట్రాక్టు క్యారేజీ కింద అనుమతి పొందగా, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు మరో 750 వరకు ఉన్నాయి. సాధారణంగా ప్రతి ప్రైవేట్ బస్సు ప్రతి మూడు నెలలకోసారి విధిగా త్రైమాసిక పన్ను చెల్లించాలి. సీటుకు రూ.3,750 చొప్పున చెల్లించాలి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులతో కలిపి ఏటా రూ.50 కోట్ల వరకు రోడ్ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా, రూ.25 కోట్లే వసూలవుతున్నట్లు రవాణా వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆన్‌లైన్‌పై విముఖత అధికార పార్టీకి చెందిన ట్రావెల్స్ నిర్వాహకులు ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతుండడంతో రోడ్ ట్యాక్స్ ఆదాయానికి గండి పడుతోంది. ఉదాహరణకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక పర్మిట్‌తో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరితే, రెండో బస్సు అదే పర్మిట్ నంబరుతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. రవాణా శాఖ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆన్లైన్లోనే రోడ్ ట్యాక్స్ చెల్లించవచ్చు. ఈ విధానంలో పన్ను చెల్లిస్తే.. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పడం కష్టం. దీంతో ఆన్లైన్లో పన్ను చెల్లించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టపడడం లేదు. -
ఉమ్రా పేరుతో టోకరా
ప్రొద్దుటూరు క్రైం : ఉమ్రా యాత్రకు పంపిస్తామని మోసం చేసిన కేఎస్ఎస్ (కర్వానే సయ్యద్ ఉస్ సజిదిన్) ఉమ్రా ట్రావెల్స్‌కు సంబంధించి భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. రాయలసీమకే పరిమితమైందనుకున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించింది. అన్ని రాష్ట్రాల్లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కేఎస్ఎస్ ట్రావెల్స్ బ్రాంచి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10 వేల మందికి పైగా ఉమ్రా కోసం డబ్బు చెల్లించగా దేశవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు బెంగళూరు, చెన్నై, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి ప్రొద్దుటూరుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు చెందిన చైర్మన్ సయ్యద్ అల్తాఫ్హుస్సేన్ అబిది, మేనేజింగ్ డైరెక్టర్ ఇజాజ్ఆలీ, మేనేజర్ బర్కత్ ఆలీ పోలీసుల అదుపులో ఉన్నారని తెలియడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉమ్రా బాధితులు ప్రొద్దుటూరుకు పయనమైనట్లు సమాచారం. జనవరి నుంచి బుకింగ్‌లు కేఎస్ఎస్ ట్రావెల్స్ సంస్థ జనవరి 14 నుంచి ఉమ్రా కోసం బుకింగ్ ప్రారంభించినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రారంభంలో రూ.14 వేలకే ఉమ్రా పంపిస్తామని ప్రచారం చేశారు. ఈ మేరకు రెండు బ్యాచ్‌లను ఉమ్రాకు పంపారు. అయినా రూ.14 వేలకే ఉమ్రా యాత్ర ఎలా పంపిస్తారనే అనుమానాలు చాలా మంది నుంచి వస్తుండటంతో ఒక్క సారిగా రూ.30 వేలకు పెంచారు. నెలలోపు పంపిస్తానని రూ. 35 వేలు–రూ.40 వేలు కూడా కొంత మంది నుంచి వసూలు చేశారు. రంజాన్ నెలలో ఉమ్రాకు పంపిస్తానని దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది వద్ద నుంచి డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. రంజాన్ మాసం ప్రారంభమైనా ఒక్క బ్యాచ్‌ను కూడా ఉమ్రాకు పంపకపోవడంతో బోర్డు తిప్పేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కడపలో రూ. 3 కోట్లు, కర్నూల్లో రూ. 2 కోట్లు, ప్రొద్దుటూరులో రూ. 5 కోట్ల మేర ట్రావెల్స్ నిర్వాహకులు వసూలు చేసినట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. ట్రావెల్స్ కార్యాలయంలో వేలాది పాస్‌పోర్ట్‌లు రంజాన్ నెలలో తక్కువ ఖర్చుతో ఉమ్రా కు పంపిస్తామని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పడంతో చాలా మంది డబ్బు కట్టారు. దేశవ్యాప్తంగా 3 వేల మందిని ఉమ్రాకు పంపిస్తానని వారి పాస్‌పోర్ట్‌లను ఆయా ప్రాంతాల ఏజెంట్లు సేకరించి వీటిని ముంబయికి పంపించారు. అయితే వీరిలో ఏ ఒక్కరినీ ఉమ్రాకు పంపకపోవడంతో పాస్‌పోర్ట్‌లన్నీ ముంబయిలోనే ఉండిపోయాయి. దేశవ్యాప్తంగా 59 చోట్ల బ్రాంచ్‌లు కేఎస్ఎస్ ఉమ్రా ట్రావెల్స్‌కు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 59 బ్రాంచ్‌లు ఉన్నట్లు సంస్థలో పని చేసే ఆపరేటర్లు తెలిపారు. ఉమ్రా పేరుతో సంస్థ నిర్వాహకులు రూ.300 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇప్పటికి సుమారు రూ.200 కోట్ల వరకూ ప్రజల నుంచి వసూలు అయినట్లు వారు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, లక్నో, ఢిల్లీ, ముంబయి, ఉత్తరాఖండ్, అలీఘడ్ తదితర రాష్ట్రాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. భయం గుప్పిట్లో ఆపరేటర్లు.. తమకు ప్రాణ భయం ఉందని కేఎస్ఎస్ ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు ఆపరేట ర్లు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కడప, ప్రొద్దుటూరు, కర్నూలు కార్యాలయాల్లో పని చేస్తు న్న ఆపరేటర్లు షఫీ, అక్తర్, గైబు, ఖాజా, ఇషాన్ సోమవారం వన్‌టౌన్‌కు వచ్చారు. ప్రజల నుంచి వీళ్లే డబ్బు తీసుకొని సంస్థకు చెల్లించడంతో తమ పై ఒత్తిడి తెస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు చొరవ తీసుకోవడం వల్లనే సంస్థ నిర్వాహకులు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రొద్దుటూరుకు క్యూ కడుతున్న బాధితులు కేఎస్ఎస్ ట్రావెల్స్ సంస్థ మోసం చేసిందని, సంస్థ నిర్వాహకులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలియడంతో చాలా మంది ప్రొద్దుటూరుకు క్యూ కట్టారు. ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, కడపతో పాటు కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, అనంతపురం జిల్లాలోని అనంతపురం, గుత్తి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉమ్రా బాధితులు డబ్బు కట్టిన రసీదులు తీసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. ఎలాగైనా తమ డబ్బు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీ శ్రీనివాసరావును కోరారు. వారి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా పోలీసులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. రూ.56 వేలు కట్టాను ఉమ్రాకు తక్కువ డబ్బుతో పంపిస్తామని తెలియడంతో మా కుటుంబ సభ్యులు నలుగురి కోసం రూ. 56 వేలు చెల్లించాను. డబ్బు కట్టి చాలా రోజులైనా అతను ఉమ్రాకు పంపలేదు. ఇలా మోసం చేస్తారని అనుకోలేదు. ఎలాగైనా మా డబ్బు ఇప్పించాలి. – షేక్ అన్వర్‌బాషా,డీసీఎస్సార్ కాలనీ, ప్రొద్దుటూరు వడ్డీకి డబ్బు చెల్లించాను ఉమ్రాకు వెళ్లే భాగ్యం మళ్లీ వస్తుందో రాదో అని మా ఇంట్లో ఇద్దరి కోసం రూ. 50 వేలు ట్రావెల్స్ నిర్వాహకులకు కట్టాను. కానీ మోసం చేశారని తెలియడంతో రెండు రోజుల నుంచి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. పోలీసు అధికారులు ఎలాగైనా మా డబ్బు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.– షాహుసేన్వల్లి, చాగలమర్రి,కర్నూలు జిల్లా మోసం చేస్తాడని అనుకోలేదు ఉమ్రాకు పంపిస్తామని ఇలా మోసం చేస్తారని అనుకోలేదు. మోసపోయిన మమ్నల్ని పోలీసు అధికారులు ఆదుకోవాలి. డబ్బు కట్టిన వాళ్లలో చాలా మంది పేదలే ఉన్నారు. రూ. కోట్లలో వసూలు చేసిన కేఎస్ఎస్ ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. – వల్లీ సాహెబ్, ఖాదర్‌బాద్,ప్రొద్దుటూరు మండలం -
కేఎస్ఎస్ ట్రావెల్స్ ఘరానా మోసం
ప్రొద్దుటూరు క్రైం : ఉమ్రా (మక్కా) యాత్ర చేయాలనే కోరిక ప్రతి ముస్లింకు ఉంటుంది. అయితే ఖర్చుతో కూడుకుంది కావడంతో స్థోమత కలిగిన వారే ఉమ్రా, హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇటీవల ఒక ట్రావెల్ ఏజెంట్ రూ. 14 వేలకే ఉమ్రా యాత్ర చేయిస్తానని ప్రకటించడంతో ఎక్కువ మంది ముస్లింలు డబ్బు చెల్లించారు.ఇంత తక్కువ డబ్బుతో ఎలా ఉమ్రాకు తీసుకెళ్తారని చాలా మందిలో సందేహం రావడంతో వారిలో నమ్మకం కలిగించడానికి ఏజెంట్ ఒక బ్యాచ్‌ను తీసుకెళ్లాడు. చివరకు ఉమ్రా పేరుతో డబ్బువసూలు చేసుకొని పవిత్ర రంజాన్ మాసంలో అతను పాపానికి ఒడిగట్టాడు. నమ్మకం కలిగించి.. దోచుకొన్న ఏజెంట్ కడపకు చెందిన ఆలీ అనే వ్యక్తి ఒక పార్టీకి జిల్లా అ«ధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ అందరికీ సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలోనే అతను కేఎస్ఎస్ పేరుతో ట్రావెల్స్‌ను ఏర్పాటు చేశాడు. కడపలో హెడ్‌ఆఫీసును ఏర్పాటు చేసుకొని ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపురం, గుల్బర్గా తదితర ప్రాంతాల్లో ట్రావెల్స్ బ్రాంచి కార్యాలయాలను తెరిచాడు. ఒక్కో కార్యాలయంలో ముగ్గురు చొప్పున ఏజెంట్లను నియమించుకున్నాడు. అన్ని చోట్ల రూ. 14 వేలకే ఉమ్రాకు పంపిస్తామని ఫ్లైక్సీలను ఏర్పాటు చేశాడు. కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశాడు. ఉమ్రా యాత్రకు ట్రావెల్స్ నిర్వాహకులు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు తీసుకుంటారు. ఇంత తక్కువ డబ్బుతో ఎలా పంపిస్తారని అడిగిన వారితో అతను వాదిస్తూ వచ్చాడు. ‘ ఇందులో నేను ఒక్క రూపాయి కూడా లాభం తీసుకోను.. ఇంకా అంతో ఇంతో నాకే చేతి నుంచి పడుతుంది.. పేద, మధ్య తరగతి వారికి కూడా ఉమ్రా దర్శన భాగ్యం కల్పించాలన్నదే నా ఉద్దేశం’ అని చెబుతూ వచ్చాడు. ఇందులో భాగంగా అతను కొన్ని రోజుల క్రితం అన్ని ప్రాంతాల నుంచి కొంత మందిని ఎంపిక చేసుకొని ఉమ్రాకు పంపించాడు. వారు తిరిగి వచ్చిన తర్వాత నమ్మ కం కలగడంతో డబ్బు కట్టడానికి ట్రావెల్స్ వద్ద క్యూలో నిల్చున్నారు. డబ్బు కట్టడానికి వచ్చిన కొందరిని రెండు, మూడు రోజుల తర్వాత రమ్మ ని కూడా సిబ్బంది చెప్పేవారు. ఇలా ఒక్కో ప్రాం తం నుంచి రూ. కోట్లలో వసూలు చేసుకున్నాడు. డబ్బు కట్టిన కొందరికి ఉమ్రాకు వెళ్లే తేది కూడా చెప్పాడు. అయితే అతను చెప్పిన గడువు తీరడంతో చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. విమానాలు దొరకడం లేదని, నెల, రెండు నెలలు ఆలస్యం అయినా ఉమ్రాకు పంపిస్తానని నమ్మబలికే వాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో స్థానిక ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది. సుమారు 20 రోజులుగా ప్రధాన ఏజెంట్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో కింది స్థాయి వారిలో కూడా ఆందోళన మొదలైంది. దీంతో ప్రొద్దుటూరు, కడపతో పాటు ఇతర ప్రాంతాల్లో ట్రావెల్స్ కార్యాలయాలను మూసి వేశారు. రూ, కోట్లలో వసూలు.. అతను ఉమ్రాకు పంపిస్తానని పేద, మధ్య తరగతి ప్రజల వద్ద నుంచి రూ. కోట్లలో డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ అవకాశం మళ్లీ రాదన్నట్లు ఒక ఇంట్లో ఆరుగురు ఉంటే వారందరూ రూ.14 వేల చొప్పున డబ్బు చెల్లించిన వారు కూడా ప్రొద్దుటూరు, కర్నూలులో ఉన్నారు. ప్రొద్దుటూరులోనే సుమారు రూ. 6 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే కడప, కర్నూలు, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, అనంతపురం తదితర ప్రాంతాల్లో కూడా రూ.కోట్లలో వసూలు చేసినట్లు సమాచారం. రోజు రోజుకు స్థానికంగా ఉన్న బ్రాంచ్ కార్యాలయాల ఏజెంట్లపై ఒత్తిడి అధికం కావడంతో వారు కూడా కార్యాలయాలకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేఎస్ఎస్ ట్రావెల్స్ ప్రధాన ఏజెంట్ ఆలీ బెంగళూరులో ఉన్నాడని తెలియడంతో ఏజెంట్లే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. రాయలసీమతో పాటు కర్నాటక, తమిళనాడు, తెలంగాణాలో కూడా అతను బ్రాంచ్ కార్యాలయాలను తెరచినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలోనే అతను అందరి వద్ద వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కడపలో ఆస్తులు కూడగట్టుకున్న ఏజెంట్ ఏజెంట్ ఇటీవల కడపలో పెద్ద ఎత్తున ఆస్తులను కొన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వివాదంలో ఉన్న పాఠశాలను రూ. 1.5 కోట్లు చెల్లించి అతను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పాఠశాలలో చేరాలని కడపలో ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కొన్నాడు. ఉన్నట్టుండి అతనికి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే సందేహం అతని బంధువులు, సన్నిహితుల్లో కూడా నెలకొంది. -
ట్రావెల్స్ బస్సులో భారీగా సొమ్ము పట్టివేత
-
విశాఖలో ట్రావెల్ బస్సు బోల్తా 10 మంది పరిస్థితి విషమం
-
అడ్డంగా దోచేసిన ఆర్టీసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యం 75 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి సీజన్లో ఫక్తు వ్యాపార ధోరణిని ప్రదర్శించింది. ప్రయాణికుల అవసరాన్ని భారీగా సొమ్ము చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలతో పోటీ పడి మరీ ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసింది. సంక్రాంతి పండుగను సొంత గ్రామాల్లో చేసుకుందామని బయలుదేరిన వారికి ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల రుసుములు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. పండుగ నేపథ్యంలో 50 శాతం అదనంగా చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఈ అదనపు చార్జీలకు మించి మరింత ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు రాయలసీమ జిల్లాల రూట్లలో భారీగా దోపిడీ జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానయాన సంస్థలు ప్రయాణికుల రద్దీని బట్టి ఫ్లెక్సీ ఫేర్ విధానంలో టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సైతం పండుగ సీజన్లో ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని అమలు చేసింది. దీనిప్రకారం నచ్చిన రేట్లను వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సంక్రాంతి ముగిశాక జనమంతా తిరుగు ప్రయాణమవుతారు. తిరుగు ప్రయాణంలోనూ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం టిక్కెట్ల ధరలను భారీగానే పెంచేసింది. ఈ మేరకు టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచింది. రాయితీల ఊసేది? ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ కాకుండా కార్పొరేషన్ కావడంతో మనుగడ కోసం సొంత ఆదాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. పండుగ సీజన్లో ప్రత్యేక బస్సులు నడపండి, ప్రయాణికుల జేబులు కొల్లగొట్టండి అని ఆర్టీసీ యాజమాన్యానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వం రాయితీలు ఇస్తే ప్రయాణికులపై అదనపు భారం పడదు. సాధారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే అమరావతి ఏసీ సర్వీసులోచార్జీ రూ.808. ప్రత్యేక బస్సు పేరిట 50 శాతం అదనంగా, అంటే రూ.1,200కు పైగా వసూలు చేశారు. అన్ని ప్రధాన రూట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ ట్రావెల్స్దీ అదే దారి ఆర్టీసీలో అధిక చార్జీలను సాకుగా చూపి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ప్రయాణికులను ఇష్టారీతిన దోచుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి రూ.3 వేలకు పైగా వసూలు చేశారంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టిక్కెట్ ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్తో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ప్లీజ్.. ఒక్క టిక్కెట్!
ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వేస్‌కు సంక్రాంతి కళ వచ్చేసింది. దూర ప్రాంతాలకు టికెట్లన్నీ అడ్వాన్స్‌గా బుక్ అయిపోవడంతో పండుగకు ఇంటి వెళ్లాలనుకునే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్లీజ్.. ఒక్క టికెట్! అని బతిమలాడుకోవాల్సి వస్తోంది. ఇదే అదనుగా టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఆర్టీసీ ‘స్పెషల్’ పేరుతో అదనపు చార్జీ వసూలు చేస్తుంటే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల టికెట్ ధరలు మూడింతలకు పెరిగాయి. మేమేమైనా తక్కువా అన్నట్లుగా రైల్వేస్ కూడా ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచేయడంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. ఎస్వీఎన్కాలనీ / పాత గుంటూరు : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా అవసరాల రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సొంతూరు వెళ్లాలని అనుకునే పండుగ. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో టికెట్లన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయి. ఇప్పటికిప్పుడు టికెట్ కొనుక్కుని వెళ్లాలనుకునే వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ చెబుతున్న ధరలు విని సగటు ప్రయాణికుడు బేజారవుతున్నాడు. ఇదే అదనుగా ఆర్టీసీ కూడా స్పెషల్ సర్వీస్ పేరుతో బస్సులు నడుపుతూ అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. రైల్వే శాఖ కూడా పండగ రోజుల్లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచేసింది. ఆగని దోపిడీ.... జిల్లా ఆర్టీసీ అధికారులు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు 350, హైదరాబాద్ నుంచి వచ్చేందుకు 330 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే, బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చేందుకు 40, వెళ్లేందుకు 45 బస్సులు వేశారు. చెన్నై నుంచి గుంటూరుకు వచ్చేందుకు 60, వెళ్లేందుకు 70 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, వీటిలో టికెట్లు ఇప్పటికే రిజర్వేషన్ అయిపోయాయి. కొన్నింట్లో మాత్రమే నామమాత్రంగా అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాలకు తక్కువ సంఖ్యలో బస్సులు ఉండటంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ధరలు విపరీతంగా పెంచేశారు. అలాగే, పండగ సీజన్లో రీజియన్‌లోని 13 డిపోల నుంచి దాదాపు 448 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఇవి చాలకపోవడంతో సిటీ సర్వీసులను ఎక్స్‌ప్రెస్, లగ్జరీ సర్వీసులుగా మార్చేసి నడిపేందుకు సిద్ధమయ్యారు. వీటిలో చార్జీలు అదనం అని వేరే చెప్పక్కర్లేదు. రైళ్లదీ అదే తీరు.. సంక్రాంతి పండుగకు 6 రోజులపాటు వరుస సెలవులు రావడంతో రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దూర ప్రాంతాలు వెళ్లే రైళ్ల టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. కొన్నింట్లో వెయింటింగ్ లిస్టు 200 వరకు ఉంటే, మరికొన్నింట్లో ఏకంగా రిగ్రెట్ అని వస్తోంది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వరకు రెండు సువిధ సూపర్‌ఫాస్ట్ రైళ్లు, రెండు ప్రీమియం రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇదే అదనుగా డైనమిక్ ఫేర్ పేరుతో మూడు రెట్లు చార్జీ వసూలు చేస్తున్నారు. ఈ ధరలు సమయాన్ని బట్టీ మారిపోతుండటం గమనార్హం. సందట్లో సడేమియా అన్నట్లు రైలు టికెట్లు బుక్ చేసే ప్రయివేటు ఏజెన్సీల దోపిడీ సైతం పెరిగిపోయింది. ఇక రిజర్వేషన్ లేని ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఏ రైలులోనూ ఖాళీ దొరకకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. పనిలో పనిగా ఫ్లాట్పాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచి రైల్వే శాఖ అదనపు ఆదాయం కోసం ప్రయాణికులపై భారం వేసింది. -
ట్రావెల్స్ బస్సు బోల్తా..
-
సంక్రాంతి షాక్
మండపేట: సంక్రాంతి బాదుడుకు అంతా సిద్ధమైంది. పెద్ద పండుగ కోసం హైదరాబాద్ నుంచి వచ్చే జిల్లా వాసులను రవాణా ఛార్జీల రూపంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ సమాయత్తమయ్యాయి. ఇప్పటికే ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసింది. ప్రత్యేక బస్సుల పేరిట సాధారణ టిక్కెట్టు ధరపై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనుండగా, రద్దీని బట్టి రెండు నుంచి మూడు రెట్లు వరకు టిక్కెట్టు ధర వసూలు చేసే యోచనలో ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. మరోపక్క రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోవడం ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్న వారు పెద్ద పండుగ సందర్భంగా జిల్లాకు రావడం పరిపాటి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ప్రారంభానికి ఐదు రోజుల ముందు నుంచీ ప్రయాణ రద్దీ మొదలవుతుంది. పండుగ తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారితో దాదాపు వారం రోజులపాటు రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో దాదాపు రెండు వారాల పాటు ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ వారికి పెద్ద పండుగనే చెప్పాలి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టిక్కెట్టు ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. పరుగులిలా... జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, ఏలేశ్వరం, రాజోలు తదితర ప్రాంతాల నుంచి రోజూ హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సుమారు 130 బస్సులు నడుస్తుండగా, ఆర్టీసీ సర్వీసులు 38 వరకూ నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో కాకినాడ నుంచి హైదరాబాద్‌కు టిక్కెట్టు ధర ప్రైవేట్ ట్రావెల్స్‌లో రూ. 600 నుంచి రూ.700, ఏసీ సర్వీసుకు రూ. 1000 వరకూ ఉంటుంది. రద్దీని బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులుంటుంటాయి. ఆర్టీసీ టిక్కెట్టు ధర రూ.680 వరకు ఉంటుంది. ఏసీ బస్సుకు రూ.950 వరకు ఉంటుంది. పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీతో అదనపు టిక్కెట్టు ధరపై ప్రత్యేక బస్సులు నడుపుతుంటారు. సైట్‌ను బ్లాక్ చేసిన ఆర్టీసీ... గతంలో మూడు నెలల ముందుగానే రిజర్వేషన్ సదుపాయం కల్పించిన ఆర్టీసీ సంస్థ పండుగ రద్దీ దృష్ట్యా రిజర్వేషన్ కాలపరిమితిని నెల రోజులకు కుదించేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పటికే సైట్స్ మూసివేశాయి. ప్రత్యేకం పేరుతో జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఆర్టీసీ సంస్థ హైదరాబాద్‌కు దాదాపు 60 బస్సులు వరకు నడిపే ప్రయత్నంలో ఉంది. ప్రత్యేక బస్సుల ద్వారా రానుపోను అదనపు ధర రూపంలో దాదాపు రూ.80 లక్షల మేర ఆదాయం రాబట్టే పనిలో ఉన్నట్టు సమాచారం. రికార్డు స్థాయిలో పెరగనున్న ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు... ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు రికార్డు స్థాయిలో పెరగనున్నట్టు ట్రావెల్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఆయా ట్రావెల్స్ రిజర్వేషన్ చార్జీను ఇంకా తెరవలేదు. దసరా పండుగ సందర్భంగా రూ.2,500లు వరకు టిక్కెట్టు ధర పలికింది. అదే తరహాలో పండుగ ధరలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా రోజుకు సుమారు పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో నాన్ ఏసీ బస్సులు 70 శాతం కాగా, మిగిలినవి ఏసీ బస్సులు. పండుగ రద్దీతో నాన్ ఏసీ ధరలు రూ.1200లు నుంచి రూ. 1600 వరకు, ఏసీ సర్వీసుకు రూ. 2000లు నుంచి రూ. 3000లు వరకు పెరగవచ్చునని భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వాసుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి. దోపిడీకి గురికాకుండా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. చాంతాండంత వెయిటింగ్ లిస్ట్... జిల్లా మీదుగా రోజూ హైదరాబాద్‌కు 12 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జనవరి 12వ తేదీ నుంచి స్లీపర్‌తోపాటు థర్డ్, సెకండ్ ఏసీల వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంది. పండుగ రోజుల్లో మినహా, తిరుగు ప్రయాణానికి సంబంధించి 16వ తేదీ నుంచి వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నుంచి జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపే విషయమై రైల్వేశాఖ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం ప్రయాణికులను నిరాశకు గురిచేస్తోంది. -
పండక్కి ప్రయాణమెలా?
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఆర్టీసీ గట్టి షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా దోపిడీకి తెరతీశాయి. గతంలో ఆన్లైన్లో ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ చేసుకు నేందుకు మూడు నెలల గడువు ఉండేది. అంటే ప్రయాణానికి తొంబై రోజులకు ముందుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆర్టీసీ ఈ గడువును 30 రోజులకు కుదించింది. దీంతో సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణి కులకు టిక్కెట్ల రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో లేకుండా పోయింది. టికెట్ రిజర్వేషన్ ఫ్రాంచైజీని ఆర్టీసీ యాజమాన్యం నాలుగు కంపెనీలకు అప్పగించింది. రెడ్‌బస్, అభీబస్, పేటీఎమ్, ఐబిబో కంపెనీలు టికెట్ రిజర్వేషన్ ప్రాంఛైజీలు పొందాయి. ప్రాంఛైజీల కోసమే ఆర్టీసీ రిజర్వేషన్ల గడువును కుదించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీకి సొంతంగా ఆన్లైన్ రిజర్వేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం గమనార్హం. ఆర్టీసీ రిజర్వేషన్లకు నెల గడువు విధించినట్లు యాజమాన్యం పేర్కొంటున్నా.. టిక్కెట్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అంటే పండక్కి ముందు డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 11వ తేదీ తర్వాత ప్రయాణానికి ఆర్టీసీ టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. మరో దారిలేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయిద్దామంటే టిక్కెట్ల ధరలు షాక్ కొడుతున్నాయి. జేబులకు చిల్లు పడేలా పండగ సీజన్లో టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా ఉంది. రైళ్లదీ అదే పరిస్థితి రైళ్లలో టిక్కెట్ల రిజర్వేషన్లు సైతం గగనంగా మారాయి. రైళ్లలో 120 రోజులు ముందుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుంది. అయితే ప్రధాన రైళ్లలో చాంతాండంత వెయిటింగ్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే ముఖ్య రైళ్లలో ఇప్పటికే ‘నో రూమ్’ కనిపిస్తోంది. పైగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికీ ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు. ప్రైవేటు ట్రావెల్స్ దందా ఆర్టీసీలో అధిక చార్జీలను సాకుగా చూపి ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు తీసుకుని స్టేజీ క్యారియర్లుగా తిప్పుతున్నా రవాణా శాఖ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. విజయవాడ నుంచి విశాఖపట్నం టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా చెబుతున్నారంటే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టిక్కెట్ల ధరలను కట్టడి చేయాల్సిన రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం మానేశారు. ‘ప్రత్యేక’ దోపిడీకి రెడీ ఆర్టీసీ కూడా పండుగ సీజన్లో ప్రత్యేక చార్జీల పేరుతో దోపిడీకి రంగం సిద్ధం చేసింది. సాధారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే అమరావతి ఏసీ సర్వీసుకు చార్జీ రూ.808. అదే ప్రత్యేక బస్సుకు 50 శాతం అధికంగా వసూలు చేస్తారు. అంటే రూ.1,200కు పైగా చెల్లించాలన్నమాట! ప్రైవేటు బస్సుల్లో విజయవాడ–విశాఖపట్నం రూటుకు జనవరి 11న టిక్కెట్ ధర రూ.1,550–రూ.1,800, జనవరి 12న రూ.3 వేలు, జనవరి 13న రూ.3,500 వరకు ఉండడం గమనార్హం. విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య దూరం 337 కిలోమీటర్లు. అంటే కిలోమీటర్‌కు రూ.10కి పైగానే దండుకుంటున్నారు. ప్రత్యేక బస్సుల పేరిట ఆర్టీసీ అధికంగా వసూలు చేస్తుండగా, తాము డిమాండ్‌ను బట్టి ఎక్కువ తీసుకుంటే తప్పేంటని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌కు 2,135 ప్రత్యేక బస్సులు సంక్రాంతి పండుగ సీజన్లో జనవరి 9 నుంచి ప్రతి రోజూ 2,135 ప్రత్యేక బస్సులను విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధికంగా చార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. టిక్కెట్లు బ్లాక్ చేశారు ‘‘ప్రైవేటు బస్సులో ప్రయాణం కంటే ఆర్టీసీ బస్సు సురక్షితమని ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించా. కానీ, పండుగ సీజన్లో టిక్కెట్లు బ్లాక్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్టు ధరలు దారుణంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ – శ్రీధర్, విజయవాడ ప్రతి పండక్కీ ఇదే ఆనవాయితీ ‘‘దసరా, దీపావళి, సంక్రాంతి ఏ పండుగకైనా ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేటు ఆపరేటర్ల తీరు మారడం లేదు. ఆర్టీసీ టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేయడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాం. నెల గడువు అని అధికారులు చెబుతున్నా.. నెలకు ముందు రోజు కూడా రిజర్వేషన్ దొరకడం లేదు’’ – కిరణ్మయి, సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధిక చార్జీలు ‘‘ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపితే కచ్చితంగా 50 శాతం అధిక చార్జీలు వసూలు చేస్తాం. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్ గతంలో 90 రోజులకు ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలుండేది. ఇప్పుడు 30 రోజులకే పరిమితం చేశాం’’ – జయరావు, ఆర్టీసీ ఈడీ -
దారి’ దోపిడీ షురూ!
-
దారి’ దోపిడీ షురూ!
► దసరా రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ ► బస్సు చార్జీల ధరలు అడ్డగోలుగా పెంపు ► రెట్టింపు చార్జీలతో ప్రయాణికుల జేబులు లూటీ ► ఏటా ఇదే తంతు.. పట్టించుకోని రవాణాశాఖ సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల్లో ప్రైవేటు ట్రావెల్స్ ‘దారి’ దోపిడీ మళ్లీ మొదలైంది. రద్దీని అవకాశంగా తీసుకుని బస్సు చార్జీల మోత మోగిపోతోంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలు, జిల్లాలకు వెళ్లే బస్సుల్లో చార్జీలను అడ్డగోలుగా పెంచేశారు. ఏకంగా రెట్టింపునకుపైగా వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ కూడా పండుగ రద్దీ పేరుతో 50 శాతం దాకా అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. అటు రైల్వే కూడా ప్రత్యేక రైళ్ల పేరిట చార్జీల మోత మోగిస్తోంది. మొత్తంగా ప్రయాణికులు మాత్రం లబోదిబోమంటున్నారు. నిలువు దోపిడీ ఇది.. రాష్ట్రంలో రెండు రోజుల కింద దసరా సెలవులు మొదలయ్యాయి. దీంతో హైదరా బాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వెళ్లేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ రద్దీని అవకాశంగా తీసుకుని ప్రయాణికులపై ముప్పే ట దాడి మొదలైంది. ఇప్పటికే ఆర్టీసీ, రైల్వే అదనపు చార్జీల వసూలు మొదలుపెట్టగా.. ప్రైవేటు ట్రావెల్స్ అయితే నిలువుదోపిడీకి తెరతీశాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్లు లభించనివారు... హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. వారి వద్ద నుంచి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు సాధారణం కంటే ఏకంగా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండే విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం వంటి మార్గాల్లో బాదుడు మరింత దారుణంగా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రైవేట్ ఏసీ బస్సుల్లో చార్జీ రూ.450 నుంచి రూ.500 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.950 నుంచి రూ.1,100 వరకు పెంచారు. అంటే నలుగురు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తే ఏకంగా నాలుగైదు వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో సగటు వేతన జీవులు విలవిల్లాడిపోతున్నారు. పండుగ అంటే కొత్త బట్టలు, సామగ్రి వంటి ఖర్చు ఎలాగూ ఉంటుంది. దానికితోడు చార్జీల భారంతో అంచనాలు తలకిందులవుతున్నాయి. రద్దీని బట్టి మోత! హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు రోజూ 650 నుంచి 700 ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటి నిర్వాహకులు పండుగలు, సెలవుల వంటి సందర్భాల్లో రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతారు. అదనపు వసూళ్లు మొదలుపెడతారు. వాస్తవానికి ప్రైవేటు బస్సులన్నీ కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొని.. స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్నవే. అవి కేవలం కాంట్రాక్టు ప్రాతిపదికన పర్యాటక, దర్శనీయ ప్రాంతాలకు, ఇతర అవసరాలకు మాత్రమే రాకపోకలు సాగించాలి. కానీ ప్రయాణికులను ఎక్కించుకుంటూ స్టేజీ క్యారేజీలుగా తిప్పుతున్నారు. దీనిని ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తోంది. కనీసం వాటిలో అడ్డగోలుగా చార్జీల వసూలును నియంత్రించడంపైనా దృష్టి సారించడం లేదు. ప్రైవేట్ బస్సుల చార్జీల అంశం తమ పరిధిలో లేదంటూ రవాణాశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు వెళ్లే ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు (రూ.లలో) నాన్ ఏసీ బస్సులు ఏసీ బస్సులు ప్రాంతం సాధారణం ప్రస్తుతం సాధారణం ప్రస్తుతం విజయవాడ 350 600 450 850 వైజాగ్ 550 950 750 1,400 తిరుపతి 500 1,000 650 1,300 గుంటూరు 400 750 450 950 రాజమండ్రి 550 1,100 750 1,550 కాకినాడ 550 1,100 750 1,550. పండుగ సంబరం ఆవిరి ‘‘మాది శ్రీకాకుళం. దసరా సెలవులు వచ్చాయంటే కుటుంబమంతా స్వగ్రామానికి వెళ్లి ఆనందంగా గడిపి వస్తాం. రైల్వే రిజర్వేషన్ దొరకడం లేదు. ఆర్టీసీ బస్సుల్లోనూ సీట్లు దొరకడం లేదు. రెట్టింపు చార్జీలు చెల్లించి ప్రైవేటు బస్సుల్లో వెళ్లాల్సి వస్తోంది. పండుగ సంబరం చార్జీలకే ఆవిరైపోతోంది..’’ – జి.నర్సింగరావు, కూకట్పల్లి, హైదరాబాద్ వేలకు వేలు చార్జీలకే.. ‘‘మాది ఖమ్మం. ఏటా దసరా సెలవులకు ఊరికి వెళతాం. ఈసారి ముందుగా రైల్వే రిజర్వేషన్ చేయించుకోలేకపోయా. ఇప్పుడు ట్రావెల్స్ బస్సులో వెళ్లాల్సి వస్తోంది. సామాన్య, మధ్యతరగతివారు వేలకు వేలు చార్జీలకే ఖర్చుచేసి ఊరికి వెళ్లి రావాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి..’’ – గోపీ భాస్కర్‌రావు, మోతీనగర్ -
ట్రావెల్స్ బస్సుల తీరుతో ప్రయాణికుల ఇక్కట్లు
-
ప్రైవేట్ ట్రావెల్స్ దందా
– జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాల బస్సుల రాకపోకలు – రవాణా శాఖ ఖజానాకు భారీ నష్టం అనంతపురం సెంట్రల్: అనుమతులు పొందేది ఒక చోట. రాకపోకలు సాగిస్తున్నది మరోచోట. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులూ చెల్లించకుండానే మనరోడ్లపై రయ్యి.. రయ్యి మంటూ ఇతర రాష్ట్రాల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దూసుకుపోతున్నాయి. దీని వలన ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడుతోంది. రాష్ట్ర స్థాయిలో తీవ్ర దుమారం రేగడంతో ఇలాంటి బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో పెనుకొండ చెక్‌పోస్టులో రెండు, గుత్తి టోల్గేట్ వద్ద ఒకటి, అనంతపురం జాతీయ రహదారిలో ఒక బస్సును సీజ్ చేశారు. ఇటు బెంగళూరు, అటు హైదరాబాద్, విజయవాడకు వెళ్లాలంటే అనంతపురం మీదుగా రాకపోకలు సాగాలి. ఈ నేపథ్యంలో అనుమతి లేని వాహనాలకు కళ్లెం వేసేందుకు దాడులు ముమ్మరం చేయాలని రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఎక్కువశాతం కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఎలాంటి పన్నులు లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారు. రాష్ట్రాలు దాటి ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మధ్యలో కొన్ని రాష్ట్రాలకు అనుమతి పొందకుండానే నడుపుతున్నారు. దీని వలన ప్రభుత్వ ఖజనాకు పన్నుల రూపంలో నష్టం వాటిల్లితే... ప్రయాణికులను చేరవస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ, పన్నులు చెల్లిస్తున్న మన ట్రావెల్స్ యాజమాన్యాలకు నష్టం చేకూరుతోంది. కొన్నేళ్ల నుంచి ఇతర రాష్ట్రాల ప్రైవేట్ ట్రావెల్స్‌ల దందా కొనసాగుతోంది. సీజ్ చేయడానికి అధికారుల్లో భయం ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అధికారుల్లో మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇచ్చినా.. వాటిపై జరిమానాలు విధించి విడుదల చేసే అధికారాలు జిల్లాస్థాయి అధికారులకు లేవు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది ఇతర రాష్ట్రాల ట్రావెల్స్ నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బస్సుల జోలికి రావొద్దని అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. దాడులు చేస్తున్నాం నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నా ఇతర రాష్ట్రాల బస్సులను సీజ్ చేయాలని ఆదేశాలు అందాయి. దీంతో దాడులు చేస్తున్నాం. ముఖ్యమైన రహదారుల్లో వాహన తనిఖీలు చేపడుతున్నాం. ఇప్పటి వరకూ నాలుగు బస్సులు సీజ్ చేశాం. - శ్రీధర్, ఆర్టీఏ, అనంతపురం -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సెంటర్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం సమీపానికి రాగానే అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. -
తెలుగు బస్సులకు అరుణాచల్ బ్రేక్
► ఆ రాష్ట్రంలో రిజిస్ట్రర్ అయిన బస్సు పర్మిట్లు రద్దు ►తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న వెయ్యి ట్రావెల్ బస్సులపై వేటు ►ఇకపై పెనాల్టీలు ఉండవు.. జప్తు చేస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: నిబంధనలను బేఖాతరు చేస్తూ చట్ట విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు పర్యాటక రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ షాకిచ్చింది! రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెయ్యి బస్సులు రోడ్డెక్కకుండా చేసింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ కంగుతిన్నాయి. ఇదీ సంగతి.. ఆదాయమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలు ఏమీ చేయలేకపోగా చిన్న రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్ ముప్పు తిప్పలు పెడుతోంది. పర్యాటక రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో 2+1 విధానంతో స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసుకునే అవకాశంతోపా టు పర్మిట్ పన్ను తక్కువగా ఉండటంతో తెలం గాణ, ఏపీలకు చెందిన పలు ట్రావెల్స్ యజమానులు తమ బస్సులను ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అక్కడ్నుంచే పర్మిట్ పొంది ఇక్కడ తిప్పుతున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ నిబం ధనల ప్రకారం అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని పర్మిట్ పొందిన బస్సులు కనీసం నెలలో ఒకసారి ఆ రాష్ట్రానికి వెళ్లాలి. కానీ ఆ నిబంధనను బేఖాతరు చేయడంతోపాటు స్థాయికి మించి సీట్లు, బెర్తుల సంఖ్య పెంచుకొని ట్రావెల్స్ నిర్వాహకులు భారీగా డబ్బు చేసుకుంటున్నారు. ఏపీకి చెందిన కేశినేని ట్రావెల్స్ ఇటీవల తమ బస్సుల నిర్వహణను నిలిపేసింది. కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ నిర్వాహకులకు ఆ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌కు మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, నిబంధనలను బేఖాతరు చేస్తున్న తీరు పై ఏపీకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు అరుణాచల్‌ప్రదేశ్ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘన నిజమేనని తేల్చి ఆయా ట్రావెల్స్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలను పాటించని దాదాపు వెయ్యి బస్సుల రిజిస్ట్రేషన్, పర్మిట్లు రద్దు చేస్తున్నట్లు అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల రవాణా శాఖలకు ఆదేశాలను పంపింది. దీంతో తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని 2+1 స్లీపర్ విధానం ఇక్కడ అమలుచేయించుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు యత్నిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆదేశాలు తమ చేతికి అందగానే తక్షణం చర్యలు ప్రారంభిస్తామని తెలం గాణ రవాణాశాఖ జేటీసీ రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ఇంతకాలం పెనాల్టీతో సరి... ఇక జప్తే.. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడి నిబంధనలకు విరుద్ధంగా 2+1 స్లీపర్ విధానంతో తిరుగుతున్న బస్సులపై ఇప్పటివరకు తెలంగాణ రవాణా శాఖ పెనాల్టీలు మాత్రమే విధిస్తూ వచ్చింది. అడపాదడపా పెనాల్టీలు విధించడం రవాణశాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి అలవాటుగా మారింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్, పర్మిట్లు రద్దు చేయడంతో ఈ బస్సులు తెలంగాణ పరిధిలో తిరగడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ఆ బస్సులు కనిపిస్తే జప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు
కీసర: ప్రయాణికుల నుంచి టికెట్ల డబ్బులు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం వారి కష్టాలను మాత్రం గాలికొదిలేసింది. రంగారెడ్డి జిల్లా కీసర వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎస్వీకేడీటీ ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో కీసర వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది. అయితే కొన్ని గంటల వరకూ తమను ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తిరుగు ప్రయాణాలకు కూడా టిక్కెట్లు తీసుకున్నామని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. దీనిపై కీసర పోలీస్ స్టేషన్లో ట్రావెల్స్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు దాడులు
-
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ట్రావెల్స్
-
వోల్వో బస్సు దగ్ధం మరో బస్సులో మంటలు
-
వోల్వో బస్సు దగ్ధం.. మరో బస్సులో మంటలు
హైదరాబాద్/ విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల పెను ప్రమాదాలు తప్పాయి. ఒకేరోజు కొన్ని గంటల తేడాతో రెండు ప్రైవేట్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సులో మంటలను అదుపు చేశారు. ఈ రెండు ఘటనల్లో ప్రయాణకులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం: విశాఖపట్టణం జిల్లా కశింకోట మండలం పరవాడపాలెం వద్ద శనివారం వేకువజామున కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి అనకాపల్లికి పెళ్లి బృందంతో వెళుతున్న ఈ బస్సులో పొగలు వచ్చాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు నుంచి పొగలు వస్తున్నాయని పక్కనే కారులో వెళ్తున్నవారు చెప్పడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. ప్రయాణుకులు కిందకు దిగారో లేదో బస్సులోకి మంటలు వ్యాపించాయి. బస్సు చాలావరకు దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెళ్ళి బృందాన్ని మరో బస్సులో తరలించారు. బస్సులో మంటలు: ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వినాయక్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బస్సు వనస్థలిపురం దాటగానే ఒక్కసారిగా పొగ వాసన రావడంతో ప్రయాణికులు ఆప్రమత్తమై బస్సును ఆపించి అంతా తమ సామాన్లతో సహా కిందకు దిగిపోయారు. ముందుగా దిగినవారు చూసేసరికి అప్పటికే బస్సు కింద భాగంలో మంటలు మొదలయ్యాయి. దాంతో వాళ్లు లోపల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసి అందరినీ కిందకు దించేశారు. అందుబాటులో ఉన్న నీళ్లను మంటలపై చల్లారు. అయినా పొగలు మాత్రం చాలాసేపటి వరకు ఆగలేదు. బస్సు నాన్ ఏసీ కావడం, కిటికీ అద్దాలు తెరుచుకుని ఉన్న ప్రయాణికులు వాసనను గుర్తించి సకాలంలో అప్రమత్తం కావడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అదే ఏసీ బస్సు అయి ఉంటే అద్దాలు అన్నీ మూసేసి ఉండేవని, పొగ వాసన కూడా తమకు తెలిసేది కాదని ప్రయాణికులలో ఉన్న నవీన్ అనే యువకుడు 'సాక్షి'కి చెప్పారు. బహుశా ఇంధన ట్యాంకు లీకేజి వల్ల మంటలు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడిన ప్రయాణికులు.. కూకట్ పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అక్కడినుంచి సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
హైదరాబాద్: శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు రేగాయి. అయితే అప్పటికే తెల్లవారడం, మెలకువ వచ్చిన ప్రయాణికులు పొగ వాసనకు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వినాయక్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బస్సు వనస్థలిపురం దాటగానే ఒక్కసారిగా పొగ వాసన రావడంతో ప్రయాణికులు ఆప్రమత్తమై బస్సును ఆపించి అంతా తమ సామాన్లతో సహా కిందకు దిగిపోయారు. ముందుగా దిగివారు చూసేసరికి అప్పటికే బస్సు కింద భాగంలో మంటలు మొదలయ్యాయి. దాంతో వాళ్లు లోపల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసి అందరినీ కిందకు దించేశారు. మంటల మీద దగ్గర అందుబాటులో ఉన్న నీళ్లు చల్లారు. అయినా పొగలు మాత్రం చాలాసేపటి వరకు ఆగలేదు. బస్సు నాన్ ఏసీ కావడం, కిటికీ అద్దాలు తెరుచుకుని ఉన్న ప్రయాణికులు వాసనను గుర్తించి సకాలంలో అప్రమత్తం కావడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అదే ఏసీ బస్సు అయి ఉంటే అద్దాలు అన్నీ మూసేసి ఉండేవని, పొగ వాసన కూడా తమకు తెలిసేది కాదని ప్రయాణికులలో ఉన్న నవీన్ అనే యువకుడు 'సాక్షి'కి చెప్పారు. బహుశా ఇంధన ట్యాంకు లీకేజి వల్ల మంటలు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడిన ప్రయాణికులు.. కూకట్ పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అక్కడినుంచి సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. -
వారిపై చర్యలు తీసుకోండి
అమరావతి బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను నిర్బంధించి దూషించిన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బొండా ఉమాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలకు ఆదేశించాలని కూడా ఆ ఫిర్యాదులో కోరారు. కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్కు చెందిన సామాజిక కార్యకర్త ఎం.సుబ్రమణ్యం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తాము చెప్పినట్లుగా తప్పుడు నివేదికలు ఇవ్వనందునే రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. రవాణా శాఖ అధికారుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని, వారికి తగిన రక్షణ కల్పించి ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన కోరారు. -
బస్మాసుర ట్రావెల్స్
-
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం
ఉంగుటూరు: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు కొనసాగతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు టోల్గేట్ వద్ద ఆదివారం తెలల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు టోల్గేట్ వద్ద గల కంటైనర్ రూం ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు టోల్గేట్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు బస్సులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
4 రోజులైనా బస్సు ఘటనపై విచారణ లేదు
-
4 రోజులైనా విచారణ లేదు
⇒ 10 మంది మరణించినా దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై కదలిక లేదు ⇒ గురువారంనాటి రెండు బస్సు ప్రమాదాలపై మాత్రం విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం సాక్షి, అమరావతి: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇది జరిగి 4 రోజులైంది. దీనిపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రం. ఇంతవరకు న్యాయ విచారణకు ఆదేశించలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ, గురువారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు బస్సు ప్రమాదాలపై మాత్రం ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ రెండు ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ మరణించలేదు. కానీ, ఈ రెండు ప్రమాదాల్లో బస్సులు చిన్న సంస్థలవి కావడం, అధికార పార్టీ నేతలకు చెందినవి కాకపోవడంతో ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఇదే వేగాన్ని 10 మందిని బలితీసుకున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘటనపై చూపలేదు. ఈ సంస్థ అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానిది కావడంవల్లే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం తనిఖీలూ లేవు.. ఆలిండియా టూరిస్ట్ పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముండ్లపాడు ఘటనతో పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం తమ సరిహద్దుల్లో తిరుగుతున్న ఏపీ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేపట్టింది. ఏపీలోని ప్రైవేటు ట్రావెల్స్‌పై ఉక్కుపాదం మోపింది. పలు బస్సులకు సరైన పత్రాలు లేవని కేసులు నమోదు చేసింది. కానీ, ఏపీ రవాణా శాఖ అధికారులు కనీసం తనిఖీలు చేయడంలేదు. ప్రభుత్వ పెద్దలు కొందరు అడ్డుపడుతుండటంవల్లే తామేమీ చేయలేక పోతున్నామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో సర్కారు పెద్దలు ఎంతలా అంటకాగుతున్నారో దీనిని బట్టే అర్ధమవు తుంది. రవాణా శాఖ అధికారులు జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో బస్సుల వేగ పరిమితి, బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు చేయాలి. రోజూ టోల్గేట్లు దాటే బస్సుల వివరాలు నమోదు చేయాలి. అవేమీ జరగడంలేదు. సర్కారు నుంచి సహకారం లేదని,సిబ్బందిని నియమించడంలేదని, బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ గన్లు వంటి పరికరాల కొనుగోలుకు నిధులు లేవని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తనిఖీలు చేయలేకపోతున్నామని అంటున్నారు. -
ప్రైవేటు బస్సులపై అధికారుల కొరడా
రంగారెడ్డి : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. శంషాబాద్ గగన్‌పహాడ్ వద్ద శుక్రవారం ఉదయం రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా పలు బస్సులపై దాడులు జరిపారు. నిబంధనలు పాటించని 19 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: అమాయక ప్రజల ప్రాణాలను ప్రైవేటు ట్రావెల్స్ బలితీసుకుంటున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్‌కు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. లారీలకు సింగిల్ పర్మిట్లు ఇవ్వాలని కోరినా ఏపీ ప్రభుత్వంలో స్పందనలేదన్నారు. 15 రోజుల్లో దీనిపై చర్యలు తీసుకోకపోతే బస్సులు, లారీలను కోదాడ వద్ద ఆపేస్తామని హెచ్చరించారు. అక్రమ పర్మిషన్లతో బస్సులను నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన పది మంది ప్రాణాలకు విలువ ఎవరు కడతారని ప్రశ్నించారు. ‘ప్రైవేటు ట్రావెల్స్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. ఏపీలో ఏమైనా చేసుకోండి కానీ తెలంగాణలో మాత్రం ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు ఆస్కారం లేదు. రాజకీయ ప్రమేయం లేకుండా దోషులను కఠినంగా శిక్షించాలి. రాజకీయ నేతలే వీటికి యజమానులు కావడం వల్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీనిపై పార్టీలు కూడా సమీక్షించుకోవాలి’ అని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీలకే వందలాది బస్సులున్నాయని, ఏం చేసినా చెల్లుతుందనే ఇలా చేస్తున్నారని అన్నారు. ఈ అక్రమాలను ఇరు ప్రభుత్వాలు అరికట్టాలని, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రజలు ప్రయాణించాలని సూచించారు. -
బ్రేకుల్లేని ట్రావెల్స్ దందా..
మాఫియా మాదిరి మారిన ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తిరుగుతున్న బస్సులు అధికార పార్టీ నేతలే ట్రావెల్స్ యాజమాన్యాలు అందుకే పట్టించుకోని ప్రభుత్వం, రవాణా శాఖ అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరిల్లో రిజిస్ట్రేషన్ సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల్ని తిప్పుతున్నా.. ప్రభుత్వం వారిపై చర్యలకు వెనుకాడుతోంది. ప్రైవేటు ట్రావెల్స్ నడుపుతోంది.. అధికార పార్టీకి చెందిన ఎంపీలే కావడమే దానికి కారణం. ఒకవేళ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. వారికి సర్కారు బదిలీల బహుమానం అందిస్తోంది. ఐదేళ్లుగా నిత్యం ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘోర ప్రమాదం జరిగి ప్రయాణికులు దుర్మరణం పాలయితే ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రైవేటు ట్రావెల్స్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం లేదు. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో.. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో స్టేజి క్యారియర్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో బస్సుల్ని తిప్పుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఆలిండియా పర్మిట్లు పొంది నిబంధనలకు విరుద్ధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. మొత్తం 500 ప్రైవేటు బస్సులు ఇలా తిరుగుతున్నాయనేది అంచనా. కేంద్ర మోటారు వాహన చట్టం–1989 నిబంధనలను అతిక్రమించి తిప్పుతున్న ఈ బస్సుల జోలికి వెళ్లవద్దంటూ సాక్షాత్తూ ఓ మంత్రి రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రతను సవాల్ చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్ ఏకంగా టూ ప్లస్ వన్ బెర్తులతో తిప్పుతున్నా.. రవాణా శాఖ చోద్యం చూడటం మినహా ఏ ఒక్క బస్సును సీజ్ చేయట్లేదు. విజయవాడ బందరు రోడ్డు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో.. మెయిన్ రోడ్డు మీదే దాదాపు 200 ట్రావెల్స్ బస్సులు నిలిపి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను ఎక్కించుకోవడం రోజూ కనిపించే దృశ్యం. అయినా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి పైనుంచి వచ్చే ఒత్తిళ్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యాటక రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు టూరిజాన్ని ప్రోత్సహిస్తున్న అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరిలలో రవాణా శాఖ ట్యాక్స్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఏడాదికి ఒక బస్సుకు రూ. 17 వేలు చెల్లించి ఆలిండియా పర్మిట్ పొందవచ్చు. అదే తెలుగు రాష్ట్రాల్లో పర్మిట్లు పొందాలంటే మూడు నెలలకోసారి బస్సులో ఒక్కో సీటుకు ఏపీలో అయితే రూ. 3,750, తెలంగాణలో రూ. 3,675 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ట్రావెల్స్ తమ బస్సుల్ని అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. నిజానికి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించి పర్మిట్ పొందాలంటే ఆ రాష్ట్రం మీదుగాకానీ, ఆ రాష్ట్రంలోగానీ బస్సులు తిరగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్ ఆ పర్మిట్లతో ఏపీ, హైదరాబాద్‌ల నుంచి.. షిర్డీ, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు బస్సుల్ని తిప్పుతున్నారు. అక్రమ బస్సులపై ఎన్ఫోర్సుమెంట్ తనిఖీలు చేయాలని రవాణా శాఖను ఆదేశిస్తామని ఆశాఖ మంత్రి ప్రకటనలు దండగలా మారాయని ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్లులో ఘోర బస్సు ప్రమాదాలు.. 2017 ఫిబ్రవరి 28న భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురై 10 మంది మృత్యువాత పడ్డారు. 2016 సెప్టెంబర్ 16న హైదరాబాద్ నుంచి షిర్డీ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సు కర్ణాటక దగ్గర హుమ్నాబాద్ వద్ద తగులబడి పోయింది. ఈ మంటల్లో చిక్కుకుని తణుకు ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి విహాన్ సజీవ దహనమయ్యాడు. అనుమతి లేని, సురక్షితం కాని స్లీపర్ బస్సులో ప్రయాణించడం వల్లే ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. 2013 అక్టోబర్ 30న బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమయ్యారు. 2012 జూన్ 16న షోలాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై షిర్డీ వెళుతున్న కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడి 32 మంది భక్తులు మరణించారు. -
ప్రమాదకర ప్రయాణం
- ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యం - కండీషన్ లేని బస్సులు - నైపుణ్యం లేని డ్రైవర్లు - ఒక డ్రైవర్‌తోనే సుదూర ప్రాంతాలకు.. - పరిమితికి మించి ప్రయాణికులతో రాకపోకలు - తరచూ ప్రమాదాలతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు అధికారిక లెక్కల ప్రకారం గతేడాది రోడ్డు ప్రమాదాలు : 1394 మృతిచెందిన వారి సంఖ్య : 637 గాయపడిన వారు : 2084 అనధికార లెక్కల ప్రకారం : రెట్టింపు స్థాయిలో బాధితులు - ఫిబ్రవరి 15న తనకల్లు మండలం దేవళంతండా సమీపంలోని మలుపు వద్ద జీటీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు పల్టీలు కొట్టింది. కర్ణాటకలోని బాగేపల్లి నుంచి అనంతపురానికి 40 మంది ప్రయాణికులతో ఈ బస్సు బయలుదేరింది. అతివేగంగా వస్తున్న సమయంలో టైరు పంక్చర్ కావడంతో ఈ ఘటన జరిగింది. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. - జనవరి 5న పామిడిలోని అంబేడ్కర్ సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగమ్మ అనే మహిళ మృత్యువాత పడింది. తన భర్త సుంకన్నతో కలిసి సైకిల్‌పై కూలిపనులకు వెళుతండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టి సుంకమ్మపై దూసుకెళ్లింది. దీంతో ఆమె మాంసపు ముద్దలా తయారైంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అనంతపురం సెంట్రల్ : ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ధనార్జనే ధ్యేయంగా భావించిన కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. అరకొర సిబ్బందితో సుదూర ప్రాంతాలకు సర్వీసులు నడుపతుండటమే కాకుండా.. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సురక్షిత ప్రయాణానికి చిరునామా అయిన ఆర్టీసీ సంస్థను దెబ్బతీసేందుకు పలువురు ట్రావెల్స్ నిర్వాహకులు కుట్ర పన్నుతున్నారు. జిల్లాలో సగటున జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే ఆర్టీసీ బస్సులకంటే ప్రైవేటు వాహనాల ప్రమాదాలే అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీలో శిక్షణ తీసుకున్న డ్రైవర్లు పనిచేస్తున్నారు. కానీ తక్కువ జీతం కోసం కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నైపుణ్యం లేని వారితో బస్సులు నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. కొన్ని ట్రావెల్స్ ఈ నిబంధనను తుంగలోకి తొక్కుతున్నాయి. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి ప్రతి రోజూ దాదాపు 25 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు హెదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు తిప్పుతున్నాయి. ప్రతి స్టేజీలోనూ ప్రయాణికులను తామే ఎక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో అతివేగంగా బస్సులు నడుపుతున్నారు. వీటికి తోడు ఆటోలు, జీపులు తదితర ప్రైవేటు వాహనాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆర్టీసీబస్సులు లేని గ్రామీణ ప్రాంతాలకు వందలాది ప్రైవేట్ వాహనాలు ప్రజలను తీసుకెళుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం అనుభవం లేని డ్రైవర్లు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిట్నెస్ లేని వాహనాలు అనేకం : జిల్లాలో అనేక వాహనాలు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. రోడ్డు రవాణా శాఖ అధికారుల కళ్లుగప్పి రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం సరుకు రావాణా ఉపయోగించే గూడ్స్ వాహనాలే ఉన్నాయి. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు కాంట్రాక్టు క్యారేజ్ పేరుతో అనుమతి ఒకదానిపై తీసుకుని వేరే వాహనాలను కూడా తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న వాహనాల వివరాలు ట్రాక్టర్ ట్రాలీలు - 452 గూడ్స్ లారీలు - 639 గూడ్స్ వ్యాన్లు - 49 మ్యాక్సిక్యాబ్‌లు - 78 మోటార్క్యాబ్లు - 28 త్రీవీలర్స్ గూడ్స్ వాహనాలు - 313 -
ప్రైవేట్ ట్రావెల్స్‌కు కొమ్ముకాస్తున్నారు
సోమందేపల్లి : ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్‌కు కొమ్ముకాస్తోందనీ, అందుకే ఆర్టీసీ నష్టాలబాటలో కూరుకుపోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విమర్శించారు. సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
ఒంగోలులో ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య ఘర్షణ
-
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా
ఎల్బీనగర్: పండగ వేళ తీవ్ర రద్దీగా ఉన్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డిజిల్లా హయత్‌నగర్ పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగురోడ్డు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 28 బస్సులను గుర్తించి.. కేసులు నమోదు చేశారు. -
పల్లెటూర్
పల్లెబాట పట్టిన నగరం రైళ్లు, బస్సులు కిటకిట ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపర్వం ఏయూలో అలరించిన పండుగ సంబరాలు పండుగ సెలవులిచ్చేశారు. తెల్లారితే భోగి పండుగ..దాంతో నగరం సొంతూరికి పయనమైంది... బస్టాండు, రైల్వేస్టేషన్ కిటకిటలాడాయి. క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడి టికెట్లు కొనుక్కొని రైళ్లు, బస్సులపైకి జనం ఎగబడ్డారు. పండుగ రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా.. రద్దీని అవి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు దోపిడీకి పాల్పడుతున్నారు. అదిరిపోయే రేట్లతో బెదరగొడుతున్నారు. అయినా సరే ప్రయాణికులు వాటిని ఆశ్రయించక తప్పడంలేదు. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో పల్లె వాతావరణం సృష్టించాయి. ధింసా నృత్యాలు.. తప్పెటగుళ్లు.. సంప్రదాయ పిండివంటల ఘుమఘుమలు.. బొమ్మలకొలువులు.. భోగిమంటలు.. ముగ్గుల పోటీలతో ఏయూ మైదానం అచ్చమైన తెలుగు పల్లెను తలపించింది. ఆటపాటలు, పోటీలతో హోరెత్తింది.. విశాఖపట్నం : సంక్రాంతి పండగను సొంత ఊళ్లల్లో జరుపుకోవడానికి నగరం నుంచి భారీ ఎత్తున ప్రజలు ప్రయాణæమవుతున్నారు. సిటీలో పుట్టిపెరిగిన వారు సైతం బంధువులు, స్నేహితుల ఊళ్లకు పయణమవుతున్నారు. దీంతో గురువారం నగరమంతా సందడి సందడిగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఆర్టీసీ 600 రెగ్యులర్, 95 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రైళ్లకు ఆ శాఖ అదనపు బోగీలు ఏర్పాటు చేసింది. బస్సుల్లో సుమారు 6 లక్షల మంది, రైళ్లల్లో సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు నగరం నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీకి గురువారం ఒక్కరోజే రూ.95 లక్షల ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లో కంటే ఇది సుమారు రూ.20 లక్షలు అదనం. రద్దీతో తప్పని తిప్పలు తాటిచెట్లపాలెం : రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉండడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. సంతోషంగా గడపాల్సిన పండగకు వ్యయ ప్రయాసలతో వెళుతున్నారు. దీనికి తోడు ఎప్పటిలాగే రైల్వే శాఖ వేసిన అరకొర రైళ్లతో ప్రయాణంలో సీట్లు రిజర్వుగాక, జనరల్‌లో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. చార్జీల భారాన్ని భరించలేక సాధారణ జనం విసుగు చెందుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు జేబుదొంగలు రద్దీని ఆసరా చేసుకొని తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రైల్వే పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఆర్పీఎఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటునట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సొంతూరులో సంతోషాలు తెలుగు వారి పండగల్లో అత్యంత విశిష్టత కలిగిన సంక్రాంతి పండగను ఎవరికి వారు తమ స్వగ్రామాల్లో జరుపుకోవాలనుకుంటుంటారు. బంధు మిత్రులతో, పిండి వంటలతో అత్యంత శోభాయమానంగా ఉండే పల్లె లోగిళ్లలో సంబరాలు చేసుకోవాలనుకుంటారు. అందుకే సొంత ఊరికి వెళ్లేది ఏడాదికి ఒక్క సారే అయినా సంక్రాంతికే వెళ్లాలనుకుంటారు. విశాఖ నగరానికి జిల్లా నలుమూల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది విద్య, ఉపాధి, ఉద్యోగ అవసరాల కోసం వస్తుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు పలు కళాశాలల్లో ఇతర ప్రాంతాల విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. వారంతా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉపాధి కోసం కూడా విశాఖ నగరానికి ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. ప్రైవేటు సంస్థలు కూడా సిబ్బందికి సెలవులు ఇవ్వడంతో వారు సొంతూరులో సంతోషాలు పంచుకోవడానికి వెళ్లారు. విశాఖలో ఈ సారి పండుగ ఆఫర్లు హోరెత్తడంతో కొత్త దుస్తులు, గృహోపకరణలు, కానుకలు కొనుగోలు చేసి తమ వారికి తీసుకుని వెళ్లారు. -
సంక్రాంతి తర్వాత అడ్డుకుంటాం : శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తాము ట్రావెల్స్ బస్సులను అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోకపోతే సంక్రాంతి పండుగ తర్వాత రోడ్లపైకి వచ్చి ట్రావెల్స్ బస్సులను అడ్డుకుంటామని ఆయన అన్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ల పండుగ దందా !
-
బాబ్బాబూ.. బస్సులు పంపండి!
– సీఎం సభకు బస్సులు సమకూర్చడంలో ఆర్టీఏ అధికారులు తలమునకలు – చినబాబు సభ బిల్లులే ఇవ్వలేదంటూ ట్రావెల్స్ యజమానుల అసహనం అనంతపురం సెంట్రల్ : ఈనెల 2న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు జనాన్ని తరలించేందుకు బస్సులను సమకూర్చేందుకు రోడ్డు రవాణాశాఖ (ఆర్టీఏ) అధికారులు తలమునకలవుతున్నారు. శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడు హంద్రీనీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయడానికి జిల్లాకు రానున్నారు. అనంతరం మడకశిరలో డ్వాక్రా మహిళలతో సమావేశం ఉంటుంది. దీంతో జిల్లా పర్యటన విజయవంతం చేయడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. జిల్లా నలుమూలల నుంచీ జన సమీకరణకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు సమకూర్చాలని ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనకు బస్సులు సమకూర్చారు. నెలలు తిరక్కనే మళ్లీ సీఎం పర్యటన ఉండటంతో బస్సులు సమకూర్చలేక ఆర్టీఏ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల చినబాబు పర్యటనకు సంబందించి వాహనాలు చెందిన బిల్లులు ఇవ్వలేదు. మళ్లీ తాము ఏర్పాటు చేయలేమంటూ కొందరు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు బాహాటంగానే పేర్కొంటున్నట్లు సమాచారం. ఇటీవల స్వైప్ మిషన్లు ఏర్పాటు విషయంలో ట్రావెల్స్ నిర్వాహకులతో ఆర్టీఏ అధికారులు సమావేశం నిర్వహించారు. దీంతో అధికారులతో కొందరు ట్రావెల్స్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వీఐపీలు ఎవరొచ్చినా మమ్మల్ని వాడుకుంటారు.. మా సమస్యలు మాత్రం పట్టించుకోరంటూ’ ఓ నిర్వాహకుడు అధికారి ఎదుట వాపోయారు. ప్రస్తుతం డీజిల్‌కు సంబంధించి కూడా బిల్లులు ఇవ్వకపోవడంతో తమతో కాదని కొందరు చేతులెత్తేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకూ ట్రావెల్స్ నిర్వాహకులతో చర్చలు జరిపితే 10 బస్సులు సమకూరినట్లు తెలిసింది. గురువారంలోపు ఎన్ని బస్సులు సమకూరుతాయో తేలాల్సి ఉంది. అనుకున్న మేరకు సమకూరకపోతే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను మళ్లించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయం సమాచారం. -
కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికుల ఇక్కట్లు
పిట్టలవానిపాలెం/బాపట్ల (గుంటూరు): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 54 మంది యాత్రికులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మోసగించడమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఒకరైన గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం జెడ్పీటీసీ సభ్యుడు చిరసాని నారపరెడ్డి ఫోన్లో తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా నుంచి 20 మంది, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ నుంచి 34 మంది హైదరాబాద్ ఆర్కే ట్రావెల్స్ నుంచి బద్రినాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ నెల 16న టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 54 మంది యాత్రికులను కేదార్‌నాథ్‌లోని రుద్రప్రయాగ జిల్లా వరకు తీసుకెళ్లారు. ఒప్పం దం ప్రకారం అక్కడి నుంచి బద్రినాథ్‌కు హెలికాఫ్టర్‌లో ట్రావెల్స్వారే తీసుకెళ్లాల్సి ఉంది. అక్కడ దించేసిన తర్వాత వారి గురించి పట్టించుకున్ననాథుడే లేకుండా పోయారు. ట్రావెల్స్ వారికి ఫోన్ చేస్తే సరైన సమాధానం చెప్పకపోవడంతో న్యాయం చేయాలంటూ యాత్రికులు రుద్రప్రయాగ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈలోగా కొంతమంది యాత్రికులు దారి తెలియక తలో దిక్కు అయ్యారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి యాత్రికులందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని కోరామని ఆయన చెప్పారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేయూత గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి కేదార్నాథ్ యాత్రకు వెళ్లి దిక్కుతోచని స్థితిలో ఉన్న పలువురు యాత్రికులను బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆదుకున్నారు. ట్రావెల్స్ సిబ్బంది చేతులెత్తేయడంతో మరి కొందరు కనిపించకుండా పోవడాన్ని నారపరెడ్డి.. ఎమ్మెల్యే కోనరఘుపతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఢిల్లీలోని ఏపీ భవన్ ఇన్చార్జి శ్రీకాంత్‌తోపాటు రుద్రప్రయాగలోని ఎస్పీ ప్రహ్లాద్ మీనన్‌తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. యాత్రికులందరిని గుప్తకాశీ ప్రాంతంలో సురక్షితంగా ఉంచడంతోపాటు గురువారం కొన్ని ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. -
ప్రణయ్ కళ్లను దానం చేసిన తల్లిదండ్రులు
విజయవాడ: గొల్లపూడి ప్రమాదం ఘటనలో మృతిచెందిన ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థి మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం విద్యార్థి ప్రణయ్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. కొడుకు చనిపోయాడన్న పుట్టెడు దు:ఖంలోనూ ప్రణయ్ కళ్లను ఆ తల్లిదండ్రులు స్వేచ్ఛ ఐ బ్యాంకుకు దానం చేశారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
పదేళ్ల అనుభవం ఉందంటూ.. ఢీకొట్టాడు!
విజయవాడ: గొల్లపూడి ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మీడియా సంప్రదించింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఓ విద్యార్థి మాట్లాడుతూ.. తాను రెండో వరుస సీట్లో కూర్చున్నానని, తన ముందు, పక్కన కూర్చున్న ఇద్దరు చనిపోయారని చెప్పాడు. తన ముందు కొందరు సీనియర్స్ నిల్చున్నారని, వారి వెనకాల తాను రెండో సీట్లో కూర్చున్నా ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపాడు. డ్రైవర్ మద్యం తాగి బస్సు నడుపుతున్నట్లు అనిపించిందని, దానిపై అనుమానంతో కొందరు విద్యార్థులు ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే.. డ్రైవర్‌ను మారుస్తామని హామీ ఇచ్చారని.. అయినా మార్చకపోవడంతో సూరయ్యపాలెం వద్ద బస్సును ఆపాలని కోరినా డ్రైవర్ పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. తాము ప్రయాణిస్తున్న ధనుంజయ ట్రావెల్స్ బస్సు గొల్లపూడికి రాగానే డ్రైవర్ కంట్రోల్లో లేడని అర్థమయిందన్నాడు. మరో విద్యార్థి మాట్లాడుతూ.. తమ సీనియర్లు డ్రైవర్ ను వేగంగా వెళ్లవెద్దని వారించినా అతడు వినపించుకోలేదని చెప్పాడు. డ్రైవర్ కంట్రోల్ తప్పినట్లు గ్రహించిన సీనియర్స్ ముందుగానే వేరే డ్రైవర్ ను ఏర్పాటుచేసుకున్నారని, కానీ అతడు వచ్చేలోపే ఘోరం జరిగిపోయి తమ కాలేజీ మిత్రులు నలుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. బస్సును ఆపాలని సీనియర్లు డ్రైవర్‌ను కోరగా, తనకు పదేళ్ల అనుభవం ఉందంటూ బస్సు వేగాన్ని మరింత పెంచడంతోనే చెట్టును ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. తన మిత్రులు మరికొంత మంది పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని వివరించాడు. -
డ్రైవర్ తీరుపై ముందే డౌట్ వచ్చింది..
విజయవాడ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పినట్లు సమాచారం అందింది. ప్రమాదానికి ముందే డ్రైవర్ వ్యవహారంపై తమకు అనుమానం తలెత్తిందని విద్యార్థులు చెబుతున్నారు. శివ్వరూప్ అనే విద్యార్థి డ్రైవర్ తీరుపై అనుమానం వచ్చి ట్రావెల్స్ వాళ్లకు కాల్ చేసినట్లు తెలిపాడు. వేరే బస్సు డ్రైవర్ కోసం తాము కాల్ చేసినట్లు చెప్పాడు. అయితే, తాను పదేళ్ల నుంచి డ్రైవర్ గా చేస్తున్నానని, తాను ఇదే విధంగా డ్రైవ్ చేస్తానని ఏ అనుమానాలు పెట్టుకోవద్దని డ్రైవర్ విద్యార్థులకు సర్దిచెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. గొల్లపూడి నుంచి కొంతదూరం వెళ్లగానే బస్సును ఆపివేయాలని తాము అరుస్తున్నా డ్రైవర్ పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు తమ అరుపులను మరింత పెద్దవి చేయగా, ఆ తొందర్లో డ్రైవర్ వేముల శివ మరింత వేగంగా నడపడం మొదలుపెట్టాలని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వివరించారు. కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి లక్ష్మారెడ్డి
విజయవాడ: ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు స్పోర్ట్స్ కోసం అమలాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి ఆయన వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెట్టుకు ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు ఐసీయూలో ఉన్నారని, మరో ఇద్దరు విద్యార్థులకు సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, చనిపోయిన విద్యార్థులను ఆదుకోవడానకి సీఎం కేసీఆర్ తో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. స్పోర్ట్స్ ఈవెంట్ సజావుగానే సాగిందని, చివర్లో ట్రావెల్స్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. వైద్యులు అనుమతి విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకొచ్చి చికిత్స అందించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. -
గొల్లపూడి ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విజయవాడ: గొల్లపూడి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వైఎస్ జగన్ కోరారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆరుగురు ఐసీయూలో ఉండగా, ఇద్దరు విద్యార్థులకు శస్త్రచికిత్సలు జరిగాయి. మరికొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. -
గొల్లపూడి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
విజయవాడ: కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదం ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం, సహాయక చర్యలను పర్యవేక్షించాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. మృతిచెందిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులకు కేసీఆర్ సానుభూతి తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరో 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్), విజయ్ తేజ (కుత్బుల్లాపుర్), ఉదయ్ (కరీంనగర్), గిరి లక్ష్మణ్ (ఆదిలాబాద్), డ్రైవర్ వేముల శివయ్య లను మృతులుగా గుర్తించారు.