సార్వత్రిక ఎన్నికల దృశ్య సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యా ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు మంగళ, బుధ వారాల్లో ఫుల్ అయిపోయాయి. రైళ్లలో కూడా రద్దీ పెరిగింది. సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులు.. ఎంజీబీఎస్‌లో పడిగాపులు కాస్తున్నారు.