RTC buses
-
కొత్తగా 500 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కొత్తగా 500 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలులోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. ఈ సంఖ్య 35 లక్షల నుంచి 66 లక్షలకు పెరిగింది. దీంతో బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా 500 బస్సులు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించబోతోంది. కనీసం 4 వేలు అవసరం.. ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతం దాటుతోంది. ప్రత్యేక సందర్భాల్లో అది 106 శాతాన్ని మించుతోంది. ఇప్పటికే చాలా బస్సులు పాతవై మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. పాత బస్సుల్లో దాదాపు వేయి వరకు తొలగించాల్సి ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు నాలుగు వేల బస్సుల అవసరం ఉంది. కానీ అన్ని సమకూర్చుకునే పరిస్థితి ఆర్టీసీకి లేదు. దీంతో కొన్నికొన్ని బస్సులు పెంచుకుంటూపోవాలని సంస్థ భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే తిరిగేలా చూడాలని ఆదేశించటంతో ఆమేరకు చర్యలు ప్రారంభించింది. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు కోరుతోంది. 2800బస్సులు మంజూరు చేయాలని దరఖాస్తు చేసింది. అవన్నీ సబ్సిడీ ద్వారా సరఫరా అవుతాయి. ఆర్టీసీ సొంతంగా వాటిని కొనదు. జీసీసీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలు వాటిని టెండర్ల ద్వారా పొంది ఆర్టీసీకి అద్దెకిస్తాయి. అవి దశలవారీగా ఆర్టీసీకి చేరుతాయి. అవి వచ్చే కొద్దీ వాటి సంఖ్యకు సమానంగా నగరంలోని డీజిల్ బస్సులను జిల్లాలకు తరలిస్తారు. జిల్లాలకు తరలే బస్సుల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులే ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులుగా మార్పుచేసి జిల్లాల్లో వాడతారు. దీనివల్ల కొంత కొరత తీరుతుంది. ఇక సొంతంగా కొత్త బస్సులు 500 కొంటే చాలావరకు సమస్య పరిష్కారమవుతుందని సంస్థ భావిస్తోంది. వాటి కొనుగోలుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరబోతోంది. ఆ సిబ్బంది కొత్త బస్సులకు...హైదరాబాద్‌లో తిరుగుతున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవాలన్న నిర్ణయంతో పెద్ద సంఖ్యలో సిబ్బంది మిగిలిపోనున్నారు. అద్దె బస్సులకు డ్రైవర్లు, మెకానిక్‌లు ప్రైవేటు వారే ఉండనున్నందున ఆర్టీసీ సిబ్బంది జిల్లాలకు తరలాల్సి ఉంటుంది. జిల్లాల్లో ఉన్న ఖాళీలు భర్తీ కాగా, మిగతావారు అదనంగా మారతారు. ఇప్పుడు కొత్తగా కొనే ఐదొందల బస్సులకు దాదాపు 1,300 మంది సిబ్బంది అవసరమవుతారు. ఆ అదనపు సిబ్బందిని ఈ బస్సులకు వినియోగించుకోవటం ద్వారా సర్దుబాటు చేస్తారు. ఇక మరో 3 వేల మందిని కొత్తగా నియమించుకునే ప్రతిపాదన పెండింగులో ఉంది. అలా వచ్చే వారిని కూడా ఈ కొత్త బస్సులతోపాటు ఇతరత్రా ఖాళీల్లో భర్తీ చేస్తారు. -
ఖర్చులు వెల్లడిస్తాం
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరకు చేసిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తామని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను సోమవారం దర్శించుకున్న అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. జాతరకు డబ్బు లేదనకుండా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశామన్నారు. గత ప్రభుత్వం జాతరకు మూడు వేల బస్సులను నడిపితే.. ఈ ప్రభుత్వం ఆరువేల బస్సులు నడుపుతోందన్నారు. ఇప్పటివరకు వనదేవతలను 17 లక్షల మంది మహిళలు దర్శించుకున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ రానంతమంది ఈసారి జాతరకు వచ్చిపోతున్నారని, వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. క్రమశిక్షణ, స్వీయ రక్షణతో జాతరకు వచ్చివెళ్లాలని, వాహనాలను ఓవర్టేక్ చేసి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. -
TSRTC: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించనుండటంతో సాధారణ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈసారి జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారీ సంఖ్యలో బస్సులను సమకూర్చింది. 4,479 ఆర్టీసీ బస్సులతో పాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు మరో 1,500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల సేవలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నిర్దిష్ట ప్రాంతాలకు తరలిపోవడంతో బస్స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికుల తిప్పలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం. ‘మహాలక్మి’తో పెరిగిన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులో ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మహిళల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఆటోలు లాంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారిలో 90 శాతం మంది బస్సుల వైపు మళ్లారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఫలితంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి ఇన్ని బస్సులు అందుబాటులో లేకుండాపోతే పరిస్థితి గందరగోళంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిరోజే అవస్థలు రాష్ట్రంలోని 51 కేంద్రాల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడవాల్సి ఉంది. దీంతో విడతల వారీగా బస్సులు ఆయా కేంద్రాలకు తరలిపోతున్నాయి. సోమవారం దాదాపు 550 బస్సులు వెళ్లాయి. హైదరాబాద్ నగరం నుంచి కూడా 250 బస్సులు వెళ్లిపోయాయి. సాధారణంగా సోమవారాల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్పేర్ బస్సులు సహా అన్ని బస్సులను తిప్పినా ఆ రోజు రద్దీని తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. గత సోమవారం ఏకంగా 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో తిరిగారు. ఈ సోమవారం కొన్ని బస్సులు మేడారం జాతరకు వెళ్లిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. బస్సులు సరిపోక తోపులాటలు చోటు చేసుకున్నాయి. నగరంలో ఫుట్‌బోర్డులపై వేళ్లాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఇక బుధవారం నుంచి మిగతా బస్సులు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సాధారణ రోజుల్లోలాగే బుధవారం తర్వాత కూడా రద్దీ ఉంటే మేడారం డ్యూటీ బస్సుల్లో కొన్నింటిని తిరిగి వాపస్ పంపే యోచనలో ఉన్నారు. కానీ మేడారం ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి రైల్వే అధికారులు 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు. ఒక రైలులో 1,500 మంది ప్రయాణికులు వస్తారు. మేడారం వరకు రైల్వే లైన్ లేనందున ఎక్కువ మంది కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో దిగుతారు. దీంతో రైలు వచ్చే సమయానికి ఒక్కో స్టేషన్ వద్ద 30కి పైగా బస్సులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద వచ్చే ఆదివారం వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. 👉: తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సులు హౌస్‌ఫుల్ (ఫొటోలు) -
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
మహా రద్దీ..
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. ‘మహాలక్ష్మి’తర్వాత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 13 లక్షల మేర పెరిగింది. గతంలో 66 శాతంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 90 శాతానికి చేరుకుంది. కొన్ని మార్గాల్లో అది వందశాతం కూడా దాటింది. అంటే సీట్ల సామర్థ్యం కంటే ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులు 70 శాతం సీట్లలో కూర్చుంటున్నారు. దీంతో మిగతా మహిళలు, పురుషులు నిలబడే ప్రయాణించాల్సి రావడం వివాదాలకు కారణమవుతోంది. బస్సులు సరిపోక... పెరిగిన రద్దీని క్రమబద్ధికరించాలంటే బస్సుల సంఖ్య భారీగా పెంచాలి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సగటున 41 లక్షల మంది, రద్దీ ఎక్కువగా ఉండే సోమవారాల్లో 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉంటోంది. మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంది. ఈ కేటగిరీ బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 7292 బస్సులు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఆర్టీసీ డిపోల్లో ఉన్న అన్ని బస్సులు రోజూ రోడ్డెక్కవు. వాటిల్లో కొన్ని బ్రేక్‌డౌన్‌లో ఉంటాయి. కొన్ని ఇతర అవసరాల కోసం స్పేర్‌లో ఉంటాయి. సాధారణ రోజుల్లోనే బస్సులు సరిపోక ట్రిప్పులకు ఇబ్బంది అవుతూ వస్తున్న తరుణంలో, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అమలులోకి రావటంతో బస్సులకు ఒక్కసారిగా తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వంద శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుండటంతో అదనపు ట్రిప్పు నడపాల్సి వస్తోంది. కానీ బస్సులు అందుబాటులో లేక సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఫలితంగా, ప్రయాణికులతో కిక్కిరిసి నడపాల్సి వస్తోంది. స్థలం సరిపోక కొందరు ప్రయాణికులు దిగిపోవాల్సి వస్తోంది. దీంతో అదనపు బస్సు నడపాలంటూ వారు సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు 4 వేల బస్సులు కావాల్సిందే.. ప్రస్తుత రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఇప్పటికిప్పుడు దాదాపు 4 వేల వరకు కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. గతంలోనే ఆర్టీసీ రెండు వేల బస్సులకు ఆర్డరిచ్చింది. వాటిల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు 1,500 వరకు ఉంటాయి. కానీ ఆ బస్సులు అందుబాటులోకి రావాలంటే ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది. వచ్చే మార్చి చివరి నాటికి అవి దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మరో 20 రోజుల్లో 50 బస్సులు అందనున్నాయి. కానీ అప్పటి వరకు ఈ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రయాణికులు–ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని సంతోషపడుతున్నా.. రోజూ నిలబడి ప్రయాణించటం ఇబ్బందిగా భావించేవారు మళ్లీ ఆటోల వైపు మళ్లుతారు. దీంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో కొంత పడిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే నాలుగు వేల బస్సులు కావాలి. కానీ, అన్ని బస్సులు సమకూర్చుకోవటానికి ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త బస్సుల అంశాన్ని ప్రస్తావించలేదు. ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా.. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. వాటిలో 500 బస్సులు సిటీ సర్వీసులుగా తిరుగుతాయి. నగరంలో ఓఆర్ 90 శాతాన్ని దాటింది. అంత లోడ్‌ను ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. లాగినా, బ్యాటరీలు ముందుగానే డిస్ఛార్జి అవుతాయని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అద్దె బస్సుల నోటిఫికేషన్ సమస్య నుంచి గట్టెక్కాలంటే వెంటనే కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఆర్టీసీ అధికారులు మరోసారి అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అద్దె బస్సులు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ప్రస్తుతం రద్దీ విపరీతంగా పెరిగినందున, పాత అద్దె రేట్లకు బస్సులు పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు సుముఖంగా లేరు. అద్దె చార్జీలు సవరించాలని కోరుతున్నారు. సవరిస్తే ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుంది. వారంలో 50 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్ కొత్తగా వచ్చే బస్సుల నమూనాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం పరిశీలించారు. వాటిల్లో లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. సంక్రాంతి నాటికి 200 బస్సులు రోడ్డెక్కుతాయని, వీటిలో 50 బస్సులు వారం రోజుల్లో అందుతాయని సజ్జనార్ వెల్లడించారు. నాలుగైదు నెలల్లో విడతలవారీగా 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని, 540 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు, నగరం వెలుపల తిరిగేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుతాయని వెల్లడించారు. -
‘మండే’ మహాలక్ష్మి@ 31లక్షలు
‘‘సోమవారం ఒక్కరోజే ఆర్టీసీ బస్సుల్లో 51 లక్షల మంది ప్రయాణించారు... ఇది ఆర్టీసీ చరిత్రలోనే ఒక రికార్డు... అందులోనూ మహిళల సంఖ్య 31 లక్షలు ఉండటం కనీవినీ ఎరుగని రికార్డు’’ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాకే ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో ఇలా నిండిపోతున్నాయి. సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆరు గార్యంటీల్లో భాగంగా ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో వాస్తవరద్దీ ఎంత ఉంటుందో అంచనా వేయటం కష్టం. సాధారణ రోజుల్లో కంటే సోమవారాల్లో బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆరోజు దాదాపు 35 లక్షల మంది వరకు బస్సుల్లో ప్రయాణిస్తారు. సాధారణ రోజుల్లో ఆ సంఖ్య 28 లక్షల మేర ఉంటుంది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజువారీ ఆదాయం రూ.14 లక్షలుంటే, సోమవారాల్లో రూ.18 లక్షల వరకు ఉంటుంది. అలాంటిది 11వ తేదీ సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో ఏకంగా 51 లక్షల మంది ప్రయాణించినట్టు ఆర్టీసీ లెక్క తేల్చింది. ఇందులో టికెట్ తీసుకున్న ప్రయాణికుల సంఖ్య 20.87 లక్షలుగా పేర్కొంది. అంటే మిగతావారు మహిళలే అని స్పష్టమవుతోంది. ఒక్కరోజే రూ.7 కోట్లు తగ్గిన ఆదాయం: సోమవారాల్లో రద్దీకి అనుగుణంగా ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. సగటున రూ.18.50 కోట్ల మేర ఆదాయం వస్తుంది. ఈ సోమవారం ప్రయాణికుల సంఖ్య 51 లక్షలు నమోదైనందున ఆదాయం కూడా భారీగానే పెరగాలి. కానీ ఇందులో మహిళల సంఖ్య 60 శాతానికి పైగా ఉన్నందున ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వారి నుంచి నయా పైసా ఆదాయం రాలేదు. దీంతో ఈ సోమవారం కేవలం రూ.11.74 కోట్ల ఆదాయం మాత్రమే రికార్డయ్యింది. జీరో టికెట్ విధానం వస్తేనే కచ్చితమైన లెక్కలు మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమే అయినా, టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తారో ఆ వివరాలతో కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. టికెట్‌పై చార్జీ స్థానంలో సున్నా అని ఉంటుంది. కానీ, వాస్తవానికి వారి నుంచి ఎంతచార్జీ వసూలు చేయాల్సి ఉందో ఆ టికెట్ ద్వారా అధికారులకు తెలుస్తుంది. నెల ముగియగానే ఆ టికెట్ల మొత్తాన్ని గుణించి ప్రభుత్వానికి అందిస్తే అక్కడి నుంచి రీయింబర్స్ అవుతుంది. ప్రస్తుతం టికెట్ జారీ యంత్రాల సాఫ్ట్వేర్ ఇంకా అప్డేట్ కానందున జీరో టికెట్ జారీ కావటం లేదు. మహిళల సంఖ్య కండక్టర్లు మాన్యువల్‌గా లెక్కించి రాస్తున్నారు. దీంతో వారి సంఖ్యలో కొంత తేడా ఉండే అవకాశం ఉంది. -
ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ఆర్టీసీకి మంచి బేరం దొరుకుతోంది. ఆర్టీసీ బస్సుల బుకింగ్ రాజకీయ పార్టీలకు మంచి వెసులుబాటుగా ఉంటుండగా, సంస్థకు సైతం లాభసాటిగా మారుతోంది. గత నెల రోజుల వ్యవధిలోనే రాజకీయ పార్టీలు తమ సభలకు దాదాపు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి. భలే మంచి ఆదాయ మార్గం.. ఆర్టీసీ బస్సులకు పండుగ రోజులు, శుభ ముహూర్తాలున్న రోజుల్లోనే ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటుంది. మిగతా రోజుల్లో సగటున 62 శాతం నుంచి 65 శాతం వరకు ఉంటుంది. అయితే, రాజకీయ సభలకు బస్సులను అద్దెకిస్తే మంచి ఆదాయం వస్తుంది. వారికి అద్దెకిచ్చిన సమయంలో బస్సుల్లో ఎంతమంది ఎక్కారన్న సంఖ్యతో నిమిత్తం లేకుండా.. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోను లెక్కగడ తారు. అంటే.. ప్రతి సీటుకు టికెట్ జారీ చేసినట్టన్న మాట. ఈ లెక్కన ఒక్కో బస్సుకు రూ.20 వేల నుంచి 24 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం దసరా పండుగ రద్దీ అధికంగా ఉంది. మరమ్మతుల కోసం డిపోలకే పరిమితమైన బస్సులను కూడా సిద్ధం చేసి ప్రయాణికుల కోసం పంపుతుంటారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణ రోజుల్లో వీలైనన్ని బస్సులను అధికారులు పార్టీలకు కేటాయిస్తున్నారు. పార్టీలకు అద్దెకివ్వటం ద్వారా ఆదాయం ఎక్కువగానే వస్తున్నా.. ఆర్టీసీ మాత్రం తొలి ప్రాధాన్యం ప్రయాణికుల సేవకే ఇస్తుండటం విశేషం. గత నెల కొల్లాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. దానికి దాదాపు 2 వేల బస్సులను బుక్ చేశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల మొదటి వారంలో రెండు రోజుల తేడాతో రెండు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారు. ఆ సందర్భంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో భారీ బహి రంగ సభలు నిర్వహించారు. వీటికి దాదాపు రెండు వేల బస్సులను బుక్ చేశారు. రాహుల్‌గాంధీ ఇటీ వల తెలంగాణ పర్యటనలో నిర్వహించిన సభలకు కూడా ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తు న్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, జడ్చర్ల, భువనగిరి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్నింటికి ప్రైవేటు వాహనాలను బుక్ చేస్తే, కొన్నింటికి ఆర్టీసీ బస్సు లను బుక్ చేశారు. ఇటీవల కేంద్రమంత్రులు రాజ్ నాథ్‌సింగ్, అమిత్‌షాలు బహిరంగ సభలు నిర్వ హించారు. గత నెల రోజుల్లో అన్ని పార్టీలు దాదాపు 12 వేలకుపైగా బస్సులను బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఒక్కో బస్‌కు సగటున రూ.20 వేల చొప్పున చెల్లిస్తుండటంతో వీలైనన్ని బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఆదాయాన్ని పొందే ప్రయ త్నంలో ఆర్టీసీ ఉంది. దసరా, దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి లాంటి పండుగల వేళ ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ఆ సంస్థ 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో సిబ్బందికి ప్రత్యేక టార్గెట్లను కేటాయించింది. ఇందులో ఎన్నికల అంశాన్ని కూడా చేర్చటం విశేషం. రాజకీయ పార్టీలకు బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్న ఆదేశాలు మౌఖికంగా వెలువడ్డాయి. పార్టీలకు కూడా సౌలభ్యమే.. పెద్ద నేతలు పాల్గొన్న బహిరంగ సభలకు పార్టీ నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇందుకు వారికి వందల సంఖ్యలో వాహనాలు అవసరమవుతాయి. ప్రైవేటు వాహనాలను సమీకరించుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సులయితే కావాల్సినన్ని సిద్ధంగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవటం వారికి వెసులు బాటుగా మారింది. పైగా వ్యాన్లు లాంటి ప్రైవేటు వాహనాల ఖర్చుతో పోలిస్తే, ఆర్టీసీ బస్సుల ఛార్జీనే తక్కువగా ఉంటుంది. -
సీసీ కెమెరాలు తిప్పేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లను భయపెడుతున్నాయి. తమపై నిఘా కోసమే వాటిని ఏర్పాటు చేశారన్న అపోహలో ఉన్న డ్రైవర్లు గుట్టు చప్పుడు కాకుండా కెమెరాలను ఓ పక్కకు తిప్పేస్తున్నారు. దీంతో బస్సులోపల ప్రయాణికులు ఉండే భాగం కాకుండా, బస్సు గోడలు, కిటికీల ప్రాంతం కెమెరాల్లో రికార్డు అవుతోంది. తాజాగా బస్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అలాంటి డ్రైవర్లకు సీసీ కెమెరాలపై అపోహలు తొలగిపోయేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చర్యలు తీసుకుంటారన్న భయంతో..: ఇటీవలే ఆర్టీసీ దాదాపు 700 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సమకూర్చుకుంది. ఇప్పటి వరకు కొన్ని ఏసీ బస్సుల్లో తప్ప మిగతా ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు లేవు. బస్సులో ఏ ఘటన జరిగినా స్పష్టంగా తెలుసుకునే వీలు లేకుండా పోతోంది. దీంతో ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని భావించి, కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇలా కొత్త సూపర్ లగ్జరీ బస్సులను కంపెనీ నుంచి వచ్చినవి వచ్చినట్టు రోడ్డెక్కిస్తున్నారు. ఆ బస్సుల్లో లోపల డ్రైవర్ క్యాబిన్ ఎదురుగా ఒక కెమెరా, డ్రైవర్ క్యాబిన్ వెనక మరో కెమెరా ప్రయాణికులు కనిపించేలా ఉంటాయి. మరో కెమెరా బస్సు వెనక రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు సౌలభ్యం కలిగించేలా ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాబిన్ ముందువైపు ఉన్న కెమెరాను చూడగానే డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్ వేటు పడుతుండటమే దీనికి కారణం. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ వినియోగం సాధారణ విషయంగా మారింది. ఇంటి నుంచి కాల్ వచ్చినా, అత్యవసర పనులకు సంబంధించి ఫోన్ కాల్‌వచ్చినా డ్రైవర్లు మాట్లాడేస్తుంటారు. అయితే బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడటాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాగే కొందరిలో డ్రైవింగ్‌లో అప్పుడప్పుడు ఏమరపాటు వ్యక్తమవుతుంటుంది. ఇలాంటివన్నీ సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. ఇది తమపై చర్యలకు కారణమవుతుందేమోనన్నది డ్రైవర్ల భయానికి కారణంగా ఉంటోందని అధికారులంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు సంకటం.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అడ్వాన్సు టికెట్ బుకింగ్ సమయంలో డ్రైవర్ ఫోన్ నంబర్‌ను కూడా తెలియజేస్తారు. ప్రయాణికులు ఆ నంబర్‌కు ఫోన్ చేసి బస్సు ఎక్కడి వరకు వచ్చిందో వాకబు చేస్తుంటారు. కాగా, విశాఖపట్నం, బెంగళూరు లాంటి దూర ప్రాంతాల సర్విసులు మినహా మిగతా బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. ప్రయాణికుల నుంచి ఫోన్ కాల్ వస్తే అతనే మాట్లాడాల్సి వస్తోంది. ఇది రికార్డయితే, దానిని కూడా నేరంగా పరిగణిస్తారన్న భయం డ్రైవర్లలో ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బస్సులో కెమెరా యాంగిల్‌ను తిప్పేస్తున్నారన్నది అధికారుల మాట. దీంతో డ్రైవర్లలో అపోహలు తొలగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ కెమెరాలు ప్రయాణికుల భద్రత కోసమే కేటాయించాన్న విషయాన్ని తెలిపి, వారిలో ఆందోళన పోగొట్టాలని అధికారులు నిర్ణయించారు. -
ఆర్టీసీ కొత్త టికెట్! రూ.50 చెల్లించు.. 12 గంటలపాటు బస్సుల్లో ప్రయాణించు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు వారు తెలిపారు. (చదవండి: పెద్దపల్లిలో విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి) ఎక్కడ తీసుకోవాలంటే? ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 (గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుందని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. టి9-30 టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. (చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్) అందరికీ ‘టి9-60 టికెట్’ వర్తింపు ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. టి9-30 టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. -
ఆర్టీసీ డ్రైవర్ రాములుకు సజ్జనార్ అభినందన!
జగిత్యాల: ఆర్టీసీ డ్రైవర్ రాములును ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా, డ్రైవర్ రాములు వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఈ సంఘటనలో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎండీ సజ్జనార్.. డ్రైవర్‌ను అభినందించారు. ‘చాకచక్యం, అప్రమత్తతతో నిండు ప్రాణం నిలిచింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళ ప్రా ణాలు కాపాడిన డ్రైవర్ రాములుకు అభినందనలు’ అని సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహారించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన మెట్పల్లి డిపో డ్రైవర్ పి.రాములుకు అభినందనలు. డ్రైవర్ చాకచాక్యం, అప్రమత్తత వల్ల ఓ నిండు ప్రాణం నిలిచింది. మెట్పల్లిలో జగిత్యాలకు వైపునకు వెళ్తొన్న బస్ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. బస్ కదలిక గమనించిన… pic.twitter.com/fylJs7zsH5 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 21, 2023 -
ఉచిత ప్రయాణాల ప్రభావం... ఆటో డ్రైవర్ల ఉపాధికి దెబ్బ
కర్ణాటక: ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు కల్పించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆటోలు, కార్లు నడిపిస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తాజాగా మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో వీరు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. గంగావతి తదితర పట్టణాలకు రాకపోకలు సాగిస్తూ నిత్యం రూ. 1500 వరకు సంపాదించేవారు. కంప్లి నుంచి రాంసాగర, దేవసముద్ర, కృష్ణానగర్ క్యాంప్, కంప్లి కొట్టాల తదితర గ్రామాలకు రాకపోకలు సాగించే ఆటో డ్రైవర్ల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఆటోల వద్దకు మహిళలు రావడమే కష్టంగా మారింది. వ్యవసాయ కూలీలు నిత్యం షేర్ ఆటోలను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆటోలను ఆశ్రయించే వారు కరువయ్యారు. దీంతో ఎలా బతుకు నెట్టుకురావాలో ఆటో డ్రైవర్లకు అర్థం కావడం లేదు. వికలాంగులకు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఉంటే బాగుండేదని వారు చెబుతున్నారు. -
డీజిల్ బస్సుకు బైబై
హైదరాబాద్: ఆర్టీసీ డీజిల్ బస్సులు ఇక తుక్కు జాబితాలో చేరనున్నాయి. ఏళ్ల తరబడి లక్షల కొద్దీ కిలోమీటర్లు తిరిగిన కాలం చెల్లిన బస్సులను వదిలించుకొనేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. వీటి స్థానంలో అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడతో పాటు పలు జిల్లా కేంద్రాలకు ఈ– గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జూన్ నుంచి దశలవారీగా ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 28 డిపోల్లో సుమారు 2500 బస్సులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచి క్రమంగా డీజిల్ బస్సుల వినియోగాన్ని తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఈ సంవత్సరం వెయ్యి డీజిల్ బస్సులను తొలగించడంతో పాటు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం. ఇలా ప్రతి సంవత్సరం డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణహితమైన బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐటీ కారిడార్లకు పరుగులు.. నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత సిటీ బస్సుల వినియోగం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో నగర శివార్లలో బస్సుల అవసరం బాగా పెరిగింది. ఔటర్‌ను దాటి సిటీ విస్తరించింది. ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్, తదితర రంగాలకు చెందిన ప్రజలు కూడా శివార్లకు తరలివెళ్తున్నారు. చాలామంది నగరంలోని ఐటీ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ శివార్లలో నివాసం ఉండడంతో రవాణా సదుపాయం సవాల్‌గానే మారింది. దీంతో జూన్ నుంచి ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను నగర శివార్ల నుంచి ఐటీ కారిడార్లకు నడపాలని అధికారులు భావిస్తున్నారు. తొలివిడత 28 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కంటోన్మెంట్ డిపో నుంచి వీటిని నిర్వహిస్తారు. ఈ బస్సులు సికింద్రాబాద్ నుంచి మణికొండ, ఇబ్రహీంపట్నం, దిల్సుఖ్నగర్లకు రాకపోకలు సాగిస్తాయి. జూలైలో మరో 32 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సులు బాచుపల్లి నుంచి వేవ్‌రాక్. ప్రగతినగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లకు నడపనున్నారు. కోఠి– పటాన్చెరు డబుల్ డెక్కర్.. మరో రెండు నెలల్లో ప్రవేశపెట్టనున్న 10 డబుల్ డెక్కర్ బస్సులను కోఠి– పటాన్‌చెరుల మధ్య రెండు మార్గాల్లో నడిపేందుకు రూట్‌ను ఖరారు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కోఠి– పటాన్చెరు (218), కోఠి– పటాన్చెరు (222) రూట్లలో ఈ బస్సులు నడుస్తాయి. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు పెద్దగా ఆటంకాలు లేకపోవడంతో పాటు ఎక్కువ మంది ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఈ రెండు మార్గాలను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
గ్యాస్ లీకై రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కంప్రెషర్ నేచురల్ (సీఎన్జీ) గ్యాస్ లీకయిన కారణంగాఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో రెండు బస్సులు దగ్ధం అయ్యాయి. ఒకటి పూర్తిగా దగ్ధం కాగా పక్కనే ఉన్న మరో బస్ పాక్షికంగా కాలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ 11 జడ్ 7482 నంబర్‌గల మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ శుక్రవారం రాజమండ్రిలో ఏకలవ్య మోడల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిమిత్తం స్పెషల్ సర్వీస్‌గా వెళ్లింది. తిరిగి రాత్రి సుమారు 2.30 గంటల సమయానికి డిపోకు చేరుకుంది. డిపో ఆవరణలోనే ఉన్న సీఎన్జీ గ్యాస్ బంక్‌లో గ్యాస్ నింపుకుని మెయింటెనెన్స్ కోసం గ్యారేజీలో పెట్టారు. అనంతరం గ్యారేజీ వెనుక భాగంలో పార్కింగ్ చేసేందుకు వెళుతుండగా గ్యాస్ సిలెండర్ల నుంచి గ్యాస్ లీకవ్వటాన్ని గమనించిన సిబ్బంది దగ్గరకు వెళ్లి చూసేలోపే మంటలు చెలరేగి బస్‌కు అంటుకున్నాయి. దీంతో అది పూర్తిగా దగ్ధం అయ్యింది. దాని పక్కనే పార్క్ చేసి ఉన్న ఏపీ జడ్ 7430 నంబర్‌గల మరో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌కు మంటలు అంటుకుని పాక్షికంగా (డ్రైవర్ క్యాబిన్‌తోపాటు వెనుక భాగాన కొన్ని సీట్లు) కాలిపోయింది. ఘటన జరిగిన విధానాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. -
ఆర్టీసీ డొక్కు బస్సులు ఇక తుక్కే!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 15 ఏళ్లకుపైగా నడుస్తున్న డొక్కు బస్సులు ఇక కనిపించవు. 15ఏళ్ల కాలం తీరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలన్నింటినీ వచ్చే ఏప్రిల్ నాటికి తుక్కుగా మార్చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ బస్సులను తొలగించబోతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఏర్పాట్లు ప్రారంభించింది. సంస్థలో 15 ఏళ్లు దాటిన బస్సుల జాబితా సిద్ధం చేస్తోంది. సుమారు 700కుపైగా బస్సులను తొలగించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే 670 కొత్త బస్సుల కోసం ఆర్టీసీ ఇటీవల టెండర్లు పిలిచింది. ఈ నెలాఖరు నుంచి మార్చి వరకు దశలవారీగా కొత్త బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. బస్సులు తగ్గితే ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ముందుజాగ్రత్తగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా అవే ఆధారం ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను వెంటనే తుక్కుగా మార్చే విధానం గతంలో ఉండేది. కానీ గత పదేళ్లలో పరిస్థితి మారింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ ఇబ్బంది పడుతోంది. 2015లో ఒకదఫా మినహా పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు సమకూర్చుకోలేకపోయింది. ఆర్టీసీలో ఏటా 200కుపైగా పాత బస్సులు తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. కానీ కొత్త బస్సుల కొనుగోలు దాదాపు నిలిచిపోవటంతో పాత బస్సులనే రిపేర్లు చేసుకుంటూ నడుపుతోంది. నిజానికి 2019 నాటి ఆర్టీసీ సమ్మె సమయంలో హైదరాబాద్ నగరంలో వెయ్యి బస్సులు తగ్గించాలని సీఎం ఆదేశించారు. అన్ని బస్సులు తగ్గిస్తే ప్రయాణికులకు ఇబ్బందని భావించిన అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా బాగా పాతబడ్డ బస్సులను తుక్కుగా చేసి, వాటినే తొలగించిన వెయ్యి బస్సులుగా చూపారు. అలా ఒకేసారి పెద్ద మొత్తంలో 15 ఏళ్లు పైబడిన బస్సులు తగ్గిపోయాయి. లేకుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 1,700 వరకు ఉండేదని అంటున్నారు. కన్వర్షన్ పేరుతో.. ఆర్టీసీకి లాభసాటి కేటగిరీ బస్సులు సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌లే. ఆరున్నర లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన బస్సులను తదుపరి తక్కువ కేటగిరీ బస్సులుగా మార్చే పద్ధతి ఆర్టీసీలో ఉంది. ఎక్కువ దూరం తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌లుగా, ఎక్స్‌ప్రెస్‌లను పల్లె వెలుగు బస్సులుగా, మరీ ఎక్కువ తిరిగిన బస్సులను హైదరాబాద్ సిటీ బస్సులుగా మారుస్తున్నారు. ఇలా మార్చినవాటిలో కొన్నింటికి ఏకంగా మరో పదేళ్లు తిప్పుతున్నారు. కానీ వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే పాత వాహనాలను కూడా కేంద్ర ఆదేశం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త వాహనాలు సమకూరాయి. చాలా వరకు పాతవాటిని పక్కనపెట్టేశారు. దీనితో తొలగించాల్సినవి నామమాత్రంగానే ఉంటాయని..అయితే పోలీసుశాఖ పరిధిలో వాడే వ్యాన్లు, బస్సులు, పాత జీపుల్లో కొన్నింటిని తొలగించాల్సి ఉంటుందని అంటున్నారు. -
AP: ఆర్టీసీ బస్సులకు సరికొత్త రూపు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) బస్సులు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. దశాబ్ద కాలంగా పాతబడిన బస్సులతో ప్రయాణికులు పడుతున్న పాట్లకు ముగింపు పలకాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను ఆధునికీకరణకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే 650 కొత్త బస్సుల కొనుగోలుతోపాటు 880 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న బస్సులకు ఫేస్‌లిఫ్ట్ ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. రెండు దశల్లో 2,750 బస్సులను ఆధునికీకరిస్తారు. దసరా నాటికి మొదటి దశ ఆధునికీకరించిన బస్సులను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సుల్లో దాదాపు 3,800 బాగా పాతబడ్డాయి. వాటిలో ఏసీ బస్సులు 10 లక్షల కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. పూర్తి చేశాయి. ఆర్టీసీ ఆదాయం సరిపోక, ఉద్యోగుల జీతాలకే అప్పులు చేయాల్సి రావడంతో దశాబ్ద కాలంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. ఉన్న వాటికి మరమ్మతులు చేయించలేదు. ఉన్న బస్సుల ఆధునికీకరణా చేపట్టలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి 2020 జనవరి నుంచి ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. దాంతో ఆర్టీసీ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన బస్సు ప్రయాణాన్ని అందించేలా పాలక మండలి కార్యాచరణ చేపట్టింది. రెండు దశల్లో ఆధునికీకరణ 2,750 బస్సులను ఆధునికీకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త సీట్లు వేయడం, టైర్లు, హెడ్లైట్లు మార్చడం, రంగులు వేయడం, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు. బస్సులకు కొత్త రూపు తెస్తారు. మొదటి దశలో 1,250 పల్లె వెలుగు బస్సులు, 250 సిటీ బస్సుల ఆధునీకరణ చేపట్టారు. ఆర్టీసీ మెకానికల్ విభాగం సొంత గ్యారేజీల్లోనే ఈ పనులు చేపట్టింది. ఒక్కో బస్సుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 1,500 బస్సుల ఆధునీకరణకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారు. దసరా నాటికి తొలి దశ పూర్తి చేయనున్నారు. రెండో దశలో 1,250 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆధునికీకరించనున్నారు. వాటిలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సెమీ లగ్జరీ సర్వీసులున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రాల మధ్య తిరిగే ఈ సర్వీసులను మరింత వినూత్నంగా ఫేస్ లిఫ్ట్ డిజైన్‌ను ఆర్టీసీ రూపొందించింది. సీట్లు, టైర్లు, లైట్లు మార్చడంతోపాటు అవసరమైన మేరకు బస్సు బాడీనీ కొత్తగా నిర్మిస్తారు. డిసెంబర్ దీనిని పూర్తి చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. -
ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై మహిళా డ్రైవర్లు రానున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళా కండక్టర్లను చూసిన మనం ఇకపై వారిని డ్రైవర్లుగానూ చూడబోతున్నాం. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు మొదలెట్టారు. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను తయారుచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. దీనిపై ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. వారికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఇవ్వడంతో వారికి డ్రైవింగ్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చినందుకు గాను ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. ఆర్టీసీలోనే పోస్టింగ్.. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తారు. వారిలో అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల్లో నియమించేందుకు ప్రతిపాదించారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మహిళలకు పదవులు, నామినేటెడ్ పనులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రపీఠం వేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఎస్సీ మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అర్హుల ఎంపిక కోసం అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. ఎంపికైన ఎస్సీ మహిళలకు ఆర్టీసీ ద్వారా భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను తొలి దఫా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 310 ఎస్సీ బ్యాక్లాగ్ డ్రైవర్ పోస్టుల్లో నియమించేలా ప్రభుత్వానికి నివేదిస్తాం. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
ఏఐతో ‘రాస్తే’ సేఫ్: పనిచేస్తుందిలా!
సాక్షి, హైదరాబాద్: బస్సు ప్రమాదాలను నివారించేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. రెండు రైళ్లు ఢీ కొనకుండా కవచ్ పేరుతో రైల్వే ఇటీవలే యాంటీ కొల్యూజన్ డివైస్‌లను అమర్చే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ తరహాలోనే, బస్సుల్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో యాంటీ కొల్యూజన్ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. డ్రైవర్‌ను నిరంతరం అప్రమత్తం చేసేలా.. గచ్చిబౌలిలోని ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్–సీఆర్ఆర్ఐ, ఐఎన్ఏఐలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘ఐ–రాస్తే’(ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్) పరిజ్ఞానాన్ని బస్సుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరిజ్ఞానాన్ని నాగ్‌పూర్‌లోని బస్సుల్లో ఇటీవలే ఏర్పాటు చేసి విజయవంతంగా వినియోగిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కూడా ఈ పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంలో కీలకంగా వ్యవహరించిన ఐఐఐటీ నిపుణులతో ఇటీవల చర్చించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు తిరిగే 20 అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత మూడు రోజులుగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పది బస్సుల్లో దీన్ని బిగించారు. వాటి పనితీరును మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. మిగతా బస్సుల్లో కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ‘ఐ–రాస్తే’ పనిచేస్తుందిలా.. ► ఈ వ్యవస్థ నిరంతరం డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంటుంది. డ్రైవర్ వద్ద ఉండే స్క్రీన్‌పై సూచనలువస్తాయి. ► అవసరమైనప్పుడు బీప్ సౌండ్ ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. తద్వారా ముందు వెళ్లే వాహనానికి బస్సు అతి చేరువగా వెళ్లకుండా చూస్తుంది. ► ముందు వెళ్లే వాహనం నెమ్మదించినా, సడన్ బ్రేక్ వేసినా కూడా డ్రైవర్ గుర్తించేలా సిగ్నల్ ఇస్తుంది. ► రోడ్ల పరిస్థితిని కూడా డ్రైవర్‌కు తెలుపుతుంది. బస్సు రోడ్డుకు ఓ పక్కకు వెళ్లినా, రోడ్డు గతుకులుగా ఉన్నా, గోతులు చేరువవుతున్నా, మలుపులు సమీపించే ముందు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. గరిష్ట స్థాయిలో ప్రమాదాల నివారణ గత రెండుమూడు నెలలుగా ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్లు సరిగా లేకపోవటం, ముందు వెళ్లే వాహన డ్రైవర్ల తప్పిదాలు, ఇతర కొన్ని కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని గరిష్ట స్థాయిలో నివారించేందుకు ఈ కొత్త సాంకేతికత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 20 బస్సుల్లో ఈ వ్యవస్థ పనితీరును అంచనా వేసి, ఆ సాంకేతికత ద్వారా డ్రైవర్‌కు అందుతున్న సూచనలు, వాటిల్లో చేయాల్సిన మార్పు చేర్పులపై మరోసారి ఐఐఐటీ నిపుణులతో చర్చించి పూర్తిస్థాయిలో ఆ సాంకేతికతను సమకూర్చుకోనున్నారు. ప్రస్తుతానికి ఆ సాంకేతికతను ఉచితంగానే సమకూరుస్తున్నా.. ప్రయోగం విజయవంతమయ్యాక అవసర మైన బస్సుల్లో దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కొనుగోలు చేయాల్సి ఉంది. ధర విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. -
ఆర్టీసీలో ప్రయాణం ఉచితం
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్ నుంచి నగరానికి చేరుకున్న వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు తగిన విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. -
శైవక్షేత్రాలకు 3,325 బస్సులు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి ఆర్టీసీ పాత టికెట్ ధరలే వసూలు చేస్తుందని, ధరల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రెండేళ్లుగా డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినా.. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్లకు ఆర్టీసీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా గ్యారేజ్ ఆవరణలో సిబ్బందికి గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన మహాశివరాత్రికి సంస్థ సంసిద్ధమైందన్నారు. కోటప్పకొండ, కర్నూలు జిల్లాలోని శ్రీశైలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 96 చిన్నా, పెద్ద శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా శివరాత్రి ముందురోజు, శివరాత్రి రోజున 21 లక్షల మంది కోసం 3,325 బస్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు. వాటిలో 410 బస్సులు కోటప్పకొండకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నరసరావుపేట నుంచి 285, మిగతా ప్రాంతాల నుంచి 55, ఘాట్‌రోడ్డులో 70 బస్సులు నడుస్తాయని చెప్పారు. -
మేడారంలో భక్తుల మొక్కులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహా జాతర శనివారం సాయంత్రం ముగిసినప్పటికీ ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగిసిన క్రమంలో అమ్మవార్ల గద్దెల ఐలాండ్ వరకు భక్తుల వాహనాలకు అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్సులు కూడా ఐలాండ్ వరకు వెళ్లాయి. కలెక్టర్ కృష్ణ ఆదిత్య కుటుంబ సభ్యులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
కొత్త బస్సుల కోసం సీఎంకు ప్రతిపాదిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి కొత్త బస్సుల అవసరముందని, 2,820 బస్సులు కొనేందుకు సీఎంకు ప్రతిపాదించనున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. అలాగే మృతిచెందిన ఆర్టీసీ ఉద్యో గుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా సంస్థలో ఉద్యో గం కల్పించే అంశాన్ని కూడా అందులో ప్రస్తావిస్తామని, కారుణ్య నియామకాల కోసం 1,200 మంది ఎదురు చూస్తున్నారన్నారు. శనివారం బస్‌భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ జాతరకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని, ఆశించినంత ఆదాయం రాలేదన్నారు. రిటైర్మెంట్ బెని ఫిట్లకు సంబంధించి రూ.500 కోట్లను ప్రభుత్వం నుంచి కోరనున్నట్లు చెప్పారు. -
80 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తున్న దసరా ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్బీ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయని, అయితే సాధారణ సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. కేవలం 16 దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50శాతం అదనపు చార్జీ వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు బస్సులను నడుపుతున్నాయని వివరించారు. -
దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల కోసం రేపటి (శుక్రవారం) నుంచి ఈనెల 18వ తేదీ వరకు 4 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 14వ తేదీ వరకు 1,800 బస్సులు, 15 నుంచి 18వ తేదీ వరకు 2,200 బస్సులు తిప్పుతామని చెప్పారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా సందర్భంగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు సౌకర్యవంతంగా వచ్చి, పండుగ తరువాత మళ్లీ వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. హైదరాబాద్ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు. దసరా ప్రత్యేక బస్సులను ఓ వైపు ఖాళీగా అంటే సున్నా రాబడితో నడపాల్సి ఉంటుందన్నారు. డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. అందువల్ల అనివార్య పరిస్థితులతో దసరా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులు సహృదయంతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రెగ్యులర్ బస్ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కారుణ్య నియామకాలకు ఆమోదం గత సంవత్సరం జనవరి 1 తరువాత మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామన్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. అంతకుముందు అంటే ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నకాలంలో చనిపోయిన సంస్థ ఉద్యోగుల పిల్లలకు కూడా కారుణ్య నియామకాలపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 2020–21కి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు బస్ డిజైన్ మారుస్తామన్నారు. అన్ని బస్సులకు లైవ్ ట్రాకింగ్ సౌలభ్యం కల్పిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా, పోలీసు అధికారులతో కలిపి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి.ప్రయోగాత్మకంగా తొలుత సిటీ బస్సుల రంగు మార్చాలని ఆర్టీసీ భావిస్తోంది. తీవ్ర నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని సంస్థ భావిస్తోంది. చాలాకాలంగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ బస్సులకు కొత్త రంగులతో కొత్త లుక్ తేవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో ఆర్టీసీ తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటోంది. కోవిడ్‌తో కునారిల్లి నెలరోజులుగా సిటీ బస్సులు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నా.. మరింత పెరగాల్సిందేనన్న ఉద్దేశంతో ఆర్టీసీ ఉంది. ఇందుకు వాటి రంగులు మార్చడం ద్వారా కొంత ఫలితాన్ని పొందొచ్చని ఆశిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత.. గతంలో నగరంలో ఆకుపచ్చ, పెసర రంగులతో సిటీబస్సులు ప్రత్యేకంగా కనిపించేవి. డబుల్ డెక్కర్ బస్సులకు కూడా ఇవే రంగులుండేవి. 15 ఏళ్ల క్రితం దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో బస్సుల రంగులు మార్చారు. అప్పటి వరకు ఎర్ర బస్సు అన్న పేరుతో ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి. పల్లెలు పచ్చదనంతో మెరిసిపోయే తరుణంలో, బస్సులు కూడా దాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్న ఉద్దేశంతో రంగులు మార్చారు. అందుకే పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ రంగుతో ఉంటున్నాయి. ఈ సమయంలోనే నగరంలో ఆకుపచ్చ, పెసర రంగు కాంబినేషన్లో ఉండే రంగులు కూడా మారి ఎరుపు రంగు వచ్చింది. దశాబ్దంనరపాటు ఆ రంగు చూసి జనానికి బోర్ కొట్టి ఉంటుందన్న భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది. అందుకోసం జనాన్ని ఆకట్టుకునే రంగుల్లోకి వాటిని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. తెలుపు రంగు వెంటనే ఆకర్షిస్తుందన్న ఉద్దేశంతో తెలుపుతో సమ్మిళితమై ఇతర రంగు వేయించాలన్న ఆలోచన ఉండగా, గతంలో బాగా ఆకట్టుకున్న ఆకుపచ్చ–పెసరి రంగును కూడా పరిశీలిస్తున్నారు. ఓ బస్సుకు ఆ రంగు వేయించారు కూడా. మరో ఏడెనిమిది కాంబినేషన్లతో రంగులు వేయించి మెరుగ్గా ఉన్న దాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లా బస్సుల రంగులు కూడా మార్చే అవకాశముంది. -
ఆర్టీసీ దిద్దు‘బాట'.. మారనున్న సిటీ బస్సుల రూటు
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సు రూటు మారనుంది. నగరంలో భారీగా పెరిగిన సొంత వాహనాల వినియోగం, మెట్రో రైళ్లు, ప్రైవేట్ వాహనాల పోటీ వంటి పరిణామాలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న గ్రేటర్ ఆర్టీసీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు హైదరాబాద్ చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో బస్సుల విస్తరణకు చర్యలు చేపట్టింది. శివార్లకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపడం ద్వారా ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుందని భావిస్తోంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాంతర రూట్లలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పడిపోయింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులు మరింత దెబ్బతీశాయి. దీంతో ప్రధాన నగరంలో సిటీ బస్సులను తగ్గించి శివార్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ట్రిప్పులను పెంచనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు నగరం చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణ అవసరాలపైన అధ్యయనం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ సైతం సిటీ బస్సుల నష్టాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రేటర్లో దిద్దుబాటు మొదలైంది. చదవండి: తెలంగాణ: నష్టాల ఆర్టీసీలో దుబారా..! ప్రయాణికులకు చేరువగా... ► ప్రస్తుతం సిటీ బస్సులు గంటకు 15 కిలోమీటర్ల చొప్పున ప్రతి రోజు 250 కిలోమీటర్ల మాత్రమే తిరుగుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ, ట్రిప్పుల రద్దు, పరిమిత రూట్లు ఇందుకు కారణం. స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడం వల్ల కూడా బస్సులు ఎక్కువ దూరం తిరగడం లేదు. ► గతంలో హయత్‌నగర్ నుంచి పటాన్చెరు వరకు తిరిగిన బస్సులు ఇప్పుడు హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్కు పరిమితమయ్యాయి. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు రావడం ఇందుకు కారణం. ► ఇదే సమయంలో జిల్లా బస్సులు మాత్రం గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల చొప్పున రోజుకు 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. ► గతంలో నగరంలో 3850 బస్సులు ప్రతిరోజు 9 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. 800కు పైగా సిటీ బస్సులను తొలగించారు. దీంతో ప్రస్తుతం 7 లక్షల కిలోమీటర్లే తిరుగుతున్నాయి. ► వివిధ కారణాల వల్ల నగరంలో తగ్గిన ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకొనేందుకు సిటీ బస్సు స్టీరింగ్‌ను శివార్ల వైపు తిప్పేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. చదవండి: ఆర్టీసీ నష్టాలకు వాస్తు దోషమా? బస్‌భవన్‌కు వాస్తు మార్పులు మారనున్న రూటు... ► సికింద్రాబాద్–కోఠి, నాంపల్లి–మెహిదీపట్నం వంటి తక్కువ దూరం ఉన్న రూట్లలో ఒక బస్సు రోజుకు 6 ట్రిప్పులు నడిచినా 250 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా ఉంది. అదే సమయంలో ఆక్యుపెన్సీ కూడా 60 శాతం లోపే ఉంటుంది. ► ప్రత్యామ్నాయంగా తక్కువ దూరం ఉన్న రూట్లలో ట్రిప్పులను తగ్గించి చౌటుప్పల్–ఎంజీబీఎస్, మాల్–కోఠి, భువనగిరి–సికింద్రాబాద్, చేవెళ్ల– మెహిదీపట్నం వంటి దూరప్రాంతాలకు ట్రిప్పులను పెంచనున్నారు. ► ఈ మార్పులతో గంటకు 15 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు, రోజుకు 250 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు బస్సు వినియోగం పెరిగే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. భారీగా నష్టాలు ► ప్రస్తుతం నగరంలో సిటీ బస్సులు రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తున్నాయి. ► కిలోమీటర్‌కు రూ.36 ఆదాయం లభిస్తుండగా ఖర్చు మాత్రం రూ.85 వరకు నమోదవుతోంది. ఒక్క డీజిల్ కోసమే కిలోమీటర్‌కు రూ.20 చొప్పున వెచ్చించవలసి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► ప్రస్తుతం రోజు రూ.2.5 కోట్ల ఆదాయం ఉన్నా నిర్వహణ వ్యయం రూ.3.5 కోట్లు. ► సిటీ నుంచి చేవెళ్ల, శంకర్పల్లి, మాల్, రాయగిరి, భువనగిరి వంటి దూరప్రాంతాలకు బస్సులను పెంచుకోవడం వల్ల కిలోమీటర్‌పైన వచ్చే ఆదాయం రూ.36 నుంచి కనీసం రూ.50 వరకు పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులకు వాట్సప్ పరిష్కారం ► ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఆర్టీసీ మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ► సిటీ బస్సుల సమస్యలపైన ప్రయాణికులు కింది నెంబర్లకు వాట్సప్ ద్వారా ఫిర్యాదులు చేసి పరిష్కారం పొందవచ్చు. కోఠి సహాయ కేంద్రం: 99592 26160 రెతిఫైల్ కేంద్రం: 83339 04531 -
ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు రద్దు
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది. కరోనా సెకండ్ వేవ్ రాకముందు రోజుకు 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించేది. కానీ, ప్రస్తుతం రోజుకు 3,000 షెడ్యూళ్లే నిర్వహిస్తోంది. అంటే కేవలం 30 శాతం సర్వీసులనే కొనసాగిస్తోంది. వీటిలో కూడా గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతిస్తోంది. కరోనా ఉధృతితో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రయాణాలను విరమించుకుంటున్నారు. దాంతో బస్సుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదు. దీనికితోడు తాజాగా 1,450 అంతర్రాష్ట్ర సర్వీసులను పూర్తిగా రద్దు చేయడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడనుంది. సాధారణ రోజుల్లో ఆర్టీసీకి టిక్కెట్ల ద్వారా రోజుకు సగటున రూ.15 కోట్లు ఆదాయం వచ్చేది. కరోనా రెండో వేవ్ ఉధృతి పెరిగాక రోజువారి ఆదాయం రూ.7 కోట్లకు పడిపోయింది. ఇక కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రావడంతో రోజువారీ ఆదాయం కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే వస్తోంది. మే అంతా దాదాపు ఇలానే ఉంటుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప ఆర్టీసీ ఆదాయం మళ్లీ గాడిన పడే అవకాశాల్లేవని అధికారులు చెబుతున్నారు. కర్ఫ్యూలోనూ పార్సిల్ సేవలు కర్ఫ్యూ పరిస్థితుల్లోనూ పార్సిల్ సర్వీసులు నిరం తరాయంగా కొనసాగేలా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం డెడికేటెడ్ కారిడార్ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు హైదరాబా ద్‌ను అనుసంధానిస్తూ రోజుకు 9 ప్రత్యేక పార్సిల్ సర్వీసులను నిర్వహిస్తోంది. ► గుంటూరు–విశాఖపట్నం, తిరుపతి–విజయవాడ, అనంతపురం–విజయవాడ మధ్య రెండేసి పార్సిల్ సర్వీసులు నిర్వహిస్తోంది. రోజూ అటు వైపు నుంచి ఒక బస్సు, ఇటువైపు నుంచి ఒక బస్సు నడుస్తుంది. ► రాజమండ్రి–హైదరాబాద్, గుంటూరు–విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–అనంతపురం మధ్య ఒక్కో పార్సిల్ సర్వీసు నిర్వహిస్తున్నారు. ► విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పార్సిళ్లను ప్రయాణికుల బస్సుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చేరవేస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌ను అనుసంధా నిస్తూ పార్సిల్ సేవలు అందిస్తున్నారు. -
50% ప్రయాణికులతోనే ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే మంగళవారం నుంచి అనుమతిస్తోంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈ నెలలో రోజుకు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. సోమవారం ఆక్యుపెన్సీ రేటు 50 శాతానికే పరిమితమైంది. దాంతో ఆర్టీసీ ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. సగటున రోజుకు రూ.14 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.7 కోట్లే వస్తోంది. దాంతో ఆర్టీసీ తమ బస్సు సర్వీసులను తగ్గించింది. డిమాండ్ అంతగాలేని రూట్లలో సర్వీసుల్లో కోత విధించింది. ఆర్టీసీ రోజూ 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించాలి. కానీ వాటిలో 25 శాతం సర్వీసులను తగ్గించింది. ఆర్టీసీ బస్ స్టేషన్లు, కార్యాలయాల్లో కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు. -
తమిళనాడుకి వెళ్లాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
నెల్లూరు (క్రైమ్): ఆర్టీసీ బస్సుల్లో తమిళనాడుకి ప్రయాణించేవారు ఈ–పాస్‌ను తప్పనిసరిగా పొందాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీపీటీడీ) ఆర్ఎం పీవీ శేషయ్య ఆదివారం తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి ఆంక్షలను కఠినతరం చేసిందని పేర్కొన్నారు. ఇకపై ఏపీ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి తమిళనాడుకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ పాస్ పొందాలని ఆదేశించినట్లు వివరించారు. ప్రయాణికులు https.eregister.tnega.org వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకుంటే వారి ఫోన్ నంబర్‌కు ఈ పాస్ మెసేజ్ వస్తుందన్నారు. నెల్లూరు రీజియన్ నుంచి చెన్నై వెళ్లేవారు వెబ్సైట్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. -
TSRTC: పదేళ్లలో ఇంత పతనమా!
సాక్షి, హైదరాబాద్: పదేళ్లలో ఎంత తేడా. కళకళలాడిన ఆర్టీసీ కనీవినీ ఎరుగని రీతిలో దెబ్బతింది. ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకుంటూ, సమస్యలను అధిగమించుకుంటూ సాగితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ, ఏయేటికాయేడు పనితీరు పూర్తిగా దిగజారి చరిత్రలో ఎన్నడూ లేని దుస్థితికి చేరింది మన ఎర్ర బస్సు. ప్రస్తుతం కోవిడ్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అయిన తీరుకు ఆర్టీసీ మినహాయింపు కాదు. కానీ, కోవిడ్ పంజా విసరటానికి ముందు చేసిన ఆర్థిక మదింపు ఆర్టీసీ దీనావస్థకు అద్దం పడుతోంది. ఇటీవలే ముగిసిన శాసనసభ సమావేశాల్లో రవాణాశాఖ సభకు సమర్పించిన లెక్కలే ఇవి. పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకుంటే, ఊహించని రీతిలో సంస్థ దెబ్బతిన్నదని స్పష్టమవుతోంది. 2011–12 నుంచి 2019–20 (కోవిడ్‌కు ముందు నాటికి) వరకు సంవత్సరం వారీగా వివరాలను ఇందులో పొందుపరిచారు. 2015 నుంచి మూడున్నర రెట్లు పెరిగిన నష్టం ఈ పదేళ్ల కాలంలో 2014–15 వరకు పరిస్థితి ఒకరకంగా ఉంటే, 2015–16 నుంచి దారుణంగా మారిపోయిందని రవాణాశాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. 2011 నుంచి 2014 వరకు తెలంగాణ పరిధిలో గరిష్ట నష్టం రూ.299 కోట్లు మాత్రమే. ఇది 2014లో నమోదైంది. కానీ 2015లో ఆ మొత్తం ఏకంగా రూ.1,150 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత అది కాస్త తగ్గినా మళ్లీ 2019–20లో రూ.1,002 కోట్లుగా నమోదైంది. నష్టం దాదాపు మూడున్నర రెట్లు పెరగగా, ఆదాయం మాత్రం కనీసం రెట్టింపు కాలేదు. 2012లో స్థూల ఆదాయం రూ.3,409 కోట్లు ఉండగా, 2019–20లో రూ.4,593 కోట్లుగా చూపారు. నష్టాల పెరుగుదలకు, ఆదాయం పెరుగుదలకు ఎక్కడా పొంతనే లేకుండా పోయింది. 2011–12లో కి.మీ. స్థూల ఆదాయం రూ.25 ఉంటే స్థూల ఖర్చు రూ.27గా నమోదైంది. అంటే కేవలం కి.మీ.కు రూ.2 మాత్రమే తేడా ఉంది. అదే 2019–20లో కి.మీ. స్థూల ఆదాయం రూ.39.88గా ఉంటే ఖర్చు రూ.48.58గా ఉంది. అంటే ఆదాయానికి ఖర్చుకు తేడా రూ.9 వరకు నమోదవటం గమనార్హం. తీవ్ర నష్టాల్లో... వేతన పెంపు ఎలా? ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంది. 2013 నాటి వేతన సవరణ 2015లో అమలు చేశారు. కార్మిక సంఘాల డిమాండ్‌తో ప్రమేయం లేకుండా ఎవరూ ఊహించనట్టు ఏకంగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆర్టీసీపై దాదాపు రూ.850 కోట్ల వార్షిక భారం పడింది. కానీ, ఆదాయం పెంపునకు కనీస ప్రయత్నం జరగలేదు. దీంతో ఆర్టీసీకి వచ్చే అరకొర ఆదాయం కాస్తా వేతన సవరణ భారం ముందు నిలవలేక నష్టాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ వేతన సవరణ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ప్రతినెలా ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన మొత్తం నుంచి జీతాలకు నిధులు విడుదల చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం 16 శాతం ఐఆర్ అమలవుతోంది. అంతమేరనే పెంచుతారా, ఇంకా పెరుగుతుందా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీ ఆదాయం ఏరకంగానూ పెరిగే సూచనలు కనిపించటం లేనందున కొత్త వేతన సవరణకు ప్రభుత్వమే పూర్తిగా సాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. తగ్గిన బస్సులు.. రోజులు గడిచేకొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ఆమేరకు బస్సుల సంఖ్య కూడా పెరగటం కద్దు. కానీ తెలంగాణలో పరిస్థితి దానికి విరుద్ధంగా మారింది. 2011లో ఉన్న బస్సుల కంటే ఇప్పుడు తగ్గిపోయాయి. అప్పుడు 10,309 బస్సులుంటే ఇప్పుడు 9,691 బస్సులున్నాయి. పదేళ్ల కింద ఏడాదికి 116.71 కోట్ల కి.మీ. మేర బస్సులు తిరిగితే 2019–20లో 115.19 కోట్లే తిరిగాయి. అంటే బస్సుల సంఖ్యే కాకుండా అవి తిరిగే నిడివి కూడా తగ్గిపోయింది. 2011లో 1,681 కొత్త బస్సులను ఆర్టీసీ తెలంగాణ పరిధిలో సమకూర్చుకుంది. 2019–20లో ఆ సంఖ్య కేవలం 149 మాత్రమే. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌తో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్న సమయంలో, ఏపీ పరిధిలో టీఎస్ఆర్టీసీ లక్షన్నర కి.మీ. అదనంగా తిప్పుకునే అంశం పరిశీలనకు వచ్చింది. అది జరగాలంటే కొత్త బస్సులను ఎక్కువగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో తాము పెంచుకోలేమని, అంతమేర ఏపీనే తగ్గించుకోవాలని టీఎస్ఆర్టీసీ పేర్కొంది, అదే చేసింది. ఇలా బస్సుల సంఖ్య, తిరిగే కిలోమీటర్లు, సర్వీసుల సంఖ్య, రూట్ల సంఖ్య తగ్గుతూ పోతే ఆదాయం ఎలా పెరుగుతుందో ఆర్టీసీకే తెలియాలి. రవాణా శాఖ నివేదిక ప్రకారం ఆదాయ, నష్టాల వివరాలు ఇలా.. (రూ.కోట్లలో) సంవత్సరం 2011–12 2012–13 2013–14 2014–15 2015–16 2016–17 2017–18 2018–19 2019–20 స్థూల ఆదాయం 2863.87 3408.65 3742.93 3294.33 4336.30 4233.05 4570.37 4882.72 4592.93 నష్టం 282.99 5.48 209 299.64 1150.48 749.27 748.90 928.67 1002.02 -
భారత్ బంద్ విజయవంతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో పోరాడుతున్న రైతుల పిలుపు మేరకు శుక్రవారం భారత్ బంద్ నిర్వహించారు. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోనూ బంద్‌ను తలపెట్టిన పలు ప్రధాన పక్షాలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీజేపీ, జనసేన మినహా వైఎస్సార్సీపీ, వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు సంఘీభావంగా నిలిచాయి. లారీ అసోసియేషన్, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి బంద్‌లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు రోడ్లపై రాస్తారోకో, ధర్నాలతో నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు విడనాడాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనకారులు నినదించారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు, హోటల్స్, వర్తక, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. విజయవాడ బస్టాండ్ వద్ద బోసిపోతున్న పోలీస్ కంట్రోల్ రూం సెంటర్ ► విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీఎస్) వద్ద ధర్నా చేపట్టారు. బంద్ సందర్భంగా పలువురు నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ► గుంటూరులో వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ► కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద మధ్యాహ్నం తర్వాత కూడా ఆర్టీసీ బస్సులను బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ► అనంతపురం, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పలు పార్టీలు, కార్మీక సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహించారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భీమవరంలో బస్సులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంద్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమవరం శివారున ఉన్న తిరుమల విద్యా సంస్థకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. క్లాసులు జరగకపోయినా హాస్టల్లో విద్యార్థులు చదువుకోవడాన్ని గమనించిన భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కొంత వాగ్వాదం జరగడంతో విద్యా సంస్థకు చెందిన బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానికులు జోక్యం చేసుకని సర్దుబాటు చేశారు. రాళ్లు రువ్వడంపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిలో గుండు కొట్టించుకుని నిరసన తెలుపుతున్న ఉద్యమకారులు బంద్‌కు మావోయిస్టు పార్టీ మద్దతు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్టు మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణేష్ ఆడియో విడుదల చేశారు. మావోయిస్టులు ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటారని, బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో మారుమోగిన విశాఖ సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జరిగిన పలు నిరసన కార్యక్రమాల్లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’, ‘విశాఖ ఉక్కు – ప్రైవేటీకరణ వద్దు’ అంటూ ఆందోళనకారులు నినదించారు. జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థలు, వాణిజ్య, వర్తక సముదాయాలు, దుకాణాలు మూతపడ్డాయి. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు డిపోలకే పరిమితమయ్యాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూసీ, సీఎఫ్ఐటీయూ, టీఎన్టీయూసీ , డీవైఎఫ్ఐ, ఐవైఎఫ్, ఏపీ మహిళా సమాఖ్య, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, ఏఐడీఎస్వో, పీడీఎస్‌వో నాయకులు నిరసనలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగర, రూరల్ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు. విశాఖపట్నం మద్దిలపాలెం డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ► గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. హెచ్‌పీసీఎల్ గేటు వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేతలు నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.మోకాళ్లపై నిరసన తెలిపారు. ► గాజువాక, లంకెలపాలెం, కూర్మన్నపాలెం, షీలానగర్, పెదగంట్యాడ ప్రాంతాల్లో ఆయా వైఎస్సార్సీపీ పార్టీల నేతలు, అఖిలపక్ష కారి్మక సంఘాల నేతలు కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్దిలపాలెం కూడలిలో నిరసన చేపట్టి, వెంకోజిపాలెం వరకు ప్రదర్శన కొనసాగించారు. ► హుకుంపేట, అరకులోయ జంక్షన్, పాడేరు, అనకాపల్లి మెయిన్‌రోడ్ జంక్షన్లో రాస్తారోకోలు నిర్వహించారు. -
పెట్రో మంట.. ఆర్టీసీకి కాసుల పంట!
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటం ఆర్టీసీని తీవ్రంగా కలవరపరుస్తోంది.. ఆ భారాన్ని మోయలేమంటూ ఇటీవల ఏకంగా ముఖ్యమంత్రికే మొరపెట్టుకుంది. కానీ ఇప్పుడు అవే చమురు ధరల పెంపు తమకు మరో రకంగా కలిసొచ్చిందని సంబరపడుతోంది. గత కొన్నిరోజులుగా వరుసపెట్టి పెరుగుతున్న చమురు ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులు, సొంత బండ్లకు కాస్త విరామం ఇచ్చి బస్కెక్కేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఉన్నట్టుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. మళ్లీ మునుపటి రోజులు.. గతేడాది మార్చి 21.. ఆర్టీసీకి టికెట్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.13 కోట్లు.. ఇక అంతే మళ్లీ ఒకరోజు రూ.13 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కళ్ల చూడలేదు. మధ్యలో సంక్రాంతి సందర్భంగా ఆమేర ఆదాయం నమోదైనా.. అది ప్రత్యేక బస్సుల చలవే.. సాధారణ రోజుల్లో రూ.10 కోట్లను మించటమే గగనంగా మారింది. బస్సులు నడుస్తున్నా సగం సీట్లు ఖాళీగానే ఉంటుండటంతో ఆక్యుపెన్సీ రేషియో లేక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇప్పుడు డీజిల్, పెట్రోలు ధరలు భారీగా పెరిగిపోవటంతో సొంత వాహనాల్లో తిరిగే చాలామంది బస్సుల వైపు మళ్లటం కనిపిస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ఆర్టీసీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాకాలం తర్వాత గత సోమవారం (15వ తేదీ) ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.13.25 కోట్లుగా నమోదైంది. అంతకుముందు మూడ్రోజుల పాటు కూడా రూ.13 కోట్లకు కాస్త చేరువగా నమోదైంది. వెరసి లాక్‌డౌన్‌కు పూర్వం ఉన్న పరిస్థితి దాదాపు కనిపిస్తోంది. సాధారణంగా మంగళవారాల్లో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. లాక్‌డౌన్‌కు పూర్వం మంగళవారం రోజు సగటు ఆదాయం రూ.11.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల మధ్య నమోదయ్యేది. గత మంగళవారం (16వ తేదీ) రూ.11.72 కోట్లు రికార్డయింది. ఏడాది క్రితం ఇదే రోజు ఆదాయం రూ.11.53 కోట్లుగా నమోదైంది. లాక్డౌన్ తర్వాత మంగళవారాల్లో ఇంత మొత్తం వసూలు కావటం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే రోజు నమోదైన ఓఆర్ 63 శాతమే.. కిలోమీటరుకు ఆదాయం సగటు రూ.34.70గా ఉండగా, గతేడాది ఇదే రోజు రూ.33.25గా నమోదైంది. గతేడాది ఇదే రోజు రాష్ట్రంలో బస్సులు 34.69 లక్షల కిలోమీటర్లు తిరిగితే, గత మంగళవారం (16వ తేదీ) 33.80 లక్షల కి.మీ. తిరిగాయి. అంటే గతేడాది ఇదే రోజు కంటే ఈసారి తక్కువ తిరిగినా ఆదాయం ఎక్కువగా రావటం విశేషం. కోవిడ్ భయం తగ్గినా.. లాక్డౌన్ సమయంలో సొంత వాహనాల్లో తిరిగేందుకు ప్రాధాన్యమిచ్చిన చాలామంది బస్సులు ఎక్కేందుకు భయపడ్డారు. కానీ కోవిడ్ భయం దాదాపు సమసినా కూడా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సొంత వాహనాల్లో తిరిగే అలవాటు నుంచి బస్సుల వైపు మళ్లలేకపోయారు. ఫలితంగా ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతాన్ని దాటేందుకు చాలా సమయం పట్టింది. క్రమంగా జిల్లా సర్వీసుల్లో అది 60 శాతాన్ని మించినా సిటీ బస్సుల్లో మరీ తక్కువగా 45 శాతంగానే ఉంటూ వచ్చింది. హైదరాబాద్‌లో సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నగరంలో రోడ్లు విపరీతంగా రద్దీగా మారటమే దీనికి నిదర్శనం.. అంతకుముందు క్రమం తప్పకుండా బస్సుల్లో తిరిగిన వారు కూడా సొంత వాహనాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో పెట్రోలు ఖర్చును చూసి బెంబేలెత్తి మళ్లీ బస్సులెక్కేందుకు ఆసక్తి చూపటం ప్రారంభించినట్టు ఆర్టీసీ గుర్తించింది. ఆదాయం ఒక్కసారిగా పెరిగేందుకు ఇదే ప్రధాన కారణమని తేల్చింది. పాత ట్రిప్పుల పునరుద్ధరణ.. తాజాగా ఆర్టీసీ ఆదాయం పెరగటంతో లాక్‌డౌన్‌కు పూర్వమున్న ట్రిప్పులను పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. లాక్డౌన్ తర్వాత బస్సులు తిరిగి ప్రారంభమైనా.. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండటంతో చాలా ప్రాంతాలకు ట్రిప్పులు రద్దు చేశారు. కొన్ని ఊళ్లకు అసలు బస్సులే వెళ్లటం లేదు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వారం రోజులుగా ఆక్యుపెన్సీ రేషియో పెరగటంతో మళ్లీ పాత ట్రిప్పులను పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. డిపోల వారీగా అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి, ఇదే మంచి తరుణమని, ప్రజలు తిరిగి బస్సులెక్కేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. ఒకసారి బస్సులెక్కటం తిరిగి మొదలైతే మళ్లీ వారు సొంత వాహనాల వినియోగానికి ఇష్టపడరన్న విషయాన్ని గుర్తించి సిబ్బంది వ్యవహరించాలని పేర్కొంటున్నారు. ఈ విషయంలో బాగా పనిచేసే సిబ్బందికి పురస్కారాలు ఇవ్వాలని కూడా నిర్ణయించటం విశేషం.. -
సొంతూళ్లకు సొంత వాహనాల్లోనే..
సాక్షి, అమరావతి: తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతికి సొంతూళ్లు వెళ్లేవారు ఎక్కువగా సొంత వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. బస్సులకు డిమాండ్ తగ్గిపోయింది. హైదరాబాద్–విజయవాడ మార్గంలో (ఎన్‌హెచ్–65) సొంత వాహనాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో ఈ మార్గంలో నాలుగువేల నుంచి ఐదువేల వ్యక్తిగత వాహనాలు టోల్గేట్లను దాటుతుంటాయి. రెండురోజుల నుంచి 12 వేల వరకు వాహనాలు టోల్గేట్ల మీదుగా వెళుతున్నాయి. సొంతూళ్లకు సొంత వాహనాలు, క్యాబ్‌లనే ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారనేందుకు ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో డిమాండ్ తక్కువగా ఉండటమే నిదర్శనం. ఆర్టీసీ రెగ్యులర్ రిజర్వేషన్లు కూడా 60 శాతం దాటడం లేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే సగం సీట్లు కూడా నిండలేదు. ఆర్టీసీ రిజర్వేషన్లను ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆరురోజులు పరిశీలిస్తే రెగ్యులర్ సర్వీసుల్లో 60 శాతం ఆక్యుపెన్సీ దాటలేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే 48.03 శాతం రిజర్వేషన్లే అయ్యాయి. ఈ దఫా ఆర్టీసీ రిజర్వేషన్లపై ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. పండుగకు వెళ్లేందుకు, తిరుగు ప్రయాణంలోను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి ఆర్టీసీ ఈ నెల 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీలోని ముఖ్య నగరాలకు, పట్టణాలకు 571 సర్వీసులు ఏర్పాటు చేసింది. వీటితో పాటు రెగ్యులర్‌గా నడిచే సర్వీసులు అన్ని జిల్లాలకు 1,988 వరకు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు ఈ సీజన్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు కేవలం 115 మంది మాత్రమే కావడం గమనార్హం. అధికశాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లలోనే.. మామూలుగా సంక్రాంతి పండుగ సీజన్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు, తిరుగు ప్రయాణానికి అడ్వాన్స్ రిజర్వేషన్లు చేయించుకుంటారు. వీరి డిమాండ్ కారణంగానే రెగ్యులర్, ప్రత్యేక సర్వీసుల్లో నెలముందే రిజర్వేషన్ల ఆక్యుపెన్సీ 30 నుంచి 35 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్ రిజర్వేషన్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో 90 శాతం మంది ఉద్యోగులు సొంతూళ్లలోనే ఉన్నట్లు ఆర్టీసీ ట్రాఫిక్ వింగ్ అంచనా వేస్తోంది. రిజర్వేషన్లు బాగా తక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. విద్యాసంస్థలు తెరవకపోవడం, ఆన్లైన్ క్లాస్‌లు జరగడం వల్లే విద్యార్థులు కూడా సొంత ప్రాంతాలను దాటి రాలేదని, అందువల్లే రిజర్వేషన్లు చేసుకోలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర,, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆశాజనకంగా రిజర్వేషన్లు ఉన్నాయి. -
ముగిసిన ఆర్టీసీ భేటీ.. వీడని సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసు ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు భేటీ అవ్వగా.. 2.65 లక్షల కిలోమీటర్లకు 65 వేల తగ్గించుకుంటామని గతంలో చెప్పిన ఏపీ మరో 40వేల కిలోమీటర్లు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. చదవండి: ఆర్టీసీ సిబ్బంది విభజనలో ‘సుప్రీం’ స్టే అయితే తాజాగా తాము లక్ష 61 వేల కిలోమీటర్ల నడుపుకుంటామని మీరు(ఏపీ) కూడా లక్ష 61వేల కిలోమీటర్లు నడుపుకొండని టీఎస్ఆర్టీసీ అధికారులు ఏపీ ఆర్టీసీ అధికారులకు సూచించారు. దీనిపై ఆలోచించిన ఏపీ అధికారులు మరోసారి నిర్ణయం తీసుకొని భేటీ అవుతామని చెప్పారు. కాగా దసరా పండక్కి బస్సులపై తెలంగాణ అధికారులకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. చదవండి: మరోమారు చర్చలు.. బస్సులు నడిచేనా? -
రోడెక్కిన సిటీ బస్సులు
-
రోడెక్కిన సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆరునెలల తర్వాత హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి సిటీ బస్సులు రోడెక్కాయి. మొత్తం బస్సుల్లో 25 శాతమే తిప్పనున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయి సిటీ బస్సుల రవాణా గురించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో పావు వంతు బస్సులు తిప్పటమే ఉత్తమమంటూ ఆర్టీసీ ఎండీ ఇచ్చిన నివేదిక మేరకే సీఎం అనుమతి ఇచ్చారు. శుక్రవారం ఉదయం షిఫ్ట్ నుంచి బస్సులు తిరుగుతున్నాయి. వారం, పది రోజుల తర్వాత పరిస్థితి సానుకూలంగా కనిపిస్తే, 50 శాతం బస్సులను అనుమతించనున్నట్టు సమాచారం. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా అంతర్రాష్ట్ర బస్సులను పునరుద్ధరించేందుకు సీఎం అనుమతించారు. ఈ సర్వీసులు కూడా శుక్రవారం నుంచే ప్రారంభమవుతాయి. ముఖ్యమైన ఆంధ్ర–తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో కదలిక రాలేదు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే జిల్లా సర్వీసులు తిరుగుతుండగా, బుధవారం హైదరాబాద్ శివారు గ్రామాలకు మఫిసిల్ సర్వీసులు మొదలయ్యాయి. ప్రధాన రూట్లలో ఎక్కువ.. ప్రభుత్వ నిర్ణయం మేరకు హైదరాబాద్ నగరంలో తొలుత దాదాపు 625 బస్సులు తిప్పుతున్నారు. అయితే ఇందులో రద్దీ ఎక్కువగా ఉండే ముఖ్యమైన రూట్లలోనే ఎక్కువ సర్వీసులు తిప్పనున్నారు. కీలకమైన ఎయిర్‌పోర్టు రూట్‌తోపాటు పటాన్చెరు–చార్మినార్, పటాన్చెరు–హయత్‌నగర్, ఉప్పల్–లింగంపల్లి, గచ్చిబౌలి–దిల్‌సుఖ్‌నగర్‌తోపాటు చార్మినార్, జూపార్కు, ఎల్బీనగర్, చింతల్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు ఉంటాయని తెలుస్తోంది. ఇందులోనూ ఎక్స్‌ప్రెస్ బస్సులే ఎక్కువగా తిరిగే అవకాశం ఉంది. -
ప్రైవేట్ బస్సుల్లో అధిక చార్జీలకు బ్రేకులు
సాక్షి, అమరావతి: ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గత వారం రోజులుగా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ 150 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళుతున్నాయి. ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తొలుత విజయవాడ–హైదరాబాద్ రూట్లో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ► టీఎస్ ఆర్టీసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్రాష్ట్ర ఒప్పందం విషయంలో వెనక్కు తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులు తిప్పే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ వివాదం కొనసాగుతుండటం ప్రైవేట్ ఆపరేటర్లకు కలిసొచ్చింది. ► ప్రతి రోజూ ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో 4 వేల మంది వెళుతున్నారు. ప్రైవేట్ బస్సులే దిక్కు కావడంతో ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ► హైదరాబాద్ నుంచి విజయవాడకు స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీలో రూ.800. ► నాన్ ఏసీ టికెట్ ధర ఆర్టీసీలో రూ.400 వరకు ఉండగా, ప్రైవేట్ ఆపరేటర్లు రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. ► మరోవైపు ట్రావెల్స్ నిర్వాహకులు క్వార్టర్లీ ట్యాక్స్ చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ప్రైవేట్ ట్రావెల్స్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే బస్సులు నడపాలి. ప్రయాణికుల అవసరాలను అవకాశంగా తీసుకుని అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్–విజయవాడ రూట్లో తనిఖీలు చేపడుతున్నాం. – ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ -
రైట్ రైట్.. రైతు బజార్
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కిలోమీటర్లు పూర్తయిన బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారుల వద్దకే కూరగాయలు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లనున్నారు. వీటికి ‘వైఎస్సార్ జనతా బజార్లు’గా నామకరణంచేయనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 52 బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చనున్నారు. వీటిని ఆర్టీసీలో ఇంజనీరింగ్ అధికారులు రూపొందించనున్నారు. లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ మొబైల్ రైతు బజార్లను నగరాలు, పట్టణాల్లో తిప్పింది. ఈ ప్రయోగానికి వినియోగదారుల నుంచి స్పందన రావడంతో ఆర్టీసీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాన్ టిక్కెట్ రెవెన్యూ కింద ఆర్టీసీ ఆదాయం ఆర్జించేందుకు ఉపకరించడంతో ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖకు సంజీవని బస్సులు, మార్క్‌ఫెడ్‌కు మొబైల్ రైతు బజార్లు బస్సులను తిప్పేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. లాక్డౌన్లో రూ.కోట్ల ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా... ► స్క్రాప్ కింద ఆర్టీసీ బస్సులను తీసేయకుండా నో కాస్ట్.. నో ప్రాఫిట్ విధానంలో కార్గో బస్సులుగా, మొబైల్ రైతు బజార్లుగా ఇంజనీరింగ్ అధికారులు మార్చారు. ► కరోనా వ్యాప్తి రైతు బజార్లలో, మార్కెట్లలో ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి వినియోగదారుల వద్దకే సరుకులు తీసుకెళ్లనున్నారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ ఉదంతంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ► లాక్డౌన్ సమయంలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో మొబైల్ బస్సులను తిప్పడంతో ఆదరణ లభించింది. -
సంచార బయో టాయిలెట్లుగా ఆర్టీసీ పాత బస్సులు
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికుల సేవలో అలసి మూలపడిపోయిన పాత బస్సులు ఇక కొత్త అవతారమెత్తనున్నాయి. పట్టణాల్లో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో సంచార బయో టాయిలెట్లుగా మారబోతున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో కొన్ని ప్రారంభించగా.. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ సంచార బయో టాయిలెట్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పురపాలక శాఖ వీటిని ఏర్పాటు చేయబోతోంది. ఆర్టీసీ వద్ద నిరుపయోగంగా ఉన్న పాత బస్సులను బయో టాయిలెట్లుగా మార్చి అన్ని పట్టణాల్లో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. పట్టణాల్లోని బహిరంగ ప్రాంతాల్లో టాయిలెట్లు లేక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా అవస్థ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం సమయంలో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. దేశంలోని కొన్ని ఇతర పట్టణాల్లో పాత బస్సులను సంచార శౌచాలయాలుగా మార్చి వినియోగిస్తున్న విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ వద్ద పాత బస్సులు ఉండటంతో వాటిని ఇలా వినియోగించవచ్చని నిర్ణయించి అధికారులతో చర్చించారు. దాదాపు 700 బస్సుల వరకు సిద్ధంగా ఉన్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో విధుల్లో ఉండే ఆర్టీసీ మహిళా సిబ్బంది కోసం ఛేంజ్ ఓవర్ గదులుగా పాత బస్సులను వాడాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ తీసుకుంది. ప్రయోగాత్మకంగా కొన్నింటిని రూపొందించి అందుబాటులోకి తెచ్చింది. అదే తరహాలో ఇప్పుడు పాత బస్సులను సంచార మరుగుదొడ్లుగా మార్చారు. ఒక్కో బస్సులో నాలుగు టాయిలెట్లు.. ఒక్కో బస్సులో నాలుగు టాయిలెట్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఇందులో ఒకటి ఇండియన్ మోడల్, మూడు వెస్ట్రన్ మోడల్ ఉంటాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ బయో టాయిలెట్లను త్వరలో రూపొందించబోతున్నారు. ఇప్పటికే నగరంలో ఆర్టీసీ సిబ్బంది కోసం రూపొందించిన సంచార శౌచాలయాలను చూసిన మంత్రి పువ్వాడ, అలాంటివి ఖమ్మంలో ఏర్పాటు చేయా లని నిర్ణయించి అధికారులను ఆదేశించారు. -
తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసివేత
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విస్తరణ నిరోధక చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులను మూసివేశారు. అత్యవసర వాహనాలు మినహా వేటినీ అనుమతించడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజా, ప్రైవేట్ రవాణాను ఇప్పటికే నిలిపివేశారు. మూడు రోజుల క్రితమే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేశారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గరికపాడు చెక్‌పోస్టు వద్ద సోమవారం భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని రవాణా, పోలీస్ అధికారులు తేల్చి చెప్పడంతో వాహనదారులు వెనుదిరిగారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో పోలీసులు, రవాణా అధికారులు, వైద్య సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. అత్యవసర సర్వీసుల కోసం ఆర్టీసీ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఆటోలు, క్యాబ్‌లను నిలిపివేసిన రవాణా శాఖ ఆస్పత్రులకు వెళ్లేందుకు మాత్రం మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. - లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సొంత వాహనాల్లో బయలుదేరిన వారిని చెక్ పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. - కోదాడ, భద్రాచలం, నాగార్జున సాగర్, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువైపులా వాహనాలను నిలిపివేస్తున్నారు. కర్ణాట క, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల ను అనుమతించడం లేదు. కోదాడ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. - పాలు, కూరగాయలు, ఔషధాల వాహనాలను మాత్రమే రాష్ట్రం నుంచి బయటకు వెళ్లనిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. - సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని లారీ యజమానుల సంఘం కోరింది. -
ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తా..
ఆర్టీసీ అనగానే.. పాతబడిన, కండీషన్లో లేని డొక్కు బస్సులే సహజంగా గుర్తుకొస్తాయి. వాటి రూపం కూడాఆ భావనకు బలం చేకూర్చుతుంది. వెలిసిపోయిన రంగులు, శుభ్రత లోపించడం, వ్యాపార ప్రకటనలతో నిండిపోవడం వంటి దృశ్యాలే కళ్లముందు కదలాడతాయి. ఇప్పుడా పరిస్థితి మారనుంది. రంగురంగుల వర్ణచిత్రాలతో చూడగానే ఆకట్టుకునేలా వాటి రూపం మారనుంది. ఇచ్చిన హామీ మేరకు ఏపీఎస్ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ప్రజారవాణ శాఖను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల రూపురేఖలను మార్చే దిశగా చర్యలు చేపట్టింది. మన రాష్ట్ర, తెలుగువారి సంస్కతి సంప్రదాయాలను ప్రతిబింబించే వర్ణరంజితమైన చిత్రాలు.. ఇప్పుడున్న వ్యాపార ప్రకటనల స్థానంలో కనువిందు చేయనున్నాయి. అలాగే డొక్కు బస్సులన్న అపప్రదను తొలగించేందుకు రీకండీషన్ కూడా చేయిస్తున్నారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి.. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతోపాటు.. బహుమతులు పొందిన చిత్రాలను.. సంబంధిత విద్యార్థి, పాఠశాల పేరుతో సహా బస్సులపై ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ సీఎండీ మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు. వర్ణ చిత్రాలతో అలంకరించిన 21 బస్సులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని బస్సుల రూపురేఖలను దశలవారీగా మార్చనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం): ప్రగతి చక్రం కొత్త ‘కళ’ను సంతరించుకుంటోంది. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సొబగు లద్దుకుంటోంది. మన పండగలు, దర్శనీయ ప్రదేశాలు, కళలు, రమణీయ దృశ్యాలతో చిత్రీకరించిన బస్సులు ఇకపై కళ్లెదుటే సాక్షాత్కరించనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ ‘మన బస్సు.. మన సంస్కృతి’ పేరిట అందంగా పెయింట్ చేస్తున్నారు. విశాఖ రీజియన్‌లోని 600 బస్సులను దశలవారీగా రీ కండిషన్ చేసి, పెయింటింగ్ వేయించనున్నారు. ప్రయాణికులను ఆకర్షించేలా.. చూడముచ్చటగా రూపొందిన 21 బస్సులను వాల్తేరు డిపో ప్రాంగణంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ కమిషనర్ మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇకపై బస్సులపై ఎటువంటి అడ్వర్టై ్జజ్మెంట్స్ కనిపించవు. ఏడాది పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కళలు, పండుగలు, దర్శనీయ ప్రాంతాలను చిత్రీకరించిన పెయింటింగ్స్‌తో ఆర్టీసీ బస్సులు రూపుదిద్దుకోనున్నాయి. ఆరు నెలల్లో అన్ని బస్సులకూ కొత్త సొబగులు నిర్జీవంగా ఉన్న బస్సులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన పిమ్మట, ప్రజల మనసులకు హత్తుకునేలా స్థానిక కళాకారులచే కళాకృతులను బస్సులపై చిత్రీకరించామని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లో నగరంలోని బస్సులన్నీ కొత్త సొబగులు అద్దుకుంటాయన్నారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో, అందుకు తగినట్లుగా బస్సులకు కొత్త కళను తెస్తున్నామన్నారు. నగరంలో 600 బస్సులున్నాయని, ప్రతి బస్సు రోజుకు 220 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయని తెలిపారు. బస్సులన్నింటినీ సంస్కృతి, సంప్ర దాయాలు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతామన్నా రు. ఇది పెద్దగా ఖర్చయిన వ్యవహారం కాదని, నిర్జీవమైన వాహనాలను రీ కండీషన్ చేసి పెయింట్లు అద్దడంతోనే కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పారు. ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని ఏర్పాటు చేశారని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో ఆ విభాగానికి తొలి కమిషనర్‌గా నియమించారని, దానిని నిలబెట్టుకుని ఆర్టీసీని కొత్తపుంతలు తొక్కిస్తానన్నారు. తాను ఏయూలోనే చదువుకున్నానని తెలిపారు. అనంతరం డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడారు. మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, డ్రైవర్లు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసని, వారికి పలు సూచనలు చేశారు. డ్రైవర్లు వేసుకుంటున్న యూనిఫాంపై స్పందిస్తూ టీ షర్ట్స్ వేసుకుంటే బాగుంటుదన్నారు. కార్యక్రమంలో ఈడీ రవికుమార్, రీజనల్ మే నేజర్ ఎం.యేసుదానం, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(అర్బన్) సుధాబిందు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(రూరల్) కె.వెంకట్రావు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్(అర్బన్) బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్(రూరల్) అప్పలనారాయణ, వాల్తేర్ డిపో మేనేజర్ గంగాధర్‌తో పాటు పలు డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కొలువుదీరిన కళాకృతులు ఆర్టీసీ బస్‌పై చక్కని ఆకృతులు, రమణీయ దృశ్యాలెన్నో సాక్షాత్కరిస్తున్నాయి. ‘అందాల కైలాసగిరి.. ఆంధ్రప్రదేశ్‌కు అదనపు సిరి’, ‘ప్రకృతి ఒడిలో జీవన పోరాటం’, ‘భారతదేశ అన్నపూర్ణ .. మన ఆంధ్రప్రదేశ్’, ‘రైతే మన దేశానికి వెన్నెముక’, ‘డాల్ఫిన్ నోస్ .. విశాఖ సాగర తీర అద్భుతం’, బాపూ బొమ్మలు, చేనేత వస్త్రాల సోయగం, ‘ఉభయ గోదావరి పెన్నిధి..గోదావరి’, ‘అణువణువునా ప్రకృతి..అందమైన అనుభూతి’, ‘విహంగాల సోయగాలు.. కొల్లేటి సరస్సు’, ‘వివాహ భోజనంబు.. పసందైన వంటకాలు’, ‘అబ్దుల్ కలాం కలల కోట .. శ్రీహరికోట’, ‘పక్షి జాతులకు అలవాలం.. పులికాట్ సరస్సు’.. అరకు నృత్యం థింసా.. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రత్యేకతలు.. కళలు బస్సులపై కొలువుదీరుతున్నాయి. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు ప్రతి జిల్లాలో స్కూల్ పిల్లలకు పెయింటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి, వాటిలో ఉన్నత స్థానంలో నిలిచిన పెయింటింగ్‌లను బస్సులపై చిత్రీకరిస్తూ..పెయింటింగ్ వేసిన విద్యార్థి పేరు, స్కూల్ పేరు కూడా పెడతామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ముఖ్యంగా డ్రీమ్ అ»ౌట్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై పెయింటింగ్స్ ఉంటాయన్నారు. అమరావతి సర్వీసులతో పాటు 14.5 మీటర్ల పొడవు గల 18 వోల్వో బస్సులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. వాటికి డాల్ఫిన్ నోస్‌పై ఆర్టీసీ ఎంబ్లెమ్‌తో కూడిన బొమ్మలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు. -
కిటికిటలాడుతున్న మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల రద్దుతో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు కిటికిటలాడుతున్నాయి. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధాన మార్గాల్లోనే బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుమారు 1000 బస్సులను రద్దు చేసేందుకు నిర్ణయించిన గ్రేటర్ ఆర్టీసీ.. దశల వారీగా బస్సుల సంఖ్యను తగ్గిస్తోంది. ఇప్పుటి దాకా 600 బస్సులను రద్దు చేయగా, వేల సంఖ్యలో ట్రిప్పులకు కోతపెట్టారు. రాత్రి వేళల్లో సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల వరకు ఆఖరి మెట్రో బయలుదేరే విధంగా ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలు వేళలను మార్చారు. దీంతో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కాలం నుంచి పెరుగుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య ఇప్పటికే 4 లక్షల మైలు రాయిని దాటింది. వారం రోజులుగా మరో 24 వేల మంది ప్రయాణికులు అదనంగా పెరిగినట్టు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 1150 రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మరిన్ని బస్సులు రద్దు కానున్నాయి. దీంతో సిటీ బస్సు ప్రయాణికుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. ఒకవైపు చార్జీల పెంపు వల్ల కొంత మేర ఆర్టీసీ ఆదాయం పెరిగినప్పటికీ ఆకస్మాత్తుగా బస్సులను తగ్గించడంతో ప్రయాణికుల ఆదరణను కోల్పోవాల్సి రావడం గమనార్హం. ఆదాయం వచ్చే రూట్లలోనూ ట్రిప్పుల కోత నష్టాల నుంచి గట్టెక్కేందుకు బస్సుల రద్దునే పరిష్కారంగా భావిస్తున్న ఆర్టీసీ ఏకపక్ష నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆర్టీసీకి ఆదాయం వచ్చే మార్గాల్లోనూ బస్సులు రద్దు చేస్తున్నారని కండక్టర్లు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఏళ్ల తరబడి బస్సులు నడుపుతున్నాం. ఏ రూట్లో ఎంత ఆదాయం వస్తుందో అధికారుల కంటే మాకే ఎక్కువ తెలుసు. కానీ బస్సులను రద్దు చేయడమే పనిగా పెట్టుకోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా ఆదాయాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది’ అని రాణిగంజ్–1 డిపోకు చెందిన ఓ కండక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. కోఠి–ఈసీఐఎల్, సికింద్రాబాద్–సనత్‌నగర్, నాంపల్లి–హేమానగర్, ఎల్బీనగర్–బీహెచ్ఈఎల్ వంటి రూట్లలో బస్సులు తగ్గాయి. ఉదయం 6 గంటలకు ముందు బయలుదేరే బస్సుల్లో 80 శాతం వరకు తగ్గించినట్లు అంచనా. అలాగే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ట్రిప్పుల సంఖ్యను భారీగా తగ్గించారు. గ్రేటర్లో గతంలో రోజుకు 3,550 బస్సులు రాకపోకలు సాగిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 2,950కి చేరింది. దశలవారీగా మరిన్ని బస్సులు రద్దు చేయనున్నారు. గతంలో రోజుకు 9.5 లక్షల కి.మీ తిరిగితే ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 7 లక్షలకు పడిపోయింది. జనవరిలో జేబీఎస్–ఎంజీబీఎస్ ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తున్న జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్‌లో జనవరి చివరి వారంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 11 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి మీదుగా కోఠి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు చేరుకొనే అవకాశముంది. పెరిగిన మెట్రో దూకుడు ఆర్టీసీ డీలా పడిపోవడంతో మెట్రో దూకుడు పెరిగింది. ఆర్టీసీ సమ్మె కాలం నాటికి 3 లక్షలు ఉన్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగి ప్రస్తుతం 4.24 లక్షల మందికి చేరింది. హైటెక్ సిటీ నుంచి రోజుకు సుమారు 6,125 మంది రాకపోకలు సాగిస్తుండగా, అమీర్‌పేట్ నుంచి మరో 4,102 మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. అలాగే మరో ప్రధాన మెట్రో స్టేషన్ ఎల్బీనగర్ నుంచి 3,950 మంది, మియాపూర్ నుంచి 5,150 మంది, బేగంపేట్ నుంచి 1500 మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కూకట్పల్లి నుంచి 2,200, దిల్సుఖ్నగర్ నుంచి మరో 1430 మంది పెరిగినట్లు అంచనా. మొత్తంగా గతంలో 4 లక్షలు ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.24 లక్షలు దాటిపోయింది. సిటీబస్సుల ట్రిప్పులు తగ్గించే కొద్దీ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. -
మేడారం జాతర.. బస్సులపై బెంగ !
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి(వరంగల్) : ఆసియాలోనే అత్యధిక మంది భక్తులు వచ్చే మేడారం శ్రీసమ్మక్క – సారలమ్మ జాతరపై ఈసారి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ పడనుం దా.. ఒకవేళ సమ్మె ముగిసినా భక్తుల రాకపోకల కు అనుగుణంగా బస్సులు సమకూర్చుకుని నడపగలరా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహా జాతర జరగనుంది. అంటే ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. అయినా ఇంత వరకు ఆర్టీసీ నుంచి ఎటువంటి సన్నద్ధత లేకపోవడం భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. సన్నద్ధత కరువు కోటిమందికి పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్న మేడారం జాతరకు భక్తులను తరలించడంలో ఆర్టీసీ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. జాతరకు నాలుగు నెలల ముందు నుంచే ఆర్టీసీ ఎండీ, ఈడీ వంటి ఉన్నతాధికారులు మేడారం, వరంగల్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేవారు. ఇక్కడి అధికారులను జాతరకు సమాయత్తం చేసేలా సలహాలు, సూచనలు చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీలో నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె కారణంగా మేడారం జాతరకు సంబంధించిన ఊసే ఆర్టీసీలో వినిపించడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం అంతా కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో ఉన్నాధికారులంతా ఆ పని మీదే దృష్టి కేంద్రీకరించారు. దీంతో జాతరకు సంబంధించి ఆర్టీసీ పరంగా ముందస్తు సన్నద్ధత కరువైంది. తగ్గిన బస్సులు ప్రభుత్వ విధానాలను అనుసరించి కొత్త బస్సులు కొనడం కంటే అద్దె ప్రతిపాదికన బస్సులను నడిపించడంపై గత కొంత కాలంగా ఆర్టీసీ ఎక్కువ దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ పరిధిలోని 97 డిపోల్లో 10,640 బస్సులు ఉన్నాయి. వీటిలో అద్దె ప్రతిపాదికన 2140 బస్సులు ఉన్నాయి. సాధారణంగా అద్దె బస్సులను జాతర విధుల నుంచి మినహాయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ సంస్థకు 8,320 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గరుడ, ఏసీ, మినీ పల్లె వెలుగులు, సిటీ సర్వీసులను మినహాయిస్తే ఈ సంఖ్య మరింతగా తగ్గుతుంది. వీటికి తోడు ఇటీవల ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడు నడుస్తున్న బస్సుల్లో ఐదువందలకు పైగా బస్సులు పూర్తిగా చెడిపోయినట్లేనని చెప్పారు. గత జాతర అనుభవాలను పరిశీలిస్తే ఆర్టీసీ సంస్థ కనీసం 3,600 బస్సులను జాతరకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే సంస్థకు అందుబాటులో ఉన్న బస్సుల్లో సగం జాతరకు కేటాయించాలి. ఈ స్థాయిలో పని జరగాలంటే ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సమ్మె కారణంగా ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. సమ్మె సవాళ్లు జాతరకు కేటాయించే బస్సులు పూర్తి స్థాయిలో కండీషన్లో ఉండాలి. మార్గమధ్యలో బస్సులు మొరాయిస్తే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సమస్య ఎదురవుతుంది. గడిచిన నలభై రోజులుగా ఆర్టీసీ సంస్థ అరకొర సౌకర్యాలు, మెకానిక్‌లతో బస్సులను నడిపిస్తోంది. దీంతో బస్సుల కండీషన్ దెబ్బ తింటోందని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. అలవాటు లేని వ్యక్తులు నడిపించడం వల్ల బస్సులు త్వరగా దెబ్బతింటున్నాయనేది వారి వాదనగా ఉంది. సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల భవిష్యత్తులో ఆర్టీసీలో ఎంత మంది కార్మికులు ఉంటారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. జాతర విధులు నిర్వర్తించేందుకు కనీసం పదివేల మందికి పైగా కార్మికులు అవసరం ఉంటుంది. భారీ ప్రణాళిక రోడ్డు సౌకర్యం మెరుగైనప్పటి నుంచి జాతరకు వెళ్లేందుకు ఆర్టీసీపై ఆధారపడుతున్న భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సంస్థ జాతర ప్రారంభానికి నాలుగైదు నెలల ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసేది. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాయింట్లు ఏర్పాటు చేసేది. ఇక్కడ నుంచి మేడారం వరకు భక్తులు రాకపోకలు సాగించేందుకు నాలుగు వేల బస్సులు అందుబాటులో ఉంచేది. 2012 జాతర నుంచి మూడు వేలకు తక్కువ కాకుండా బస్సులను నడిపించారు. గత రెండు జాతరలలో ఏకంగా 3,600 బస్సులు భక్తులను తరలించేందుకు ఉపయోగించగా, నాలుగు వందల బస్సులు అదనంగా అందుబాటులో ఉంచారు. ఈ బస్సులు నడిపేందుకు సుమారు పదివేల మంది కార్మికులు పని జాతర సమయంలో అహర్నిశలు శ్రమించారు. -
హన్మకొండలో మస్తు బస్సులు... అయినా తిరగట్లేదు
సాక్షి, హన్మకొండ : ఓ పక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా.. మరో పక్క తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో అధికారులు బస్సులు నడుపుతున్నారు. కానీ ఈ బస్సులు పూర్తి స్థాయి రూట్లలోకి వెళ్లడం లేదు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయేవి. ఈసారి కార్మికుల సమ్మెను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇతర శాఖల అధికారులను రంగంలోకి దింపి డిపోల వారీగా నోడల్ అధికారులుగా నియమించింది. ఈ మేరకు నడుపుతున్న బస్సులో అ«ధిక శాతం ప్రధాన రూట్లలోనే పరుగులు పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం లేదు. ఒక్కటి, రెండు గ్రామాలు మినహా మిగతా గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు చూడక 13 రోజులైంది. ఫలితంగా వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో దీంతో బస్టాండ్లలో ప్రయాణికుల కంటే బస్సులే అధికంగా కనిపిస్తున్నాయి. పాయింట్ల వద్ద పడిగాపులు హన్మకొండ జిల్లా బస్ స్టేషన్లో శుక్రవారం పరిశీలించగా బస్సులు బారులు తీరి ఉన్నా ప్రయాణికులు అంతంత మాత్రంగానే కనిపించారు. ఫలితంగా బస్సు డ్రైవర్లు చాలాసేపు ప్రయాణికుల కోసం బస్ పాయింట్ల(ప్లాట్ ఫాం) వద్ద వేచి చూస్తూ గడిపారు. బస్సులు పెద్దసంఖ్యలో ఉండడంతో ప్లాట్‌ఫాం ఖాళీ కాగానే అక్కడ బస్సు ఆపేందుకు తాత్కాలిక డ్రైవర్లు పోటీ పడుతున్నారు. తానంటే తానే ముందు వచ్చానని పోట్లాడుకుంటూ బస్సులను తీసుకొస్తుండడంతో ఎక్కడ ఢీకొటంటాయోనన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ఇక కొన్ని రూట్లలో గంటల కొద్ది బస్సులు లేక పోవడంతో ప్రయాణికులు నిరీక్షిస్తూ కూర్చుంటున్నారు. ప్రైవేట్ బస్సులను కూడా బస్టాండ్లలోకి అనుమతిస్తున్నా.. స్థలం సరిపోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద శాతం బస్సులు నడపాలని ప్రయత్నిస్తున్న అధికారులు ప్రధాన రూట్లలోనే నడుపుతూ గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్నారు. జిల్లాలో 726 బస్సులు.. వరంగల్ రీజియన్‌లో 13వ రోజైన శుక్రవారం ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. ఈ మేరకు రీజియన్‌లోని 942 బస్సులకుగాను 726 బస్సులు రోడ్లపై పెరుగులు పెట్టాయి. అలాగే, రాజధాని ఏసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. జేఎన్ఎన్యూఆర్ఎం, వజ్ర బస్సులు మినహా మిగతా బస్సులన్నీ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా 522 ఆర్టీసీ బస్సులు, 204 అద్దె బస్సులు కలిసి మొత్తం బస్సుల్లో 77 శాతం బస్సులు నడిచాయి. ఈ బస్సుల నిర్వహణ కోసం 522 మంది తాత్కాలిక డ్రైవర్లు, 726 తాత్కాలిక కండక్టర్లను నియమించగా, 281 బస్సులను టికెట్లతో, 413 బస్సులను టిమ్‌లతో నడిపారు. తాత్కాలిక కండక్టర్ల చేతివాటం టికెట్లతో నడుపుతున్న బస్సుల్లో కొందరు తాత్కాలిక కండక్టర్లు చేతివాటానికి పాల్పడుతున్నారు. ప్రయాణికులకు ఇచ్చిన టికెట్లను వారు దిగే సమయంలో మళ్లీ తీసుకుని ఇంకొకరికి ఇస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, కొన్ని తక్కువ చార్జీ టికెట్లపై ఎక్కువ ధర రాసి ఇస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. -
సాధారణ బస్సు చార్జీలకు మించి వసూలు చేయొద్దు
సాక్షి, రంగారెడ్డి: ప్రతి బస్సులో చార్జీల పట్టికను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్టేజీ క్యారియర్ తదితర బస్సులు ఈ నిబంధనను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ చార్జీకి మించి ఒక్కపైసా కూడా అదనంగా వసూలు చేయవద్దని, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకుని నడిపిస్తున్న బస్సుల్లో అన్ని రకాల రాయితీ బస్‌పాస్‌లను అనుమతించాలని సూచించారు. 80 శాతం బస్సులను తప్పనిసరిగా ప్రయాణికుల కోసం తిప్పాలన్నారు. ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తీసుకున్న అన్ని బస్సులను రోడ్డెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకుంటే కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయబోమని హెచ్చరించారు. పోలీస్ అధికారులు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల సహకారంతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్లను, ఆర్డీఓలను కోరారు. నైట్‌హాల్ట్ బస్సులను స్థానిక పోలీస్ స్టేషన్లలో నిలపాలని పేర్కొన్నారు. అర్ధంతరంగా బస్సులు మరమ్మతులకు గురైతే 100కు డయల్ చేయాలని సూచించారు. మద్యం మత్తులో విధులకు వచ్చే డ్రైవర్లను, కండక్టర్లను అనుమతించవద్దని పేర్కొన్నారు. రూ.6 కోట్ల మేర నష్టం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో బస్సులు రోడ్డెక్కకపోవడం వల్ల జిల్లాలో ఆర్టీసీకి బుధవారం నాటికి రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణ రోజులతో పోల్చితే దసరా పండగ సీజన్లో ప్రయాణికులు అదనంగా 65 శాతం ప్రయాణిస్తారని పేర్కొంటున్నారు. ఈ లెక్కన గత రెండు రోజుల్లోనే సుమారు రూ.4 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం సుమారు 911 బస్సులు, ప్రైవేటు వాహనాలను రోడ్లపై తిప్పినట్లు డిప్యూటీ ట్రాన్ప్‌పోర్ట్ కమిషనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. ఇందులో ఆర్టీసీ 262, అద్దె బస్సులు 176, ప్రైవేటు కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులు 78, ప్రైవేటు కంపెనీల బస్సులు 62, స్కూల్ బస్సులు 83, ప్రైవేట్ క్యాబ్‌లు 250 ఉన్నాయని వివరించారు. సమ్మె ఇంకా కొనసాగితే ఈ వాహనాల సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్ మృతి
సాక్షి ఖమ్మం : అర్ధరాత్రి 1.20 గంటల సమయం.. రాష్ట్రీయ రహదారి.. వాహనాలు రోడ్డుపై వేగంగా వెళ్తున్నాయి.. ఒకేసారి పెద్ద శబ్దం.. ఆ సమయంలో పక్కనే వినాయకుడి మండపంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూశారు. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొని ఉన్నాయి. రెండు బస్సుల డ్రైవర్లు బస్సుల క్యాబిన్లో ఇరుక్కుపోయి కనిపించారు. అప్పటికే ఒక డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెంది ఉన్నాడు. మరో బస్సులో ఉన్న డ్రైవర్ మూలుగుతూ కనిపించాడు. బస్సుల్లో ఉన్న ప్రయాణికుల హాహాకారాలు. ఏం జరిగిందోనని ప్రయాణికులు పెద్దగా బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించారు. ఈ ఘటన ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 1.20 గంటలకు చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాండూరు డిపోకు చెందిన డీలక్స్ బస్సు తాండూరు నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట వెళ్తోంది. ఏలూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈ రెండు బస్సులు మార్గమధ్యలో తల్లంపాడు ఊరి చివర ఉన్న మూల మలుపు వద్ద అతివేగంతో వచ్చి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో ఏలూరు డిపో బస్సు డ్రైవర్ కిరణ్(40) బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పొట్టకు, తలకు, కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తాండూరు డిపో బస్సు డ్రైవర్ జంగయ్య కూడా బస్సు క్యాబిన్లో ఇరుక్కుని తీవ్ర గాయాల పాలై చావు బతుకుల మధ్య ఉన్నాడు. రెండు బస్సుల్లో ఉన్న 90 మంది ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. కానీ, ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అందులో ఓ మహిళా ప్రయాణికురాలికి తలకు గాయం కావడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరించారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలం పక్కనే వినాయకుడి మండపంలో ఉన్న భక్తులు జరిగిన ఘటన చూసిన వెంటనే గ్రామస్తులను నిద్ర నుంచి లేపి ప్రమాదస్థలానికి తీసుకువచ్చారు. ఈలోపు కొందరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్లు జంగయ్యను, మృతి చెందిన కిరణ్ మృతదేహాన్ని గంటపాటు శ్రమించి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న జంగయ్యను వెంటనే 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదాలకు నిలయం.. తల్లంపాడు గ్రామ శివారు మూలమలుపు అంటేనే తెలిసిన వారు అక్కడకు రాగానే జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ అర్ధరాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ మూలమలుపు వద్ద దగ్గరకు వచ్చే వరకు కూడా రెండు వాహనాల డ్రైవర్లకు ఎదురుగా వాహనం వస్తున్నట్లు అర్థంకాదు. ఈ రహదారిలో ఎక్కువ సార్లు ప్రయాణం చేసిన వారికి కొద్దిగా తెలిసి ఉంటుంది. కొత్తవారు మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కనురెప్ప పాటులో ఘోర ప్రమాదాల్లో ఇరుక్కున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పదేళ్ల కిందట ఇదే మూలమలుపులో ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు ఇదే తరహాలో క్యాబిన్లలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగేళ్ల కిందట డీసీఎం వ్యాన్ లారీ ఇదే స్థలం మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొనగా వ్యాన్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కపోయి మృతి చెందాడు. ఈరెండు ప్రమాదాలు అర్ధరాత్రి సమయంలోనే జరగడం గమనార్హం. అనంతరం రెండు ద్విచక్రవాహనాలు కూడా ఇక్కడే ఎదురెదురుగా ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. రెండేళ్ల కిందట కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఇదే మూలమలుపులో ఆర్టీసీ బస్సు ఢీకొనగా ఆటోలో ఉన్న ఇద్దరు కూలీల పొట్టలోకి బస్సు ముందు భాగంలో ఉన్న ఇనుప రాడ్లు దూసుకెళ్లి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక చిన్నాచితకా ఘటనలు స్వల్ప ప్రమదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు ప్రమదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కాగా, ఘటనా స్థలాన్ని ఖమ్మం, జంగారెడ్డిగూడెం డిపోల ఆర్టీసీ అధికారులు సందర్శించి క్రేన్లతో రెండు బస్సులను వేరు చేశారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి ప్రమాదాలకు నిలయమైన ఈ మూమలుపు వద్ద కనీసం స్పీడు బ్రేకర్లు కూడా లేకపోవడంతో వాహనాలు వేగం తగ్గించకుండా వచ్చి ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించే అవకాశంలేక ఢీకొంటున్నాయి. అయితే స్పీడ్ బ్రేకర్లు ఉం టే అక్కడకు రాగానే వాహనాలు కొద్దిగా వేగం తగ్గించి నడుపుతారని, ప్రమాదం జరిగినా తీవ్రత తగ్గుతుందని తద్వారా ప్రాణ నష్టం కూడా ఉండదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మూలమలుపు ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. డ్రైవర్ జంగయ్యపై కేసు తల్లంపాడు బస్సు ప్ర మాదంలో మృతి చెంది న డ్రైవర్ కిరణ్‌కుమార్(38)ది పశ్చిమగోదా వరి జిల్లా లింగపాలెం మండలం తోచెలకరాయుడుపాలెం గ్రామం. ఆయన అవివాహితు డు. గాయపడిన వారు చింతలపూడికి చెందిన గంటి విజయ్‌కుమార్, ఖానాపురానికి చెందిన రాంకోటి, కె.నర్సింహులు తాండురుకు రజిత, బి.షాబోర్ ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ జంగయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. -
అప్రెంటీస్‌లే ఆయువు!
సాక్షి, హైదరాబాద్: కండిషన్లో ఉంటేనే ఆర్టీసీ బస్సు రోడ్డుపై సరిగ్గా పరుగుపెడుతుంది, క్షేమంగా ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తుంది. కీలకమైన ఆర్టీసీ బస్సుల భద్రతా ప్రమాణాలు ఇప్పుడు ఐటీఐ విద్యార్థులపై ఆధారపడి ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఆర్టీసీలో పరిస్థితి ఇలాగే ఉంది. బస్సు ఎక్కి కూర్చుంటే మనకు అంతాడ్రైవర్ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బస్సు డ్రైవర్ చేతికి వచ్చేముందు దాన్ని సిద్ధం చేసేది డిపో గ్యారేజీ కార్మికులే. బస్సు ఇంజన్ మొదలు, బ్రేకులు, బాడీ, సీట్లు.. ఇలా అన్నింటిని పరీక్షించేది ఈ కార్మికులే. వీరు పచ్చజెండా ఊపిన తర్వాతనే బస్సు డిపో నుంచి బయటకు వస్తుంది. వీరు లేకుంటే బస్సు డిపోకు పరిమితం కావాల్సిందే. కానీ చాలా డిపోల్లో ఈ కేటగిరీ కార్మికుల సంఖ్య తక్కువగా ఉంది. దాదాపు ఏడేళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవటంతో ఖాళీలు ఏర్పడి క్రమంగా వాటి సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆర్టీసీలో దాదాపు వేయికి పైగా ఇలాంటి కార్మికుల కొరత ఉంది. మరి వీరి సంఖ్య ఇంత తక్కువగా ఉంటే బస్సులు కండిషన్లో ఎలా ఉంటున్నాయన్న సందేహం వస్తుంది. కానీ బస్సులు కండీషన్ తప్పకుండా వాటిని కాపాడటంలో ఐటీఐ విద్యార్థులు కీలక భూమిక పోషిస్తున్నారు. అప్రెంటిస్ షిప్‌తో ఆదుకుంటున్నారు ఐటీఐలో చేరుతున్న విద్యార్థుల్లో డీజిల్ మెకానిక్ ట్రేడ్‌పై ఆసక్తి చూపే వారు ఎక్కువ. దీంతోపాటు మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మన్, వెల్డర్ లాంటి ట్రేడ్స్లోనూ చాలామంది చేరతారు. ఇవన్నీ ఆర్టీసీ డిపో గ్యారేజీల్లో అవసరమైనవే. ఆ కోర్సుల్లో భాగంగా చివరలో రెండేళ్లపాటు విద్యార్థులు ఏదైనా నిర్ధారిత సంస్థలో అప్రెంటిస్ షిప్ చేయాల్సి ఉంటుంది. బీహెచ్ఈఎల్, హెచ్ఎల్ లాంటి సంస్థలతో పాటు ఆర్టీసీ కూడా ఆ జాబితాలో ఉంది. కోర్సులో భాగంగా అప్రెంటిస్‌షిప్ ఎక్కడ చేయాలను కుంటు న్నారో విద్యార్థులు ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో భాగంగా ఇంజన్ మెకానిక్కు సంబంధించి చాలామంది ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ చేస్తే భవిష్యత్తులో అందులో ఉద్యోగావకాశం ఉంటుందన్న ఆశనే దానికి కారణం. ప్రస్తుతం అలా ఆర్టీసీలో మూడున్నరవేల మంది ఐటీఐ విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ చేస్తున్నారు. వీరికి విడతలవారీగా పరీక్షలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వ అదీనంలోని స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సర్టిఫికెట్లు అందజేస్తుంది. ఆ తర్వాత వారు ఉద్యోగాన్వేషణ ప్రారంభిస్తారు. ఇలా అప్రెంటిస్‌షిప్ కోసం రెండేళ్ల కాలపరిమితితో ఆర్టీసీలో పనిచేసేవారు బస్సులు కండిషన్లో ఉంచటంలో కీలకంగా మారారు. కొన్ని డిపోల్లో బస్సులను సకాలంలో సిద్ధం చేయటం కుదరనంత ఇబ్బంది ఉంది. ఈ సమస్యకు ఐటీఐ విద్యార్థులు చెక్ పెడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు వీరు ప్రధాన సహాయకులుగా మారి కొన్ని నెలల్లోనే మెకానిక్‌ల స్థాయిలో పనిచేస్తున్నారు. రెండేళ్లపాటు పనిచేయాల్సి ఉన్నందున ఈలోపు పూర్తి పని నేర్చుకుంటున్నారు. సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని వీరు ఆదుకుంటున్నారు. వీరు లేకుంటే బస్సులు కదిలే పరిస్థితి లేదు. కేవలం ఏడు వేల స్టైఫండ్‌తో వారు పని చేస్తుండటం ఆర్టీసీకి కూడా భారంగా లేకపోవటంతో సిబ్బంది నియామకం లేకుండానే వీరి పుణ్యంతో ఆర్టీసీ నెట్టుకొస్తోంది. ఇంతా చేస్తే ఉద్యోగం రాదు.. ఆర్టీసీలో ఉద్యోగం దక్కుతుందన్న ఆశతో ఇక్కడ అప్రెంటిస్‌షిప్ చేసేందుకు వచ్చే ఐటీఐ విద్యార్థులకు చివరకు నిరాశే మిగులుతోంది. ఇక్కడ ఖాళీలున్నా.. సిబ్బంది నియా మకానికి ప్రభుత్వం ఆమోదం లేకపోవటంతో భర్తీ ప్రక్రియ ఉండటం లేదు. అప్రెంటిస్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికెట్ తీసుకుని వెళ్లిపోవటం తప్ప ప్రయోజనం ఉండటం లేదు. భవిష్యత్తులో భర్తీ ప్రక్రియ ఉంటే వీరికి 10% వెయిటేజీ ఉంటుంది. కానీ ఏడేళ్లుగా నియామకాలు లేనందున ఆ అవకాశం ఎప్పు డొస్తుందో తెలియక వారు నిరాశగా వెనుదిరుగుతు న్నారు. వీరికి ఉద్యోగం కావాలి.. ఆర్టీసీకి ఉద్యోగులు కావాలి... ఇలా 2 అవకాశాలు ఉన్నా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం వీరికి స్టైఫండ్‌గా చెల్లిస్తున్న 7 వేలను రెట్టింపు చేస్తే వారి జీతాలు చెల్లించొచ్చు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం సమ కూర్చగలిగితే సరి పోతుంది. ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారు లు కోరుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అవకాశం కల్పించ టం లేదు. వీరి బదులు దాదాపు అంతే మొత్తం చెల్లించి ఔట్ సోర్సింగ్ కింద సిబ్బందిని అడపాదడపా తీసుకుంటున్నా రు. కానీ సంబంధిత కాంట్రాక్టర్ సిబ్బందికి కేవలం 9 వేలే చెల్లిస్తున్నాడు. ఆ డబ్బులు సరిపోక ఆ సిబ్బంది సరిగా పని చేయటం లేదు. దీని వల్ల కాంట్రాక్టర్ లబ్ది పొందటం తప్ప ఇటు ఆర్టీసీ, అటు ఉద్యోగులకు ఉపయోగం ఉండటం లేదు. ప్రస్తుతం 3 రోజులుగా దాదాపు వెయ్యి మంది ఐటీఐ విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసుకుని పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలా మంది తమకు ఉద్యోగావకాశం కల్పించాలని కనిపించిన అధికారినల్లా కోరుతున్నారు. -
బస్ టికెట్స్ చాలా కాస్ట్లీ గురూ..
-
ఏపీకి బస్ టికెట్స్ చాలా కాస్ట్లీ గురూ..
సాక్షి, హైదరబాద్: సార్వత్రిక ఎన్నికల దృశ్య సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యా ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు మంగళ, బుధ వారాల్లో ఫుల్ అయిపోయాయి. రైళ్లలో కూడా రద్దీ పెరిగింది. సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులు.. ఎంజీబీఎస్‌లో పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ రెచ్చిపోతున్నారు. టికెట్ల ధరలు మూడింతలు, నాలుగింతలు చేసేశారు. దీంతో ఓటు వేయాలని బయలుదేరిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా విజయవాడ రూట్లో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఛార్జీలు భారీగా పెంచారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా చాలా రూట్లలో నాన్ ఏసీ బస్సులలో సీట్లు నిండిపోయాయి. ఏసీ సర్వీస్‌లో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ టికెటు రెట్లు భారీగా ఉన్నాయి. మరోవైపు విమాన ధరలు కూడా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ సర్వీస్ టికెట్ల రెట్లు గమనించినట్లయితే.. విశాఖ- రూ.3,200 విజయవాడ- రూ. 2,500 కాకినాడ- రూ. 2,000 గుంటూరు- రూ. 2,200 నెల్లూరు- రూ. 3,000 నుంచి 3,500 తిరుపతి- 2,200 కడప- 1,900 -
ఆవైపు సరే.. కాస్త ఈవైపూ చూడండి!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా కోస్తాకు ప్రత్యేక రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మేరకు ఈ సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు 203 ప్రత్యేక రైళ్లు వేయగా వాటిలో 70 శాతం కోస్తా ప్రయాణికుల కోసం కేటాయించారు. మరో వైపు తెలంగాణ వైపు ప్రయాణించే వారికోసం బస్సులే దిక్కవుతున్నాయి. ఇటు వైపు కూడా ప్రత్యేక రైళ్లను వేసి ఉంటే పండుగ వేళ ప్రయాణాలు సునాయాసంగా జరిగేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది తెలంగాణకు కనీసం 10 రైళ్లు నడిపి ఈసారి ఒక్క రైలైనా ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే 31 డెమూ రైళ్లను ఎందుకు ఎత్తేశారని నిలదీస్తున్నారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దాదాపుగా 203 రైళ్లు నడుపు తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో దాదాపుగా 141కిపైగా కోస్తా ప్రాంతాలకు వేశారు. ఇందులో విజయ వాడ, గుంటూరు, తాడేపల్లిగూడెం, సామర్ల కోట, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. వీటిలో 60 జన సాధారణ్ రైళ్లు ఉన్నాయి. వాటిలో 15 వరకు సాధారణ బోగీలే ఉన్నాయి. మరో 10 సువిధ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో ధరలు 300 నుంచి 400% అధికంగా ఉన్నాయి. సువిధ రైళ్లలో ధరల్ని చూసి ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. దీంతో 60 జన సాధారణ్ రైళ్లు కూడా ప్రత్యేక రైళ్లని ప్రకటించడంతో వీటిలో ఎక్కేందుకు ఎవరూ సాహసించడం లేదు. రోజుకు 4 రైళ్లు కోస్తాలోని వివిధ ప్రాంతాలకు బయల్దేరుతున్నా... ఈ రైళ్లు చాలామటుకు ఖాళీగా వెళ్తుండటం గమనార్హం. మరోవైపు తిరుపతికి 10 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సమాచారం. ఇవి ఆ మార్గంలోని రద్దీకి అనుగుణంగా లేవన్న వాదనలూ వస్తున్నాయి. కుంభ మేళా దెబ్బతో... వాస్తవానికి గతేడాది వరకు తెలంగాణ ప్రాంతాల వైపు సంక్రాంతి సీజన్లో 10 వరకు ప్రత్యేక రైళ్లు నడిపారు. ఈసారి ఒక్క ప్రత్యేక రైలు నడపడం లేదు. మరోవైపు హైదరాబాద్ నుంచి మేడ్చల్, భువనగిరి తదితర ప్రాంతాలకు నడిచే 31 లోకల్ డెమూ రైళ్లను కూడా ఎత్తేశారు. వీటిని కుంభమేళా కోసం తరలించినట్లు సమాచారం. రైళ్లను ఇటూ వేసి ఉంటే... తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి కోసం 5,252 ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. వీటిలో 1500 ఆంధ్రకు నడుస్తుండగా.. మిగిలిన 3,700 బస్సులు తెలంగాణకు నడుస్తున్నాయి. బస్సుకు 50 మంది చొప్పున వేసుకున్నా.. గత వారం రోజులుగా రోజుకు 3.2లక్షల మంది తెలంగాణ వాసులు వివిధ తెలంగాణ జిల్లాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరంతా 50 శాతం అదనపు చార్జీలు చెల్లించి మరీ బస్సుల్లో తిప్పలు పడుతూ వెళ్తున్నారు.ఈ అదనపు మోతను తప్పించడానికి ప్రత్యేక రైళ్లను కూడా వేసి ఉంటే ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గేదని ప్రయాణికులు అంటున్నారు. కనీసం తిరుగు ప్రయాణంలోనైనా..! కనీసం 10 రైళ్లయినా తెలంగా ణకు వేస్తే చాలా మేలు చేసిన వారవు తారని తెలంగాణ ప్రాంత ప్రయాణి కులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేస్తే కనీసం తిరుగు ప్రయా ణంలోనైనా తమకు అధిక చార్జీల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ దారిలోని వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాలు, ముంబై మార్గంలోని మేడ్చల్, కామారెడ్డి, బాసరా, నిజామాబాద్ ప్రాంతాల ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుంది. -
ఆర్టీసీ ఆదాయానికి చిల్లు
.సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలైంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం నుంచి ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ వాసుల్లో అధికశాతం ఊళ్లు 200 కిలోమీటర్లలోపే కాబట్టి వీరంతా నేరుగా బస్టాండ్లకే వచ్చి ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఎక్కుతున్నారు. దూరంగా ఉన్న ప్రాంతాలకు రాజధాని, సూపర్ లగ్జరీ, వజ్ర, గరుడ బస్సుల్లో రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఆంధ్ర బస్సులే ముందు నిండుతున్నాయి ఈసారి తెలంగాణ 5,252 ప్రత్యేక బస్సులను కేటాయించింది. ఇందులో 1,500లకుపైగా బస్సులను ఆంధ్ర ప్రాంతానికే నడుపుతోంది. ప్రముఖ టికెట్ అగ్రిగేటర్ సంస్థల్లో ప్రైవేటు సంస్థలతో పాటు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ సంస్థల బస్సులను కూడా బుక్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ అగ్రిగేటర్ ద్వారా ఆన్లైన్లో టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ సంస్థల టికెట్లు వెనువెంటనే అమ్ముడవుతున్నాయి. కానీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇక్కడ తెలివిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నుంచి బయలుదేరే బస్సుల జాబితాలో కొన్ని డీలక్స్ బస్సులను కూడా చేర్చినట్లు సమాచారం. దీంతో ప్రారంభ ధర టీఎస్ఆర్టీసీ కన్నా తక్కువ చూపిస్తుండటంతో ప్రయాణికులు ఏపీ బస్సులనే ముందుగా బుక్ చేసుకుంటున్నారు. వాస్తవానికి తెలంగాణకు చెందిన కొన్ని బస్సుల్లో దాదాపు రూ.8 వరకు చార్జీలు తక్కువగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు క్యాబ్‌ల హల్చల్.. పండుగ సందర్భంగా తెలంగాణ జిల్లాలకు టీఎస్ఆర్టీసీ దాదాపుగా 3,500 బస్సులు వేసింది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. బస్టాండ్లలోకి ప్రైవేటు వాహనాలు రాకుండా.. వచ్చిన బస్సులకు రద్దీ చిక్కులు లేకుండా ఎప్పటికప్పుడు పంపేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది. అయితే వీరి కన్నుగప్పి ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను తమ వాహనాల్లో తరలిస్తున్నారు. జూబ్లీ, ఉప్పల్, ఎంజీబీఎస్ సమీప గల్లీల్లో వాహనాలు నిలిపి వారే స్వయంగా కారు ఉందని చెప్పి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. రద్దీని ఆసరాగా చేసుకుని బస్సు చార్జీలకు రెట్టింపు చార్జీలను వసూలు చేస్తున్నారు. జిల్లాల బస్టాండ్లలోనూ ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లు తమ దందా కొనసాగిస్తున్నారు. -
సంక్రాంతికి 4,049 ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని స్వస్థలాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం.. ఈ సీజన్లో హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలు.. అలాగే, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రెగ్యులర్ సర్వీసులతో కలిపి మొత్తం 4,029 బస్సుల్ని తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 9–15 వరకు వీటిని తిప్పనుంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు 2,029 ప్రత్యేక బస్సులు.. అలాగే, ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రెండు వేల ప్రత్యేక బస్సుల్ని అధికారులు తిప్పనున్నారు. అయితే, హైదరాబాద్‌లో బస్సుల్ని నిలిపి ఉంచేందుకు ఏపీఎస్ఆర్టీసీకి స్థల సమస్య ఉండటంతో టీఎస్ఆర్టీసీ అధికారులతో ఏపీ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో ఎల్బీ నగర్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని నిలిపి ఉంచేందుకు అక్కడ నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. ఫ్లై ఓవర్‌కు ముందు టీఎస్ఆర్టీసీ నల్గొండ, ఖమ్మం వెళ్లే బస్సుల కోసం ప్రత్యేక స్టాప్ ఏర్పాటుచేసింది. ఫలితంగా విజయవాడ, విశాఖపట్టణం, ఇతర ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు ఎల్బీ నగర్ వద్ద ఏపీఎస్ఆర్టీసీకి స్టాప్ లేకుండాపోయింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు టీఎస్ఆర్టీసీ అధికారుల సహకారంతో టీఎస్ఆర్టీసీ స్టాప్ పక్కనే ప్రత్యేకంగా బస్సుల్ని నిలిపి ఉంచుకునేలా ఏర్పాట్లుచేశారు. కర్నూలు, కడప, తిరుపతి, చెన్నై వైపు వెళ్లే బస్సుల కోసం ఎంజీబీఎస్ వద్ద స్థలం కేటాయించాలని రాష్ట్ర వినతికి టీఎస్ఆర్టీసీ అధికారులు అంగీకరించి సీబీఎస్ వద్ద స్టాప్ కేటాయించారు. -
ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్లలో గోల్మాల్?
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వ్యవహారం ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. అయినవారికి కట్టబెట్టేందుకే యాజమాన్యం టెండర్ల నిబంధనల్లో మార్పులు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల గడువు పొడిగించేందుకు.. పాత బస్సులను తిప్పుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం అనుమతించడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సుల్లో సింహభాగం ప్రభుత్వంలో కీలక మంత్రి బినామీవేననే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా అద్దె బస్సులకు టెండర్లు పిలిచినప్పుడు కొత్త బస్సులను తీసుకునేందుకు మాత్రమే యాజమాన్యం అనుమతివ్వాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా 2014 నుంచి కొనుగోలు చేసిన బస్సులనూ అనుమతించేలా టెండర్ల నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో బస్సులు కొనుగోలు చేసి కిస్తీలు కట్టని వాటిని ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేశాయి. 2014 నుంచి ఇప్పటివరకూ ఇలాంటి బస్సులు 400 వరకు ఉన్నాయి. వీటిని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుకునేలా ఓ ఫైనాన్స్ సంస్థ ఆర్టీసీ అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని, అందువల్లే పాత బస్సులను టెండర్లలో అనుమతిస్తూ నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత బస్సుల్ని అనుమతించడం ద్వారా బస్సుల ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. అద్దె ప్రాతిపదికన 250 బస్సులకు టెండర్లు ఆర్టీసీలో రెండు విడతలుగా అద్దె ప్రాతిపదికన 250 బస్సుల్ని సమకూర్చుకునేందుకు యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దఫా 150 బస్సులకు, రెండో దఫా మరో వంద బస్సులకు టెండర్లు పిలిచింది. మొదటి విడతలో 50 బస్సులకు మాత్రమే టెండర్లు ఖరారు చేశారు. ఈ 50 బస్సుల్లోనూ 20 బస్సులకు మాత్రమే అద్దె బస్సుల నిర్వాహకులు కొత్త ఛాసిస్ నెంబర్లు ఆర్టీసీకిచ్చారు. మిగిలిన 30 బస్సులను ఆర్టీసీలో తిప్పుతారా లేదా? అన్నది ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. రెండో దఫా పిలిచిన వంద బస్సుల టెండర్లలోనూ యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు.. సొంతంగా బస్సుల్ని సమకూర్చుకోకుండా అద్దె బస్సుల సంఖ్య పెంచుకునేందుకు ఆర్టీసీ తాపత్రయపడడంపైనా విమర్శలు వస్తున్నాయి. టెండర్ల ఖరారుకు వాయిదాల పర్వం అద్దె బస్సుల టెండర్ల ఖరారుకు ఆర్టీసీ వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. టెండర్ల దాఖలుకు గడువు ముగిసినా మంగళవారం వరకు గడువిచ్చింది. పాత బస్సులను తిప్పేందుకు అనుమతివ్వడం.. అదీ ఏళ్ల కిందట సీజ్ చేసిన బస్సుల్ని టెండర్ల ద్వారా తీసుకునేందుకు యాజమాన్యం కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. దీనిద్వారా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణీకుల భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చేసిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
దసరాకు అదనపు బస్సులు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను నడుపుతామని టీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఎంజీబీఎస్‌లో విలేకరుల సమావేశంలో యాదగిరి మాట్లాడారు. తెలంగాణాతో పాటు ఆంధ్రా, ముంబాయి, బెంగుళూరు, చెన్నై, పూణె ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతున్న సందర్భంగా 8వ తేదీ సాయంత్రం నుంచే రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని వెల్లడించారు. 13,14 తేదీలతో పాటు 19న కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపేందుకు సిద్ధం చేశామని తెలిపారు. పండుగ సందర్భంగా 4480 బస్సులను అదనంగా తిప్పుతున్నామని చెప్పారు. తెలంగాణ జిల్లాలకు ఎక్కువ సర్వీసులు నడుపుతామని అన్నారు. ఓపీఆర్ఎస్ ఆధారంగా అదనపు బస్సులను ఇంటర్‌స్టేట్‌లకు నడుపుతామని తెలిపారు. ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. రద్దీ తగ్గించేందుకు నగర శివార్ల నుండి సర్వీసులను నడిపిస్తామని వెల్లడించారు. వరంగల్, యాదగిరిగుట్ట నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే నడుస్తాయని, ఉత్తర తెలంగాణ సర్వీసులను జేబీఎస్‌కే పరిమితం చేస్తామని తెలిపారు. రాయలసీమకు సీబీఎస్ హ్యాంగర్ నుంచి నడిపే వాళ్లం కానీ అది పడిపోయినందుకు ఎంజీబీఎస్ నుంచి ఆపరేట్ చేస్తామని అన్నారు. కాచీగూడ బస్టాండ్ నుంచి స్పెషల్ బస్‌లను నంద్యాల, కడప, చిత్తూరు, నందికొట్కూరు ప్రాంతాలకు నడుపుతామని చెప్పారు. నల్గొండ జిల్లా బస్సులను దిల్సుఖ్నగర్ నుంచి, విజయవాడ రూట్ బస్సులు కూడా ఎంజీబీఎస్ నుంచి కాకుండా నగర శివార్ల నుంచి, కొన్ని ఆంధ్రా ప్రాంత సర్వీసులు ఎల్బీనగర్ నుంచి, తిరుపతికి ఎంజీబీఎస్ నుంచి నడుపుతామని వెల్లడించారు. 16,17, 18 తేదీల్లో ఎంజీబీఎస్ నుంచి సిటీ బస్సులను నగర శివార్లకు నడుపుతామని వివరించారు. సమాచారం లేక ఎంజీబీఎస్‌కు వచ్చేవారు ఈ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. బెంగుళూరు నుంచి వచ్చివెళ్లే వారికోసం 90 బస్సులు అదనంగా సిద్ధం చేశామని.. టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్పెషల్ సర్వీసులకు 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. -
నిర్లక్యం ఖరీదు!
జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, డబ్బతిమ్మయ్యపల్లి, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట గ్రామాలు కొండగట్టు పుణ్యక్షేత్రానికి శివారులో ఉంటాయి. ఈ గ్రామాలకు గత కొన్నేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. పది రోజులకు ముందు వరకు ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు మీదుగా కాకుండా, జేఎన్టీయూ, నాచుపల్లి మీదుగా నడిపించేవారు. పది రోజులుగా ఆర్టీసీ అధికారులు రూట్ మార్చారు. ఒక మార్గంలో వెళ్లి మరో మార్గంలో వచ్చేలా రూపొందించారు. గ్రామాలకు వెళ్లేటప్పుడు జేఎన్టీయూ, నాచుపల్లి, పూడూర్, దొంగలమర్రి మీదుగా వెళ్తుంది. వచ్చేటప్పుడు జగిత్యాలకు వెళ్లే రూట్లోనే కొండగట్టు పుణ్యక్షేత్రం ఘాట్ రోడ్డు మీదుగా నడుపుతున్నారు. ఘాట్ రోడ్డు పక్కనే లోయలు ఉండటంతో బస్సును నడిపించవద్దని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. కానీ ఆర్టీసీ అధికారులు ఘాట్ రోడ్డుపై నుంచి బస్సు నడపడం, అది ప్రమాదానికి గురికావడంతో అమాయకులు మృత్యువాత పడ్డారు. సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం కంటే ఘోరం.. ఉన్మాదం కన్నా దారుణం.. ఊచకోత కంటే భయానకం.. అదే నిర్లక్ష్యం.. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టుపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి కారణం ముమ్మాటికీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే. సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కించి ఘాట్ రోడ్డు గుండా తీసుకురావడమే ప్రమాదానికి ప్రధాన కారణం. 70 ఏళ్ల ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ జరగని ఘోరం జరిగిపోయింది. ఏకంగా 57 మందిని పొట్టనపెట్టుకుంది నిర్లక్ష్యమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆదాయం కోసమే తెరిచారు.. వాస్తవానికి ఇక్కడ ప్రమాదాలు కొత్తకాదు. గతంలోనూ పలుమార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. 2005లో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాపడి 30 మంది మరణించారు. 2011లో ఇదే ఘాట్‌రోడ్డుపై లారీ బోల్తాపడి 16 మంది హనుమాన్ భక్తులు అసువులుబాసారు. దీంతో అప్పుడు కలెక్టర్‌గా ఉన్న స్మితా సబర్వాల్ ఈ ఘాట్‌రోడ్డు గుండా రాకపోకలను నిషేధించారు. ఈ ప్రాంతం జగిత్యాల జిల్లా కిందకు వచ్చింది. గతేడాదిగా ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగించాలని స్థానిక అధికారులు డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం దూరం తగ్గుతుంది.. టార్గెట్ పెరుగుతుంది.. వీలైనంత మంది ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకోవచ్చన్న అత్యుత్సాహమే ఇంతమంది ప్రాణాలు బలితీసుకుంది. బస్సుల ప్రమాదాలు... సురక్షిత ప్రయాణానికి చిరునామాగా ఉన్న ఆర్టీసీ బస్సులు కొంతకాలంగా తీవ్ర ప్రమాదాలకు హేతువులుగా నిలుస్తుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా జరిగిన కొండగట్టు ప్రమాదం ఏకంగా ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక మందిని బలితీసుకున్న విషాదకర దుర్ఘటనగా నిలిచిపోయింది. గతంలో జరిగిన ఘటనలు.. - 2013 అక్టోబర్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది దుర్మరణం చెందారు. - 2018 మే 26 సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 16 మంది చనిపోయారు. - 2018 మే 29 కరీంనగర్ సమీపంలోని మానకొండూరు (చెంజర్ల) వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు చనిపోయారు. - 2018 సెప్టెంబర్ 10న గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు ప్రయాణికులు మరణం. కొండగట్టు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి .. సాక్షి, న్యూఢిల్లీ: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు తెలుగులో ప్రకటన వెలువడింది. ‘కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటున్నదని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు. ప్రమాదాన్ని మాటల్లో చెప్పలేని విషాదకర దుర్ఘటనగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ సంతాపం.. కొండగట్టు బస్సు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన కలచి వేసిందని పేర్కొన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జగిత్యాల జిల్లా కలెక్టర్‌తో గవర్నర్ మాట్లాడారు. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ తీవ్ర విచారం.. సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం ఆవేదన చెందారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కొండగట్టు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అమ్మను చూపించరా.. గాయపడిన అమ్మ ఓ చోట.. చనిపోయిన కొడుకు మరో చోట. ‘నేను చని పోయినా ఫర్వాలేదు.. నా కొడుకును బతికించండి’ అంటూ ఓ తల్లి రోదన. ‘నాకు మా అమ్మను చూడా లని ఉంది. ఒక్కసారి చూపించండి అంకుల్’ అంటూ గాయాలతో డాక్టర్‌ను వేడుకుంటున్న ఐదేళ్ల చిన్నారి. రోదనలు.. వేదనలు.. ఆప్తుల ఆర్త నాదాలు.. జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో ఎటు చూసినా ఇదే పరిస్థితి. కాలు తెగిపోయిన ఓ వృద్ధురాలు.. చేయి విరిగిన ఓ యువతి, తలకు తీవ్రగాయాలై రక్తం, వాంతులతో మాట్లాడలేని స్థితిలో వృద్ధుడు, ఒకే కుటుంబంలో అందరూ చనిపోవడం, నిండు గర్భిణులు మృత్యువాత పడటం, ఆసుపత్రి మంచం మీద పడుకోబెట్టగానే చనిపోయిన మహిళలు.. అన్నీ కన్నీరు తెప్పించే దృశ్యాలే. మనసును మెలిపెట్టే సన్నివేశాలే. మృతులు, క్షతగాత్రుల బంధువులు వేల సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని తమ వారి కోసం వెతుకు తుండటం కనిపించింది. తమతో పాటే బస్సెక్కిన వారు ఏమయ్యారో తెలియదు.. ఎవరు చని పోయారో.. ఎవరో బతికున్నారో చెప్పేవారు కూడా లేని దుస్థితి. కలసిన వారినల్లా ‘సార్.. మా అమ్మ ఎక్కడుంది, మా అయ్య ఎక్కడున్నడు’ అంటూ రోదిస్తూ అడగడం కనిపించింది. ఉద్యోగం వచ్చిందని అమ్మకు చెప్పేందుకు వచ్చి.. హిమ్మత్‌రావుపేట గ్రామా నికి చెందిన పడిగెల స్నేహ లత ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. వెంటనే ఉద్యోగం సంపాదిం చింది. ఇంటి వద్ద ఉన్న తల్లిదండ్రులకు ఉద్యోగం వచ్చిందని చెప్పి, తిరిగి బస్సులో వెళ్తూ మృతువాత పడింది. ఎప్పుడైనా వాళ్ల నాన్న దొంగలమర్రి వద్ద దించుతుండేవాడు. కాని తండ్రి వ్యవసాయ పను లకు పోవడంతో, ‘‘బస్సులో వెళ్తా. కొండగట్టు కింద దిగి హైదరాబాద్‌కు వెళ్తా’’ అని ఇంట్లో చెప్పిన కొద్ది నిమిషాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. డెలివరీ కోసం వస్తూ.. శనివారంపేటకు చెందిన ఎండ్రికాయల సుమలత నిండు గర్భిణి. డాక్టర్లు ఆమెకు బుధవారం డెలివరీ చేస్తామని చెప్పారు. దీంతో అత్త ఎండ్రికాయల వెంకవ్వ, కోనాపూర్‌కు చెందిన తల్లి ఎండ్రికాయల భూలక్ష్మితో కలిసి బస్సు ఎక్కింది. ప్రమాదంలో గర్భిణితోపాటు అత్త, తల్లి కూడా మృత్యువాత పడ్డారు. పెళ్లయిన 9 నెలలకే.. శనివారంపేటకు చెందిన నామల మౌనికది చిన్న వయస్సే. పెళ్లి జరిగి 9 నెలలే అవుతోంది. ప్రస్తుతం మౌనిక 7 నెలల గర్భిణి. డాక్టర్‌కు చూపించుకునేందుకు జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో కన్నుమూసింది. బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని.. బంధువులు జగిత్యాల అసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో, వారిని చూసేందుకు బస్సులో వస్తూ డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన గాజుల రాజవ్వ, గాజుల చిన్నయ్య మృత్యువాత పడ్డారు. దీంతో పరామర్శకని వచ్చి.. విగతజీవులుగా ఆస్పత్రికి చేరుకున్నారని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. అమ్మను ఆసుపత్రిలో చూయించేందుకు వస్తూ.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన సామకూర మల్లవ్వ తన తల్లికి అనారోగ్యానికి గురైంది. జగిత్యాల ఆసుపత్రిలో చూయించేందుకు తల్లితో కలిసి బస్సులో వస్తూ మృత్యువాత పడింది. తల్లి మాత్రం కూతురు కోసం ఆసుపత్రిలో వేచి చూస్తోంది. మధ్యాహ్న భోజన డబ్బు కోసం వెళ్తూ.. సండ్రళ్లపల్లికి చెందిన ఎల్లవ్వ.. గ్రామ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. మధ్యాహ్న భోజన డబ్బుల కోసం మల్యాల మండలంలోని బ్యాంకుకు వస్తూ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది. బిడ్డకు జ్వరం వచ్చిందని.. డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన లైశెట్టి చంద్రకళ కూతురు హైదరాబాద్‌లో పీజీ చదువుతోంది. బిడ్డకు జ్వరం రావడంతో జగిత్యాల ఆసుపత్రిలో చూపిస్తానని చెప్పింది. దీంతో బిడ్డ నేరుగా జగిత్యాలకు రాగా, తల్లి చంద్రకళ బస్సులో జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో తల్లిపై పడి కూతురు రోదిస్తున్న తీరు కలచివేసింది. కళ్లద్దాలు తీసుకుందామని.. శనివారంపేటకు చెందిన బొల్లారపు బాపుకు ఇటీవల కళ్లు సరిగ్గా కనిపించడం లేదు. జగిత్యాల కంటి ఆసుపత్రిలో చూయించుకుని కళ్ల అద్దాలు తీసుకువెళ్దామని చెప్పి బస్సులో జగిత్యాల బయలు దేరి మృత్యువాత పడ్డాడు. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి.. రాంసాగర్‌కు చెందిన ద్యాగల ఆనందం.. ఫ్యాన్ చెడిపోవడంతో జగిత్యాలలో బాగు చేయిస్తామని చెప్పి, ఫ్యాన్‌ను తీసుకుని బస్సులో వెళ్తూ మృత్యువాత పడ్డారు. నూనె పట్టించుకోవడానికి వచ్చి.. హిమ్మత్‌రావుపేట గ్రామానికి చెందిన గండి లక్ష్మి.. పల్లి నూనె పట్టించుకోవడానికి, పల్లీలు తీసుకుని జగిత్యాల బస్సు ఎక్కింది. ప్రమాదంలో మృతిచెందింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: సోమారపు ప్రమాదం జరగడం విషాదకరమని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొ న్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.5 లక్షలు ప్రకటించిందని, ఆర్టీసీ తరఫున మరో రూ.3 లక్షలు ఇప్పిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే.. రూ.15 నుంచి 20 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పా రు. సిబ్బంది లేకపోవడం వల్లే డ్రైవ ర్లకు ఓవర్ డ్యూటీలు ఇస్తున్నామని, రద్దీని బట్టి అధిక డ్యూటీలు ఇస్తు న్నాం తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు.. బస్సు సామర్థ్యం పరంగా అన్ని పరీక్షలు పూర్తిచేసుకుంది. 3 నెలలకోసారి చేసే పరీక్షల్లో భాగంగా ఆగస్టు 9న ఈ బస్సుకు చివరిసారి అన్ని పరీక్షలు పూర్తి చేశారు. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకున్నాడు. జగిత్యాల డిపో బాధ్యతలు చూస్తున్న డీఎం హనుమంతరావు కూడా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నాడు. మరి తప్పు ఎక్కడ జరిగింది? అన్న చర్చ ఇప్పుడు ఆర్టీసీలో జరుగుతోంది. 52 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సులో ఏకంగా 100 మందిని ఎక్కించుకునేలా కండక్టర్లకు టార్గెట్లు పెట్టిన అధికారులదే ఈ పాపం అని ఆర్టీసీ ఉద్యోగులు, స్థానికులు, బాధితుల బంధువులు మండిపడుతున్నారు. పట్టుమని 10 మీటర్ల లోతులేని గోతిలో పడి ఏకంగా 57 మంది దుర్మరణం చెందడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రమాదం జరిగిన మూలమలుపు వద్ద ప్రయాణికులంతా డ్రైవర్ మీద పడేసరికి బస్సు అదుపుతప్పి గోతిలో పడింది. ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం.. కొండగట్టు వద్ద బస్సు లోయలో పడిన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కొండగట్టు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రూ.25 వేలు ప్రకటించిన ఎల్.రమణ బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందిస్తామని రమణ ప్రకటించారు. ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కన్నవారి కలలు కల్లలు కొడిమ్యాల: కొండగట్టు ప్రమాదంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువతీ, యువకులు తనువు చాలించారు. మండలంలోని హిమ్మత్రావు పేటకు చెందిన మల్యాల అనిల్ (19) జగిత్యాల లోని ఎన్ఎస్వీ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం కళాశాలకు బయల్దేరిన అనిల్ బస్సు ప్రమాదంలో మృతిచెందాడు. ఇదే గ్రామానికి చెందిన పడిగెల స్నేహలత (19) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేసి ఆరు నెలలుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. కింది కొండగట్టు వరకు వెళ్లి, అక్కడినుండి కరీంనగర్ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. ప్రమాదంలో తుదిశ్వాస విడిచి, కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. రాంపల్లిలో విషాదం పెద్దపల్లిరూరల్: కొండగట్టు వద్ద మంగళ వారం ఆర్టీసీ బస్సు లోయలో పడ్డ ఘటన పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాంపల్లి గ్రామానికి చెందిన రెండు కుటుం బాలకు చెందిన 8మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు. దురదృష్టవశాత్తు వారిలో నలుగురు మృత్యు వాత పడ్డారు. రాంపల్లికి చెందిన బొంగాని నారాయణ, ఆయన భార్య స్వప్న, కుమారులు రాంచరణ్, పర్శరాములు, తల్లి భూమక్క, చేగుర్తి నుంచి వచ్చిన అత్త బాలసాని రాజేశ్వరీలతో పాటు సమీప బంధువులైన బొంగాని మధునయ్య, మధునమ్మ దంపతులు శనివారం సాయం త్రం దైవదర్శనానికి బయల్దేరారు. కొమురవెల్లి, వేముల వాడ, కొండగట్టు దేవాలయాల్లో మొక్కులు సమర్పించు కుని మంగళవారం తిరుగుపయనమయ్యారు. కొద్దిసేపట్లో దిగుతామనుకునే లోపే తాము ఎక్కిన బస్సు ప్రమాదానికి గురై బొంగాని మధునయ్య (54), బొంగాని భూమక్క (50), బాలసాని రాజేశ్వరి (48), రాంచరణ్ (12)లు అక్కడికక్కడే మరణించారు. బొంగాని నారాయణ, స్వప్న, పర్శరామలు, మధునమ్మలు తీవ్ర గాయాలతో కరీంనగర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వచ్చెవారం పోయిన బాగుండు.. ‘అమవాస్య అయితంది.. మల్లొచ్చే వారం పోతమన్నరు.. ఏమైందో ఏమో శని వారమే బయల్దేరి పోయిండ్రు. వచ్చే వారం పోయినా బతుకుదురు. దేవుని మొక్కులు అప్పజెప్పెతందుకు పోయి దేవుని దగ్గరనే ఉండిపోయిండ్రు’ – బొంగాని చిలకమ్మ, రాంపల్లి సహాయక చర్యల్లో పాల్గొనండి: రాహుల్ కొండగట్టు ప్రమాదంలో 57 మంది మృత్యువాతపడటం పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కుటుంబాలకు సహాయక చర్యలు అందించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిం చాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ప్రథమ చికిత్స.. అధమం
గుమ్మలక్ష్మీపురం (కురుపాం) : అత్యవసర సమయంలో వెంటనే చికిత్స అందిస్తే ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం బస్సులు, పాఠశాలల్లో మందులు, బ్యాండేజీలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టెలను బస్సులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గాయాలైతే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ప్రథమ చికిత్స చేసి తీవ్రతను కొంతవరకు తగ్గించేందుకు ఈ ప్రథమ చికిత్స పెట్టెలు ఉపయోగపడేవి. కానీ ప్రస్తుతం అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. రవాణా వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రదేశాలు.. ఇలా జనసంచారం ఉండే ప్రతి ప్రదేశంలోనూ ప్రథమ చికిత్స సదుపాయం ఉండాలి. బస్సుల్లో ఖాళీ పెట్టెలు బస్సుల్లో పెట్టెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారులు వీటి గురించి పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. నిబంధనల ప్రకారం ఈ పెట్టెల్లో అత్యవసరమైన మందులు, గాయాలకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సయిడ్, అయొడిన్, దూది వంటివి ఉండాలి. కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలు, ఇన్ఫెక్షన్లను నియంత్రించే అత్యవసర మందులు, ఇతర సామగ్రి ఉంచాలి. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, ఇతర చిన్నపిల్లలు, విద్యార్థులుండే ప్రదేశాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన సామగ్రి సహా శిక్షణ పొందిన సహాయకులు ఉండాలి. కానీ పలు వసతి గృహాలకు ఇటీవలే తాత్కాలికంగా ఏఎన్ఎంలను నియమించడంతో హాస్టళ్లను మినహాయించి మరెక్కడా ప్రథమ చికిత్సలకు అవసరమైన పెట్టెలు కనిపించడం లేదు. పాఠశాలల్లో అయితే ఎప్పుడో సమీపంలోని పీహెచ్సీ నుంచి వచ్చే వైద్యాధికారులు నిర్వహించే ఆరోగ్య పరీక్షలప్పుడు విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ముందు జాగ్రత్తగా కొన్ని రకాల మందులు తీసుకుంటున్నారే తప్పా, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉండటం లేదు. పట్టించుకోని ప్రభుత్వ శాఖలు అత్యవసర వైద్య సేవల గురించి ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం మానేశాయి. బస్సులు, ప్రయివేటు వాహనాలు,పాఠశాల బస్సులు, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ఇలాంటి సదుపాయం ఉందా? లేదా? అనే విషయాన్ని రవాణా శాఖ, ఆర్టీసీ, విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలి. సిబ్బందిని చైతన్య పరచి, చిన్న చిన్న ప్రాథమిక చికిత్స చేసేలా అవగాహన కల్పించాలి. ఏర్పాటు చేయాలి జన సంచారం ఉండే ప్రదేశాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రథమ చికిత్సకు సంబంధించి ఎలాంటి సామగ్రి ఉంచకపోవడం విచారకరం. అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స అందితే ప్రాణాలు దక్కించుకోవచ్చు. ప్రభుత్వం స్పందించి ప్రథమ చికిత్స పెట్టెల్ని ఏర్పాటు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. – కుంబురుక దీనమయ్య, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గతేడాది నుంచి రాలేదు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ప్రథమ చికిత్సకు ప్రథమ చికిత్స పెట్టెలు వచ్చేవి. రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపిస్తున్నప్పటికీ ప్రథమ చికిత్సపెట్టెలు రావడం లేదు. వచ్చిన వెంటనే అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తాం. – జి.శోభారాణి, భద్రగిరి సీడీపీఓ -
ఆర్టీసీలో దురుసు ప్రవర్తనకు చెక్!
గుంటూరు / సత్తెనపల్లి: బస్టాపుల్లో ఎప్పటిలానే ఆర్టీసీ బస్సులు వచ్చి ఆగుతాయి. కండక్టర్లు కిందకు దిగి మరీ ప్రయాణికులను దగ్గరుండి బస్సు ఎక్కిస్తారు. వారిలో వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు ఉంటే తమ చేతులనే వారికి ఆసరగా ఇస్తారు. బస్సుకు రైట్ చెప్పాకా టికెట్ కొడుతూనే తమ బస్సుల్లో నిత్యం ప్రయాణించే వారిని చొరవగా పలకరిస్తూ... వారి సాధక బాధకాలు శ్రద్ధగా ఆలకిస్తారు. చక్కని సలహాలతో వారి సమస్యలకు పరిష్కార మార్గమూ సూచిస్తారు. ఎవరు ఎక్కడ చేయి ఎత్తిన కండక్టర్ ఊదె విజిల్‌కు ఏ మాత్రం కాదనకుండా డ్రైవర్ బస్సును ఆపుతాడు. మొత్తం మీద ప్రయాణికులకు ప్రీతిపాత్రమైన డ్రైవర్, కండక్టర్లుగా వారు ఉంటారు. ఇదంతా.... ఆర్టీసీ సంస్థ తమ కండక్టర్లు, డ్రైవర్ల పనితీరును వివరిస్తూ రూపొందించిన ప్రచార చిత్రంలోని సన్నివేశాలు. అగ్గి మీద గుగ్గిలం అయితే నిజానికి ఆర్టీసీ బస్సుల్లో ... ముఖ్యంగా తెలుగు వెలుగు బస్సుల్లోని డ్రైవర్లు, కండక్టర్లు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోయినా, బస్సు ఆగకముందే సీటు నుంచి లేవకపోయినా, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే డ్రైవర్‌ను ఎవరైనా ప్రశ్నించినా... సదరు కండక్టర్, డ్రైవర్ ప్రయాణికులపై అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇక బస్సు పూర్తిగా దిగకముందే, ప్రయాణికులు ఎక్కక ముందే బస్సును కదిలిస్తున్నారు. నిర్ణీత స్టేజి దాటిన తర్వాత మధ్యలో ఎవరైనా చెయి ఎత్తితే... బస్సును ఆపే డ్రైవర్లు కొంత మంది మాత్రమేనన్నది ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న ఆరోపణ. ఇలా శృతి మించిన పోతున్న ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనను గాడిలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నూతన ఎండీ సురేంద్రబాబు తెరపైకి నూతన విధానాన్ని తీసుకువచ్చారు. ప్రయాణికులకు అండగా..... వృద్ధులు ఎక్కేటప్పుడు బస్సును ముందుకు కదిలించడం వల్ల పడిపోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో వృద్ధులు గాయాలపాలుకావడంతో పాటు ప్రాణాలు పోయిన సందర్భాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎండీ సురేంద్రబాబుకు అందిన ఫిర్యాదుల్లో భాగంగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రయాణికులతో దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేది లేదని, సంస్థ అభివృద్ధికి కారణమైన ప్రయాణికులతో హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన పట్ల అభ్యంతరాలు ఉంటే సంబంధిత డిపో మేనేజర్, ఆర్ఎంకు, ప్రధాన కార్యాలయంలో 0866 2570005 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలోనూ అదే పరిస్థితి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల దురుసు ప్రవర్తన సంఘటనలు గుంటూరు రీజియన్‌లోనూ ఉన్నాయి. ఇటీవల ఓ ప్రయాణికుడు చేయి ఎత్తితే బస్సు ఆపక పోవడంతో సదరు ప్రయాణికుడు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ మంత్రూనాయక్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ బస్సు డ్రైవర్‌ను రెండు రోజుల పాటు విధుల నుంచి తప్పించారు. ఇలా పలు డిపోల్లో తెలుగు వెలుగు బస్సులలో కండక్టర్లు, ప్రయాణికులు ఘర్షణ పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ ఇచ్చే సమయంలో అసభ్యంగా మాట్లాడుతూ.. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికులకు సహకరించాల్సిన కండక్టర్లే ఇలా బెదిరింపు ధోరణితో మాట్లాడడంపై వాగ్వాదాలు పెరుగుతున్నాయి. -
ఆర్టీసీ బస్సులు ఆన్ TDP డ్యూటీ
-
ప్రైవేటుకిద్దాం.. కమీషన్ కొట్టేద్దాం!
సాక్షి, హైదరాబాద్: మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు ఏం చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. రూపాయికి రూపాయి చేర్చి ఇబ్బందులను దూరం చేసుకుని ఆదాయాన్ని పెంపు చేసుకుంటారు. కానీ... ఆర్టీసీ దీనికి భిన్నం. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు తంటాలు పడుతున్న వేళ.. మంచి ఆదాయమార్గాన్ని కాలదన్నుకుంది. భారీగా ఆదాయంపొందే అవకాశం ఉన్నా, కమీషన్ల మత్తులో మునిగిపోయిన కొందరు అధికారులు దాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించి నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టేందుకు తెరదీశారు. సంస్థ కంటే సొంతజేబు నింపుకునేందుకే ఓ ఉన్నతాధికారి తెరవెనుక చక్రం తిప్పినట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రెట్లు ఆదాయం పొందే వీలున్నా... దేశంలో తెలంగాణ ఆర్టీసీకి మంచి పేరుంది. దాదాపు 10,500 బస్సులతో 9 వేల గ్రామాలు, అన్ని పట్టణాలతో అనుసంధానమై ఉంది. ఇదే సమయంలో తక్కువ మోతాదు సరుకు రవాణాలోనూ ఆర్టీసీ బస్సులు కీలక భూమిక నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు పార్సిల్ సర్వీసు ధరలతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో సరుకు తరలింపు తక్కువ ఖర్చుతో కూడుకున్నది, సురక్షితం కూడా కావటంతో చాలామంది దీనివైపు మొగ్గుతున్నారు. ఇప్పటివరకు ఈ సరుకు రవాణా బాధ్యతను ఆర్టీసీ ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ వస్తోంది. ఆర్టీసీ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి కొనసాగింది. విడిపోయిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ సొంతంగా నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకున్నా, తెలంగాణ ఆర్టీసీ మాత్రం సొంతంగా నిర్వహించే ఆలోచనను పక్కనపెట్టి ప్రైవేటుకు అప్పగించేందుకే మొగ్గు చూపుతోంది. ఇటీవలి వరకు ఓ ప్రైవేటు సంస్థ ఆ బాధ్యతను చూసింది. ప్రస్తుతం దాని గడువు తీరిపోవటంతో తాజాగా ఆర్టీసీ మళ్లీ టెండర్లు పిలిచింది. ప్రస్తుతం ప్రైవేటు సంస్థ ఆర్టీసీకి సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే చెల్లిస్తోంది. కానీ సరుకు రవాణాను ఆర్టీసీనే సొంతంగా నిర్వహిస్తే ఆ మొత్తం రూ.20 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సొంతంగా సరుకు రవాణా నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని యాజమాన్యానికి సూచనలు అందుతూనే ఉన్నాయి. నెల రోజుల క్రితం అప్పటి ఉన్నతాధికారి ఒకరు ప్రైవేటు సంస్థలతో సమావేశం ఏర్పాటుచేసి సరుకు రవాణాకు టెండర్లు పిలుస్తామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. శనివారం టెండర్లు ఆహ్వానించారు. కమీషన్ల దందాయే కారణమా? ఈ వ్యవహారం వెనక కమీషన్ల దందా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీలో కీలక బాధ్యత నిర్వహించిన ఓ ‘అధికారి’కమీషన్లకు అలవాటుపడి సంస్థ ఆదాయాన్ని సొంత జేబులోకి మళ్లించాడన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఆ అధికారి నిర్వాకం వల్లనే ఆర్టీసీ నష్టాలు మూటగట్టుకున్నదన్న వాదనా ఉంది. ఇప్పుడు మరోసారి టెండర్ల వ్యవహారంతో ఆ విషయం చర్చనీయాంశమైంది. గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష సందర్భంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేం దుకు ఆయన సూచన మేరకు రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటుచేసి ఈడీ స్థాయి అధికారికి అప్పగించారు. కానీ సీఎం ఆదేశాలను ధిక్కరించి సరుకు రవాణా రూపంలో భారీ ఆదాయం వచ్చే వీలున్నా... ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి మరోసారి ఆర్టీసీ ఖజానాపై దెబ్బకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఐఏఎస్/ఐపీఎస్‌కు అప్పగించాలి ఆర్టీసీని అస్తవ్యస్త విధానాలతో తీవ్ర నష్టాలపాలు జేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ.2,500 కోట్ల నష్టాలు వచ్చి పడ్డాయి. కానీ బాధ్యులను గుర్తించలేదు. ఇకనైనా బాధ్యులను గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆదాయం వచ్చే మార్గాలను కూడా కమీషన్ల కోసం మళ్లిస్తున్నవారిని వదలొద్దు. ఆర్టీసీని బాగుచేయాలంటే వెంటనే మంచి పేరున్న ఐఏఎస్ అధికారికి గానీ, ఐపీఎస్ అధికారికిగానీ అప్పగించాలి. కనీసం కార్మికులకు యూనిఫామ్ ఇచ్చే స్థితిలో కూడా లేని సంస్థను వెంటనే గాడిలో పెట్టాల్సిన అవసరముంది. – ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు -
చంద్రబాబు టూర్‌కు ఆర్టీసీ బస్సులు ; ప్రజలకు ఇక్కట్లు
-
తారాస్థాయికి టీడీపీ అధికార దుర్వినియోగం
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వనియోగం తారాస్థాయికి చేరింది. కడపలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సీఎం రమేశ్‌ను పరామర్శించేందుకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తున్నారు. దీంతో జనాల తరలింపుకు సగానికి పైగా ఆర్టీసీ బస్సులను చంద్రబాబు టూర్‌కు కేటాయించారు. అంతేకాకుండా నియోజక వర్గాల ఇంచార్జిల పేర్లు రాసి మరీ బస్సులు తరలించారు. ఈ క్రమంలో బస్సులు లేక బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. 300లకు పైగా బస్సులు బాబు పర్యటనకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు. భద్రతా వలయంలో జెడ్పీ ఆవరణం చంద్రబాబు, ఆయన కుమారుడుచ మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. - రిమ్స్, ఎక్రముక్కపల్లె వైపు నుంచి వచ్చే వాహనాలు ఎల్ఐసీ, అంబేద్కర్ సర్కిల్ మీదుగా కడప నగరంలోకి రావాలి. - కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ - ఎర్రముక్క పల్లె - రాయచోటి వైపుకు వెళ్లాలి. - రాయచోటి వైపు నుంచి వచ్చే వాహనాలు చైతన్య సర్కిల్, ఎర్రముక్కపల్లె, ఎల్ఐసీ సర్కిల్ నుంచి కడపలోకి ప్రవేశించాలన్నారు. - పులివెందుల నుంచి వచ్చే వాహనాలు బిల్టప్, రెండవ గాంధీబొమ్మ మీదుగా కడపలోకి ప్రవేశించాలి. - జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఇర్కాన్ జంక్షన్ మీదుగా, దేవుని కడప నుంచి కడప నగరానికి చేరుకోవాలి. -
ఆర్టీసీకి కలిసొచ్చిన జాతర
మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. ప్రయాణికుల చేరవేత ద్వారా అదనంగా ఆదాయం గడించింది. గత జాతరతో పోలిస్తే ఈసారి ఆదాయం మరింత మెరుగుపడింది. రీజినల్‌లో అన్ని డిపోలకు చెందిన అధికారులు నష్టాలను పూడ్చుకునేందుకు అందివచ్చిన జాతరపై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి బస్సులు నడిపించారు. మంచిర్యాల జిల్లా నుంచి మేడారం జాతరకు అత్యధికంగా భక్తులు వెళ్లడాన్ని గ్రహించిన యాజమాన్యం ఈ దఫా అక్కడి నుంచే బస్సులు నడిపించే ఏర్పాటు చేసుకుంది. రీజినల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ ఆయా డిపోల మేనేజర్లతో సమన్వయం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మందమర్రి, శ్రీరాంపూర్‌లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా డిపోల డీఎంలు పర్యవేక్షిస్తూ బస్సులు నడిపించారు. మొత్తం 294 బస్సులు నడిపి 68,975 వేల మంది ప్రయాణికులను ఆర్టీసీ చేరవేసింది. బస్సుల నడపడం ద్వారా రూ.2.08 కోట్ల ఆర్జించింది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పొల్చితే రూ.78 లక్షలు అదనంగా సాధించారు. డిపోల వారీగా.. మంచిర్యాల డిపోకు చెందిన 94 బస్సులను జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి నడిపించారు. లక్షా 61 వేల కిలోమీటర్లు బస్సులు నడిపి రూ.60.16 లక్షల ఆదాయాన్ని సాధించారు. భైంసా డిపోకు చెందిన బస్సులను శ్రీరాంపూర్ నుంచి నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. 83 వేలు కిలోమీటర్ల బస్సులు తిప్పి రూ.28,37,373 సంపాదించారు. ఆసిఫాబాద్ డిపో 60 బస్సులను బెల్లంపల్లి కేంద్రంగా నడిపి రూ.41,69,608 ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన 53 బస్సులను చెన్నూరు కేంద్రంగా 33 వేల కిలోమీటర్లు నడిపి ప్రయాణికులను చేరవేయడం ద్వారా రూ.41.03 లక్షల ఆదాయం సాధించారు. నిర్మల్ డిపోకు చెందిన 52 బస్సులను మందమర్రి కేంద్రంగా నడిపారు. ప్రయాణికులను మందమర్రి నుంచి మేడారం చేరవేయడం ద్వారా రూ.36.18 లక్షల ఆదాయం సమకూరింది. మంచిర్యాల డిపో నుంచి 2016లో 127 బస్సులు నడిచాయి. 844 ట్రిప్పులతో 32,743 మంది భక్తులను చేరవేశారు. ఈసారి 94 బస్సులు 672 ట్రిప్పులతో 18,492 మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గత జాతర కంటే అధికం.. గత మేడారం జాతరతో పోల్చితే ఈసారి అదనపు ఆదాయం సమకూరింది. 2016లో అత్యధికంగా 364 బస్సులు కేటాయించారు. రూ.2.33 కోట్లు ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. మహదేవ్పూర్, కాళేశ్వరం, మంథని కేంద్రాలు రీజినల్ బస్సులు నడిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బస్సులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా లేకపోవడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డిలకు చెందిన ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకువచ్చి నడిపారు. బస్సు నడిచినా లేకపోయినా రోజుకు రూ.11.500 చెల్లించారు. ఈదఫా జాతర కంటే గతంలో 70 బస్సులను అదనంగా తిప్పారు. ఈ జాతర సందర్భంగా అద్దె బస్సులు, ఇతర జిల్లాల నుంచి బస్సులు నడపకపోవడం వల్ల అదనపు ఖర్చు తగ్గింది. ఈసారి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాలు నుంచి 294 బస్సులు నడిపి రూ.2.08 కోట్లు సాధించారు. మహా శివరాత్రి ఉత్సవాలపై దృష్టి మహా శివరాత్రి నేపథ్యంలో జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి వేలాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు బస్సులు నడపాలని యోచిస్తున్నారు. 25 బస్సులు నడిపి ప్రయాణికులను చేరేవేసేలా చర్యలు చేపట్టారు. కరీంనగర్‌కు బస్సులు నడపడంతోపాటు రద్దీ ఉంటే ఒకటి, రెండు బస్సులను వేములవాడకు తిప్పాలని చూస్తున్నట్లు డీఎం రజనికృష్ణ తెలిపారు. ఆసిఫాబాద్ డిపో నుంచి బుగ్గరాజరాజేశ్వరస్వామి దేవాలయానికి బస్సులు నడపనున్నట్లు తెలుస్తోంది. సమన్వయంతో లక్ష్యాన్ని సాధించాం.. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, అధికారులంతా సమన్వయంతో పనిచేశారు. జాతర వెళ్లే భక్తులకు ఎక్కడ ఇక్కట్లు ఎదురుకాకుండా చూశాం. రీజియన్ నుంచి 294 బస్సులు నడిపి రూ.2.06 కోట్లు ఆదాయం సాధించాం. మంచిర్యాల–మేడారం–మంచిర్యాలకు 68,975 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. సాధారణ రోజుల కంటే రూ.78 లక్షల అదనపు ఆదాయం ఆర్టీసీకి సమకూరడం సంతోషాన్ని కలిగిస్తోంది. – రాజేంద్రప్రసాద్, రీజినల్ మేనేజర్ ఆదిలాబాద్ -
జాతరకు ముందే రూ. కోటి ఆదాయం
భూపాలపల్లి: జాతరకు ముందే ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. జాతర బుధవారం నుంచి జరుగనుండగా మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు మేడారం వచ్చారు. 52 పాయింట్ల నుంచి వచ్చిన 2,490 బస్సుల్లో 1,04,000 మంది భక్తులు మేడారం చేరుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆర్టీసీకి ఒక్కరోజే సుమారు రూ.కోటి ఆదాయం లభించింది. కాగా, 48 వేల మంది భక్తులు మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 60 వేల మంది భక్తులు జాతరలోనే ఉన్నారు. బుధవారం సారలమ్మ తల్లి గద్దెలకు రానున్న నేపథ్యంలో భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రస్తుతం నడిపిస్తున్న సుమారు 2,500 బస్సులతోపాటు అదనంగా మరో 2 వేల బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం సూర్యకిరణ్ తెలిపారు. అందుబాటులో అద్దె బండ్లు.. ఎస్ఎస్ తాడ్వాయి: జాతరకు వచ్చిన భక్తులను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఎడ్ల బండ్లు మేడారానికి చేరుకుంటున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ బస్సులో మేడారం వచ్చే భక్తులను బస్టాండ్ వద్ద దింపుతున్నారు. ఇక ముల్లెమూటలతో వచ్చిన భక్తులు అద్దె బండ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగు వరకు, అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులను తరలించి వారి నుంచి రూ.200 తీసుకుంటున్నారు. అద్దె బండ్లను తీసుకున్న భక్తులు వాటిపై హైహై నాయక అంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ( ఎడ్లబండ్లలో జంపన్నవాగుకు వెళ్తున్న భక్తులు ) -
మేడారం జాతరకు 4200 బస్సులు
సాక్షి, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహా జాతరకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 50 కేంద్రాల నుంచి 4200 లకు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ సందర్బంగా భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు తెలిపారు. రెండేళ్ల క్రితం జాతర సందర్భంగా ఆర్టీసీ 3700 ప్రత్యేక బస్సులను నడపగా.. సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి జాతరకు అదనంగా మరో 500 బస్సులను నడపునున్నట్టు తెలిపారు. ఈసారి సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, గోదావరి ఖని, పెద్దపల్లి వంటి 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. జాతరకు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని మేడారం స్పెషల్ ఆపరేషన్స్ విధుల్లో నియమించారని ఆయన వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సుల ఏర్పాట్లు చేయడంతో పాటు, మేడారం వద్ద ఆర్టీసీ తాత్కాలిక బస్ టర్మినల్ కూడా ఏర్పాటుచేశామన్నారు. కాగా మేడారంలో ఏర్పాటు చేసిన వసతులను ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. వరంగల్‌లో అధికారులతో ఎండీ సమీక్ష నిర్వహించారు. జాతరలో బస్సుల నిర్వహణ, ప్రయాణికుల కోసం ఏర్పాట్లు, బస్ టర్మినల్, భక్తుల డిమాండ్ మేరకు ఆయా రూట్లలో బస్సుల నిర్వహణపై ఆర్ఎంలు, డిపో మేనేజర్లు, అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. -
తొలిరోజు మేడారానికి 450 బస్సులు
హన్మకొండ: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన తొలి రోజు 450 బస్సులు నడిచాయి. వరంగల్ నగరంతో పాటు, జిల్లాలోని ఇతర ప్రత్యేక పాయింట్లు, ఇతర జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రాత్రి 8 గంటల వరకు 450 బస్సులు 1800 ట్రిప్పుల ద్వారా 72 వేల మంది భక్తులను జాతరకు చేరవేశాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ తెలిపారు. భక్తుల రాక, సంఖ్యను బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వెంట వెంటనే పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
20 లక్షల మంది భక్తులు!
సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల బస్సులు.. 11 వేల మంది సిబ్బంది.. 20 లక్షల మంది ప్రయాణికుల తరలింపు లక్ష్యం.. సీసీ కెమెరాలు, ఉపగ్రహం ద్వారా ట్రాకింగ్‌తో పర్యవేక్షణ.. గిరిజన కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక ఇది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అప్పటికప్పుడు సిద్ధంగా ఉన్న ప్రయాణికులెందరు, వారికి ఎన్ని బస్సులు అవసరమన్నది క్షణాల మీద గుర్తించి.. అంతేవేగంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. కనీసం 20 లక్షల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చటం లక్ష్యంగా పెట్టుకున్నందున 4 వేల బస్సులను సిద్ధం చేసింది. మరో ఐదారు వందల బస్సులను స్పేర్‌లో పెట్టుకుంది. హైదరాబాద్ నుంచి మేడారం వద్దకు బస్సును తరలించే వరకు మొత్తం 11 వేల మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. మేడారంలో పెద్ద పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రద్దీని తెలుసుకునేందుకు.. సీసీ కెమెరాలు జాతర జరిగే ప్రాంతంలో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 20 సీసీ కెమెరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆర్టీసీ ప్రాంగణంవైపు వస్తున్న భక్తులు, బస్సుల కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ప్రయాణికుల సంఖ్యను క్షణక్షణం పర్యవేక్షిస్తూ బస్సులను సమాయత్తం చేయనుంది. ఏ బస్సు ఎక్కడుందో ట్రాక్ చేసేందుకు వీలుగా జాతరకు ఏర్పాటు చేసిన బస్సులన్నింటినీ ఉపగ్రహం ద్వారా ట్రాక్ చేసే విధానంతో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. సిబ్బంది వద్ద వాకీటాకీలు ఉంటాయి. జంపన్నవాగు నుంచి ఉచిత బస్సులు జాతరకు వచ్చే వారు తమ వాహనాలను సమీపంలో ఉండే నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ యార్డులో నిలపాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో జాతర వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగుకు కూడా మినీ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిలోనూ ప్రయాణికులను ఉచితంగా తరలించనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం: ఆర్టీసీ ఎండీ రమణారావు ‘ఈ సారి జాతరలో ఆర్టీసీ కీలక సేవలందించనుంది. దాదాపు 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు తరలించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను వాడుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నేను జాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తాను’. -
సొంత ఊళ్లకు 15 లక్షల మంది పయనం
-
15 లక్షల మంది.. పల్లె బాట
సాక్షి, హైదరాబాద్: పట్నం పల్లెకు తరలింది. సొంత ఊళ్లో సంక్రాంతి వేడుకలు చేసుకునేందుకు నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు గత నాలుగు రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. రెగ్యులర్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు రెట్టింపు ప్రయాణికులతో బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులతో పాటు, మరో 3,650 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్స్ కార్లు, ఇతర రకాల వాహనాల్లో సైతం భారీ సంఖ్యలో ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాల యాలకు సైతం వరుసగా సెలవులు రావ డంతో నగర ప్రజలు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. ఈ నాలుగు రోజుల్లో వివిధ మార్గాల్లో సుమారు 15 లక్షల మందికి పైగా ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లారు. మరో రెండు రోజుల పాటు 5 లక్షల మందికి పైగా ఊళ్లకు తరలి వెళ్లనున్నారు. రైళ్లల్లో రిజర్వేషన్లు లభించక పోవడంతో చాలా మంది దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్ రైళ్లల్లో, సాధారణ బోగీల్లో ఒంటికాలిపై ప్రయాణం చేయాల్సి వచ్చింది. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించారు. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలకు సైతం అనూహ్య డిమాండ్ నెలకొంది. భారీ దోపిడీ... ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లు చేస్తోంది. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందుకేసి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. సంక్రాంతి వేడుకలను సొంత ఊళ్లో చేసుకోవాలనుకున్న తమ కోరిక కోసం నగర వాసులు రవాణా చార్జీల రూపంలో భారీ మూల్యాన్నే చెల్లించు కోవలసి వచ్చింది. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి వివిధ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రోజువారి బయలుదేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 50 ప్రత్యేక రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన చార్జీలు కూడా భారీగా పెరిగాయి. ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండే అన్ని మార్గాల్లో చార్జీలు ఒకటి నుంచి రెండు రెట్లు అధికమయ్యాయి. ప్రయాణికుల రద్దీ మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగనుంది. -
ప్రైవేటు జోరు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యానికి ప్రైవేట్ వాహనాల జోరు తోడై ప్రయాణికుల జీవితాలకు చెలగాటంగా మారింది. అధికారులు స్పందించకపోవడంతో జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికులను తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలైన ఆటోలు, జీపులు, టాటాఎస్ లలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆయా ప్రదేశాలకు చేరవేస్తున్నారు. ఒకవేళ ఊహించని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుపోతున్న అటోలు, జీపులు తదితర ప్రైవేట్ వాహనాల కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నా అధికారు ల్లోమార్పురాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేటలో ‘ప్రైవేటు’ జోరు.. జిల్లా కేంద్రం అయిన సిద్దిపేటలో ప్రైవేట్ వాహనాల జోరు మరింత తీవ్రంగా ఉంది. సిద్దిపేట జిల్లా కేంద్రం కావటం వలన ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వారికి అటోలే పెద్ద దిక్కుగా మారాయి. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లోకి విద్యార్థులు చదువులకోసం, వ్యాపారులు, ఇతరులు నిత్యం అనేక మంది పట్టణాలకు తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడం వల్ల కూడా ఎంతోమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. ప్రతీ గ్రామానికి మినీ బస్సులను ప్రభుత్వం నడిపితే ఆర్టీసీకి ఆదాయంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండేది. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లోకి వెళ్లాలంటే ప్రజలు ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. నిబంధనలు బేఖాతర్.. ముఖ్యంగా పల్లెలకు బస్సులు ప్రతి దినం రెండు లేక మూడు ట్రిప్పులు మాత్రమే తిరుగుతాయి . దీంతో ప్రయాణికులు ప్రమాదమని తెలిసినా అటోలను అశ్రయించాల్సివస్తోంది. ఆటో డ్రైవర్లు మాత్రం ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేస్తే అధికంగా డబ్బులు వస్తాయన్న ఆశతో ఆటోలలో పరిమితికి మించిన ప్రయాణికులను తీసుకుపోతున్నారు. దీంతో ఆటోప్రయాణం ప్రజల పాలిట కత్తిపై సాములా మారింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లల అవస్థలు వర్ణనాతీతం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటోలో కేవలం డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే ప్రయాణించాలి. దీంతో పాటుగా ఇతర వాహనాల్లో కెపాసిటీకి లోబడి ప్రయాణికులను తీసుకెళ్లాలి. కాని వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రతీ ఆటోలో కనీసం 10మందికి తక్కువ కాకుండా ప్రయాణికులు లేనిదే వాటిని ముందుకు కదిలించరు. నియంత్రణ చర్యలు శూన్యం ప్రైవేట్ వాహనాలకు ప్రమాదం సంభవిస్తే.. ఆ సందర్భంలో నిబంధనలు పాటించని వాహనాలకు, అందులో ప్రయాణించేవారికి ఎలాంటి ప్రమాద బీమా వర్తించదు. అయినప్పటికీ జిల్లాలో ప్రైవేట్ వాహనాల జోరుపై సంబంధిత అధికారుల నియంత్రణ చర్యలు కనిపించడం లేదు. పట్టణాల్లో ప్రతినిత్యం ప్రైవేటు వాహనాలవారు నిబంధనలను పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాని ఇలాంటి చర్యలు కనిపించడం లేదు. ఎప్పుడో ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించినపుడో, ఇతర ముఖ్య అధికారులతో ఒత్తిడి వచ్చినపుడు మాత్రమే తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి సిద్దిపేట జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్టు సౌకర్యాలు కల్పించడం అధికారుల బాధ్యత. జిల్లాలో మూడు రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా ముఖ్య పట్టణంలో జిల్లా రవాణాశాఖ అధికారి ఉంటారు, ఇతర ముఖ్య ట్రాపిక్ అధికారులు , ఆర్టీసీ అధికారులు ఉంటారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు రవాణాలో ఇబ్బందులను తొలగించడంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రమాదాలు జరిగినపుడే చూసుకుందాం అన్న ధోరణితో కాకుండా ముందే జాగ్రత్త పడాలని జిల్లా కేంద్రంలోని ప్రజలు అధికారులను కోరుతున్నారు. అధికారులు స్పందించాలి ప్రతి అటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళుతున్నారు. చార్జీలనూ బాదుతున్నారు. సంబంధిత అధికారులు మారుమూల గ్రామాలకు మినీ బస్సులను నడిపి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని పెంపొందించాలి. ప్రైవేట్ వాహనాలవారు ఓవర్‌లోడ్‌తో నడిపించకుండా తగిన చర్యలు చేపట్టాలి. –దుర్గయ్య, ప్రశాంత్‌నగర్ సమయానికి బస్సులు లేక.. నేను సిద్దిపేటలో పని చేస్తాను. ప్రతి రోజూ ఇంటికి వెళ్లాలంటే రాత్రి అవుతుంది. దీంతో ప్రైవేట్ వాహనాలను అశ్రయించక తప్పడం లేదు. వాటిలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. రాత్రి వేళలో బస్సులు వెళ్లిపోతే ప్రైవేటు వాహనాలే మాకు దిక్కుగా మారాయి. –పర్శరాములు, ప్రయాణికుడు పరిమితికి మించితే కఠిన చర్యలు ప్రతీ వాహనం పరిమితికి లోబడే ప్రయాణికులను తీసుకెళ్లాలి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే తీవ్ర చర్యలుంటాయి. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటుగా, వాహనాలను సీజ్ చేస్తాం. ప్రమాదం సంభవిస్తే వాహనానికి, ప్రయాణికులకు ఎలాంటి బీమా వర్తించదు. – రామేశ్వర్‌రెడ్డి, జిల్లా రవాణశాఖఅధికారి -
ఆర్టీసీపై మెట్రో రైలు ఎఫెక్ట్
-
ఆర్టీసీకి, గోల్కొండ కోటకు అద్దె చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహణకు సంబంధించి ప్రతినిధులకు గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసినందుకు కేంద్ర పురావస్తు శాఖకు, ప్రతినిధులను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులు వాడుకున్నందుకు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించింది. కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. అద్దె చెల్లిస్తేగాని గోల్కొండ కోటను విందుకు వాడుకోవటానికి వీల్లేదని కేంద్ర పురావస్తుశాఖ చెప్పటంతోపాటు, కొంత మొత్తం నష్టపరిహారం రూపంలో అడ్వా న్సుగా చెల్లించాలని కూడా కోరింది. ఏ రూపంలోనైనా కట్టడంలోని భాగాలు దెబ్బ తింటే ఆ మొత్తాన్ని మరమ్మతు చేయించేం దుకు అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఇలా షరతులతో కూడిన అనుమతి మంజూరైంది. బుధవారం రాత్రి సదస్సు ప్రతినిధులకు విందు ఇచ్చినందుకు రూ.50 వేలను రాష్ట్రప్రభుత్వం అద్దెగా చెల్లించింది. ఆర్టీసీకి కూడా... ఇక ప్రతినిధులను విమానాశ్రయం నుంచి హోటల్ గదులకు, హెచ్ఐసీసీకి, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోటకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను విని యోగిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ బస్సులు సదస్సుకే పరిమితం కావటంతో ప్రయాణికులను తరలించే విధులకు దూరమయ్యాయి. ఆర్టీసీకి ఆమేర నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం వాటికి అద్దె చెల్లిం చేందుకు సిద్ధమైంది. ఈ మూడు రోజులకు కలిపి రూ.కోటి అద్దె చెల్లించనుంది. -
పల్లె వెలుగులకు అల్ట్రా సొగసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ కొత్తగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పటివరకు దూర ప్రాంత సర్వీసులుగా అంతర్ జిల్లాల్లో తిప్పుతున్న ఆల్ట్రా డీలక్స్ బస్సుల్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పల్లె వెలుగు చార్జీలతోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సుల్ని ప్రయోగాత్మకంగా వైఎస్సార్ జిల్లా, తిరుపతిలలో ప్రవేశపెట్టింది. డీలక్స్ బస్సుల్లో ఉండే పుష్బ్యాక్ సీట్లు, ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడీ టీవీలను వీటిల్లో ఏర్పాటుచేశారు. పల్లెవెలుగు బస్సులతో నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ భావిస్తున్న తరుణంలో ప్రయోగాత్మకంగా పల్లెలకు ఆల్ట్రా డీలక్స్ సర్వీసులు ప్రవేశపెట్టడంతో ఆక్యుపెన్సీ రేషియో అనూహ్యంగా పెరిగింది. దీంతో ఈ నెలలో కృష్ణా రీజియన్, విజయవాడలలో కూడా వీటిని ప్రవేశపెట్టి, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. వైఎస్సార్ జిల్లాలో పెరిగిన ఆక్యుపెన్సీ వైఎస్సార్ జిల్లాలో సెప్టెంబరు 1న రాజంపేట బస్ డిపోలో ఈ ఆల్ట్రా డీలక్స్ బస్సులు ప్రారంభించారు. రాజంపేట నుంచి నందలూరు, ఒంటిమిట్ట, బాకరాపేట మీదుగా కడపకు ఈ సర్వీసులు ప్రారంభించారు. పల్లెవెలుగు బస్సుల ఛార్జీల మాదిరిగానే కనీస చార్జీ రూ.6గా ఆల్ట్రా బస్సులకూ నిర్ణయించారు. పల్లెవెలుగు బస్సుల్లానే స్టాప్ల సంఖ్య పెంచారు. పాస్‌లను కూడా అనుమతించడంతో విద్యార్ధులు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉంది. వీటన్నింటి కారణంగా ఒక్క నెలలోనే వీటి ఆక్యుపెన్సీ 80 శాతానికి పెరిగింది. ప్రైవేటు సర్వీసులకు ధీటుగా సౌకర్యాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 700 ప్రైవేట్ బస్సుల వరకు చట్ట వ్యతిరేకంగా కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లు తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లతో ప్రైవేటు బస్సులు తిప్పడంతో ఏడాదికి ఆర్టీసీకి రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. గ్రామీణ రూట్లలో ఆటోలవల్ల ఈ నష్టం మరింత పెరుగుతోంది. వీటిల్లో ప్రయాణిస్తే రెండు మూడు కిలోమీటర్లకు రూ.10 వసూలు చేస్తున్నారు. అదే ఆల్ట్రా డీలక్స్ బస్సులో కనీస చార్జి రూ.6గా వసూలు చేస్తున్నారు. మరోవైపు.. ప్రైవేటు వాహనాలవల్ల పెరుగుతున్న ప్రమాదాలపై కూడా ఆర్టీసీ ప్రచారం చేసేందుకు నిర్ణయించింది. అదే ఆర్టీసీలో ప్రమాదాల శాతం ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.09గా ఉంది. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల సంఖ్య ఇదీ.. - రాష్ట్రంలో పల్లెవెలుగు బస్సుల సంఖ్య: 1,436 - ఆల్ట్రా డీలక్స్ బస్సుల సంఖ్య: 101 - రాష్ట్రంలో తిరుగుతున్న ఆటోల సంఖ్య: 1.20 లక్షలు - కాంట్రాక్టు క్యారేజీ అనుమతి పొంది తిరుగుతున్న పైవేట్ బస్సుల సంఖ్య : 655 పల్లెలకు మరిన్ని సౌకర్యాలు రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలతో ఆర్టీసీ సర్వీసులను గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. ప్రైవేటు వాహనాల కంటే తక్కువ చార్జీతో ప్రారంభించి సంస్థను ప్రయాణికులకు మరింత చేరువ చేయాలని ఆలోచిస్తున్నాం. అలాగే, పల్లెలకు ఆల్ట్రా డీలక్స్ సర్వీసులు విజయవంతమయ్యాయి. అన్ని సర్వీసులు కలుపు కుంటే ఆక్యుపెన్సీ గత ఏడాది కంటే ఎనిమిది శాతం పెరిగింది. సంస్థకు ఒక్క శాతం ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే రూ.60 కోట్ల ఆదాయం పెరుగుతుంది. – జయరావు, ఈడీ (ఆపరేషన్స్) రవాణాలో... -
‘గిన్నిస్ రికార్డు’పై ఆర్టీసీ కన్ను
సాక్షి ప్రతినిధి, వరంగల్: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రికార్డు స్థాయిలో ప్రయాణికులను తరలించి గిన్నిస్ రికార్డు సాధించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సన్నద్ధం అవుతోంది. జాతర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై వరంగల్‌లో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర జరిగే నాలుగు రోజుల్లో అత్యధిక రద్దీ ఉండే రోజు 2.61 లక్షల మంది ప్రయాణికులను చేరవేసి గిన్నిస్ రికార్డుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒకే రోజు 3,300 బస్సులు వినియోగిస్తామని, గంటకు 450 బస్సులు 11,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయని ఆయన వివరిం చారు. ఇందుకోసం పదివేల మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలను కలుపుకుని మొత్తం 23 పాయింట్ల నుంచి మేడారం జాతర వరకు బస్సులు నడపనున్నట్లు చెప్పారు. గత జాతరలో 3,600 బస్సులు వినియోగించామని, ఈసారి జాతరకు 4,000 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, వీటితో పాటు మరో 400 బస్సులు స్పేర్‌లో ఉంచుతామన్నారు. ఈ జాతర సందర్భంగా 40 లక్షల మంది భక్తులకు సేవలు అందివ్వాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ నుంచి మేడారం వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యంతో ఏసీ బస్సులు ప్రవేశపెడతామన్నారు. గత జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.45 కోట్లు కేటాయించిందన్నారు. వజ్ర బస్సులకు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ప్రారంభంలో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో డ్రైవర్లకు ట్యాబ్‌లు ఇచ్చిన తర్వాత 60 శాతానికి పెరిగిందన్నారు. -
ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టోల్గేట్ల వద్ద ఫీజు చెల్లించడం, నెలవారీ పాస్ చూపించడం వాటితో సమయం వృథా కాకుండా ఫాస్ట్ ట్యాగ్ సిక్కర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ విధానాన్ని మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియ న్లో ఆగస్టులో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావ డంతో సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో దీనిని అమలు చేస్తున్నారు. ఎన్‌హెచ్–44పై మూడు టోల్ప్లాజాలున్నాయి. ఆర్టీసీ బస్సులు వాటి వద్ద టోల్ రుసుం చెల్లించడానికి లేదా నెలవారీ పాస్ చూపించేందుకు వేచి చూడాల్సి వచ్చేది. దీనివల్ల రద్దీ సమయాల్లో సమయం వృథా అయ్యేది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతిని తీసుకొచ్చింది. బస్సుకు సంబంధించిన ఒక అద్దానికి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ అంటిస్తారు. ఈ స్టిక్కర్‌పై బార్ కోడ్ ఉంటుంది. టోల్‌ప్లాజ్‌ల వద్దకు ఫాస్ట్ ట్యాగ్ బస్సులు చేరుకోగానే పది అడుగుల దూరంలోనే బార్‌కోడింగ్‌ను టోల్‌ప్లాజ్‌కు చెందిన స్కానర్లు స్కానింగ్ చేసుకుంటాయి. దీంతో వెంటనే అక్కడి నుంచి బస్సులు ముందుకు కదిలేలా గేట్ తెరుచుకుంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న బస్సులు వెళ్లడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్‌తో సమయం ఆదా.. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి అమలు చేయడం వల్ల సమయం ఆదా అవుతోందని ఆర్టీసీ డీవీఎం మహేశ్ తెలిపారు. గతంలో టోల్‌ప్లాజాల వద్ద టికెట్ తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేదని చెప్పారు. -
ఆ బస్సులు ఏపీలో తిరిగితే సీజ్
►సీఎంతో ముగిసిన రవాణాశాఖాధికారుల భేటీ అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో రవాణా శాఖ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. అరుణాచల్‌ప్రదేశ్ రవాణాశాఖ రిజిస్ట్రేషను రద్దు చేసిన బస్సులను ఏపీలో తిరిగితే సీజ్ చేయాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి నుంచి బస్సులను సీజ్ చేసేందుకు రవాణావాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఈ మేరకు రవాణాశాఖ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 బస్సులుంటాయని అంచనా. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. -
ఆర్టీసీ బస్సులు కాదు, యమపాశాలు.
అవి ఆర్టీసీ బస్సులు కాదు, యమపాశాలు. గమ్యాలకు చేర్చాల్సిన ప్రగతి రథ చక్రాలు శ్మశానానికి చేరుస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాలం చెల్లిన బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అసలే గుంతలు పడ్డ రోడ్లు, ఆపై పాతబస్సులు ఇంకేం వుంది,, రోడ్డుమీద పోతున్న ఆటోలను, ద్విచక్రవాహనాలను ఢీ అంటే ఢీ అంటూ ఢీ కొడుతున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమం అని రాసిపెట్ట్డడం తప్ప ఇతరుల భద్రత గురించి అసలు ఆలోచించట్లేదు . రోడ్లమీద ఇతర వాహనాలని ఢీ కొడుతూ ప్రజల ప్రాణాలని బలితీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే ఏడు మంది ప్రాణాలను తీశాయి. ► వనపర్తి జిల్లా గోపాల్పేట్ వద్ద ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వనపర్తికి చెందిన బాలేమియా(70), నర్సింగావపల్లికి చెందిన గొల్లమణ్యం(65) అక్కడికక్కడే మృతిచెందారు. ► కరీంనగర్ వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాసాని శ్రీనివాస్, ఆయన భార్య జలజ, బంధువుల అమ్మాయి ప్రజ్ఞ అక్కడికక్కడే మృతిచెందారు. ► తూర్పుగోదావరి జిల్లా ఎల్.గన్నవరం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆదిమూలంవారిపాలెంకు చెందిన ఆదిమూలం గంగరాజు(35) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన బైక్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొంది. ► చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం చౌడసముద్రం గ్రామానికి చెందిన అబుబకర్(5) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
ప్యాసింజర్ల ప్రాణాలతో డ్రైవర్ల చెలగాటం!
హైదరాబాద్: ఆదాయం కోసం ఆర్టీసీ బస్సుల సిబ్బంది మధ్య పోటీ తీవ్రమైంది. డ్రైవర్లు పరస్పరం పోటీపడుతూ ప్రయాణికుల ప్రాణాలమీదికి తెస్తున్నారు. తాజాగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన వివరాలివీ. శనివారం మధ్యాహ్నం కర్ణాటకకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్‌కు చేరుకున్నాయి. ఒకే ప్లాట్‌ఫాం వద్ద ఒకదాని వెనుక మరొకటి ఆగాయి. ముందుగా ఆగిన బస్సులో ప్రయాణికులంతా ఎక్కారు. దీంతో వెనుక ఉన్న బస్సు డ్రైవర్ ముందున్న బస్సులో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు యత్నించాడు. దీంతో రెండు బస్సుల డ్రైవర్ల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో కోపంతో ఉన్న మొదటి బస్సు డ్రైవర్ వేగంగా బస్సును వెనక్కి నడిపారు. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. దీంతో ఆ డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశారు. లేకపోయినట్లయితే వెనుక బస్సును ఢీకొట్టి ప్రమాదం సంభవించి ఉండేది. విషయం తెలుసుకున్న వెంటనే కంట్రోలర్ భూమయ్య అక్కడికి చేరుకొని వారిని సముదాయించి పంపించారు. బస్సుల మధ్య ఆదాయం పోటీ ప్రయాణికుల ప్రాణాల మీదికి వస్తోంది. ఈ విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
మోటార్ సైకిల్‌పై అసెంబ్లీకి..!
-
మోటార్ సైకిల్‌పై అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఎమ్మెల్యే.. వరుసగా మూడోసారి గెలిచారు. అయితేనేమీ..! అసెంబ్లీకి మోటార్ సైకిల్‌పై వచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య శనివారం బైక్‌పై అసెంబ్లీకి రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సమావేశాల వరకు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాహన వసతి కల్పించింది. క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి, సమావేశాలు ముగిశాక తిరిగి క్వార్టర్స్ వరకు ఎమ్మెల్యేలు వెళ్లేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపింది. క్రమంగా ఈ బస్సుల్లో వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. దీంతో బస్సును ప్రభుత్వం రద్దు చేసింది. వాహన సదుపాయాన్ని పునరుద్ధరిం చాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. స్పందన రాకపోవడంతో రాజయ్య మోటార్ బైక్‌పైనే అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. -
పెళ్లికి.. రూ. 10 కోట్లు
⇒ టీడీపీ ఎమ్మెల్యేల ఆర్భాటం ⇒ సెట్టింగులు, భోజనాలకే రూ.4.50 కోట్ల ఖర్చు సాక్షి, గుంటూరు: ఇద్దరూ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలే. ఇంకేముందీ తమ పిల్లల పెళ్లిని అత్యంత ఆడంబరంగా, కళ్లు మిరు మిట్లు గొలిపే సెట్టింగుల మధ్య వైభవో పేతంగా నిర్వహించారు. ఈ వివాహానికి సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని అంచనా. వినుకొండ ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కుమార్తె లక్ష్మీసౌజన్య, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కుమారుడు కొమ్మాలపాటి సాయిసుధాకర్ల వివాహం మేడికొండూరు మండలంలోని కైలాసగిరి వద్ద బుధవారం జరిగింది. ఈ వివాహానికి ఇద్దరు ఎమ్మెల్యేలు కలసి అట్టహాసంగా ఏర్పా ట్లు చేశారు. సెట్టింగులు, లైటింగ్ మొదలు కొని, భోజనాల వరకు డబ్బులు భారీయెత్తున ఖర్చు చేశారు. ముఖ్యంగా వీవీఐపీ, వీఐపీ, సాధారణ.. ఇలా మూడు కేటగిరీలు గా పెట్టిన భోజనాలకే రూ.2 కోట్లు ఖర్చయి నట్లు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వివాహానికి సెట్టింగ్‌లు వేసిన బెంగళూరుకు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో భారీ సెట్టింగ్‌లు వేయించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌కు చెందిన అభినందన వెంచర్స్‌లో ఈ వివాహం జరిగింది. ఇందుకోసం 30 ఎకరాల విస్తీర్ణంలో సెట్టింగ్ నిర్మించారు. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో వివాహ మండపాన్ని ఏర్పాటు చేశారు. వీటి కోసం రూ.2.50 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. వినుకొండ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు, జిల్లాలోని పలు ప్రైవేటు ట్రావెల్స్, బస్సులు, కార్లు అన్నీ కలిపి రవాణాకు రూ.42 లక్షలు చెల్లించారు. ఇవికాకుండా సిబ్బంది, ఇతర కూలి ఖర్చుల నిమిత్తం రూ.కోటి ఖర్చు పెట్టారు. వీటితోపాటు, లైటింగ్, ఇతర ఏర్పాట్లకు, వివాహానికి పెద్దయెత్తున తరలివచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర అతిథుల కోసం చేసిన ఏర్పాట్లకు రూ.కోట్లలో ఖర్చయినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
నేటి నుంచి మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు
చెన్నూర్ నుంచి సిరోంచకు ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం ట్రయల్ రన్ చెన్నూర్: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాక పోకలు ప్రారంభంకానున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నుంచి కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో బస్సును ఆదివారం నుంచి అధికారులు ప్రారంభించనున్నారు. శనివారం చెన్నూర్ నుంచి కాళేశ్వరం మీదు గా సిరోంచ వరకు కిలో మీటర్ల సర్వే కోసం ఆర్టీసీ అధికారులు ట్రయల్ ట్రిప్పును ప్రారంభించారు. కాళేశ్వరం గోదావరి నదిపై నిర్మించిన వంతెన ప్రారంభం కావడంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలకు సులభతరం చేసే క్రమంలో అధికారులు ఈ మేరకు ఏర్పాటు చేశారు. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులను చెన్నూర్ బస్టాండ్ నుంచి, పలుగుల, కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ వరకు ఆర్టీసీ బస్సును నడిపించేందుకు సిద్ధం అవుతున్నారు. చెన్నూరు నుంచి కాళేశ్వరం మీదుగా సిరోంచకు ఆర్టీసీ బస్సులను ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు మంచిర్యాల ఆర్టీసీ డీఎం పీఆర్ కృష్ణ తెలిపారు. చెన్నూరు నుంచి కాళేశ్వరం వెళ్లేందుకు ప్రస్తుతం తాత్కాలిక వంతెన మాత్రమే ఉంది. గతంలో మంచిర్యాల ప్రజలు సిరోంచకు వెళ్లాలంటే కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాం తంలోగల ప్రాణహిత నదిపై పడవల ద్వారా ప్రయాణం చేసేవారు. ప్రాణహితపై వంతెన కోసం రూ. 126 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. -
గ్రూప్-2 కోసం అదనంగా 1000 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11, 13 తేదీల్లో జరుగనున్న గ్రూపు-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 1000 బస్సులు అదనంగా నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం పరీక్షలు పూర్తి అయ్యే వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, నగరంలోని అన్ని పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తారని, ఎన్ఫోర్స్మెంట్ కోసం 6 జీపులలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని, బస్సుల సమాచారం కోసం కోఠి బస్‌స్టేషన్ 99592 26160, రేతిఫైల్ బస్‌స్టేషన్ 99592 26154 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
'పల్లె'కు దూరం
ఆర్టీసీ అధికారులు ఆదాయం రావడం లేదనే సాకుతో ఆయా పల్లెలకు బస్సులను దూరం చేస్తుంటే, అవే గ్రామాల నుంచి ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి రాకపోకలు సాగిస్తున్నా యి. పదుల సంఖ్యలో ఆటోలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. అయినా ఆర్టీసీ బస్సులకు ఆదరణ లేదంటూ అధికారులు తప్పించుకోవడాన్ని ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు తప్పుపడుతున్నారు. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో ప్రయాణం చేస్తున్న ప్రజలు, సమయానికి ట్రిప్పు నడిపిస్తే బస్సుల్లో ఎందుకు ప్రయాణం చేయరని వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, సిరిసిల్ల : ‘ప్రతీ పల్లెకు ఆర్టీసీ ప్రగతి చక్రా లు’ అంటూ అధికారులు ఊదరగొడుతున్నా వాస్తవం రూపం దాల్చడం లేదు. కొత్త పాలనలో సరికొత్త సేవలందించాల్సిన ఆర్టీసీ.. ఆచరణలో విఫలమవుతోంది. ప్రతీపల్లెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, భారీగా నష్టపోతున్నా ప్రయాణికులకు రవాణా సేవలందిస్తున్నామని చెబుతున్నా నమ్మే పరిస్థితిలేదు. కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 224 గ్రామాలున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ డిపోలతోపాటు, కరీంనగర్, కోరుట్ల, కామారెడ్డి తదితర ఇతర ప్రాంతాలకు చెందిన డిపోల బస్సులు జిల్లాలో ప్రయాణికుల ను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అయినా, ఆర్టీసీ బస్సు గురించి తెలియని పల్లెలు జిల్లాలో 26 ఉండడం విస్మయా న్ని కలిగిస్తోంది. రూట్‌కు సమీపం లో ఉన్నా, మెరుగైన రోడ్డు మార్గం ఉన్నా, ప్రజలు ఆర్టీసీ వైపే ఆసక్తి చూపుతున్నా.. ఆదాయం లేదనే సాకుతోనే అధికారులు ఈ గ్రామాలకు బస్సులు నడిపించడంలేదనే విమర్శలున్నాయి. జిల్లా కేంద్రమైన సిరిసిల్లకు సమీపంలోని అంకుసాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, ఇందిరానాగర్, ఇప్పలపల్లి, వేణుగోపాల్పూర్, వేములవాడ పట్టణానికి సమీపంలోని అనుపురం, రుద్రారం, కొడిముంజ, లింగంపల్లి తదితర గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. సమీప గ్రామాలు కాబట్టి, ఆదాయం అంతగా ఉండదనే సాకుతో బస్సు సర్వీసులు ఈ గ్రామాలకు వెళ్లడం లేదు. ఆదాయం ఘనం.. జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి మెరుగ్గానే ఉంది. రెండు డిపోలకు గాను సిరిసిల్ల డిపో పరిధిలో రోజూ రూ.7లక్షల చొప్పున ఏడాదికి రూ.36.57కోట్ల ఆదాయం సమకూరుతోంది. వేములవాడ డిపో పరిధిలో ఏడాదికి రూ.20.88 కోట్ల ఆదాయం వస్తోంది. మొత్తంగా జిల్లాలో ఆర్టీసీకి సుమారు రూ.58 కోట్ల ఆదాయం వస్తున్నా, అన్ని పల్లెలకు సేవలందించడంలో ముందుకు రావడంలేదు. ప్రణాళికా లోపంతోనే... ఆర్టీసీ అధికారులు సరైన ప్రణాళిక రూపొందించ లేకపోవడంతోనే జిల్లాలో 26 గ్రామాలు బస్సు సేవలకు దూరమయ్యాయనే విమర్శలున్నాయి. ప్రజాప్రతినిధుల సూచన, గ్రామస్తుల విన్నపం మేరకు కొన్ని రూట్లలో బస్సులను నడిపించిన అధికారులు.. ఆదాయం రావడం లేదంటూ కొద్దిరోజుల్లోనే ఆ రూట్లలో సర్వీసులు నిలిపివేస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనువైన సమయవేళల్లో బస్సులను నడిపిస్తే ఆదాయం తప్పకుండా పెరుగుతుందని, ఆ దిశగా ప్రణాళిక ప్రకారం సర్వీసులు నడిపించాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పట్టణాలకు సమీపంలో ఉన్నాయనే కారణంతో పల్లెలకు బస్సులు నడిపించకపోవడం సరికాదంటున్నారు. ఆయా రూట్లలో వెళ్లే బస్సులను ఆ గ్రామాల గుండా మళ్లిస్తే ప్రజలకు ఆర్టీసీ సేవలందించడంతోపాటు, ఆదాయాన్ని పెంచుకోవచ్చంటున్నారు. ఆర్టీసీ అధికారులు పటిష్ట ప్రణాళికతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు సేవలందించాల్సిన అవసరం ఉంది. -
పల్లెకు చేరని ప్రగతి చక్రం!
► రాష్ట్రంలో 1,341 గ్రామాలకు రాని ఆర్టీసీ బస్సులు ► ఆక్యుపెన్సీ రేషియో లేదన్న కారణంతో నడపని ఆర్టీసీ ► లాభాపేక్షతో ముడిపెట్టబోమన్న హామీ గాలికి.. ► రెండున్నరేళ్లలో మరో 200 ఊళ్లకు బస్ కట్! ► ఆటోలు, జీపుల వంటి ప్రైవేటు వాహనాలు కిటకిట ► వాటిని నియంత్రించాలన్న సీఎం ఆదేశాలు బుట్టదాఖలు ► ఆర్టీసీ–ఆర్టీఏల మధ్య సమన్వయం శూన్యం సాక్షి, హైదరాబాద్ : ఎన్నో రంగాల్లో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత పలు రంగాల్లో వేగంగా ముందుకు దూసుకెళుతూ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ ఆర్టీసీ బస్సు వెళ్లని పల్లెలు 1,341 ఉన్నాయి. అంతేకాదు ఈ లెక్కన వచ్చే రెండున్నరేళ్లలో మరో రెండు వందల ఊళ్లకూ ప్రగతి రథ చక్రం దూరమవనుంది. మరి ఆర్టీసీ బస్సులు రాకపోవడం రోడ్లు లేక కాదు.. సరైన సంఖ్యలో ప్రయాణికులు ఉండడం లేదని బస్సులు నడపడం లేదు. వాస్తవానికి కొత్త రాష్ట్రం ఏర్పాటై ప్రభుత్వం కొలువుదీరాక.. ‘‘రాష్ట్రంలో 1,050 గ్రామాలకు బస్సు వసతి లేదు. వాటికి వెంటనే బస్సు వసతి కల్పిస్తాం, లాభాపేక్షతో ప్రమేయం లేకుండా బస్సులు నడుపుతాం. అవసరమైన చోట రోడ్ల నిర్మాణం జరిగేలా చూస్తాం..’’ అని ప్రకటించింది. కానీ వాటికి బస్సు రాకపోగా.. మరో రెండు వందల పల్లెలకూ దూరమైంది. తాజాగా ఆర్టీసీ అధికారుల పరిశీలనలోనే ఈ లెక్కలు తేలాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,265 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా.. 1,341 పల్లెలకు నడపడం లేదని అధికారులు గుర్తించారు. ఎందుకిలా..? మహబూబ్‌నగర్ జిల్లా–కర్ణాటక సరిహద్దు మండలం కృష్ణా. ఈ మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఐనాపూర్. దాదాపు 400 ఇళ్లున్న ఈ పల్లెకు బీటీ రోడ్డున్నా.. ఇప్పటికీ ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీనికి సమీపంలోనే ఉన్న మాగనూరు మండలంలోని కృష్ణానదీ తీర గ్రామం తంగిడి. ఇటీవలి కృష్ణా పుష్కరాల కోసం ఈ గ్రామానికి విశాలమైన రోడ్డును కూడా నిర్మించారు. కానీ ఇప్పటికీ ఆర్టీసీ బస్సు మాత్రం రావడం లేదు. ఈ రెండు గ్రామాల పరిస్థితే కాదు... పూర్వపు జిల్లాల స్వరూపంలోని వరంగల్ పరిధిలో 70 గ్రామాలకు, ఆదిలాబాద్ పరిధిలో 300, మహబూబ్‌నగర్ పరిధిలో 275, నల్లగొండ జిల్లా పరిధిలో 189 పల్లెలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రంగారెడ్డి జిల్లాలోనూ ఈ దుస్థితి ఉంది. దీనిపై ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే... ‘‘చాలా ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రయత్నిస్తున్నాం. కానీ సరిపడా ప్రయాణీకులు ఉండడం లేదు. డీజిల్ ఖర్చుకు తగినంత కూడా టికెట్ ఆదాయం రావడం లేదు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింతగా నష్టాల్లో కూరుకుపోతుంది. అందుకే కొన్ని ప్రాంతాలకు బస్సులు నడపటం లేదు..’’ అని చెబుతున్నారు. మరోవైపు ఆయా పల్లెలకు పెద్ద సంఖ్యలో ఆటోలు, జీపులు కిక్కిరిసి తిరుగుతుండడం గమనార్హం. ముఖ్యమంత్రి ఆదేశాలూ బుట్టదాఖలు రాష్ట్రంలోని అన్ని పల్లెలకూ బస్సులు నడపాలని గత జూన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. చాలా చోట్ల సరైన అనుమతులు, పర్మిట్లు లేకుండా ప్రైవేటు వాహనాలు తిరుగుతుండడంతో ఆర్టీసీ బస్సులకు ప్రయాణీకులు ఉండడం లేదని... దానిని నియంత్రించాలనీ సూచించారు. ప్రైవేటు వాహనాలను నియంత్రించేందుకు వీలుగా ఆర్టీసీ–ఆర్టీఏ మధ్య సమన్వయం కోసం ఓ లైజన్ ఆఫీసర్‌ను కూడా నియమించారు. ఆర్టీసీ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర్లును దీనికి సిఫారసు చేశారు. కానీ ఇప్పటివరకు ఈ రెండు విభాగాల మధ్య కనీస సమన్వయం కూడా ఏర్పడలేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాల నియంత్రణకు సరైన చర్యలే దిక్కులేవు. దీంతో ప్రైవేటు వాహనాలు ప్రయాణీకులను తరలిస్తుండగా.. ఆక్యుపెన్సీ లేదంటూ ఆర్టీసీ అధికారులు బస్సులు నడపటం లేదు. సరైన ప్రణాళిక లేక.. గతంలో కొన్ని గ్రామాలకు బస్సులు నడిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఇలా నాలుగు పూటల ఆయా గ్రామాలను అనుసంధానిస్తూ బస్సులు సర్వీసులు నిర్వహించారు. కానీ బస్సు ట్రిప్పుల మధ్య ప్రైవేటు వాహనాలు ప్రయాణీకులను తరలించుకుపోతుండటంతో.. బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఉండడం లేదని స్థానిక ఆర్టీసీ అధికారులు గుర్తించి సర్వీసులు రద్దు చేశారు. ఇక కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు అసలు బస్సులే నడపలేదు. రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని, గుంతలు, ఎత్తుపల్లాలతో ఉన్నాయని, బస్సులు నడిపితే పాడవుతాయంటూ సర్వీసులు మొదలుపెట్టలేదు. ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రణాళిక కూడా రూపొందించలేదు. పరిష్కారంపై దృష్టే లేదు ఇక చాలా మార్గాలను ఆర్టీసీ అద్దె (హైర్) బస్సులకు కేటాయిస్తుండటంతో వాటి నిర్వాహకులు లాభదాయక మార్గాలనే ఎంచుకుంటున్నారు. నిర్వాహకులతో కొందరు అధికారులు లాలూచీ పడుతుండడంతో దూరంగా ఉండే పల్లెలకు బస్సులు తిరిగే పరిస్థితి ఉండడం లేదు. దాంతో ఆయా పల్లెల ప్రజలు ప్రైవేటు వాహనాలకు అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. ప్రైవేటు వాహనాలను నియంత్రించి, అనుకున్న వేళలకు బస్సులు నడిపితే ఆక్యుపెన్సీ రేషియో మెరుగుపడుతుందనే వాదనను పట్టించుకునేవారే లేరు. ఇటీవల కొన్ని కార్మిక సంఘాలు సమ్మె చేసిన సమయంలో.. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, నిపుణుల నుంచి ఆర్టీసీకి ఎన్నో సూచనలు వచ్చాయి. కానీ వాటిని అమలు దిశగా ఎటువంటి యోచనా లేదు. -
నగరంలో నిలిచిపోయిన బస్సులు
హైదరాబాద్: అక్రమ బదిలీలకు నిరసనగా.. ఆర్టీసీ కార్మికులు సోమవారం విధులు బహిష్కరించారు. దీంతో నగరంలోని 8 డిపోల పరిధిలో వందల బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకారణంగా బదిలీలు చేపట్టడానికి నిరసిస్తూ సోమవారం టీఎంయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు బంద్ పాటిస్తున్నారు. ఉప్పల్ డిపో పరిధిలో కండక్టర్‌గా పని చేస్తున్న రత్నకుమారిని అకారణంగా బదిలీ చేశారని ఆగ్రహించిన తోటి ఉద్యోగులు ఈ రోజు బదిలీకి నిరసనగా బంద్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయం పై ఉన్నతాధికారులను సంప్రదించారు. అయితే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందడంతోనే బదిలీ చేశామని అధికారులు చెప్తున్నారు. -
సదా మీ సేవలో...
ఇక ఇంటి ముందుకు రానున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఆకర్షిస్తున్న యాజమాన్యం హన్మకొండ టు హైదరాబాద్‌కు మినీ బస్సులు త్వరలో నడిపించేందుకు చర్యలు సర్వే పూర్తిచేసిన అధికారులు హన్మకొండ : ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం.. అనే నినాదంతో ముందుకుసాగుతున్న యాజమాన్యం మరో అడుగు వేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ఆర్టీసీ డోర్ టు డోర్ సర్వీస్‌కు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీధి నుంచి ప్రయాణికులను తీసుకెళ్లి వారు చేరుకోవాల్సిన వాడలో దింపుతాయి. ఇందుకోసం టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం 236 మినీ బస్సులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో సగం ఏసీ మినీ బస్సులను కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. ప్రయాణికులపై సర్వే హన్మకొండ, వరంగల్‌లోని కాలనీలు, పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజు ఎంతమంది ప్రయాణికులు వెళ్తున్నారనే దానిపై వరంగల్ రీజినల్ అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు. మొత్తం 514 మందిని సర్వే చేయగా.. అందులో ప్రధానంగా 20.62 శాతం ఉప్పల్‌కు, మహాత్మాగాంధీ బస్‌స్టేçÙన్కు 9.34 శాతం, సికింద్రాబాద్ జేబీఎస్‌కు 8.95 శాతం వెళ్తున్నట్లు తెలిసింది. హన్మకొండ, వరంగల్‌లో సర్వే చేయగా.. హన్మకొండ నుంచి 47.47 శాతం, వరంగల్ నుంచి 20.43, ఇతర ప్రాంతాల నుంచి 5.84 శాతం హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు తేలింది. వీరితో పాటు మరో 3,350 మంది ప్రయాణికులను సర్వే చేశారు. వీరిలో ఎవరెవరు ఏయే బస్సులో ప్రయాణిస్తున్నారు.. ఒక్కో వ్యక్తి నెలలో ఎన్ని రోజులు హైదరాబాద్‌కు వెళ్తున్నాడు.. జిల్లాలో ఏయే స్టేజీలో బస్సు ఎక్కుతున్నారు...హైదరాబాద్‌లో ఎక్కడ దిగుతున్నారు.. దిగిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అనే అంశాలపై సర్వే చేపట్టారు. ఈ మేరకు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ మినీ బస్సులను నడిపేందుకు కార్యా చరణ సిద్ధం చేశారు. త్వరలో 16 కొత్త మినీ బస్సులు వరంగల్ రీజియన్‌కు రానున్నాయి. ఈ బస్సులు వరంగల్, హన్మకొం డలోని పలు కాలనీలు, ప్రధాన కూడళ్ల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నడువనున్నాయి. ఇంటి ముందు బస్సు ఎక్కి తే మరో వాహనం అవసరం లేకుండా కోరుకున్న చోట దిగే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించనుంది. దీంతో ప్రయాణికులకు ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతోంది. కాగా, బస్సుల సమాచారం, టికెట్ బుకింగ్, రిజర్వేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. మొత్తంగా ప్రయాణికులను ఇంటి నుంచే తీసుకెళ్లి తిరిగి ఇంటివద్దనే దించే ఆలోచనలో యాజమాన్యం కసరత్తు చేస్తోంది. వరంగల్ రీజియ¯Œæకు 16 మినీ బస్సులు మినీ బస్సులను తొలుత హన్మకొండ–హైదరాబాద్, నిజామాబాద్–హైదరాబాద్ రూట్లో నడుపనున్నారు. మొదటి దశలో వరంగల్ రీజియన్‌కు 16 ఏసీ మినీ బస్సులు రానున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై స్వయంగా ఆయా డిపో మేనే జర్లతో కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నష్టాలను పూడ్చుకోవడంపై డిపోల వారీగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడంపై దృష్టి సారించారు. అలాగే ప్రయాణికులను ఆర్టీసీ వైపు మళ్లించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ రీజియన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హన్మకొండ–హైదరాబాద్ రూట్‌పై దృష్టి సారించారు. క్యాబ్‌లు, ప్రైవేట్ ట్యాక్సీకార్లలో వెళ్లే ప్రయాణికులు సైతం ఆర్టీసీ బస్సులోనే వచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ప్రయాణికుడి ఇంటి ముందుకు బస్సును తీసుకెళ్లి వారిని ఆకర్షించాలనే సంకల్పంతో ముందుకుపోతున్నారు. -
ఆర్టీసీ బస్సులు తిరుగు ప్రయాణం
విజయవాడ (బస్‌స్టేషన్) : కృష్ణాపుష్కరాలకు యాత్రికులను తరలించేందుకు ఆర్టీసీ కీలక పాత్ర పోషించింది. ఆర్టీసీ అధికారులు పక్కా ప్రణాళికతో ఇతర జిల్లాల నుంచి కూడా బస్సులను రప్పించి భక్తులకు సేవలు అందించారు. బస్సులను బుధవారం తిరిగి స్వస్థలాలకు పంపించడంతో ‘ఆపరేషన్ పుష్కర’ విజయవంతంగా ముగిసింది. అధికారులు, సిబ్బంది మధ్యాహ్నం భోజనం చేసి తమ గమ్యస్థానాలకు ఆయా బస్సుల్లో చేరుకున్నారు. పుష్కరాలకు1800 ఆర్టీసీ బస్సులు పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ 1800 బస్సులు నడిపింది. జిల్లాలోని అన్ని డిపోల బస్సులు, ఇతర జిల్లాలకు చెందిన 800లకు బస్సులను నడిపారు. జిల్లాల వారీగా పుష్కర స్పెషల్ పేరుతో బస్సులను కేటాయించి యాత్రికులు పుష్కరాలకు వెళ్లే దిశగా ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా నడిచేటప్పుడు టికెట్టు తీసుకుని, నగర పరిధిలో ఘాట్లకు తరలించేందుకు ఉచితంగా బస్సుసర్వీసులు నడిపారు. ఇతర జిల్లాలకు 831 బస్సులు కృష్ణా రీజియన్‌కు సంబంధించిన బస్సులను శ్రీకాకుళం, విజయనగరానికి 75 బస్సులు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు 150 బస్సులు, విశాఖపట్నం75, గుంటూరుకు 100, ప్రకాశం 150, నెల్లూరుకు 150, ప్రకాశం 150, చిత్తూరుకు 75, కడపకు 15, కర్నూల్‌కు 25, అనంతపురానికి 16 చొప్పున నడిపి యాత్రికులను పుష్కరాలకు తరలించారు. రైలు ప్రయాణాలు చేయలేని చాలా మంది ఆర్టీసీవైపే అడుగులు వేశారు. నగరంలో 900 ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన యాత్రికులను, నగరవాసులను పుష్కరాలకు తరలించడానికి ఆర్టీసీ ఉచిత సర్వీసులు నడిపింది. నగరపరిధిలో ఆరు శాటిలైట్ బస్స్టేషన్లు ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఆయా స్టేషన్ల నుంచి పుష్కరనగర్లకు, నగరపరిధిలో పలురూట్లనే కేటాయించి స్థానికులకు ఉచిత ప్రయాణాలు అందించడానికి, పవిత్ర సంగమంలో జరిగే హారతిని తిలకించేందుకు ఉచితంగా ఈ బస్సులను నడిపింది. స్థానికులకు ఇబ్బందులు అందరూ ఆర్టీసీ బస్సును ఆశ్రయించాలని అధికారులు సూచించారు. అయితే ఆర్టీసీ పుష్కర యాత్రికులకు ఇచ్చిన ప్రాధాన్యత స్థానికులకు ఇవ్వకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఐదు నిమిషాలకో బస్సు అని ప్రచారం చేసి, అది శాటిలైట్ బస్‌స్టేషన్‌లోని యాత్రికులకే అన్నట్లుగా వ్యవహరించింది. దీంతో నగరవాసులు పుష్కరాలకు వెళ్లాలన్నా, పవిత్ర సంగమానికి వెళ్లాలన్నా గంటల తరబడి బస్‌స్టాపుల్లో నిలబడి ఉండిపోయారు. ఒన్‌టౌన్ నుంచి టూటౌన్‌కు రాకపోకలు సాగించాలన్నా కష్టమైంది. కనీసం పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు కూడా బస్సులు నడపలేదు. తొలిరోజుల్లో ఆటోల రూట్లను నియంత్రించి తర్వాత వదలడంతో స్థానిక నగరవాసులు ఆటోల్లోనే తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఆర్టీసీకి రూ.11 కోట్లు ఖర్చు పుష్కరాలను పురస్కరించుకుని ఆర్టీసీ సుమారు రూ.11 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు, సిబ్బంది డ్యూటీ నిమిత్తం వారి జీతాలతో లెక్కించగా బస్సులో వాడిన ఇంధనం, ఆక్యుపెన్సీ, శాటిలైట్ బస్‌స్టేషన్ నిర్మాణం తదితర వాటికి చేసిన ఖర్చులపై అంచనాలు వేశారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయి లెక్కింపు జరుగుతుందని రీజనల్ మేనేజర్ పి.వి.రామారావు తెలిపారు. -
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ మంకమ్మతోట : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కృష్ణ పుష్కరాలకు కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీచుపల్లికి రోజూ ఐదు బస్సులు – ఉదయం 8:30 నుంచి 10:30 వరకు అరగంటకో బస్సు నాగార్జునసాగర్‌కు రెండు బస్సులు – ఉదయం 8 గంటలు, 10 గంటలకు విజయవాడకు రెండు బస్సులు – ఉదయం 7 గంటలు, 11 గంటలకు వడపల్లికి రెండు బస్సులు – ఉదయం 8:30, 10: 30 గంటలకు ఈ సర్వీస్‌లకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. 36 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వెళ్తే ప్రత్యేక బస్సు వేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 9959225931 నెంబరులో సంప్రదించాలని కోరారు. -
పుష్కరాలకు ఆర్టీసీ రిజర్వేషన్ నిల్
విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ రిజర్వేషన్ సౌకర్యాన్ని అధికారులు నిలిపివేశారు. పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ ఎక్కడికక్కడ టెర్మినల్స్‌ను ఏర్పాటుచేసి నగరమంతా సిటీ బస్సుల హవా నడిపిస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఉన్న ఆర్టీసీ సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం లేకుండా చేసింది. ఆగస్టు 11వ తేదీ అర్థరాత్రి ఆయా గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సు రిజర్వేషన్ మాత్రమే ఏర్పాటుచేశారు. మరుసటి రోజు 12 గంటల సమయం నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో రిజర్వేషన్ నిలిపివేశారు. ఎందుకంటే.. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో రిజర్వేషన్ ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. దీంతో బస్సులు సమయానుకూలంగా నడవక, ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక.. రిజర్వేషన్ నగదును కోల్పోయారు. కొందరికి డబ్బు వాపస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమస్య పునరావృత్తం కాకుండా ఉండేందుకు రిజర్వేషన్ సౌకర్యం ఎత్తివేసినట్లు అధికారులు చెబుతున్నారు. కరెంట్ రిజర్వేషన్ ఉంది ఆర్టీసీ షెడ్యూల్ ప్రకారం సర్వీసుల్ని రద్దు చేయట్లేదు. రిజర్వేషన్ రద్దు చేయడంతో షెడ్యూల్ ప్రకారం ఉన్న సర్వీసులకు కరెంట్ రిజర్వేషన్ అవకాశం కల్పించారు. అలాగే, స్పెషల్ సర్వీసులు నడపడానికీ ప్రయత్నాలు చేస్తున్నారు. -
కొట్టం ఇంజనీరింగ్ విద్యా సంస్థల మూత
► 350 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం ►శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్‌లో చేరాలని ►యాజమాన్యం హుకుం ఎన్ఓసీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ► విద్యార్థుల డిమాండ్ కల్లూరు: ఇంజనీరింగ్ విద్య విభాగంలో ఒక వెలుగు వెలిగిన కొట్టం ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ విద్యా సంస్థలో సీఎస్ఈ, ఈసీఈ, ఈసీ, సీఎస్ఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్ కోర్సులు చదువుతున్న 350 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కొట్టం కరుణాకరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లు చిన్నటేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ కాలేజ్ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కళాశాలలోని ల్యాబ్పరికరాలను యాజమాన్యం అమ్ముకుని ల్యాబ్ పరీక్షలు, ప్రయోగాలపై వారికి శిక్షణ ఇవ్వలేదు. బస్సు సౌకర్యాలను రద్దు చేయడంతో సొంత వాహనాలు,ఆర్టీసీ బస్సులద్వారా కొందరు విద్యార్థులు కాలేజ్‌కు వస్తుండగా మరికొందరు సమీప గ్రామాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అడ్మిషన్ పొందుతున్న సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తామని యాజమాన్యం చెప్పి మోసం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యా సంస్థలను మూసివేస్తున్న సమాచారం తమకు ఇవ్వలేదని, కేవలం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్‌లో చేరాలని యాజమాన్యం హుకుం జారీచేసిందని ఈసీఈ నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాధవరెడ్డి, శశిధర్, బి.రాజశేఖర్, బి.ఈరన్న తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు గురువారం వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు ఎన్ఓసీ ధ్రువీకరణ పత్రాలు అందేలా చూడాలని కోరుతున్నారు. -
పల్లెను తాకని వెలుగు
శ్రీకాకుళం అర్బన్: రోడ్లు బాగోలేని సమయంలో కూడా పల్లెలవైపు పరుగులు తీసిన ఆర్టీసీ బస్సులు నేడు అందుకు భిన్నంగా మారాయి. ఆదాయమే ధ్యేయంగా భావిస్తున్న సంబంధిత అధికారులు బస్సు సౌకర్యాన్ని పల్లె ప్రజలకు దూరం చేస్తున్నారు. కనీసం పల్లె వెలుగు, తెలుగు వెలుగు బస్సులను కూడా మారుమూల ప్రాంతాలకు నడపకుండా ప్రజలను గాలికొదిలేసింది. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో 1100 పంచాయతీలు ఉండగా వాటికి అనుసంధానంగా 2, 600 గ్రామాలున్నాయి. 38 మండలాలకు గాను 11 మండలాల పరిధిలో వందకు పైగా తీరప్రాంత గ్రామాలు, ఏడు మండలాల పరిధిలో వందకు పైగా గిరిజన గ్రామాలున్నాయి. అయితే మూడు వంతులకు పైబడి గ్రామాలకు ఆర్టీసీ అధికారులు తెలుగు-వెలుగు సేవలను దూరం చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పట్టణాలకు రావాలంటే నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు వాహనాలే గతి పల్లెప్రాంత వాసులు పట్టణానికి రాకపోకలు సాగించాలంటే ప్రైవేటు వాహనాలే గతిగా మారారుు. గతంలో నడిచే పల్లెవెలుగు బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో ఆర్థికంగా నష్టపోవడంతోపాటు, ఒక్కోసారి ప్రమాదాల బారినపడుతున్నారు. ఇబ్బందుల్లో విద్యార్థులు గతంలో పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు వస్తుండడంతో విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఉండేవికావు. కాలక్రమేణా నష్టాల సాకుతో ఒక్కో బస్సును తీసివేయడంతో ప్రజలతోపాటు విద్యార్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాలకు తిరుగుతున్న బస్సులు కూడా సకాలంలో రాకపోవడంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తెలుగు-వెలుగు బస్సుల వివరాలు శ్రీకాకుళం జిల్లాలో ఐదు డిపోల పరిధిలో 485 ఆర్టీసీ బస్సులు ఉండగా... అందులో తెలుగు వెలుగు 237 ఉన్నాయి. శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో 51, రెండవ డిపో పరిధిలో 53, పాలకొండలో 51, టెక్కలిలో 35, పలాస పరిధిలో 47 తెలుగు వెలుగు బస్సులు నడుస్తున్నాయి. బస్సులు వెళ్లని పల్లెలు శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఎన్నో పల్లెలకు ఆర్టీసీ సేవలు అందుబాటులో లేవు. శ్రీకాకుళం పట్టణం నుంచి కలెక్టరేట్, కల్లేపల్లి, కిల్లిపాలెం, వాడాడ, బొంతలకోడూరు, రూరల్ మండలంలో తండ్యాంవలస, ఆమదాలవలస మండలంలో పొందూరు, సరుబుజ్జిలి మండలాల పరిధిలో బాణాం, తానేం, దళ్లిపేట, తుంగపేట, గోరింట, గోకర్ణపల్లి, పెద్దసవళాపురం, మతలబుపేట, తెలుగుపెంట, బూర్జ మండల పరిధిలో నీలంపేట, రూపేట, అల్లెన, గుత్తావల్లి ప్రాంతాలకు బస్సులు వెళ్లడం లేదు. అలాగే పాలకొండ, సీతంపేట, భామిని మండలాల పరిధిలో బాసూరు, కోటిపల్లి, ఓని, తలవరం, నీలానగరం, చిదిమి, తొత్తడి, వలగెడ్డ, కె.గుమ్మడ, మనుమకొండ, ఒడ్డంగి, తాలాడ, కోసలి, పాతపట్నం నియోజకవర్గ పరిధిలో ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, మెళియాపుట్టి మండలాల పరిధిలో బడ్డుమర్రి, సీదిరోడ్డు నుంచి రొంపివలస, తురకపేట, దబ్బపాడు, మిరియాపల్లి, సిద్దాంతం, చొర్లంగి, కాశీపురం, కుంటిబద్ర, లబ్బ, కారిగూడ, మారడికోట, భరణికోటకు బస్సుల్లేవు. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల పరిధిలో తెలగాం, తేలినీలాపురం, జెండాపేట, పెద్దరోకళ్ళపల్లి, బడగాం, సైలాడ, శివరాంపురం, కాశీరాజుకాశీపురం, ఆర్.ఎస్.పురం, రుంకు, డి.మరువాడ, చిన్నమరువాడ, కొత్తపల్లి, హరిశ్చంద్ర, లకండిడ్డి, తోటిపర్తి, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట మండలాల పరిధిలో డొంకూరు, బిర్లంగి, పురుషొత్తపురం, టి.బరంపురం, మకరాంపురం, జలంత్రకోట, గోకర్ణపురం, కుత్తుమ, దూగానపుట్టుగ, నెలవంక, ఇద్దువానిపాలెం, పొత్రఖండ, పాలవలస, రుషికుడ్డ, ఇస్కలపాలెం తదితర ప్రాంతాలకు గతంలో పల్లెవెలుగు బస్సులు తిరగేవి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత బస్సు పేర్లను ‘తెలుగు-వెలుగు’గా మార్పు చేసినప్పికీ బస్సులను మాత్రం నడపడం లేదు. -
ఆర్టీసీకి ‘మెట్రో’ బ్రేక్
గ్రేటర్లో రోజుకు 3వేల ట్రిప్పులు రద్దు మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ రద్దీయే కారణం హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్‌కు సిటీ బస్సుకు నిర్ణయించిన రన్నింగ్ టైమ్ 35 నిమిషాలు. కానీ ఇప్పుడు గంట దాటినా గమ్యానికి చేరుకోవడంలేదు. అన్ని చోట్లా అదే పరిస్థితి. కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, కొండాపూర్, బోరబండ, మాదాపూర్, లింగంపల్లి, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, కోఠి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, మెహదీపట్నం, చార్మినార్, తదితర మార్గాల్లో నడిచే సిటీ బస్సులు ట్రాఫిక్ రద్దీ కారణంగా నత్తనడక నడుస్తున్నాయి. బస్సులకు కేటాయించిన రన్నింగ్ టైమ్ ట్రాఫిక్‌లోనే హరించుకు పోతోంది. దీంతో గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో ప్రతి రోజు 3000కు పైగా ట్రిప్పులు రద్దవుతున్నాయి. 1.5 లక్షల మంది ప్రయాణ సదుపాయాన్ని కోల్పోతున్నారు. బేగంపేట్, జేబీఎస్, సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్డి, కోఠి, మలక్‌పేట్ తదితర మార్గాల్లో పలు ట్రిప్పుల బస్సులు రద్దు కానున్నాయి. -
చెక్‌పోస్టు సిబ్బంది దారి దోపిడీ
► ఇసుక లారీల నుంచి వసూళ్లు ► హైదరాబాద్‌కు రూ.50.. వరంగల్‌కు రూ.30 ► ఇవ్వని డ్రైవర్లకు ఇబ్బందులే.. ములుగు : ఏటూరునాగారం ప్రాంతాల్లో నడుస్తున్న ఇసుక క్వారీలు అటవీ చెక్ పోస్టు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఇసుక లారీల నుంచి చెక్ పోస్టు సిబ్బంది దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. రోజూ వచ్చే వందల లారీల నుంచి పెద్దమొత్తంలో జేబులు నింపుకుంటున్నారు. గతంలోనూ ఇదేవిధంగా వసూళ్లకు పాల్పడగా.. ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అప్పుడు ఉన్నతాధికారులు విచారణ చేశారు. సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలడంతో అందుకు కారణమైన ముగ్గురు బీట్ అధికారులకు నోటీసులుజారీచేశారు. అయినా సిబ్బంది తీరులో మా ర్పు రావడం లేదు. ఏటూరు ఇసుక క్వారీ నుం చి సాయంత్రం 4గంటల తరువాత మాత్రమే జిల్లా కేంద్రం వైపునకు లారీలను అనుమతి ఇస్తున్నారు. ఈ లారీలు ములుగు మండలం జంగాలపల్లికి వచ్చే సాయంత్రం 7గంటలు దాటుతోంది. చీకట్లో ఎవరు పట్టించుకుంటారని అనుకుంటున్నారో ఏమోగాని జంగాలపల్లి చెక్‌పోస్టు సిబ్బంది దర్జాగా వసూళ్ల పర్వం నడిపిస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే లారీల నుంచి రూ.50, జిల్లా కేంద్రానికి వెళ్లే లారీలకు రూ.30 వసూలు చేస్తున్నారు. ఇదేమిటని లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తే ‘మాకూ ఖర్చలు ఉంటాయి కదా.. ఎవరు ఇస్తారు. మాతో పాటు పెద్ద సార్లకు ఇం దులో వాటాలు పోతాయి’ అని సమాధానం ఇస్తున్నారని లారీ డ్రైవర్లు తెలిపారు. రోజుకు రూ.20వేల పైమాటే.. జంగాలపల్లి చెక్‌పోస్టు మీదుగా ప్రతి రోజూ హైదరాబాద్‌కు సుమారు 350, జిల్లా కేంద్రానికి 200 వరకు లారీ లు వెళ్తున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు వెళ్లే లారీలకు రూ.50, జిల్లా కేంద్రానికి వెళ్లే లారీలకు రూ.30 చొప్పున లెక్కవేస్తే.. రోజుకు సుమారు రూ.20 వేలకు పైగా వసూళ్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. డబ్బు ఇవ్వని లారీల నంబర్లను నోట్ చేసుకొని మరోసారి ఇదే దారిలో వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న లారీలు ఒక్కో లారీ డ్రైవర్ చెక్‌పోస్టు సిబ్బందికి డబ్బు లు ఇవ్వడానికి లారీని రోడ్డుపైనే ఆపుతున్నాడు. ఇలా ఒక లారీ డ్రైవర్ పని పూర్తి కావడానికి సుమారు ఐదు నిమిషాలు పడుతుంది. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీలు ఆగిపోతున్నాయి. ఇలా చైన్ సిస్టమ్ మాదిరిగా లారీలు సుమారు 2కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ఈ సమయంలో ఏటూరునాగారం, భద్రాచలం, మణుగూరు ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనదారులు చెక్‌పోస్టు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. -
నకిలీ ఐడీ కార్డుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్
మంచిర్యాల: నకిలీ ఐడీ కార్డుతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీకార్డుతో పవన్‌కుమార్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేవాడు. స్టాఫ్ అని చెబుతూ కండక్టర్లను నమ్మించేవాడు. అయితే సోమవారం మంచిర్యాలలో స్పెషల్ స్క్వాడ్ అధికారులు కార్డును తనిఖీచేసి నకిలీదని గుర్తించారు. ఆర్టీసీ అధికారులు నిందితుడిని మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
శ్రీశైలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్‌సిటీ: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8 వరకు శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు నడపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్, ఐఎస్‌సదన్, ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు నుంచి ఈ బస్సులు నడుస్తాయి. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. వివరాలకు: 9959226257, 9959224910, 040-24614406లను సంప్రదించవచ్చు. -
ఆర్టీసీకి నష్టాల ‘జాతర’
మేడారంతో ఖజానాకు చిల్లు.. రూ.4 కోట్లు నష్టం సాక్షి, హైదరాబాద్: జాతరలు.. పుష్కరాలు.. కోట్లలో జనం ఒకచోటికి చేరే ఇలాంటి వేడుకల్లో ఆర్టీసీ పాత్ర అంతాఇంతా కాదు. సందర్శకులను అక్కడికి చేర్చటం, తిరిగి సొంతూళ్లకు తరలించడంలో ఆర్టీసీ బస్సులదే కీలక భూమిక. ఆ సమయంలో ఏ బస్సును చూసినా కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూస్తే ఆర్టీసీకి కాసులే... కాసులు అనుకుంటారు. కానీ చివరికి లెక్కలు తేల్చేసరికి ఆర్టీసీ నష్టమే మిగులుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకుండా చోద్యం చూస్తుండటంతో భారీ వేడుకలు ఆర్టీసీకి గుదిబండలుగా మారుతున్నాయి. ఇటీవలి గోదావరి పుష్కరాల్లో లక్షల మందిని తరలించి రికార్డు సృష్టించిన ఆర్టీసీ చివరికి చేతులు కాల్చుకోగా, తాజాగా మేడారం జాతర కూడా అదే పరిస్థితిని కల్పించింది. 2014లో మేడారం జాతరకు ఉమ్మడి ఆర్టీసీ విస్తృతంగా సేవలందించి 16 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ టీఎస్ఆర్టీసీ సొంతంగా 18 లక్షల మందిని తరలించి సత్తా చాటింది. గత జాతరలో రూ.20 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.22 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇంత ఆదాయం వచ్చినా అంతకు కోటిన్నర మించి ఖర్చు ఉండే అవకాశం ఉందని అధికారులు సూత్రప్రాయంగా తేల్చారు. గోదావరి పుష్కరాల తరహాలో భక్తులు అధికసంఖ్యలో పోటెత్తితే ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో ఈసారి చాలామంది జాతర ప్రారంభానికి ముందే మేడారం బాటపట్టారు. వారు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. ఆర్టీసీ జాతర వేళ భారీ సంఖ్యలో సమకూర్చిన ప్రత్యేక బస్సులను పూర్తిగా వినియోగించాల్సిన అవసరం రాలేదు. దీంతో దాదాపు 650 బస్సులు ఖాళీగా ఉండిపోయాయి. రోజువారీ వీటికి రావాల్సిన ఆదాయం రాకపోవడంతోపాటు, వీటికోసం ప్రత్యేకంగా వచ్చిన సిబ్బందికి అదనపు భత్యాల చెల్లింపు ఖర్చు మీదపడింది. దీనివల్ల రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. వెరసి ఈ జాతర రూ.4 కోట్ల మేర నష్టాన్నే మిగిల్చినట్టయింది. -
మేడారం జాతర సమయంలో బస్సులెలా?
♦ ‘స్పెషల్’ రూపంలో 2 వేల బస్సుల మళ్లింపు ♦ హైదరాబాద్ నుంచే వెయ్యి సిటీ బస్సుల తరలింపు ♦ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ♦ విభజనతో ఆంధ్ర నుంచి బస్సులు రాకపోవటమే కారణం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన మేడారం జాతరకు కోట్లలో భక్తులు తరలి వెళ్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్ జిల్లా మేడారానికి భక్తజనం చేరుకుంటుంది. జాతర జరిగే రోజుల్లో ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు. అక్కడి జంపన్నవాగులో నీళ్లు కనిపించకుండా భక్తులు నిండిపోతారు. ఇంత రద్దీ ఉండే సమయంలో వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఇది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. కానీ ఈసారి అదనపు బస్సులు నడపటం ఇబ్బందిగా మారబోతోంది. జాతర మొదలు కాకముందు నుంచే శని, ఆదివారాల్లో లక్షల్లో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ఈనెల 14 నుంచి ఆ సంఖ్య ఎక్కువ కానుంది. ఇక 17, 18 తేదీల్లో అది మరింతగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ దాదాపు రెండు వేల అదనపు బస్సులను మేడారం వైపు నడుపుతోంది. ఒక్క హైదరాబాద్ నుంచే వెయ్యి వరకు సిటీ బస్సులను నడపనున్నట్లు సమాచారం. తొలుత సిటీ బస్సుల్ని వివిధ జిల్లాలకు పంపి.. ఆయా ప్రాంతాల నుంచి మేడారం వరకు నడపనున్నారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తే.. అదనపు బస్సులు నడపాలంటే ఇలాంటి ఇబ్బందులను ఇక ఎదుర్కొనక తప్పదని బదులిస్తున్నారు. ప్రతి జాతర సమయంలో ఆంధ్ర నుంచి బస్సులను తెప్పించి స్పెషల్ సర్వీసులుగా నడిపేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోవటంతో అక్కడి నుంచి ఒక్క బస్సు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వాటిని తెప్పిస్తే ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అది టీఎస్ ఆర్టీసీ ఖజానాకు భారంగా మారుతుంది. దీంతో ఇక్కడి పది జిల్లాల నుంచే కొన్ని కొన్ని చొప్పున బస్సులను మళ్లించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జాతర జరిగే మూడు, నాలుగు రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా బస్సుల కొరత ఏర్పడబోతోంది. -
‘z’ కా మత్లబ్ క్యా హై..?
తెలుసా ఈ చరితం..? వాహనాల నెంబర్ ప్లేట్లపై రకరకాల అక్షరాలను మీరే గమనించే ఉంటారు. ఒక సీరిస్ ప్రకారం రవాణాశాఖ ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తుంది. కానీ ఆర్టీసీ బస్సులు మాత్రం ‘జడ్’ అనే అక్షరంతోనే నమోదవుతాయి. ఎందుకో తెలుసా..?నిజాం ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు’ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 1932 జూన్‌లో మొట్టమొదటిసారి సిటీ బస్సులను ప్రవేశపెట్టింది. వీటిని నిజాం ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి జహ్రాబేగం పేరిట నమోదు చేయించారు. అందుకే ప్రతి బస్సు నెంబర్ ఆమె పేరులోని మొదటి అక్షరం ‘జడ్’తో ప్రారంభమవుతుంది. ఆర్టీసీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నేటికీ.. అదే నెంబర్ వన్: నిజాం కాలంలో బస్సులు హైదరాబాద్ నుం చి సికింద్రాబాద్ వరకు నడిచేవి. ఇప్పటి ట్యాంక్‌బండ్ అప్పుడు రెండు జంటనగరాల మధ్య ప్రధాన రహదారి. ముఖ్యంగా నవాబు నివాసం కింగ్ కోఠి నుంచి సికింద్రాబాద్‌కు మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన బస్సు నెంబ ర్ ఒకటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రూ ట్ నెంబర్ ఒకటే. కింగ్‌కోఠితో పాటు ఉద్యోగులు, అధికారుల నివాస ప్రాంతాలకు బస్సు లు నడిపేవారు. ఉదాహరణకు బార్కాస్‌కు రెండో నెంబర్ బస్సు వెళ్తుంది. బార్కాస్ మొదటి నుంచి సైనికులు, అధికారుల నివాస ప్రాంతం. అలా అప్పట్లో ప్రముఖుల అవసరాల మేరకు ప్రవేశపెట్టిన బస్సులు క్రమంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. -
స్పెషల్ బస్సుల్లో అదనపు వసూళ్లకు అనుమతి
హైదరాబాద్ : పత్యేక సందర్భాల్లో స్పెషల్ సర్వీసులు తిప్పినప్పుడు స్టేజి క్యారియర్లుగా తిరిగే బస్సులకు ఒకటిన్నర రెట్లు ఛార్జీలు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వారాంతంలో, వారంలో ఏ రోజైనా, పండుగల వేళ, జాతర్లకు ప్రయాణీకుల డిమాండ్ మేరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని, మోటారు వాహన చట్టం 67(1) ప్రకారం ఈ అవకాశం కల్పించి చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టేజి క్యారియర్లుగా ఆర్టీసీ బస్సులకు మాత్రమే అధికారికంగా అనుమతి ఉంది. అయితే ప్రైవేటు బస్సులు కూడా స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్నా.. రవాణా శాఖ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో ప్రైవేటు బస్సులు పండుగ సీజన్లో ఛార్జీల మోత మోగించనున్నాయి. -
తిరుమలలో రోడ్డు ప్రమాదం.. భక్తులు సురక్షితం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో అలిపిరి సమీపంలో 57వ మలుపు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్న ఓ కారు, రెండు ఆర్టీసీ బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం అయినట్టు పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి భక్తులు సురక్షితంగా భయటపడ్డారు. కాగా, ట్రాఫిక్ స్తంభించి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమైయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖైరతాబాద్-పంజాగుట్ట: బస్సుల మళ్లింపు
హైదరాబాద్: మెట్రోరైలు నిర్మాణ పనుల దృష్ట్యా పంజాగుట్ట - ఖైరతాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ నాయక్ సోమవారం వివరాలను వెల్లడించారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే కొన్ని బస్సులను రాజ్‌భవన్, యశోద హాస్పిటల్, సోమాజీగూడ క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లిస్తారు. మరికొన్ని బస్సులను ఖైరతాబాద్, ఆర్టీఏ కార్యాలయం, తాజ్‌బంజారా, జీవీకే మాల్, నిమ్స్ వెనుక గేట్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లించనున్నట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని.. ప్రయాణీకులు సహకరించాలని కోరారు. -
తెలంగాణ బంద్ ప్రశాంతం
-
తెలంగాణ బంద్ ప్రశాంతం
* రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించిన విపక్షాలు * రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ * అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తత.. ఏడు ఆర్టీసీ బస్సులు ధ్వంసం * 228 కేసులు నమోదు.. దాదాపు 8,048 మంది అరెస్టు * హైదరాబాద్‌లో బంద్ పాక్షికం * కేసీఆర్ ఒక నియంత: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ శనివారం ప్రశాంతంగా జరిగింది. బంద్ నేపథ్యంలో ఉదయం నుంచే వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి.. దుకాణాలను మూయించారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల దుకాణాలు, స్కూళ్లు, హోటళ్లు, వ్యాపార సంస్థలను కార్యకర్తలు మూయించగా... మరికొన్ని చోట్ల స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్ సందర్భంగా ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,048 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ చోటు చేసుకున్న స్వల్ప ఉద్రిక్తతలు, దాడుల వంటి ఘటనలపై 228 కేసులు నమోదయ్యాయి. ఏడు ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను నడిపించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిలను హైదరాబాద్‌లో బస్సు డిపోల వద్ద ధర్నా చేస్తుండగా... టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డిలను సికింద్రాబాద్‌లో అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా...: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహేశ్వరంలో మాజీ మంత్రి సబితారెడ్డి, పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రయ్య, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి యాదయ్య, కమ్యూనిస్టు పార్టీ నేతలు బస్‌డిపోల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో దుకాణాలు, హోటళ్లు, పాఠశాలలను మూసివేశారు. పలుచోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఆందోళనకారులు రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, కోదండరాంరెడ్డి, జగ్గారెడ్డి బంద్ నిరసనల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో విపక్షాల నేతలు కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డగించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. బంద్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. విపక్షాలన్నీ కలసి.. నిజామాబాద్ జిల్లాలో విపక్షాల నేతలంతా కలసి నిరసనలు తెలియజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. కల్వకుర్తిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబ్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ, టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కల్వకుర్తిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. ఇక నల్లగొండ జిల్లాలో భువనగిరి, మునుగోడు, దేవరకొండ, హాలియా, గుర్రంపోడు, త్రిపురారం, నిడమనూరులలో రాస్తారోకో చేస్తున్న 150 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాలో విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా దయానంద్‌ను, మణుగూరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బస్సులు పాక్షికంగా నడిచాయి. భైంసాలో అఖిలపక్ష నాయకులు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రాజధానిలో.. హైదరాబాద్‌లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. కొద్దిసేపు బస్సుల రాకపోకలు నిలిచిపోయినా.. ఆ తరువాత యథావిధిగా కొనసాగాయి. పెట్రోల్ బంకులు, దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను కొద్దిసేపు మూసి ఉంచారు. అబిడ్స్ వద్ద ఆందోళనకారులు రెండు బస్సుల అద్దాలు పగులగొట్టారు. స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు కావడంతో బంద్ ప్రభావం తక్కువగానే కనిపించింది. విపక్షాలు నిర్వహించిన ఈ బంద్‌లో తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమిక పోషించింది. కానీ ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ మాల్స్ మాత్రం యథావిధిగా పనిచేయడం గమనార్హం. పోటీలు పడి దుకాణాలను మూయించిన టీడీపీ, బీజేపీ నాయకులు వీటి జోలికి మాత్రం వెళ్లలేదు. కేసీఆర్ నియంత రాష్ట్రాన్ని కేసీఆర్ నియంతలా పాలిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు అదనంగా బోనస్ ఇవ్వాలని... ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ పెంచిన ఎక్స్‌గ్రేషియా అందజేయాలని కోరారు. రైతులకు సంఘీభావంగా ప్రతిపక్షాలు చేపట్టిన బంద్‌ను అడ్డుకొనేందుకు సీఎం కేసీఆర్ ఎంతగా ప్రయత్నించినా... అన్ని జిల్లాల్లో విజయవంతమైందని చెప్పారు. -
మంత్రివర్యా.. ఇలాగైతే చదువుకునేదెలా..?
అసలే కార్పొ‘రేటు’ విద్య. భారీ ఫీజులు తలకుమించిన భారం కావడంతో పట్టణాల్లోని హాస్టళ్లలో ఉండేందుకు ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు స్వగ్రామాల్లోని ఇళ్ల నుంచే రోజూ రాకపోకలు సాగిస్తూ చదువుకుంటున్నారు. అందుకోసం స్టూడెంట్ బస్‌పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కళాశాలలు ప్రారంభమవుతాయి. అంటే 8.30 నుంచి 9 గంటల మధ్యలో వారివారి గ్రామాల నుంచి బయలుదేరాలి. కానీ, ఆ సమయంలో ఒకేఒక్క ఆర్టీసీ బస్సు మాత్రమే ఉంటోంది. అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరత్రా పనులపై పట్టణాలకు బయలుదేరే ప్రజలతో ఆ బస్సు కాస్తా కిక్కిరిసిపోతోంది. విద్యార్థులు డోర్ వద్ద వేలాడుతూ నిత్యం నరకం చూస్తున్నారు. యువకులు ఒంటికాలిపై నిలబడి ఎలాగోలా ప్రయాణిస్తుండగా, యువతుల మాత్రం కాలుపెట్టేందుకు కూడా ఖాళీలేని బస్సుల్లో ప్రయాణించలేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. బస్‌పాస్‌లు ఉన్నప్పటికీ ఆటోలకు అదనంగా ఖర్చుచేస్తున్నారు. ఇదంతా ఎక్కడో పశ్చిమ ప్రకాశంలోని మారుమూల పల్లెల్లో అనుకుంటే పొరపాటే. జిల్లా నడిబొడ్డునున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు సొంత నియోజకవర్గమైన దర్శిలో. ఈ నియోజకవర్గంలోని దొనకొండ-దర్శి, బొద్దికూరపాడు-దర్శి, తూర్పుగంగవరం-దర్శి, ఇతర అన్ని రూట్లలో విద్యార్థులకు నిత్యం ఇలాంటి సినిమా కష్టాలు తప్పడం లేదు. దర్శి పట్టణంలో చదువుకునే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం మరో బస్సును అదనంగా తిప్పి ఈ సమస్య పరిష్కరించాలంటూ యువతీయువకులు ఇప్పటికే అనేకసార్లు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. అయినాగానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో... మంత్రిగారూ..ఇలాగైతే మేమంతా చదువుకునేదెలా అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం
జవహర్ నగర్: ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే సురక్షితమని, అంతుకే మారుమూల ప్రాంతాలకు ఆర్డీసి సేవసలను విస్తరించనున్నట్లు ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లెబోయిన చంద్రశేఖర్‌యాదవ్ అన్నారు. ఆదివారం గబ్బిలాలపేట నుండి సికింద్రాబాద్‌కు 24బిజి నెంబర్ బస్సును ప్రాంరంభించిన ఆయన.. వివిధ జిల్లాల నుండి వలసవచ్చి గబ్బిలాలపేట పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నవారు దాదాపు 20వేల పైచిలుకు ఉంటారని, నగరాకి వెళ్లి పనిచేసుకునే వీరు ఇన్నాళ్లు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారని, ఇప్పుడు ఆర్టీసీ బస్సు సర్వీసు రావడం ఆనందంగా ఉన్నదన్నారు. గ్రామజ్యోతి పధకం ద్వారా మారుమూల ప్రాంతాల్లో మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. -
అప్పన్నే కొండ ఎక్కించాలి..
సింహగిరి ఘాట్‌లో ఆర్టీసీ బస్సుల మొరాయింపు కండిషన్లో లేని వాహనాలతో తంటా పట్టించుకోని ఆర్టీసీ అధికారులు సింహాచలం: ఆర్టీసీ బస్సులు సింహగిరి ఘాటీ ఎక్కలేక మొరాయిస్తున్నాయి. ప్రయాణికులు మధ్యలోనే దిగి కాలినడకన కొండపైకి చేరుకోవలసిన దుస్థితి. తరచు ఇలాంటి సంఘటనలు ఘాట్‌రోడ్డులో జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని బస్సు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఘాట్‌రోడ్డులో కండిషన్లో లే ని బస్సులను ఆర్టీసీ నడపడం వల్లే తర చు ఇలాంటి సంఘటనలు నెలకొంటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోంచి పలు ప్రదేశాల నుంచి సింహగిరికి భక్తులను చేరవేసేందుకు సింహాచలం డిపో బస్సులు నడుపుతోంది. చాలా బస్సులు కండిషన్లో లేకపోవడంతో ఘాటీ ఎక్కలేకపోతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చేసరికి మొరాయిస్తున్నాయి. సింహగిరి నుంచి బయలుదేరే బస్సులు మొదటి మలుపు వద్దనున్న ఘాటీ ఎక్కలేకపోతున్నాయి. ఒక్కోసారి ఈ ప్రాం తాల్లో బస్సులు ఘాటీ ఎక్కలేక వెనక్కి వచ్చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద చెట్టుని ఆనుకుని గతంలో బస్సు ఆగిన సంఘటన కూడా చోటుచేసుకుంది. ఘాటీ ఎక్కలేని పరిస్థితిలో బస్సుల్లో ఉన్న భక్తులను కిందకు దించాల్సి వస్తోంది. పరిమితికి మించి భక్తులను బస్సుల్లో ఎక్కించుకుంటున్న సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. దీంతో తరకు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కండిషన్లో ఉన్న బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు మాట వరసకే చెబుతున్నారు గానీ చేతల్లో చూపించడం లేదు. ఈ విషయంపై డిపో మేనేజర్ దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. -
బస్సుల కోసం విద్యార్థుల నిరసన
రొంపిచర్ల: బస్సులు చాలటం లేదని, కొత్తగా సర్వీసులు నడపాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని విప్పర్ల, రెడ్డిపాలెం, దారావారిపాలెం, కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందిన 400 మంది విద్యార్థులు నిత్యం నరసరావుపేట పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, ఆర్టీసీ బస్సులు వేళకు రాక, వచ్చినా సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు సోమవారం ఉదయం విప్పర్ల వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి జాతీయరహదారిపై బైఠాయించారు. పది గంటల వరకు ఆందోళన కొనసాగటంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు విద్యార్థినీ విద్యార్థులను లాఠీచార్జితో చెదరగొట్టారు. రాకపోకలను పునరుద్ధరించారు. -
డిపోలకే పరిమతమైన ఆర్టీసీ బస్సులు
-
నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. శనివారం తెల్లవారుజామున 4గంటలకే వైఎస్సార్ సీపీ జిల్లాలోని పలు డిపోలకు వద్దకు చేరుకొని బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా డిపోల ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
కర్నూలు జిల్లాలో ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం
రాజ్‌విహార్: ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాలు మంగళవారం చేపట్టిన బంద్ కారణంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సుమారు రూ.50 లక్షల ఆదాయం కోల్పోయినట్టు ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్ పరిధిలో ఓ ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమైనట్టు చెప్పారు. కాగా, బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. -
డిపోలకే పరిమితమైన బస్సులు
-
బస్సుల కోసం రాస్తారోకో
బచ్చన్నపేట : కాలేజీలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు రాస్తారోకో కు దిగారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు జనగామలోని కళాశాలలకు వెళుతుంటారు. కానీ వీరికి ఒకే ఒక్క ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంది. దాంతో వేరే వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సుమారు 450 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మరో రెండు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్‌తో మాట్లాడగా... చర్చించేందుకు రావాలని విద్యార్థులను ఆహ్వానించారు. .......................... -
పోటెత్తిన వాహనాలు
♦ పదివేలకు పైగా తరలివచ్చిన వెహికిల్స్ ♦ కరువైన పార్కింగ్ స్థలాలు ♦ ములుగు నుంచి బారులు ♦ ముల్లకట్ట వైపు దారి మళ్లింపు ♦ పోలీసులకు ముచ్చెమటలు ♦ మధ్యాహ్నం తర్వాత తగ్గిన ట్రాఫిక్ క్లియర్ సాక్షి, హన్మకొండ/మంగపేట : జిల్లాలోని మంగపేట, ముల్లకట్ట, రామన్నగూడెం పుష్కరఘాట్లకు భక్తులతోపాటు వాహనాలు పోటెత్తారుు. రంజాన్ సందర్భంగా శనివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పలు వాహనాల ద్వారా గోదావరి తీరం చేరారు. ఉదయం 7గంటలకే మంగపేట పుష్కరఘాట్ పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోరుుంది. వాహనాల రాక మరింత పెరగడంతో ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలు చూపించలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. దీంతో గంపోనిగూడెం వద్దే వాహనాలు నిలిచిపోయూరుు. మంగపేట, కమలాపురం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర బారులు తీరారుు. ఉదయం పదిగంటలకు ఏటూరునాగారం అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద నిమిషానికి కనీసం 25వాహనాల చొప్పున మధ్యాహ్నం వరకు సుమారు 7500వాహనాలు మంగపేట వైపువెళ్లారుు. అదే సమయానికి పుష్కరస్నానాలు ఆచరించిన మరికొందరు భక్తులు తిరుగు ప్రయాణం కావడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు కిక్కిరిశారుు. ముఖ్యంగా పస్రా, తాడ్వాయి నుంచి ఏటూరునాగారం వరకు సింగిల్‌రోడ్డు కావడంతో ఇబ్బందులు తలెత్తారుు. ఏటూరునాగరం వద్ద దారి మళ్లింపు అన్ని వాహనాలు కమలాపురం-మంగపేట వైపు వెళ్లకుండా కొన్నింటిని ఏటూరునాగాం మీదుగా రామన్నగూడెం, మంగపేట వైపు దారి మళ్లించారు. మంగపేట వైపు నుంచి వాహనాలు వెళ్లడంతో రామన్నగూడెం-ఏటూరునాగారం మధ్య ట్రాఫిక్ పెరిగింది. రామన్నగూడెం వచ్చిన వాహనాలు తిరుగుప్రయాణంలో పప్కాపూర్ మీదుగా మళ్లించినా.. వాహనాలు వేగంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ముల్లకట్ట వైపు వెళ్లేలా వాహనాలను దారి మళ్లించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.00 గంటల రద్దీ అధికం కావడంతో ఏటూరునాగరం క్యాంపు ఆఫీస్ సమీప పాఠశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈలోగా జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా మంగపేట చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పాల్గొన్నారు. ఆ వెంటనే అదనపు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. మరికొందరు భక్తులు తామే వాహనాలను అడవులు, పొలాల్లో పార్కింగ్ చేసుకుని ఐదారు కిలోమీటర్లు కాలినడక ప్రయాణం చేసి పుష్కరఘాట్లకు చేరుకోవడం ప్రారంభించారు. ఫలితంగా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ట్రాఫిక్ పోలీసుల అదుపులోకి వచ్చింది. అరుుతే, ట్రాఫిక్ సమస్యతో ఆర్టీసీ బస్సులు సకాలంలో నడవలేదు. నిరీక్షించిన భక్తులు ఆందోళన చేపట్టారు. అధికారులు జోక్యంతో శాంతించారు. కాగా, ఒక్కరోజే సుమారు పదివేల వాహనాల్లో దాదాపు 2.50లక్షలమంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారని అధికారులు అంచనా వేశారు. -
నరకానికి నకళ్లు !
జిల్లాలో రహదారుల వ్యవస్థ దారుణంగా మారింది. రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో అంతర్భాగమైన రహదారుల వ్యవస్థను ప్రభుత్వం గాలికొదిలేసిన ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణం, నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో రహదారులు క్షీణదశకు చేరాయి. పలు నియోజకవర్గాలు, మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లేందుకు సరైన రహదారుల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కళ్లకు కడుతోంది. రాజధాని కేంద్ర బిందువైన తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలకు సరైన రహదారుల వ్యవస్థ లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. - గ్రామీణ రహదారుల వ్యవస్థ చిన్నాభిన్నం - రోడ్లు సరిగా లేక 40 గ్రామాలకు వెళ్లని ఆర్టీసీ బస్సులు - గుంతలమయంగా మారిన గుంటూరు - హైదరాబాద్, చెన్నైమార్గాలు - మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు నియోజకవర్గాల్లో సైతం దారుణం - నాణ్యతాలోపంతో తెనాలి డివిజన్లో భారీగా దెబ్బతిన్న రహదారులు గుంటూరు ఎడ్యుకేషన్ రహదారులు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) పరిధిలో జిల్లాలో 3,400 కిలో మీటర్ల మేర రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిలో 656 కిలోమీటర్ల పరిధిలో రాష్ట్ర రహదారులు, 1,965 కిలోమీటర్ల మేర జిల్లా రహదారులు, 779 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు ఉన్నాయి. రహదారుల వ్యవస్థ లేక జిల్లాలోని 40 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు సైతం వెళ్లని పరిస్థితులు ఉన్నాయయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తట్టుకొనేందుకు చేపట్టిన రహదారుల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు రెండు లేన్ల రాష్ట్ర రహదారిని నాలుగు లేన్లగా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఓ కొలిక్కి రాలేదు. గుం టూరు నగర పరిధిలో చుట్టుగుంట-పల్నాడు బస్టాండ్ మధ్య విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్, అటు చెన్నై వెళ్లే మార్గాలకు ఈ దారే కీలకం. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రహదారి నిర్వహణ లోపంతో గుంతల మయంగా మారి ప్రయాణికులకు నరకం చూపుతోంది. తారు రోడ్డు ఎరుగని గ్రామాలు ... - తారురోడ్డు సైతం ఎరుగని గ్రామాలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల వ్యవస్థ అధ్వానంగా మా రింది. ఎస్సీ కాలనీలకు దారితీసే రోడ్లు మట్టి, గ్రావెల్ వంటి తాత్కాలిక మెరుగులకే పరిమితమయ్యాయి. - రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజవర్గంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లు అధ్వానంగా మారాయి. యడ్లపాడు -లింగారావుపాలెం, వంకాయలపాడు - కారుచోల రోడ్డు, తిమ్మాపురం-దింతెనపాడు, సందెపూడి-వేలూరు రోడ్లు అధ్వానంగా ఉన్నా యి. చిలకలూరిపేట మండలంలో కొమటినేని వారిపాలెం-కమ్మవారిపాలెం, మానుకొండవారిపాలెం-వేలూరు, నాదెండ్ల -గణపవరం, కనుపర్రు-సాతులూరు, సాతులూరు-నాదెండ్ల రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. - మాచర్ల నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారులు అధ్వానంగా తయారై నిత్యం ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మార్జిన్లు సక్రమంగా లేకపోవటం, వర్షాలకు కోతకు గురికావటంతో ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే సాగర్ రహదారి గుంతల మయంగా మారింది. - పొన్నూరు నియోజకవర్గంలో వలసమాలప ల్లి, మన్నవ, రమణప్పపాలెం, దొప్పలపూడి, నండూరు,కసుకర్రు, మన్నవ,రమణప్పపాలెం, వల్లభరావుపాలెం, పెదపాలెం, ఉప్పరపాలెం గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. - తెనాలి డివిజన్లో ఆర్అండ్బీ రోడ్లు నిర్మా ణం, మరమ్మతుల్లో నాణ్యత లేమి కారణంగా భారీగా దెబ్బతిన్నాయి. నిర్మాణంలో ఉన్న రోడ్లు నత్తనడకన సాగుతున్నాయి. సిరిపురం-తెనాలి, దంతులూరు-మున్నంగి, తెనాలి-చెరుకుపల్లి రోడ్లు దారుణంగా కనిపిస్తున్నాయి. -
హైవేపై నిఘా ఏదీ..?
ఫిబ్రవరిలో వనపర్తికి చెందిన దంపతులు ఇల్లు అమ్మగా వచ్చిన మూడు లక్షల రూపాయలు తీసుకొని కర్నూలు నుంచి వనపర్తికి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. బస్సు అలంపూర్ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ గుర్తు తెలియని మహిళలు ముగ్గురు బస్సెక్కారు. అనంతరం వనపర్తికి చెందిన దంపతుల వద్దనుంచి రెండు లక్షల రూపాయలు దొంగిలించారు. అనంతరం ఇటిక్యాలపాడు వద్ద దిగిపోయారు. తర్వాత తమ డబ్బులు చూసుకున్న దంపతులు అందులో రూ. రెండు లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారన్న విషయం తెలిసి గొల్లుమన్నారు. ఈ సంఘటన ఒక్కటే కాదు.. 44వ నెంబర్ జాతీయ రహదారిపై బస్సుల్లో దొంగతనాలు జరగడం నిత్యకృత్యంగా మారింది. ఇటిక్యాల : 44వ నెంబరు జాతీయ రహదారిపై దొంగలు బస్సులు.. లారీల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. అయినా, పోలీసులు వాటిని అరికట్టడంలో నిర్లక్షంగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు హడావుడి చేయడం తప్ప జాతీయరహదారిపై పటిష్ట నిఘాను ఏర్పాటు చేయడం లేదు. దీనిని అదునుగా తీసుకున్న దొంగలు తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు. దొంగలు హైవేపై అలంపూర్ టోల్‌ప్లాజా నుంచి జల్లాపురం స్టేజీ వరకు చోరీలకు అడ్డాగా మార్చుకొని పథకం ప్రకారం చోరీలు చేస్తున్నారు. ప్రస్తుతం హైవేపై హైవే పెట్రోలింగ్ వాహనం గస్తీ తిరుగుతోంది. పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా విధులు నిర్వహించడంతోనే ఇలాంటి చోరీలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. చోరీలను అరికట్టేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రయాణికులతోపాటు పోలీసు బలగాలు సైతం ఈ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చస్తే తప్ప చోరీలు అదుపులోకి రావన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హైవేపై జరిగిన ప్రధాన దొంగతనాలు.. మానవపాడు స్టేజీ వద్ద గుర్తు తెలియని దుండగులు ఓ లారీ డ్రైవర్, క్లీనర్‌ను చితకబాది రూ. 10వేలు లాక్కెళ్లారు. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా.. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మానవపాడు గ్రామ శివారులో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లే డీసీఎం డ్రైవర్‌ను దుండగులు చితకబాది అతని వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. కేశినేని ట్రావెల్స్ బస్సులో కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు బంగారం తీసుకెళ్లే ఇద్దరు వ్యక్తుల నుంచి మానవపాడు మండలంలోని ఘర్దాబా వద్ద నాలుగు కిలోల బంగారం చోరీకి గురైంది. అయితే, బంగారం తీసుకొచ్చే ఇద్దరు వ్యక్తులపైనేప్రయాణికులు అనుమానం వ్యక్తం చేయడంతో చోరీ మిస్టరీగా మారింది. బంగారం తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఘర్ దాబా వద్ద బస్సు దిగి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వెంటనే మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా బంగారాన్ని తీసుకొచ్చే లోకనాథన్, సుజారాం బస్సు సీట్ల వద్దకు వెళ్లి బ్యాగులలోని నాలుగు కిలోల బంగారాన్ని తీసుకొని టవల్లో చుట్టుకొని వడివడిగా బస్సు దిగి వారు తెచ్చుకున్న కారులో వెళ్లిపోయారు. -
నష్టాల్లో ఆర్టీసీ..కష్టాల్లో ప్రయాణికులు
-
సగం జనరథాలకే చలనం
రాజమండ్రి :ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల సమ్మె రెండవ రోజు గురువారం కూడా జిల్లాలో విజయవంతమైంది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం డిపోలతోపాటు మిగిలిన డిపోల వద్ద కార్మికులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. సమ్మెను అడ్డుకునేందుకు యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లను, కండక్టుర్లును నియమించి, బస్సులు తిప్పినా అవి ప్రయాణికుల అవసరాలకు అరకొరగానే అక్కరకు వచ్చారుు. ఆర్టీసీ అధికారు ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో బస్సులు తిప్పాలన్న యత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లాలో తొమ్మిది డిపోలకు సుమారు 840 బస్సులు ఉండగా, కేవలం 437 బస్సులు మాత్రమే తిరిగాయి. మధ్యాహ్నం వరకు కేవలం 200 బస్సులు మాత్రమే తిరిగాయి. చాలా చోట్ల కార్మికులు బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని డిపోల వద్ద దారిపై మేకులు, సీసాలు బద్దలు కొట్టి గాజుముక్కలు వేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో అధికారులు పోలీసుల సహాయంతో బస్సులు తిప్పారు. శుక్రవారం నుంచి బస్సుల్లో పోలీసులను ఉంచి సర్వీసులు తిరిగేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ హామీ ఇచ్చారు. బస్సులు గురువారం కూడా తిరగవనే అనుమానంతో ప్రయాణికులు రాకపోకలకు ఇతర వాహనాల మీద ఆధారపడ్డారు. దీనితో మధ్యాహ్నం వరకు బస్సులు ఒకరిద్దరు ప్రయాణికులతో బోసిపోరుు కనపించాయి. సాయంత్రం నుంచి ప్రయూణికుల సందడి కొంత పెరిగింది. సగం బసులు తిప్పినా ఆర్టీసీకి వచ్చిన ఆదాయం కొసరే. టిక్కెట్లు ఇవ్వకుండా, వాటి రేటు పెంచి తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు సొమ్ములు జేబులో వేసుకున్నారు. టిక్కెట్ రేటుకు రెట్టింపు వసూలు చేస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పేరుకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులని బోర్డుపెట్టినా పాసింజరు బస్సుల్లాగే ప్రతి చోటా ఆపి ప్రయాణికులను ఎక్కించుకున్నారు. రెండు రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ జిల్లావ్యాప్తంగా రూ.1.80 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అధికారులు చెబుతున్నారు. విధులకు హాజరైతే.. ఉద్యోగం పక్కా ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు, సమ్మెను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న యాజమాన్యం కాంట్రాక్ట్ ఉద్యోగులపై కన్నేసింది. వారిని నయానో.. భయానో దారికి తెచ్చుకుని బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తోంది. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు విధులకు వస్తే వారిని పర్మనెంట్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇస్తోంది. లేకుంటే ఉన్న ఉద్యోగాలను తొలగిస్తామని బెదిరింపులకు దిగుతోంది. జిల్లాలో 259 కాంట్రాక్ట్ డ్రైవర్లు, 57 మంది కండక్టర్లు ఉన్నారు. వీరు విధుల్లోకి వస్తే ఇప్పుడున్నవారితో కలిసి మరిన్ని బస్సు సర్వీసులను తిప్పాలని భావిస్తున్నారు. -
పోలీస్ ఎస్కార్ట్‌తో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఇందుకోసం ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకోవడంతో ఏకంగా పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో వాటిని నడుపుతున్నారు. గురవారం వరంగల్ జిల్లాలో పోలీసుల ఎస్కార్ట్ సహాయంతో నడుస్తున్న బస్సులపై నర్సంపేట సమీపంలో ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు. రెండు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు దాడులకు పాల్పడిన ముగ్గురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఎంసెట్‌కు సమ్మె టెన్షన్
ఆర్టీసీ బస్సులు లేక ఎదురుకానున్న రవాణా ఇబ్బందులు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న అధికారులు ఆందోళనలో విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాయనున్న 27,617 మంది గుంటూరు ఎడ్యుకేషన్: ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులను ఆర్టీసీ సమ్మె టెన్షన్ పెడుతోంది. ఎంసెట్ రాసేం దుకు శుక్రవారం జిల్లా నలుమూలల నుంచి గుంటూరుకు రావాల్సిన విద్యార్థులకు సమ్మె కొనసాగితే బస్సులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తనున్నాయి. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదన్న అధికారుల ప్రకటనతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో సమీప ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బందులు ఉండకపోవచ్చు. మాచర్ల, వినుకొండ, రేపల్లె, బాపట్ల తదితర దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఆటోలు, ప్రైవేటు వాహనాలే శరణ్యం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 27,617 మంది ఎంసెట్‌కు హాజరుకానున్నారు. వీరి కోసం 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. గుంటూరు నగరంలో 38, నరసరావుపేటలో 5, చిలకలూరిపేటలో ఒక కేంద్రం ఉన్నాయి. జిల్లాలోని 57 మండలాల వారీగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులు నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో సాహసం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలిచేందుకు ముందుకు రావాల్సి ఉంది. ఎంసెట్‌కు ముమ్మర ఏర్పాట్లు ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదురుకానున్నాయి. అధికారులు మాత్రం ఎంసెట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు 19,878 మంది, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షకు 7,739 మంది హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38 కేంద్రాల్లో ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 16 కేంద్రాల్లో మెడిసిన్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను గంట ముందు నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. నిర్థిష్ట సమయానికి అరగంట ముందుగా విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేస్తామని చెబుతున్నారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2.30 తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఒక నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని తేల్చిచెబుతున్నారు. -
ఎక్కడి బస్సులు అక్కడే
కార్మికుల సమ్మెతో నిలిచిన ఆర్టీసీ బస్సులు జిల్లావ్యాప్తంగా 600కు పైగా బస్సులకు బ్రేకులు గ్యారేజీల ఎదుట కార్మికుల ఆందోళన ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపేందుకు చర్యలు వ్యతిరేకించిన కార్మికుల అరెస్ట్ ఆర్టీసీకి రూ.40 లక్షల ఆదాయానికి గండి ప్రయాణికులను దోచుకున్న ప్రైవేటు ఆపరేటర్లు ఏలూరు (ఆర్ఆర్ పేట) :వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్‌తోపాటు నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తదితర ప్రధాన కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు బుధవారం ఉదయం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. తమకు 2013 ఏప్రిల్ నుంచి నూతన పీఆర్సీ వర్తింపచేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్లతో కార్మికులంతా సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు కదల్లేరు. ప్రజా రవాణాకు దూరమైన 1.20 లక్షల మంది కార్మికుల సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల మంది ప్రయాణికులకు ప్రజా రవాణా సౌకర్యం దూరమైంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, భీమవరం, నరసాపురం, డిపోల నుంచి 612 బస్సులు 650 సర్వీసులుగా, 578 షెడ్యూళ్లలో తిరిగేవి. సుమారు 207 రూట్లలో 1.20 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేవి. తద్వారా ఆర్టీసీకి రోజుకి రూ.48 లక్షల ఆదాయం సమకూరేది. జిల్లాలోని 2,878 మందికార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడగా, ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మూసుకుపోయాయి. బుధవారం వేకువజామున 5 గంటల నుంచే డిపో గ్యారేజీలకు కార్మికులు, వివిధ యూనియన్ల నాయకులు చేరుకుని ఆందోళన చేపట్టారు. బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని డిపోల్లో ఇదే వాతావరణం కనిపిం చగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత ఏలూరు గ్యారేజీకి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సి ఉన్నందున కార్మికులు స్వచ్ఛందంగా ఆందోళనను విరమించి గ్యారేజీ నుంచి వెనుకకు వెళ్లాలని కోరారు. దీనికి యూనియన్ల నాయకులు ససేమిరా అనడంతో కొంత గడువు ఇచ్చిన అనంతరం ఆందోళనకారులను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అనంతరం కొంతమంది ప్రత్యామ్నాయ డ్రైవర్లు, కండక్టర్లతో ఏలూరు డిపో నుంచి 5 బస్సులను వివిధ ప్రాంతాలకు పంపించారు. కాగా, నరసాపురం డిపో నుంచి మరో 3 బస్సులను నడపగలిగారు. వీటితోపాటు ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యానికి అవకాశం కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 44 అద్దె బస్సులను నడిపారు. మిగిలిన సుమారు 600 పైగా బస్సులు నిలిచిపోయాయి. ‘ఎస్మా’ ప్రయోగిస్తామనడంపై ఆగ్రహం సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు వెంటనే విధులకు హాజరు కావాలని, లేనిపక్షంలో వారిపై ఎస్మా చట్టం (అత్యవసర సేవల నిర్వహణా చట్టం) ప్రయోగించి విధుల నుంచి తొలగిస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయాల్లో అధికారులు నోటీసులు పెట్టారు. దీనిపై కార్మికులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, కార్మికుల నిరవధిక సమ్మెకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చింతకాయల బాబూరావు మద్దతు ప్రకటించారు. ఆందోళనకు దిగిన కార్మికులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ప్రైవేటు ఆపరేటర్ల ఇష్టారాజ్యం ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఆటోలు, ట్రక్ ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు, హైదరాబాద్ వెళ్లే టూరిస్ట్ బస్సుల యజమానులు అధిక చార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఇప్పటివరకూ ఆటో కనీస చార్జీ రూ.7 వసూలు చేస్తుండగా, బుధవారం ఈ ధరను అమాంతం రూ.12కు పెంచారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌కు రూ.400 నుంచి రూ. 700 చార్జీ వసూలు చేస్తుండగా బుధవారం రూ.1,200 వసూలు చేశారు. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తిరిగిన మ్యాక్సీ క్యాబ్‌లు, ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు సైతం చార్జీలను రెట్టింపు వసూలు చేశాయి. అరెస్ట్‌ల ద్వారా సమ్మె ఆగదు కార్మికులు వేతన సవరణ కోసం రెండేళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. శాంతియుతంగా సమ్మెకు దిగిన కార్మికులను అరెస్ట్ చేస్తే సమ్మె నిలిచిపోతుందనుకోవడం పొరపాటు. నిర్బంధాలు, 144 సెక్షన్లు, ఎస్మా చట్టాల ప్రయోగం ద్వారా సమ్మెలు ఆగిన దాఖలాలు చరిత్రలో లేవు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించి ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. - సీహెచ్ సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కక్ష సాధింపు చర్యే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోంది. తాత్కాలిక డ్రైవర్లకు ఇస్తామని ప్రకటించిన రూ.వెయ్యిలో రూ.500 ప్రస్తుత కార్మికులకు ఇస్తే ఫిట్మెంట్ బెనిఫిట్‌కు సరిపోతుంది. సమ్మెకు అనేక పరిష్కార మార్గాలు సూచించాం. చర్చలకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం. - నెక్కంటి సుబ్బారావు, గౌరవాధ్యక్షుడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ -
ఎక్కడి బస్సులక్కడే..
రాజమండ్రి :జిల్లాలో బుధవారం ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వోద్యోగులకు ఇచ్చినట్టు పీఆర్సీ ఫిట్మెంట్ 43 శాతం ఇవ్వాలని ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె తొలి రోజు విజయవంతమైంది. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు తిప్పాలన్న యాజమాన్యం యత్నాలను కార్మికులు విజయవంతంగా అడ్డుకున్నారు. జిల్లాలో తొమ్మిది బస్సు డిపోల్లో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వంటి ప్రధాన డిపోలతోపాటు మిగిలిన చోట్ల కూడా ఒకటి రెండు సర్వీసులు మాత్రమే తిరిగాయి. ఒక్క గోకవరం డిపోలో మాత్రమే అత్యధికంగా 22 సర్వీసులు కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరం తిరిగాయి. జిల్లాలో 841 బస్సులు రోజుకు వెయ్యికి పైగా సర్వీసులు నడవాల్సి ఉండగా కేవలం 80 బస్సులు మాత్రమే తిరిగాయి. ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు తిప్పేందుకు యత్నించినా కార్మికులు, ఉద్యోగులు అడ్డుకున్నారు. ధర్నాలు చేయడంతోజిల్లాలో బస్సులు ఎక్కడికక్కడకు నిలిచిపోయాయి. పాటు టైర్లలో గాలి తీసి ఆందోళనకు దిగారు. వారి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో డిపోలు హోరెత్తాయి. రాజమండ్రి డిపో పరిధిలో మొత్తం 132 సర్వీసులకు 10, కాకినాడ డిపోలో 153 సర్వీసులకు కేవలం రెండు, అమలాపురం డిపోలో 136 సర్వీసులకు రెండు సర్వీసులు తిరిగాయి. ఆర్టీసీ రూ.70 లక్షల వరకు ఆదాయం కోల్పోయింది. తుని డిపోలో కార్మికులకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సంపూర్ణ మద్దతు తెలిపారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా ధర్నా చేశారు. కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. కిటకిటలాడిన లాంచీలు.. బస్సులు తిరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది రైళ్లు, లారీలు, ఆటోలను ఆశ్రయించారు. తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రైళ్లు కిక్కిరిశాయి. రిజర్వేషన్ బోగీల్లోకి సైతం మామూలు ప్రయూణికులు చొరబడడంతో రిజర్వేషన్ చేరుుంచుకున్న వారు ఇబ్బంది పడ్డారు. కొవ్వూరు - రాజమండ్రి మధ్య నడుస్తున్న లాంచిలు సైతం కిటకిటలాడాయి. లారీలు, ఆటోలలో సైతం సామర్థ్యానికి మించి ప్రయాణించారు. హైవేలపై ప్రయాణికులు గంటల పాటు మండుటెండల్లో వాహనాల కోసం ఎదురు తెన్నులు చూడాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ సమ్మెతో నిలిచిన బస్సు సర్వీసులను గురువారం నుంచి పునరుద్ధరించాలని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయయత్నాల్లో తలమునకలయ్యారు. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపించాలని భావిస్తున్నారు. రోజుకు డ్రైవర్‌కు రూ.1,000, కండక్టర్‌కు రూ.800 ఇస్తామన్న ఆర్టీసీ ప్రకటనకు స్పందన బాగానే ఉంది. రాజమండ్రి డిపోలో తాత్కాలిక పద్ధతిలో కండక్టర్ల నియూమకానికి సుమారు 100 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 500 మందిని తాత్కాలికంగా నియమించినట్టు తెలిసింది. వారితో రేపు పూర్తిస్థాయిలో సర్వీసులు నడుపుతామని యాజమాన్యం ప్రకటించింది. కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరు కాకుంటే తొలగిస్తామనడంతో వారంతా వస్తారని యాజమాన్యం భావిస్తోంది. దీనికితోడు ‘ఏదో విధంగా బస్సులు తిప్పండి.. వచ్చినంత ఇవ్వండి’అని అధికారులే అనధికారికంగా చెబుతుండడంతో సర్వీసులు తిప్పేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అద్దె బస్సులు తిప్పకుంటే పర్మిట్ రద్దు అద్దె బస్సులు తిరగకుంటే పర్మిట్ రద్దు చేస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. బస్సు సర్వీసులు తిప్పాల్సిందిగా ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. డిపో మేనేజర్లతో కలిసి అద్దె బస్సులను ఏ రూట్లో అయినా తిప్పుకునేలా నిబంధనలు సడలించారు. పర్మిట్‌తో సంబంధం లేకుండా సొంతంగా డ్రైవర్లను, కండక్టర్లును ఏర్పాటు చేసుకుని బస్సు యాజమాన్యం తిప్పుకునేందుకు సైతం సిద్ధమవుతోంది. -
ఆగిన రథచక్రాలు..
స్తంభించిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు స్పందించని ప్రభుత్వంపై మండిపడ్డ కార్మికులు అనంతపురం రూరల్ : కార్మికుల సమ్మెతో ఆర్టీసీ రథచక్రాలు ఆగిపోయాయి. దీని కారణంగా వందలాది బస్సులు రోడ్డెక్కలేదు. ప్రజానీకం గమ్యస్థానాలు చేరడం కోసం నానా అవస్థలు పడ్డారు. అసలే వేసవి కాలం కావడంతో బస్సుల కోసం గంటలతరబడి నిరీక్షించి అలసిపోయారు. లక్షల మంది ప్రయాణాలను విరమించుకున్నారు. అదే స్థాయిలో ప్రైవేట్ వాహనాల్లో ఇబ్బందులు పడుతూ భయం గుప్పిట్లో ప్రయాణించారు. జిల్లాలోని 12 డిపోల్లో సమ్మె తీవ్రంగా సాగింది. అనంతపురంతో పాటు, హిందూపురం, పెనుకొండ, గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, ధర్మవరం, రాయదుర్గం, పుట్టపర్తి, మడకశిర, కదిరి డిపోల్లో ఆర్టీసీ కార్యకలాపాలు స్తంభించాయి. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోయే బస్టాండ్లు వెలవెలబోయాయి. గత్యంతరం లేక రైలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ప్రైవేట్ వాహనదారులు దోపిడీకు ప్రజలు బలయ్యారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న జీపులు, వ్యాన్లు, బస్సుల నిర్వాహకులు అధిక రేట్లతో బస్సులు తిప్పారు. ఇదిలా ఉండగా అధికారులు బస్సులు తిప్పేందుకు ప్రయత్నించగా ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, కార్మికులు తిప్పికొట్టారు. బస్సులకు అడ్డంగా పడుకుని అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం సైతం ఎక్కడా ఆస్తి నష్టం కల్గకుండా ప్రత్యేక పోలీసులు బలగాలను రంగంలోకి దింపారు. ఘర్షణలకు దారితీయకుండా పోలీసులు సమన్వయం పాటించారు. అధికారులు కార్మికుల కన్నుగప్పి హైర్ బస్సులను దొంగగా తిప్పారు. ఊరి సరిహిద్దు ప్రాంతాల నుంచి బస్సులను తిప్పారు. ఇది తెలుసుకున్న నేతలు పాతవూరు, కళ్యాణదుర్గం బైపాస్, కలెక్టరేట్ వద్ద బస్సులను ఆపారు. బస్సులు తిప్పతే ఉపేక్షించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు. అల్లాడిపోయిన ప్రజానీకం సమ్మె కారణంగా వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. అసలే వేసవి సెలవులతో పాటు, పెళ్లిళ్ల సందడి కారణంగా ఆర్టీసీకు మంచి సీజన్ సమయంలో బస్సులు ఆగిపోయాయి. ప్రయాణికులు ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా అంటూ ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. తల్లిదండ్రులు చిన్నపిల్లలను వెంటబెట్టుకుని బస్టాండ్‌లో గంటల తరబడి నిలుచుండిపోయారు. ఇక ఎంతో మంది చేసేది ఏమీ లేక ఇళ్లకు వెళ్లారు. ప్రైవేట్ వాహనాలకు భలే గిరాకీ ఆర్టీసీ సమ్మె కావడంతో ప్రైవేట్ వాహనాలకు మంచి గిరాకీ లభించింది. ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు మినీ వ్యాన్లు, డీజిల్ ఆటోలు, సూమోలు వివిధ ప్రాంతాలకు తిప్పారు. సందట్లో సడేమియా అంటూ డబ్బులు ఇష్టారాజ్యంగా వసూలు చేశారు. ప్రయాణికులు గత్యంతరం లేక అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. కిక్కిరిసిన రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్సులు తిప్పకపోవడంతో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయించారు. అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, గుత్తి, పెనుకొండ రైల్వే స్టేషన్లలో వేలాది మంది ప్రయాణికులు తరలివచ్చారు. రైళ్లలో సీట్లు దొరక్క నానా తంటాలు పడ్డారు. అందులోనూ అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కావడంతో పెద్ద తలనొప్పిగా మారింది. రైల్లో కిందనే కూర్చుని మరీ వెళ్లారు. డిపో ముందు ఉద్రిక్తత హైదరాబాద్ నుంచి బస్సులు తిప్పడానికి స్పెషల్ ఆఫీసర్‌గా శ్రీహరి వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో డిప్యూటీ సీటీఎం మధుసూదన్, సీఎంఈ శ్రీలక్ష్మి, డీఎం రమణ బస్సులు తిప్పేందుకు రంగం సిద్దం చేశారు. మొదట గుత్తికు రెండు సర్వీసులు తిప్పాలని చూశారు. డిపో ముందు బస్సులు పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కార్మికులు రెచ్చిపోయారు. తమపై ఎక్కించి మరీ బస్సులు తిప్పాలన్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుపడడంతో కార్మికులు లోపలికి వెళ్లలేదు. పోలీసుల పహారా: డీఎస్పీ మల్లికార్జున వర్మ నేతృత్వంలో త్రీటౌన్, వన్‌టౌన్ పోలీసులతో పాటు రోప్‌పార్టీ, స్పెషల్ పార్టీ పోలీసులతో డిపో ఆవరణం నిండిపోయింది. ఎక్కడ బస్సులు ధ్వంసం చేస్తారేమోనని ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెకు మద్దతు...సమ్మె చేపడుతున్న ఆర్టీసీ ఈయూ, ఎన్ఎంయూకు ఏఐటీయూసీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలన్నారు. వివిధ పార్టీ నేతలు జాఫర్, దాదా గాంధీ, తదితరులు మద్దతు తెలిపారు. బంద్ ఎఫెక్ట్‌పై ప్రయాణికుల అభిప్రాయాలు... ఉదయం నుంచి వేచి ఉన్నాం - కల్పన(అనంతపురం): తాడిపత్రిలో మా బంధువుల పెళ్లికి వెళ్లాలి. ఉదయం నుంచి వేచి ఉన్నాం. ఒక్క బస్సు రాలేదు. ప్రైవేట్ వాహనాల్లో ఏవిధంగా వెళ్లాలి. సమస్యను పరిష్కరించి త్వరగా బస్సులు తిప్పాలి. ఇక్కడొచ్చి ఇరక్కపోయాం - హబీబా(ధర్మవరం) : ధర్మవరం నుంచి పొద్దునే వచ్చాం. గుంతకల్లు దర్గాకు వెళ్లాలి. ఇక్కడేమో బస్సులు తిప్పరంటున్నారు. ఏం చేద్దాం పిల్లోలను వేసుకుని ఉంటున్నాం. ఎవరు పట్టించుకోవడంలేదు. చివరి చూపు చూస్తానో లేదో - చెన్నమ్మ(అనంతపురం): మా అల్లుడు చనిపోయాడు. వాళ్లది పెనుకొండ. అక్కడకు వెళ్లాలి. ఇక్కడేమో బస్సులు రావన్నారు. చివరి చూపు చేస్తానో లేదో. కార్మికుల అభిప్రాయాలు... ప్రభుత్వమే బాధ్యత వహించాలి - భాస్కర్‌నాయుడు(ఎన్ఎంయూ): సమ్మె జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. ప్రయాణికులు, కార్మికులు రోడ్డుపాలు కావడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కార్మిక చట్టాలను విస్మరిస్తున్నారు. 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలి - గోపాల్(ఎన్ఎంయూ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే. అందరితో ధీటుగా పనిచేస్తూ...ప్రజలకు సేవలందిస్తున్నాం. మాకే ఇవ్వకపోతే ఎలా..? డిమాండ్లు నెరవేరాకే బస్సెక్కుతాం. ఒక్క బస్సు తిరగనివ్వం - వైకే మూర్తి(ఎన్ఎంయూ): ఒక్క బస్సు బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. కార్మికులంటే అంత చుకలనా. ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి ఇవాల మాట మారుస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. మారిన బాబు అంటే ఇదేనా - రామిరెడ్డి(ఈయూ): నేను మారాను. అందరి కష్టాలను తీరుస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...మారడమంటే ఇదేనా.. కార్మికులతో ఆడుకుంటున్నావ్. లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా...నీకు కన్పించలేదా...ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ మాట తప్పడం బాబు నైజం - కొండయ్య(ఈయూ): చంద్రబాబు నాయుడుకు మాట తప్పడం అతని నైజం. కార్మికులతో ఆడుకుంటున్నారు. ఎన్నికల ముందు ఓ మాట ఇప్పుడోమాట మాట్లాడుతున్నారు. మా ఆగ్రహానికి గురికాక తప్పదు. -
ఖమ్మంలో డిపోలకే పరిమితమైన బస్సులు
ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న రహదారుల భద్రత బిల్లును వ్యతిరేకిస్తూ ఖమ్మం బస్‌స్టేషన్‌లో కార్మికులు ఆందోళన బాటపట్టారు. పలు కార్మిక సంఘాల నాయకులు విధులను బహిష్కరించి బస్సులను డిపోలకు పరిమితం చేసి ఆందోళన చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
బస్సులన్నీ భాగ్యనగరంవైపే..
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయూణికులు - బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షణ - ఆర్టీసీ నిర్ణయంపై నిరసన - పొరుగు రాష్ట్రాల బస్సుల్లో ప్రయూణం నిజామాబాద్ నాగారం: ఆర్టీసీ బస్సుల్లో అత్యధిక భాగం టీఆర్ఎస్ సభకు తరలాయి. దీంతో పనులపై వివిధ ప్రాంతాలకు ప్రయూణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ రీజియన్‌లో ఆరు డిపోల పరిధిలో మొత్తం 669 బస్సులు ఉన్నారుు. ఇందులో 575 బస్సులను టీఆర్ఎస్ సభకు తరలించారు. 94 బస్సులు మాత్రమే ప్రయూణికులకు అందుబాటులో ఉన్నారుు. ఇందులో 10 ఇంద్ర బస్సులు, నాలుగు గరుడ బస్సులు, మిగతావి సూపర్‌లగ్జరీ, డీలక్స్ బస్సులు. ఇవి కూ డా హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు నడిచారుు. అరకొరగానే బస్సులు నడవడంతో ప్రయూణికులు గంటల తరబడి బస్టాండ్లలో నిరీక్షించాల్సి వచ్చింది. హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయూణికులకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కు చెందిన బస్సులు ఉపయోగపడ్డారుు. గ్రామీణ ప్రాంతాల కు వెళ్లే ప్రయూణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ వాహనాల హవా ఆర్టీసీ బస్సులు ఎక్కువగా టీఆర్ఎస్ సభకు తరలివెళ్లడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రరుుంచాల్సి వచ్చింది. ఆటోలు, జీపులు, సుమోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. దొరికిందే అవకాశం అన్నట్లుగా ప్రైవేట్ వాహనాలవారు ప్రయూణికులను దోచుకున్నారు. సాధారణ చార్జీలకన్నా ఎక్కువగా చార్జీ తీసుకున్నారు. కండక్టర్లకు సెలవుపై.. ఇక ఆర్టీసీలో డ్రైవర్లు మాత్రమే విధులు నిర్వహించారు. 575 బస్సులకు సంబంధించిన కండక్టర్లను సెలవుపై పంపారు. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులను టీఆర్ఎస్ సభకు తరలించి కండక్టర్లను లీవ్ పెట్టమనడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. కాగా టీఆర్ఎస్ సభకు బస్సులను నడపడం వల్ల సోమవారం రూ. 75 లక్షల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ సీటీఎం గంగాధర్ తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ప్రయాణీకులకు బస్సు లు అందుబాటులో ఉంటాయన్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ, ఆర్టీసీ యూజమాన్యం వ్యవహరించిన తీరుపై ప్రయూణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..15 మందికి గాయాలు
సూర్యాపేట రూరల్: నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి వరంగల్ జిల్లా జనగామకు వెళ్లే రహదారిలో గాంధీనగర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట డిపోకు చెందిన రెండు బస్సులు జనగామ వైపు వెళుతుండగా ముందున్న బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో... వెనుక బస్సు ముందు బస్సును ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు తెలిపారు. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్ని దారులూ పట్నంవైపే..
- టీఆర్ఎస్ సభకు భారీగా తరలిన కార్యకర్తలు - స్వయంగా పర్యవేక్షించిన మంత్రులు - పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల బుకింగ్ సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభ కావడంతో జిల్లా నుంచి గులాబీదండు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివెళ్లింది. సోమవారం జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా నుంచి జనం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. స్వయంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డా.సి.లకా్ష్మరెడ్డిలు జిల్లాలో మకాం వేసి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున ఉపయోగించుకున్నారు. జిల్లా మొత్తం మీద లక్షన్నరకు పైగానే జనం తరలివెళ్లారు. దీంతో జిల్లాలోని అన్నిదారులు కూడా హైదరాబాద్ వైపే కదలాయి. మరోవైపు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మందికి పైగానే.. హైదరాబాద్‌కు పక్కనే ఉండడంతో జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేపట్టాలని పైస్థాయి నుంచి ఉన్న ఆదేశాల మేరకు ముఖ్యనాయకులు పక్కా ప్రణాళిక రచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందికి తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి వందల సంఖ్యలో వాహనాలను కేటాయించారు. దిశా నిర్దేశం ఇవ్వడం కోసం మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డి రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు ఎక్కడిక్కడ బాధ్యతలు అప్పగించి సక్సెస్ చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమీటీలు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు అందరినీ భాగస్వామ్యం చేశారు. కొన్నిచోట్ల పైస్థాయిలో మెప్పు పొందేందుకు నాయకులు హొరాహోరీగా జన సమీకరణ చేపట్టారు. మరోవైపు త్వరలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. సీటు పొందేందుకు ఎమ్మెల్సీ ఆశావహుల పోటీపడ్డారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్ తదితర నాయకులు జనసమీకరణలో చురుగ్గా వ్యవహరించారు. ఆర్టీసీ బస్సులన్నీ అటువైపే.. జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్నీ టీఆర్ఎస్ మహాసభకు కదలాయి. జిల్లాలో ఆర్టీసీకి 900 బస్సులున్నాయి. వీటిలో దాదాపు 612 బస్సులను టీఆర్ఎస్ సభకు జనాన్ని తరలించడం కోసం ఉపయోగించారు. దీంతో జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్క నాగర్‌కర్నూల్ డిపోకు మొత్తం 82 బస్సులుంటే టీఆర్ఎస్ సభ కోసం 70 బస్సులను వినియోగించారు. బస్సుల కొరత కారణంగా దూరప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నిత్యం 40 బస్సులు 80 ట్రిప్పులు వెళ్లేవి. టీఆర్ఎస్ మహాసభ కారణంగా పదిహేను బస్సులకు మించి తిరగలేదు. రాయిచూరు, తాండూరు, పరిగి, శ్రీశైలం ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. నియోజకవర్గాల వారీగా బస్సుల కేటాయింపు.. మహబూబ్‌నగర్-100, నారాయణపేట-96, షాద్‌నగర్-70, కల్వకుర్తి-75, నాగర్‌కర్నూల్-70, అచ్చంపేట-51, కొల్లాపూర్-55, వనపర్తి-40, గద్వాల్-51, ఇవిగాక కొండగల్, మక్తల్ నియోజకవర్గాలకు తాండూరు, పరిగి, వికారాబాద్ డిపోలకు చెందిన దాదాపు 100 బస్సులను కేటాయించారు. -
నగరంలో నిలిచిన ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్: తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. కంటోన్మెంట్ డిపోలో రెండు రోజుల క్రితం కార్మికులు విధులను బహిష్కరించిన విషయం తెలిసిందే. గురువారం మరోసారి మరిన్ని డిపోల్లో విధులకు హాజరుకాలేదు. సికింద్రాబాద్ రీజియన్‌లోని రాణిగంజ్1, 2, కుషాయిగూడ, చెంగిచర్ల, హకీంపేటలో కార్మికులు విధుల్లోకి రాకపోవటంతో వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
కర్నూలు: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులుఢీ కొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా, కొంత మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా తాండ్రపాడులో జరిగింది. వివరాలు..తిరుపతి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి కడప వెళ్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలైన ప్రయాణికులు ప్రాథమిక చికిత్స చేయించుకొని వెళ్లిపోయినట్లు సమాచారం. -
శ్రీవారి భక్తులపై ఎన్కౌంటర్ తీవ్ర ప్రభావం...
తిరుపతి: శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనతో శ్రీవారి భక్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్కౌంటర్లో మృతిచెందిన వారంతా తమిళనాడుకు చెందినవారు కావడంతో ఇప్పటికే అక్కడి రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగురోజుల పాటు బస్సులు నడపలేమని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దాంతో ఒక్క చిత్తూరు జిల్లా నుంచే రోజుకు 214 సర్వీసులు రద్దు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కర్నూలు, కడప, అనంతపురం నుంచి కూడా బస్సులను నిలిపివేసినట్టు ఆర్టీసీ పేర్కొంది. ఒక్క చిత్తూరు జిల్లాకే రోజుకు ఆర్టీసీకి 20లక్షల నష్టం వాటిలినట్టు అంచనా. కాగా, తమిళనాడులో భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్నాయనీ, ఇప్పుడే బస్సులను నడపలేమనీ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్ పరిస్థితి విషమం
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో నంద్యాల జాతీయ రహదారిపై ఓ దాబా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు శనివారం అర్ధరాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన విష్ణుప్రియ, సునీల్, శివ, సంతోష్‌నగర్‌కు చెందిన రోహిత, ఉమేశ్, శివ, ఎల్బీనగర్కు చెందిన నరసింహా, నిజామాబాద్‌కు చెందిన అమర్‌లు గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురయిన బస్సుల్లో ఒకటి పుత్తూరు నుంచి హైదరాబాద్ వైపు, మరొకటి మెదక్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్నాయి. పుత్తూరు బస్సు డ్రైవర్ రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఆళ్లగడ్డ) -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ; 40మందికి గాయాలు
-
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ; 40మందికి గాయాలు
తిరుమల: తిరుమల రెండో ఘాట్ లోని 11వ మైలురాయి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించినట్టు సమాచారం. బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యం బస్సు నడపడంతోనే ఈ ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. రుయా ఆస్పత్రి వద్ద బస్సు డ్రైవర్ పై దాడి చేసేందుకు ప్రయాణికులు దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గాయపడినవారంతా గుజరాత్ రాజకోట్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
నష్టాల బాటలో ఆర్టీసీ
అక్టోబర్‌లో నష్టం రూ.111 కోట్లు గత ఏడు నెలల్లో రూ. 687 కోట్లు... సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక శ్రద్ధతో నిత్యం పర్యవేక్షిస్తేతప్ప నష్టాల నియంత్రణ సాధ్యం కానీ ఆర్టీసీలో ఇప్పుడు అయోమయం రాజ్యమేలుతుండటంతో సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దారితప్పుతోంది. రాష్ట్రం విడిపోయినా ఆర్టీసీ ఇప్పటికీ ఉమ్మడిగానే కొనసాగుతుండటం.. అధికారులు రెండు ప్రాంతాలుగా విడిపోయి ఎడమొహం పెడమొహంగా ఉండటం.. ఓ ప్రాంతానికి చెందిన అధికారులు మరో ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించని పరిస్థితి నెలకొనడంతో పాలన పూర్తిగా పడకేసింది. దీంతో పర్యవేక్షణ దాదాపు శూన్యంగా మారటంతో సంస్థ నష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అక్టోబర్ నెల లాభనష్టాల వివరాలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ ఒక్క నెలకు సంబంధించే ఆర్టీసీకి రూ.111.13 కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. ఇందులో తెలంగాణ వాటా రూ.41.45 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటాలో రూ.69.68 కోట్లున్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలలకు సంస్థ నష్టాలు రూ.687 కోట్లకు పైగా చేరుకున్నాయని తెలుస్తోంది. తెలంగాణలోనూ పెరిగిన నష్టాలు గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని జోన్లతో పోలిస్తే తెలంగాణలో నష్టాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు రెంటి నష్టాలు దాదాపు ఒకేరకంగా నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ జోన్లో నష్టాలు పెద్దగా ఉండవు. అయితే అక్టోబర్ నెలకు సంబంధించి ఇక్కడా మిగతా జోన్ల మాదిరిగానే నమోదయ్యాయి. అయితే జూన్ నెలలో సిటీ జోన్ రూ.7 కోట్ల మేర లాభాలు సాధించటం విశేషం. ఏపీ యథాప్రకారం నష్టాల్లో ముందుంది. ఏపీలోని విజయవాడ, విజ యనగరం, కడప, నెల్లూరు జోన్లు తెలంగాణలోని జోన్ల కంటే ఎక్కువ నష్టాలు మూటగట్టుకున్నాయి. గత ఏడాది కాలంగా నష్టాలు పెరిగినప్పటికీ.. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోలేదు. విభజన హడావుడిలో మునిగిన రెండు ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. స్టేజి క్యారియర్లుగా మారిన ప్రైవేటు వాహనాలను నియంత్రించనున్నట్టు ప్రకటించినా తెలంగాణ ప్రభుత్వం దాన్ని పకడ్బందీగా నిర్వహించలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణ అంతంతమాత్రం గానే ఉండటంతో నష్టాలు పెరిగిపోతున్నాయి. కనీసం ఈ విషయంపై అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిం చటం లేదు. ఏ ప్రభుత్వానికి బాధ్యత వహించాలో స్పష్టత లేకపోవటంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. -
సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రతీరోజు ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే 3,560 రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నెల 8 నుంచి 13 వరకు అదనపు బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకోవడంతో ఈ నెల 9 నుంచి 13 వరకు రెగ్యులర్ బస్సుల్లో సీట్లు సుమారు 90 శాతం భర్తీ అయ్యాయి. తెలంగాణ ప్రాంతాలకు కేవలం 20 శాతం రిజర్వ్ కాగా.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు రెగ్యులర్ బస్సుల సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. -
హై అలర్ట్
భద్రాచలం: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్,ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ముమ్మరమయ్యాయి. సమాచార వ్యవస్థను విధ్వంసం చేయటమే లక్ష్యంగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నట్లుగా చర్ల మండలం సత్యనారాయణపురం ఘటన రుజువు చేస్తోంది. మావోల కార్యకలాపాలకు అడుకట్ట వేసేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చర్ల మండలం దోశిలపల్లి వద్ద ఇటీవల పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గిరిజనుడు మృతిచెందాడు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకుండా ఆదివారం రాత్రి నుంచే డివిజన్లోని అన్ని స్టేషన్ల పరిధిలో పోలీసు తనిఖీలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే భద్రాచలం పట్టణ సమీపంలోని కూనవరం రోడ్లో పట్టణ ఎస్సై మురళీ తన సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేసి అందులో ప్రయాణిస్తున్న అనుమానిత వ్యక్తుల వివరాలతో పాటు బ్యాగులను సోదా చేశారు.ద్విచక్రవాహనాలు, వివిధ ప్రైవేటు వాహనాలపై వచ్చే వారి వివరాలను తెలుసుకున్న తరువాతే పట్టణంలోకి అనుమతించారు. మావోయిస్టుల బంద్, చర్లలో జరిగిన ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లుగా ఎస్సై మురళి తెలిపారు. బంద్ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్, సరిహద్దున ఉన్న మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. సమాచార వ్యవస్థ ధ్వంసమే లక్ష్యమా? నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో సమాచార వ్యవస్థను ధ్వంసం చేయడమే లక్ష్యంగా మావోయిస్టులు వ్యూహ రచన చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సెల్‌టవర్‌ను కాల్చివేయటం గతంలో కూడా పలు చోట్ల జరిగింది. భద్రాచలం (ప్రస్తుతం నెల్లిపాక మండలం) మండలంలోని గన్నవరం, దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి వద్ద ఉన్న సెల్‌టవర్లను మావోలు తగులబెట్టారు. తాజాగా చర్ల మండలం సత్యనారాయణపురం వద్ద బీఎస్ఎన్ఎల్ టవర్‌ను పేల్చివేసేందుకు మావోయిస్టులు సిద్ధమయ్యారు. పోలీసులు అప్రమత్తతతో తిప్పికొట్టారు. రూ. 25 లక్షల విలువైన ఆస్తిని కాపాడగలిగారు. ఇటీవలికాలంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో ఆయా సెల్టవర్ల వద్ద పోలీసులు కాపలా కోసమని తగిన బందోబస్తును ఏర్పాటు చేశారు. -
‘పచ్చ’ ముచ్చటకు రూ.10 కోట్లు
కార్మికుల సొమ్ముతో ఆర్టీసీ బస్సులకు పసుపు పచ్చ రంగు సాక్షి, హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే మరి! పల్లెవెలుగు బస్సులను ‘పచ్చ’ రంగుతో అలకరించేందుకు ఆర్టీసీ కార్మికుల సొమ్ముకు సర్కారు ఎసరు పెట్టింది. కొత్తగా ప్రవేశపెడుతున్న వాటితోపాటు పాత బస్సులకూ తమ పార్టీ రంగు పసుపు రంగులోకి మార్చాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి నాటికి రాష్ట్రంలోని 123 డిపోల్లోని పల్లెవెలుగు బస్సులతో పాటు హైటెక్, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకు పసుపు పచ్చ రంగు పడనుంది. హైటెక్, లగ్జరీ బస్సులకు బోర్డర్ పసుపు రంగు వేయాలని నిర్ణయించారు. సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసి దాచుకున్న డబ్బును వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సరైన నిర్వహణ లేకుండా రంగులెందుకు? ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల నిర్వహణ సరిగా లేదు. సీట్లలో కూర్చొంటే నల్లులు బాధ తప్పడం లేదని స్వయానా రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బస్సుల రంగు కోసం నిధులు వినియోగించటం సరికాదని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గించి ఆర్టీసీకి మొండిచేయి విమాన ఇంధనంపై వ్యాట్ శాతాన్ని ఇటీవలే ప్రభుత్వం 16 నుంచి 1 శాతానికి తగ్గించింది. దీనివల్ల రాష్ట్రంలో విమానయానం పెరుగుతుందని చెబుతోంది. ప్రభుత్వానికి ఏటా రూ.25 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంటోంది. ఆర్టీసీకి కూడా ఇంధన రాయితీ కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి కార్మిక సంఘాలు కోరుతున్నాయి. డీజిల్‌పై వ్యాట్ శాతం తగ్గించాలని కోరినా పట్టించుకోని ప్రభుత్వం సంపన్నులు ప్రయాణించే విమానాలపై మాత్రం ఇంధనం వ్యాట్ తగ్గించడాన్ని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. ఆర్టీసీకి నష్టాలు రావడానికి కారణం కేవలం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలేనని మండిపడుతున్నారు. -
హా...ర్టీసీ!
సాక్షి, సిటీబ్యూరో: నగరం, శివారు ప్రాంతాల్లోని విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కోసమే కాదు... బస్సులు పట్టుకోవడానికి... వాటిలో సీట్లు సంపాదించడానికి కూడా పోటీ పడాల్సి వస్తోంది. పది కిలోమీటర్ల దూరమైనా...రెండు గంటలు ముందు బయలుదేరనిదే సకాలంలో తరగతులకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విద్యార్థుల సంఖ్యకు తగిన స్థాయిలో ఆర్టీసీ బస్సులు లేకపోవడమే. ఉదయం, సాయంత్రం బస్సు ప్రయాణం ఒక సవాల్‌గా మారింది. వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం శివార్లలోని ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలలకు వెళ్తుండగా వాళ్ల కోసం కనీస సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. అందుబాటులో ఉండే కొద్దిపాటి బస్సుల్లోనే విద్యార్థులు ప్రమాదపుటంచుల్లో పయనిస్తున్నారు. ఫుట్‌బోర్డులు, టాప్‌లపై పయనిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవరకూ తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గడుపుతున్నారు. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ మార్గంలో నిత్యం 30 వేల మందికి పైగా విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. వారిలో 24 వేల మంది ఆర్టీసీ పైనే ఆధారపడి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కలిపి 101 బస్సులు మాత్రమే ఈ మార్గాల్లో నడుస్తున్నాయి. ఇవి కేవలం విద్యార్థుల కోసం నడిపేవే కాదు. అన్ని వర్గాల ప్రయాణికులను అనుమతిస్తారు. దీంతో ప్రయాణం ప్రమాదకరంగానే ఉంటుంది. నగరంలోని అన్ని రూట్లలో ఇదే పరిస్థితి. పరుగెత్తే బస్సులను అందుకొనేందుకు విఫలయత్నం చేస్తూ ఏటా వందలాది మంది విద్యార్థులు ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులవుతున్నారు. అమ్మాయిలు సైతం ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. * నగర శివార్లలో 500కు పైగా ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్మెంట్, ఎంసీఏ, తదితర వృత్తి విద్యా కళాశాలల్లో 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 2.5 లక్షల మంది ఆర్టీసీ పైనే ఆధారపడి పాస్‌లు తీసుకున్నారు. అవి ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. * 9 ప్రధాన మార్గాల్లో ఆర్టీసీ 771 బస్సులు నడుపుతోంది. మొత్తం 7,459 ట్రిప్పులు నడుపుతున్నట్లు చెబుతున్నారు. కానీ విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా ఉంటున్నాయా అన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. ఇదీ ప్రమాదాల సంఖ్య... ► ఎల్బీనగర్ పరిధిలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు: 30, క్షతగాత్రులు : 50 మంది ► పేట్‌బషీరాబాద్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు ► 88 రోడ్డు ప్రమాదాలు జరిగితే 29 మంది మరణించారు. వారిలో విద్యార్థుల ► సంఖ్య 12గా పోలీసులు చెబుతున్నారు. ► దుండిగల్ పరిధిలో 93 రోడ్డు ప్రమాదాల్లో 48 మంది మృతి చెందగా... ► వారిలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. ► జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన 66 రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందారు. ► వారిలో నలుగురు విద్యార్థులు. ► గతంలో ప్రమాదాల నివారణకు బస్ స్టాపులలో నియమించిన ► హోంగార్డులను ఇటీవల తొలగించారు. -
‘సర్వే’ విధులు సక్రమంగా నిర్వహించాలి
ప్రగతినగర్ : ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా ప్రజలు బాగుండాలనే సంకల్పంతో సమగ్ర కు టుంబ సర్వే విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అధికారులకు, ఎన్యూమరేటర్లకు సూచించారు. శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సమగ్ర కుటుంబ సర్వేపై జోనల్ అధికారులు, ప్రత్యేక అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈనెల 17న జిల్లాలోని అన్ని మండలాల్లో రెండో విడత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినందున ఎన్యూమరేటర్లు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. బ్యాంకు ఉద్యోగులు కూడా శిక్షణకు హాజరయ్యేందుకు లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకర్లందరికి తెలియజేయాలన్నారు. ఎన్యూమరేటర్లకు డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని తహశీల్దారులు, స్పెషల్ అధికారులు డ్యూటీ ఆర్డరుతో పాటు వాటిని తీసుకుని 17వ తేదీకల్లా ఎన్యూమరేటర్లకు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. 19వ తేదీన ఉదయం 6 గంటల కల్ల సంబంధిత మండల కేంద్రంలోని కార్యాలయం వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, గ్రామాలకు వెళ్లేందుకు రూట్ ఆఫీసర్స్ సహకరిస్తారని తెలిపారు. మెటీరియల్‌తో కూడిన కిట్ బ్యాగులను ఎన్యుమరేటర్లకు అందజేస్తామన్నారు. కొత్తగా రూపొందించిన కర దీపికను తీసుకెళ్లాలని ఎన్యూమరేటర్లకు స్పెషల్ ఆఫీసర్లు చెప్పాలన్నారు. జోనల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు ,గ్రామ స్పెషల్ ఆఫీసర్ల వద్ద రిజర్వు సిబ్బందిని కేటాయిస్తున్నామని, అవసరమైతే వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు 19వ తేదీన ఎన్యూమరేటర్ల బస్సులు బయలుదేరినప్పటి నుంచి సర్వే పూర్తి అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుండాలన్నారు. 17వ తేదీన జరిగే శిక్షణ కార్యక్రమంలో జోనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు అన్ని వివరాలు ఎన్యూమరేటర్లకు తెలియచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రాజారాం, ఐకేపీ పీడీ వెంకటేశం, డీపిఓ సురేష్‌బాబు, అధికారులు పాల్గొన్నారు. కుటుంబ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి ప్రభుత్వం నిర్దేశించిన ప్రోఫార్మలో ఎన్యూమరేటర్లు కుటుంబ వివరాలు సమాచారం తప్పులు లేకుండా నమోదు చేయాలని జిల్లా పరిషత్ సీఈవో రాజారాం సూచించారు. ఈనెల 12వ తేదీన అనివార్య కారణాల వల్ల శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు, ఎన్యూమరేటర్లకు శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలోప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే ఆ కుటుంబాల వారు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు అందక నష్టపోతారన్నారు. అందువల్ల సర్వే ప్రాముఖ్యతను వారికి తెలియచెప్పి, వివరాలు తీసుకొని సమాచారం నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ అంశాలలో ఏ విధంగా సమాచార నమోదు చేయాలో వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు, పలువురు అధికారులు పాల్గొని ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించారు. -
‘ప్రైవేటు’ బాటలో ఆర్టీసీ!
777 అద్దె బస్సులు తీసుకునేందుకు నిర్ణయం నేడు టెండర్లు ఖరారు చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ మళ్లీ ‘ప్రైవేటు’ బాట పట్టింది. కొత్త బస్సులు కొనేందుకు ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, ఉన్న పాత బస్సుల నిర్వహణ భారంగా పరిణమిస్తున్న నేపథ్యంలో అద్దె బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాటిని సమకూర్చుకునేందుకు శుక్రవారం టెండర్లను ఖరారు చేయబోతోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నందున అద్దె బస్సులను కూడా ఉమ్మడి అవసరాలకు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాలకు కలిపి 777 బస్సులను సమకూర్చుకోనుంది. ఇందులో తెలంగాణకు 172 పల్లెవెలుగు, 215 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను, ఆంధ్రప్రదేశ్‌కు 172 పల్లెవెలుగు, 252 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కేటాయించాలని సంస్థ నిర్ణయించింది. క్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరించే చర్యల్లో భాగంగానే అద్దె బస్సులు తీసుకుంటున్నారని మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 3300 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీ వాదన గతంలో తీసుకున్న అద్దె బస్సుల్లో నిర్వహణ లోపంతో ఇప్పటికే 500 బస్సులు తగ్గిపోయాయి. వచ్చే డిసెంబర్‌తో మరో 450 బస్సుల ఒప్పంద గడువు పూర్తవుతోంది. ఆ లోటును భర్తీ చేసేందుకే ఇప్పుడు కొత్తగా 777 బస్సులను సమకూర్చుకోవాల్సి వచ్చింది. కార్మిక సంఘాల వాదన ఆర్టీసీలో అద్దె బస్సులను క్రమంగా తగ్గించి సొంత బస్సులనే సమకూర్చుకుంటామని నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీని సంస్థ విస్మరించిందనడానికి తాజా నిర్ణయమే నిదర్శనం. అద్దె బస్సుల రాకతో సంస్థలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. నైపుణ్యం లేని డ్రైవర్లతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. నిర్వహణ కూడా సరిగా ఉండటం లేదు. అయినా అద్దె బస్సులనే తీసుకుంటున్నారంటే పరోక్షంగా ప్రైవేటీకరణ మొదలుపెట్టినట్టే! -
'అవసరమైతే ప్రైవేటు బస్సులను నిలిపివేస్తాం'
హైదరాబాద్:నగరంలోని రవాణా వ్యవస్థ ఆధునీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు ఆరంభించింది. ఇందుకు గాను టీ.ప్రభుత్వ బృందం ముంబై నగరానికి బయల్దేరనుంది. దీనికి సంబంధించి రవాణశాఖా మంత్రి పి. మహేందర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ ప్రభుత్వ బృందం రవాణా వ్యవస్థ పరిశీలనకై ముంబైకి వెళ్లనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో అవసరాల మేరకు కొత్తగా 80 బస్సులను నడుపుతామని తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రైవేటు బస్సు సర్వీసులను నిలిపివేస్తామన్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచే విధులు నిర్వహించాలని మహేందర్ రెడ్డి సూచించారు. -
బంద్ సక్సెస్
- ముంపు మండలాల్లో నిలిచిన ఆర్టీసీ బస్సులు - మూతపడిన దుకాణాలు - ‘పోలవరం’ డిజైన్ మార్చాలని అఖిలపక్షం డిమాండ్ - 30న విద్యాసంస్థల బంద్‌కు పిలుపు భద్రాచలం : గిరిజనులను నీటముంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ముంపు మండలాల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా అఖిల పక్షం, వివిధ ప్రజా సంఘాలు, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. విధులు బహిష్కరించి బయటకు రావాలని ఐటీడీఏ కార్యాలయ ఉద్యోగులను కోరారు. బంద్ విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట టైర్లు కాల్చి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆందోళన కారులతో చర్చించి, వాహనాలు ముందుకుపోయేలా ఏర్పాటు చేశారు. కాగా, భద్రాచలం బస్టాండ్ నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం వరకూ బస్సులు కదల్లేదు. ఖమ్మం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కూడా సార పాక నుంచే వెనక్కు మళ్లించారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీయొద్దు.. గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పోలవరం ముంపు ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ముంపు మండలాల బంద్‌లో భాగంగా భద్రాచలంలో పార్టీ నాయకులతో కలసి ఆయన జాతీయ రహదారిపై భైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కార్పొరేట్ శక్తుల లబ్ధి కోసం లక్షలాది మంది గిరిజనులను నీట ముంచటం అన్యాయమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదని, అయితే డిజైన్ మార్చి నష్టాన్ని నివారించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించకపోవడం దారుణమని విమర్శించారు. డిజైన్ మార్పు చేసి ఎత్తు తగ్గిస్తే ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావటంపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం... ముంపు మండలాను రక్షించుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ క న్వీనర్ వట్టం నారాయణ దొర, గుండు శరత్‌బాబు అన్నారు. గురువారం భద్రాచలం వచ్చే ఉప ముఖ్యమంత్రి రాజయ్యను కలసి దీని పై వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 30న ముంపు మండలాల్లో విద్యా సంస్థల బంద్ చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆందోళన కార్యక్రమాల్లో టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు పూసం రవికుమారి, వైఎస్సార్సీపీ నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, సీపీఎం రాష్ట్ర కమి టీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, దుమ్ముగూడెం జడ్పీటీసీ అన్నెం సత్యాలు, కాం గ్రెస్ పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారా వు, కెచ్చెల కల్పన, ఎంబీ నర్సారెడ్డి, ఏవీ రావు, పడిసరి శ్రీనివాస్, మడవి నెహ్రూ, జగదీష్, నవీన్, మహేష్, వెంకటరెడ్డి, శేఖర్,జేఏసీ నాయకులు సోమశేఖర్, సోడె చలపతి, సాయిబాబా పాల్గొన్నారు. సీమాంధ్ర సభ్యుల దిష్టిబొమ్మ దహనం... సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఏవూరి వెంకటేశ్వరరావు, రాజు, నాయుడు, గంగాధర్, సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కని బస్సులు
- డిపోల్లో నిలిచిపోయిన 728 బస్సులు - రూ.70లక్షల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ బంద్ నిర్వహించిన నేపథ్యం లో జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. నల్లగొండ రీజియన్‌లో 728 బస్సులు ఆయా డిపోల్లోనే నిలిచి పోయాయి. జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల పరిధిలో బస్సులు నిత్యం 2.85 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. బంద్ వల్ల బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ఆర్టీసీ దాదా పు రూ. 70లక్షల రోజువారీ ఆదాయం కోల్పోయింది. బంద్‌కు పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించడంతో డిపోల నుంచి బస్సులను బయటికి తీయాలనే ప్రయత్నం కూడా జరగలేదు. బంద్ నిర్వాహకులు తెల్లవారుజామునే డిపోలకు చేరుకుని ప్రధాన గేట్ల ఎదుట ఆందోళనకు దిగారు. రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్ల కార్యాలయాల సిబ్బంది, ఆర్టీసీ ఇతర కార్యాలయాల ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్లన్నీ వెలవెలబోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో అన్ని రూట్లలో రాకపోకలకు ఆటంకమేర్పడింది. -
సెకను లేటైనా నో ఎంట్రీ!
వీఆర్వో,వీఆర్ఏ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. వీటి నిర్వహణకు కలెక్టర్ సారథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు జిల్లా వ్యాప్తంగా సమకూర్చారు. పోలీసు పరంగా కూడా గట్టి బందోబస్తు సిద్ధం చేశారు. ఈ మారు వీడియోల వినియోగం, వేలిముద్రల సేకరణ వంటివి చేపట్టి నకీలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈనెల 2న ఆదివారం జిల్లాలో నిర్వహించే వీ ఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒ క్క సెకండు అలస్యమైనా అనుమతించబోమని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. పరీక్షల నిర్వాహణపై శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. అభ్యర్థులంతా తమకు కేటాయించిన కేంద్రాలకు గంట ముందుగా ఉదయం 9గంటలకే చేరుకోవాలన్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఈసారి కొత్తగా అభ్యర్థుల వేలిముద్రల్ని సేకరించాకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ సెంటర్ వద్ద అభ్యర్థులను వీడియో గ్రఫీతోపాటు, పురుషులను, స్త్రీలను విడిగా తనిఖీ చేయనున్నామన్నారు. అభ్యర్థులు పరీక్ష ప్యాడ్తోపాటు, బ్లూ, బ్లాక్ బాల్ పెన్ను తప్పనిసరిగా తీసుకొని రావాలన్నారు. అర్టీసీ బస్సు సదుపాయంతోపాటు, తాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144సెక్షన్ అమలు..... పరీక్షల నిర్వాహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా, ప్రతీ కేంద్రం దగ్గర 144సెక్షన్‌ని విధించారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని, సమస్యాత్మకమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా జిరాక్స్ సెంటర్లన్నీ మూసేయాలని, ఎవరైనా తెరిచినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 81,993మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు...... ఈనెల 2న నిర్వహించే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు గాను 81,993మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఇక జిల్లాలో ఖాళీగా పోస్టుల విషయానికొస్తే 103వీఅర్వో పోస్ట్‌లకు గాను 80,674 మంది, 94విఆర్ఏ పోస్ట్‌లకుగాను 1986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో రెండింటికి దరఖాస్తు చేసుకొన్న వారు 806మంది ఉన్నారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 5డివిజన్ కేంద్రాలతోపాటు, 10పట్టణప్రాంతాల్లో 243 పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇక వీఆర్వొ, వీఆర్ఏ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులకైతే జిల్లా కేంద్రంలోనే 8పరీక్ష కేంద్రాలను గుర్తించారు. వీరు ఈ కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి ఉంటోంది. అప్రకారమే వారికి హాల్ టిక్కెట్లను జారీ చేశారు. ఈసారి రెండు పరీక్షలు రాసే అభ్యర్థులందరికి ఒకే దగ్గర పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో, ఉదయం వీఆర్వొ, మధ్యాహ్నం వీఆర్ఏ పరీక్షల్ని రాసే సదుపాయాన్ని కల్పించారు. -పరీక్ష సమయం వీఆర్వొ ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వీఆర్ఏ మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు . సిబ్బంది నియామకం పూర్తి....... పరీక్షలకు సంబంధించి 5కేంద్రాలకో రూట్‌గా చేసిమొత్తం 43రూట్లను అధి కారులు గుర్తించారు. ఇందుకుగాను 36 మంది జిల్లా స్థాయి అధికారులను పరిశీ లకులుగా ఉంటారు. రూట్, లైజాన్ అధికారులుగా 45మంది తహశీల్దార్లను నియమించారు. డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్, ఎంఅర్ఐలను కలిపి అసిస్టెంట్ లైజాన్ అధికారులతోపాటు, సిట్టింగ్స్క్వాడ్స్గా ఉంటారు. చీఫ్ సూపరింటెండెంట్లుగా 108మంది, ఇన్విజిలేటర్స్‌గా 3784మంది అధికారులు వ్యవహరిస్తారు. నకిలీ అభ్యర్థులపై ప్రత్యేక నిఘా.. ఈసారి నకిలీ అభ్యర్థులను గుర్తించేందుకుగాను ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంల్లోకి వచ్చేటప్పుడు అభ్యర్థుల వీడియో గ్రఫీని తీసుకొన్న అనంతరం, వారు పరీక్షలు రాసేటప్పుడు ముందుగా దరఖాస్తు చేసుకొన్నది వారా కాదా అనేది మరోసారి నిర్ధారించుకుంటారు. గతంలో ఒకరికి బదులు ఇంకొకరు పరీక్షలు రాస్తూ పట్టుబడిన దృష్ట్యా ఈసారి పకడ్బందీగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఇవే....... సెకండు అలస్యమైనా పరీక్ష కేంద్రం లోకి అనుమతించరు. సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, బ్లేడ్ వం టి వి తీసుకరాకూడదు. ఒకవేళ వాటిని తెచ్చినా పరీక్షా కేం ద్రాల అవరణలో ఉంచనివ్వరు. బయటనే తమవారి వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంల్లోనికి బయటవారికి అనుమతి లేదు. పరీక్ష ప్రారంభం అయినప్పటి నుం చి పూర్తయ్యేంత వరకూ అభ్యర్థులు హాల్లోనే ఉండాలి జెల్, ఇంకూ పెన్నులు వంటివి వాడరాదు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారు ఈ పరీక్షలో పాల్గొనేందుకు వారి ఉన్నతాధికారినుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. లేని పక్షంలో సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం చర్యలుంటాయి. అర్టీసి బస్సులు....... ఈ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకుగాను అన్ని రూట్లకు సరిపడా బస్సుల్ని నియమించడతోపాటు, అదనంగా 54బస్సుల్ని కేటాయించినట్లు ప్రకటించింది. -
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో భరోసా
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ :ప్రయాణంపై పూర్తి భరోసా కల్పించేలా ఆర్టీసీ పనిచేస్తోందని, ఈ సంస్థ కనుక లేకపోతే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శ్రీకాకుళం ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో శనివారం నిర్వహించిన 25వ భద్రత వారోత్సవాల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే మన ఆర్టీసీ ఎంతో చక్కగా పనిచేస్తోందన్నారు. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఆర్టీసీ బస్సులు తిరగక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని కొత్త రూట్లలో బస్సులు తిప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. బీఆర్‌ఏయూ వీసీ లజపతిరాయ్ మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు బాగున్నా, కాంప్లెక్సుల్లోని క్యాంటిన్లలో ఆహార పదార్థాలు నాశిరకంగా ఉంటున్నాయని చెప్పారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రతి రోజూ 22 వేలకు పైగా బస్సులతో 45 వేల మంది డ్రైవర్లు కోటీ 80 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారని చెప్పారు. సురక్షిత డ్రైవింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఏటా కచ్చితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 84 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ, డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం 21 నుంచి 29 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా డ్రైవింగ్ చేసిన 31 మందిని సన్మానించారు. సన్మాన గ్రహీతలు వీరే.. జోనల్ స్థాయిలో 29 ఏళ్ల 10 నెలల 9 రోజులుగా ప్రమాదరహితంగా డ్రైవింగ్ చేసిన శ్రీకాకుళం రెండో డిపోకు చెందిన టి.రాజారావును ఘనంగా సన్మానించారు. రీజినల్ స్థాయిలో కె.జి.మూర్తి, జె.ఎస్.టి.ఎస్.రావు, కె.ఎస్.రావులను, డిపో స్థాయిలో వి.ఎస్.నారాయణ, ఎన్.రమణ, ఎస్.ఎస్.రావు(పార్వతీపురం), జి.జి.రావు, కె.రాము, ఎస్.కె.రావు(సాలూరు) ఎ.ఎస్.నారాయణ, జి.ఎం.ఎస్.రావు, కె.కొండ (ఎస్.కోట) జి.బి.రావు, కె.ఎస్.రావు, బి.ప్రకాశం (విజయనగరం), ఆర్.చంద్రరావు, బి.ఎస్.రావు, వై.ఎల్.రావు (పాలకొండ), కె.జె.ఆర్.ఆచారి, జి.సన్యాసి, టి.బి.రావు (పలాస), వి.ఎం.రావు, కె.ఆర్.రావు, కె.వి.రావు (శ్రీకాకుళం ఒకటో డిపో), బి.వి.ఎస్.నారాయణ, డి.నీలం, పి.సీతారాం (శ్రీకాకుళం రెండో డిపో), ఎం.ఎన్.బి.రావు, జె.ఎస్.నారాయణ, వై.బి.రావు (టెక్కలి)లను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్పీ బి.డి.వి.సాగర్, విజయనగరం డీసీటీఎం శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఒకటి, రెండు, పలాస, టెక్కలి, ఎస్.కోట డిపోల మేనేజర్లు ఎం.సన్యాసిరావు, ఎం.ముకుందరావు, రమేష్, నంబాళ్ళ అరుణకుమారి, శ్రీనివాసరావు, ఈయూ నాయకులు పి.భానుమూర్తి, బొత్స గౌరు, బి.కృష్ణమూర్తి, కొర్లాం గణేశ్వరరావు, కె.సుమన్, ఎస్.వి.రమణ, పి.రమేష్, ఎన్ఎంయూ నాయకులు పి.వి.వి.మోహన్, ఎం.ఎ.రాజు, బీఎల్పీ రావు, శాంతరాజు, ఆర్.వెంకట్రావు, సీఆర్సీ ఎ.ఆర్.మూర్తి, సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో భరోసా
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ :ప్రయాణంపై పూర్తి భరోసా కల్పించేలా ఆర్టీసీ పనిచేస్తోందని, ఈ సంస్థ కనుక లేకపోతే ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పవని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శ్రీకాకుళం ఒకటవ డిపో గ్యారేజీ ఆవరణలో శనివారం నిర్వహించిన 25వ భద్రత వారోత్సవాల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే మన ఆర్టీసీ ఎంతో చక్కగా పనిచేస్తోందన్నారు. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఆర్టీసీ బస్సులు తిరగక ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. జిల్లాలోని కొత్త రూట్లలో బస్సులు తిప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. బీఆర్‌ఏయూ వీసీ లజపతిరాయ్ మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు బాగున్నా, కాంప్లెక్సుల్లోని క్యాంటిన్లలో ఆహార పదార్ధాలు నాశిరకంగా ఉంటున్నాయని చెప్పారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రతి రోజూ 22 వేల పైచిలుకు బస్సులతో 45 వేల మంది డ్రైవర్లు కోటీ 80 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారని చెప్పారు. సురక్షిత డ్రైవింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఏటా కచ్చితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 84 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. డిప్యూటీ ఛీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ, డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం 21 నుంచి 29 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా డ్రైవింగ్ చేసిన 31 మందిని సన్మానించారు. సన్మాన గ్రహీతలు వీరే.. జోనల్ స్థాయిలో 29 ఏళ్ల 10 నెలల 9 రోజులుగా ప్రమాదరహితంగా డ్రైవింగ్ చేసిన శ్రీకాకుళం రెండవ డిపోకు చెందిన టి.రాజారావును ఘనంగా సన్మానించారు. రీజినల్ స్థాయిలో కె.జి.మూర్తి, జె.ఎస్.టి.ఎస్.రావు, కె.ఎస్.రావులను, డిపో స్థాయిలో వి.ఎస్.నారాయణ, ఎన్.రమణ, ఎస్.ఎస్.రావు(పార్వతీపురం), జి.జి.రావు, కె.రాము, ఎస్.కె.రావు(సాలూరు) ఎ.ఎస్.నారాయణ, జి.ఎం.ఎస్.రావు, కె.కొండ (ఎస్.కోట) జి.బి.రావు, కె.ఎస్.రావు, బి.ప్రకాశం (విజయనగరం), ఆర్.చంద్రరావు, బి.ఎస్.రావు, వై.ఎల్.రావు (పాలకొండ), కె.జె.ఆర్.ఆచారి, జి.సన్యాసి, టి.బి.రావు (పలాస), వి.ఎం.రావు, కె.ఆర్.రావు, కె.వి.రావు (శ్రీకాకుళం ఒకటవ డిపో), బి.వి.ఎస్.నారాయణ, డి.నీలం, పి.సీతారాం (శ్రీకాకుళం రెండవ డిపో), ఎం.ఎన్.బి.రావు, జె.ఎస్.నారాయణ, వై.బి.రావు (టెక్కలి)లను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్పీ బి.డి.వి.సాగర్, విజయనగరం డీసీటీఎం శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఒకటి, రెండు, పలాస, టెక్కలి, ఎస్.కోట డిపోల మేనేజర్లు ఎం.సన్యాసిరావు, ఎం.ముకుందరావు, రమేష్, నంబాళ్ళ అరుణకుమారి, శ్రీనివాసరావు, ఈయూ నాయకులు పి.భానుమూర్తి, బొత్స గౌరు, బి.కృష్ణమూర్తి, కొర్లాం గణేశ్వరరావు, కె.సుమన్, ఎస్.వి.రమణ, పి.రమేష్, ఎన్ఎంయూ నాయకులు పి.వి.వి.మోహన్, ఎం.ఎ.రాజు, బీఎల్పీ రావు, శాంతరాజు, ఆర్.వెంకట్రావు, సీఆర్సీ ఎ.ఆర్.మూర్తి, సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య బంద్ సక్సెస్
సిక్కోలు మరోసారి గర్జించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ బంద్ పాటించింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు, న్యాయవాదులు, ఉద్యోగులు.. బంద్ విజయవంతానికి కృషి చేశారు. విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేయగా.. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉదయమే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ఫలితంగా మధ్యాహ్నం వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్‌లో టీడీపీ, కాంగ్రెస్‌ల ఉనికి మాత్రం ఎక్కడా కనిపించలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్ శుక్రవారం ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు, ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు తిరగలేదు. ఉదయాన్ని రోడ్లపైకి చేరిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు డిపోల వద్దకు చేరుకోవడంతో బస్సులు బయటకు రాలేదు. జిల్లా కేంద్రంలో టీడీపీ వారు కనిపించలేదు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక వారు కొందరు కనిపించారు. నాయకులు ప్రధాన కూడళ్లలో తిరుగుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఏడురోడ్ల కూడలిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ పట్టణంలో ఎక్కడా వారు పాల్గొనలేదు. ఉదయం ఆరు గంటలకే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కు చేరుకొని రోడ్డుపై బైఠాయించడంతో ఉదయం 9.30 గంటల వరకు బస్సులు నిలిచి పోయాయి. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు డేఅండ్‌నైట్ కూడలి నుంచి ర్యాలీగా వైఎస్ఆర్ కూడలి వరకు వెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, బ్యాం కులను మూసివేయించారు. బంద్‌కు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల నుంచి మద్దతు లభించింది. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, శ్రీకాకుళం నియోజవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు. జెడ్పీ ఉద్యోగులు ఉదయం విధులను బహిష్కరించారు. ఎచ్చెర్ల : రణస్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఇరువైపులా వాహనాలను అడ్డు కున్నారు. పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, నాయకులు పిన్నింటి సాయ్కుమార్, గొర్లె అప్పలనర్సు నాయుడు పాల్గొన్నారు. చిలకపాలెంలో పార్టీ శ్రేణులు హైవేపై రాస్తారోకో, మానవ హారం నిర్వహించారు. బీఆర్ఏయూలు విద్యార్థులు తరగతులు బహిష్కరించి.. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. పార్టీ సమన్వయకర్తలు కిల్లి ర్మాహన్రావు, బొడ్డేపల్లి మాధురి, నాయకుడు తమ్మినేని సీతారాం ర్యాలీ చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు లు, పాఠశాలలు, కళాశాలలను ముట్టడించి వాటికి తాళాలు వేయించారు. పాతపట్నం: పాతపట్నం నియోజక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో శుక్రవారం నిర్వహించిన బంద్ పాతపట్నం, కొత్తూరు మండలాల్లో విజయవంతమైంది. పాతపట్నంలో సమన్వయకర్త కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు బంద్‌ను చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు లు, పాఠశాలలను మూయించారు. కొత్తూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా బీసీసెల్ కన్వీనర్ కొమరాపు తిరుపతిరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. రాజాం: రాజాంలో బంద్ ప్రశాంతంగా సాగింది. సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, పలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పీఎంజె బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకున్నారు. టెక్కలి: టెక్కలిలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ైవె ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు టీడీపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు మద్దతు పలికాయి. ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ నాయకులంతా బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దువ్వాడ వాణి, కోత మురళీ, సంపతిరావు రాఘవరావు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: ఇచ్చాపురంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. దుకాణాదారులు స్వచ్ఛం దంగా బంద్ పాటించారు. పాఠశాలలు మూతపడ్టాయి. పార్టీ నాయకులు బస్టాండ్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. పలాస: పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం 4గంటల నుంచే ఆర్టీసీ బస్సులు తిరగకుండా వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఆర్టీస్డీడిపో కూడలి వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకొండ: పాలకొండలో సీమాంధ్ర ద్రోహుల దిష్టిబొమ్మలను దహనం చేసి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఆంజ నేయ సెంటర్ వద్ద టైర్లను కాల్చి నిరసన తెలి యజేశారు. సీతంపేటలో ప్రధాన రహదారిలో ధర్నా, రాస్తారోకో చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. వీరఘట్టం, భామిని మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. పదిమందికి గాయాలు
అవంతీపురం(మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ మండలం అవంతీపురంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రయా ణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ వైపు వస్తుండగా మణుగూరు డిపోనకు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మణుగూరు బస్సులో ఉన్న మండలంలోని ఏడు కోట్ల తండాకు చెందిన రంగమ్మ, శాంతి, శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మాధవి, విజయలక్ష్మి, హైదలాపురానికి చెందిన యామినిలతో పాటు మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది తెలిపారు. ఆటోబోల్తా.. ముగ్గురికి.. తోపుచర్ల (మిర్యాలగూడ): ఆటోబోల్తా పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వేములపల్లి మండలం తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధి గండ్రవానిగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధి సీత్యాతండాకు చెందిన భానావత్ రమేష్ ఆటోలో ఐదుగురు వ్యక్తులు ఇటీవల మహబుబ్‌నగర్ జిల్లా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు.తిరుగు ప్రయాణంలో ఆటో గండ్రవానిగూడెం గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సీత్యాతండాకు చెందిన డ్రైవర్ రమేష్, వాంకుడోతు గోపాల్, ధనావత్ హరిలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బస్సులు ఢీ
పులివెందుల/తొండూరు, న్యూస్‌లైన్ : పులివెందుల-జమ్మలమడుగు ప్రధాన రహదారిపై సైదాపురం-ఇనగలూరు మధ్యలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రొద్దుటూరు డిపో బస్సు, పులివెందుల డిపో బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సులలో ఉన్న సుమారు 42మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు భీతిల్లిపోయారు. ప్రొద్దుటూరు డ్రైవర్ దస్తగిరి పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు. 108 వాహనం దాదాపు 45నిమిషాల తర్వాత రావడంతో క్షతగాత్రులు అప్పటికే ఆటోలు, ఇతర వాహనాల్లో పులివెందుల ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులు వీరే ప్రొద్దుటూరు డిపో డ్రైవర్ దస్తగిరి, కండక్టర్ బేబీరాణి, పులివెందుల డిపో డ్రైవర్ వల్లి, కండక్టర్ రఘురాంతోపాటు మంజుల, కుళ్లాయప్ప, ఎస్.మాబుజాన్, షేక్ నజీమున్నీషా, శ్రీనివాసులు, డి.మాధవి, నారాయణరెడ్డి, ఆదాంవల్లి, చంద్రశేఖరుడు, ఖాదర్ బాషా, సూర్యనారాయణ, శంకర్ నాయక్, కృష్ణమ్మ, రామ్మూర్తి, శ్రీదేవి, లింగమూర్తి, వసంత, ప్రసాద్, గంగిరెడ్డి, ఈశ్వరయ్య, నాగేంద్రకుమార్ రెడ్డి, షాజహాన్, సుబ్బరాయుడు, రంగాచారి, వరదప్ప, చిన్నారి అభిలాష్, స్వర్ణకుమారి, వెంకటేష్, ఆదినారాయణ, ఎరికలరెడ్డి, వీరన్న, రామయ్య, కృష్ణ, ఎర్రంరెడ్డి, సాల్మన్ రాజు, నరసింహులు, అల్లా బకాష్, పెద్ద గంగమ్మ, బాల గంగమ్మ తదితరులు గాయపడిన వారిలో ఉన్నారు. వీరిలో 10మందిని కడప, కర్నూలుతోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేశారు. హెడ్మాస్టర్లకు గాయాలు తొండూరులో సమావేశానికి వెళుతున్న అగడూరు పాఠశాల హెడ్మాస్టర్ చంద్రశేఖరుడు, సంతకొవ్వూరు హెడ్మాస్టర్ కృష్ణమ్మ, క్రిష్ణంగారిపల్లె హెడ్మాస్టర్ శంకర్ నాయక్, గోటూరు పాఠశాల హెడ్మాస్టర్ సూర్యనారాయణతోపాటు ఐటీఐ ప్రిన్సిపాల్ రామ్మూర్తి తదితరులు గాయపడ్డారు. క్షతగాత్రులను పరామర్శ పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ఆర్ సీపీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. -
స్తంభించిన భద్రాద్రి
భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలంటూ నిరసనలు మొదటిరోజు బంద్ సంపూర్ణం భద్రాచలం, న్యూస్‌లై న్: భద్రాచలంను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలనే డిమాండ్‌తో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన డివిజన్ బంద్ మొదటి రోజైన శుక్రవారం సంపూర్ణంగా జరిగింది. తెలంగాణ జేఏసీ, రాజకీయ పార్టీలు, వివిధ కుల, ప్రజా సంఘాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో భద్రాచలం వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జర్నలిస్టు సంఘాల నాయకులు గోదావరి వంతెన సెంటర్లో బైఠాయించి భద్రాచలంకు వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సారపాక వద్దే నిలిచిపోయాయి. దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాలతో పాటు, రామాలయం దర్శనం కోసం వచ్చే భక్తులు సారపాక నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వచ్చారు. పట్టణంలో ఆటోలు కూడా తిరగలేదు. బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. డివిజన్లోని ఎనిమిది మండలాల్లో కూడా బంద్ సంపూర్ణంగా జరిగింది. వాజేడులో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురంలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. వీఆర్ పురంలో రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లను నిలిపి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆరోరోజుకు చేరాయి. ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు దీక్షలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యవతి మాట్లాడుతూ భద్రాద్రి రాముడు లేని తెలంగాణ తమకు అవసరం లేదన్నారు. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. పాపికొండల విహారయాత్రకు బ్రేక్ బంద్ నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు బోట్ యజమానుల సంఘం ప్రకటించింది. దూర ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే వాహనాలను తెలంగాణవాదులు నిలిపివేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బంద్‌తో భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. ఆలయ సమీపంలోని విస్తా కాంప్లెక్స్ దుకాణాలన్నీ మూసేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేశారు. తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భద్రాచలం, ఇల్లెందు, ఖమ్మంలలో ఆయన దిష్టిబొమ్మలను ద హనం చేశారు. నేడు, రేపూ కొనసాగనున్న బంద్ భద్రాచలంను ఆంధ్రలో కలపాలనే కుట్రలకు నిరసనగా శని, ఆదివారాల్లో కూడా బంద్ కొనసాగించనున్నట్లు జర్నలిస్టు సంఘాల వేదిక నేత బి.వి.రమణారెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి రామాలయానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించారు. బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు. -
సమరోత్సాహం
యుద్ధానికి రథసారథి ఎంత కీలకమో...ఉద్యమానికి గట్టి నాయకుడూ అంతే అవసరం. ఇన్నాళ్లుగా సమైక్య ఉద్యమం ఎంత ఉధృతంగా సాగినా నాయకత్వలోపం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఆలోటు తీరింది.సమైక్యాంధ్ర సాధన కోసం జననేత జగన్ పూరించిన సమైక్యశంఖారావం విజయవంతం కావడం, సమైక్యాన్ని సాధించే వరకూ విశ్రమించేది లేదని తేల్చిచెప్పడంతో సమైక్యవాదుల్లో కొండంత ఆత్మస్థైర్యం వచ్చింది. సమైక్యాంధ్ర సాధన జగన్‌తోనే సాధ్యమని జిల్లా అంతటా చర్చ మొదలైంది. లక్ష్యసాధన దిశగా సమైక్యఉద్యమం మళ్లీ తీవ్ర రూపం దాల్చనుంది. పోగైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జూలై 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే జిల్లాలో సమైక్య ఉద్యమం హోరుగా సాగింది. తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత మరింత జోరందుకుంది. దసరా కంటే ముందుగా ప్రభుత్వంతో చర్చల అనంతరం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లోకి వెళ్లడంతో సమైక్యాంధ్ర ఉద్యమం నెమ్మదించింది. అయితే ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు మాత్రం అలుపెరగకుండా ఉద్యమం సాగిస్తున్నారు. నిరాటంకంగా రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. పదిరోజులుగా జిల్లాలో ఉద్యమం చల్లబడటం, తెలంగాణపై కేంద్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, పంపకాలకు సంబంధించిన నివేదికలను నవంబర్ 5లోపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులను ఆదేశించడంతో సమైక్యవాదుల్లో మరింత ఆందోళన నెలకొంది. తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మనసులో కసితో రగిలిపోతున్నా, నాయకుడు లేక మదనపడ్డారు. సమైక్యాంధ్రపై ప్రజల ఆకాంక్షకు అనువుగా జగన్ సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా రాజధానిలో శనివారం సమైక్యశంఖారావాన్ని చేపట్డారు. భారీగా తరలివెళ్లిన ప్రజలు, ఉద్యోగులు, రైతులు: జగన్ పిలుపుతో జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు సమైక్యశంఖారావానికి తరలివెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 800 బస్సులు, 3వేలకుపైగా ఇతర వాహనాలతో వేలాదిమంది వెళ్లారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు కూడా హాజరయ్యారు. దాదాపు 50వేలమందికిపైగా జిల్లా వాసులు శంఖారావంలో పాల్గొన్నారు. ఓవైపు ఎడతెరిపి లేని వర్షాలతో పంటలు నష్టపోయిన బాధ కంటే రాష్ట్రం విడిపోతే తలెత్తే బాధ మరింత ఎక్కువగా ఉంటుందని సభకు వెళ్లారు. సమైక్యకాంక్ష బలమైందని చాటిచెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యమాన్ని నడిపినా రాజకీయపార్టీ అండ లేకుండా ఉద్యమాన్ని దీర్ఘకాలికంగా సాగించడం కష్టమని ఉద్యమకారులంతా ఇటీవల వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఉద్యమాన్ని తమ భుజస్కందాలపై వేసుకుని ముందుకు నడిపిస్తామని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఏరాజకీయపార్టీ చేయని విధంగా జిల్లాలో నిర్విరామంగా రిలేదీక్షలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సమైక్యశంఖారావాన్ని చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంతవరకూ విశ్రమించేది లేదని, వందేమాతరం నినాదంతో ప్రతి ఒక్కరూ సమైక్య జెండాలతో ముందుకు రావాలని జగన్ పిలుపున్విడంతో సమైక్య ఉద్యమంలో జిల్లాలో మరోసారి ఉధృతంగా సాగనుందని జిల్లా వ్యాప్తంగా శనివారం చర్చలు మొదలయ్యాయి. జగన్మోహన్రెడ్డితోనే సమైక్యసాధన సాధ్యమని, పార్టీ భవిష్యత్తును కూడా పట్టించుకోకుండా ప్రజల కోసం నిష్కల్మషంగా సమైక్యరాష్ట్రం కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగనే అని హోటళ్లు, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో చర్చించుకుంటున్నారు. రాజకీయపార్టీలలో సమైక్యబాటలో నడుస్తున్న ఏకైకపార్టీ వైఎస్సార్సీపీనే. శంఖారావం విజయోత్సాహంతో పార్టీ శ్రేణులు కూడా సమరోత్సాహంతో ఉన్నాయి. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ సమాయత్తం అవుతోంది. ప్రజలు ఇంత వేదన పడుతున్నా, కేంద్రం దారుణంగా వ్యవహరిస్తున్నా వైఎస్సార్సీపీ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతోందని, జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్ నేతలు పూర్తి స్తబ్దుగా ఉండటాన్ని జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి విపత్కర సమయంలోనూ అండగా నిలవకపోవడం ఏంటని మండిపడుతున్నారు. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైఎస్సార్సీపీ తో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమైక్యవాదులు సన్నద్ధమవుతున్నారు. -
ప్రయాణం.. నరకం!
సాక్షి, చిత్తూరు: సమైక్యరాష్ట్రం కోసం రెండు నెలలుగా జిల్లాలో జరుగుతున్న ఆందోళనలు అత్యవసర ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం లేకపోవడంతో దూరప్రాంతాల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడం నరకప్రాయంగా మారుతోంది. దీనికి తోడు శుక్రవారం నుంచి 72 గంటల పాటు సీమాంధ్ర బంద్‌కు వైఎస్సార్ సీపీ పిలుపు ఇవ్వటంతో ప్రయాణికులకు మరిన్ని అవస్థలు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేశాఖ సామాన్యుని కడగండ్లు పట్టించుకునే పరిస్థితిలో లేదు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు బోగీల్లో కనీసం కాలుమోపే స్థలం లేకున్నా అవస్థలు పడుతూ వెళుతున్నారు. దీంతో తిరుపతి నుంచి వచ్చిపోయే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అ య్యాయి. ఏటా ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది ఇలా వచ్చే వారికి రైలు తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. అయినా దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్యాసిం జర్ రైళ్లకు ఇంతవరకు అదనపు బోగీలు అమర్చలేదు. కేవలం ఆదాయం సమకూరే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మరికొన్ని సూపర్‌ఫాస్టు రైళ్లకు మాత్రమే ఒకటి రెండు అదనపు బోగీలు వేసి చేతులు దులుపుకుంది. ఇక తిరుపతి కాట్పాడి మార్గంలో అయితే ప్యాసింజర్ రైలు బోగీల్లో లోపల స్థలం లేక డోర్‌వద్ద వేలాడుతూ, ఒక్కొక్కసారి ట్రైన్‌పైకి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా విజయవాడ వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లకు కూడా అదనపు బోగీలు లేవు. టిక్కెట్లు మాత్రం అడిగినంతమందికి ఇస్తున్నారు. చెన్నయ్ రూట్లోనూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒక్క అదనపు బోగీ వేయలేదు. ఈ క్రమంలో అత్యవసర పనులపై వెళ్లేవారు నరకం చవిచూస్తున్నారు. దోచేస్తున్న ప్రైవేట్ వాహనాలు రైళ్లతో పాటు నిత్యం వేలాదిమంది సుమోలు, టెంపోలు, సెవెన్‌సీటర్ ఆటోలను ఆశ్రయించి ప్రయాణం చేస్తున్నారు. బస్సులు లేకపోవడం, ప్రయాణికుల అవసరాలను అదనుగా తీసుకున్న ప్రైవేట్ వాహనాలవారు కనీస దూరానికి కూడా రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నారు. చిత్తూరు నుంచి పీలేరుకు సెవెన్సీటర్లు, ఇతర మామూలు వాహనాల్లో రూ.100, ప్రైవేట్ ట్రావెల్స్ కార్లలో రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లు తప్పడం లేదు.