ఖాళీగా ఉన్న ఆటోలు
కర్ణాటక: ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు కల్పించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆటోలు, కార్లు నడిపిస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తాజాగా మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో వీరు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. గంగావతి తదితర పట్టణాలకు రాకపోకలు సాగిస్తూ నిత్యం రూ. 1500 వరకు సంపాదించేవారు.
కంప్లి నుంచి రాంసాగర, దేవసముద్ర, కృష్ణానగర్ క్యాంప్, కంప్లి కొట్టాల తదితర గ్రామాలకు రాకపోకలు సాగించే ఆటో డ్రైవర్ల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఆటోల వద్దకు మహిళలు రావడమే కష్టంగా మారింది. వ్యవసాయ కూలీలు నిత్యం షేర్ ఆటోలను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆటోలను ఆశ్రయించే వారు కరువయ్యారు.
దీంతో ఎలా బతుకు నెట్టుకురావాలో ఆటో డ్రైవర్లకు అర్థం కావడం లేదు. వికలాంగులకు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఉంటే బాగుండేదని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment