free charge
-
ఉచిత ప్రయాణాల ప్రభావం... ఆటో డ్రైవర్ల ఉపాధికి దెబ్బ
కర్ణాటక: ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు కల్పించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆటోలు, కార్లు నడిపిస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తాజాగా మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో వీరు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. గంగావతి తదితర పట్టణాలకు రాకపోకలు సాగిస్తూ నిత్యం రూ. 1500 వరకు సంపాదించేవారు. కంప్లి నుంచి రాంసాగర, దేవసముద్ర, కృష్ణానగర్ క్యాంప్, కంప్లి కొట్టాల తదితర గ్రామాలకు రాకపోకలు సాగించే ఆటో డ్రైవర్ల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఆటోల వద్దకు మహిళలు రావడమే కష్టంగా మారింది. వ్యవసాయ కూలీలు నిత్యం షేర్ ఆటోలను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆటోలను ఆశ్రయించే వారు కరువయ్యారు. దీంతో ఎలా బతుకు నెట్టుకురావాలో ఆటో డ్రైవర్లకు అర్థం కావడం లేదు. వికలాంగులకు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఉంటే బాగుండేదని వారు చెబుతున్నారు. -
బస్సంతా మహిళలే.. మరి మా పరిస్థితి ఏంటి..?
కర్ణాటక: ఆదివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులు, బస్టాండ్లు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో అత్యధిక శాతం మంది మహిళలే ఉంటున్నారు. గతంలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో 75 శాతం పురుషులు, 25 శాతం మహిళలు ఉండేవారు. ఇప్పుడు ఈ శాతం తారుమారైంది. నగరంలోని సెంట్రల్ బస్టాండు, రాయల్ సర్కిల్ వద్ద గల కొత్త బస్టాండులోను ఇదే పరిస్థితి ఉంటోంది. ఇకపై బస్సుల్లో మహిళల కోసం సీట్ల పరిమితిని పెంచాల్సి వస్తుందని పురుష ప్రయాణికులు అంటున్నారు. బస్సు పూర్తిగా మహిళలతో నిండిపోతే పురుష ప్రయాణికులు గత్యంతరం లేక పుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. -
ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం
-
ఫ్రీచార్జ్‌పై మొబిక్విక్ కన్ను
► విలీనంపై ప్రాథమిక స్థాయిలో చర్చలు ► 1 బిలియన్ డాలర్లుగా విలీన కంపెనీ విలువ న్యూఢిల్లీ: ఈ–వాలెట్ కంపెనీ ఫ్రీచార్జ్ కొనుగోలుపై పోటీ సంస్థ మొబిక్విక్ దృష్టి పెట్టింది. రెండింటి మధ్య విలీన చర్చలు ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. వేర్వేరుగా చూస్తే రెండు సంస్థల విలువ చెరో 300 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని.. ఒకవేళ డీల్ కానీ పూర్తయిన పక్షంలో విలీన కంపెనీ విలువ సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల దాకా ఉండగలదని పరిశ్రమవర్గాల అంచనా. అలాగే, భారత మార్కెట్లో ప్రవేశించాలని ఆసక్తిగా ఉన్న ఓ చైనా ఇన్వెస్టరు.. ఈ సంస్థలోకి సుమారు 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి సంసిధ్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని బ్యాంకులు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొబిక్విక్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం కూడా ఫ్రీచార్జ్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నాయి. ఫ్రీచార్జ్‌ను విక్రయించేందుకు గత కొన్నాళ్లుగా కంపెనీ సీఈవో జేసన్ కొఠారి ప్రయత్నిస్తున్నారు. అమెరికా, చైనాకు చెందిన పలువురు ఇన్వెస్టర్లతో కూడా చర్చలు జరిపారు. ఫ్రీచార్జ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు పేపాల్ ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మొబిక్విక్, ఫ్రీచార్జ్ మధ్య విలీన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెకోయా క్యాపిటల్ ఈ రెండు సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 13 కార్యాలయాలు ప్రారంభించిన మొబిక్విక్.. సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. రూ. 1,000 కోట్లు పైగా సమీకరించే ప్రయత్నాల్లో భాగంగా పలు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌తో చర్చలు జరుపుతోంది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే ప్రారంభంలో నిధులు అందవచ్చని అంచనా. -
అమ్మకానికి ఫ్రీచార్జ్ రేసులో పేటీఎమ్ !
ముంబై: స్నాప్‌డీల్‌కు చెందిన మొబైల్ వాలెట్ ప్లాట్ఫార్మ్ ఫ్రీచార్జ్‌ను సాఫ్ట్‌బ్యాంక్ విక్రయించనున్నదని సమాచారం. దీనికి సంబంధించి కొన్ని సంస్థలతో సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు జరుపుతోందని డీల్ విలువ 15–20 కోట్ల డాలర్ల రేంజ్లో ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్నాప్‌డీల్‌ను మరో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌కు సాఫ్ట్‌బ్యాంక్ విక్రయించనున్నదన్న వార్తల నేపథ్యంలో ఫ్రీచార్జ్ విక్రయ వార్తలు రావడం విశేషం. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆలీబాబా యాజమాన్యంలోని పేటీఎమ్ సంస్థ ప్రీచార్జ్ ను కొనుగోలు చేయొచ్చని సమాచారం. రెండేళ్ల క్రితం ప్రీచార్జ్‌ను స్నాప్‌డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ 40 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కాలంలో నిధుల కోసం ఫ్రీచార్జ్ సంస్థ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పేపాల్, పేయూలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా కొన్ని నెలల క్రితం ప్రీచార్జ్‌ను కొనుగోలు చేయడానికి విజయ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎమ్ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్‌ను సంప్రదించిందని, అప్పుడు జాస్పర్ ఇన్ఫోటెక్ 50 కోట్ల డాలర్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఒక దశలో ప్రీచార్జ్ విలువను 90 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. కాగా గత మూడు నెలల్లో స్నాప్‌డీల్, ప్రీచార్జ్లకు సంబంధించి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రీచార్జ్ కోసం 15 కోట్ల డాలర్లనే పేటీఎమ్ ఆఫర్ చేస్తోందని సమాచారం. -
ఫ్రీచార్జ్ ఈ–వాలెట్ ప్రొటెక్షన్ ప్లాన్...
• వాలెట్ బ్యాలెన్స్‌పై రూ.20,000 వరకూ ఉచిత బీమా • రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో జట్టు న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ‘ఫ్రీచార్జ్’ తాజాగా తన యూజర్ల కోసం కొత్త ఈ–వాలెట్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కస్టమర్లు/వ్యాపారులు వారి మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే వాలెట్ బ్యాలెన్స్‌పై రూ.20,000 వరకూ ఉచిత బీమాను పొం దొచ్చు. ఇందుకు ఫ్రీచార్జ్.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఈ–వాలెట్ల వినియోగం, భద్రతకు సంబంధించి వినియోగదారుల్లో ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మొబైల్ ఫోన్ జారిపోయినప్పుడు కస్టమర్ల డబ్బుకు రక్షణ కల్పిస్తుంది’ అని కంపెనీ తెలిపింది. ఫోన్ పోయినప్పుడు కన్సూమర్ 24 గంటల లోపు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలని ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ పేర్కొన్నారు. అదేవిధంగా ఫ్రీచార్జ్కు ఈ–మెయిల్ లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలియజేయాలని చెప్పారు. నెలలో కనీసం ఒకసారైన లావాదేవీ నిర్వహిస్తేనే బీమా వర్తిస్తుందని తెలిపారు.