కర్ణాటక: ఆదివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులు, బస్టాండ్లు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో అత్యధిక శాతం మంది మహిళలే ఉంటున్నారు. గతంలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో 75 శాతం పురుషులు, 25 శాతం మహిళలు ఉండేవారు. ఇప్పుడు ఈ శాతం తారుమారైంది.
నగరంలోని సెంట్రల్ బస్టాండు, రాయల్ సర్కిల్ వద్ద గల కొత్త బస్టాండులోను ఇదే పరిస్థితి ఉంటోంది. ఇకపై బస్సుల్లో మహిళల కోసం సీట్ల పరిమితిని పెంచాల్సి వస్తుందని పురుష ప్రయాణికులు అంటున్నారు. బస్సు పూర్తిగా మహిళలతో నిండిపోతే పురుష ప్రయాణికులు గత్యంతరం లేక పుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment