
అమెరికా నౌకలకు వెసులుబాటు ఇవ్వలేదు
పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో వెల్లడి
పనామా సిటీ: పనామా కాలువ నుంచి అమెరికా యుద్ధనౌకలు ఉచితంగా రాకపోకలు సాగించేలా ఒప్పందం ఏదీ కుదరలేదని పనామా అధ్యక్షుడు జోస్‌రాల్ ములినో గురువారం స్పష్టంచేశారు. తమ యుద్ధ నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పనామాతో ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలకు రుసుము ఖరారు చేయడం గానీ, మినహాయింపు ఇవ్వడం గానీ తాను చేయలేనని పేర్కొన్నారు.
అమెరికా నౌకలకు ప్రత్యేక వెసులుబాటు లేదని వివరించారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అన్ని దేశాల నౌకలు రుసుము చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్‌కు తెలియజేశానని చెప్పారు. అయితే, పనామా అధ్యక్షుడు జోస్‌రాల్ ములినో అమెరికా సర్కారు ఇంకా స్పందించలేదు. ‘‘అమెరికా ప్రభుత్వ నౌకలు ఇకపై పనామా కాలువలో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. దీనివల్ల మనకు మిలియన్ డాలర్ల ఆదా అవుతుంది’’అని అమెరికా బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది.

Comments
Please login to add a commentAdd a comment