
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారుల్ని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేయిస్తున్నారు. ఈ అరెస్ట్‌ల నుంచి తప్పించుకుని సరిహద్దులు దాటే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు.
ఈ అరెస్ట్‌లపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. యుఎస్ అధికారులు ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారని, సైనిక విమానాల్ని ఉపయోగించి వందల మందిని బహిష్కరించినట్లు చెప్పారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సైనిక విమానం ద్వారా వందలాది అక్రమ వలస దారుల్ని బహిష్కరించింది. చరిత్రలో అక్రమ వలస దారుల బహిష్కరణ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతున్నారని తెలిపారు.