అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోమారు అధిరోహించిన ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి ఉపసంహరణ, మరొకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం... ఈ నిర్ణయాలతో ఆమెరికాలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
పారిస్ ఒప్పందం అనేది ప్రపంచంలోని పలు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. పారిశ్రామికీకరణ జరగక ముందున్నప్పటి కంటే 2 డిగ్రీల సెల్సియస్ తక్కువకు గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదలువుతున్న దేశాలలో అమెరికా ఒకటి. ఇప్పుడు పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినందున వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ సహకారానికి ఆ దేశం దూరమవుతుంది.
ఆర్థిక పరిణామాలు:
పెరుగుతున్న క్లీన్ ఎనర్జీ రంగంలో ఆర్థిక అవకాశాలను అమెరికా కోల్పోనుంది. కీలకమైన క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ ప్రపంచ మార్కెట్ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి, రెండు ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోంది.
దౌత్య సంబంధాలు:
ఈ ఉపసంహరణ అమెరికాను అంతర్జాతీయ మిత్రదేశాల నుండి దూరం చేస్తుంది. దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుంది. వాతావరణ సమస్యలపై ప్రపంచ సహకారం నుండి అమెరికా దూరమవుతుంది.
పర్యావరణ ప్రభావం:
యూఎస్ భాగస్వామ్యం లేకుండా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన వాతావరణ ప్రభావాలకు దారితీసే పరిస్థితులు ఏర్పాడనున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి..
ప్రపంచ ఆరోగ్య భద్రత:
ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు అంతర్జాతీయ ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో అమెరికా ఉపసంహరణ ప్రపంచ ఆరోగ్య భద్రత, ప్రతిస్పందన సామర్థ్యాలను బలహీనపరుస్తుంది.
నిధులు-వనరులు:
ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీగా నిధులను అందించే దేశాలలో అమెరికా ఒకటి. దీని నుంచి అమెరికా వైదొలగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆ దేశపు ఆర్థిక చేయూత దూరమవుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ప్రజారోగ్య సహకారం:
వ్యాధి నివారణ, నియంత్రణతో సహా వివిధ ఆరోగ్య సమస్యలపై అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకారం అందిస్తుంటుంది. అయితే ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాల పురోగతికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
అమెరికా ఆరోగ్యంపై ప్రభావం:
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సహకారం లేనప్పుడు అమెరికా వైద్యారోగ్యం విషయంలో ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదేవిధంగా ప్రపంచ ఆరోగ్య డేటా, పరిశోధనలో అమెరికాకు స్థానం ఉండదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు యునైటెడ్ స్టేట్స్ గణనీయమైన సహకారం అందిస్తోంది. 2022–2023 ద్వివార్షిక కాలంలో అమెరికా సుమారు 1.284 బిలియన్ అమెరిన్ డాలర్ల సాయాన్ని అందించింది. ఈ నిధులు అత్యవసర ప్రతిస్పందన, వ్యాధుల నివారణ, ఆరోగ్య వ్యవస్థ బలోపేతంతో సహా వివిధ ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..
Comments
Please login to add a commentAdd a comment