
వాష్టింగన్: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది.
అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.
ఆఘమేఘాల మీద
ఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది.
ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్
ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో
ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్‌లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం.
పాక్-ట్రంప్ చీకటి ఒప్పందంపై అనుమానం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.