Pahalgam
-
ముగిసిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: 62వ వార్షిక అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. హిమాలయాల్లోని మంచు స్ఫటిక శివలింగం ఉన్న ఈ గుహాలయాన్ని ఈ ఏడాది 4.4 లక్షల మంది యాత్రికులు సందర్శించుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బల్టాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్ర మొదలైంది. యాత్రికులు సహా మొత్తం 48 మంది వాతావరణ సంబంధ, సహజ కారణాలతో చనిపోగా, మరో 62 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. -
అమర్నాథ్ యాత్ర నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి భక్తులెవరినీ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అనుమతించట్లేదని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్లోని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళ్తుంటారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్లోని నున్వాన్ క్యాంప్, గందర్బల్ జిల్లా బాల్టాల్ క్యాంప్ నుంచి ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేసేవరకు 72,000 మందికిపైగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి రోజున అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. -
ముగ్గురు తీవ్రవాదులు హతం
-
ముగ్గురు తీవ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుపెట్టాయి. ఈ సంఘటన పహల్గాంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 లను స్వాధీనం చేసుకున్నారు. -
అమర్ నాథ్ యాత్ర ప్రారంభం