
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు సింది. తాజాగా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాల భాగస్వామ్య కూటమి క్వాడ్(క్యూయూఏడీ)పహల్గామ్ ఉగ్రదాడిపై ఒక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నవారిని, వారికి సహకరించినవారిని తక్షణం న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరింది.
BREAKING: QUAD condemns Pahalgam terror attack; says,'perpetrators, organizers, and financiers of this reprehensible act to be brought to justice without any delay' pic.twitter.com/zCA06YkMqZ
— Sidhant Sibal (@sidhant) July 2, 2025
2025, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మృతిచెందారు. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ ఈ చర్యను ఖండించాయి. ‘క్వాడ్’ సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యలను, హింసాత్మక తీవ్రవాద చర్యలను ఖండిస్తుందని, ఉగ్రవాదంపై పోరాటానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ‘క్వాడ్’ ఆ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ‘క్వాడ్’ నేతలు కోరారు.
ఇది కూడా చదవండి: ‘అందుకు ఇజ్రాయెల్ ఓకే’: గాజాలో కాల్పుల విరమణపై ట్రంప్