Quad Summit
-
ఇండో–పసిఫిక్ స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యం
న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు, విస్తరణవాదానికి కళ్లెం వేస్తూ ఈ ప్రాంత స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యంగా ఉమ్మడిగా ముందడుగువేస్తున్నామని క్వాడ్ కూటమి దేశాలు పునరు ద్ఘాటించాయి. క్వాడ్ కూటమిగా ఆవిర్భవించి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలెట్టి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా క్వాడ్ సభ్యదేశాలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశాయి. 2004లో హిందూ మహాసముద్రంలో ఇండోనేసియా సమీపంలో సముద్రగర్భంలో భూకంపం కారణంగా ఉద్భవించిన సునామీ సృష్టించిన విలయం నుంచి కోలుకునేందుకు భార త్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు 20 ఏళ్ల క్రితం ‘క్వాడ్’కూటమిగా ఏర్పడిన విషయం విదితమే.మంగళవారం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ఇటీవలికాలంలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తరచూ సముద్రతీర భద్రత, మౌలిక వసతుల కల్పన, దేశాల మధ్య అనుసంధానత పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సంయుక్త ప్రక టన వెలువడటం గమనార్హం. ‘‘ఇండో–పసిఫిక్ స్వేచ్ఛాయుతంగా ఉంటే ఇక్కడ సుస్థిరత, పారదర్శకత నెలకొనడంతోపాటు దేశాల మధ్య పరస్పర నమ్మకం, విశ్వాసం ఇనుమడిస్తుంది. పది దేశాలతో ఏర్పడిన ఆసియాన్ గురించి క్వాడ్ ఆలో చిస్తోంది. తూర్పు ఆసియా దేశాలకు పూర్తి సహాయసహకారాలు అందించడంతోపాటు దేశాల మధ్య ఐక్యతకు క్వాడ్ కృషిచేస్తోంది. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లకూ క్వాడ్ తన మద్దతు పలుకుతోంది.సునామీ వంటి ప్రకృతి విపత్తులు మా నాలుగు దేశాలను దగ్గర చేశాయి. సునామీ వినాశనం వేళ దాదాపు 2.5 లక్షల మంది సజీవ సమాధి అయ్యారు. రాకాసి అలల ధాటికి తీరప్రాంతమున్న 14 దేశాల్లో 17 లక్షల మంది సర్వస్వం కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. లక్షలాది బాధితులను ఆదుకునేందుకు 40,000కు పైగా అత్యయక బృందాలు అవిశ్రాంతంగా సేవలందించాయి. వినాశనాల వేళ మానవీయ సా యం, విపత్తు స్పందన సహకారం అందించడమే క్వాడ్ ముఖ్యోద్దేశం. ఇండో–పసిఫిక్‌లో తలెత్తే ఎలాంటి ఉపద్రవాన్నైనా తక్షణం ఎదుర్కొనేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం.2021 నుంచి ప్రతి ఏటా క్వాడ్ దేశాధినేతలు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పసిఫిక్ ప్రాంతాల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారు’’అని సంయుక్త ప్రకటన పేర్కొంది. 2025 ద్వితీయార్థంలో క్వాడ్ సదస్సు భారత్‌లో జరగనుంది. క్రితంసారి అమెరికాలోని విలి్మంగ్టన్‌లో క్వాడ్ సదస్సు జరిగింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ దేశాల సార్వ¿ౌమత్వానికి భంగం వాటిల్లకుండా క్వాడ్ దేశాలు పనిచేస్తున్నాయని ప్రకటన స్పష్టంచేసింది. -
స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్
విలి్మంగ్టన్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: ‘క్వాడ్’ కూటమి ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ కోసమే అది కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. ప్రపంచదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను క్వాడ్ గౌరవిస్తోందని అన్నారు. సంఘర్షణలు, సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, సమగ్ర, శాంతి సౌభాగ్యాలతో కూడిన ఇండో–పసిఫిక్‌కు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో డెలావెర్‌లోని విలి్మంగ్టన్‌లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం జరిగిన క్వాడ్ దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రారం¿ోపన్యాసం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమిచి్చన ఈ సదస్సులో ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు ఆంథోనీ అల్బనీస్, ఫుమియో కిషిదా కూడా పాల్గొన్నారు. భిన్న రంగాల్లో క్వాడ్ దేశాలు పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని మోదీ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణమార్పులు, మౌలిక సదుపాయా కల్పనతోపాటు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. క్వాడ్ సదస్సులో ఫలవంతమైన చర్చ జరగబోతోందని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక బంధం బలోపేతం ప్రపంచమంతటా శాంతియుత పరిస్థితి నెలకొనాలన్నదే క్వాడ్ ఆకాంక్ష అని కూటమి నేతలు స్పష్టం చేశా రు. ఇండో–పసిఫిక్ దేశాల బాగు కోసమే కూటమి ఏర్పాటైందన్నారు. ‘ఇండో–పసిఫిక్ సంక్షేమానికి కృషి చేస్తున్న శక్తి క్వాడ్’ అని ఉద్ఘాటించారు. తమ కూటమి దేశాల మధ్య వ్వూహాత్మక బంధం గతంలో ఎన్నడూ లేనంతగా బలపడిందని వెల్లడించారు. సదస్సు అనంతరం నేతలంతా ఈ మేరకు ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల జరిగిన మిస్సైల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. చైనా తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండో–పసిఫిక్ విద్యార్థులకు 50 క్వాడ్ స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు భారత్ ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికింద మొత్తం 5 లక్షల డాలర్లు అందజేయనున్నట్లు వెల్లడించింది. నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు క్వాడ్ సదస్సు సందర్భంగా ప్రధానులు అల్బనీస్, కిషిదాతో పాటు బైడెన్‌తో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, భద్రతపై భారత వైఖరిని వివరించారు. ఆయా దేశాలతో బంధాల బలోపేతంపై సంప్రదింపులు జరిపారు.ఉక్రెయిన్‌లో శాంతికి మోదీ చొరవ ప్రశంసనీయం: బైడెన్ మోదీపై బైడెన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గత నెలలో ఉక్రెయిన్‌లో చరిత్రాత్మక పర్యటన చేపట్టడం, శాంతి సందేశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో శాంతికి మోదీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. మోదీకి బైడెన్ శనివారం విలి్మంగ్టన్లోని తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ గళం బలంగా వినిపించేలా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలకు తాను మద్దతు ఇస్తానని ఈ సందర్భంగా బైడెన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కలి్పంచేందుకు తన మద్దతు ఉంటుందన్నారు. మోదీ–బైడన్ భేటీపై భారత్, అమెరికా ఒక ఫ్యాక్ట్ïÙట్ విడుదల చేశాయి. అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి భారత్ 31 లాంగ్–రేంజ్ ఎండ్యూరెన్స్ ఎంక్యూ–9బీ ఆర్మ్డ్ డ్రోన్లు కొనుగోలు చేస్తుండడాన్ని బైడెన్ స్వాగతించారు. -
Joe Biden: క్వాడ్ సదస్సులో మళ్లీ తడబడిన బైడెన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయం ఇండో-పసిఫిక్ భాగస్వామ్యానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) సమావేశం జరిగింది.ఆ సమావేశం ప్రారంభంలో క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించేలా క్వాడ్ కూటమి దేశాలు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా క్యాన్సర్ మూన్‌షాట్ ఇనిషియేటివ్ అనే పోగ్రాంను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో జో బైడెన్, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలు ఉన్నారు.క్యాన్సర్ మూన్‌షాట్ ఇనిషియేటివ్ పోగ్రాం ప్రారంభించిన అనంతరం సమావేశానికి క్వాడ్ దేశాల అధ్యక్షులను పరిచయం చేయాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీని సభకు పరిచయం చేశానని జో బైడెన్ అనుకున్నారు. కానీ చేయలేదు.తడబడ్డారు. ఇప్పుడు నేను ఎవరిని పరిచయం చేస్తున్నాను?..నేను ఎవరిని పరిచయం చేస్తున్నాను? అంటూ..అటూ ఇటూ దిక్కులు చూశారు. పక్కనే ఉన్న జో బైడెన్ తడబాటును గ్రహించిన అధికారులు ప్రధాని మోదీ పేరు చెప్పారు. అనంతరం వేదికపైన కూర్చన్న మోదీ ముందుకు వచ్చి జోబైడెన్‌తో కరచాలనం చేశారు. ఇలా బైడెన్ తడబడటం గతంలో అనేక మార్లు జరిగింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ట్రంప్ అనడం, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ బదులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రస్తావించడం చర్చకు దారి తీసింది. కాబట్టే రెండో దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నా అనారోగ్య సమస్యల కారణంగా తప్పుకున్నారు.I thank President Biden for hosting me at his residence in Greenville, Delaware. Our talks were extremely fruitful. We had the opportunity to discuss regional and global issues during the meeting. @JoeBiden pic.twitter.com/WzWW3fudTn— Narendra Modi (@narendramodi) September 21, 2024చదవండి : మరోసారి కిమ్ కర్కశత్యం -
చైనా మనందరినీ పరీక్షిస్తోంది: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో నాలుగో క్వాడ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. ‘‘చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఇలా దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాల్లో చైనా మనందరినీ పరీక్షిస్తోంది. అయితే ఈ సందర్భంలో దేశాల మధ్య పోటీకి దౌత్యం అవసరమని మేము నమ్ముతున్నాం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైతం ఆ దేశ ప్రయోజనాలను దూకుడుగా కొనసాగించేందుకు ఇతర దేశాలతో దౌత్యపరమైన విధానాలు అమలు చేయడానికి యోచిస్తున్నారని విన్నాను. ముఖ్యంగా చైనాలో దేశీయ ఆర్థిక సవాళ్లపై జీ జిన్‌పింగ్ దృష్టి సారించారని, చైనాలో అల్లకల్లోలం తగ్గించేందుకు దృష్టి సారించారని తెలుస్తోంది’ అని అన్నారు.President Joe Biden was caught on a hot mic saying China is “testing” the US and its allies in the Indo-Pacific region during a Quad leaders’ summit https://t.co/qAPslysOMJ— Bloomberg Markets (@markets) September 21, 2024క్రెడిట్స్: Bloomberg Marketsదక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం ప్రదర్శించడానికి దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే మొత్తం దక్షిణ చైనా సముద్రంపై తాము సార్వభౌమాధికారం కలిగి ఉన్నామని చైనా అంటున్న విషయం తెలిసిందే. అయితే చైనా వైఖరిపై వియత్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ ఇతర ఆగ్నేయాసియా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.చదవండి: బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
ఉక్రెయిన్‌పై ఏం చేద్దాం?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై లోతుగా చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ప్రధాని అమెరికా చేరుకున్నారు. అనంతరం నేరుగా డెలావెర్‌లో విల్లింగ్టన్ లోని బైడెన్ నివాసానికి వెళ్లారు. మోదీకి అధ్యక్షుడు ఘనస్వాగతం పలికారు. వారిద్దరూ ఆతీ్మయంగా కౌగిలించుకున్నారు. అనంతరం మోదీ చేయి పట్టుకుని బైడెన్ లోనికి తీసుకెళ్లారు. పలు అంశాలపై నేతలిద్దరూ చాలాసేపు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ఈ భేటీలో పరిష్కార మార్గం లభించవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్–గాజా ఘర్షణతో పాటు అమెరికా–భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. వారితో ఆయన కరచాలనం చేస్తూ అటోగ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేశారు.అమెరికాతో బంధం బలోపేతం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతికి కృషి చేయడానికి భావసారూప్య దేశాలకు ‘క్వాడ్’ అత్యంత కీలకమైన వేదిక అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేశారు. ‘‘బైడెన్, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అమెరికాలోని ప్రవాస భారతీయులను కలుసుకోబోతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. మోదీ అమెరికాలో కీలక సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటారు. బైడెన్‌తో పాటు పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సులో, న్యూయార్క్‌లో ఐరాస సాధారణ సభలో ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు. లాంగ్ ఐలండ్‌లో ప్రవాస భారతీయుల భేటీలో పాల్గొంటారు. ప్రఖ్యాత అమెరికా కంపెనీల సీఈఓలతో సమావేశమై ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతపై చర్చిస్తారు. -
అమెరికాకు ప్రధాని మోదీ.. క్వాడ్ సందేశం విడుదల
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా బయల్దేరారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్మింగ్టన్లో జరగనున్న నాలుగో క్వాడ్ సదస్సుకు మోదీ హాజరవుతారు. అంతకంటే ముందు.. ఓ సందేశం విడుదల చేశారాయన. ‘‘ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం క్వాడ్ పాటుపడుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరిగి క్వాడ్ సమావేశం పాల్గొనబోతున్నా. అలాగే.. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ సమ్మిట్‌లో ప్రసంగం ఉండనుంది’’ అని ప్రకటన విడుదల చేశారాయన. మరోవైపు.. ప్రధాని మోదీ వివిధ సంస్థల సీఈవోలతోనూ భేటీ కానున్నారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for United StatesDuring his three-day visit to US, he will be attending the QUAD Leaders' Summit and the Summit of the Future (SOTF) at the United Nations in New York. Along with that, he will hold some key bilateral meetings… pic.twitter.com/aAKqEmYhgc— ANI (@ANI) September 20, 2024 వాస్తవానికి.. క్వాడ్ సదస్సును ఈ ఏడాది భారత్‌లో నిర్వహించాల్సి ఉంది. అమెరికా చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నిర్వహించేందుకు భారత్ అంగీకరించింది. ఈ క్వాడ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. డెలావేర్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. Today, I am embarking on a three day visit to the United States of America to participate in the Quad Summit being hosted by President Biden in his hometown Wilmington and to address the Summit of the Future at the UN General Assembly in New York. I look forward to joining my… pic.twitter.com/hvRrVtFSqv— ANI (@ANI) September 20, 2024ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. ‘మెరుగైన రేపటి కోసం.. బహుపాక్షిక పరిష్కారాలు’ అనేది ఈసారి సదస్సు థీమ్. ఈ సమ్మిట్‌లో పెద్ద సంఖ్యలో ప్రపంచ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. #WATCH | US: Preparation visuals from Nassau Veterans Memorial Coliseum in New York’s Long Island.Prime Minister Narendra Modi will meet the Indian diaspora here during a community event on September 22, during his 3-day US visit. pic.twitter.com/zvjA3cemEa— ANI (@ANI) September 21, 2024 -
క్వాడ్ సదస్సు కోసం భారత్‌కు బైడెన్
వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో ఈ ఏడాది జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హాజరవుతారని వైట్‌హౌజ్ ప్రకటించింది. ఈ ఏడాది క్వాడ్ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు తాము కట్టుబడి ఉన్నామని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సలహాదారు జాన్ కిర్బీ తెలిపారు.బైడెన్ ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో ఆయన షెడ్యూల్లో చాలా సమయం ఉందని చెప్పారు. 2020 నుంచి క్వాడ్ సదస్సులు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం భారత్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి చివరివారంలో జరగాల్సిన క్వాడ్ సదస్సును భారత్ వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది. -
ఉగ్రవాదంపై ‘క్వాడ్’ కార్యాచరణ బృందం
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని కఠినంగా అణచివేయడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ‘వర్కింగ్ గ్రూప్ ఆఫ్ కౌంటర్–టెర్రరిజం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ‘క్వాడ్’ కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర మూకల ఆటకట్టించడానికి నాలుగు దేశాల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. జీ7 కూటమికి జపాన్, జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతోపాటు ఈ ఏడాది ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కో–ఆపరేషన్(ఏపీఈసీ)కి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ‘క్వాడ్’ అజెండా అమలు కోసం సన్నిహితంగా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అనంతరం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’లో పాల్గొన్నారు. -
అంతర్జాతీయ రాజకీయాలపై... చెరగని ముద్ర
షింజో అబె. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన నేత. అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా జపాన్‌కు సైనికంగా, ఆర్థికంగా నూతన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ రాజకీయాలపైనా చెరగని ముద్ర వేశారు. జపాన్‌లోని శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టారాయన. అబె తాత నొబుసుకే కిషి జపాన్ ప్రధానిగా పని చేశారు. మరో తాత ఎయ్‌సాకు సాతో కూడా ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. అనంతర కాలంలో జపాన్ను అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఆయన రికార్డునే అబె అధిగమించడం విశేషం. అబెనామిక్స్‌తో ఆర్థిక చికిత్స అబె 1954 సెప్టెంబర్ 21న టోక్యోలో జన్మించారు. తండ్రి షింటారో అబె విదేశాంగ మంత్రిగా పని చేశారు. టోక్యోలోని సెయ్‌కీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాక అబె అమెరికా వెళ్లి సౌత్ కాలిఫోర్నియా వర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం కోబే స్టీల్‌లో పని చేసి 1982లో విదేశాంగ శాఖలో చేరారు. తర్వాత యమగూచి స్థానం నుంచి ఎల్డీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో జునిచిరో కొయిజుమి ప్రభుత్వంలో చీఫ్ కేబినెట్ సెక్రెటరీ అయ్యారు. 2006లో 52వ ఏట తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. కానీ అనారోగ్యం వేధించడంతో ఏడాదికే తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో ఐదేళ్ల రాజకీయ అస్థిరత అనంతరం 2012లో రెండోసారి ప్రధాని అయ్యారు. 2020 ఆగస్టు దాకా కొనసాగారు. పాలనలో తనదైన మార్కు చూపించారు. ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. అబెనామిక్స్ పేరుతో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమర్థ విధానాల ద్వారా ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. తిరుగులేని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిపెట్టారు. ఆగర్భ శత్రువైన చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. ప్రపంచ దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సైనికపరంగా కూడా జపాన్ను అత్యంత బలోపేతం చేయాలని చివరిదాకా తపించారు. జపాన్ జాతీయవాదానికి పోస్టర్ బోయ్‌గా నిలిచి యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. అత్యంత బలోపేతమైన సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ సంఘర్షణల్లో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తున్న దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని చైనా, కొరియాలనే గాక స్వదేశంలోని సంప్రదాయవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడాక జపాన్‌పై అమెరికా తదితర దేశాలు విధించిన ఆంక్షలను, బలవంతపు ఒప్పందాలను పక్కన పెట్టేందుకూ ప్రయత్నించారు. అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషించేలా జపాన్ను తీర్చిదిద్దాలని తపించారు. దేశంలో జాతీయవాద విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించారు. అందరు దేశాధినేతలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించినా, భారత్ అంటే మాత్రం అబెకు ప్రత్యేకమైన అభిమానం. అది 1950ల్లో జపాన్ ప్రధానిగా చేసిన ఆయన తాత నుంచి ఒకరకంగా ఆయనకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. తనకు నెహ్రూ ఇచ్చిన ఆతిథ్యాన్ని తాత తనకు వర్ణించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని పలుమార్లు అబె చెప్పారు. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిడాపై అబె ప్రభావం చాలా ఉంది. అమెరికాతో జపాన్ బంధాన్ని పటిష్టంగా మార్చిన ప్రధానిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ‘క్వాడ్’తో చైనాకు ముకుతాడు రాజనీతిజ్ఞుడిగా అబె ముందుచూపు అత్యంత నిశితమైనది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఎప్పటికైనా పెను ముప్పేనని ముందే ఊహించారాయన. దాని ఫలితమే చైనాను ఇప్పుడు నిత్యం భయపెడుతున్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సంయుక్త కూటమి (క్వాడ్). దీని రూపకర్త అబెనే. భారత పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ప్రతిపాదనే క్వాడ్‌గా రూపుదాల్చింది. అది జపాన్‌తో పాటు భారత్‌నూ అమెరికాకు సన్నిహితం చేసింది. -
ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భేటీ
-
క్వాడ్ నేతల మూడో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ
-
క్వాడ్.. మంచి కోసం ఓ శక్తి: ప్రధాని మోదీ
టోక్యో: క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో-పసిఫిక్‌లో శాంతిని నిర్ధారించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య.. వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. సదస్సుకు ముందు.. బైడెన్, కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాకక్షిక సంబంధాల గురించి చర్చించారు ప్రధాని మోదీ. మార్చి 2021లో వర్చువల్‌గా క్వాడ్ నేతల మధ్య భేటీ జరగ్గా.. సెప్టెంబర్ 2021 వాషింగ్టన్ డీసీలో ఇన్ పర్సన్, మార్చి 2022లో వర్చువల్ మీటింగ్ జరగ్గా.. ఇప్పుడు టోక్యో వేదికగా జరుగుతున్న సమావేశం నాలుగవది.