వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయం ఇండో-పసిఫిక్ భాగస్వామ్యానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) సమావేశం జరిగింది.
ఆ సమావేశం ప్రారంభంలో క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించేలా క్వాడ్ కూటమి దేశాలు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా క్యాన్సర్ మూన్‌షాట్ ఇనిషియేటివ్ అనే పోగ్రాంను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో జో బైడెన్, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలు ఉన్నారు.
క్యాన్సర్ మూన్‌షాట్ ఇనిషియేటివ్ పోగ్రాం ప్రారంభించిన అనంతరం సమావేశానికి క్వాడ్ దేశాల అధ్యక్షులను పరిచయం చేయాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీని సభకు పరిచయం చేశానని జో బైడెన్ అనుకున్నారు. కానీ చేయలేదు.తడబడ్డారు.
ఇప్పుడు నేను ఎవరిని పరిచయం చేస్తున్నాను?..నేను ఎవరిని పరిచయం చేస్తున్నాను? అంటూ..అటూ ఇటూ దిక్కులు చూశారు. పక్కనే ఉన్న జో బైడెన్ తడబాటును గ్రహించిన అధికారులు ప్రధాని మోదీ పేరు చెప్పారు. అనంతరం వేదికపైన కూర్చన్న మోదీ ముందుకు వచ్చి జోబైడెన్‌తో కరచాలనం చేశారు.
ఇలా బైడెన్ తడబడటం గతంలో అనేక మార్లు జరిగింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ట్రంప్ అనడం, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ బదులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రస్తావించడం చర్చకు దారి తీసింది. కాబట్టే రెండో దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నా అనారోగ్య సమస్యల కారణంగా తప్పుకున్నారు.
I thank President Biden for hosting me at his residence in Greenville, Delaware. Our talks were extremely fruitful. We had the opportunity to discuss regional and global issues during the meeting. @JoeBiden pic.twitter.com/WzWW3fudTn
— Narendra Modi (@narendramodi) September 21, 2024
చదవండి : మరోసారి కిమ్ కర్కశత్యం
Comments
Please login to add a commentAdd a comment