మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రధాని మోదీ | Modi,reacting To The Strong Earthquake That Jolted Myanmar | Sakshi
Sakshi News home page

మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రధాని మోదీ

Published Fri, Mar 28 2025 2:28 PM | Last Updated on Fri, Mar 28 2025 3:25 PM

Modi,reacting To The Strong Earthquake That Jolted Myanmar

ఢిల్లీ :  మయన్మార్‌ (Myanmar earthquake)ను కుదిపేసిన భూకంపంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.    

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లను భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి భవనాలు ఊగాయి. బహుళజాతి భవనాలు నేల మట్టమయ్యాయి. ఓ భవనం కూలడంతో శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నారు. నేల మట్టమైన భవనాల కింద వేలాది మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ భూకంపంతో వేలాది భారీ నిర్మాణాలు నేల మట్టమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది.

ముఖ్యంగా మయన్మార్‌లో వరుసగా స్వల్ప వ్యవధిలో రిక్టర్‌ స్కేలుపై 7.7,6.4 భూకంప తీవ్రత నమోదైంది. ఆ భూకంపంపై ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. భూకంపం ప్రభావం నేపథ్యంలో మయన్మార్‌,  థాయిలాండ్‌ దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుంది. అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. 

 

భూమి లోపల.. పది కిలోమీటర్ల మేర భూకంపం 
మయన్మార్ వాయువ్య భాగమైన సాగైంగ్‌కు 16కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మయన్మార్‌లో గతంలో కూడా సాగైంగ్‌కు భూకంపాలు సంభవించిన చరిత్ర ఉంది. ఈసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం రావడం గమనార్హం.

Myanmar Earthquake: అన్ని విధాలా సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ మోదీ పోస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement