Myanmar
-
మృత్యువుతో 108 గంటల పోరాటం
బ్యాంకాక్: భారీ భూకంపం మయన్మార్‌ను అతలాకుతలం చేసింది. వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వందలాదిగా భారీ భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో మిగిలి ఉంటున్నారు. హోటల్లో కార్మికుడిగా పని చేస్తున్న 26 ఏళ్ల నాయింగ్ లిన్ టున్ అదృష్టం కూడా బాగున్నట్లుంది. 108 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. నాయింగ్ లిన్ టున్ మయన్మార్ రాజధాని నేపడాలోని క్యాపిటల్ సిటీ హోటల్లో పని చేస్తున్నాడు. గత శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి ఈ హోటల్ కుప్పకూలింది. శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇక్కడ గత ఐదు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో కేవలం మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా బతికి ఉండొచ్చన్న అంచనాతో ఎండోస్కోపిక్ కెమెరాతో గాలించారు. శిథిలాల కింద చిక్కుకున్న నాయింగ్ లిన్ టున్ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల సాయంతో కాంక్రీట్ దిమ్మెలకు భారీ రంధ్రం చేసి అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ పూర్తికావడానికి 9 గంటలకు పైగా సమయం పట్టింది. ఆహారం, నీరు లేక పూర్తిగా నీరసించిపోయినప్పటికీ స్పృహలోనే ఉన్న నాయింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు ప్రకటించారు. 3,000 దాటిన మృతుల సంఖ్య ఇదిలా ఉండగా, మయన్మార్ భూకంపంలో మృతుల సంఖ్య 3,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో 4,639 మంది గాయపడ్డారని తెలియజేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్‌లో భూకంపం మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 34 మంది క్షతగాత్రులయ్యారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక్కడ బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఆ్రస్టేలియా ప్రభుత్వం ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా, అదనంగా మరో 4.5 మిలియన్ డాలర్లు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 200 మందిని పంపించింది. చైనా 270 మందిని, రష్యా 212 మందిని, యూఏఈ 122 మందిని పంపించాయి. మయన్మార్‌లో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్‌ఫోన్ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. రోడ్లు చాలావరకు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మాండలే నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సింగు టౌన్షిప్లో ఓ బంగారు గని భూకంపం వల్ల కుప్పకూలడంతో అందులో ఉన్న 27 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు తాజాగా వెల్లడయ్యింది. -
మయన్మార్ లో మళ్లీ భూకంపం
-
మాండలే.. మరుభూమి
మాండలే: మయన్మార్ భూకంపం దేశంలో రెండో అతి పెద్ద నగరమైన మాండలేను మరుభూమిగా మార్చేసింది. నగరంలో మూడొంతులకు పైగా భవనాలు కుప్పకూలాయి. అవన్నీ క్రమంగా శవాల దిబ్బలుగా మారుతున్నాయి. మౌలిక సదుపాయాల లేమితో శిథిలాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. వాటికింద వేలాదిమంది చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. భూకంపం సంభవించి ఐదు రోజులు కావస్తుండటంతో వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లుతున్నాయి. కుళ్లుతున్న శవాలతో మాండలే వీధుల్లో ఇప్పటికే భరించలేనంతటి దుర్గంధం వ్యాపించింది.దీనికితోడు మంగళవారం సాయంత్రం కూడా మాండలేను మరో భూకంపం వణికించింది. 5.1 తీవ్రత భూమి కంపించడంతో ఇప్పటికే దెబ్బతిని పగుళ్లిచ్చిన చాలా భవనాలు కుప్పకూలాయి. దాంతో జనం హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేస్తూ గడిపారు. దేశవ్యాప్తంగా భూకంప మృతుల సంఖ్య 2,700, క్షతగాత్రుల సంఖ్య 5,000 దాటాయి. వారి స్మృత్యర్థం మంగళవారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ప్రజలు నిమిషం పాటు మౌనం పాటించారు. మయన్మార్‌లో 10 వేలకు పైగా భవనాలు కూలిపోయినట్టు ఐరాస పేర్కొన్న నేపథ్యంలో మృతుల సంఖ్య అపారంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం కూడా సహాయక చర్యలకు పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. మంగళవారం దాకా విపరీతమైన ఎండ కాయగా బుధవారం నుంచి భారీ వర్ష సూచనలు ఆందోళనగా మారాయి. బ్యాంకాక్‌లో 21 మంది...థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపానికి 21 మంది బలైనట్టు ఇప్పటిదాకా తేలింది. కుప్పకూలిన నిర్మాణంలోని 30 అంతస్తుల భవనం వద్ద శిథిలాల తొలగింపు ఇంకా కొనసా గుతోంది. అందులో పని చేస్తున్నవారిలో 78 మంది ఆచూకీ తేలడం లేదని అధికారులు తెలిపారు. దానికింద చిక్కినవారి సంఖ్య 300 దాకా ఉంటుందని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి.పాపం పసివాళ్లు!మాండలేకు 40 కి.మీ. దూరంలోని క్యౌక్సే పట్టణంలో ఓ ప్రీ స్కూల్లో 70 మంది చిన్నారుల్లో అత్యధికులు భూకంపానికి నిస్సహాయంగా బలయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. జరిగిన దారుణాన్ని తలచుకుంటూ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మాండలే సమీపంలో కుప్పకూలిన ఓ బౌద్ధారామం శిథిలాల నుంచి ఇప్పటిదాకా 50 మందికి పైగా సన్యాసుల మృతదేహాలను వెలికితీశారు. వాటికింద నలిగి కనీసం మరో 150 మంది మరణించి ఉంటారని చెబుతున్నారు.మృత్యుంజయులుమయన్మార్ రాజధాని నేపిడాలో భవన శిథిలాల నుంచి ఓ 63 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలు ఏకంగా 91 గంటల తర్వాత మంగళవారం ప్రాణాలతో బయటపడ్డారు. మరోచోట ఓ ఐదేళ్ల చిన్నారిని, గర్భిణిని కూడా సహాయక బృందాలు కాపాడాయి. -
భూకంపం విధ్వంసం నుంచి ఇంకా తేరుకోని మయన్మార్
-
మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్, థాయిలాండ్(Myanmar, Thailand)లను తాకిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ రెండు దేశాలలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటివరకు సుమారు 1,700 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం నిర్థారించింది. సుమారు 3,400 మంది గాయపడ్డారని, 300 మంది గల్లంతయ్యారని తెలిపింది.బ్యాంకాక్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదే..బ్యాంకాక్‌లో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి పెరిగిందని నగర అధికారులు తెలిపారు. బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అథారిటీ(Bangkok Metropolitan Authority) తెలిపిన వివరాల ప్రకారం 32 మంది గాయపడ్డారు. 82 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వీరు నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల టవర్‌లో గల్లంతయ్యారని సమాచారం. ఈ భూకంపం మధ్య మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి వాయువ్యంగా సంభవించింది. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలేలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది.సాయం కోసం రెడ్ క్రాస్ విజ్ఞప్తిభూకంప బాధితులకు సహాయం అందించేందుకు అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీ(International Red Cross and Red Crescent Society)ల సమాఖ్య (ఐఎఫ్ఆర్సీ)100 మిలియన్ డాలర్ల పైగా మొత్తం అత్యవసరమని విజ్ఞప్తి చేసింది. అలాగే భూకంపం సంభవించిన ప్రాంతంలో అవసరాలు అంతకంతకూ పెగుతున్నాయని పేర్కొంది. రాబోయే 24 నెలల్లో లక్ష కుటుంబాలకు సహాయం అందించేందుకు మరింతగా నిధులు అవసరం కానున్నాయని పేర్కొంది. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మరో సంక్షోభం తలెత్తకముందే అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది. ఇది విపత్తు మాత్రమే కాదని, సంక్లిష్టమైన మానవతా సంక్షోభమని ఐఎఫ్ఆర్సీ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ మాథ్యూ పేర్కొన్నారు.‘ఈ సమయంలో వైమానిక దాడులా?’1,700 మందిని బలిగొన్న భూకంపంతో దేశం అతలాకుతలం అవుతున్నసమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సాయుధ ప్రతిఘటన ఉద్యమం గ్రామాలపై వైమానిక దాడులు నిర్వహించడంపై మయన్మార్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెన్ నేషనల్ యూనియన్ జంటా పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తూనే ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ పరిస్థితులలో సైన్యం సహాయ చర్యలకు ముందుకు వస్తుందని, అయితే ఇప్పుడు దీనికి బదులుగా దేశ ప్రజలపై దాడి చేయడానికి బలగాలను మోహరించడం దురదృష్టకరమని పేర్కొంది. #OperationBrahma continues. @indiannavy ships INS Karmuk and LCU 52 are headed for Yangon with 30 tonnes of disaster relief and medical supplies.🇮🇳 🇲🇲 pic.twitter.com/mLTXPrwn5h— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 30, 2025భారత్ నుంచి 30 టన్నుల సహాయక సామగ్రిభారత నావికాదళ నౌకలు మయన్మార్‌కు 30 టన్నుల సహాయాన్ని తీసుకువెళ్లాయని భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మీడియాకు తెలిపారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కార్ముక్, ఎల్సీయూలు 52 భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకువెళ్లాయని అయన పేర్కొన్నారు. ఈ సహాయ చర్యలు ఆపరేషన్ బ్రహ్మలో భాగమని తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోంది. భారత నావికాదళ నౌకలు 30 టన్నుల సహాయక, వైద్య సామాగ్రితో యాంగోన్‌కు వెళ్లాయని తెలిపారు."మయన్మార్‌కు భారత రెస్క్యూ బృందంభారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం 10 మంది సిబ్బందితో కూడిన మొదటి సహాయక బృందం మయన్మార్‌లోని మండలే అంతర్జాతీయ విమానాశ్రయానికి(Mandalay International Airport) చేరుకుంది. ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఈ బృందం ప్రయత్నాలు ప్రారంభించింది. భారీ పరికరాలు, సహాయక సామగ్రిని తరలించేందుకు ఈ బృందం సోమవారం రోడ్డు మార్గంలో ప్రయాణించనుంది. కాగా భారత నేవీ నౌకలు సహాయ సామగ్రిని మయన్మార్‌కు తీసుకువెళుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.‘సహాయం అందినా ప్రాణం పోయింది’మయన్మార్‌లోని మండలేలో కూలిపోయిన అపార్ట్మెంట్ శిథిల్లాల్లో ఒక గర్భిణి 55 గంటల పాటు చిక్కకుపోయింది. రెస్క్యూ సిబ్బంది బాధితురాలు, 35 ఏళ్ల మాథు తుల్విన్ ప్రాణాలను కాపాడారు. అయితే స్కై విల్లా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ శిథిలాల నుండి ఆమెను బయటకు తీసిన కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది.‘హూ’నుంచి మూడు టన్నుల వైద్య సామగ్రిమయన్మార్ను కుదిపేసిన భూకంపాలలో గాయపడిన వేలాది మందికి సాయం అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(హూ)దాదాపు మూడు టన్నుల వైద్య సామగ్రిని పంపింది. ట్రామా కిట్లు,టెంట్లతో సహా వైద్య సామగ్రి ఇప్పటికే వెయ్యి పడకల ఆసుపత్రికి చేరుకున్నాయని ‘హూ’ ఒక ప్రకటనలో తెలిపింది. భూకంప సంభవించిన 24 గంటల వ్యవధిలోపునే యాంగోన్లోని అత్యవసర వైద్య సామగ్రి నిల్వ నుంచి ఈ సామగ్రిని తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ధ్వంసమైన 50 మసీదులుమయన్మార్లో శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు ముస్లింలు చేరుకుంటున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఈ ప్రమాదం బారినపడి వందలాది మంది ముస్లింలు మృతిచెంది ఉంటారనే అంచనాలున్నాయి. భూకంపం సంభవించినప్పుడు, మండలేలో ఉంటున్న ఒక ముస్లిం తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. మసీదు పక్కనే ఉన్న తన ఇల్లు కూలిపోయిందని, తన అమ్మమ్మ, ఇద్దరు మామలు శిథిలాల కింద చిక్కకున్నారని తెలిపారు. నగరంలో శిథిలాల భవనాలు అలానే ఉన్నాయని, రెస్క్యూ బృందాలు అందించే సాయం సరిపోవడం లేదని ఆయన కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు. షాడో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 50కి పైగా మసీదులు ధ్వంసమయ్యాయి. ఇది కూడా చదవండి: Mann Ki Baat: వేసవి సెలవులు.. నీటి సంరక్షణపై ప్రధాని మోదీ సందేశం -
Myanmar earthquake: కుళ్లుతున్న మృతదేహాలు
మాండలే: భూకంపం తాలూకు విధ్వంసం నుంచి మయన్మార్ ఇంకా తేరుకోలేదు. మౌలిక వనరుల లేమికి భూ ప్రకంపనలు తోడై సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుబడ్డవారి సంఖ్య అపారంగా ఉన్నట్టు సైనిక ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నానాయి. ఇప్పటికే రెండు రోజులు దాటిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. దాంతో రాజధాని నేపిడా మొదలుకుని ఏ నగరంలో చూసినా మృత్యుఘోషే విన్పిస్తోంది. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మాండలేలో శిథిలాల కింద కుళ్లిపోతున్న మృతదేహాలతో వీధులన్నీ కంపు కొడుతున్న పరిస్థితి! అంతర్జాతీయంగా అందుతున్న సాయం ఏ మూలకూ చాలడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. చాలా నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని నేపిడా సమీపంలో శనివారం రెండుసార్లు 4.7, 4.3 తీవ్రతతో భూమి కంపించడం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో జనం భయాందోళనలతో ఇళ్లను వీడి వీధుల్లోకి పరుగులు తీశారు. స్వల్ప స్థాయి ప్రకంపనలు రోజంతా కొనసాగాయి. రోడ్డు, రైలు మార్గాలు, బ్రిడ్జిల వంటివన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థలన్నీ పడకేశాయి. దాంతో సహాయక బృందాలను బాధిత ప్రాంతాలకు తరలించడమే సవాలుగా మారింది. సమాచార వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. వీటికి తోడు 41 డిగ్రీల పై చిలుకు ఎండ ఠారెత్తిస్తోంది. చాలాచోట్ల శిథిలాలను పారలు, చేతులతోనే తొలగించేందుకు స్థానికులు ప్రయతి్నస్తున్నారు! ఇన్ని ప్రతికూలతల మధ్యే ఇప్పటిదాకా 1,700కు పైగా మృతదేహాలను వెలికితీశారు. అయితే సహాయక బృందాలు ఇంకా దేశంలో చాలా ప్రాంతాలకు చేరుకోనే లేదు. తిరుగుబాటుదారుల అ«దీనంలో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల ఊసే లేదు. దాంతో అక్కడి మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారమూ లేదు. ఈ నేపథ్యంలో మరణాలు 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. భారత్ ఆపద్బాంధవ పాత్ర కల్లోల మయన్మార్‌ను ఆదుకోవడంతో భారత్ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మ పేరిట ఇప్పటికే ఐదు సైనిక విమానాల్లో 60 టన్నుల మేరకు సహాయక సామగ్రిని చేరవేసింది. మరో 40 టన్నుల సహాయక సామగ్రి సముద్ర మార్గాన చేరుకుంటోంది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేక సైనిక పారా బ్రిగేడ్ బృందం కూడా తోడైంది. 120 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో వాయు మార్గాన తరలించిన తాత్కాలిక ఆస్పత్రి రెండుగా విడిపోయి మాండలే, నేపిడాల్లో రోగులను పెద్ద ఎత్తున ఆదుకుంటోంది.మాండలేలో ఆకలి కేకలు 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో విధ్వంసం మాటలకందని రీతిలో ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ నిర్మణాలన్నీ కుప్పకూలడమో, భారీగా పగుళ్లివ్వడమో జరిగింది. దాంతో నగరవాసులు వీధుల్లోనే గడుపుతున్నారు. శిథిలాల కింద చిక్కిన తమవారిని ఎలాగోలా కాపాడుకోవాలని తపిస్తున్నారు. పారలు, పలుగులతో వాటిని తవ్వి తీసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే తిండికి, తాగునీటికి కూడా వాళ్లు అల్లాడిపోతున్న పరిస్థితి! శిథిలాల తొలగింపుకే నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని కేథలిక్ రిలీఫ్ సరీ్వసెస్ మేనేజర్ కారా బ్రాగ్ అభిప్రాయపడ్డారు. ‘‘క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు చాలినన్ని సదుపాయాల్లేవు. ఔషధాలు తదితరాలకు తీవ్ర కొరత ఉంది. తిండికి, తాగునీటికి కొరత తీవ్రతరమవుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నేపిడా, మాండలే విమానాశ్రయాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ నగరాలకు వాయుమార్గాన సహాయక సామగ్రి, సిబ్బంది తరలింపు అసాధ్యంగా మారింది. నేపిడాలో ప్రభుత్వ కార్యాలయాల పునరుద్ధరణకే సైనిక సర్కారు ప్రాధాన్యమిస్తోంది. దాంతో సాధారణ ప్రజల దైన్యాన్ని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.థాయ్‌లాండ్‌లో 18కి మృతులు శుక్రవారం నాటి భూకంపంతో తీవ్రంగా దెబ్బ తిన్న థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 18కి పెరిగింది. బ్యాంకాక్‌లో కుప్పకూలిన 33 అంతçస్తులు నిర్మాణంలోని భవనం శిథిలాల్లో నుంచి ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికితీశారు. -
Myanmar earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం
మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రత నమోదైంది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. యునైటెడ్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం.. ఆదివాయం మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంట మధ్యలో మయన్మార్‌ను మరోసారి భూకంపం వణికించింది. మయన్మార్‌లోని మాండలే ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తేలింది.మరణాల సంఖ్య పెరుగుతోందిమార్చి 28న మయన్మార్‌ను భారీగా కుదిపేసిన 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య సుమారు 1600కు పైకి చేరింది. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు. యూఎస్జీఎస్ ప్రాథమిక సమాచారం మేరకు మయన్మార్‌లో ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య 10,000 దాటే అవకాశముందని పేర్కొంది. -
భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్ అంటూ ప్రశంసలు
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్‌పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా.. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.Nurses in SW China protect newborn babies during earthquake in Myanmar #ChinaBuzz pic.twitter.com/Yixj3pCtZE— CGTN (@CGTNOfficial) March 30, 2025ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు.Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025 Nature doesn’t care about our strength, borders, or pride. The earthquake in #Thailand & #Myanmar is a stark reminder: no matter how advanced we become, nature still holds the power to shake everything. A brutal reminder of how small we really are. #earthquake pic.twitter.com/wQPZ82MB8j— Hala Jaber (@HalaJaber) March 29, 2025 -
Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్‌లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్‌కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్‌లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.ఇదేవిధంగా మయన్మార్‌లోని ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్‌లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్‌కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది. ఈ నేపధ్యంలో భారత్.. మయన్మార్‌కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం -
ఆపరేషన్ బ్రహ్మ.. మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం
న్యూఢిల్లీ: భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు అంతర్జాతీయ సాయం వెల్లువెత్తుతోంది. ఈ విషయంలో తక్షణం స్పందించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక సామగ్రి తదితరాలు అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట హుటాహుటిన రంగంలోకి దిగింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగు లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్లైట్లు, జెనరేటర్ సెట్లు, అత్యవసర ఔషధాల వంటివాటితో కూడిన 15 టన్నుల సహాయక సామగ్రిని శనివారం తెల్లవారుజామున మూడింటికే సైనిక విమానాల్లో మయన్మార్‌కు పంపింది. ఉదయం 8 గంటలకల్లా వాటిని స్థానికంగా బాధిత ప్రాంతాలకు పంపే కార్యక్రమం మొదలైపోయింది. అంతేగాక 118 మంది వైద్య తదితర సిబ్బందితో కూడిన పూర్తిస్థాయి ఫీల్డ్ ఆస్పత్రిని కూడా వాయుమార్గాన శనివారం రాత్రికల్లా మయన్మార్‌కు తరలించింది! వాళ్లంతా ఇప్పటికే మాండలే ప్రాంతంలో రంగంలోకి దిగా రు. గాయపడ్డ వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరో రెండు వాయుసేన విమానాల్లో మరింత సామగ్రిని పంపుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేగాక మరో 40 టన్నుల సామగ్రిని ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో యాంగూన్కు తరలిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. కమాండెంట్ పి.కె.తివారీ నేతృత్వంలో 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ అన్వేషక, విపత్తు సహాయక బృందాలు శనివారం సాయంత్రానికే బాధిత ప్రాంతాలకు చేరుకుని రంగంలోకి కూడా దిగాయని చెప్పారు. ‘‘రెస్క్యూ డాగ్స్ కూడా వెంట వెళ్లాయి. వాయు మార్గాన ఆరు అంబులెన్సులను తరలిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. చైనా, రష్యా, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి కూడా సహాయక సామగ్రి మయన్మార్ చేరుతోంది. ఆ దేశంతో భారత్ 1,643 కి.మీ. పొడవైన సరిహద్దును పంచుకుంటుంది. అందుకే ‘బ్రహ్మ’ ‘‘బ్రహ్మ సృష్టికర్త. తీవ్ర విధ్వంసం బారిన పడ్డ మయన్మార్‌లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరగాలన్నది భారత్ ఆకాంక్ష. అందుకే ఈ సహాయక ఆపరేషన్‌కు బ్రహ్మ అని పేరు పెట్టాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ మీడియాకు వివరించారు. మరింత సాయం పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. గతేడాది యాగీ తుపానుతో అతలాకుతలమైనప్పుడు కూడా మయన్మార్‌కు భారత్ ఇలాగే తక్షణం ఆపన్నహస్తం అందించిందని గుర్తు చేశారు. సహాయక సామగ్రి బాధిత ప్రాంతాలకు తక్షణం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మయన్మార్ సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. -
మయన్మార్ వెన్ను విరిగింది
బ్యాంకాక్: భూకంపం మయన్మార్ వెన్ను విరిచింది. అంచనాలకు కూడా అందనంతటి నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలు, వారి సంబం«దీకుల ఆక్రందనలే. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో కునారిల్లుతున్న ఆ దేశానికి ఇది పులిమీద పుట్రలా పరిణమించింది. అత్యవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు కనీస స్థాయి మౌలిక వనరులు కూడా లేక సైనిక సర్కారు చేతులెత్తేస్తోంది. శిథిలాల నుంచి మృతులు, క్షతగాత్రుల వెలికితీతకు అవసరమైనన్ని భారీ క్రేన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి! దాంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఫలితంగా శిథిలాల కింద చిక్కిన వారిలో అత్యధికులు మృత్యువాత పడే దుస్థితి నెలకొంది. నిస్సహాయ స్థితిలో ఉన్న మయన్మార్‌కు భారత్ తక్షణం ఆపన్నహస్తం అందించింది. ఇతర దేశాల నుంచి కూడా మయన్మార్‌కు సాయం అందుతోంది. మరోవైపు శనివారం మధ్యాహ్నం నేపిడా సమీపంలో మూడు గంటల తేడాతో రెండుసార్లు భూమి కంపించింది. 4.3, 4.7 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపాల తాలూకు నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు. గత 24 గంటల్లో మయన్మార్‌లో 14కు పైగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కుప్పకూలిన కంట్రోల్ టవర్ భూకంప ధాటికి నేపిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కంట్రోల్ టవర్ కుప్పకూలి శిథిలాల దిబ్బగా మారింది. విమాన సేవలు ఆగిపోవడంతో భారత్ తదితర దేశాల నుంచి వస్తున్న సహాయక విమానాలు యాంగూన్‌లో దిగుతున్నాయి. థాయ్‌లాండ్‌లో... థాయ్‌లాండ్‌లో భూకంపం తాలూకు విధ్వంస తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రాజధాని బ్యాంకాక్‌తో పాటు పలు నగరాల్లో భవనాలు, ఆస్పత్రులు, ఆలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరంలో కనీసం 2,000 పైచిలుకు భవనాలు తీవ్రంగా పగుళ్లిచ్చినట్టు గవర్నర్ తెలిపారు. 334 అణుబాంబుల శక్తి! మయన్మార్ భూకంపం ఏకంగా శక్తిమంతమైన 334 అణుబాంబుల పేలుడుకు సమానమైన శక్తిని విడుదల చేసినట్టు జియాలజిస్టులు తేల్చారు! మాండలే, పరిసర ప్రాంతాలకు ముప్పు ఇంకా తొలగలేదని వారు హెచ్చరించారు. అక్కడ ఒకట్రెండు నెలల పాటు ప్రకంపనలు కొనసాగే ఆస్కారముందని వివరించారు.రోడ్డుపైనే ప్రసవం శుక్రవారం మధ్యాహ్న వేళ. భూకంపం దెబ్బకు బ్యాంకాక్ అతలాకుతలమైంది. జనమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లూ, భవనాలు వీడుతున్నారు. ఉన్నపళంగా రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి రోగులను ఫైర్ సేఫ్టీ మార్గం గుండా బయటికి తరలిస్తున్నారు. ఆ క్రమంలో ఓ నిండు గర్భిణికి నడిరోడ్డు మీదే పురిటి నొప్పులు మొదలయ్యాయి. చుట్టూ గందరగోళం మధ్యే వైద్య సిబ్బంది సమక్షంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.15 మంది సజీవం! భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం శుక్రవారం కుప్పకూలడం తెలిసిందే. పదుల సంఖ్యలో నిర్మాణ కారి్మకులు, సిబ్బంది శిథిలాల కింద చిక్కుబడ్డట్టు చెబుతున్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన 100 మందిలో అత్యధికులు ఆ శిథిలాల కిందే ఉన్నట్టు భావిస్తున్నారు. దాంతో వారి బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. వారిలో కనీసం 15 మంది ప్రాణాలతో ఉన్నట్టు సహాయక సిబ్బంది గుర్తించారు. శిథిలాల అడుగుభాగం నుంచి వారి మూలుగులు, సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు తమకు లీలగా వినిపిస్తున్నాయని సిబ్బంది చెప్పారు. -
Myanmar: భూ ప్రకంపనల వైరల్ వీడియోలు
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్(Myanmar)ను భూకంపం కుదిపేసింది. వందలాది భవనాలు నేల మట్టమయ్యాయి. మరణాల సంఖ్య లెక్కకు అందనంతగా ఉంది. ఇక నిరాశ్రయులైనవారి సంఖ్య చెప్పలేనంతగా ఉంది. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Dashcam footage of the powerful 7.7 magnitude earthquake in Myanmar Mandalay city#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/jzuRilDMsr— Culture War Report (@CultureWar2020) March 29, 2025మయన్మార్, థాయిలాండ్‌లలో సంభవించిన భూకంపానికి సంబంధించిన ఈ వీడియోలో ఆకాశహర్మ్యాలు ఊగడాన్ని చూడవచ్చు. రోడ్లపై వాహనాలు కదలడాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియో వణుకుపుట్టించేదిగా ఉంది.High-rise condo in Thailand with a pool on the 37th floor#Myanmar #Burma #Thailand pic.twitter.com/9tHDxZ7B4M— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఆకాశహర్మ్యంలో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్లో అలలు ఏర్పడి, అవి ఎగసిపడటాన్ని చూడవచ్చు. దీనిని చూస్తే చాలు.. భూకంప తీవ్రతను అంచనా వేయవచ్చు.🧵 Extreme shaking going on in Myanmar during the 7.7 Earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/4jGeCgZJXc— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఇంటిలో ఏర్పడిన భూకంప ప్రభావాన్ని చూడవచ్చు. చిన్న చెట్టును ఊపినప్పుడు అది ఎలా ఊగిపోతుందో ఆ విధంగా ఈ ఇల్లు భూకంప తీవ్రతకు ఊగిపోయింది.People trapped on the 78th floor Skywalk at Mahanakhon Building, Bangkok, during the 7.7 earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/j7WQYai24w— Culture War Report (@CultureWar2020) March 29, 2025స్కై వాక్ చేయడానికి 78వ అంతస్తుకు చేరుకున్న జనం భవనం కంపించడంతో ఎంతగా భయపడ్డారో ఈ వీడియోలో చూడవచ్చు. అక్కడున్న వస్తువులు జారిపోతుండటాన్ని గమనించవచ్చు.🧵 Mother Nature is Mind blowing The Earth was torn open today in Myittha, Mandalay Region, following the powerful 7.7 earthquake in Myanmar#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/tORlQD019c— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. భూమి పూర్తిగా చీలిపోయి, చాలా లోతైన పగుళ్లు ఏర్పడటాన్ని చూడవచ్చు.Narrowly escape! In #Bangkok, Thailand, a worker was cleaning the exterior walls while the building shook violently due to the #Myanmar earthquake, nearly hit by the falling glasses.#Myanmarquake #earthquakemyanmar pic.twitter.com/mDSB8MgiX4— Shanghai Daily (@shanghaidaily) March 29, 2025ఈ వీడియోలో భూకంపం తర్వాత ఆకాశహర్మ్యం పైకప్పుపై నుంచి నీరు జలపాతంలా పడటం కనిపిస్తుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాన్ని శుభ్రం చేస్తున్న వ్యక్తి ఎంతో భయపడుతూ కనిపిస్తున్నాడు.Devastating 7.7 Earthquake causes water to rise up from the ground in Myanmar pic.twitter.com/VFfT8qMLmU— TaraBull (@TaraBull808) March 29, 2025ఈ వీడియోలో భూమికి పగుళ్లు ఏర్పడిన దరిమిలా భూమి నుండి పంపు ద్వారా నీరు దానికదే ఉబికి రావడాన్ని గమనించవచ్చు.Nurses at a maternity center in Ruili, southwest China's Yunnan Province, did all they could to protect newborns when a deadly earthquake struck Myanmar, sending strong tremors across the border into Yunnan. #quake #heroes #China pic.twitter.com/KKhkxiDrKm— China Xinhua News (@XHNews) March 29, 2025ఈ వీడియో నైరుతి చైనాలోని ఒక ఆస్పత్రికి సంబంధించినది. భూకంపం సమయంలో నవజాత శిశువులను రక్షించడానికి నర్సులు పడుతున్న పాట్లను గమనించవచ్చు.ఇది కూడా చదవండి: ‘ప్రయాగ్‌రాజ్’కు పోటీగా నాసిక్ కుంభమేళా -
ఎందుకింత తీవ్ర భూకంపం.. అసలు కారణాలేంటి?
-
Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనం పరుగులు
నేపిడా: మయన్మార్‌లో శుక్రవారం (మార్చి 28) ఉదయం భూకంపం(Earthquake) విధ్వంసం సృష్టించింది. ఇదిమరువకముందే రాత్రి మరోమారు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. మళ్లీ పెను భూకంపం వచ్చిందేమోనంటూ వణికిపోయారు. అయితే ఇది అంత శక్తివంతమైనది కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మార్చి 28న రాత్రి 11.56 గంటలకు మయన్మార్(Myanmar)లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి 10 మీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపానికి ముందు పగటిపూట వరుసగా సంభవించిన రెండు భూకంపాలలో 150 మందికి పైగా జనం మరణించారని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. శుక్రవారం ఉదయం సంభవించిన భూ ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. పొరుగు దేశమైన థాయిలాండ్‌పై కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మయన్మార్‌లో తీవ్ర భూకంపం సంభవించిన దరిమిలా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇది కూడా చదవండి: Earthquake Updates: ఎటు చూసినా విషాదమే! -
భారీ భూకంపంతో థాయ్‌లాండ్, మయన్మార్ అతలాకుతలం
-
Magazine Story: రెండు భారీ భూకంపాలు 100 భవనాలు నేలమట్టం
-
థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు
-
పేక మేడల్లా కుప్పకూలాయి
భారీ భూకంపం థాయ్‌లాండ్, మయన్మార్‌లను అతలాకుతలం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్‌లో సంభవించిన ప్రకంపనల ధాటికి ఇరు దేశాల్లో అపార ఆస్తి నష్టం సంభవించింది. భారీ భవనాలు కుప్పకూలాయి. నిర్మాణాలన్నీ పగుళ్లిచ్చాయి. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విధ్వంస తీవ్రత దృష్ట్యా ప్రాణ నష్టమూ భారీగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా మయన్మార్‌లో 180 మందికి పైగా మరణించగా 750 మందికి పైగా గాయపడ్డారు. బ్యాంకాక్‌లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. బ్యాంకాక్/కోల్‌కతా: ప్రకృతి ప్రకోపానికి థాయ్‌లాండ్, మయన్మార్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరు దేశాల్లోనూ భారీ విధ్వంసం మిగిల్చింది. కాసేపటికే 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. పురాతన బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరా లైన్లు తదితరాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల్లో ఇప్పటిదాకా 200 మందికి పైగా మరణించారు. మయన్మార్‌లోనే 180 మందికి పైగా మరణించారు. 750 మందికి పైగా గాయపడ్డారని సైనిక ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం తక్షణం ఆదుకోవాలని కోరింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా ఉంది. మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలింది. అందులో అత్యధికులు మరణించి ఉంటారంటున్నారు. భూకంప కేంద్రాన్ని సెంట్రల్ మయన్మార్‌లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేకు సమీపంలో మొన్య్‌వా సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో ప్రమాద తీవ్రత చాలా పెరిగింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. చటూచాక్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భారీ భవంతి నేలమట్టమైంది. దానికింద కనీసం 90 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు భవనాలు అటూ ఇటూ ఊగిపోతున్న దృశ్యాలు, అత్యంత ఎత్తైన ఓ భవనం తాలూకు పై అంతస్తులోని స్విమింగ్‌పూల్ నుంచి నీళ్లన్నీ కిందకు పడుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని భూకంపాలు తప్పకపోవచ్చన్న హెచ్చరికలు వణికిస్తున్నాయి. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. బ్యాంకాక్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. రెండేళ్ల క్రితం తుర్కియేలో 50 వేల మందికి పైగా భూకంపానికి బలవడం తెలిసిందే. ఆ తర్వాత అతి తీవ్ర భూకంపం ఇదే. మయన్మార్‌లో... సైనిక పాలనలో మగ్గుతున్న మయన్మార్‌లో 1946 తర్వాత ఇదే అతి తీవ్రమైన భూకంపం. నేపిడాలో రాజప్రసాదాలు, భవనాలు దెబ్బ తిన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చీలిపోయి కన్పిస్తున్నాయి. ఐకానిక్ వంతెన, ఆలయాలు తదితరాలు కుప్పకూలాయి. ఇప్పటిదాకా 90 మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. చాలామందికి తీవ్ర గాయాలు కావడంతో రక్తానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మాండలేలో మసీదు కూలి 20 మంది మరణించారు. నగరానికి ఆగ్నేయాన సగాయింగ్ ప్రాంతంలో 90 ఏళ్ల నాటి బ్రిడ్జి కుప్పకూలింది. మా సో యానే బౌద్ధారామం కూడా నేలమట్టమైంది. మృతులు భారీగా పెరగవచ్చని సైనిక నియంత జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్ చెప్పారు. థాయ్‌లాండ్‌లో... భూకంపం ధాటికి ఇళ్లు, కార్యాలయాల నుంచి జనం ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చారు. భవనాలు కళ్లముందే కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. బ్యాంకాక్‌లోని 1.7 కోట్ల జనాభాలో అత్యధికులు భారీ అపార్ట్మెంట్లలోనే నివసిస్తారు. భూకంపం దెబ్బకు భయాందోళనలకు లోనై కార్లు, ఇతర వాహనాల్లో రోడ్లెక్కడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. ర్యాపిడ్ ట్రాన్సిల్, సబ్వే వ్యవస్థలను తాత్కాలికంగా మూసేయడంతో భారీ జననష్టం తప్పింది. నగరం మొత్తాన్నీ ప్రమాద ప్రాంతంగా పేర్కొన్నారు. కుప్పకూలిన నిర్మాణంలోని భవన శిథిలాలు ఏ క్షణమైనా పూర్తిగా పడిపోయేలా కన్పిస్తున్నాయి. దాంతో శిథిలాల కింద చిక్కిన వారికోసం పోలీసు శునకాలతో వెదుకుతున్నారు. ఆ ప్రాంతాన్ని ప్రధాని షినవత్రా సందర్శించారు. భద్రత దృష్ట్యా ప్రతి భవనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అత్యవసర కేబినెట్ సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. బ్యాంకాక్‌లో 10 మందికి పైగా మరణించినట్టు ధ్రువీకరించారు. చాలా భవనాలకు పగుళ్లు రావడంతో లోనికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు.హృదయ విదారకం మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో భూకంప దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద చిక్కినవారు హాహాకారాలు చేస్తున్నారు. శిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే జనం వెదుక్కుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.అన్నివిధాలా సాయం: మోదీ న్యూఢిల్లీ: భూకంప విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జరిగిన ఘోరం చూసి చలించిపోయా. బాధితుల క్షేమం కోసం ప్రారి్థస్తున్నా. థాయ్‌లాండ్, మయన్మార్లకు అన్నివిధాలా సాయం అందించేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రెండు దేశాలకూ భారత్ సహాయ తదితర సామగ్రి పంపుతోంది. థాయ్‌లాండ్‌లోని భారతీయుల కోసం బ్యాంకాక్‌లో భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ (+66 618819218) ఏర్పాటు చేసింది. భూకంప మృతుల్లో భారతీయులెవరూ లేరని పేర్కొంది. బ్యాంకాక్‌లో ఏప్రిల్ 4న బిమ్స్టెక్ ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ అధినేతలు భేటీలో పాల్గొంటారు. కోల్‌కతా నుంచి ఈశాన్యం దాకా...భూకంపం తాలూకు ప్రకంపనలు భారత్‌లోనూ కన్పించాయి. కోల్‌కతాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం భూమి 2.5 తీవ్రతతో స్వల్పంగా కంపించింది. ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. వాయవ్య చైనాలోని యునాన్, సీచుయాన్ ప్రావిన్సుల్లో కూడా భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. మాంగ్షీ తదితర నగరాల్లో భూకంప తీవ్రత హెచ్చుగా ఉంది. ఇల్లు, నిర్మాణాలు బాగా దెబ్బతిన్నాయి.బతుకుతామనుకోలేదుభూకంపం నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. మేమంతా ఆఫీసులో ఉండగా అలజడి రేగింది. భూకంపమంటూ అరుపులు విన్పించడంతో వెంటనే బయటికి పరుగెత్తుకెళ్లాం. నిర్మాణంలోని భారీ భవనాలు కూలిపోయాయి. ఇళ్లు పగుళ్లివ్వడంతో వాటిని ఖాళీ చేయించి జనాన్ని పార్కులు, ఖాళీ స్థలాల్లోకి పంపుతున్నారు. మేం యూనివర్సిటీ క్యాంపస్‌లో తలదాచుకున్నాం.– ‘సాక్షి’తో ఫోన్లో బ్యాంకాక్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రమేశ్చాలామంది చనిపోయారు బ్యాంకాక్‌లో ఇంతటి భూకంపం ఎన్నడూ చూడలేదు. 40, 50 అంతస్తులున్న నాలుగైదు భవనాలు కూలిపోయాయి. వాటిలోని చాలామంది చనిపోయే ఉంటారు. భారత పర్యాటకులు బస చేసే ప్రాంతాల్లో విధ్వంస తీవ్రత ఎక్కువగా ఉంది. తెలుగు వారందరినీ గ్రూపుల్లో అప్రమత్తం చేస్తున్నాం.– వెంకటేశ్ యాదవ్,బ్యాంకాక్‌లోని ఆంధ్రా రెస్టారెంట్ ఎండీ -
పెను ఉత్పాతం
భూమిని గురించి చెబుతూ ప్రఖ్యాత కవి దేవిప్రియ అది ‘మధ్యమధ్యలో మతిభ్రమించే/ మమతానురాగాల మాతృమూర్తి’ అంటారు. సకల సంపదలకూ పుట్టిల్లయిన నేలతల్లి ఎందుకనో ఆగ్రహించింది. శుక్రవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపాల పరంపర మయన్మార్, థాయ్‌లాండ్‌లను తీవ్రంగా దెబ్బతీయగా... మయన్మార్ ఇరుగు పొరుగు నున్న భారత్, చైనాలను భూప్రకంపనలు వణికించాయి. ఈశాన్య భారత్, బెంగాల్, ఢిల్లీ తదితర చోట్ల ప్రకంపనలు కనబడగా, చైనాలో యునాన్, సిచువాన్ ప్రాంతాలు దీని బారినపడ్డాయి. ఈ భూప్రళయం ఒక్కసారిగా జనజీవనాన్ని తలకిందులు చేసింది. మృతులెందరన్న లెక్క వెంటనే తేలడం కష్టం. ఎందుకంటే కోటి 70 లక్షల జనాభాగల థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆకాశా న్నంటే భవనాలు చాలా వున్నాయి. వాటిల్లో అనేకం నేలమట్టమయ్యాయి. వేలాదిమంది ఇరుక్కు పోయారు. వర్తక, వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు ముమ్మరంగా సాగే వేళ భూకంపం రావటం ప్రాణనష్టాన్ని పెంచివుండొచ్చన్న అంచనాలున్నాయి. మయన్మార్‌లో సైనిక పాలనవల్ల పరిస్థితి తీవ్రత తెలియటం లేదంటున్నారు. అయితే భూకంప కేంద్రం ఆ దేశంలోని రెండో పెద్ద నగరమైన మాండలేకు సమీపంలో వుండటం, భూగర్భంలో 20– 30 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభ వించటాన్నిబట్టి నష్టం ఎక్కువుంటుందన్నది భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా. నిరంతర ఘర్షణలతో అట్టుడుకుతున్న ఆ దేశంలో ఇప్పటికే 30 లక్షలమంది కొంపా గోడూ వదిలి అత్యంత దుర్భరమైన స్థితిలో బతుకీడుస్తున్నారు. ఒక్కో పట్టణం ఒక్కో సాయుధ ముఠా గుప్పిట్లో వుంది. ఇవిగాక సైన్యం అడపా దడపా వైమానిక దాడులు చేస్తోంది. ఈ భూకంపం ఆ దేశ జనాభాలో మూడోవంతుమందిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం వున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. మిగిలిన వైపరీత్యాలు విరుచుకుపడే ముందు ఏదో రకమైన సూచనలందిస్తాయి. జాగ్రత్త పడటానికి కాస్తయినా వ్యవధినిస్తాయి. కానీ భూకంపాలు చెప్పా పెట్టకుండా విరుచుకుపడతాయి. రెప్పపాటులో సర్వం శిథిలాల కుప్పగా మారుతుంది. అపార ప్రాణనష్టం వుంటుంది. తప్పించు కున్నవారిని సైతం తీవ్ర భయోత్పాతం వెన్నాడుతుంది. భూమి లోలోతు పొరల్లో అనునిత్యం మార్పులు సంభవిస్తూనే వుంటాయి. భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నదాన్నిబట్టి భూగర్భం ఏడు పలకలుగా విడివడి వుంటుంది. వీటిల్లో వచ్చే కదలికలూ, అవి తీసుకొచ్చే రాపిడులూ పర్యవసానంగా ఆకస్మికంగా శక్తి విడుదలవుతుంటుంది. ఆ శక్తి తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరుతుంది. అది భూకంపం రూపంలో వ్యక్తమవుతుంది. భూకంపం మనిషి జ్ఞానాన్ని పరిహసించే ప్రకృతి విపత్తు. ఖగోళంలో మానవుడు సాధించిన ప్రగతి అంతా ఇంతా కాదు. అక్కడ జరిగే పరిశోధనలు అన్నీ ఇన్నీ కాదు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ నిరుడు డిసెంబర్ 24న సూర్యుడి ఉపరితలానికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమించింది. ఇది అత్యంత సమీపం వరకూ వెళ్లినట్టు లెక్క. కానీ కాళ్లకింద పరుచుకున్న భూమి లోలోతు పొరల్లో ఏం జరుగుతున్నదో ఆరా తీయటంలో వైఫల్యాలే ఎదురవుతున్నాయి. భూకంపాలపై సాగుతున్న పరిశోధనలు గతంతో పోలిస్తే ఎంతో కొంత ప్రగతి సాధించాయనే చెప్పాలి. ఫలానాచోట భూకంపం రావొచ్చని చెప్ప గలిగే స్థాయి వచ్చింది. కానీ అది నిర్దిష్టంగా ఎప్పుడు, ఎక్కడ వస్తుందో చెప్పటం మటుకు సాధ్యం కావటం లేదు. ఏడెనిమిదేళ్ల క్రితం దక్షిణ కాలిఫోర్నియా, దక్షిణమధ్య అలస్కా ప్రాంతాల్లో చాలా తక్కువస్థాయి ప్రకంపనలు నమోదైనప్పుడు భూ పొరల్లో ఏదో జరుగుతున్నదని, భూకంపం వచ్చే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ తర్వాత ఉత్పాతం చోటుచేసుకుంది. అయితే సంభావ్యతను 85 శాతం వరకూ ఊహించవచ్చని, నిర్దిష్ట సమయాన్ని చెప్పటం అసాధ్యమనిఅంటున్నారు. ఇందులో చిక్కేమంటే... ముందే చెబితే జనం భయాందోళనల్లో కాలం వెళ్లదీస్తారు. ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ తర్వాత అంచనాలు తప్పితే అనవసర భయాందోళనలు సృష్టించారని శాస్త్రవేత్తలను తప్పుబడతారు. ప్రకృతిని గౌరవించటం నేర్చుకోనంతవరకూ ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. వాతావరణ కాలుష్యం, నానాటికీ పెరుగుతున్న భూతాపం, అడవుల విధ్వంసం, అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా కొండలు తొలిచి రైలు, రోడ్డు మార్గాలు నిర్మించటం, జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటివి ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ సముద్ర మట్టాలు పెరగటానికీ, వరదలకూ దారితీసి భూమి లోలోపలి పొరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముప్పును వేగవంతం చేస్తున్నాయి. ఎంఐటీ శాస్త్రవేత్తలు జపాన్‌లోని నోటో ద్వీపకల్పంలో సాగించిన పరిశోధనల ఫలితాలు దీన్నే చాటు తున్నాయి. 2020కి ముందు అక్కడ ఒకటీ అరా వచ్చే భూకంపాలు స్వల్పస్థాయిలోవుంటే... ఆ తర్వాతి కాలంలో వాటి సంఖ్య పెరగటంతోపాటు తీవ్రత ఎక్కువ కావటాన్ని వారు గమనించారు. ఇదంతా అక్కడి వాతావరణ మార్పులవల్లేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిశోధనలు ప్రభు త్వాల కళ్లు తెరిపించాలి. అభివృద్ధి పేరుతో అమలవుతున్న నమూనాలను మార్చుకోవాలి. అలాగే భూకంపాలు వాటికవే ప్రాణాలు తీయవు. బలహీనమైన కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాలు ముప్పునుంచి బయటపడే మార్గాలను మూసేస్తున్నాయి. ఇలాంటి నిర్మాణాలకు అనుమతు లిచ్చేటపుడు ప్రభుత్వాలు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవటం అవసరం. -
మయన్మార్, బ్యాంకాక్‌లను వణికించిన భారీ భూకంపం
-
Earthquake: బ్యాంకాక్ & మయన్మార్‌లో పేక మేడలా కుప్ప కూలుతున్న బిల్డింగ్లు
-
మయన్మార్‌లో భూకంపం.. ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు
-
Myanmar Earthquake: అన్ని విధాలా సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ మోదీ పోస్ట్
-
Myanmar Earthquake: ఎక్కడికక్కడ చీలిపోయిన భూమి.
-
బ్యాంకాక్ లో భారీ భూకంపం
-
మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రధాని మోదీ
ఢిల్లీ : మయన్మార్ (Myanmar earthquake)ను కుదిపేసిన భూకంపంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లను భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి భవనాలు ఊగాయి. బహుళజాతి భవనాలు నేల మట్టమయ్యాయి. ఓ భవనం కూలడంతో శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నారు. నేల మట్టమైన భవనాల కింద వేలాది మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ భూకంపంతో వేలాది భారీ నిర్మాణాలు నేల మట్టమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది.Concerned by the situation in the wake of the Earthquake in Myanmar and Thailand. Praying for the safety and wellbeing of everyone. India stands ready to offer all possible assistance. In this regard, asked our authorities to be on standby. Also asked the MEA to remain in touch…— Narendra Modi (@narendramodi) March 28, 2025ముఖ్యంగా మయన్మార్‌లో వరుసగా స్వల్ప వ్యవధిలో రిక్టర్ స్కేలుపై 7.7,6.4 భూకంప తీవ్రత నమోదైంది. ఆ భూకంపంపై ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భూకంపం ప్రభావం నేపథ్యంలో మయన్మార్, థాయిలాండ్ దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుంది. అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. 🚨 Strong 7.7 Earthquake shakes Bangkok: People run out onto the streets, water splashes out of swimming pools.pic.twitter.com/U4nlcRGaT0— Gems (@gemsofbabus_) March 28, 2025భూమి లోపల.. పది కిలోమీటర్ల మేర భూకంపం మయన్మార్ వాయువ్య భాగమైన సాగైంగ్‌కు 16కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మయన్మార్‌లో గతంలో కూడా సాగైంగ్‌కు భూకంపాలు సంభవించిన చరిత్ర ఉంది. ఈసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం రావడం గమనార్హం. -
మయన్మార్ లో భారీ భూకంపం
-
అంతర్జాతీయ ఆవాసం!
అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్‌లో, మిగతా భాగం మయన్మార్ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్ (భారత్), ఈ పక్క సగంపై సగాయింగ్ (మయన్మార్) అని రాసి ఉంటుంది కూడా. ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్ ప్వాంగ్. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది. ‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు. -
మయన్మార్ ముక్కలవడం ఖాయమా?
2025 ఫిబ్రవరి 1న మయన్మార్ అంత ర్యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ‘తమడో’ (మయన్మార్ సైనిక బలగాలు) తిరుగుబాటు చేసినప్పటి నుండి దేశంలో జనజీవితం మారిపోయింది. 2020 ఎన్ని కలలో గెలిచినప్పటికీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ నేతృత్వంలోని ప్రభుత్వం అధి కారంలోకి రావడానికి సైనిక నాయకత్వం ఎన్నడూ అనుమతించలేదు. దాని నాయకు లను, మద్దతుదారులను అరెస్టు చేశారు. ఏడాదిపాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సైన్యం ద్వారా నూతన ప్రభుత్వం ‘స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్’ ఏర్పడింది. దీనికి సైన్యం కమాండర్ ఇన్‌చీఫ్ అయిన సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ నాయకత్వం వహి స్తున్నారు. ఆయన తనను తాను మయన్మార్ ప్రధానమంత్రిగా ప్రక టించుకున్నారు. 2008 రాజ్యాంగం ప్రకారం ఈ పదవి లేదు. సంవ త్సరం లోపే ఎన్నికలు జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు.2025లో మయన్మార్ ఎన్నికలపై ఊహాగానాలు జరుగు తున్నాయి. ప్రతిపక్ష నాయకులను, జుంటా (సైనిక నాయకత్వం) వ్యతిరేకులను అరెస్టు చేస్తూనే ఉన్నారు. అంతర్యుద్ధానికి పరిష్కారా లను కనుగొనే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మయన్మార్ ప్రజలు బాధలకు గురవుతూనే ఉన్నారు. గ్రామాలను తగలబెట్టడం, వైమానిక బాంబు దాడులు, మరణ శిక్షలు వంటి పాత వ్యూహాలనే సైనిక నాయకత్వం ఉపయోగిస్తున్న క్రమంలో, మయన్మార్‌లో అంత ర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల సంఖ్య 33 లక్షలను దాటింది.తగ్గుతున్న సైన్య ప్రాభవంగత రెండేళ్ల కాలంలో, మయన్మార్‌లో సైనిక బలగాల అధికారం, భూభాగంపై నియంత్రణ తగ్గిపోవడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. జనరల్ నే విన్ తలపెట్టిన 1962 సైనిక కుట్ర, సైనిక కుట్రకు దారితీసిన 1988 తిరుగుబాటు రెండు సందర్భాల్లోనూ అధికారం చేజిక్కించుకున్నాక సైన్యం బలపడింది. కానీ 2021 సైనిక కుట్ర తర్వాత విషయాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజా ప్రతిఘటన మరింత ఆచరణీయమైన నిర్మాణంతో తన బలాన్ని పెంచుకుంది.ప్రవాసంలో ఉన్న ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ ఏర్పర్చిన ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్’ సైనిక అణచివేతను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా సహ కరించింది. ఇది పౌర అవిధేయతా ఉద్యమానికి ఊపునిచ్చింది. ప్రజా స్వామ్యం నుండి మయన్మార్ వెనక్కి తగ్గడం వల్ల నిరాశ చెందిన యువత ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో చేరారు. దీనికి సమాంతరంగా, అనేక జాతి సాయుధ సంస్థలు ఈ అవ కాశాన్ని ఉపయోగించుకుని అవి చాలా కాలంగా పోరాడుతున్నప్రాంతాల నుండి తమడో బలగాలను వెనక్కి నెట్టాయి. షాన్ లోని ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’, ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’, రఖైన్ లోని ‘అరకాన్ ఆర్మీ’, కరెన్నిలోని ‘కరెన్ని ఆర్మీ’ దీనికి కొన్ని ఉదాహరణలు. ఆసక్తికరంగా, ‘కాచిన్ ఇండిపెండెన్్స ఆర్మీ’ వంటి అనేక జాతీయ సాయుధ సంస్థలు ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్’కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. తమడోకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇలాంటి వివిధ సంయుక్త ఫ్రంట్ల ఉనికి మయన్మార్‌లో దీర్ఘకాలిక అంతర్యుద్ధానికి ప్రారంభ సంకేతం. గతంలో మాదిరిగా కాకుండా, మయన్మార్ అంతటా ఉన్న 330 టౌన్ షిప్‌లలో కనీసం 321 పట్టణాలకు ఈ పోరాటం వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి.మయన్మార్ సైనిక బలగమైన తమడో అనేక కీలకమైన అంశా లలో విఫలమైంది. బలగాల పరంగా, 2024లో ఉన్న సైనికుల సంఖ్య 4,00,000 నుండి కేవలం 70,000కు పడిపోయింది. చాలా మంది సైన్యాన్ని విడిచిపెట్టి, వెళ్లిపోయారు. దీనికి ప్రాథమిక వేతనం, బీమా లేకపోవడంతో పాటు ఇతర కారణాలు ఉన్నాయి. తమడో బలగా లకు నైతిక స్థైర్యం, యుద్ధరంగంలో నైపుణ్యాలు లేకపోవడం కూడా ఉంది. నాయకత్వ పరంగా, మిన్ ఆంగ్ హ్లైంగ్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. 2024 ఆగస్టులో జరిగిన ఒక అంతర్గత కుట్ర గురించిన పుకార్లు, మయన్మార్‌లో పరిస్థితులు అంత చక్కగా లేవని సూచి స్తున్నాయి. సైన్యంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న మిన్ ఆంగ్హ్లైంగ్, సో విన్ ఇద్దరూ 2023లో నేపిటా ప్రాంతంలో త్రుటిలో తప్పించుకున్నారు. ఇది వారి రక్షణ దుర్బలత్వాన్ని బహిర్గతంచేసింది. తమడో తన భూభాగాలను నిలుపుకోలేకపోవడం మరింత ముఖ్యమైనది. మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ, తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, అరకాన్ ఆర్మీలతో కూడిన ‘త్రీ బ్రదర్హుడ్ అలయన్స్’ 2023 అక్టోబర్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ 1027’ ఈ విషయంలో ఒక మలుపు అని చెప్పాలి.దీని తర్వాత కరెన్ని రాష్ట్రంలో జరిగిన ‘ఆపరేషన్ 1111’ ద్వారా ప్రతిఘటనా బలగాలు ప్రయోజనాలు సాధించాయి. కొత్త పాలనా వ్యవస్థలను ఎలా రూపొందిస్తున్నారో చూపించే తాత్కాలిక కార్య నిర్వాహక మండలిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. 2024 ప్రారంభం నాటికి, మయన్మార్ భూభాగంలో 50 శాతాన్ని సైనికేతర దళాలే నియంత్రిస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. అంతర్యుద్ధం ముగిసిపోతుందా?సైనిక నియంతృత్వం విఫలమైతే, అంతర్యుద్ధం ముగిసిపోతుందా? అంతర్యుద్ధానికి అంత తేలికైన ముగింపు లేదు. ఈ అంత ర్యుద్ధంలో పాల్గొంటున్న పార్టీల సంఖ్య చాలా ఎక్కువ. 2021 నుండి యుద్ధంలో పాల్గొంటున్న కొత్త ప్రభుత్వేతర సైనికుల సంఖ్య 2,600 అని ఒక అంచనా. ఉదాహరణకు, ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’, ‘షాన్ స్టేట్ ప్రోగ్రెసివ్ పార్టీ’ వంటి వాటి మధ్య కూడా పోరాటం ఉంది. ఇవి రెండూ ‘ఫెడరల్ పొలిటికల్ నెగో షియేషన్ అండ్ కన్సల్టేటివ్ కమిటీ’లో భాగం.‘త్రీ బ్రదర్హుడ్ అల యన్స్’ కూడా మయన్మార్ పరిణామాలపై భిన్నమైన అభిప్రాయా లను కలిగి ఉంది. చైనా ఆదేశం మేరకు, ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’ 2024లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’ ఇటీవలే దానిని అనుసరించింది. కానీ తమడో ఆధీనంలో ఉన్న రఖైన్ లోని చివరి కీలకప్రాంతాలలో ఒకటైన సిట్వే వద్ద సైన్యంతో పూర్తి యుద్ధానికి ‘అరకాన్ ఆర్మీ’ సిద్ధమవుతోంది. అందువల్ల, మయన్మార్ ముఖచిత్రం చాలా అస్పష్టంగా ఉంది.ఇప్పుడు ఏమి జరగవచ్చు? మొదట, మయన్మార్ విచ్ఛిన్నం కావడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న జాతి రాజ్యాలు సైనిక దళాల నియంత్రణ నుండి దాదాపుగా బయటపడ్డాయి. ప్రత్యేక రాజ్యాలు లేదా ముఖ్యంగా రఖైన్ లో ఏదో ఒక రకమైన సమాఖ్య కోసం ప్రకటన కూడా తయారు కావచ్చు. అయినప్పటికీ, బామర్లు నివసించే ప్రాంతాల్లో సైనిక దళాలు అధికారంలో ఉంటాయని ఒక అంచనా. సైనిక దళాలు ప్రతి పాదిస్తున్నట్లుగా 2025లో ఎన్నికలు జరిగితే, అది సైన్యం ఆధ్వర్యంలోని ‘స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్’(ఎస్ఏసీ) పాలనను మరింత చట్టబద్ధం చేయడానికే ఉపయోగపడుతుంది. దీని అర్థం సైనిక కుట్ర తర్వాత గత వారం ఏడవసారి పొడిగించిన అత్యవసర పరిస్థితి ఈ ఏడాది కూడా ముగిసిపోదు. చైనా ప్రాబల్యంలోని పార్టీలను చర్చ లకు తీసుకురాగలిగితే, కొత్త సైనిక ప్రభుత్వం ఎస్ఏసీ స్థానంలోకి రావచ్చు. కానీ, ఇది మయన్మార్ కోసం మరొక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే పనిలో పడుతుంది. మళ్లీ దేశ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మయన్మార్ గతంలోకంటే ఈ ఏడాది మరింత వార్తల్లో ఉంటుంది.- వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్ ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలోని నెహ్గిన్ పావో కిప్జెన్ సెంటర్ ఫర్ ఆగ్నేయాసియా స్టడీస్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-శ్రబణ బారువా -
అంగ్ సాన్ సూకీ ఇంటి కథ
యాంగూన్: తమ దేశంలో ప్రజాస్వామ్యం, పౌర ప్రభుత్వం సాధన కోసం పోరాడి ఏళ్లకు ఏళ్లు గృహనిర్బంధంలో గడిపిన మయన్మార్ నాయకురాలు అంగ్ సాన్ సూకీకి చెందిన నివాసం మూడోసారి వేలంలో వెళ్లింది. అయినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గత వేలంపాటతో పోలిస్తే ఆసారి కాస్తంత తక్కువగా రూ.1,231 కోట్లకు ఎవరైనా దీనిని కొనుగోలు చేయొచ్చని కామాయుత్ జిల్లా కోర్టు అధికారిణి వేలంపాటను మొదలెట్టినా ఎవ్వరూ ముందుకు రాలేదు. మూడేళ్లుగా సైనిక ప్రభుత్వం దిగ్భందంలో దేశం కల్లోలితంగా మారిన కారణంగా అనిశ్చితిలో ఇంతటి డబ్బు కుమ్మరించేందుకు ఎవరూ సాహసించట్లేరని మీడియాలో వార్తలొచ్చాయి.ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం యాంగూన్ సిటీలోని బహాన్ టౌన్షిప్లో ఇన్యా సరస్సు ఒడ్డున చుట్టూ పచ్చికతో తెలుపు వర్ణంలో హుందాగా కనిపించే ఈ ‘54 యూనివర్సిటీ అవెన్యూ’భవనానికి ఘన చరిత్రే ఉంది. 1953లో ఆంగ్ సాంగ్ సూకీ తన సోదరులు, తల్లితో కలిసి ఈ విల్లాలోకి మకాం మార్చారు. అప్పట్నుంచీ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ఇంట్లో ఎవరూ లేరు. సైనిక పాలన అంతానికి పోరాటం ఇక్కడే మొదలెట్టారు. అహింసా ఉద్యమానికి ఇక్కడి నుంచే ఎన్నో వ్యూహరచనలు చేశారు. తదనంతర కాలంలో సైనిక ప్రభుత్వం సూకీని ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచింది. ఏకంగా 15 సంవత్సరాలకుపైగా ఆమె ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉండిపోయారు. తర్వాత సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి సాధారణ ఎన్నికలు నిర్వహించాక అంగ్ సాన్ ఘన విజయం సాధించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. సూకీ ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగినప్పుడూ ఈ ఇంట్లోనే ఉన్నారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్సహా ఎందరో ప్రపంచ నేతలు అంగ్‌సాన్‌ను ఈ ఇంట్లోనే భేటీ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడూ ఆమె ఈ ఇంట్లోనే ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిౖకైన అంగ్ ప్రభుత్వాన్ని జుంటా సైన్యం 2021 ఫిబ్రవరిలో కూలదోసింది. ఆంగ్ ప్రభుత్వ పాలనలో పలు రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఈమెపై ఎన్నో రకాల కేసులు నమోదుచేసి ఏకంగా 27 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం తెల్సిందే.కోర్టులో వారసత్వ పోరురెండెకరాల స్థలంలో నిర్మించిన ఈ విల్లాపై వారసత్వంగా తనకూ హక్కు ఉంటుందని అంగ్‌సాన్ సూకీ అన్నయ్య అంగ్ సాన్ హో 2000 సంవత్సరంలో కోర్టుకెక్కారు. తన వాటా దక్కేలా చేయాలని యాంగూన్ హైకోర్టులో దావా వేశారు. అయితే ఈ దావా వెనుక జుంటా సైనికపాలకుల కుట్ర దాగుందని మీడియాలో వార్తలొచ్చాయి. హో ద్వారా సగం వాటా కొనేసి తర్వాత పూర్తి హక్కును దక్కించుకుని చిట్టచివరకు సూకీ జ్ఞాపకాలు జనం మదిలో లేకుండా దీనిని కూల్చేయాలని సైన్యం కుట్ర పన్నిందని అమెరికా మీడియాలో అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఈ భవనాన్ని జాతీయ స్మారకంగా మార్చాలని విపక్ష ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఆఫ్ మయన్మార్’ డిమాండ్ చేసింది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. చట్టప్రకారం అన్నా చెల్లెళ్లకు సమాన వాటా ఉంటుందని ఇంటిని వేలంవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో గత ఏడాది మార్చి 20న తొలిసారి, ఆగస్ట్ 15న రెండోసారి వేలంవేసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. -
నేటి సిద్ధార్థుడు!
రాబిన్ శర్మ బెస్ట్ సెల్లర్ ‘ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’నవలలో కథా నాయకుడు జూలియన్ మాంటిల్ తిరుగులేని క్రిమినల్ లాయర్. తృప్తిలేని తన జీవన విధానంతో విసిగి అపారమైన ఆస్తులన్నింటినీ అమ్మేసి తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అలాంటి కథే. ఏకంగా 500 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అలియాస్ ఏకే మలేషియాలో మూడో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి రూ.42,000 కోట్ల పైమాటే. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఆయనది. అలాంటి ఏకేకు సిరిపన్నో ఏకైక కుమారుడు. అంతటి ఆస్తినీ వద్దనుకుని బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బౌద్ధాన్ని నమ్మే తండ్రి కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించడం విశేషం. ఇదంతా జరిగి 20 ఏళ్లయింది. నాటినుంచీ సిరిపన్నో దాదాపుగా అడవుల్లోనే గడుపుతున్నారు. థాయ్‌లాండ్–మయన్మార్ సరిహద్దులో తావో దమ్ బౌద్ధారామంలో అబాట్ (ప్రధాన సన్యాసి)గా ఉన్నారు. పూర్తిగా భిక్ష మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఓసారి తండ్రిని చూడటానికి వచ్చిపోతుంటారు. మార్చింది ఆ ప్రయాణమే సిరిపన్నో జీవితంలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఆయన తల్లి మోమ్వాజరోంగ్సే సుప్రిందా చక్రబన్ థాయ్ రాజ కుటుంబీకురాలు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో పెరిగారు. అక్కడే చదువు పూర్తి చేశారు. ఇంగ్లిష్తో పాటు ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలరు. 18 ఏళ్ల వయసులో తల్లితో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. సరదాగా ఓ బౌద్ధారామానికి రిట్రీట్‌కు వెళ్లారు. అక్కడే ఆయనను బౌద్ధం ఆకర్షించింది. అది బలపడి, చూస్తుండగానే జీవన విధానంగా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మయన్మార్‌లో పడక మునక..
బ్యాంకాక్: అండమాన్ సముద్రంలో ఆదివారం మయన్మార్‌కు చెందిన పడవ మునిగిన ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. తీర ప్రాంత పట్టణం క్యావుక్కర్లో గత వారం రోజులుగా సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల గెరిల్లాలకు మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఈ పట్టణం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 75 మంది ప్రజలు దక్షిణ ప్రాంత టనింథర్యిలోని తీర పట్టణం మెయిక్కు పడవలో బయలుదేరారు. అలల తాకిడి తీవ్రతకు పావు గంటలోనే పడవ ప్రమాదానికి గురైంది. సమీప గ్రామాల వారు వచ్చి సుమారు 30 మందిని కాపాడారు. ఎనిమిది మృతదేహా లను వెలికి తీశారు. మరో 20 మంది జాడ తెలియాల్సి ఉంది. పడవ సామర్థ్యం 30 నుంచి 40 మంది మాత్రమే కాగా, అందుకు మించి జనం ఎక్కడం, వారి వెంట సామగ్రి ఉండటంతో బరువు పెరిగి ప్రమాదానికి దారితీసిందని చెబుతున్నారు. క్యావుక్కర్ సమీపంలోని కియె గ్రామంపై బుధవారం ఆర్మీ వైమానిక దాడులు జరిపిందని, దీంతో వేలాదిగా జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని హక్కుల గ్రూపులు అంటున్నాయి. -
మయన్మార్ వరదల్లో... 236 మంది మృతి
నైపిడావ్: మయన్మార్‌లోని యాగీ తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వాటి ధాటికి ఇప్పటిదాకా ఏకంగా 236 మంది మృతి చెందారని ప్రభుత్వ సంస్థ గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ మంగళవారం వెల్లడించింది. ఈ సంఖ్య పెరగవచ్చని ఐరాస మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్ ఏ) పేర్కొంది. ‘‘77 మంది గల్లంతయ్యారు. కనీసం 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడ్డారు’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ చైనా, వియత్నాం, లావోస్, మయన్మార్‌లో గత వారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర వియత్నాంలో ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు నిర్ధారించారు. మయన్మార్‌లో రాజధాని నైపిడావ్, సెంట్రల్ మాండలే, కయా, కయిన్, షాన్ స్టేట్స్ సహా కనీసం తొమ్మిది ప్రాంతాలు, రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేశాయి. 2023లో మోచా తుఫాను వేళ అంతర్జాతీయ సాయాన్ని తిరస్కరించిన సైనిక పాలకులు ఇప్పుడు మాత్రం సాయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.సైనిక ప్రభుత్వంతో సమస్య ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, ఆశ్రయం మయన్మార్‌కు అత్యవసరమని ఓసీహెచ్ఏ పేర్కొంది. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, అస్థిరమైన టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని తెలిపింది. పొరుగు దేశాల సాయం బాధితులకు అందాలంటే సైన్యం పౌర సమాజంతో కలిసి పని చేయడం ముఖ్యమని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణుల స్వతంత్ర సమూహం ఏఎస్ఏసీ–ఎం తెలిపింది. కానీ మెజారిటీ ప్రజలకు సాయమందేలా చూడాలనే ఉద్దేశం సైనిక ప్రభుత్వానికి లేదని ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సైన్యం దేశంలో మానవతా సంక్షోభాన్ని సృష్టించిందని, ప్రజలను గాలికొదిలి సొంత సైనిక, రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తోందని ఆరోపించింది. నిధుల సమస్యతో కూడా సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ఓసీహెచ్ఏ పేర్కొంది. -
మళ్ళీ మంటలు
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మెయితీల ప్రాబల్య మున్న కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో మునుపెన్నడూ లేని డ్రోన్ దాడులతో దేశం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా భావిస్తున్నట్టు ఇది కేవలం రెండు వర్గాల మధ్య జాతి, మతఘర్షణలే అనుకోవడానికి వీల్లేదని తేలిపోయింది. ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం, వ్యవస్థీకృతంగా సాగిస్తున్న యుద్ధనేరాల స్థాయికి దాడులు చేరిపోయాయి. మణిపుర్లో ఘర్షణలు తగ్గిపోయాయంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటల్లో పస లేదని క్షేత్రస్థాయి సంఘటనలతో స్పష్టమైంది. పైగా భారత భూభాగం లోపలే, సాక్షాత్తూ దేశ పౌరులపైనే ఇలా సైనిక వ్యూహంతో డ్రోన్ దాడులు మొత్తం ఈ ప్రాంతాన్నే భయంలోకి నెట్టి, అస్థిరపరచే కుట్రగా కనిపిస్తోంది. మయన్మార్‌లో జుంటాపై ప్రజాస్వామ్య అనుకూల వేర్పాటువాదులు సాగించే ఈ యుద్ధతంత్రం ఇక్కడ దర్శన మివ్వడం సరిహద్దుల ఆవల ప్రమేయాన్ని చూపుతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. అత్యాధునిక సాంకేతిక జ్ఞానంతో కూడిన డ్రోన్ల ద్వారా తీవ్రవాదులు రాకెట్ చోదిత గ్రెనేడ్లను ప్రయోగించడంతో ఆదివారం పలువురు గాయపడ్డారు. సోమవారం సైతం మరో గ్రామంపై ఇదే పద్ధతిలో డ్రోన్ దాడులు జరిగాయి. మణిపుర్లో హింస కొంతకాలం నుంచి ఉన్నదే అయినా, ఇలా పౌరులపై డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి. అదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా గిరిజనుల ఆధిక్యం ఉన్న కొన్ని జిల్లాల్లో కుకీ – జో వర్గాలు నిరసన ప్రదర్శనలు జరి పిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనార్హం. యుద్ధాల్లో వాడే ఇలాంటి వ్యూహాలను ఇలా అనూహ్యంగా అందరిపై ప్రయోగించి, ఉద్రిక్తతల్ని పెంచినది కుకీలే అన్నది పోలీసుల ఆరోపణ. అదెలా ఉన్నా, ఇది మన నిఘా సంస్థల వైఫల్యానికీ, తీవ్రవాదుల కట్టడిలో మన భద్రతాదళాల వైఫల్యానికీ మచ్చుతునక. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం మణిపుర్లో జరిగిన డ్రోన్ దాడులను నిశితంగా అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తీవ్ర వాదులు ఎలాంటి డ్రోన్లను వాడారన్నది మొదలు పలు అంశాలను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టా లన్న దానిపై నివేదిక సమర్పించనుంది. అయితే గతేడాది మేలో మొదలైన హింసాకాండ చివరకు ఈ స్థాయికి చేరిందంటే, ఇప్పటికీ చల్లారలేదంటే తప్పు ఎక్కడున్నట్టు? ఉద్రిక్తతల్ని చల్లార్చి, విభేదాలు సమసిపోయేలా చూడడంలో స్థానిక పాలనా యంత్రాంగం ఇన్ని నెలలుగా విఫలమైందన్న మాట. కొండ ప్రాంతాలకూ, లోయ ప్రాంతాలకూ మధ్య బఫర్ జోన్లు పెట్టి, భద్రతాదళాల మోహరింపుతో శాశ్వతంగా శాంతి భద్రతల్ని కాపాడగలమని పాలకులు భావిస్తే పిచ్చితనం.అసమర్థ పాలనతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ మాత్రం కుర్చీ పట్టుకొని వేలాడుతూ, ఆ మధ్య కూడా గొప్పలు చెప్పారు. తాము నియమించిన శాంతిదూతలు గణనీయమైన పురోగతి సాధించారనీ, ఆరు నెలల్లో శాంతి తిరిగి నెలకొంటుందనీ ఊదరగొట్టారు. ఆ మాటలన్నీ నీటిమూటలేనని తాజా ఘటనలు ఋజువు చేశాయి. పైపెచ్చు, తాజాగా ఆధునిక సాంకేతికత సాయంతో, అత్యాధునిక ఆయుధాలతో సాగుతున్న దాడులను బట్టి చూస్తే, కొన్ని వర్గాలకు దేశం వెలుపల నుంచి అన్ని రకాల వనరులు అందుతున్నట్టు అనుమానం బలపడుతోంది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికే ముప్పుగా పరిణమించే ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు కుంభకర్ణ నిద్ర పోతే పెను ప్రమాదం. శతాబ్దాలుగా అనేక సంక్షోభాలను ఎదుర్కొని, తమ మట్టినీ, మనుగడనూ కాపాడుకొన్న చరిత్ర మణిపుర్ ప్రజలది. అలాంటి ప్రాంతాన్ని పేరుకు మాత్రమే భారత్‌లో భూభాగంగా చూడక, ఆ ప్రాంత ప్రజల బాగోగులు, అక్కడి శాంతి సుస్థిరతలు తాము పట్టించుకుంటామని పాలకులు నిరూపించుకోవాల్సిన సమయమిది. 2023 నుంచి కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, అక్కడ అది ఆ వర్గపు అడ్డాగా ఇప్పటికే మణిపుర్ అనేక జోన్లుగా అనధికారంగా చీలిపోయింది. ఇంటిలోని ఈ గుండెల మీద కుంపటి చాలదన్నట్టు, ఆ పక్కనే మన దేశానికి సరిహద్దులు సైతం అంతే ఉద్రిక్తంగా తయారయ్యాయి. జుంటాకూ, తిరుగు బాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ రగులుతోంది. ఇటీవలి రాజకీయ సంక్షోభంతో పొరుగున బంగ్లాదేశ్‌తో వ్యవహారం అస్తుబిస్తుగా ఉంది. ఈ గందరగోళ భూభౌగోళిక వాతావరణం మణిపుర్ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చేస్తోంది. అంతా బాగానే ఉందనడం మాని, ఇప్పటికైనా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తాము అనుసరిస్తున్న ధోరణిని పునస్సమీక్షించుకోవాలి. మణిపుర్ మరో యుద్ధభూమిగా మిగిలిపోకూడదనుకుంటే, మన పాలకులకు కావాల్సింది రాజకీయ దృఢసంకల్పం, చిత్తశుద్ధి. దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని గమనించి, తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాయడం మాని, పెద్దన్న తరహాలో అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహ సౌహార్దాలు నెలకొనేలా నిజాయతీగా కృషి చేయాలి. సంబంధిత వర్గాలన్నిటితో రాజకీయ చర్చలు సాగించాలి. ఘర్షణల్ని పెంచిపోషిస్తున్న అంతర్లీన అంశాలను గుర్తించి, వాటిని ముందుగా పరిష్కరించాలి. తాత్కాలిక సర్దుబాటు కాక శాశ్వత శాంతిస్థాపనకై చర్చించాలి. ఇప్పటికైనా పాలకులు వివేకాన్ని చూపగలిగితే, మణిపుర్‌ను మంటల్లో నుంచి బయటపడేయవచ్చు. లేదంటే దేశమంతటికీ కష్టం, నష్టం. -
పదికోట్ల ఏళ్ల నత్త ఇది...
ఫొటో చూశారుగా.. అదీ విషయం. ఎప్పుడో పదికోట్ల ఏళ్ల క్రితం నాటి నత్త ఇది. చెట్ల జిగురు (ఆంబర్)లో బందీ అయిపోయింది. మయన్మార్‌లో ఇటీవల బయటపడ్డ ఈ అపురూపమైన శిలాజంలోని నత్త బతికి ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. పైభాగంలోని పెంకుతోపాటు కణజాలం కూడా ఏమాత్రం చెడిపోకుండా భద్రంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద రాక్షసబల్లులు తిరుగాడిన కాలంలోనే ఈ నత్తలు కూడా మనుగడలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిగురులో చిక్కుకునే సమయానికి నత్త బతికే ఉందని.. శరీరం నిటారుగా ఉండటం, తలచుట్టూ గాలి బుడగ ఉండటం దీనికి నిదర్శమని ఈ శిలాజాన్ని పరిశీలించిన పురాతత్వ శాస్త్రవేత్త జెఫ్రీ స్టివెల్ అంటున్నారు. రాక్షసబల్లుల కాలంలో నత్తలు ఉన్న విషయం తెలిసినప్పటికీ వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం లేకపోయిందని.. పది కోట్ల ఏళ్లనాటి నత్త శరీరం చెక్కు చెదరకుండా లభించడం ద్వారా ఈ కొరత తీరనుందని ఆయన వివరించారు. చెట్ల జిగురులో చిక్కుకుపోయి చెక్కు చెదరకుండా లభించిన అవశేషాల్లో రాక్షసబల్లి తోక, కర్రలాంటి తోక ఉన్న విచిత్ర ఆకారపు జంతువు, ఊసరవెల్లి, -
స్నేహిత్ జంటకు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారుడు సూరావజ్జుల స్నేహిత్ మెరిశాడు. మయన్మార్‌లో ముగిసిన ఈ పోటీల్లో బాలుర డబుల్స్ విభాగంలో తన భాగస్వామి జీత్చంద్రతో కలిసి స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్–జీత్‌చంద్ర ద్వయం 3–11, 10–12, 7–11తో చోయి ఇన్హోయిక్–క్వాక్ యుబిన్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకం సాధించింది. ఇదే టోర్నీలో బాలుర డబుల్స్‌లో మానవ్ ఠక్కర్–మనుశ్ షా జంట, మిక్స్డ్ డబుల్స్‌లో మానవ్ ఠక్కర్–అర్చన కామత్ జోడీలకు కాంస్యాలు లభించాయి. -
రోహింగ్యాలకు మయన్మార్ పిలుపు
కాక్స్ బజార్ : మయన్మార్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన ఏడు లక్షల రోహింగ్యా ముస్లింలు తిరిగి స్వచ్ఛందంగా మయన్మార్ రావచ్చని ఈ దేశ జాతీయ భద్రత సలహాదారుడు థాంగ్ తన్ తెలిపారు. సింగపూర్‌లో జరుగుతున్న ప్రాంతీయ భద్రతాదళ సమావేశంలో థాంగ్ మాట్లాడుతూ.. ‘రోహింగ్యా ముస్లింలు స్వచ్ఛందంగా మయన్మార్ తిరిగి రావచ్చు. వారు మేం వస్తున్నాం అంటే మా దేశం వారికి స్వాగతం పలుకుతుంది. ఐక్యరాజ్యసమితి బాధ్యతలను కాపాడటానికి రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను తమ దేశానికి ఆహ్మానించాల్సిన అవసర ఉందని’ ఆయన పేర్కొన్నారు. 2017 నుంచి మయన్మార్‌లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను ఆ దేశ సైన్యం చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. సైన్యం నుంచి తప్పించుకుని పారిపోయిన రోహింగ్యాలు ఎక్కువగా బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలను మయన్మార్ రావటానికి వీలుగా యూఎన్ఓ రూపొందించిన అవగాహన పత్రంపై థాంగ్ తన్ సంతకం చేశారు. -
మయన్మార్‌తో చర్చలకి భారత్ సహకరించాలి
-
సూకీ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
యంగూన్: మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్ అంగ్ సాన్ సూకీ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఝా హెచ్టయ్ గురువారం అధికారంగా ప్రకటించారు. గుర్తుతెలియని దుండగులు సూకీని లక్ష్యంగా చేసుకుని.. ఇంటి ఆవరణలో బాంబు విసిరారని ఆయన స్పష్టం చేశారు. కానీ ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ పెట్రోల్ బాంబు దాడి ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
సామూహికంగా చంపేశారు!
కాక్స్‌బజార్(బంగ్లాదేశ్): మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం మిలిటెంట్ల దురాగతాలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి. హింసకు కేంద్రంగా మారిన రాఖైన్ రాష్ట్రంలో రోహింగ్యాల చేతిలో హత్యకు గురైన హిందువుల మృతదేహాలు 45 బయటపడ్డాయి. వీటి లో 28 శవాలను ఆదివారం రెండు వేర్వేరు చోట్ల గుర్తించగా, 17 శవాలను సోమవారం మరో చోట కనుగొన్నారు. అప్పటికప్పుడు తవ్విన గోతుల్లోనే ఈ శవాలను పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. జాడ తెలియకుండా పోయిన 100 మంది హిందువుల్లో శవాలుగా బయపడిన వారున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఆగస్టు 25న రోహింగ్యా మిలిటెంట్లు సామూహిక హత్యలకు పాల్పడ్డారనడానికి ఇవే నిదర్శనమని మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. బౌద్ధులు, హిందువులు, ఇతర మైనారిటీలకు చెందిన పిల్లలు, మహిళలను రోహింగ్యాలు క్రూరంగా హతమార్చారని ఆరోపించింది. హిందువుల శవాలు బయటపడిన ప్రాంతానికి బుధవారం తొలిసారి విలేకర్లను అనుమతించారు. హింస కారణంగా చెల్లాచెదురై బంగ్లాదేశ్‌కు తరలిపోయిన ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. రోహింగ్యాల చేతిలో తమకు ఎదురైన పీడకలను బాధితులు గుర్తుచేసుకుంటున్నారు. ముసుగులు ధరించిన కొందరు కత్తులతో ఇంట్లోకి చొరబడి తన భర్త, ఇద్దరు సోదరులను కిరాతకంగా చంపా రని రీకా ధార్ అనే మహిళ పేర్కొంది. గ్రామస్థుల చేతులను వెనక కట్టేసి మోకాళ్లపై నడిపించారని తెలిపింది. మూడు పెద్ద గోతులు తవ్వి శవాలను సామూహికంగా అందులో పాతిపెట్టారని వెల్లడించింది. కేవలం హిందువులమైనందునే తమపై దాడులు జరిగాయని ఆమె వాపోయింది. ‘నల్లదుస్తుల్లో ఉన్న కొం దరు మా గ్రామంలోకి చొరబడి మనుషులను కొట్టారు. కొంతమందిని అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేయడం నేను చూశా’ అని బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రొమిలా షీల్ అనే మహిళ తెలిపింది. దాడుల్లో 163 మంది మృతి రాఖైన్ రాష్ట్రంలో ఏడాది కాలంగా రోహింగ్యా మిలిటెంట్ల దాడుల్లో 163 మంది మృతి చెందగా, 91 మంది కనిపించకుండా పోయారని మయన్మార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఫేస్బుక్లో విడుదల చేసింది. 2016 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఆగస్ట్ మధ్య కాలంలో 79 మంది చనిపోగా, 37 మంది గల్లంతయ్యారని పేర్కొంది. -
రోహింగ్యాలు శరణార్థులు కాదు: రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంలోని రోహింగ్యాలను మయన్మార్‌కు డీపోర్ట్ చేయాలన్న కేంద్రం వైఖరి మారబోదని ఆయన స్పష్టం చేశారు. 'రోహింగ్యాలు శరణార్థులు కాదు. వారు ఆశ్రయం కోరి దేశంలోకి రాలేదు. వారు అక్రమ వలసదారులు' అని ఆయన అన్నారు. రోహింగ్యాలను తిరిగి తీసుకోవడానికి మయన్మార్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. కొందరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. శరణార్థి హోదా పొందాలంటే ఒక ప్రక్రియ ఉంటుందని, ఈ ప్రక్రియను రోహింగ్యా వలసదారులు పాటించలేదన్నారు. 1951 ఐరాస శరణార్థి ఒప్పందంలో భారత్ సంతకం చేయలేదని, రోహింగ్యాలను మయన్మార్‌కు పంపడం ద్వారా భారత్ ఎలాంటి అంతర్జాతీయ ఒడంబడికను ఉల్లంఘించడం లేదని చెప్పారు. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పుగా మారరని, అందుకే వారిని మయన్మార్‌కు తరలించాలని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అంతు లేని కథ
-
రోహింగ్యాలు : ఒక్కరు కూడా అడుగుపెట్టొద్దు
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు, మిలిటెంట్లు దేశంలోకి ప్రవేశించే అన్నిదారులను కేంద్ర ప్రభుత్వం మూసేస్తోంది. తాజాగా రోహింగ్యాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న అంతర్గత నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం మిజోరామ్-మయన్మార్ సరిహద్దు వెంబడి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. సరిహద్దులో అస్సాం రైఫిల్స్ విభాగంతో భద్రతను పెంచినట్లు హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం చెప్పారు. మయన్మార్ సరిహద్దు భద్రతపై మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ పలు దఫాలుగా చర్చలు జరిపింది. ప్రధానంగా మిజోరామ్ పోలీస్, పార్లమెంటరీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్, మిజోరామ్ రాష్ట్రప్రభుత్వంతో సరిహద్దు పరిస్థితిపై రివ్యూ జరిపింది. మయన్మార్ నుంచి ఒక్క రోహింగ్యా ముస్లిం కూడా సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించరాదని కేంద్రం ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మయన్మార్‌తో మిజోరామ్‌కు మొత్తం 404 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. -
రోహింగ్యాలకు ఆహ్వానం..!
-
రోహింగ్యాలకు ఆహ్వానం..!
తొలిసారి స్పందించిన మయన్మార్ ప్రభుత్వం రఖైనా ఘటనలపై విచారం వ్యక్తం చేసిన సూకీ అంతర్జాతీయ పరిశీలకులు ఎవరైనా రావచ్చు శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆంగ్సాన్సూకీ యాంగాన్ : వలసవెళ్లిన శరణార్థులు తిరిగి దేశానికి రావచ్చని.. మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీ మంగళవారం ప్రకటించారు. రోహింగ్యా ముస్లింలపై ఆగస్టు 25న జరిగిన దాడి తరువాత తొలిసారిగా ఆ దేశం స్పందించింది. ఉత్తర మయన్మార్‌లోని రఖైనా రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండ తరువాత 4 లక్షల 10 వేల మంది రోహింగ్యాలు సరిహద్దు దాటి ఇతర దేశాలకు వలస వెళ్లారు. దీనిపై తొలిసారి మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలు తిరిగి దేశానికి రావచ్చు.. అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలతోనే చేపడతామని ఆమె స్పష్టం చేశారు. జాతినుద్దేశించిన సూకీ మాట్లాడుతూ.. మతపరమైన అంశాలతో మయన్మార్‌ను విభిజించాలని, ఒక జాతిని నిర్మూలించాలన్న లక్ష్యంతోనూ ప్రభుత్వం పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా శాంతి, సౌఖ్యాలతో జీవించేందుకు ప్రభుత్వం అన్నిసౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. రోహింగ్యాలపై జరిగిన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. దీనిపై ఎంతో మథనపడ్డానని చెప్పారు. ఇది మంచిది కాదు మయన్మార్‌లో జరిగిన మానవహక్కుల ఉల్లంఘన, హింసాత్మక పరిణామాలను సూకీ తీవ్రంగా ఖండించారు. మయన్మార్‌లో మళ్లీ శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు సూకీ వెల్లడించారు. పరిస్థితులపై ఆరా రోహింగ్యాలకు, ఇతర జాతులకు ఎందుకు విభేధాలు వచ్చాయి? రఖైనా రాష్ట్రంలో ఎందుకంత హింస చెలరేగింది? అంటి అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలు తెలుసుకుంటామని సూకీ వెల్లడించారు. రఖైనా రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యాల్లో మెజారిటీ ప్రజలు దేశం కోసం త్యాగాలు చేశారని సూకీ గుర్తు చేశారు. అందరిదీ..! మయన్మార్ అనేది ఏ ఒక్క మతానికి, జాతికో చెందిన దేశం కాదని.. అందరిదీ అని సూకీ చెప్పారు. బర్మా అనే దేశం ఏ అంతర్జాతీయ సమాజానికో, విచారణలకో భయపడదని సూకీ తెలిపారు. ఎవరైనా రావచ్చు.. పరిశీలించవచ్చు! మయన్మార్‌కు అంతర్జాతీయ పరిశీలకుడు, సంస్థలు రావచ్చని.. ఇక్కడి పరిస్థితులలు తెలుసుకోవచ్చని ప్రకటించారు. సూకీ ప్రసంగంలో ముఖ్యాంశాలు -మయన్మార్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పడి 18 నెలలు. ఇన్నేళ్లుగా దేశంలో పేరుకుపోయిన అనేక సమస్యలను, సవాళ్లను మేం ఎదుర్కొంటున్నాం. చాలావాటిని పరిష్కరించగలిగాం. ప్రపంచమంతా రఖైనా రాష్ట్రంమీద దృష్టి పెట్టింది. మేం ధైర్యంగా చెబుతున్నాం. ఏవరైనా.. ఏ సంస్థ అయినా ఇక్కడకు వచ్చి పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవచ్చు. మయన్మార్‌లో శాంతిని పునరుద్దరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రోహింగ్యాలపై జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. ప్రభుత్వం రఖైనా రాష్ట్రంలో తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం. -
రొహింగ్యాల రోదన వినపడదా!
రెండో మాట 40 వేలమంది రొహింగ్యాలు భారత సరిహద్దులు దాటి శరణార్థులై వచ్చారు. తమను వెనక్కి పంపించవద్దన్న శరణార్థుల విన్నపాన్ని వారి తరఫున సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత భూషణ్ న్యాయస్థానానికి నివేదించారు. కానీ అలాంటి హామీని కేంద్రం తరఫున తానివ్వజాలనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కోర్టుకు తెలిపారు. ‘రొహింగ్యాలు చట్ట విరుద్ధంగా ప్రవేశించినవారు. కాబట్టి వారిని వెనక్కి పంపించేస్తాం’ అని చెప్పారు. మన పాలకుల విధానాలన్నీ పరస్పర విరుద్ధంగానే ఉంటున్నాయి. ‘ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ జాతి అయినా హింసకు, ఆకలి దప్పులకు, అవమానాలకు మతం పేరుతోనో, అభిప్రాయభేదాల పేరుతోనో గురైతే మిగతా మానవులు వారి పక్షాన నిలబడడమే నిజమైన పౌరధర్మం.’ – పాలీ వీజిల్ (నోబెల్ బహుమతి గ్రహీత వీజిల్ యూదు జాతీయుడు. జర్మనీలో యూదుల పట్ల సాగిన కిరాతకాలకు ప్రత్యక్ష సాక్షి. ‘నైట్’ అన్న రచనలో ఆయన ఈ మాటలు రాశారు.) ‘చిట్టచివరి బాధాతప్తుడైన మానవుడు విమోచన పొందేవరకు విశ్రమించబోనని గాంధీజీ పదే పదే చెప్పేవారు. నేడు మయన్మార్‌లో శతాబ్దాల తరబడి నివసిస్తున్న రొహింగ్యా ముస్లింలు అక్కడి ప్రభుత్వం నుంచి, సైనిక కిరాతకాల నుంచి ఎదుర్కొంటున్న హింసాకాండ ఫలితంగా ఇరుగు పొరుగు దేశాలకు వలసబాట పట్టవలసి వచ్చినవారు, గాంధీ చెప్పిన ఆ ‘చివరి మానవుడు’ కోవకు చెందినవారే. వీరు ప్రపంచంలోనే అత్యంత పీడన, దోపిడీలకు, కిరాతకాలకు, అణచివేతకు గురవుతున్న మైనారిటీ ముస్లింలు. వీరిని బానిసలుగా వెట్టి చాకిరీ వైపు మయన్మార్ సైన్యం, ప్రభుత్వం నెట్టాయి. ఈ నరమేధంలో దారితప్పి సంకుచిత జాతీయవాదాన్ని ఆశ్రయించిన బౌద్ధమతస్తులు కూడా పాల్గొనడం విచిత్రం’. – ప్రొ. శివవిశ్వనాథన్ (జిందాల్ విశ్వవిద్యాలయం, గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్, 6–9–17) ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్ అణగారిన ఆర్తులలో ఒకరిగా, అనుభవిం చిన కిరాతకాలకు సమాధానంగా అణచివేతపై ఎవరు ఎందుకు ఎప్పుడు తిరగబడలవలసి వస్తుందో పాత్రోచితంగా ప్రేక్షకులకు చూపిస్తాడు. అలాగే ప్రాచీనకాలంలో స్పార్టకస్, నవీన యుగంలో షెగువేరా అణచివేతలకు సమాధానంగా కనిపిస్తారు. తెలుగుప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం రాజ్యపాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా పాలకుల మీద తిరగబడవలసి వచ్చింది. దారుణ జీవన పరిస్థితుల మధ్య, శతాబ్దాల వలస చరిత్ర నుంచి సంక్రమించిన భారాన్ని మోస్తూ కనీసం పౌరసత్వానికి కూడా నోచుకోని దశలో మయన్మార్ రొహింగ్యాలు సైన్యం మీద తిరగబడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దుర్భర స్థితిలో రొహింగ్యాలు ఇలాంటి తిరుగుబాటుకు కూడా పాలకులు ‘ఉగ్రవాద’ ముద్ర వేసి రొహిం గ్యాలను తరిమి కొడుతున్నారు. దీనితో ఇరుగు పొరుగు దేశాలు ఇండియా, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్‌లకు లక్షలాది మంది తరలిపోవలసి వచ్చింది. రొహింగ్యాలను బెంగాల్లో రొహింగులు అని, మయన్మార్ (నాటి బర్మా)లో జోహింగాలు అని పిలుస్తారు. ఈస్టిండియా కంపెనీ పాలకులు (1799 నాటికి) రూయింగాలుగా పేర్కొన్న ఈ ముస్లిం మైనారిటీలు ప్రస్తుతం మయన్మార్‌లో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ వీరి సమస్యను బీజేపీ పాలకుల మాదిరిగా నేటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఉగ్రవాదం ఫలితం’గా చూడడం లేదు. రొహింగ్యా ప్రజా బాహుళ్యాన్ని ఉగ్రవాదులుగా భావించడాన్ని ఖండించారు కూడా. నిజానికి బ్రిటిష్ ఇండియా కాలంలో ఇక్కడ నుంచి కూడా పొట్ట కూటికోసం, ఉపాధి కోసం బర్మాకు వలస వెళ్లడం గురించి కూడా మనకు తెలుసు. మయన్మార్‌లోని ఆరకాన్ రాష్ట్రం, ఉత్తర భాగాన్ని రఖినీ పేరుతో వ్యవహరించేవారు. అలా 15వ శతాబ్దం నాటికే బెంగాలీలు ఆరకాన్ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. నిజానికి చారిత్రక ఆధారాలను బట్టి 8వ శతాబ్దం నుంచే రొహింగ్యా జాతి తెగలు ఉనికిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కాలంలో వారిని ఆర్కనీస్ ఇండియన్లు అని పిలిచేవారు. ఆనాటి నుంచి వీరికి స్థిర నివాసం లేక, ఒక దేశానికి చెందినవారిగా గుర్తింపు లేకుండా ఉండిపోయారు. 2016–17లలో జాతి వివక్ష సంక్షోభం ముదిరే సమయానికి రొహింగ్యా జనాభా పది లక్షలని అంచనా. వాస్తవానికి 8వ శతాబ్దానికి ముస్లిములే మెజారిటీ వర్గీయులు కాగా, హిందువులు మైనారిటీలుగా ఉన్నారని వికీపీడియా చెబుతోంది. ఇది 2013 నాటికి మారింది. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన వేధింపులకు, అవమానాలకు గురైన మైనారిటీలుగా రొహింగ్యాలను ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అలా వీరి సమస్య ప్రపంచం దృష్టికి తెచ్చింది. అయితే శతాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ రొహింగ్యాలకు మయన్మార్‌లో ఎందుకు పౌరసత్వం దక్కలేదో కూడా సమితి వివరించవలసి వచ్చింది. 1982లో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బర్మీస్ పౌరసత్వ చట్టం రొహింగ్యాలకు ఆ హక్కును నిరాకరించింది. నోరు విప్పని నోబెల్ శాంతి దూత అన్నింటికన్నా దారుణమైన విషయం ఒకటి ఉంది. మయన్మార్ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించి, అనేక ఏళ్లపాటు గృహ నిర్బంధానికి గురైన ఆంగ్–సాన్ సూకీని స్వీడిష్ అకాడమీ నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసింది. కానీ సూకీ ఆ స్ఫూర్తిని మరిచి దేశాధినేతగా రొహింగ్యాల ఊచకోతలను నిరోధించలేక పోతున్నారు. సైనిక నాయకత్వంతోపాటు తన ఉనికి కోసం ముస్లిం మైనారిటీలను ‘ఉగ్రవాదులు’గా ముద్ర వేశారు. రొహిం గ్యాలపై మయన్మార్ పాలక శక్తులు సాగిస్తున్న పైశాచిక దాడుల్ని ఐక్యరాజ్య సమితి ఖండించాల్సి వచ్చింది. అక్కడి మానవ హక్కుల పరిస్థితిని వర్ణిస్తూ సమితి ప్రత్యేక ప్రతినిధి, సంధానకర్త ప్రొఫెసర్ యాంఘీ–లీ ముస్లిం మైనారిటీల దుస్థితిని ఇలా వర్ణించాల్సి వచ్చింది (4.9.17): ‘‘ఈ రోజునే కాదు, రొహింగ్యాలను మూకుమ్మడిగా మయన్మార్ నుంచి బలవంతంగా తొలగించే కార్యక్రమం చాలాకాలంగా కొనసాగుతోంది. ముస్లింలకు సైన్యం దాడులవల్ల కల్పించిన ఈ దుస్థితివల్లనే వారు తిరగబడ్డారు. రఖినీ (ఆరకాన్) రాష్ట్రంలో వంద కిలోమీటర్ల పర్యంతం వ్యాపించి ఉన్న రొహింగ్యాల గ్రామాలను ఖాళీ చేయించి సైన్యం ఆ గ్రామాలను తగులబెట్టింది, వేలాదిమందిని చంపేసింది. నేడు రఖినీ రాష్ట్రం ఉడికిపోతూ తీవ్రవాదం రూపం దాల్చింది. 2012 నుంచీ ఈ పరిస్థితుల్లోనే ముస్లిం మైనారిటీలు జీవించవలసి వచ్చింది. వారికి సంచార స్వేచ్ఛ లేదు, అతి మౌలికమైన సేవలు పొందే స్వాతంత్య్రమూ లేదు. వివక్షాపూరిత చట్టాల మధ్యనే రొహింగ్యాలు దశాబ్దాల తరబడి జీవిస్తూ వచ్చారు. అలాంటి దారుణ పరిస్థితుల్లోనే ఎవరైనా సరే ‘లక్ష్మ ణరేఖ’ను దాటి వ్యవహరించడం తేలికే గదా!’’ (4.9.17). అందుకే ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, తర్వాత సమితి తరఫున మయన్మార్‌లో పరిస్థితిని పరిశీలించి నివేదిక సమర్పించిన కోఫీ అన్నాన్ కూడా మయన్మార్ సంక్షోభం తీవ్రవాదం వైపు పోకుండా ఉండాలంటే రొహింగ్యాలకు పౌరసత్వం కల్పించి తీరాలి అని సూచించారు. అయితే, సమితి కమిషన్ నివేదిక వెలువడిన (ఆగస్టు 24) 24 గంటల్లోనే సైన్యం రొహింగ్యాలపై ఆకస్మికంగా విరుచుకుపడింది. ఇది హిందువులకు, రొహింగ్యా ముస్లిం మైనారిటీలకు మధ్య అంతర్యుద్ధంగా మారింది. ఈ పరిస్థితుల్లో మన భారత పాలకుల ధోరణి రోజుకొక తీరుగా మారుతూ వచ్చింది. ప్రధాని మోదీ నేప్యీతా నగరంలో (మయన్మార్ పర్యటనలో) సూకీని సెప్టెం బర్ 6న కలుసుకున్నప్పుడు రొహింగ్యాల సమస్యను కేవలం సూకీ తరహాలోనే ‘ఉగ్రవాద హింసాకాండ’ దృష్టితోనే పరిశీలించారు. ప్రభుత్వ మారణకాండను తప్పించుకుంటూ 40 వేలమంది రొహిం గ్యాలు భారత సరిహద్దులు దాటి శరణార్థులై వచ్చారు. తమను వెనక్కి పంపించవద్దన్న శరణార్థుల విన్నపాన్ని వారి తరఫున సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత భూషణ్ న్యాయస్థానానికి నివేదించారు. కానీ అలాంటి హామీని కేంద్రం తరఫున తానివ్వజాలనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కోర్టుకు తెలిపారు. ‘రొహింగ్యాలు చట్ట విరుద్ధంగా ప్రవేశించినవారు. కాబట్టి వారిని వెనక్కి పంపించేస్తాం’ అని చెప్పారు. కాగా, మయన్మార్ సంక్షోభం ముదిరి ఐక్యరాజ్యసమితి సూకీ ప్రభుత్వ దమన నీతిని ఖండిస్తూ ప్రకటనలు విడుదలవుతున్న సంగతి గమనించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ‘రొహింగ్యాలు మయన్మార్‌కు వెళ్లి అక్కడే ఉంటే వారికి ఇండియా సహాయం అందిస్తుంద’ని ప్రకటించారు. ఎందుకంటే, అస్సాంకు బంగ్లాతో 262 కిలోమీటర్ల సరిహద్దు ఉండటమేగాక, ఈశాన్య భారతంలోని మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లతో కూడా సరిహద్దులున్నాయి. బహుశా అందుకే బీజేపీ పాలనలో ఉన్న అస్సాం, మణిపూర్ ప్రభుత్వాలను ‘రొహింగ్యా ముస్లిములు సరిహద్దు దాటి ప్రవేశించే పక్షంలో వెనక్కి నెట్టేయండి’ అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించి ఉంటుంది (15.9.17). పరస్పర విరుద్ధ విధానాలు మన పాలకుల విధానాలన్నీ పరస్పర విరుద్ధంగానే ఉంటున్నాయి. ఎవరు ఏ దేశం వారైనా, ఏ ఇబ్బందుల్లోనైనా మరొక దేశ ప్రభుత్వం నిరంకుశమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలు తమపై విధించిన సమయంలోనే– అలాంటి వారికి మన దేశం ఆశ్రయం కల్పించిందా లేదా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భారత ఉపఖండ విభజన తర్వాత ఇండియా–పాకిస్తాన్‌లుగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్లో భాగమైన తూర్పు పాకిస్తాన్‌ను ప్రధాని ఇందిరాగాంధీ విడగొట్టి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా– ఎన్ని వేలు, లక్షలమంది కాందిశీకులై పశ్చిమ బెంగాల్ సహా మరెన్ని భారత రాష్ట్రాల్లో ప్రవేశిం చలేదు? బాధల్లో ఉన్న ఎంతమందికి మనం ఆశ్రయం ఇవ్వలేదు? కశ్మీర్ సమస్యవల్ల ఎంతమంది కాందిశీకులయ్యారు? బంగ్లాదేశ్ ఏర్పాటు ఫలి తంగా మరికొందరు ముస్లిం మైనారిటీలు భారతదేశానికే కాదు, మయన్మార్‌కు సైతం పెద్ద సంఖ్యలో శరణార్థులైపోయారా లేదా? అలాగే శతాబ్దాల తరబడి బర్మా సమాజంలో అంతర్భాగమైపోయిన రొహింగ్యా ముస్లింలను భాగం కాదంటే కుదరదు గదా! కానీ, సిరియా, సూడాన్ ఆంతరంగిక సంక్షోభాలతో కాందిశీకులై వెడుతున్న ప్రజల్ని రావద్దని అడ్డుకుంటున్న పశ్చిమ దేశాల ప్రభుత్వాల్ని విమర్శించగల స్థితిలో మనం ఉన్నామా? మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ మాటల్లో చెప్పాలంటే ‘‘వోల్గా తీరంనుంచి గంగానదీ తీరం దాకా సాగిన మానవ వలసలన్నీ (వోల్గా–సే–గంగా) చరిత్రలో అంతర్భాగమేగానీ వేరు కాదని గుర్తించవలసిన ఘడియలు మరొకసారి వచ్చాయి. ‘వసుదైక కుటుం బాన్ని’ నిత్యం గుర్తుచేసే ఉపనిషత్ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఏకం కావల్సిన సమయం ఇదే?!
రోహింగ్యాల మూలాలు లేవు వాళ్లంతా బంగ్లా వలసదారులే రోహింగ్యాలకు ఉగ్రవాదులతో సంబంధాలు యాంగాన్ : రోహింగ్యాల విషయంలో మయన్మార్ వాసులంతా ఏకం కావాలని.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ హలియాంగ్ ఆదివారంనాడు పిలుపునిచ్చారు. మయన్మార్‌లో రోహింగ్యాల మూలాలు ఎక్కడా లేవని.. ఆయన పేర్కొన్నారు. గత నెల 25న రోహింగ్యా మిలిటెంట్లు పోలీస్ పోస్ట్‌లపై క్రమపద్ధతిలో దాడులు చేశారని అన్నారు. ఈ ఘటన అనంతరమే సైన్యం ఉత్తర రఖైనే రాష్ట్రంలో మిలిటెంట్ల ఏరివేతకు దిగింది. మిలిటెంట్ల ఏరివేతకు ప్రయత్నిస్తున్న తరుణంలో భారీగా హింస చెలరేగింది. దీంతో సరిహద్దుల్లో ఉన్న 4 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాకు శరణార్థులుగా వెళ్లారని.. చెప్పారు. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి పేర్కొంటున్నట్లు.. జాతి నిర్మూలనకు మా సైన్యం దిగలేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. అసలు రోహింగ్యాల మూలాలు మా దేశంలో ఎందుకుంటాయని ఆయన ఎదురు ప్రశ్నించారు. మయన్మార్‌కు స్వతంత్రం వచ్చాక.. నాటి తూర్పుపాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వలస వచ్చారని.. వారే తరువాత రోహింగ్యా ముస్లింలుగా స్థిరపడ్డారని ఆర్మీ చీఫ్ చెబుతున్నారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల నుంచి సైన్యం వ్యతిరేక ప్రచారం చేస్తోందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే స్థానిక బౌద్ధులు.. సైన్యానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశ సరిహద్దులు దాటి శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలను ఇక దేశంలోకి అనుమతించేదిలేదంటూ మయన్మార్ ప్రభుత్వం సూచనప్రాయంగా ప్రకటించింది. వలస వెళ్లిన రోహింగ్యాలకు అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని సైన్యాధిపతి స్పష్టం చేస్తున్నారు. -
రోహింగ్యాలను హింసిస్తున్న సైన్యం : అమ్నెస్టీ
ఢాకా: రోహింగ్యాలపై ఒక క్రమపద్దతిలో మయన్యార్ సైన్యం హింసిస్తోందని అమ్నెస్టీ సంస్థ ప్రకటించింది. అమ్నెస్టీ ప్రకటనతో మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమ్నెస్టీ నివేదికపై ఐక్యరాజ్యసమితి కార్యదర్శి రెక్స్ టెలిర్సన్ మాట్లాడుతూ రోహింగ్యాలపై దాడులు చేయడాన్ని, వారు నివసిస్తున్న గ్రామాలపై సైన్యం దాడి చేస్తూ వారిని ఒక క్రమపద్ధతిలో హింసించడాన్ని ఎవరూ సమర్ధించరని అన్నారు. మయన్మార్‌లో బౌద్ధులు-రోహింగ్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. 3 లక్షల 91 వేలమంది వలస వెళ్లినట్లు ఆయన ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ఒక జాతికి చెందిన వ్యక్తులు వలస వెళ్లడం ఇదే తొలిసారి కావచ్చని రెక్స్ టెలిర్సన్ చెప్పారు. మయన్మార్‌లో గ్రామాలకు గ్రామాలను వదలి రోహింగ్యాలు ప్రాణరక్షణ కోసం వెళుతున్నారని చెప్పారు. ప్రస్తుత దారుణ పరిస్థితులను చక్కదిద్దేందుకు సహకరించాలని ఆంగ్‌సాన్ సూకీని కోరినట్లు రెక్స్ తెలిపారు. -
2లక్షల 40 వేలు : మయన్మార్‌ను వీడిన చిన్నారులు
సాక్షి : మయన్మార్‌లో నెలకొన్న వివాద పరిస్థితుల నేపథ్యంలో భారీగా రోహింగ్యాలు బంగ్లా వలసబాట పట్టారు. గత మూడు వారాల్లోనే సుమారు 2 లక్షల 40 వేల మంది రోహింగ్యా చిన్నారులు బంగ్లాకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకటించింది. మయన్మార్‌లో బౌద్ధులకు-రోహింగ్యాలకు మధ్య అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చిన్నారుల వలసలపై యూనిసెఫ్ అధికార ప్రతినిధి మారిక్సీ మెర్కాడో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 60 శాతం మంది రోహింగ్యాలు అంటే 3 లక్షల 91 వేల మంది వలస వెళ్లినట్లు చెప్పారు. ఇందులో ఏడాదిలోపు ఉన్న చిన్నారుల సంఖ్య 36 వేలు, అలాగే గర్భవతుల సంఖ్య 52 వేలు ఉందని మారిక్సీ అన్నారు. -
రోహింగ్యాలపై దాడిని ఖండించిన ఐరాస
జెనీవా : మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. రోహింగ్యాలపై మయన్మార్‌లో జరుగుతును దాడులపై ఐరాస మండిపడింది. ఒక జాతిపై కక్ష గట్టినట్టు జరుగుతున్న దాడులకు అందరూ సిగ్గుపడాలని సమితి హ్యూమన్ రైట్స్ చీఫ్ జైదీ ఆల్ హసన్ అన్నారు. మయన్మార్‌లో యధేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. -
మోదీ మయన్మార్ యాత్ర
మూడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్‌లో పర్యటించారు. 2014లో ఆయన కేవలం ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మాత్రమే వెళ్లారు. ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల కోసం పర్యటించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం మయన్మార్ అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. గత కొన్ని నెలలుగా అక్కడి సైన్యం రోహింగ్యా ముస్లింలపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గత నెల 25న రోహింగ్యా మిలి టెంట్ సంస్థ రఖినే రాష్ట్రంలో పోలీసు, సైనిక పికెట్లపై దాడులు చేసి 12మంది అధికారులను హతమార్చడంతో ఈ సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత మయన్మార్ భద్రతా దళాలు సాగిస్తున్న దమనకాండ అంతా ఇంతా కాదు. వారి కాల్పుల్లో 400మంది జనం మరణించగా, లక్షన్నరమందికి పైగా పొరుగు నున్న బంగ్లాదేశ్‌కు ప్రాణాలు అరచేతబట్టుకుని వలసపోతున్నారు. ఈ క్రమంలో అనేకమంది నీటిలో మునిగి చనిపోవడం, వ్యాధుల బారిన పడటం సంగతలా ఉంచి మయన్మార్ సైన్యం అమర్చిన మందుపాతరలు పేలి ప్రాణాలు కోల్పో తున్నారు. తీవ్ర గాయాలపాలై బంగ్లాదేశ్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అత్యాచా రాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మయన్మార్‌పై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నది. మానవ హక్కుల్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు చెబుతోంది. ఇలాంటి సమయంలో నరేంద్ర మోదీ మయన్మార్ వెళ్లారు. మన పొరుగు దేశంలో ఒక సంక్షోభం తలెత్తినప్పుడు, ఆ సంక్షోభం ప్రభావం మన దేశంపై కూడా పడకతప్పదని అర్ధమవుతున్నప్పుడు మౌనంగా ఉండటం ఇబ్బందికరమే. పైగా ఆ దేశంలో జరుగుతున్నది మానవ ఉత్పాతం. మెజారిటీగా ఉన్న బుద్ధిస్ట్ల నుంచి మాత్రమే కాదు... వారికి వత్తాసుగా వచ్చిపడే సైన్యం నుంచి కూడా రోహింగ్యాలు అణచివేతను ఎదుర్కొంటూ అక్కడ రెండో తరగతి పౌరులుగా కాలం వెళ్లదీస్తున్నారు. 1978 నుంచి క్రమం తప్పకుండా చెలరేగుతున్న హింసాకాండ వల్ల ఇప్పటికే దాదాపు నాలుగు లక్షలమంది రోహింగ్యాలు పొరు గునున్న బంగ్లాదేశ్‌కూ, మన దేశంతో సహా మరికొన్ని ఇతర దేశాలకూ వలసపో యారు. సముద్రం మీదుగా మలేసియా, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌లకు చేరడం కోసం చిన్న చిన్న పడవల్లో వెళ్లున్న వేలాదిమంది మధ్యలోనే జలసమాధి అవు తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు వెళ్లేవారు కూడా ఇలాంటి ప్రమాదాల్లోనే చిక్కుకుంటున్నారు. మయన్మార్ నుంచి వస్తున్న శరణార్ధుల వల్ల మన దేశానికి కూడా సమస్యలొస్తున్నాయి. అలా వచ్చేవారికి తగిన ఉపాధి చూపలేక ప్రభుత్వ యంత్రాంగం సతమతమవుతున్నది. నరేంద్ర మోదీ పర్యటనలో భారత్–మయన్మార్ల మధ్య సాగర ప్రాంత భద్రత, మయన్మార్ ప్రజాతంత్ర సంస్థల బలోపేతం, ఆరోగ్యం, ఐటీ రంగాల్లో సహకారంతోసహా 11 ఒప్పందాలు కుదిరాయి. రఖినేలో తలెత్తిన రోహింగ్యా సంక్షోభం గురించి...ఆ విషయంలో అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి మోదీ ప్రస్తావించకపోవచ్చుగానీ రఖినే రాష్ట్రంలో మన దేశం విస్తృత స్థాయిలో సహాయ కార్యక్రమాలు అమలు చేయడానికి మాత్రం ఆ పాలకులను ఒప్పించారు. రోహింగ్యాల విషయంలో ఇంతకుమించి ఏమీ చేయలేకపోవడం చాలామందిని నొప్పించి ఉండొచ్చు. మయన్మార్ మానవ హక్కుల హననంపై ఐక్యరాజ్యసమితి, పలు ప్రపంచ దేశాలు మొదలుకొని మన దేశంలోని ప్రజా స్వామ్య ఉద్యమకారుల వరకూ అందరూ ఆగ్రహంతో ఉన్నారు. కానీ ఒకపక్క మన దేశంలో ఉంటున్న రోహింగ్యా శరణార్ధులను అక్రమంగా వలసవచ్చిన వారిగా నిర్ధారించి బలవంతాన పంపేయడానికి సిద్ధపడుతూ మానవహక్కుల గురించి మయన్మార్‌కు ఉద్బోధించడం కష్టం. అదీగాక మయన్మార్‌తో మనకు ఈశాన్యం వైపు 1,600 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది. మిజోరం, మణిపూర్, నాగా లాండ్, అరుణాచల్‌ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాలు ఆ సరిహద్దు పొడవునా ఉన్నాయి. ఎన్ఎస్సీఎన్(ఖాప్లాంగ్) వంటి మిలిటెంట్ సంస్థలు మయన్మార్ భూభాగంలో తలదాచుకుంటూ ఈ రాష్ట్రాల్లో హింసకు పాల్పడుతుంటాయి. మయన్మార్ సహకారం లేనిదే ఇలాంటి వీటిని అదుపు చేయడం అసాధ్యం. దానికితోడు మయన్మార్ సైనిక పాలకులను వ్యతిరేకిస్తే వారు చైనాతో చెలిమి చేసి మన దేశానికి సమస్యలు సృష్టిస్తారన్న భయం ఉండనే ఉంది. ఏతావాతా మన భద్రతే ముఖ్యం తప్ప, పొరుగు దేశంలో ఏం జరిగినా అనవసరం అని మన పాలకులంతా ఎప్పుడో నిర్ణయానికొచ్చారు. ఒకప్పుడు ఈ వైఖరి ప్రస్తుత మయన్మార్ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీకి కోపం తెప్పించింది. ప్రజాస్వామ్య ఉద్యమ సారథిగా 2012లో ఆమె మన దేశం వచ్చినప్పుడు మన పాలకులను నిష్టూరమాడారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, తర్వాతా ప్రజా స్వామిక ఉద్యమాలకు నైతిక మద్దతు అందించిన భారత్ ఆపత్కాలంలో మయ న్మార్ ప్రజలను వదిలిపెట్టిందని ఆనాటి ప్రధాని మన్మోహన్ సమక్షంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి రోహింగ్యాల విషయంలో నరేంద్ర మోదీ ఇప్పుడా పని చేసి ఉంటే సూచీ ఆగ్రహం పట్టలేకపోయేవారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పాలక వ్యవస్థలో భాగంగా మారారు. అయితే మన ప్రయోజనాల పరిరక్షణతోపాటే మయన్మార్ పాలకులు హేతుబద్ధంగా వ్యవహరించేలా చూడటం కూడా అవసరం. ఎందుకంటే ప్రస్తుత సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే మన దేశానికి ఇప్పటికే ఉన్న శరణార్థుల సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. అందువల్ల ఏదో స్థాయిలో మయన్మార్‌కు చెప్పడమే మంచిది. అక్కడి ప్రజాతంత్ర సంస్థల్ని బలోపేతం చేయడమంటే కేవలం ఎన్నికల సంఘంలాంటి సంస్థల నిర్మాణానికి సాయపడటం మాత్రమే కాదు... ప్రజాస్వామిక భావనలను పెంపొందించడం కూడా. ఆ పని చేయడంతోపాటు ఇక్కడున్న రోహింగ్యాలను వెనక్కు పంపే ఆలోచన కూడా మన ప్రభుత్వం మానుకోవాలి. -
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనా, మయన్మార్ దేశాల పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం భారత్ చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు తొలుత చైనా వెళ్లిన మోదీ.. అక్కడ నుంచే మయన్మార్ పర్యటనకు వెళ్లారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం మయన్మార్ వెళ్లిన మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రముఖ చారిత్రక, వారసత్వ కట్టడం శ్వేతగోన్ పగోడాను సందర్శించుకున్నారు. యాంగూన్ రాయల్ లేక్ సమీపంలోని ఈ పగోడాలో బుద్ధ భగవానుని కేశాలు, ఇతర అమూల్య వస్తువులను భద్రపరిచారు. ఈ పగోడాను అత్యంత పవిత్రమైనదిగా బర్మా ప్రజలు భావిస్తుంటారు. పగోడా చుట్టూ బంగారు రేకుల తాపడం ఉంటుంది. దీనిపై 4,531వజ్రాలు పొదిగిన స్తూపం, స్తూపం శిఖరంపై 72 క్యారెట్ల భారీ వజ్రం అమరి ఉంటుంది. శ్వేతగోన్ పగోడాను దర్శించుకోవటం మర్చిపోని అనుభూతి అని మోదీ ట్వీట్ చేశారు. అనంతరం ఆయన బోగ్యోకే అంగ్ సాన్ మ్యూజియంను దర్శించారు. ప్రధాని వెంట మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీ ఉన్నారు. అలాగే, చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్షా జాఫర్(87) సమాధిని మోదీ సందర్శించి, నివాళులర్పించారు. ఉర్దూ కవి, రచయిత అయిన బహదూర్షా 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్ వారికి భయపడి దేశం విడిచి బర్మాలో అజ్ఞాతంలో ఉంటూ ఇక్కడే చనిపోయారు. అమరవీరుల మాసోలియంను దర్శించి, కాలిబారీ ఆలయంలో పూజలు చేశారు. ఆలయంలో ఉన్న ఫొటోతో ఆయన ట్వీట్ చేశారు. చైనాలోని జియామెన్ నగరంలో బ్రిక్స్ దేశాధినేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం మూడు రోజుల ఆయన మయన్మార్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. -
రోహింగ్యాలు: మాకు అతిపెద్ద సవాల్!
నేపితా: మయన్మార్‌లో ముదురుతున్న రోహింగ్యాల సంక్షోభంపై ఆ దేశ ప్రభుత్వ కౌన్సిలర్ ఆంగ్‌సాన్ సూచీ స్పందించారు. 'ఇది మాకు అతిపెద్ద సవాలు..కేవలం ప్రభుత్వంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఈ సవాలును మేం పరిష్కరించాలనడం సహేతుకం కాదు' అని ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు. 'రఖైన్ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా.. సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలనకు ముందునుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రోహింగ్యా ముస్లింలలో ఉగ్రవాదులెవరో, సామన్యులెవరో మేం గుర్తించాల్సి ఉంది. ఈ సమస్య గురించి భారత్‌కు బాగా తెలుసు' అని ఆమె అన్నారు. 'మా పౌరులను కాపాడటం మా కర్తవ్యం. అందుకు మేం తీవ్రంగా కృషిచేస్తున్నాం. కానీ మాకు తగినంతగా వనరులు అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరికీ చట్టబద్ధమైన రక్షణ లభించేలా మేం చూడాలనుకుంటున్నాం' అని సూచి అన్నారు. ప్రధాని మోదీ తాజాగా మయన్మార్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో రోహింగ్యాల సంక్షోభంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సవాళ్లతో ఇబ్బందిపడుతున్న మయన్మార్‌కు భారత్ అండగా ఉంటుందని హామీనిచ్చారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో అతివాద హింస నేపథ్యంలో ఆ దేశ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుందన్నారు. మయన్మార్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో ప్రధాని విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్ సైన్యం దాడులతో దాదాపు 1.25 లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలసవెళ్లిన నేపథ్యంలో ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘రఖైన్ రాష్ట్రంలో అమాయకులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అతివాద హింసపై మయన్మార్ ఆందోళనల్ని భారత్ అర్థం చేసుకుంది. మయన్మార్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కోసం సంబంధిత పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలి’ అని మోదీ సూచించారు. -
అక్కడికి వెళ్లడం కంటే ఇక్కడే చచ్చిపోతాం!
తిరిగి పంపించేస్తామన్న కేంద్రం తీరుపై రోహింగ్యాల ఆవేదన న్యూఢిల్లీ: బర్మాలో మేం ప్రశాంతంగా పడుకున్న రోజు ఒక్కటి కూడా లేదు. ఎప్పుడైనా ఆర్మీ వచ్చి విరుచుకుపడేది.. ఇక్కడ చెత్తకుప్ప పక్కన నివసిస్తున్నా రాత్రి ఎలా గడుస్తుందన్న ఆందోళన మాకు లేదు.. దక్షిణ ఢిల్లీ షహీన్‌బాగ్‌లో చెత్తకుప్ప పక్కన నివసిస్తున్న నూర్ ఆలం మాట ఇది. ఇక్కడ 74 రోహింగ్యా కుటుంబాలు శరణార్థులుగా జీవిస్తున్నాయి. 12మంది కుటుంబసభ్యులతో బతుకు వెళ్లదీస్తున్న నూర్ ఆలం.. ఇక్కడ పేదరికంలో ఉన్నా ఆనందంగానే ఉన్నామని చెప్తున్నారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యా తిరుగుబాటుదారులకు, ఆర్మీకి మధ్య ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధాన్ని తప్పించుకొని.. ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగుదేశాలకు వలస వచ్చిన వేలాదిమంది రోహింగ్యాలలో నూర్ ఆలం ఒకరు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన కిరాతకమైన తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌ను తప్పించుకొని నూర్ ఆలం బర్మాను వీడారు. ఈ రక్తపాతంలో ఆయన దూరపు కుటుంబసభ్యులంతా మృతిచెందారు. 15రోజులపాటు నడిచి బంగ్లాదేశ్ చేరుకొని.. అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవేశించారు. 'తూటా నుంచి ఎవరైతే తప్పించుకున్నారో వారే బర్మా నుంచి బయటపడ్డారు' అని నూర్ ఆలం గుర్తుచేసుకుంటారు. తాజాగా రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యాలకు, ఆర్మీకి మధ్య ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో రోహింగ్యాలను దేశంలోకి అనుమతించకూడదని, దేశంలోని 40వేల మంది శరణార్థులను తిరిగి మయన్మార్ పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. రోహింగ్యాలను తిరిగి స్వదేశానికి పంపిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై నూర్ ఆలం ఆవేదన వ్యక్తం చేశారు. 'మయన్మార్ తిరిగి వెళ్లేందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ మాకో పరిష్కారం కావాలి. అది మా దేశం. మా ఇల్లు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కంటే ఇక్కడ చావడమే ఉత్తమం' అని 41 ఏళ్ల ఆయన అన్నారు. రోహింగ్యాలను తిరిగి పంపించేయాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ అది వీలుపడే అవకాశం కనిపించడం లేదు. మయన్మార్ సర్కారు రోహింగ్యాలను అసలు తమ పౌరులుగానే గుర్తించకపోవడంతో వారిని తిరిగి స్వదేశంలోకి అనుమతిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మయన్మార్‌లో రోహింగ్యాల రోదన..! -
దేశం కోసమే..
♦ సర్జికల్ దాడులు, నోట్లరద్దు, జీఎస్టీపై మోదీ ♦ భారత సంతతి ప్రజలతో ప్రధాని సమావేశం యాంగాన్: భారతదేశ ప్రయోజనాల్లో భాగమే నోట్లరద్దు, సర్జికల్ దాడులు, జీఎస్టీ నిర్ణయాలని ప్రధాని పేర్కొన్నారు. మయన్మార్‌లో భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి బుధవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘రాజకీయాలపై కంటే దేశమే ముఖ్యమని భావించడం వల్లే అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోగలుతున్నాం. సర్జికల్ దాడులు, నోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ఏ నిర్ణయమైనా ఎలాంటి భయం, సంకోచం లేకుండా తీసుకున్నాం’ అని చెప్పారు. నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ.. ‘నల్లధనం, అవినీతి నిర్మూలనకు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆదాయపు పన్ను చెల్లించకుండా బ్యాంకుల్లో కోట్లు దాచుకున్న లక్షల మందిని గుర్తించగలిగాం. మనీ ల్యాండరింగ్‌తో సంబంధమున్న రెండు లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ల్ని రద్దు చేశాం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక నిజాయతీగా వ్యాపారం చేసే వాతావరణాన్ని కల్పించాం. సంస్కరణలే కాకుండా దేశ పరివర్తన కోసం కృషిచేస్తున్నాం. 2022 నాటికి నవభారతాన్ని నిర్మించడమే లక్ష్యం’ అని అన్నారు. ‘అభివృద్ధి ఫలాల్ని పొరుగుదేశాలతో పంచుకోవాలని భారత్ విశ్వసిస్తుంది. కష్టసమయాల్లో సాయపడుతోంది. కొన్ని నెలల క్రితం సార్క్ దేశాల కోసం దక్షిణాసియా శాటిలైట్‌ను ప్రయోగించాం. నేపాల్ భూకంపం, మాల్దీవుల్లో తాగునీటి సమస్య, మయన్మార్ తుపాను సమయంలో భారత్ ముందుగా స్పందించింది’ అని చెప్పారు. ్ర బిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలకు గుర్తుగా నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) స్మారకాన్ని మయన్మార్‌లో ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. ‘మీ రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తా’ అని మయన్మార్‌లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇచ్చిన పిలుపునకు వేలాది మంది స్పందించారని మోదీ గుర్తుచేశారు. -
శరణార్థుల సమస్య తీవ్రం..
- ముదిరిన రోహింగ్యాల సంక్షోభం... - నగరంలోనూ దాదాపు 3,800 మంది రోహింగ్యాలు.. రోహింగ్యా శరణార్థుల సమస్య తీవ్రరూపం దాల్చింది. మయన్మార్ (బర్మా)లో అల్పసంఖ్యాక ముస్లిం తెగకు చెందిన వీరిపై హత్యాకాండ, దాడులు సాగుతుండటంతో బంగ్లాదేశ్ తదితర పొరుగు దేశాలకు పెద్ద ఎత్తున వలసలు పోటెత్తుతున్నాయి. గత నెల 25న మయన్మార్ సైనికస్థావరంతో పాటు, పోలీస్ ఔట్‌పోస్టులపై ‘ఆరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ’ మిలిటెంట్ గ్రూపు దాడి ఘటనలో 12 మంది సైనికులతో పాటు 59 మంది రోహింగ్యా తిరుగుబాటుదారులు మరణించారు. ఆ తర్వాత జరిగిన దాడులు, సైనికచర్యల్లో 400 మంది వరకు ఈ తెగవారు హతం కాగా మళ్లీ మూకుమ్మడి వలసల్లో భాగంగా రెండులక్షలకు పైగా శరణార్థులు బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. మారుమూల సెయింట్ మార్టిన్ దీవిలో తలదాచుకున్న రెండువేల మంది రోహింగ్యాలను బంగ్లాదేశ్ అధికారులు బలవంతంగా తిరిగి వారి దేశానికి పంపించారు. మయన్మార్‌లో గత పదిరోజుల్లో చోటు చేసుకున్న హింస కారణంగా 1,23,600 మంది శరణార్ధులు బంగ్లాదేశ్‌లోకి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి వాలంటీర్లు వెల్లడించారు. తాజా సంక్షోభానికి పూర్వమే దాదాపు నాలుగు లక్షల మంది బంగ్లాదేశ్‌లోకి రావడంతో ఇక శరణార్థులను అనుమతించేది లేదంటూ ఆ దేశం స్పష్టంచేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో పాటు మలేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, భారత్‌లలో రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు. మనదేశంలో నలభై నుంచి యాభై వేల మంది రోహింగ్యా శరణార్దులున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరీ రోహింగ్యాలు...? బౌద్ధ మతస్తులు మెజారిటీగా (5 కోట్ల జనాభా) ఉన్న మయన్మార్‌లో దాదాపు 12 లక్షల జనాభాతో బెంగాలీ మాండలికం మాట్లాడే రోహింగ్యాలు ప్రధానంగా రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఆ దేశంలో అధికారికంగా గుర్తించిన 135 జాతుల్లో లేకపోవడంతో వారికి పౌరసత్వం లభించడంలేదు. కనీసం గుర్తింపుకార్డులు ఇవ్వకపోగా, ఏ హక్కులూ కల్పించలేదు. పౌరులుగా గుర్తింపు పొందాలంటే 60 ఏళ్ల పాటు ఆ దేశంలో ఉన్నట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. రోహింగ్యాలను అక్రమ బంగ్లాదేశీ వలసదారులుగానే అక్కడి అధికారులు పరిగణిస్తుంటారు. పాలకుల విధానాలు కూడా వీరికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రేరేపిత హింస కారణంగా 1942లో బర్మా జాతీయుల చేతుల్లో దాదాపు లక్ష మంది వరకు రోహింగ్యాలు హత్యకు గురయ్యారు. 1978లో డ్రాగన్కింగ్ పేరిట చేపట్టిన సైనిక చర్యలో అనేక అకృత్యాలు చోటుచేసుకున్నాయి. దాదాపు మూడులక్షల మంది బంగ్లాదేశ్‌కు పారిపోగా, వారికి ఆహారపదార్ధాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతో చాలా మంది మృత్యువు బారినపడ్డారు. మళ్లీ 1991లో రోహింగ్యాలపై బర్మా ఆర్మీ దాడులకు దిగడంతో 2.68 లక్షల మంది బంగ్లాదేశ్ చేరుకోగా వారిలో 60 శాతం మందిని ఆ దేశం తిప్పి పంపించింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సాగిన మిలటరీ పాలనలో సైన్యంతో పాటు, మెజారిటీ వర్గాల దాడులు కొనసాగి మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయి. మళ్లీ 2012 అక్టోబర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత పెద్ద సంఖ్యలో వలసలు చోటుచేసుకున్నాయి. సాక్షి నాలెడ్జ్ సెంటర్ భారత్‌లో.. దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులతో పాటు, 40 వేల మంది రోహింగ్యా శరణార్థులనుతిప్పి పంపించనున్నట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజూ ప్రకటించారు. వీరి వివరాలను సేకరించాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. పొరుగుదేశాల శరణార్దులను ఆదుకున్న సుదీర్ఘచరిత్ర భారత్‌కు ఉన్నందున, వీరిని బలవంతంగా మయన్మార్‌కు పంపించవద్దని హ్యుమన్ రైట్స్ వాచ్ సంస్థ కోరింది. భారత్‌లో ప్రధానంగా జమ్మూ కశ్మీర్, తెలంగాణ, హరియాణా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్‌లో రోహింగ్యాలు ఉంటున్నారు. వీరిలో దాదాపు 3,800 మంది హైదరాబాద్‌లోని బాలాపూర్, పాతబస్తీలోని 16 సెటిల్మెంట్లలో నివసిస్తున్నారు. ఇక్కడి లేబర్ అడ్డాల్లో కూలీలుగా, చెత్త ఏరుకునే వారుగా, చిరువ్యాపారులుగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. వీరి దుస్థితి పట్ల ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సానుభూతిని వ్యక్తం చేయడంతో ఈ ఉగ్రవాద గ్రూపు వైపు ఈ వర్గం వారు ఆకర్షితులవుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
రోహింగ్యాలను భారత్ ఎందుకు రానివ్వడం లేదు!
న్యూఢిల్లీ: మయాన్మార్లో రోహింగ్యా ముస్లిం తెగ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు వారి వలస కొనసాగుతుండగా.. మరోవైపు దేశంలోని రోహింగ్యా ప్రజలను తిరిగి స్వదేశానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రోహింగ్యాలను డిపోర్ట్ చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుపాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో రోహింగ్యాలు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? తదితర వివరాలివి.. రోహింగ్యాలు ఎవరు? మయన్మార్‌లోని పురాతన జాతులలో రోహింగ్యా ముస్లిం మైనారిటీ తెగ ఒకటి. కానీ, 1982లో మయన్మార్ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో 135 స్థానిక జాతులలో ఒకటిగా రోహింగ్యాలను గుర్తించలేదు. దీంతో, వారికి పౌరసత్వాన్ని నిరాకరించినట్టయింది. రోహింగ్యాలను 'బెంగాలీ'లుగా మయన్మార్ ప్రభుత్వం ముద్రవేస్తోంది. ఇటీవలికాలంలోనే బంగ్లాదేశ్ నుంచి రఖినె రాష్ట్రంలోకి రోహింగ్యాలు వలస వచ్చారని చెప్తోంది. మయన్మార్‌లో రోహింగ్యా పదాన్ని నిషిద్ధంగా భావిస్తారు. ఎంతమంది ఉన్నారు? మయన్మార్‌లో దాదాపు 10లక్షలమంది రోహింగ్యాలు ఉన్నారు గత ఆగస్టు 25 నుంచి 1.23 లక్షలమంది బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిపోయారు. జమ్మూ, హైదరాబాద్, ఢిల్లీ రాజధాని ప్రాంతం, హరియాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో దాదాపు 40వేలమంది రోహింగ్యాలు నివసిస్తున్నారు. భారత్‌లో శరణార్థుల చట్టం లేదు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు 1951లో ఐరాస తీసుకొచ్చిన తీర్మానంపైగానీ, 1967నాటి ప్రోటోకాల్పైగానీ భారత్ సంతకం చేయలేదు. కేసు టు కేసు ప్రాతిపదికన తాత్కాలిక పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది శరణార్థుల అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదిస్తే.. వారికి దీర్ఘకాలిక వీసా (ఎల్టీవీ)ని అందజేస్తుంది. ఏడాదికోసారి ఈ వీసాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీవీ పొందేవారు దేశంలోని ప్రైవేటు సెక్టార్లో పనిచేయవచ్చు. బ్యాంకింగ్, విద్య వంటి సదుపాయాలు పొందొచ్చు. కానీ, శరణార్థులను అక్కున చేర్చుకున్న భారత్! భారత్‌లో శరణార్థుల చట్టం లేకపోయినా.. అనేకమంది బాధితులకు భారత్ ఆశ్రయం కల్పించింది. టిబేటన్లు, బంగ్లాదేశ్‌కు చెందిన చక్మాస్లు, అఫ్గాన్లు, శ్రీలంకకు చెందిన తమిళులకు భారత్ ఆశ్రయమిచ్చి ఆదుకుంది. లక్షమంది టిబేటన్లు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ల్యాండ్ లీజు తీసుకోవడంతోపాటు ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తమిళనాడులో శ్రీలంక శరణార్థులు లక్షకుపైగానే ఉన్నారు. ప్రభుత్వ సాయాన్ని పొందుతున్నారు. ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు దేశంలో నివసించేందుకు వీలుగా భూ కొనుగోలుకు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఆధార్ కార్డులు పొందేందుకు 2016లో మోదీ ప్రభుత్వం అనుమతించింది. రోహింగ్యాలపై ప్రభుత్వం ఏమంటోంది? దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులందరినీ స్వదేశాలకు పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. ఎందుకంటే.. ఉగ్రవాద గ్రూపుల రిక్రూట్మెంట్కు వలసదారులు ఉపయోగపడుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. వలసదారులు భారతీయ పౌరుల హక్కులను దెబ్బతీయడమే కాకుండా.. భద్రతకు తీవ్ర సవాలుగా పరిణమిస్తున్నారు. వలసదారులు పోటెత్తుతుండటం వల్ల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సవాళ్లు తలెత్తుతున్నాయి. ఈ వలస వల్ల జనాభాపరంగా భారత భౌగోళిక ముఖచిత్రం మారిపోతోంది. రోహింగ్యాలను పంపడం సాధ్యమేనా? రోహింగ్యాలను తిరిగి వెనుకకు తీసుకోవాలని భారత్ బంగ్లాదేశ్, మయన్మార్‌లతో చర్చలు జరుపుతున్నా.. అసలు రోహింగ్యాలది తమ దేశమే కాదని, వారికి పౌరసత్వమే లేదని మయన్మార్ వాదిస్తుండటంతో ఇది కష్టసాధ్యంగా మారింది. -
ఆంగ్ సాన్ సూకీతో ప్రధాని మోదీ భేటీ!
నేపిథా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయం మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో భేటీ అయ్యారు. భారత్-మయన్మార్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 'విలువైన స్నేహితుడితో భేటీ కొనసాగుతోంది. సూకీతో మోదీ భేటీ అయ్యారు' అని భారత విదేశాంగశా అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. రఖినె రాష్ట్రంలోని రోహింగ్యా తెగ ముస్లింల మహావలస కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మయన్మార్ పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మయన్మార్‌లో మెజారిటీ ప్రజలైన బౌద్ధులు రోహింగ్యాలపై హింసాత్మక దాడులకు దిగుతున్న నేపథ్యంలో రోహింగ్యాలు ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగుదేశాలకు పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు. సూకీతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ రోహింగ్యాల వలస అంశాన్ని లేవనెత్తే అవకాశముందని భావిస్తున్నారు. దేశంలోకి పెద్ద ఎత్తున సాగుతున్న రోహింగ్యాల వలసలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40వేల మంది రోహింగ్యాలను స్వదేశానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది. భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భావిస్తున్నట్టు మయన్మార్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. సూకీతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మయన్మార్ ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. భారత్‌ను సందర్శించాలనుకునే మయన్మార్ వాసులకు ఉచితంగా వీసాలు ఇస్తామని తెలిపారు. భారత్‌లోని జైళ్లలో మగ్గుతున్న 40 మంది మయన్మార్ పౌరులను విడుదల చేస్తామని ప్రకటించారు. -
మయన్మార్ చేరుకున్న ప్రధాని మోదీ
-
బతకాలంటే దేశం దాటాల్సిందే
పిల్లాజెల్లా, తట్టాబుట్టాతో నీటిలో ఈదుకుంటూ వెళ్తున్న వీరంతా మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింలు. మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు మితిమీరడంతో బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందేందుకు బయల్దేరారు. ఇలా ప్రాణాలు అరచేతపట్టుకుని గత 10 రోజుల్లో బంగ్లాదేశ్‌కు దాదాపు 1,23,000 మంది వలసపోయారు. గత 24 గంటల్లో 35,000 మంది సరిహద్దు దాటారు. -
మయన్మార్ చేరుకున్న ప్రధాని మోదీ
మయన్మార్: చైనా పర్యటన ముగించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మయన్మార్ చేరుకున్నారు. దేశ రాజధాని నెపిడా చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. నెపిడాలో కాలు పెట్టడంతో తన మయన్మార్ పర్యటన ప్రారంభమైందని ప్రధాని ఈ సందర్భంగా ట్విట్ చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆయన చర్చలు జరపనున్నారు. మయన్మార్‌లో మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు హ్యూటిన్ జా తో భేటీ కానున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు, మయన్మార్ పశ్చిమ ప్రాంతమైన రఖీనే రాష్ట్రంలో పెరుగుతున్న హింసాకాండపై ప్రధాని చర్చించనున్నారు. అలాగే మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీతో భేటీ అవుతారు. కాగా బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యేందుకు మోదీ ఆదివారం చైనా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. -
మయన్మార్‌లో మారణకాండ
► కొత్తగా బంగ్లాకు 87 వేల మంది రోహింగ్యా శరణార్థులు ► సిద్ధంగా మరో 20వేల మంది కాక్స్‌బజార్/న్యూఢిల్లీ: మయన్మార్‌లో చెలరేగిన హింస కారణంగా గత పది రోజుల్లోనే దాదాపు 87,000 మంది రోహింగ్యా ముస్లింలు రఖైన్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి మరో 20 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింస వల్ల ఈ వలసలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది.భారీ వర్షాలకు నిలువనీడ లేక బంగ్లా ప్రభుత్వం ఏర్పరచిన శిబిరాల సమీపంలోనే రోహింగ్యాలు అందరూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ హింసలో 86 మంది హిందువులు మృతి చెందడంతో దాదాపు 500 మంది హిందువులు రోహింగ్యాలతో కలసి బంగ్లాదేశ్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్ సైన్యం దాడుల నేపథ్యంలో పదుల సంఖ్యలో రోహింగ్యాలు బుల్లెట్ గాయాలతో కాక్స్బజార్లోని సదర్ హాస్పిటల్లో చేరినట్లు వైద్యాధికారి షాహిన్ అబ్దుర్ రెహ్మన్ చౌధురీ తెలిపారు. బ్రిటిష్ వారి హయాంలో అప్పటి అవిభక్త బెంగాల్ నుంచి వెళ్లి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో స్థిరపడ్డ రోహింగ్యా ముస్లింలను పౌరులుగా గుర్తించడానికి మయన్మార్ పాలకులు నిరాకరిస్తూనే వచ్చారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలాఉండగా, భారత్‌లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిప్పిపంపే విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. రోహింగ్యాలను తిప్పిపంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సవాల్ చేశారు. -
400 మంది ముస్లింలు ఊచకోత
-
400 మంది ముస్లింలు ఊచకోత
సాక్షి, రఖైన్: సుగంధ ద్రవ్యాల సువాసనలతో అలరారే మయన్మార్ మట్టి రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడిసింది. రఖైన్ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా ఆర్మీ పోస్టులపై రోహింగ్యా మిలిటెంట్లు విరుచుకుపడటంతో వారిని అడ్డుకునేందుకు ఆర్మీ నరమేధానికి దిగాల్సివచ్చింది. మత ఘర్షణల్లో సుమారు 400 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఆ దేశ సైనికాధిపతి మిన్ ఆంగ్ హ్లెయింగ్ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో అత్యధికులు బౌద్ధ మతస్థులు. ఆ దేశంలో నివసించే రోహింగ్యా ముస్లింల సంఖ్య చాలా తక్కువ(మైనారిటీ). దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు రఖైన్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. బర్మాలో బౌద్ధులకు, రోహింగ్యా ముస్లింలకు మధ్య విభేదాలు కొత్తవేమీ కాదు. గత ఐదేళ్లుగా ఈ మత పరమైన సంక్షోభం బర్మాలో కొనసాగుతూనే ఉంది. సైన్యం, రోహింగ్యా ముస్లింల మధ్య జరుగుతున్న మారణహోమంలో రఖైన్ రాష్ట్రంలో వందల కొద్దీ గ్రామాలు తగులబడిపోయాయి. ఎంతలా అంటే వాటి ఆనవాళ్లు కూడా తెలుసుకోలేనంతలా. సైన్యం మీద కక్ష్యతో రోహింగ్యా మిలిటెంట్లు మారుమూల గ్రామాలకు నిప్పు పెడితే.. సైనికులు రోహింగ్యా ముస్లింలు దాగి ఉన్నారనే ఆరోపణలతో గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. దీంతో వణికిపోతున్న సామాన్య రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోతున్నారు. బంగ్లాదేశ్‌కు చేరేందుకు అడ్డుగా ఉన్న నాఫ్ నదిని దాటేందుకు తాత్కాలిక పడవలను ఆశ్రయించారు. అయితే, అవి మార్గం మధ్యలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊచకోతలపై దేశ వ్యాప్తంగా పుకార్లు చెలరేగడంతో అశాంతి నెలకొంది. రఖైన్ రాష్ట్రం జాతి, మతపరంగా చీలిపోయింది. ఊచకోతలో మరణించిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని, మిలటరీ దళాలు తక్కువ మంది మరణించినట్లు లెక్కలు చూపుతున్నాయని స్వచ్చంద సంస్ధలు ఆరోపిస్తున్నాయి. జాతిని కూకటివేళ్లతో పెకలించేందుకే.. రోహింగ్యా జాతిని నశింపజేసేందుకు సైన్యం, బౌద్ధులు యత్నిస్తున్నారని స్వచ్చంద సంస్థల ఆరోపణ. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కూడా మయన్మార్‌పై ఇదే ఆరోపణ చేశారు. బర్మాలో చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకూ 27 వేలకు పైగా రోహింగ్యా ముస్లింలు పారిపోయినట్లు ఐరాస ఓ ప్రకటనలో పేర్కొంది. మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. పౌరుల ప్రాణాలను కాపాడాలని మయన్మార్ ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. -
మయన్మార్ ఉగ్రదాడుల్లో 89 మంది మృతి
-
మయన్మార్ ఉగ్రదాడుల్లో 89 మంది మృతి
మాంగ్డా: మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో 12 మంది భద్రతాదళ అధికారులు, 77 మంది మిలిటెంట్లు మరణించారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. అరాకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఎఆర్‌ఎస్‌ఏ) అనే ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రకటించింది. -
మయన్మార్‌లో మారణకాండ
- బంగ్లా సరిహద్దు రఖీనేలో తీవ్రవాదుల దాడి - 70 మంది మృతి.. వందల మందికి గాయాలు నెపిటా: మయన్మార్‌లో మరోసారి రక్తపుటేరులు పారాయి. బంగ్లాదేశ్ సరిహద్దులోని రఖీనే రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్రవాదులు జరిపిన భీకర దాడుల్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోగా, వందలమంది గాయపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడికి పాల్పడింది రోహింగ్యా ముస్లిం(బెంగాలీ) తీవ్రవాదులేనని మయన్మార్ ఆర్మీ అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బంగ్లా సరిహద్దులోని మంగ్టావ్ పోలీస్ స్టేషన్‌ను తీవ్రవాదులు పేల్చేశారని, అదే సమయంలో రఖినేలోని కొన్ని పోలీస్ స్టేషన్లు, ఆర్మీ క్యాంపులపైనా దాడులు జరిగాయని, మొత్తం 200 మంది తీవ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని, కొందరు సాధారణ పౌరులు కూడా చనిపోయారని ఆర్మీ వర్గాలు చెప్పారు దశాబ్ధాల వైరం: బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే రఖీనే రాష్ట్రంలోకి రొహింగ్యా ముస్లింల వలసలు ఎక్కువ. దీంతో స్థానిక ప్రజలకు, వలసదారులకు మధ్య ఘర్షణలు జరిగేవి. ఒక దశలో రంగంలోకి దిగిన సైన్యం.. రోహింగ్యాలను తిరిగి బంగ్లాదేశ్‌లోకి వెళ్లగొట్టేయత్నం చేసింది. ఈ క్రమంలోనే ప్రారంభమైన హింసాయుత పోరాటం.. దశాబ్ధాలుగా కొనసాగుతోంది. -
ప్రమాదంలో పెళ్లి బృందం జలసమాధి
యాంగూన్: పశ్చిమ మయన్మార్‌లో పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ ఓ భారీ ఓడను ఢీకొనడంతో పడవలోని 20 మంది జలసమాధి అయ్యారు. వీరిలో 16 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో 30 మందిని రక్షించామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. వివాహ వేడుకను ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పడవలో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు. -
శరణార్థి సంక్షోభం!
కాన్ఫ్లిక్ట్ జోన్ జమ్మూ వర్సెస్ కశ్మీర్ జమ్మూ కశ్మీర్‌లోని బీజేపీ– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలివచ్చిన శరణార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం తాజా వివాదానికి కారణం. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, ఇది రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని నీరుగార్చడమేనని నేషనల్ కాన్ఫరెన్స్, వేర్పాటువాద నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ, వీహెచ్‌పీ, శ్రీరామ్‌సేన, పాంథర్స్ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ఏమిటీ గుర్తింపు పత్రాలు? దేశ విభజన అనంతరం, పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన వారిని శరణార్థులుగా గుర్తిస్తూ వారి పేరు, తల్లిదండ్రుల పేర్లతో పాటు ఫొటో ముద్రించి ఉన్న గుర్తింపు ధ్రువపత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. నైబ్ తహసీల్దార్ వీటిని జారీ చేస్తారు. అవిభాజ్య భారత్‌లో నివసిస్తున్న సదరు వ్యక్తి, దేశ విభజన అనంతరం భారత్‌కు తరలివచ్చినట్లు, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని పలానా ప్రాంతంలో అతడు నివసిస్తున్నట్లు ఈ నివాస గుర్తింపు ధ్రువపత్రం తెలియజేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో శరణార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఎంతమంది తరలివచ్చారు? తాజా గణాంకాలు అందుబాటులో లేవు. 1951 వివరాల ప్రకారం విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ నుంచి 72,95,870 మంది భారత్‌కు తరలివచ్చారు. వారిలో సుమారు 47 లక్షల మంది పశ్చిమ పాకిస్తాన్ నుంచి తరలివచ్చిన హిందువులు, సిక్కులు. 5,764 కుటుంబాలు మినహా, మిగిలిన వారందరూ పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ముంబైలలో స్థిరపడ్డారు. జమ్మూకు తరలివచ్చిన ఆ 5,784 కుటుంబాలకు చెందిన వారిని మాత్రం జమ్మూ కశ్మీర్ స్థిర నివాసులుగా గుర్తించలేదు. గత ఏడు దశాబ్దాల్లో ఈ కుటుంబాలు 19,760 కుటుంబాలుగా విస్తరించాయి. వీటిలో 20 ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పాటు వేర్పాటువాద నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లోయలో నిరసనలకు వేర్పాటువాద నేతలు పిలుపునిచ్చారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రంలో.. జనాభాలో మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే శరణార్థులు గత ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో నివసిస్తున్నారని, అలాంటప్పుడు జనసంఖ్యలో ఎలా మార్పు వస్తుందని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. ‘రోహింగ్యా ముస్లింలకు ప్రభుత్వం మద్దతు తెలిపితే సమస్య లేదు కానీ పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులకు మద్దతిస్తే సమస్య వస్తోందా?’ అని శరణార్థులు వేర్పాటువాద నేతలను ప్రశ్నిస్తున్నారు. రోహింగ్యాలతో సమస్య ఏమిటి? మయన్మార్‌లో సుమారు పది లక్షల జనాభా ఉన్న బలమైన ముస్లిం సామాజిక వర్గమే రోహింగ్యాలు. అయితే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చారనే కారణంగా అక్కడి ప్రభుత్వం వీరిలో చాలామందికి పౌరసత్వం కల్పించలేదు. విచారణ నుంచి తప్పించుకునేందుకు చాలా మంది భారత్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, ఇండొనేసియా దేశాలకు పారిపోయారు. ప్రస్తుతం భారత్‌లో సుమారు 40 వేల నుంచి 50 వేల మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు అంచనా. జమ్మూ కశ్మీర్లో సుమారు 7 వేల–8 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇళ్లలోనూ, ప్రైవేటు వాణిజ్య సంస్థల్లో కార్మికులుగా జీవిస్తున్నారు. రోహింగ్యాల జనాభా వాస్తవంగా ఇంకా ఎక్కువగానే ఉంటుందని చాలా మంది జమ్మూ ప్రజల విశ్వాసం. నిధులు, నియామకాలు ఎక్కువగా కశ్మీరీ ముస్లింలకే దక్కుతున్నాయని భావిస్తున్న హిందూ ప్రాబల్య జమ్మూ ప్రజలు... రోహింగ్యా ముస్లింలు స్థిరపడుతుండడాన్ని అనుమానంతో చూస్తున్నారు. జమ్మూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాలు స్థానికులను వివాహం చేసుకోవడం, తద్వారా ఆ ప్రాంత జనాభాలో మార్పు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని వారు భావిస్తున్నారు. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, రోహింగ్యా ముస్లింల విషయంలో జమ్మూ, కశ్మీర్ మధ్య çకొత్త వివాదం తలెత్తింది. -
మయన్మార్‌లో సైనిక అత్యాచారాలు!
నేపితా/యాంగాన్: మయన్మార్ రాఖిన్ రాష్ట్రంలో గత కొద్ది వారాలుగా జాతి హింసాకాండ కొనసాగుతుండటంతో వేలాది మంది ‘రోహింగ్యా’ మైనారిటీ శరణార్థులు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు వలసపోతున్నారు. ‘మాపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇళ్లు కాల్చేస్తున్నారు. కుటుంబ సభ్యులను ఉరితీస్తున్నారు. 10 ఏళ్లు పైబడిన వారు కనిపిస్తే చాలు.. సైన్యం వాళ్లను చంపేస్తోంది’ అని కొందరు శరణార్థులు పేర్కొన్నట్లు సీఎన్ఎన్ తెలిపింది. ‘నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలియదు’ అని బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్ క్యాంప్‌లో తలదాచుకుంటున్న లాలు బేగం తెలిపింది. ‘అందమైన ఆడవాళ్లు కనిపిస్తే చాలు. నీళ్లు కావాలని అడుగుతారు. మహిళ ఇంట్లోకి వెళ్లగానే లోపలికి పోరుు అత్యాచారం చేస్తారు’ అంటూ పేర్కొంది. పది లక్షల మంది రాహింగ్యాలు రాఖిన్లో శరణార్థులుగా ఉంటున్నారు. అరుుతే మయన్మార్ ప్రభుత్వం వారిని అధికారికంగా గుర్తించలేదు. అక్రమంగా వలస వచ్చిన బెంగాలీలుగానే భావిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే స్పందించట్లేదు.. రోహింగ్యా ముస్లింల విషయంలో ఆంగ్‌సాన్ సూచీ ఉద్దేశపూర్వకంగానే మౌనం వహిస్తున్నారని మయన్మార్ పౌర హక్కుల సంఘాలు ఆరోపించారుు. సైన్యం దాష్టీకాలకు సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ సూచీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారుు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ‘సామూహిక బహిష్కరణ’ జరుగుతోందని, వేల మంది బంగ్లాదేశ్‌కు వలస వెళ్తున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. సూచీ ఉదాసీనత వల్లే ఇదంతా జరుగుతోందని, ఆర్మీపై ఆమెకు నియంత్రణ లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ నేత డేవిడ్ మాథిసన్ ఆరోపించారు. -
మయన్మార్‌లో పడవ ప్రమాదం
-
మయన్మార్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ
యంగూన్: భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మయన్మార్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. రాజధాని యంగూన్‌లో తన మొట్టమొదటి బ్రాంచీని ప్రారంభించింది. దీనితో మయన్మార్‌లో శాఖను ప్రారంభించిన మొట్టమొదటి దేశీయ బ్యాంక్‌గా ఎస్బీఐ నిలిచింది. ఎస్బీఐకి ఇది 54వ విదేశీ బ్రాంచ్. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య బ్రాంచీని ప్రారంభించినట్లు సోమవారం ఇక్కడ విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. 198 కార్యాలయాల ద్వారా 37 దేశాల్లో ఎస్బీఐ ప్రస్తుతం సేవలు నిర్వహిస్తోంది. -
ఏనుగు చర్మం ఒలిచి..
నెపిత: కాసుల కోసం ఏనుగుల్ని ఇష్టారీతిగా హతమారుస్తున్నారు స్మగ్లర్లు. ఆసియా జాతి ఏనుగులకు స్థావరమైన మయన్మార్ లోనైతే దుండగులు పేట్రేగిపోతున్నారు. ఏనుగుల దంతాలకే కాక చర్మానికి కూడా మార్కెట్ లో భారీ గిరాకీ ఉండటంతో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 50 ఏనుగులను హతమార్చారు. మయన్మార్ రెయిన్ ఫారెస్ట్ లో యథేచ్ఛగా సాగుతోన్న ఏనుగుల వధకు సంబంధించిన భీకర దృశ్యాలను కొందరు సాహసికులు రహస్యంగా చిత్రీకరించారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు అవే. ఇక్కడ ఏనుగుల్ని చంపి, చర్మం ఒలిచి, ముక్కలుగా కత్తిరించి, చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో చైనాకు తరలిస్తారు. ఏనుగు చర్మాన్ని ప్రాసెస్ చేసి ఆభరణాలను తయారుచేస్తారు. ఈ ఆభరణాలు ధరిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందటమేకాక శుభం జరుగుతుందని చైనీయుల నమ్మకం. అందుకే ఎంత ఖర్చయినా వీటిని కొంటూఉంటారు.స్మగ్లర్లు ఏనుగుల్ని చంపుతోంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నిస్తే.. 'అబ్బే మూడో నాలుగో ఏనుగులు చనిపోయాయంతే!' అని సమాధానమిస్తున్నారు మయన్మార్ అటవీశాఖ అధికారులు. మరి ఈ గజరాజులను కాపాడుకునేదెలా? -
అతి భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న బంగారం అక్రమరవాణా గుట్టు రట్టయింది. ఒకటికాదు రెండు కాదు రూ.2000 కోట్ల విలువ చేసే 7000 కేజీల బంగారాన్ని భూతల, ఆకాశమార్గంలో తరలించిన వైనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశం మయన్మార్ నుంచి భూతల మార్గం ద్వారా పెద్ద ఎత్తున బంగారాన్ని భారత్ లోకి అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు.. గువాహటి ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ కార్గో విమానాల ద్వారా రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు బంగారాన్ని తరలించేవారని డీఆర్ఐ అధికారులు చెప్పారు. ఆ విధంగా ఇప్పటివరకు 617 దఫాలుగా 7 వేల కేజీల బంగారాన్ని భారత్ లోకి స్మగ్లింగ్ చేశారని, దాని విలువ రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు ఛేధించినవాటిల్లో అతి భారీ దందా ఇదేనని తెలిపారు. గుట్టురట్టైందిలా.. కొద్ది రోజుల కిందట ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు గొంకను కదల్చగా ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గువాహటి నుంచి ఢిల్లీకి వచ్చిన కార్గో విమానంలో 'విలువైన సరుకు'లను తనిఖీ చేసిన అధికారులు రూ.3.1 కోట్ల విలువచేసే10 కేజీల బంగారాన్ని కనుగొన్నారు. 24 కేరెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఇతర సరుకులు అక్రమంగా రవాణాచేశారు. కాగా, కార్గో రిజిస్ట్రేషన్ చిరునామాల ఆధారంగా గువాహటికి చెందిన ఓ వ్యారవేత్తను, ఢిల్లీలోని అతని అనుచరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. విమాన సిబ్బంది హస్తం? ఇంత భారీ స్థాయిలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నా విమానాశ్రయ, విమాన సిబ్బందికి ఇంతైనా అనుమానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని, ఈ వ్యవహారంలో సిబ్బంది ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నట్లు, ఆ మేరకు వారిని త్వరలోనే ప్రశ్నిస్తామని డీఆర్ఐ అధికారులు చెప్పారు. -
మయన్మార్‌కు అండగా ఉంటాం
-
మయన్మార్‌కు అండగా ఉంటాం
* ఆ దేశాధ్యక్షుడితో భేటీ అనంతరం ప్రధాని మోదీ * భారత్‌తో సంబంధాల మెరుగే మా అభిమతం: హతిన్ క్యా * ఉగ్రవాదం, చొరబాట్లపై ఉమ్మడి పోరుకు అంగీకారం న్యూఢిల్లీ: మయన్మార్ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని భారత్ సోమవారం హామీఇచ్చింది. మయన్మార్ సరికొత్త ప్రయాణంలో అండగా ఉంటామంది. మయన్మార్ అధ్యక్షుడు యు హతిన్ క్యా భారత పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య సంబంధాల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది భారత్ ఆకాంక్షని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఉగ్రవాదంపై పోరు, చొరబాటు కార్యక్రమాల నిరోధంలో కలిసికట్టుగా సాగాలని, చురుకైన సహకారం అందించుకోవాలని భేటీలో ఇరు దేశాలు నిర్ణయించాయి. మయన్మార్‌కు దగ్గరయ్యేందుకు చైనా ప్రయత్నాల నేపథ్యంలో... క్యా భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల సందర్భంగా ఇరు దేశాలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రవాణా, వైద్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సంబంధాల్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రసంస్థలు మయన్మార్‌లో విస్తరించిన విషయాన్ని భారత్ గుర్తుచేసింది. భారత్-మయన్మార్-థాయ్‌లాండ్‌ల గుండా సాగే రహదారి ప్రాజెక్టులో భాగంగా కలేవా-యార్గి విభాగం నిర్మాణం, 69 వంతెనల నిర్మాణం, అభివృద్ధి కోసం 2ఒప్పందాలు జరిగాయి. మయన్మార్ అభివృద్ధిలో భాగస్వామ్యం భేటీ తర్వాత మోదీ మాట్లాడుతూ... ‘మయన్మార్ వేసే ప్రతీ అడుగులో 125 కోట్ల మంది భారతీయులు భాగస్వాములుగా, స్నేహితులుగా అండగా ఉంటారని హామీనిస్తున్నా. ఒకరి భద్రతా అవసరాలు మరొకరితో ముడిపడి ఉన్నాయని ఇరుదేశాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరు, చొరబాటు ప్రయత్నాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. దాదాపు రూ. 13,600 కోట్ల అభివృద్ధి పనుల్లో మయన్మార్‌కు భారత్ సాయం అందిస్తోంది. రవాణా, మౌలిక సదుపాయలు, విద్య, వైద్యం, ఇతర రంగాల్లో ప్రాజెక్టులకు సహకరిస్తున్నాం. ఈ ఏడాది చివరిలో మయన్మార్‌లోని కాలాదాన్ పోర్టు ప్రాజెక్టు పూర్తి కానుంది. ఏప్రిల్‌లో మయన్మార్‌లోని తముకు విద్యుత్ సరఫరా చేసి చిన్న అడుగు ముందుకేశాం. విద్యుత్ సరఫరా సాయాన్ని పెంచుతామని ఆ దేశాధ్యక్షుడికి చెప్పాను. భారత్‌తో నైరుతి ఆసియాను కలపడంలో మయన్మార్ వారధిగా ఉంది. ‘21వ శతాబ్ది పాంగ్లాంగ్ సదస్సు’లో నిర్ణయించిన మేరకు మయన్మార్‌లో శాంతి ప్రక్రియకు పూర్తి మద్దతు ఇస్తాం. మయన్మార్ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆ దేశ నాయకుల పరిణితి, నిబద్ధతను అభినందిస్తున్నా. బౌద్ధ మతంలోని దయను ప్రేమించడం, అన్ని మతాల మధ్య సమానత్వం మన జీవితాల్ని నిర్వచిస్తుంది. బగన్‌లోని ఆనంద ఆలయం పునరుద్ధరణలో మన పాత్ర ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఇతర చారిత్రక నిర్మాణాలు, పగోడాలు పునరుద్ధణలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ’ అని మోదీ చెప్పారు. గయను సందర్శించిన హతిన్ క్యా ఈ సందర్భంగా హిన్ క్వా మాట్లాడుతూ... భారత్‌తో సంబంధాలు బలపరచుకోవాలనేది తమ కోరికన్నారు. శనివారం భారత్ చేరుకున్న క్వా.. బౌద్ధ పుణ్యక్షేత్రం గయలో పర్యటించారు. మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. దైజోక్యో బౌద్ధ ఆలయం, మయన్మార్ బౌద్ధ విహారాన్ని కూడా తిలకించారు. అనంతరం ఆగ్రా చేరుకుని తాజ్‌మహల్‌ను సందర్శించారు. సోమవారం ఉదయం ప్రధానితో భేటీకి ముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. -
మయన్మార్‌లో పెను భూకంపం
-
తూర్పు, ఈశాన్య భారతంలో భూకంపం
న్యూఢిల్లీ: తూర్పు, ఈశాన్య భారతాన్ని భూప్రకంపనలు వణికించాయి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అసోం, బిహార్, పశ్చిమబెంగాల్, పట్నా, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలతో కోల్‌కతాలో మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం సర్వీసులను పునరుద్దరించారు. మరోవైపు విశాఖపట్నంలోనూ భూమి కంపించింది. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. ఇక మయన్మార్‌లో పెను భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు అయింది. అయితే ప్రాణ, ఆస్తినష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారత్‌పై వ్యతిరేకతకు చోటివ్వం
నేపిడా (మయన్మార్): భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించేది లేదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మయన్మార్ నేతలు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత్ నుంచి తొలిసారిగా అత్యున్నత స్థాయి బృందం సోమవారం మయన్మార్‌లో పర్యటించింది. దీనిలో భాగంగా అధ్యక్షుడు యు హిటిన్ క్యాతో పాటు స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి అంగ్‌సాన్ సూచీతో సుష్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చొరబాట్లు, సీమాంతర వ్యవహారాలు వంటి ద్వైపాక్షిక అంశాలపై కీలకమైన చర్చలు జరిపారు. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నామని అధ్యక్షుడు హిటిన్ తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకపాలు నిర్వహించే చొరబాటుదారులకు తమ భూ భాగంలో చోటిచ్చేదిలేదన్నారు. ప్రజాస్వామ్య విలువ విషయంలో భారత్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల మిలిటరీ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్య పాలన తీసుకువచ్చినందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సూచీకి శుభాకాంక్షలు తెలిపారు. -
అంతుచిక్కని వ్యాధితో 38 మంది చిన్నారులు మృతి
య్యాగన్: మయన్మార్‌లో ఓ అంతుచిక్కని వ్యాధి చిన్నారును బలితీసుకుంటోంది. దేశ వాయువ్య ప్రాంతం సగైంగ్లో వ్యాపిస్తున్న ఈ వ్యాధితో ఇప్పటికే 38 మంది చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా 12 ఏళ్లలోపు వారు ఉంటున్నారని అధికారులు వెల్లడించారు. లాహెల్ టౌన్షిప్లో 38 మందికి ఈ వ్యాధి సోకగా.. వారిలో 28 మంది మృతి చెందినట్లు ఆరోగ్య కార్యకర్తలు వెల్లడించారు. వ్యాధి సోకిన వారిలో జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రక్త నమూనాలను య్యాగన్లోని నేషనల్ హెల్త్ లేబరేటరీలో పరిశీలిస్తున్నారు. అయితే, వీరిలో ముగ్గురికి మాత్రం మీసిల్స్(తట్టు) సోకినట్లు నిర్థారణ కాగా.. మిగతా వారి విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. మరో టౌన్షిప్ నాన్యున్లోనూ ఈ వ్యాధి సోకిన 13 మంది చిన్నారులు మృతి చెందారు. అధికారులు ముందుగా మీసిల్స్కు టీకాలు వేసే పనిలో పడ్డారు. -
అక్రమంగా కట్టారని మసీదుకు నిప్పు పెట్టారు
మయన్మార్‌లో బుద్ధిస్టుల తీవ్ర చర్య నేపీతా: మయన్మార్‌లో జాతుల హింస కొనసాగుతూనే ఉంది. దేశంలో జాతుల హింసను అరికట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్ యాంఘీ లీ మయన్మార్ ప్రభుత్వాన్ని కోరిన రోజే.. బుద్ధిస్టులు ఓ మసీదుకు నిప్పుపెట్టారు. దేశ రాజధాని నేపీతాకు 652 కిలోమీటర్ల దూరంలో ఉన్న హపకంత్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలో అక్రమంగా కట్టిన ముస్లింల ప్రార్థన మందిరాన్ని కూల్చేయాలని బుద్ధిస్టులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముస్లింలు మాత్రం అధికారులు ఆదేశాలిస్తేనే తాము ప్రార్థన మందిరాన్ని తొలగిస్తామని చెప్తూ వచ్చారు. ఈ అంశంపై ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం వందలమంది బుద్ధిస్టులు కత్తులు, కర్రలు పట్టుకొని వచ్చి ప్రార్థన మందిరం ముందు ఆందోళనకు దిగారు. అదుపు తప్పిన అల్లరిమూక ప్రార్థన మందిరానికి నిప్పు పెట్టింది. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా.. వారిని కూడా అల్లరిమూక అడ్డుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. మరోవైపు మయన్మార్ పర్యటనకు వచ్చిన ఐరాస రిపోర్టర్ లీ దేశంలో ఏళ్లుగా కొనసాగుతున్న మైనారిటీ ముస్లిం-బుద్ధిస్టు జాతుల మధ్య హింసను నివారించాలని ప్రజాస్వామిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 50 ఏళ్లలో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం మయన్మార్‌లో నెలకొన్న నేపథ్యంలో జాతుల హింసకు చెక్ పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
బోటు గల్లంతు: ఎనిమిది మంది మృతి
నైపీడా : మయన్మార్ పశ్చిమ రాష్ట్రమైన రాకినిలో బోటు తిరుగబడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మంది గల్లంతయ్యారు.ఈ మేరకు మీడియా బుధవారం వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోటులో 100 మంది ఉన్నారని పేర్కొంది. శరణార్థుల శిబిరం నుంచి వారిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరగుతున్నాయని మీడియా చెప్పింది. -
భారత్, మయన్మార్‌లలో భారీ భూకంపం
సాక్షి,విశాఖపట్నం/శ్రీకాకుళం/న్యూఢిల్లీ: మయన్మార్‌లో బుధవారం సంభవించిన భూకంపం ఈశాన్య భారతంతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీల్లో ప్రభావం చూపింది. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైన భూకంపం మయన్మార్‌లో రాత్రి 7.25 గంటలకు సంభవించింది. మావ్లాక్కు ఆగ్నేయంగా 74 కి.మీ. దూరంలో 134కి.మీ.లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించామని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు వార్తలందలేదు. మిజోరం, నాగాలాండ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, అస్సాం, ఒడిశాలలోనూ భూమి కంపించింది. ప్రజలు భవంతుల నుంచి బయటకు పరుగులుతీశారు. కోల్‌కతాలో మెట్రో సేవలను కాసేపు నిలిపేశారు. గువాహటిలో కొన్ని భవంతులకు బీటలు పడ్డాయి. మయన్మార్‌లోని యాంగాన్‌లో ఆరంతస్తుల ఆస్పత్రి నిమిషంపాటు కంపించింది. చైనా, భూటాన్, బంగ్లాదేశ్, టిబెట్లలో భూకంప ప్రభావం కనిపించింది. విశాఖలోనూ భూకంప ప్రభావం... మయన్మార్ భూకంప ప్రభావం విశాఖలోనూ కనిపించింది. మయన్మార్‌లో భూకంపం సంభవించిన కొద్దిసేపటికే విశాఖపట్నంలోనూ, జిల్లాలోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సెకన్లపాటు భవంతులు, ఇళ్లు ఊగుతున్నట్టు అనిపించడంతో జనం భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఇళ్లలో సామగ్రి చెల్లాచెదురుగా పడింది. విశాఖలోని అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, మురళీనగర్, పెదవాల్తేరు, ఎండాడ తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. శ్రీకాకుళంలోనూ స్వల్పంగా భూమి కంపించింది. శ్రీకాకుళం, శ్రీకాకుళం రూరల్‌తోపాటు ఆముదాలవలస, ఇచ్చాపురం, సోంపేట, పలాస మండలాల్లో భూమి కంపించింది. -
మయన్మార్ లో భూకంపం!
న్యూ ఢిల్లీః భారత్ మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. భారత సరిహద్దు ప్రాంతంలోని వాయువ్య మయన్మార్ ను తాకిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్ లోనూ, ఈశాన్య భారతదేశంలోనూ అక్కడక్కడా ప్రకంపనలు సంభవించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. భూకంపం వల్ల వచ్చిన ప్రకంపనలకు జనం భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ళనుంచి బయటకు పరుగులు తీశారు. మాల్విక్ కేంద్రానికి 74 కిలోమీటర్ల ఆగ్నేయంగా రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.8 గా నమోదైనట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే సంస్థ వెల్లడించింది. -
ఏపీ సహా ఉత్తరాదిలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ: ఉత్తరాంధ్రతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. మయన్మార్‌లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. మయన్మార్‌లోని మొనివా నగరానికి 70 కిలో మీటర్ల దూరంలో వాయవ్య ప్రాంతంలో భూకంప కేంద్రం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. దీని ప్రభావం ఏపీ, దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలపై చూపింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. 3 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. నోయిడా, ఢిల్లీ, కోల్‌కతా, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కోల్‌కతాలో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
సూచీకి కీలక బాధ్యతలు
యంగోన్: ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా.. సైన్యం మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల మయన్మార్ అధ్యక్ష పదవికి అనర్హురాలైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూచీ కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మంత్రి పదవి చేపట్టరాదని సూచీ భావించినా, ఆమెకు కీలక శాఖలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా .. పార్లమెంట్‌కు పంపిన 18 మంది కొత్త మంత్రుల జాబితాలో ఆమె పేరు ఉంది. సూచీకి విదేశీ వ్యవహారాల శాఖతో పాటు ఇంధన, విద్యాశాఖలను కేటాయించే అవకాశముంది. టిన్ క్వా కేబినెట్లో సూచీ మినహా మరో మహిళ పేరు లేదు. నవంబర్ నాటి పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సైన్యం గతంలో మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకొని ఉండరాదు. అలాగే ఆ వ్యక్తికి విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్ బ్రిటిషర్ కావడం, ఆమె ఇద్దరు పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో అధ్యక్షురాలయ్యేందుకు అనర్హురాలయ్యారు. -
ఆమె డ్రైవరే దేశాధ్యక్షుడు!
నెపిడా: మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా హితిన్ చా పేరును ప్రకటించారు. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ తమ అధినేతగా ఆంగ్ సాన్ సూచీ చిన్ననాటి స్నేహితుడు, సన్నిహితుడైన హితిన్ చా ను ఎన్నుకున్నారు. ఆయన గతంలో డ్రైవర్ గా విధులు నిర్వహించడం గమనార్హం. సూచీ ఉద్యమం చేస్తున్న సమయంలో ఆమెకు డ్రైవర్ గా పని చేశారు. ప్రస్తుతం ఆంగ్ సాన్ సూచీ చారిటీ ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, మిలిటరీ ఆధిపత్యాన్ని తప్పించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముగిశాయి. అందుకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వారసత్వాన్ని హితిన్ కు కట్టబెట్టాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో ఆంగ్ సాన్ సూచీ వెల్లడించారు. ఇక్కడ మన్మోహన్.. అక్కడ హితిన్ చా గతంలో యూపీఏ ప్రభుత్వం గెలిచినప్పటికీ విదేశీ అనే ఆరోపణలు వచ్చి వ్యతిరేకత రావడంతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని పగ్గాలను విశ్వాసపాత్రుడైన మన్మోహన్ సింగ్ కు అప్పగించారు. ఇప్పుడు మయన్మార్ లో అదే సీన్ రిపీట్ అయింది. నిబంధనల వల్ల సూచీ విదేశీ కావడంతో పాలన పగ్గాలను సన్నిహితుడు, మిత్రుడు హితిన్ చా చేతిలో పెట్టారు. నిర్ణయాలు మాత్రం సూచీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అధ్యక్ష పదవి కంటే పెద్ద స్థానంలోనే సూచీ ఉందని నేతలు పేర్కొంటున్నారు. అధ్యక్షుడి ఎన్నికపై సూచీ సొంత పార్టీ ఎన్ఎల్డీ లో కూడా కాస్త వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఎగువ సభలో మరో అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మెజార్టీ పార్టీ ఆంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఓట్లతో హితిన్ చా కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అధ్యక్షుడి భార్య అధికార పార్టీ ఎన్ఎల్డీ ఎంపీ. ఆమె పేరు సు సు లిన్. గతంలో ఆమె తండ్రి ఎన్ఎల్డీ పార్టీ అధికారప్రతినిధిగా పనిచేశారు. సూచీని అడ్డుకున్న రాజ్యాంగం! గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక ఉద్యమ కారిణి ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. వీరికి ఇద్దరు పిల్లలు. మయన్మార్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రాజ్య నియమాలకు కట్టుబడి అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపలేదు. -
సూకీభవ
ఆంగ్ సాన్ సూకీ, బర్మా ఉద్యమ నేత తల్లిదండ్రులు ►ఆంగ్‌సాన్ (దేశభక్త విప్లవకారుడు), ఖిన్ కీ (దౌత్యవేత్త) కుటుంబ స్థానం ►ముగ్గురు పిల్లల్లో ఒకే ఒక్క అమ్మాయి భర్త ►డాక్టర్ మైఖేల్ ఏరిస్ (వివాహం: 1972) సంతానం ►అలెగ్జాండర్, కిమ్ పార్టీ ►ఎన్.ఎల్.డి. (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ) వ్యవస్థాపన ►27 సెప్టెంబర్ 1988 (8888 తిరుగుబాటు తర్వాత) తిరుగుబాటు ►8 ఆగస్టు 1988 - 18 సెప్టెంబర్ 1988 అవార్డులు ► నోబెల్ శాంతి బహుమతి (1991)జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ (1992) రాఫ్టో, సఖరోవ్ ప్రైైజులు (1990) అన్నం పెట్టేవాళ్లు, పెట్టించేవాళ్లు, పండించేవాళ్లు.. ఎప్పుడూ చల్లగా ఉండాలి. అన్నదాతా.. సుఖీభవ!పిడికిలి బిగించినవారు, పోరు సాగించేవారు.. ఎప్పుడూ శాంతంగా ఉండాలి. పౌరులారా.. సూకీభవ! ఆంగ్ సాన్ సూకీలా ఉండండీ అని!!ఎప్పుడైనా సరే, అమెరికా ఎన్నికలు నవంబరులోనే జరుగుతాయి. అదీ మంగళవారమే జరుగుతాయి. అది కూడా నవంబరు నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం మాత్రమే జరుగుతాయి. అంటే.. నవంబరు 2కి ముందు గానీ, నవంబరు 8కి తర్వాత గానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగవు. రాజ్యాంగంలో అలా రాసుకున్నారు వాళ్లు! ఈ ఏడాది నవంబర్ 8న అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఏడాది మయన్మార్ ఎన్నికలు కూడా నవంబర్ 8నే జరిగాయి. అంత మాత్రాన అమెరికా, మయన్మార్ రాజ్యాంగాలకు సంబంధం ఉందని చెప్పలేం. అలాగని ఏ సంబంధమూ ఉండబోదనీ చెప్పలేం. ఒక అందమైన ఊహ ఏమిటంటే.. అమెరికా, మయన్మార్లకు అధ్యక్షులుగా ఇద్దరూ మహిళలే అయితే ఎంత బాగుంటుందీ అని! ఊహ మాత్రమే కాదు.. అయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అమెరికాలో హిల్లరీ, మయన్మార్‌లో ఆంగ్‌సాన్ సూకీ అధ్యక్ష పీఠం మీద కూర్చుంటే మానవాళి మునుపెన్నడూ వీక్షించని ఒక అందమైన ప్రపంచం ఆవిష్కృతమౌతుంది. అమెరికా చరిత్రలో ఇంతవరకు మహిళా అధ్యక్షులు లేరు. మయన్మార్ చరిత్రలో అయితే అసలు ప్రజాస్వామ్యమే లేదు. మయన్మార్ ఇప్పటికీ మిలటరీ పాలనలోనే ఉంది! మరి నవంబర్ 8న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కదా! వాటి ఫలితాలు ఏమైనట్లు? నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్.ఎల్.డి.) భారీ మెజార్టీతో గెలిచింది కదా! ఆ పార్టీ లీడర్ ఆంగ్‌సాన్ సూకీ ఎందుకు ఆ దేశానికి అధ్యక్షురాలు కాలేకపోయినట్లు? అందుకు చట్టాన్ని సవరించాలి. సవరించాలంటే పార్లమెంటులో 25 శాతం సీట్లు ఉన్న రిజర్వుడు (ఎన్నిక కాని వారు) అభ్యర్థుల ఆమోదం ఉండాలి. వాళ్లను మిలటరీ నియంత్రిస్తుంటుంది. సవరణకు మిలటరీ ఒప్పుకుంటే వాళ్లూ ఒప్పుకుంటారు. ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామికి గానీ, పిల్లలకు గానీ విదేశీ పౌరసత్వం ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. అందుకోసం ప్రస్తుతం మిలటరీకి, సూకీ పార్టీకి మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. అవి ఫలిస్తే.. మార్చిలో సూకీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ నెల మొదట్లో సూకీకి ఫేస్బుక్లో ఒక బెదిరింపు పోస్ట్ వచ్చింది. ‘నిన్ను చంపేస్తాం’ అని! మామూలుగా అయితే అక్కడి పాలకులకు అదొక చిన్న విషయం. కానీ ఇప్పుడది పెద్ద సంగతి! సూకీకి తరగని ప్రజాదరణ అందుకు కారణం కావచ్చు. బెదిరింపు వచ్చిన వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూకీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సూకీ పట్ల మిలటరీ కనబరుస్తున్న సానుకూల ధోరణికి దీనినొక నిదర్శనంగా భావించవచ్చు. మయన్మార్ ఎదురు చూపులు సూకీని తమ అధ్యక్షురాలిగా చూడడం కోసం మయన్మార్‌లో ఇప్పుడు ప్రతి ఇల్లూ ఎదురుచూస్తోంది. చదువుల కోసం, ఉద్యోగాల నిర్వహణ కోసం దాదాపు నలభై ఏళ్ల పాటు విదేశాల్లో గడిపి, 1988లో మయన్మార్ వచ్చి, వచ్చిన ఏడాదే ఉద్యమ నేతగా అవతరించడానికి సూకీకి అంత శక్తి ఎక్కడిది? ‘అది నాకు నా తండ్రి, బర్మా ప్రజలు ఇచ్చిన శక్తి’ అని చెప్తారు సూకీ. అసలు ఆంగ్ సాన్ సూ కీ అన్న పేరులోనే మూడు తరాల శక్తి ఉంది. ‘ఆంగ్ సాన్’ అన్నది తండ్రి పేరు. ‘సూ’ అన్నది నానమ్మ పేరు. ‘కీ’ అన్నది అమ్మ పేరు. సూకీ రంగూన్లో జన్మించారు. పాలిటిక్స్, ఫిలాసఫీ చదివారు. బ్రిటిష్ పౌరుడు మైఖేల్ ఆరిస్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. ఉద్యమబాట పట్టారు. ఫలితంగా గృహ నిర్బంధానికి గురయ్యారు. సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో నెగ్గి.. ప్రజాస్వామ్యానికి పురుడు పోశారు. ఇది ఆమె సాధించిన నోబెల్ శాంతి బహుమతి కంటే గొప్ప విజయం. బందీ అయిన యోధురాలు సూకీ గత ఐదేళ్లుగా స్వేచ్ఛా విహంగం అయితే కావచ్చు. అప్పటి వరకు ఆమె బర్మా స్వేచ్ఛకోసం బందీ అయిన యోధురాలు. 1989 జూలై 20 నుంచి 2010 నవంబర్ 13 వరకు ఇరవయ్యొక్కేళ్ల కాలంలో మధ్య మధ్య స్వల్ప విరామాలతో దాదాపు 15 ఏళ్ల పాటు బర్మా సైనిక పాలకులు విధించిన గృహ నిర్బంధంలో గడిపారు. నిర్భందం నుంచి బయటపడిన ఏడాదిన్నర తర్వాత - బ్యాంకాక్‌లో ఏర్పాటైన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం కోసం సూకీ చేసిన తొలి విమాన ప్రయాణంలో ఆమెను చూడగానే కెప్టెన్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. అంతేనా! కాక్‌పిట్‌కి ఆహ్వానించి, అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ హైటెక్ కంట్రోల్ ప్యానెల్ నుంచి భూమి మీద మినుకు మినుకుమని వెలుగుతున్న నగరాలను చూడగానే సూకీకి మయన్మార్ నిరుద్యోగ యువకులు, వారి కలలు, ఆశలు గుర్తొచ్చాయి. తర్వాత.. బ్యాంకాక్‌లో జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’లో ప్రసంగిస్తూ.. ఆమె అన్న మాట ఫోరమ్ సభ్యుల మనసు గెలుచుకుంది. ‘‘కొంచెం ఇవ్వండి చాలు. అవినీతికి అవకాశం కల్పించేంత భారీ స్థాయి పెట్టుబడులు అక్కర్లేదు’’ అన్నారు సూకీ. లేత నీలి రంగు దుస్తులలో, తలలో తెల్లటి పూలతో సూకీ మాట్లాడుతున్నప్పుడు ఆవిడొక స్వేచ్ఛా విహంగంలా కనిపించారంటూ అంతర్జాతీయ న్యూస్ చానళ్లు ఆహ్లాదకరమైన పోలికను తేవడం విశేషం. తొలి ఎన్నికలు.. తుది ఫలితాలు నిర్బంధం నుంచి సూకీ విడుదలయ్యాక మయన్మార్‌లో జరిగిన ఒక కీలక పరిణామం... ఉప ఎన్నికలు. ఆ ఎన్నికల్లో సూకీ ఘన విజయం సాధించారు. ఫలితాలు వెల్లడవగానే ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తరమెరికా, దక్షిణమెరికా, ఇజ్రాయిల్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియాల నుంచి సూకీకి అభినందలు వెల్లువెత్తాయి. ‘‘మయన్మార్‌కి మంచి భవిష్యత్తు ఉంది. అది మీ వల్లే సాధ్యమౌతుంది’’ అని కొందరు దేశాధినేతలు సూకీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సీన్ మొన్న 2015 ఎన్నికల్లోనూ రిపీట్ అయింది. నాన్న.. నా హీరో: సూకీ నాన్న! నా హీరో. నా జీవితానికి స్ఫూర్తి. ఉద్యమ రాజకీయాల్లో నా దిక్సూచి. బర్మా యువశక్తిని నడిపిన నాన్న... నా రెండేళ్లప్పుడు యువకుడిగానే చనిపోయారు. ఆయన నన్నెత్తుకుని ఆడించిన గుర్తు... ఉండీలేనట్లుంది. ‘‘నిన్ను ఇలా ఎత్తుకునేవారు, చేతులపై ఇలా ఊపేవారు. గాలిలో పైకి లేపి ఒక్క విసురుతో భద్రంగా నిన్ను కిందికి దింపేవారు. నువ్వు కిలకిలమని నవ్వేదానివి’’ అని అమ్మ చెబుతుంటే నాన్నని ఊహించుకునేదాన్ని. అమ్మ ఒక్కటేనా నాన్న గురించి చెప్పేది! బర్మాలోని ప్రతి ఉద్యమ గ్రామం ఆయన్ని గుర్తుంచుకుంది. ఆంగ్ సాన్ సూకీ ఒక తిరుగుబాటు నాయకురాలంటే వాళ్లకేం గొప్ప కాదు. ఆ తండ్రి కూతురేనని చెప్పుకోవడం గొప్ప! నిర్బంధానికి నిర్బంధానికి మధ్య లభించిన షరతుల స్వేచ్ఛలో పశ్చిమ బర్మాలోని రఖైన్, చిన్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ‘‘అదిగో.. ఆంగ్‌సాన్ తాతయ్య కూతురొచ్చింది చూడు’’ అని వారు అంటున్నప్పుడు నా కళ్లు చెమర్చాయి. నాన్న వారితో నిజాయితీగా ఉన్నారు. వారు నన్ను విశ్వసిస్తున్నారు. అంతే. ప్రజాస్వామ్యాన్ని తప్ప వారు ఇంకేమీ ఆశించడం లేదు. ఆచరణసాధ్యం కాని హామీలేమీ నేనివ్వడం లేదు. మా పార్టీ ప్రతి గూడెం గుండెకు హత్తుకుంది. అప్పుడు మాకు వినిపించినవి హృదయ స్పందనలు కాదు. ఆగస్టు తిరుగుబాటులో అమరవీరులైన వారి నినాదాలు! భయానికి బందీ అయ్యామా అంతకన్నా శిక్ష లేదు. భయాన్ని వదిలించుకున్నామా అంతకన్నా స్వేచ్ఛలేదు. - ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్ పోరాట యోధురాలు -
గతి తప్పిన విమానాలు.. ఘోరప్రమాదాలు
- ఇండోనేసియాలో ఇంట్లోకి దూసుకెళ్లిన సైనిక విమానం.. ముగ్గురి మృతి - సైనిక విమానం కూలి నలుగురు సైనికుల దుర్మరణం మలాంగ్/ నైపిడా: ఆగ్నేయ ఆసియా దేశాలైనా ఇండోనేసియా, మయన్మార్ లలో బుధవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇరు దేశాల్లోనూ కుప్పకూలినవి సైనిక విమానాలే కావడం గమనార్హం. రెండు దేశాల్లో కలిపి ఐదుగురు సైనికులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ఇండోనేసియా జావా దీవిలోని అబ్దుల్ రాచ్మన్ సలేహ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బుధవారం ఉదయం ఓ శిక్షణ విమానం గాలిలోకి ఎగిరింది. దాదాపు 40 నిమిషాల ప్రాక్టీస్ అనంతరం విమానానికి ఎయిర్ బేస్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం ఎక్కడున్నదీ గుర్తించలేకపోయామని, అర గంట తర్వాత నగరంలో అత్యంత రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో అది కూలిపోయినట్లు గుర్తించామని వైమానిక అధికారులు చెప్పారు. అదుపు తప్పిన విమానం నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఆ ఇంటి యజమాని, యజమానురాలు సహా పైలట్ కూడా మృత్యువాతపడ్డాడు. మయన్మార్ ప్రమాదం: సాధారణ పరీక్షల నిమిత్తం ఐదుగురు సైనికులు ఒక చిన్న తరహా విమానంలో రాజధాని నైపిడాలోని ఎయిర్ బేస్ నుంచి గాలిలోకి ఎగిరారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగి ఎయిర్ బేస్ కు సమీపంలోని పంటపొలాల్లో కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు సైనికుల్లో నలుగురు మంటలల్లో కాలిపోగా, ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డట్టు అధికారులు చెప్పారు. మయన్మార్ పూర్తిగా కొండప్రాంతం కావడంతో భూతర రవాణా సౌకర్యాలు తక్కువ. దీంతో సాధారణ ప్రయాణికులు కూడా విమాన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగా అక్కడ తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. -
ఆ ప్రజా వనితకు దేశ అధ్యక్ష పదవి?
నెపిడా: మయన్మార్ ప్రజస్వామిక ప్రతీక అంగ్ సాన్ సూకి మయన్మార్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందడుగు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ ఆమెకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు రెండు వార్తా చానెళ్లు తెలిపిన కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అంగ్ సాన్ సూకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాజ్యాంగ పరంగా ఉన్న అడ్డంకిని తొలగించేందుకు అటు సూకి, ఆ దేశ మిలటరీ వర్గాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు ఆ చానెళ్లు తెలిపాయి. గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో సూకి పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి (ఎన్ఎల్డీ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త ఓ బ్రిటన్ దేశానికి చెందిన వాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. మయన్మార్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో సూకిది కీలక పాత్ర. ఆమెను ఓ గొప్ప వ్యక్తిగా ఆ దేశ ప్రజలు భావిస్తారు. కానీ, అలాంటి వ్యక్తికి తమను పాలించే అవకాశం లేకపోవడం కూడా అక్కడి ప్రజలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉన్నత మిలటరీ విభాగంతో గత కొద్ది రోజులుగా జరుపుతున్న చర్చలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, రాజ్యాంగంలోని ఆ ఆర్టికల్ ను తొలగించేందుకు యోచన చేస్తున్నారని తెలిసింది. అయితే, సూకి అధ్యక్ష బాధ్యతల అంశంపై ఇప్పుడే అధికారికంగా ప్రకటన చేయడం తొందరపాటు చర్య అవుతుందని అక్కడి ఓ న్యాయ ప్రముఖుడు అన్నారు. -
ఫేస్'బుక్క'య్యింది... మహిళకు ఆర్నెల్లు జైలు
యంగాన్: మయన్మార్‌లో సైన్యాన్ని కించపరిచేలా ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఓ యువతికి ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. చా శాండి టున్ అనే మహిళ.. ఆర్మీ చీఫ్ యూనిఫాం రంగును మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచి ధరించే దుస్తులతో (లుంగీ) పోల్చుతూ పోస్ట్ చేసింది. 'మీరు అమ్మను ప్రేమిస్తే.. మీ తలపై తల్లి వస్త్రాన్ని (లుంగీ) ఎందుకు చుట్టుకోరాదు' అని ఫేస్బుక్ పేజీలో రాసింది. ఈ ఫేస్బుక్ పోస్ట్‌పై దుమారం రేగడంతో గత అక్టోబర్‌లో చా టున్ను అరెస్ట్ చేశారు. అయితే చా టున్ ఈ పోస్ట్ చేయలేదని, తన ఎకౌంట్‌ను హ్యాక్ చేశారని ఆమె తరపు న్యాయవాది చెప్పారు. చా టున్ తప్పు చేసినట్టు తీర్పు చెబుతూ కోర్టు ఆమెకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. -
క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించను
యాంగాన్: మయన్మార్ ప్రజాస్వామిక ఉద్యమకారిణి, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చీఫ్ ఆంగ్‌సాన్ సూచీ పార్టీ కొత్త ఎంపీలకు ‘క్లాస్’ తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని, తప్పులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శనివారమిక్కడ జరిగిన పార్టీ భేటీలో మాట్లాడుతూ నేతలంతా ఐకమత్యంతో మెలగాలన్నారు. ఎంపీలెవరైనా గ్రూపు రాజకీయాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో సైనిక మద్దతుగల అధికార పార్టీని మట్టికరిపించి పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలను మోసగించరాదన్నారు. -
హాట్ ఎయిర్ బెలూన్ సందడి
-
రెక్కవిప్పిన స్వేచ్ఛా పతాక
కొత్త కోణం ఏర్పడబోయే పౌర ప్రజాస్వామిక ప్రభుత్వం సైనిక పాలకులు విధించే పలు పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఒక సంపూర్ణ, స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మయన్మార్ ఆవిర్భవించడానికి ప్రస్తుత విజయం తొలిమెట్టు మాత్రమే. ఏర్పడబోయే పౌర ప్రభుత్వం సైన్యంతో రాజీలకు సిద్ధపడుతూనే అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. జీవితాన్నే పోరాటంగా నిర్వచించుకున్న సూచీ ఈ కత్తి మీద సామును నిబ్బరంగా నిర్వహిస్తూ నూతన ప్రభుత్వాన్ని నడిపించగలరని ఆశించవచ్చు. ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజాపోరాటాలకు తోడు నిరంతరం కొనసాగే నిలకడ గలిగిన ఉద్యమం, ఆ ఉద్యమాన్ని తుదకంటా కొనసాగించగల నిఖార్సైన నాయకత్వం ఉంటే ఏ ఉద్యమం అయినా విజయం సాధిస్తుందనడానికి మయన్మార్ ప్రజాస్వామిక ఉద్యమమే రుజువు. మయన్మార్ ప్రజాస్వామిక ఆకాంక్షలకు నిలువెత్తు ప్రతిబింబం ఓ బక్కపలుచని స్త్రీ. దశాబ్దాల నిరంకుశ సైనిక పాలనను, నిర్బంధాన్ని ఎదురొడ్డి నిలిచిన ఆమె పేరే ఆంగ్‌సాన్ సూచీ. అత్యంత శాంతియుతంగా, అంతులేని విశ్వాసంతో ఆమె నడిపిన అలుపెరు గని పోరాటం ఈ రోజు మయన్మార్ ప్రజల ప్రజాస్వామిక కాంక్షకు తుది రూపం ఇచ్చింది. ఒకప్పుడు బర్మాగా పిలిచిన మయన్మార్ 1948లో బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని పొందింది. అయితే 1962 సైనిక తిరుగుబాటుతో నియంతృత్వ పాలన మొదలైంది. సైనిక ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలన్నింటినీ నిషేధించి, ప్రజలను, ప్రజాస్వామ్య పౌరహక్కులను అత్యంత పాశవికంగా అణచివేసింది. సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, విద్యార్థులు, బౌద్ధమత సంఘాలు ఉద్యమించాయి. నియంతృత్వ ప్రభుత్వం నిర్బంధంతో ఆ ఉద్యమాలను అణచడానికి ప్రయత్నించింది. దీంతో అది సుప్రసిద్ధమైన ‘నాలుగు ఎనిమిదుల’ ఉద్యమంగా మారింది. అది మయన్మార్ ప్రజల ప్రజా స్వామిక పోరాటానికి నిర్మాణ రూపమిచ్చిన 1988 ఆగస్టు 8. యాంగాన్, మండాలే నగరాలలో విద్యార్థులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి సైనిక ప్రభుత్వా నికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రతిఘటనా పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ దశలోనే మయన్మార్ జాతిపితగా పరిగణించే ఆంగ్‌సాన్ కూతురు ఆంగ్‌సాన్ సూచీ ఈ ప్రజాస్వామ్య పోరాటంలోకి అడుగుపెట్టారు. అచంచల విశ్వాసంతోనే విజయం సెప్టెంబర్ 27, 1988న నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అనే పార్టీని స్థాపించారు. బుద్ధుడి బోధనలు, గాంధీ అహింసా సిద్ధాంతం తనకు ఆదర్శ మని ఆమె ప్రకటించుకున్నారు. సూచీ నాయకత్వంలోని ప్రజాస్వామ్య పోరా టాలకు భయపడిన ప్రభుత్వం 1989న ఆమెకు గృహ నిర్బంధం విధించింది. అది మొదలు ఆమె జీవితం జైళ్లు, గృహనిర్బంధాల్లోనే చాలాకాలం సాగింది. మరోవంక సైనిక నియంతృత్వ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ప్రజాస్వామ్యం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసమే సూచీని ఉద్యమం వైపు నడిపించింది. ఆమెను గృహనిర్బంధంలోనే ఉంచి 1990లో సైనిక ప్రభుత్వం సాధారణ ఎన్నికలు నిర్వహించింది. అయినా ఆమె నాయకత్వంలోని ఎన్ఎల్డీకి 59 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 80 శాతం సీట్లు వచ్చే అవకాశం ఉండింది. సూచీ ప్రధాన మంత్రి కావలసింది. కానీ సైనిక ప్రభుత్వం ఆ ఎన్నికలను గుర్తించలేదు. ఫలితాలను ప్రకటించకుండా ఆపివేసింది. రెండోసారి సూచీని గృహ నిర్బంధానికి పంపారు. ఆ సమ యంలోనే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. దాన్ని ఆమె తరఫున ఆమె కొడుకులు అందుకోవాల్సి వచ్చింది. 1995 జూలైలో సూచీని గృహ నిర్బంధం నుంచి విడుదల చే శారు. కానీ 1996లో 200 మంది సాయుధులు ఆమె కాన్వాయ్‌పై దాడిచేసి ఆమెను హతమార్చే యత్నం చేశారు. దీన్ని సాకుగా చూపి సైనిక ప్రభుత్వం మళ్ళీ సూచీని గృహ నిర్బంధానికి పంపింది. అయినా ఆమె మాత్రం చెక్కు చెదరలేదు. ఆమె విశ్వాసం ఇసుమంతైనా తగ్గుముఖం పట్టలేదు. ప్రజా ఉద్యమాల వెల్లువకు తోడు, అంతర్జాతీయ ఒత్తిడులకు తలొగ్గి సైనిక ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్కరణలను ప్రారంభించింది. 2010 నవంబర్ 13న బర్మా ప్రభుత్వం మరొకసారి ఆంగ్‌సాన్ సూచీని గృహ నిర్బంధం నుంచి విడుదల చేసింది. అయితే పౌర ప్రభుత్వం సైనిక ఆధి పత్యం కొనసాగేలా 2008లో తయారు చేసిన రాజ్యాంగాన్ని మార్చడానికి మాత్రం అంగీకరించలేదు. 2012 ఉప ఎన్నికల్లో పాల్గొన్న ఎన్ఎల్డీ 45 స్థానాలకు 43 స్థానాలను గెలుచుకుంది. సూచీ మొదటిసారిగా పార్లమెంటు లోకి అడుగుపెట్టింది. ఐరాస సహా ప్రపంచ దేశాలు స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని సైనిక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఫలితంగానే తాజా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎన్ఎల్డీ ఘన విజయాన్ని సాధించడంతో సైన్యం కనుసన్నల్లోని ప్రభుత్వం నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధికారం బదలాయించాల్సివస్తోంది. పరిమితులు, సవాళ్లు సూచీకి, ఎన్ఎల్డీకి అనుకూలంగా ప్రజలు తిరుగులేని విధంగా తీర్పు చెప్పినా, ఏర్పడబోయే ప్రజాస్వామిక ప్రభుత్వం అనేక పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్కరణలకు ముందే సైనిక నేతలు తమకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించి 2010 నుంచి అమల్లోకి తెచ్చారు. ప్రత్యేకించి ఆర్టికల్ 20 (బి), (ఇ), (ఎఫ్) రక్షణ వ్యవహారాలపై, సైన్యంపై పౌర ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేని స్వతంత్ర ప్రతి పత్తిని ఇచ్చాయి. సైన్యం కోరుకుంటే ఏ అంశాన్నయినా ‘రక్షణ వ్యవహారాల’ పరిధిలోకి తేగలుగుతుంది. అంతేకాదు, రాజ్యాంగాన్ని, ప్రత్యేకించి ఆర్టికల్ 20కి చెప్పే భాష్యాన్ని పరిరక్షించే కర్తవ్యాన్ని ఆ రాజ్యాంగం సైన్యం చేతుల్లోనే ఉంచింది. పౌర ప్రజాస్వామిక ప్రభుత్వం సైనిక పాలకులు విధించే పలు షరతులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు, పార్లమెంటులో ఏ ఎన్నికా లేకుండా సైన్యం నియమించే 25 శాతం మంది సభ్యుల ‘ప్రతిపక్షం’ విసిరే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవంక అంతర్జాతీయ స్థాయి మానవతావాద సంక్షోభంగా మారిన రోహింగియా ముస్లింల పట్ల వివక్ష, అణచివేత సమస్య కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. బౌద్ధ మత నేతలు తమకు వ్యతిరేకం కాకుండా ఉండటం కోసం సూచీ ఒక ఎన్నికల ఎత్తుగడగా ఒక్క ముస్లింను కూడా అభ్యర్థిగా నిలపలేదు. ఎన్నికల తర్వాత కూడా ఆమె, కొత్త ప్రభుత్వం తమ ఆకాంక్షలకు అనుగు ణంగా నడుచుకుంటారని వారు ఆశిస్తున్నారు. కాబట్టి రొహింగియాలు సహా దేశంలో రగులుతున్న అనేక జాతుల సమస్యల పరిష్కారం దిశగా ప్రజా స్వామ్య ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకూ వారి నుంచి సవాళ్లు తప్పవు. విదేశస్తుడ్ని పెళ్లి చేసుకున్న కారణంగా సూచీ రాజ్యంగ రీత్యా అధ్యక్ష పదవికి అనర్హురాలు. అయినా ఆమె ప్రభుత్వంలో నిర్ణాయక శక్తిగా ఉంటారు. ఒక సంపూర్ణ, స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మయన్మార్ ఆవిర్భవించడానికి ప్రస్తుత విజయం తొలిమెట్టు మాత్రమే. ఏర్పడబోయే పౌర ప్రభుత్వం పలు పరిమితులు, రాజీలతోనే అన్నివర్గాల ప్రజల అభీష్టాలను సంతృప్తిపరచాల్సి వస్తుంది. జీవితాన్నే పోరాటంగా నిర్వచించుకున్న సూచీ ఈ కత్తి మీద సామును నిబ్బరంగా నిర్వహించగలరని ఆశించవచ్చు. రాజకీయ ప్రజాస్వామ్యం చాలదు గత రెండువందల ఏళ్ళకుపైగా ప్రపంచ ప్రజలు జరుపుతున్న ప్రజాస్వామ్య పోరాటాలలో మయన్మార్ కూడా ఒక భాగం. అమెరికన్ ప్రొఫెసర్ హంటింగ్ టన్ నేటి పోరాటాలను మూడవ దశ ప్రజాస్వామ్య ఉప్పెనగా పేర్కొన్నారు. మొదటిదశ ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం 1820లో అమెరికాలో ప్రారంభమై 1926 వరకు కొనసాగింది. రెండవ దశ, రెండవ ప్రపంచ యుద్ధానంతరం మొదలై 1962 వరకు సాగింది. కాగా 1990 నుంచి ఇంకా సాగుతున్న మూడవ దశ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మనం చూస్తు న్నాం. లాటిన్ అమెరికా, మధ్య ఆసియా తూర్పు ఆఫ్రికా దేశాలలో సాగిన, సాగుతున్న ఉద్యమాలు దీనిలో భాగమే. బ్రెజిల్, వెనిజులా, బొలీవియా, పెరుగ్వే, అర్జెంటీనా, చిలీ, ఈక్వెడార్, నికరాగ్వా, ఉరుగ్వే లాంటి లాటిన్ అమెరికన్ దేశాలు నియంతృత్వాల నుంచి బయటపడి ప్రజాస్వామ్యం బాట పట్టాయి. మధ్య ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, లిబియా లాంటి దేశాలు ప్రజాస్వామ్య పోరాటాల్లోకి అడుగు పెట్టాయి. 167 దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థల తీరుతెన్నులపై 2014లో ‘ది ఎకనామిస్ట్’ పత్రిక నిర్వహించిన అధ్యయనం వీటిని నాలుగు రకాలుగా విభజించింది. వాటిలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలు 24 మాత్రమే నని, 27వదిగా ఉన్న భారత్‌లో పూర్తిస్థాయి ప్రజాస్వామ్యవ్యవస్థ లేదని ఆ అధ్యయనం తెలిపింది. లోపాలతో కూడిన ప్రజాస్వామ్యాలు 52 కాగా, అస్థిరంగా ఉన్నవి 39 అని పేర్కొంది. కాగా ఇప్పటికీ రాచరిక, సైనిక, కార్మిక వర్గ నియంతృత్వాల కిందనే ఉన్నాయి. ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమికమైనదే. కానీ అది పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం కాదు. రాజకీయ రంగంతో పాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం అమలైతేనే అది సమగ్రమవుతుంది. ప్రజాస్వామ్యం వైపు తొలి అడుగులు వేస్తూనే మయన్మార్ ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందనేది చారిత్రక సత్యం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు : మల్లెపల్లి లక్ష్మయ్య, మొబైల్: 97055 66213 -
పార్లమెంటుకు సూచీ పార్టీ
ప్రస్తుత సమావేశాలకు హాజరు యాంగాన్: మయన్మార్ సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో ఆంగ్‌సాన్ సూచీకి చెందిన ప్రతిపక్ష నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ నూతనోత్సాహంతో సోమవారం ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలకు హాజరైంది. నూతన పార్లమెంటు కొలువుదీరడానికి ఫిబ్రవరి దాకా సమయం ఉండటంతో ఈలోగా మాజీ సైనిక పాలకులు రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడతారేమోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి నూరు శాతం కచ్చితంగా అధికార బదిలీ జరుగుతుందని తాము భావించట్లేదని ఎన్ఎల్డీ ప్రతినిధి విన్ తీన్ పేర్కొన్నారు. 1990లో ఎన్ఎల్డీ భారీ విజయం సాధించినప్పటికీ సైనిక పాలకులు అధికారాన్ని అట్టిపెట్టుకోవడాన్ని ప్రస్తావించారు. కాగా, సోమవారం పార్లమెంటుకు చేరుకున్న ఎన్ఎల్డీ నేత సూచీ విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. నవంబర్ 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఎల్డీ దాదాపు 80 శాతం సీట్లు సాధించి సైన్యం మద్దతిస్తున్న ప్రస్తుత అధికార యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీని మట్టికరిపించింది. కానీ ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలు జనవరి దాకా జరగనుండటంతో అప్పటివరకు యూఎస్డీపీ ఎంపీల ఆధిపత్యం కొనసాగనుంది. మరోవైపు పార్లమెంటులోని మొత్తం 1,139 సీట్లకుగాను ప్రతిపక్ష ఎన్ఎల్డీ 880 సీట్లు (77.3 శాతం) సాధించగా అధికార యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ) 115 సీట్లు గెలుచుకున్నట్లు మయన్మార్ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. మిగిలిన స్థానాలను ఇతర చిన్న పార్టీలు గెలుచుకున్నాయి. విదేశీయులను పెళ్లి చేసుకునే మయన్మార్ పౌరులు దేశాధ్యక్ష పదవికి అనర్హులంటూ గతంలోని జుంటా సర్కారు రాజ్యాంగాన్ని మార్చడంతో సూచీ దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలు. -
సుదీర్ఘ కౌంటింగ్‌లో సూచీకి 880 స్థానాలు
సుదీర్ఘంగా జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మయన్మార్ ఆశాకిరణం ఆంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ 77.3 శాతం స్థానాలను గెలుచుకుంది. 1,139 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ 880 స్థానాలను గెలుచుకోగా అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ పది శాతం సీట్లతో 115 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన స్థానాలను వేరు వేరు చిన్న పార్టీల వారు గెలుచుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మయన్మార్ పార్లమెంట్ సభ్యులలో 75 శాతం సభ్యులను ఈ ఎన్నికల ద్వారా భర్తీ చేయనుండగా మిగిలిన 25 శాతం మందిని నేరుగా మయన్మార్ మిలిటరీ నామినేట్ చేస్తుంది. మయన్మార్ పార్లమెంట్ తొలి సమావేశాలు జనవరిలో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం మార్చిలో కొలువుదీరనుంది. మార్చి చివరిలో ప్రస్తుత అధికార ప్రభుత్వం రద్దుకానుంది. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి సూచీ విజయం ఎప్పుడో ఖరారైనా, అక్కడి ఎన్నికల కౌటింగ్ ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతన, అధికార పాలకుల ఉద్దేశపూర్వక కాలయాపన ఫలితంగా ఫలితాల విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తుంది. -
సూచీదే మయన్మార్ పీఠం
ఎన్ఎల్డీకి మెజారిటీ యంగూన్: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ఉద్యమనేత, ప్రతిపక్ష ఎన్ఎల్డీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ అధికారికంగా విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటినుంచి సూచీ విజయం ఖాయమని తెలిసినా.. ఫలితాలు వెలువడిన తర్వాత అధికారికంగా ఆమె విజయం ఖరారైంది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం.. ఇంకా చాలా స్థానాల్లో ఫలితాలు వెలవడాల్సి ఉన్నప్పటికీ.. సూచీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ ఫిగర్ (348 సీట్లు)ను సాధించారు. వెల్లడైన ఫలితాల్లో 80 శాతం స్థానాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల మిలటరీ పాలనతో మోడువారిన మయన్మార్‌కు కొత్త వెలుగులు అందించేందుకు మరో అడుగు ముందుకు పడింది. అధికార యూఎస్డీపీ దారుణంగా ఓడినా ప్రభుత్వ విషయాల్లో సైనిక అధికారాలు ఏమాత్రం తగ్గలేదు. ఆర్మీ జోక్యంతో తయారైన రాజ్యాంగం ద్వారానే సూచీ అధ్యక్షపీఠం ఎక్కే అవకాశం కోల్పోయారు. అయినా.. అంతకన్నా పెద్ద అధికారాలతో ప్రభుత్వాన్ని, పాలనను శాసిస్తానని సూచీ చెబుతున్నారు. కాగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా సంస్కరణలు తెచ్చిన మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్‌ను ప్రపంచం ప్రశంసించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు , కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సూచీని అభినందించారు. -
మయన్మార్‌లో ప్రశాంతంగా పోలింగ్..
యాంగాన్: పాతికేళ్ల సైనిక పాలన నుంచి పరిపూర్ణ ప్రజాస్వామ్యం దిశగా పయనిస్తోన్న మయన్మార్ లో ఎన్నికల ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనసందడి కనిపించింది. ఈ ఎన్నికల్లో మయన్మార్ లో ప్రజాస్వామిక వ్యవస్థ కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్న అంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీదే గెలుపనే భావన సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం ఆ దేశంలో యూనియన్ సాలిడారిటీ డెవలప్ మెంట్ (యూఎస్ డీపీ) అధికారంలో ఉన్నప్పటికీ దానిని నడిపించేది మాత్రం సైనికశక్తే కావటం గమనార్హం. రాజధాని నగరంలో తమ నివాసానికి దగ్గర్లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సూచీకి ఓటర్లు ఘనస్వాగతం పలికారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన పార్టీకి అదికార పగ్గాలిచ్చి తప్పుకుంటానని ప్రస్తుత అధ్యక్షుడు థేన్ సియాన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాదాపు మూడు కోట్ల మంది ఓటింగ్ లో పాల్గొంటున్నారు. వీరిలో తొలిసారి ఓటు వేయబోతున్నవారి సంఖ్యే ఎక్కువ. 90 పార్టీలకు చెందిన 6 వేలమంది అభ్యర్థులు బరిలో తలపడుతున్న ఈ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, సోమవారం ఉదయానికి విజేత ఎవరనేది తేలుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు. -
ఇటు ఉక్కు సంకల్పం.. అటు సైనిక బలం!
నేపీడా: దాదాపు 50 ఏళ్లపాటు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉక్కుమనిషి ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ, అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ) హోరాహోరీగా తలపడుతున్నాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారి స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు కావడంతో.. ఈ పోలింగ్‌పై కేవలం ఆ ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూఎస్డీపీకి సైనిక మద్దతు పుష్కలంగా ఉండగా, సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ మళ్లీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నది. ఇరు పార్టీలూ గెలుపు మీద ధీమాతో ఉన్నాయి. అధికార యూఎస్డీపీకి గతంలో నియంతృత్వం చెలాయించిన సైనిక పెద్దల నుంచి మద్దతు ఉన్నది. స్థానికంగా మీడియా వెన్నుదన్ను ఉంది. అక్రమాలతో కూడిన 2010 ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీకి పెద్దసంఖ్యలో అనుచరులు ఉన్నారు. ఈ ఐదేళ్ల హయాంలో యూఎస్డీపీ సర్కారు కొన్ని చర్యలతో ప్రజలను మెప్పించగలిగింది. దేశంలోని పలు వేర్పాటువాద గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇవే తమ ప్రధాన ప్రచారాంశాలుగా చేసుకున్న యూఎస్డీపీ తాము 75 శాతం ఓట్లతో గెలుస్తామని ధీమాగా చెప్తున్నది. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రస్తుత అధ్యక్షుడు, యూఎస్డీపీ అధినేత థీన్ సీన్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు చాలామంది సైనిక అధికారులు తమ పదవులు విడిచిపెట్టి యూఎస్డీపీ తరఫున ఎన్నికల గోదాలో దిగారు. మరోవైపు తిరుగులేని ప్రజాదరణ కలిగిన నాయకురాలైన ఆంగ్‌సాన్ సూకీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ కనుసన్నలో ఉన్న మయన్మార్ మీడియా పెద్దగా మద్దతు తెలుపకపోయినా.. ఆమె నేరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రస్తుత ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగితే మరోసారి ఆంగ్‌సాంగ్ సూకీ విజయం సాధించే అవకాశముందని అంతర్జాతీయ పరిశీలకులు చెప్తున్నారు. స్వేచ్ఛాయుతంగా పోలింగ్ జరిగేనా? అనేక ఏళ్లు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో ఇటీవలికాలంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. 2011 ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అయినప్పటీకి సైనిక మద్దతు ఉన్న యూఎస్డీపీ అప్పట్లో అధికారం చేపట్టింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో నవంబర్ 8న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ అనేక అక్రమాలు, దౌర్జ్యనాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రతిపక్ష ఎన్ఎల్డీ అభ్యర్థులపై, శ్రేణులపై దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలోనూ అవకతవకలున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు అతివాద బౌద్ధులు దేశమంతటా పర్యటించి.. ముస్లింలు ఓటువేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ముస్లిం వ్యతిరేక వైఖరి తీసుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ ఎన్నికలు ఎంతమేరకు అక్రమాలకు తావులేకుండా శాంతియుతంగా జరుగుతాయనే దానిపై కొంత ఆందోళన నెలకొంది. అయితే 1990లో జరిగిన ఎన్నికల్లో ఇంతకంటే తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయి. అయినా ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్ఎల్డీ అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అనేక సంవత్సరాలు సైనిక పాలకులు ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు. అయినా చెక్కుచెదరని ఉక్కుసంకల్పంతో మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు సూకీ. ఎన్నికల్లో అక్రమాల మాట ఎలాఉన్నా.. పోలింగ్ నాడు ప్రజలతో ముందుకొచ్చి ఓటు వేస్తే.. ఆమె విజయం తథ్యమని, 67శాతం ఓట్లతో ఆమె నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్ఎల్డీ విజయం సాధించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. -
'భవిష్యత్తు మీ చేతుల్లోనే.. నిర్ణయించుకోండి'
నెప్యిడా: 'మీ ఆశలు నెరవేర్చుకునే సమయం మీ ముందుకు వస్తోంది.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.. భవిష్యత్తు నిర్ణయించుకోండి' అంటూ మయన్మార్ ప్రజలకు ఆ దేశ అధ్యక్షుడు ఉథెయిన్ సేన్ పిలుపునిచ్చారు. ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని ఈవిషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యయుత పాలన దిశగా మార్పు చెందేందుకు ఎన్నికలు ప్రధానమైనవని చెప్పారు. భవిష్యత్తులో మయన్మార్‌ను నూతన ప్రజాస్వామ్యయుత దేశంగా మార్చే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందని తెలిపారు. మయన్మార్‌లో ఎన్నికలు ప్రతిసారి గందరగోళ పరిస్థితుల మధ్యే జరిగేవి. ఈ నేపథ్యంలో ఈసారి వాటిని నవంబర్ 8న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకుంటోంది. -
మయన్మార్ దేశస్తులకు భారత్ పాస్‌పోర్టులు
సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్‌కు చెందిన అక్రమ వలసదారులకు ఇండియన్ పాస్‌పోర్టులు ఇప్పించేందుకు సహకరించిన పాస్‌పోర్టు బ్రోకర్‌తో పాటు ఇద్దరు ఎస్బీ సిబ్బందిని సౌత్‌జోన్ టీమ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక ఒరిజినల్ పాస్‌పోర్టు, ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ టి.ప్రభాకర్‌రావు కథనం ప్రకారం...ముంబైకి చెందిన అసన్ జియా అన్సారీ ఉపాధి నిమిత్తం 2003లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. తొలినాళ్లలో ప్రైవేట్ ఉద్యోగం చేసిన అన్సారీ...ఆ తర్వాత డాటా ఎంట్రీ అపరేటింగ్‌ను ఉపాధిగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి అక్రమంగా నగరంలో నివాసముంటున్న మయన్మార్ శరణార్ధులకు ఆధార్ కార్డులు సమకూరుస్తున్న షాహీన్‌నగర్‌కు మహమ్మద్ జావేద్ (మయన్మార్ వాసి)తో పరిచయం ఏర్పడింది. దీంతో పాస్‌పోర్టు బ్రోకర్ అవతారమెత్తిన అతను ఎస్బీ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్‌తో పరిచయం పెంచుకుని మయన్మార్ దేశస్తులకు ఇండియన్ పాస్‌పోర్టులు ఇప్పించేవాడు. బషీర్ అహ్మద్‌తో పాటు పాస్‌పోర్టు దరఖాస్తులను పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్లో హోంగార్డుగా పనిచేస్తున్న సలీమ్‌కు కూడా భారీ మొత్తంలో లంచాలు ఇచ్చాడు. పాస్‌పోర్టులు పొందినవారు టూరిస్టు వీసాపై సౌదీ అరేబియా వెళ్లినట్టు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎన్.కోఠి రెడ్డి ఆధ్వర్యంలో సౌత్‌జోన్ ఇన్స్పెక్టర్ ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్, ఎస్ఐలు జి.మల్లేశ్, కె.వెంకటేశ్వర్లు, ఎస్కే జాకీర్ హుస్సేన్, డి.వెంకటేశ్వర్లు ఈ దాడులు నిర్వహించారు. -
పలు రాష్ట్రాలలో వర్షాల బీభత్సం..
81 మంది మృతి, 80 లక్షల మందిపై ప్రభావం * మయన్మార్‌లో 27కు చేరిన వరద మృతులు న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలను ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకుతోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో 48 మంది, రాజస్తాన్‌లో 28 మంది, ఒడిశాలో ఐదుగురు వరదల్లో చనిపోయారని హోంశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మణిపూర్ రాష్ట్రాలను కలుపుకొని 80 లక్షల మంది ప్రభావి తులయ్యారని తెలిపింది. రాజస్తాన్‌లో నలుగురు చిన్నారులు సహా ఐదుగురు వరదల్లో గల్లంతయ్యారు. వర్షాల వల్ల ఒక్క గుజరాత్‌లోనే 40 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కోమెన్ తుపానుతోపాటు పిడుగుపాటు, కూలిన గోడలు, కరెంట్ షాక్, వరదల్లో కొట్టుకుపోయిన ఘటనల్లో బెంగాల్లో అత్యధికంగా 48 మంది చనిపోయారు. 5,672 పశువులు సైతం మృత్యువాతపడ్డాయి. మణిపూర్‌లో కొండ చరియలు విరిగిపడి 20 మంది మృతిచెందడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వ్యక్తంచేశారు. మయన్మార్‌లోనూ వరదలు వల్ల 27 మంది మృతిచెందగా, 1.50 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. -
మయన్మార్‌లో పడవ మునిగి 34 మంది మృతి
యంగాన్: మయన్మార్‌లోని పశ్చిమ తీరంలో పడవ మునిగి 34 మంది మృతిచెందారు. సుమారు 216 మంది ప్రయాణికులతో బయల్దేరిన పడవ క్యాప్క్యూ పట్టణం నుంచి రాఖిన్ రాష్ట్రంలోని సిట్వేకు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 12 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికి తీయగా, అందులో 19 మహిళలవని, రెండు మృతదేహాలు పురుషులవని పోలీసులు చెప్పారు. -
మయన్మార్ రాజ్యాంగాన్ని మార్చాలి
సూకీకి మద్దతు పలికిన ఒబామా యాంగూన్: మయన్మార్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మయన్మార్‌ను కోరారు. ప్రతిపక్షనేత అంగ్‌సాన్ సూకీ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేలా దేశ రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. ఈ విషయంలో సూకీకి మద్దతు పలుకుతున్నానన్నారు. శుక్రవారం ఒబామా యాంగూన్‌లో సూకీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2011లో సైనిక పాలన ముగిశాక సంస్కరణల పేరుతో సమస్యలను సృష్టిస్తున్నారంటూ మయన్మార్‌ను హెచ్చరించారు. అంతకుముందు ఒబామా మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్‌తో సమావేశమయ్యారు. -
బ్రిస్బేన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
బ్రిస్బేన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ చేరుకున్నారు. జీ 20 సదస్సులో పాల్గొందుకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మరికాసేపట్లో మోదీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ తో భేటీ కానున్నారు. నేడు ఆయన ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రసంగిస్తారు. ప్రధాని అయిదు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు.కాగా దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రధాని ఆస్ట్రేలియాలో అధికారికంగా పర్యటించటం విశేషం. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ పర్యటన తర్వాత భారత్ నుంచి ఎవరూ అధికారికంగా పర్యటించలేదు. ఈ పర్యటనలో భాగంగా మోదీ, జీ-20 సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులతోనూ సమావేశం కానున్నారు. సిడ్నీలో ఏర్పాటు చేసే బహిరంగ సభలోనూ మోదీ మాట్లాడనున్నారు. ఇలా ఆస్ట్రేలియాలో ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడిన తొలి ఇతర దేశ ప్రధానిగా మోదీ రికార్డు నమోదు చేయనున్నారు. ఇక శనివారం నుంచి ప్రారంభం కానున్న జీ-20 సదస్సులో.. నల్లధనంపై పోరులో అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను ప్రముఖంగా మోదీ ప్రస్తావించనున్నట్లు సమాచారం. జీ-20, ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్ తదితర ఖండాల దేశాలకు చెందిన 40 మంది నేతలను ఆయన కలుసుకుంటారు. -
మతం, ఉగ్రవాదం.. వేర్వేరు!
-
మతం, ఉగ్రవాదం.. వేర్వేరు!
* ఆ రెండిటి మధ్య ఏ సంబంధాన్నైనా ప్రపంచం తిరస్కరించాలి * ‘తూర్పు ఆసియా సదస్సు’లో ప్రధాని మోదీ పిలుపు * ఉగ్రవాదంపై పోరులో నిజమైన భాగస్వామ్యం కావాలి * సైబర్, స్పేస్‌లను అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి * ఎబోలా నిర్మూలనకు కలసికట్టుగా కృషిచేయాలి * ఇప్పుడు భారత విధానం ‘లుక్ ఈస్ట్’ కాదు ‘యాక్ట్ ఈస్ట్’ * రష్యా, చైనా సహా పలు దేశాల నేతలతో ప్రధాని భేటీ నేప్యితా: మతం, ఉగ్రవాదం.. రెండూ వేరువేరని, వాటి మధ్య ఎలాంటి సంబంధాన్నైనా అంతర్జాతీయ సమాజం తిరస్కరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలపై పోరులో నిజాయితీతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నేప్యితాలో గురువారం జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో ఆయన ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా ప్రధాని మెద్వదెవ్, చైనా ప్రధాని లీకెకియాంగ్ సహా 18 దేశాల నేతలు ఆ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మోదీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఈ సదస్సు ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో, ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిజమైన అంతర్జాతీయ భాగస్వామ్యంతో కూడిన స్పందన అవసరమన్నారు. మానవత్వమున్న అందరూ ఇందులో కలసిరావాలన్నారు. ‘ఉగ్రవాద, తీవ్రవాద సవాళ్లు పెరిగాయి. వాటికి.. ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమరవాణా, నగదు అక్రమ చెలామణీకి దగ్గరి సంబంధం ఉంది’ అని పేర్కొన్నారు. సైబర్, అంతరిక్షం.. వీటిని విభేదాలకు కాకుండా అభివృద్ధికి, అనుసంధానతకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్థిక రంగ సహకారంపై మాట్లాడుతూ.. ఈఏఎస్ సదస్సు సభ్యదేశాలు ‘సమతుల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’పై అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వస్తు, సేవల రంగాలకు సమాన ప్రాధాన్యతనిచ్చే ఈ ఒప్పందం వల్ల ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని మోదీ వివరించారు. 2015లోగా విశాల ‘ఆసియాన్ కమ్యూనిటీ’ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ఆయన ప్రశంసించారు. సమగ్ర ఆసియా,పసిఫిక్ ప్రాంత సమైక్యతకు అది దారులు వేస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు. ‘లుక్ ఈస్ట్’ టు ‘యాక్ట్ ఈస్ట్’ ఆర్నెళ్ల క్రితం తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత విధానమైన ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని మరింత క్రియాశీలంగా మార్చే ఉద్దేశంతో ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చామని మోదీ వివరించారు. తూర్పు ఆసియా దేశాల సదస్సు తమ యాక్ట్ ఈస్ట్ విధానానికి ప్రధాన భూమికగా నిలుస్తుందన్నారు. ‘మరే ఇతర అంతర్జాతీయ వేదిక కూడా ఇంత భారీ స్థాయిలో విశ్వ జనాభాను, యువతను, ఆర్థిక, సైన్య సంపత్తిని ప్రతిబింబించదు. అలాగే మరే ఇతర వేదిక కూడా ఈ స్థాయిలో శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం కృషి చేయదు’ అని ఈఏఎస్‌లోని 18 దేశాల శక్తి సామర్ధ్యాలను మోదీ చాటిచెప్పారు. గత 8 సదస్సుల్లో అనేక రంగాల్లో పరస్పర సహకారానికి దారులు వేసుకున్నామన్న మోదీ.. ఇంధన రంగంలో.. ముఖ్యంగా స్వచ్చమైన సౌరశక్తి ఉత్పత్తిలో సభ్య దేశాలు భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అంటువ్యాధులను నిర్మూలించడంలో అంతర్జాతీయంగా అవసరమైన పరస్పర సహకారాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఎబోలా నిర్మూలనకు భారత్ 1.2 కోట్ల డాలర్లను అందించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఎబోలీ తీవ్రంగా ఉన్న లైబీరియాలో ఐరాస కార్యక్రమంలో భాగంగా భారత్‌కు చెందిన పోలీసులు 251 మంది ఉన్నారన్నారు. సదస్సు సందర్భంగా నేప్యితాలోని మయన్మార్ ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ సెంటర్లో పలువురు కీలక ప్రపంచ నేతలతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. మోదీ చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నాం త్వరలో మోదీ చేయనున్న చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నామని చైనా ప్రధాని లీ కెఖ్వియాంగ్ పేర్కొన్నారు. నేప్యితాలో గురువారం మోదీ, లీ మొదటిసారి సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల్లోని ఆర్థిక సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ భారత పర్యటన తమకు మరపురాని జ్ఞాపకమని ఈ సందర్భంగా మోదీ లీ కెఖ్వియాంగ్తో అన్నారు. భారత్ మాకు విలువైన భాగస్వామి భారత్ రష్యాకు అత్యంత సన్నిహితమైన, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. గురువారం మోదీతో మెద్వదేవ్ భేటీ అయ్యారు. రెండు దేశాల రాష్ట్రాలు, ప్రాంతాల సమాఖ్య కేంద్రాల అవసరాన్ని మోదీ వివరించారు. దానివల్ల ప్రాంతీయ సహకారం మరింత పెరుగుతుందన్నారు. 2001లో తన రష్యా పర్యటనను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. మలేసియా దేశ పనితీరు సమీక్షా విధానం భేష్ బుధవారం మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో భేటీ సందర్భంగా.. ఆ దేశ ప్రభుత్వ పనితీరు సమీక్షా విధానాన్ని మోదీ ప్రశంసించారు. భారత్‌లోనూ ఆ తరహా విధానాన్ని అవలంబించే విషయంపై చర్చించారు. భారత గృహనిర్మాణ రంగంలో మలేసియా కంపెనీలు పాలు పంచుకోవాలని కోరారు. ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమరవాణాలపై ఆసియాన్ దేశాలు, భారత్‌లు కలసికట్టుగా పోరు సాగించాల్సి ఉందన్నారు. ఫిలిపై్పన్స్ అధ్యక్షుడు బెనినో అక్వినో, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విదోడొలతోనూ మోదీ సమావేశమయ్యారు. -
సింగపూర్, బ్రూనై సుల్తాన్లతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మయన్మార్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం మోదీ పలువురు ఆగ్నేయాసియా ప్రముఖులతో భేటీ అయ్యారు. సింగపూర్ ప్రధాని లీ హీన్ లూంగ్, బ్రూనై సుల్తాన్ హసానల్ బొల్కయాలతో మోదీ సమావేశమయ్యారు. భారత్, బ్రూనై మిత్ర దేశాలని, తమ సహకారం ఇలాగే కొనసాగుతుందని మోదీ.. బ్రూనై సుల్తాన్‌తో చెప్పగా, ఆయన స్వాగతించారు. ఇక సింగపూర్ ప్రధానితో మోదీ పట్టణాభివృద్ధికి సంబంధించి చర్చించారు. మోదీ ఇదే రోజు మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ బహుమతి గ్రహీత అంగసాన్ సూకీతో సమావేశమయ్యారు. -
‘యాక్ట్ ఈస్ట్’లో తొలి అడుగు
మయన్మార్‌లో నరేంద్ర మోదీ నేపితా/న్యూఢిల్లీ: మూడు దేశాలు, మూడు శిఖరాగ్ర సదస్సులు, దాదాపు 40 మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీలు.. ఇవన్నీ భాగమైన 10 రోజుల విస్తృత విదేశీ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో మొదట ఆయన మయన్మార్ చేరుకున్నారు. నేపితా విమానాశ్రయంలో ఆ దేశ ఆరోగ్యమంత్రి థాన్ ఆంగ్, సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులు మోదీకి స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అధ్యక్ష భవనంలో మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్‌తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భేటీ అద్భుతంగా జరిగిందని, పలు కీలక ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చించామని సమావేశం అనంతరం మోదీ ట్వీట్ చేశారు. రవాణా, వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయన్నారు. భారత్‌ను తమ దేశాభివృద్ధికి సహకరించే సోదరదేశంగా మయన్మార్ భావిస్తుందని మోదీతో భేటీ సందర్భంగా థీన్ సీన్ పేర్కొన్నారు. భారత్, మయన్మార్, థాయ్‌లాండ్‌లను కలుపుతూ నిర్మిస్తున్న 3,200 కి.మీ.ల రహదారి పొడవునా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు విషయంపై వారిరువురూ చర్చించారు మణిపూర్‌లోని మోరే నుంచి మయన్మార్ మీదుగా థాయిలాండ్‌లోని మేసోట్ వరకు ఉండే ఆ రహదారి నిర్మాణం 2018లో పూర్తికానుంది. మోదీ ఇక్కడ బుధవారం ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో, గురువారం తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఆస్ట్రేలియాలో జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రిస్బేన్ వెళ్తారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఫిజీ దేశంలో పర్యటిస్తారు. ఆసియాన్‌తో గాఢమైన అనుబంధం భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి ఆసియాన్ దేశాలతో సంబంధాలు చాలా కీలకమని మయన్మార్ వెళ్లేముందు మోదీ పేర్కొన్నారు. మరింత లోతైన ద్వైపాక్షిక సంబంధాలకు మార్గం చూపేలా ఆయా దేశాలతో తన చర్చలు ఉంటాయని వ్యాఖ్యానించారు. 2016 నుంచి ప్రారంభం కానున్న ఆసియాన్- భారత్ పంచవర్ష ప్రణాళిక అమలుపై భారత్ చాలా ఆసక్తిగా ఉంద భారత అధికారులు పేర్కొన్నారు. ఆసియాన్‌లో బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాంలు సభ్యదేశాలు. తూర్పు ఆసియా సదస్సులో.. ఇండియా ఆసియాన్ సదస్సు అనంతరం గురువారం 18 దేశాలు పాల్గొంటున్న తూర్పు ఆసియా సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. ఆసియాన్ దేశాలతో పాటు ఆ సదస్సులో ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజీలాండ్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా దేశాలు పాల్గొంటున్నాయి. -
మయన్మార్ చేరుకున్న మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం మయన్మార్ రాజధాని నే పీ తాకి వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రజలు సంప్రదాయ దుస్తుల్లో మోదీకి స్వాగతం పలికారు. మయన్మార్ అందమైన దేశమంటూ మోదీ ట్వీట్ చేశారు. దక్షిణాసియాకు వారథి వంటిదని అభివర్ణిస్తూ ట్విట్టర్లో ఫొటో పోస్ట్ చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత మయన్మార్ వెళ్లారు. -
నేటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: తూర్పు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటన చేపట్టనున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీల్లో సాగే ఈ పర్యటనలో ఆయన కీలక ప్రపంచ సదస్సుల్లో పాల్గొంటారు. బ్రిస్సేన్‌లో జరిగే జీ-20 సదస్సులో.. నల్లధనంపై పోరులో అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావిస్తానని మోదీ పర్యటన సందర్భంగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీ-20, ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్ తదితర ఖండాల దేశాలకు చెందిన 40 మంది నేతలను కలుసుకుంటారు. -
మైన్మార్‌కు మంచిరోజులు?
ఏడాది తరువాత జరిగే మైన్మార్ సాధారణ ఎన్నికల గురించి పరిశీలకులు అప్పుడే ఆశావహమైన అంచనాలకు వస్తున్నారు. ప్రపంచ పటంలో ‘అస్పృశ్య దేశం’ మైన్మార్ రూపురేఖలు 2015 ఎన్నికల తరువాత సంపూర్ణంగా మారిపోవ చ్చుననిపించే రీతిలో పరిణామాలు వరసగా జరుగుతున్నాయి. రెండు వారాల తరువాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరపనున్న మైన్మార్ చరిత్రా త్మక పర్యటన ఈ పరిణామాలను వేగవంతం చేస్తోంది. ఒబామా పర్యటన ఖరారు కాగానే, దేశ అధ్యక్షుడు థీన్‌సీన్ ఆగమేఘాల మీద అక్టోబర్ 31న సైనికాధికారులతోను; విపక్షనేత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసి (ఎన్ఎల్డీ) అధ్యక్షురాలు అంగ్‌సాన్ సూకీతో చర్చల ప్రక్రియ ప్రారంభిం చారు. దేశ అధ్యక్ష స్థానానికి పోటీ చేయడంపై సూకీ మీద ఉన్న ఆం క్షలను సడలించడానికి పార్లమెంట్ సుముఖత వ్యక్తం చేయడం మరో పరిణామం. నిజానికి 2015 ఎన్నికలలో ఎన్ఎల్డీ విజయం ఖాయమని తేలిపోయింది. ఈ పరిణామాలన్నీ సూకీని అధ్యక్షపీఠం వైపు నడిపించేవే. అసలే వెనుకబాటుతనం, ఆపై సైనిక నియంతృత్వం. ఇవి రెండూ కలసి మైన్మార్‌ను ప్రపంచ పేదదేశాలలో ఒకటిగా మిగిల్చాయి. ఆసియాలో రాజ్యాలలో బర్మా లేదా మైన్మార్ పేదరికానికి చిరునామాగా కనిపిస్తుంది. 1962 నుంచి 2011 వరకు జుంటా పేరుతో పిలిచే సైనిక పాలనే అక్కడ సాగింది. హక్కులన్నింటినీ హరించడమే కాదు, బాల కార్మిక వ్యవస్థకు కూడా జుంటా వత్తాసు పలికింది. అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి వచ్చినా సైనిక పాల కులు లొంగలేదు. ఆంక్షలను లెక్కచేయలేదు. జుంటా ఏలుబడిలో ఆ చిన్నదేశం అవినీతి మయమైపోయింది. వీటన్నిటి పర్యవసానం ఏమిటో 1990లో మొద టిసారి జుంటా అనుభవానికి వచ్చింది. ఆ ఏడాది జరిగిన సాధారణ ఎన్నిక లలో సూకీ నాయకత్వంలోని ఎన్ఎల్డీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. కానీ ఈ ప్రజా విజయాన్ని కూడా సైనిక పాలకులు చెరబట్టారు. ఈ రెండు దశాబ్దా లలో మళ్లీ అక్కడ 2010 లోనే ఎన్నికలు జరిగాయి. వాటి తీరుతెన్నులు ప్రపం చాన్ని నివ్వెరపరిచాయి. ఈ ఎన్నికలకు ఎన్ఎల్డీ దూరంగా ఉంది. అయినా సూకీతో పాటు, ఆ పార్టీ ప్రముఖలందరినీ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీనికి తోడు దారుణమైన అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. సైనిక పాలకులు దేశం మీద రుద్దిన యూనియన్ సాలిడారిటీ డెవలప్మెంట్ పార్టీ వీర విహారం చేసింది. పేరుకే ప్రజా ప్రభుత్వం అనదగిన కీలుబొమ్మ సర్కారును జుంటా ఏర్పాటు చేసింది. దీని నాయకుడే థీన్‌సీన్. 2011 మార్చి లోనే ఇతడిని సైనిక పాలకులు ప్రధాని పదవిలో ప్రతిష్టించారు. థీన్‌సీన్ కూడా మాజీ సైనికాధికారే. థీన్సీన్ను ప్రధానిగా ప్రతిష్టించడానికి చాలా ముందే అంటే, 2008లోనే జుంటా రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చేసింది. ఆ మార్పుల వెనుక సూకీ రాజకీయ భవితవ్యానికి శాశ్వతంగా సమాధి కట్టాలన్న కుట్ర ఉంది. విదే శీయులతో వైవాహిక బంధం ఉన్నా, లేదా వారితో సంతానాన్ని కన్నా అలాం టివారు అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఈ రాజ్యాంగం నిరోధిస్తుంది. పార్ల మెంటులో పావు శాతం స్థానాలను సైనిక పాలకులకు కేటాయించడంతో పా టు, దేశీయ వ్యవహారాలు, రక్షణ, సరిహద్దు వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కూడా 2008 రాజ్యాంగ సవరణలు సైనికులకే రిజర్వు చేశాయి. ఇంత తీవ్ర స్థాయిలో బిగించిన పట్టు 2011 నుంచి సడలిపోవడం మొదలైంది. ఆ ఏడా దిలోనే అమెరికా విదేశ వ్యవహారాలమంత్రి హిల్లరీ మైన్మార్ వచ్చారు. ఇక 2012లో జరిగిన ఉప ఎన్నికలలో మొత్తం స్థానాలన్నీ సూకీ పార్టీయే గెలుచు కుంది. అప్పుడే ఆమె కూడా ఎంపీగా గెలిచారు. ఇది జరిగిన సంవత్సరమే ఒబామా సందర్శించారు. ఇప్పుడు ఒబామా మరోసారి తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మైన్మార్ వెళుతున్నారు. తన పర్య టన గురించి మైన్మార్ ప్రధాని సీన్‌కు తెలియజేస్తూ, 2015లో జరిగే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పడం విశేషం. ఇది జరిగిన మరునాడే రాజధానిలో ప్రధాని సీన్ సూకీ, సైనిక పాలకులతో చర్చలు జరి పారు. 2012లో ప్రారంభమైన ప్రజాస్వామ్య ప్రతిష్ట ప్రక్రియ 2015 కైనా పూర్తయితే ఆ పేద దేశం ఒక్క అడుగైనా ముందుకు వేయగలుగుతుంది. -
వంతెన.. వణికించేలా..
ఈ వంతెన మీద నుంచి రైలులో వెళ్తున్నప్పుడు మన రోమాలు నిక్కబొడవాల్సిందే.. రైలు పడిపోతుందేమో అన్నట్లుగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి మీకు సొంతం కావాలంటే.. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పక్కనే ఉన్న మయన్మార్‌లోనే ఉందీ గోతైక్ వంతెన. 2,260 అడుగుల పొడవున ఉండే ఈ వంతెన.. 820 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ భారీ వంతెనకు సపోర్టుగా కిందన 15 భారీ టవర్లు ఉంటాయి. దీన్ని ఆంగ్లేయుల జమానాలో కట్టారు. 1900లో నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన వద్దకొచ్చేసరికి రైలును కూడా ఆటోమేటిక్‌గా స్లో చేసేస్తారు. దీన్ని దాటడానికి కనీసం 25 నిమిషాల సమయం తీసుకుంటుంది. అంతసేపూ.. మన గుండె లబ్‌డబ్.. లబ్డబ్బే.. -
నేడు ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశం
నేపితా: మయన్మార్‌లో శనివారం జరిగే ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశంగా మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ శుక్రవారం మయన్మార్ రాజధాని నేపితా చేరుకున్నారు. ఆసియాన్ దేశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆమె చర్చలు జరపనున్నారు. నాలుగు రోజుల పర్యటనలో ఆమె పలు కీలక సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు. ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంతోపాటు తూర్పు ఆసియా సదస్సు, ఆసియన్ రీజినల్ ఫోరమ్ సదస్సుల్లో సుష్మా స్వరాజ్ పాల్గొంటారు. అలాగే చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
సౌదీ పురుషులు, పాక్ మహిళలు పెళ్లి చేసుకోవద్దు..
రియాద్: పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మియన్మార్ మహిళలను సౌదీ అరేబియా పురుషులు వివాహమాడకూడదని నిషేధం విధించింది. బహిషృతులను సౌదీ పురుషులు పెళ్లి చేసుకోకూడదనే నిబంధనలో భాగంగా ఈ నిషేద ప్రకటన వెలువడింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. విదేశీ మహిళలను పెళ్లి చేసుకునేందుకు తప్పనిసరిగా అనుమతి స్వీకరించాలని మెక్కా పోలీస్ డైరెక్టర్ అస్సాఫ్ ఆల్ ఖురేషి తెలిపారు. సౌదీ అరేబియాలో పెళ్లికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. పెళ్లికి దరఖాస్తు చేసుకునే వారు 25 సంవత్సరాలకు పైబడి ఉండాలని, స్థానిక అధికారుల నుంచి అనుమతి పత్రాలను స్వీకరించాలని పోలీసులు తెలిపారు. అయితే అధికారికంగా మాత్రం ఈ ప్రకటనకు ఆమోదం లభించలేదు. -
ప్రజాస్వామ్య తీరం చేరేదెన్నడు?
2008 సైనిక రాజ్యాంగాన్ని సవరించడానికి మయన్మార్ సైనిక జుంటా నిరాకరించింది. దీంతో సూచీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పినట్టయింది. అక్కడి ‘క్రమశిక్షణాయుత ప్రజాస్వామ్యాని’కి మురుస్తున్న ప్రపంచ నేతలకు ఇప్పుడు ఆమె పట్టదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత్రి ఆంగ్‌సాన్ సూచీ బహుశా తన రాజకీయ జీవితంలోకెల్లా అతి పెద్ద సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టున్నారు. సైనిక పాలన నుంచి విముక్తిని, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించి దాదాపు పదిహేనేళ్ల గృహ నిర్బంధం పాలైన ఆమె 2010లో విడుదలయ్యారు. సూచీ ఆశిస్తున్నట్టుగా వచ్చే ఏడాది దేశాధ్యక్ష పదవి ఆమెను వరిస్తుందా? లేక తిరిగి నిర్బంధం చవి చూడాల్సి వస్తుందా? 2015 చివర్లో జరిగే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే సూచ నప్రాయంగానైనా తేలవచ్చు. ఇప్పటికైతే అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఆమె అనర్హులని రాజ్యాంగ సవరణల పార్లమెంటరీ కమిటీ తేల్చేసింది. 1962 నుంచి కొనసాగుతున్న సైనిక నేతల పాలన పదిలంగా ఉండేలా 2008 ‘ప్రజాస్వామ్య’ రాజ్యాంగం తయారైంది. ప్రత్యేకించి సూచీ పీడ విరగడ చేసుకోవడం కోసమే విదేశీయులను వివాహమాడిన పౌరులను అధ్యక్ష పదవికి అనర్హులను చేస్తూ 59 (ఎఫ్) అధికరణాన్ని చేర్చారు. బ్రిటిష్ జాతీయుని పెళ్లాడిన సూచీ శాశ్వతంగా అధ్యక్ష పదవికి అనర్హురాలు. సూచీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ లీగ్ (ఎన్ఎల్డీ) అందించిన 168 సవరణల జాబితాను పార్లమెంటరీ కమిటీ 31-5 ఓట్ల తేడాతో గత వారం తిరస్కరించింది. అంతకు ముందే, గత ఏడాది నవంబర్‌లో జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో ఎన్నికల కమిషన్ చైర్మన్ టిన్ ఆయె... ఎన్నికలు 2010లో జరిగినట్టే జరుగుతాయని ప్రకటించారు. అంతేకాదు, 2012లో జరిగిన ఉప ఎన్నికలను ఎన్ఎల్డీ ‘తిరుగుబాటు’లాగా నిర్వహించిందనీ, అది ‘88 తిరుగుబాటు’ను (1988లో నెత్తురోడిన విద్యార్థి, యువజన ప్రజాస్వామ్య ఉద్యమం) గుర్తుకు తెచ్చిందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి అభ్యర్థులు వారి వారి పార్లమెంటు నియోజకవర్గాలలోనే తప్ప ఇతర ప్రాంతాల్లో ప్రచారం సాగించరాదని కొత్త నిబంధనను విధించనున్నట్టు తెలిపారు. 2012 ఉప ఎన్నికల్లో సూచీ సహా ఎన్ఎల్డీ పార్లమెంటు ఉభయ సభల్లోని 44 స్థానాలకు పోటీచేసి 42 స్థానాలను గెలుచుకుంది. 2008 రాజ్యాంగం పార్లమెంటులో సైన్యం నియమించే ప్రతినిధులకు 25 శాతం స్థానాలను కేటాయించి, రాజ్యాంగ సవరణకు 75 శాతం సభ్యుల ఆమోదం తప్పనిసరి చేసింది. తద్వారా సైన్యానికి ఆచరణలో చట్టసభ నిర్ణయాలపై వీటో అధికారం లభించింది. అందుకే ఆ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ప్రమాణ స్వీకారం చేసేది లేదని అప్పట్లో సూచీ పట్టుబట్టారు. ‘మరింత ప్రజాసామ్యీకరణ’కు సైనిక దుస్తులు విడిచిన సైనిక దేశాధ్యక్షుడు థీన్ సీన్ శుష్క వాగ్దానంతో మెట్టు దిగారు. ఏడాదికిపైగా ఒకప్పటి ప్రత్యర్థులైన సైనిక నేతలను, వారి ప్రతినిధులను రాజ్యాంగ సంస్కరణలకు ఒప్పించడానికి ఆమె విఫల యత్నం చేశారు. సంస్కరణల పట్ల సానుభూతి కలిగినవారనుకున్న స్పీకర్ ష్వా మాన్ మొండి చెయ్యి చూపారు. థీన్ సీన్ చేసిన కీలక వాగ్దానం... సైనిక జనరల్స్‌తో సూచీ ‘శిఖరాగ్ర సమావేశం’ సైతం నీటి మూటే అయింది. కమాం డర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హయాంగ్ను కలవడం కోసం గత రెండేళ్లుగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. సైనిక జుంటాకుగానీ, దాని కీలుబొమ్మ అధికార యూఎస్డీపీకిగానీ ఆమెపై నమ్మకం కుదరడం లేదు. అదే అసలు సమస్య. ‘రాజ్యాంగ (2008) పరిరక్షణే సైన్యం ప్రధాన విధి’ అని జనరల్ హయాంగ్ ఇటీవలే మరో మారు బహిరంగంగా ప్రకటించారు. ఇప్పటికైతే సూచీకి అధికారం అప్పగించడానికి సైనిక నేతలు విముఖంగా ఉన్నారు. అయితే ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. సైన్యాన్ని బుజ్జగించే ప్రయత్నాలు విఫలం కావడంతో సూచీ, ఎన్ఎల్డీలు వ్యూహాన్ని మార్చాయి. రాజ్యాంగ సవరణల కోసం ప్రచారం, ప్రదర్శనలు, సభలు సాగిస్తున్నారు. గత నవంబర్‌లో యాంగూన్ తదితర నగరాల్లో భారీ ప్రదర్శనలను నిర్వహించారు. మయన్మార్ ప్రజలు సైనిక పాలనే కొనసాగుతున్నదని భావిస్తే ఎవరికి కావాలి? సూచీ పార్లమెంటు ప్రవేశంతోనే మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్ధారకులైన ప్రపంచ నేతల పని ముగిసింది. అక్కడి సంస్కరణవాద ‘క్రమశిక్షణాయుత ప్రజాస్వామ్యాని’కి మురిసి, ఆంక్షలను ఎత్తేసి, వాణిజ్య ఒప్పందాల కోసం పోటీలు పడుతున్నారు. ఇక సూచీ రాజ్యాంగ సంస్కరణల ఘోష ఎవరు వినాలి? మయన్మార్ ప్రజలు వింటున్నారు. 2015లోగా రాజ్యాంగ సవరణలు జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఆమె ఇటీవలి కాలంలో చేస్తున్న ఉద్రేకపూరిత ఉపన్యాసాలు వారికి పాత సూచీని గుర్తుకు తెస్తున్నాయి. సైన్యంతో పరిమితమైన సంఘర్షణాత్మక వైఖరి అనే సూచీ కొత్త ఎత్తుగడ పారుతుందా? బెడిసికొడుతుందా? - ఎస్. కమలాకర్ -
ఓటమి కూడా గెలుపే కదా!
మాల్దీవుల్లో సైన్యానికి, న్యాయవ్యవస్థకు మధ్యన పెనవేసుకున్న ఈ అపవిత్ర బంధం దక్షిణ ఆసియాలో ఒక ధోరణిగానే బలపడుతోంది. మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా మాల్దీవుల్లో కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతుంది. అపురూపమైన పగడపు దిబ్బల దేశం మాల్దీవులు చరి త్రగా మిగలనుంది. భూతాప ప్రకోపానికి సముద్ర మట్టా లు పెరుగుతుండటం వల్ల జలసమాధి కానున్న ద్వీప దేశాల్లో అది ముందు వరుసలో ఉంది. రెండు రోజుల క్రితం వార్సాలో ముగిసిన వాతావారణ మార్పుల అంతర్జాతీయ సదస్సుకు దాని గోడు వినిపించలేదు. కానీ ఈ నెల 16న జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మన విదేశాంగశాఖకు ‘ప్రజాస్వామ్య’ విజయం కనిపించింది. మాల్దీవులు ‘మార్పు’నకు పట్టం గట్టిందని మన జాతీయ మీడియాకు తోచింది. లండన్ నుంచి వెలువడే ‘టెలి గ్రాఫ్’ పత్రికకు మాత్రం... సెప్టెంబర్ 7 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించిన (47 శాతం ఓట్లు) మాజీ అధ్యక్షుడు మొహ్మద్ నషీద్ ‘గెలుపును సుప్రీంకోర్టు దురాక్రమిం చింది’ అని అది రాసింది. అత్యంత నిష్పాక్షికంగా, అవకతవకలకు తావులేని విధంగా జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను కొట్టి పారేసింది. వాయిదాల మీద వాయిదాలతో సెప్టెంబర్ 28న జరగాల్సిన రెండో రౌండు ఎన్నికలతో ఎట్టకేలకు ఈ వ్యవహారం 16న కొలిక్కి వచ్చింది. మనం మరచినంత తేలిగ్గా ఆ పత్రిక... ఈ రద్దుల, వాయిదాల చరిత్రను మరచిపోలేక పోయినట్టుంది. గత ఫిబ్రవరిలో మొహ్మద్ వహీద్ హస్సన్ అకారణంగా సైన్యం సహాయంతో మొట్టమొదటి ప్రజాస్వామిక అధ్యక్షుడు నషీద్‌తో బలవంతంగా రాజీనామా చేయించి స్వయంగా అధ్యక్షుడయ్యాడు. నషీద్‌తో పాటూ భారత్‌సహా ప్రపంచ దేశాలన్నీ తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని కోరాయి. 2013 జూలైలో ఎన్నికలను నిర్వహిస్తానన్న వహీద్ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. నవంబర్ 9న తిరిగి జరిపిన ఓటింగ్‌లో సెప్టెంబర్ ఫలితాలే పునరావృతమయ్యాయి. ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లకు మించలేదు. మరో వాయిదాతో 16న జరిగిన రెండో రౌండు ముఖాముఖి ఎన్నికలో యమీన్ 51 శాతం ఓట్లతో గెలిచాననిపించుకోగలిగారు. సుప్రీంకోర్టు పాత్రధారిగా కొట్టివేత, సాగదీతలతో వహీద్‌ను ముందుంచి సైన్యం ఆడిన నాటకం రక్తికట్టింది. ఇంతకూ నషీద్‌ను ఓడించిన యమీన్ అబ్దుల్ గయూమ్ ఎవరు? మాల్దీవులను మూడు దశాబ్దాల పాటూ, 2008 వరకు నిరంకుశ నియంతృత్వానికి గురిచేసిన నియంత మహ్మద్ అబ్దుల్ గయూమ్‌కు తమ్ముడు, ఆయన పార్టీ పీపీఎం నేత. గయూం బంటు యమీన్ ప్రజాస్వామ్యవాదేననున్నా... గెలిచే అభ్యర్థి ఓడిపోయేంత వరకు ఎన్నికల ప్రక్రియను సాగదీయడం ఎలాంటి ప్రజాస్వామిక ప్రక్రియ? మాల్దీవుల్లో సైన్యానికి, న్యాయవ్యవస్థకు మధ్యన పెనవేసుకున్న ఈ అపవిత్ర బంధం దక్షిణ ఆసియా ప్రాం తంలో నేడు ఒక ధోరణిగానే బలపడుతోంది. శ్రీలంకలో అధ్యక్షుడు మహింద రాజపక్స ఒకవంక దేశాన్ని సైనికీకరణకు గురిచేస్తున్నారు. మరోవంక న్యాయవ్యవస్థను గుప్పి ట పెట్టుకుంటున్నారు. తానే నియమించిన ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించి మరీ అడ్డు తొలగిం చుకున్నారు. పాకిస్థాన్‌లో కూడా న్యాయవ్యవస్థకు సైన్యానికి మధ్యన ఇలాంటి అనుబంధం బలపడుతోంది. ఈ అపవిత్ర బంధానికి ఉన్న మరో కోణం... మత ఛాందసవాద ఉన్మాదం. మలుపులు తిరిగిన మాల్దీవుల ఎన్నికల కథను కంచికి చేర్చినది కూడా అదే. మూడో స్థానంలోని అభ్యర్థిగా నిలిచిన మాల్దీవుల కుబేరుడు అబ్దుల్ ఖాసీంకు అవి మద్దతు పలికాయి. రెండో రౌండ్లో మతోన్మాదశక్తులు గయూం సోదరునివైపు మొగ్గు చూపాయి. ఈ వాయిదాల కాలమంతా పీపీఎమ్ మతోన్మాద ఛాందసవాద శక్తులను బుజ్జగిస్తూనే గడిపింది. మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా మాల్దీవుల్లో కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతుంది. శ్రీలంక, మయన్మార్‌లలో బౌద్ధ మతోన్మాదం, పాక్, మాల్దీవుల్లో ఇస్లామిక్ మతోన్మాదం నిజమైన ప్రజాస్వామ్యానికి ఆ దేశాలను ఆమడ దూరంలో ఉంచడానికి హామీని కల్పించడానికి ప్రయత్నిస్తునాయి. నేడు ఎన్నికల ఆటలో ఓడిన నషీద్ దేశాధ్యక్షునిగా 2009లో విలక్షణమైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. సముద్రం అట్టడుగున మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు! మాల్దీవులను సముద్రం మింగేయబోతున్నవిషయాన్ని సముద్రంలో మునిగి చెపితేనన్నా అంతర్జాతీయ సమాజానికి పడుతుందేమోనని ఆశించారు. పట్టలేదు. నేడు మాల్దీవుల ప్రజాస్వామ్యం గంగలో కలుస్తున్నా ఎవరికీ పట్టదు. యమీన్‌తో సత్సంబంధాలకోసం తాపత్రయం తప్ప మనకు మరేమీ పట్టదు గాక పట్టదు. చైనా బూచి మనకు నిద్ర పట్టనీయదు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
GENERAL AWARENESS
1. What is India's Gross Domestic Product (GDP) growth in the first quarter (April-June) of the fiscal year 2013-14? 1) 5.4 per cent 2) 4.8 per cent 3) 2.8 per cent 4) 4.4 per cent 5) 5.5 per cent 2. Seamus Heaney of Ireland died on August 30, 2013. He had won the 1995 Nobel Prize in? 1) Economics 2) Literature 3) Peace 4) Physics 5) Medicine 3. Which country defeated India 4-3 in the final of the Asia Cup Hockey at Ipoh, Malaysia on September 1, 2013? 1) Pakistan 2) Malaysia 3) South Korea 4) Japan 5) Oman 4. Which Tennis player is the author of the book 'The Moon Baller'? 1) Sania Mirza 2) Ramesh Krishnan 3) Nirupama Vaidyanathan 4) Leander Paes 5) Mahesh Bhupathi 5. Which company on August 23, 2013 announced that its CEO, Steve Ballmer, will retire from the company after a successor is chosen? 1) Google 2) Oracle 3) Yahoo! 4) Microsoft 5) Amazon.com 6. Which team won the inaugural edition of the Indian Badminton League (IBL) in Mumbai on August 31, 2013? 1) Pune Pistons 2) Awadhe Warriors 3) Hyderabad Hotshots 4) Mumbai Masters 5) None of these 7. Samuel Santos Lopez visited India in August 2013. He is the Foreign Minister of? 1) Colombia 2) Ecuador 3) Venezuela 4) Nicaragua 5) Bolivia 8. Who scored the highest ever individual score in a Twenty20 International in August 2013? (He smashed 156 off 63 balls with 14 sixes, both world records) 1) Brendon McCullum 2) Chris Gayle 3) Suresh Raina 4) Tilakaratne Dilshan 5) Aaron Finch 9. Justice N.V.Ramana was sworn in the new Chief Justice of which of the following High Courts on September 2, 2013? 1) Allahabad High Court 2) Delhi High Court 3) Andhra Pradesh High Court 4) Gujarat High Court 5) None of these 10. "Big Apple" is a nickname for? 1) Canberra 2) Madrid 3) New York 4) Berne 5) Ottawa 11. The National Chemical Labo-ratory (NCL) is located in? 1) Panaji 2) Pune 3) Hyderabad 4) Chandigarh 5) Nagpur 12. Which of the following is the name of the organization created by the Government of India to promote small scale industries in India? 1) SEBI 2) IFCI 3) IDBI Bank 4) ECGC 5) None of these 13. Which of the following is designed specially as a strong measure for control of inflation in India? 1) Public Distribution System 2) Heavy taxation on import and export 3) Ban on export of excess food grain 4) Monetary policy of the RBI 5) None of these 14. 'Swayamsidha' scheme is rela-ted to? 1) School children 2) Health workers 3) Senior citizens 4) Women 5) None of these 15. "Unto This Last" is a book written by? 1) John Ruskin 2) Ruskin Bond 3) Leo Tolstoy 4) Rudyard Kipling 5) George Bernard Shaw 16. Which of the following is/are treated as artificial currency? 1) ADR 2) GDR 3) SDR 4) Both 1 and 2 5) All 1, 2 and 3 17. The basic characteristic of a capitalistic economy is? 1) Absence of monopoly 2) Large scale production in primary sector 3) Full employment 4) The private ownership of the means of production 5) None of these 18. UNDP prepares? 1) Standard of Living Index 2) Physical Quality Index 3) Human Development Index 4) Wholesale Price Index 5) None of these 19. Fiscal Policy refers to? 1) Sharing of its revenue by the central government with states 2) Sale and purchase of securities by RBI 3) Keeping foreign exchange reserves 4) Government taxes, expendi-ture and borrowings 5) None of these 20. Which of the following famous events is being held in Jaipur in January every year since 2006? 1) Cattle Fair 2) Literature Festival 3) Elephant Festival 4) International Film Festival 5) Kite Festival 21. Which event is held to mark the Onam festivities in Kerala? 1) Bull fighting 2) Bull Race 3) Cock fights 4) Boat Race 5) None of these 22. The film awards given by the Academy of Motion Picture Arts and Sciences in USA are popularly known as? 1) IIFA Awards 2) BAFTA Awards 3) Oscars 4) Grammy Awards 5) None 23. ITPO stands for? 1) International Traders and Promoters Organization 2) India Trade Promotion Organization 3) International Telecom and Postal offices 4) International Trade Policy Organization 5) None of these 24. Which country is called Cockpit of Europe? 1) Denmark 2) Spain 3) Belgium 4) Turkey 5) Italy 25. The term 'Let' is associated with? 1) Chess 2) Hockey 3) Cricket 4) Badminton 5) Soccer 26. Mahe is a part of? 1) Tamil Nadu 2) Puducherry 3) Kerala 4) Maharashtra 5) Karnataka 27. Psephology is the study of? 1) Flags 2) Rainfall pattern 3) Gene disorders 4) Stamps 5) Elections 28. The term 'Cue' is related to? 1) Badminton 2) Basketball 3) Baseball 4) Billiards 5) Boxing 29. Who acts as the Secretary of the National Development Council (NDC)? 1) Secretary,Ministry of Finance 2) Secretary,Ministryof Planning 3) Secretary, Planning Commission 4) Secretary,Finance Commission 5) None of these 30. Which one of the following full forms is wrong? 1) SIM- Subscriber Identity Module 2) MRI- Magnetic Resonance Imaging 3) IPR- Intellectual Property Rights 4) PIL - Public Interest Litigation 5) SLBC-State Level Business Committee 31. Nirmal Bharat Abhiyan Yojana is associated with? 1) Construction of houses for low income groups 2) Construction of houses for rural people 3) Community toilets in slum areas 4) Employment in rural areas 5) None of these 32. 'Pride and Prejudice' is written by? 1) Leo Tolstoy 2) Jane Austen 3) George Eliot 4) Charles Dickens 5) R.K.Narayan 33. Which one among the following statements regarding SAARC is correct? 1) Headquarters of SAARC is located in Dhaka 2) Myanmar is a member of SAARC 3) The present Secretary General of SAARC is from India 4) It was started in 1980 5) Next SAARC Summit will be held in Nepal 34. Bamako is the capital city of? 1) Mali 2) Guinea 3) Haiti 4) Laos 5) Burundi 35. Which one of the following scales is used to measure the intensity of tornadoes? 1) Richter scale 2) Mercalli scale 3) Fujita scale 4) Saffir-Sampson scale 5) None of these Answers 1) 4 2) 2 3) 3 4) 3 5) 4 6) 3 7) 4 8) 5 9) 2 10) 3 11) 2 12) 5 13) 4 14) 4 15) 1 16) 3 17) 4 18) 3 19) 4 20) 2 21) 4 22) 3 23) 2 24) 3 25) 4 26) 2 27) 5 28) 4 29) 3 30) 5 31) 3 32) 2 33) 5 34) 1 35) 3