నెప్యిడా: 'మీ ఆశలు నెరవేర్చుకునే సమయం మీ ముందుకు వస్తోంది.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.. భవిష్యత్తు నిర్ణయించుకోండి' అంటూ మయన్మార్ ప్రజలకు ఆ దేశ అధ్యక్షుడు ఉథెయిన్ సేన్ పిలుపునిచ్చారు. ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని ఈవిషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు.
మంగళవారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మయన్మార్లో ప్రజాస్వామ్యయుత పాలన దిశగా మార్పు చెందేందుకు ఎన్నికలు ప్రధానమైనవని చెప్పారు. భవిష్యత్తులో మయన్మార్ను నూతన ప్రజాస్వామ్యయుత దేశంగా మార్చే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందని తెలిపారు. మయన్మార్లో ఎన్నికలు ప్రతిసారి గందరగోళ పరిస్థితుల మధ్యే జరిగేవి. ఈ నేపథ్యంలో ఈసారి వాటిని నవంబర్ 8న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకుంటోంది.
'భవిష్యత్తు మీ చేతుల్లోనే.. నిర్ణయించుకోండి'
Published Tue, Sep 15 2015 10:45 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement