ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చేశారు. ఈ తీర్పుపై స్పందించిన సీఎం ఏక్‌నాథ్ షిండే.. శివ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరోసారి విజయం సాధించిందని అన్నారు. శివ సేన- బీజేపీ సంకీర్ణ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షల మంది ఓటర్లు గెలుపొందారని తెలిపారు.
"రాష్ట్రంలోని శివసైనికులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేడు ప్రజాస్వామ్యం మరోసారి గెలిచింది. 2019లో శివసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లు ఈరోజు విజయం సాధించారు. ఇది శివుడి విజయం. హిందూ హృదయ చక్రవర్తి బాలాసాహెబ్ థాక్రే భావాజాలంతో ఉన్న శివసైనికుల విక్టరీ ఇది." అని ఏక్‌నాథ్ షిండే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
"బాలాసాహెబ్, ధర్మవీర్ ఆనంద్ దిఘేల హిందుత్వ భావాజాలానికి మేమే నిజమైన వారసులమని మరోసారి రుజువైంది. నేటి విజయం సత్యం విజయం. సత్యమేవ జయతే." అని అన్నారు.
"నేటి ఫలితం ఏ పార్టీ విజయం కాదు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ముఖ్యం. శివ సేనాను ఎలక్షన్ కమిషన్ మనకు కేటాయించింది. ఇప్పుడు విల్లు, బాణాలు కూడా మన చేతికి వచ్చాయి. నేటి ఫలితాల నుంచి నియంతృత్వం, రాజవంశం అంతమైంది."
"పార్టీని తన ఆస్తిగా భావించి ఎవరూ తన మనసుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేరు. ప్రస్తుత తీర్పు పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా ఉండకూడదు. ఈ తీర్పు అందుకు ఉదాహారణగా ఉంది.' అని షిండే ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన
Comments
Please login to add a commentAdd a comment