ఫేస్'బుక్క'య్యింది... మహిళకు ఆర్నెల్లు జైలు | Myanmar woman jailed for Facebook post | Sakshi
Sakshi News home page

ఫేస్'బుక్క'య్యింది... మహిళకు ఆర్నెల్లు జైలు

Published Tue, Dec 29 2015 3:27 PM | Last Updated on Thu, Jul 26 2018 1:02 PM

ఫేస్'బుక్క'య్యింది... మహిళకు ఆర్నెల్లు జైలు - Sakshi

ఫేస్'బుక్క'య్యింది... మహిళకు ఆర్నెల్లు జైలు

యంగాన్: మయన్మార్లో సైన్యాన్ని కించపరిచేలా ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఓ యువతికి ఆరు నెలలు జైలు శిక్ష విధించారు.  చా శాండి టున్ అనే మహిళ.. ఆర్మీ చీఫ్ యూనిఫాం రంగును మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచి ధరించే దుస్తులతో (లుంగీ) పోల్చుతూ పోస్ట్ చేసింది. 'మీరు అమ్మను ప్రేమిస్తే.. మీ తలపై తల్లి వస్త్రాన్ని (లుంగీ) ఎందుకు చుట్టుకోరాదు' అని ఫేస్బుక్ పేజీలో రాసింది.

ఈ ఫేస్బుక్ పోస్ట్పై దుమారం రేగడంతో గత అక్టోబర్లో చా టున్ను అరెస్ట్ చేశారు. అయితే చా టున్ ఈ పోస్ట్ చేయలేదని, తన ఎకౌంట్ను హ్యాక్ చేశారని ఆమె తరపు న్యాయవాది చెప్పారు. చా టున్ తప్పు చేసినట్టు తీర్పు చెబుతూ కోర్టు ఆమెకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement