ఫేస్'బుక్క'య్యింది... మహిళకు ఆర్నెల్లు జైలు
యంగాన్: మయన్మార్‌లో సైన్యాన్ని కించపరిచేలా ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఓ యువతికి ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. చా శాండి టున్ అనే మహిళ.. ఆర్మీ చీఫ్ యూనిఫాం రంగును మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచి ధరించే దుస్తులతో (లుంగీ) పోల్చుతూ పోస్ట్ చేసింది. 'మీరు అమ్మను ప్రేమిస్తే.. మీ తలపై తల్లి వస్త్రాన్ని (లుంగీ) ఎందుకు చుట్టుకోరాదు' అని ఫేస్బుక్ పేజీలో రాసింది.
ఈ ఫేస్బుక్ పోస్ట్‌పై దుమారం రేగడంతో గత అక్టోబర్‌లో చా టున్ను అరెస్ట్ చేశారు. అయితే చా టున్ ఈ పోస్ట్ చేయలేదని, తన ఎకౌంట్‌ను హ్యాక్ చేశారని ఆమె తరపు న్యాయవాది చెప్పారు. చా టున్ తప్పు చేసినట్టు తీర్పు చెబుతూ కోర్టు ఆమెకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది.