
అంతుచిక్కని వ్యాధితో 38 మంది చిన్నారులు మృతి
య్యాగన్: మయన్మార్లో ఓ అంతుచిక్కని వ్యాధి చిన్నారును బలితీసుకుంటోంది. దేశ వాయువ్య ప్రాంతం సగైంగ్లో వ్యాపిస్తున్న ఈ వ్యాధితో ఇప్పటికే 38 మంది చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా 12 ఏళ్లలోపు వారు ఉంటున్నారని అధికారులు వెల్లడించారు.
లాహెల్ టౌన్షిప్లో 38 మందికి ఈ వ్యాధి సోకగా.. వారిలో 28 మంది మృతి చెందినట్లు ఆరోగ్య కార్యకర్తలు వెల్లడించారు. వ్యాధి సోకిన వారిలో జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రక్త నమూనాలను య్యాగన్లోని నేషనల్ హెల్త్ లేబరేటరీలో పరిశీలిస్తున్నారు. అయితే, వీరిలో ముగ్గురికి మాత్రం మీసిల్స్(తట్టు) సోకినట్లు నిర్థారణ కాగా.. మిగతా వారి విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. మరో టౌన్షిప్ నాన్యున్లోనూ ఈ వ్యాధి సోకిన 13 మంది చిన్నారులు మృతి చెందారు. అధికారులు ముందుగా మీసిల్స్కు టీకాలు వేసే పనిలో పడ్డారు.